
పాట్నా: సెల్‌ఫోన్ దొంగిలించాడని ఓ వ్యక్తిపై కిరాతంగా ప్రవర్తించారు కొందరు స్థానికులు. అతని కాళ్లను చైన్‌తో కట్టేసి చెట్టుపై నుంచి తలక్రిందులుగా వేలాడదీశారు. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్‌లోని దర్భాంగా సమీపం వద్దగల హింగోలీ గ్రామంలో అమ్రేశ్ అనే వ్యక్తి సెల్‌ఫోన్ దొంగిలించాడంటూ గ్రామస్తులు పట్టుకున్నారు. అతన్ని బాగా చితకబాదారు. అనంతరం అంతా కలిసి అతన్ని చైన్‌తో కట్టేసి పెద్ద చెట్టుపై నుంచి వేడాలదీశారు. ఇదంతా ఒకరు వీడియో తీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అమ్రేశ్‌ను , మరో ముగ్గురు గ్రామస్తులను అరెస్ట్ చేశారు.