అరారియా(బిహార్): దొంగతనం చేశాడని ఓ వ్యక్తిని తాళ్లతో బంధించి..అతడి మలద్వారంలోకి మిరప కారం జొప్పించారు. బిహార్‌లోని అరారియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీసులు నిందితుల్లో ఒకరిని గుర్తించి, అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇస్లామియానగర్‌కు చెందిన కొందరు దొంగతనం చేశాడంటూ ఓ వ్యక్తిని తాళ్లతో నిర్బంధించారు.
అతడి ప్యాంటు విప్పి, బలవంతంగా ముందుకు వంచారు. ఒక వ్యక్తి అతడి మల ద్వారంలో మిరప కారం పోసి, పెన్సిల్‌తో లోపలికి కూరాడు. అక్కడే ఉన్న కొందరు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పోలీసుల కంటబడింది. దర్యాప్తు చేపట్టి మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడే బాధితుడి ప్యాంటు బటన్లను విప్పి, మోకాళ్ల వరకు కిందికి లాగాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై ఆర్‌జేడీ నేత తేజస్వీయాదవ్ స్పందించారు. రాష్ట్రంలో తాలిబన్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment