chilli powder
-
కారంపొడిలో కలుషితాలు.. ఆ బ్యాచ్‌లో తయారైన ప్యాకెట్లు వెనక్కి..
బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని ఎఫ్ఎంసీజీ (FMCG) సంస్థ పతంజలి ఫుడ్స్‌కు (Patanjali Foods) గట్టి దెబ్బ తగిలింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని కారణంగా ఒక బ్యాచ్‌లో తయారైన మొత్తం ఎర్ర కారం పొడి ప్యాకెట్లను (chilli powder) రీకాల్ చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) ఆదేశించినట్లు పతంజలి ఫుడ్స్ తాజాగా ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలియజేసింది."ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2025 జనవరి 13 నాటి (2025 జనవరి 16న అందింది) ఆర్డర్ ప్రకారం బ్యాచ్ నెంబర్ AJD2400012 లో తయారైన పదార్థాలు (ఎర్ర కారం పొడి పాకెట్లు) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (కలుషితాలు, టాక్సిన్స్, అవశేషాలు) నిబంధనలు, 2011కి అనుగుణంగా లేనందున మొత్తం బ్యాచ్‌ను రీకాల్ చేయమని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌ని ఆదేశించిందని తెలియజేస్తున్నాం" ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.పతంజలి ఫుడ్స్ షేర్లు గురువారం (జనవరి 23) బీఎస్ఈలో దాదాపు అర శాతం తగ్గి రూ.1,855.30 వద్ద స్థిరపడ్డాయి. ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్‌పై సంవత్సర కాలంలో రాబడి దాదాపు 19 శాతం. పతంజలి ఫుడ్స్ గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్‌గా ఉండేది. 2019 డిసెంబర్లో రూ. 4,300 కోట్లకు పైగా వెచ్చించి బాబా రామ్‌దేవ్ కొనుగోలు చేశారు. గోధుమ పిండి నుండి నూనెలు, డెయిరీ.. పలు విభిన్న ఉత్పత్తులను ఎఫ్ఎంసీజీ సంస్థ విక్రయిస్తోంది. -
చోరీ చేశాడని.. కారం దట్టించారు!
అరారియా(బిహార్): దొంగతనం చేశాడని ఓ వ్యక్తిని తాళ్లతో బంధించి..అతడి మలద్వారంలోకి మిరప కారం జొప్పించారు. బిహార్‌లోని అరారియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీసులు నిందితుల్లో ఒకరిని గుర్తించి, అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇస్లామియానగర్కు చెందిన కొందరు దొంగతనం చేశాడంటూ ఓ వ్యక్తిని తాళ్లతో నిర్బంధించారు. అతడి ప్యాంటు విప్పి, బలవంతంగా ముందుకు వంచారు. ఒక వ్యక్తి అతడి మల ద్వారంలో మిరప కారం పోసి, పెన్సిల్‌తో లోపలికి కూరాడు. అక్కడే ఉన్న కొందరు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పోలీసుల కంటబడింది. దర్యాప్తు చేపట్టి మహ్మద్ సిఫత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడే బాధితుడి ప్యాంటు బటన్లను విప్పి, మోకాళ్ల వరకు కిందికి లాగాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ స్పందించారు. రాష్ట్రంలో తాలిబన్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. -
రెండేళ్లుగా తగ్గని దగ్గు.. కారణం తెలిసి షాకైన వైద్యులు
సాధారణంగా దగ్గు సమస్య అందరినీ వేధిస్తుంటుంది. గాలిలోని కాలుష్యం, ముక్కుల్లో ఇన్ఫెక్షన్, అలర్జీ, సైనుసైటిస్, గొంతు నొప్పి, గుండె జబ్బులు.. ఇలా రకరకాల కారణాల ద్వారా దగ్గు వస్తుంటుంది. ఇలాగే చైనాకు చెందిన ఓ వ్యక్తికి దగ్గు అంటుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రేండేళ్లపాటు అతడికి దగ్గు వదల్లేదు. దీంతో క్యాన్సర్ వ్యాధి ఏమైనా వచ్చిందోనని భయాందోళనకు గురయ్యాడు. కానీ చివరకు తన దగ్గుకు గల కారణం తెలిసి..హమ్మయ్యా అనుకున్నాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..తూర్పు చైనీస్ పప్రావిన్స్ జెజియాంగ్‌కు చంఎదిన 54 ఏళ్ల వ్యక్తి జుకి కొంతకాలంగా దగ్గు వేధిస్తోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, మందులు, సిరప్లు వాడినా ఎంతకీ దగ్గు తగ్గలేదు. ఇలా రెండేళ్లు గడిచాయి. గత నెల జూన్‌లో జెజియాంగ్ హాస్పిటల్లో థొరాసిక్ సర్జరీ విభాగంలో స్కాన్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.అక్కడ అతనికి సిటీ స్కాన్ చేశారు. అందులో వ్యక్తి కుడి ఊపిరితిత్తులో ఒక సెంటీమీటర్ పొడుతున్న కణతి ఉన్నట్లు తేలింది. అది న్యుమోనియా లేదా క్యాన్సర్ కణితీగా తొలుత భావించారు. ఇక జు తనకు కచ్చితంగా క్యాన్సర్ వచ్చి ఉంటుందని ఫిక్స్ అయిపోయి భయంతో అల్లాడిపోయాడుజూలై 3న ఊపిరితిత్తుల కణజాలంలో కొంత భాగాన్ని తొలగించడానికి థొరాకోస్కోపీని చేసుకున్నాడు. దీనిలో క్యాన్సర్‌ని నిర్ధారించడానికి ఒక పరీక్ష చేస్తారు. అయితే అక్కడే అసలు విషయం బయటపడింది. అతనికి ఊపిరితిత్తుల్లో దాగుంది చిల్లీ పెప్పర్ కొన(మిర్చి ముక్క) గుర్తించి వైద్యులు ఆశ్చర్యపోయారు. జు రెండు సంవత్సరాల క్రితం హాట్‌పాట్ భోజనం చేసిన రోజును గుర్తు చేసుకున్నారు. ఆరోజు మిరియాలు పీల్చడం వల్ల అసౌకర్యానికి గురవ్వడం, దగ్గడం వంటివి జరిగినట్లు నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నాడు.దీంతో మిరపకాయ అతని ఊపిరితిత్తులలోకి వెళ్లి ఉండవచ్చని జెజియాంగ్ హాస్పిటల్‌లోని థొరాసిక్ సర్జరీ విభాగం డైరెక్టర్ జు జిన్హై చెప్పారు. ఇది అతని కణజాలం కింద దాగిపోయిందని, దీనిని గుర్తించడం సవాలుగామారిందని తెలిపారు.పెప్పర్ చాలా కాలం అతని శ్వాసనాళంలో ఉన్నందున, అది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్నుదారి తీసిందని. అందుకు రెండు సంవత్సరాలకు పైగా దగ్గు వచ్చినట్లు పేర్కొన్నారు. -
దినుసులన్నీ కలిపితే.. ఈ రకరకాల 'రుచి కారము పొడులు' మీకే!
'సంక్రాంతి రుచుల తియ్యటి రుచి బయటపడాలనిపిస్తోందా! నోటికి కారంగా, పొట్టకు తేలిగ్గా ఉండే ఆహారం తినాలనిపిస్తోందా! ఉన్నది ఆరు రుచులే.. కానీ జిహ్వ మరింత రుచిని కోరుకుంటుంది. నాలుకకు మమకారం మాత్రమే కాదు రుచి కారమూ ఇష్టమే. పోపుల పెట్టెలో దినుసులన్నీ కలిపి రకరకాల కారం పొడులు చేద్దాం.' నువ్వుల పొడి.. కావలసినవి: తెల్ల నువ్వులు – వంద గ్రాములు; ఎండు మిర్చి– 10; మినప్పప్పు – అర టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు– రుచికి తగినంత. తయారీ.. మందపాటి బాణలిలో నువ్వులు వేసి మీడియం మంట మీద దోరగా వేయించి పక్కన పెట్టాలి. మరొక బాణలిలో ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేయించి చివరగా జీలకర్ర వేసి దించేయాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో నువ్వులు, పోపు దినుసులు, ఇంగువ, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఈ పొడిని అన్నం, ఇడ్లీ, ఉప్మాల్లో తినవచ్చు. కూరల్లో కలుపుకోవచ్చు. వేపుళ్లలో పైన చల్లుకోవచ్చు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి వారంలో కనీసం మూడు రోజులు ఆహారంలో ఈ పొడి ఉండేలా చూసుకోవడం మంచిది. కొబ్బరి పొడి.. కావలసినవి: ఎండుకొబ్బరి తురుము – వంద గ్రాములు; పచ్చి శనగపప్పు – టీ స్పూన్; వేయించిన శనగపప్పు – టీ స్పూన్; మిరప్పొడి– టేబుల్ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ – అర టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. బాణలిలో పచ్చి శనగపప్పు వేసి దోరగా వేగిన తర్వాత వేయించిన శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ, కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. వేడి తగ్గిన తర్వాత అన్నింటినీ మిక్సీ జార్లో వేసి మిరప్పొడి, ఉప్పు కలిపి పొడి చేయాలి. ఇడ్లీ, దోశెలు, అన్నంలోకి బాగుంటుంది. వేపుళ్లలో ఒక టేబుల్ స్పూన్ పొడి కలిపితే రుచి ఇనుమడిస్తుంది. కరివేపాకు పొడి.. కావలసినవి: కరివేపాకు– వందగ్రాములు (మంచి నీటిలో శుభ్రం చేసి ఆరబెట్టి ఈనెలు తీసిన ఆకులు); ఎండు మిర్చి– పది; ఆవాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టేబుల్ స్పూన్; వేరుశనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు – అర టీ స్పూన్; చింతపండు – అర అంగుళం పాయ; వెల్లుల్లి రేకలు – 4; ఇంగువ పొడి– పావు టీ స్పూన్; నూనె – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత. తయారీ.. బాణలిలో నూనె వేడి చేసి వేరు శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు దోరగా వేయించాలి. అవి వేగిన తర్వాత మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆకులో పచ్చిదనం పోయే వరకు చిన్న మంట మీద వేయించాలి. ఆకు వేగిన తర్వాత చింతపండు, ఇంగువ, వెల్లుల్లిరేకలు, ఉప్పు వేసి దించేయాలి. చల్లారే కొద్దీ ఆకు పెళపెళలాడుతుంది. పూర్తిగా చల్లారిన వెంటనే మిక్సీలో వేసి పొడి చేయాలి. రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవాలి. ఈ పొడి వేడి అన్నం, ఇడ్లీ, దోశెల్లోకి రుచిగా ఉంటుంది. ఆకలి మందగించినప్పుడు, నోటికి ఏదీ రుచించనప్పుడు ఈ పొడి తింటే జీర్ణవ్యవస్థ క్రమబద్ధమవుతుంది. గమనిక: చల్లారిన వెంటనే పొడి చేయకపోతే ఆలస్యమయ్యే కొద్దీ ఆకు మెత్తబడి పోతుంది. సరిగ్గా మెదగదు. అవిశె గింజల పొడి.. కావలసినవి: అవిశె గింజలు – వందగ్రాములు; ఎండు మిర్చి – పది; ఆవాలు – అర టీ స్పూన్; మిరియాలు– అర టీ స్పూన్; పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; వేరు శనగపప్పు – అర టేబుల్ స్పూన్; ధనియాలు – టీ స్పూన్; ఇంగువ– అర టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి. తయారీ.. బాణలిలో అవిశె గింజలను మీడియం మంట మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. మరొక బాణలిలో ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, వేరు శనగపప్పు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, కరివేపాకు వేసి వేయించాలి. దినుసులన్నీ చక్కగా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు అవిశె గింజలు, ఇంగువ వేసి కలిపి దించేయాలి. వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఉప్పు కలిపి పొడి చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరోగ్యకారకం. గుండె వ్యాధుల నివారణ, డయాబెటిస్ నియంత్రణకు డాక్టర్లు అవిశె గింజలను సూచిస్తున్నారు. రుచి కోసం చూడకుండా రోజూ ఒక స్పూన్ అన్నంలో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లలో ఏదో ఒకరకంగా తీసుకోవడం మంచిది. ఇవి చదవండి: ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని చూపించిన ప్రదాని మోదీ! -
పోలీసుల కళ్లలో కారం కొట్టి.. ప్రతీకార హత్య!
క్రైమ్: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపింది ప్రత్యర్థి గ్యాంగ్. రాజస్థాన్ భరత్‌పూర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు దీనిని ప్రతీకార హత్యగానే ప్రకటించారు. కుల్దీప్ అనే గ్యాంగ్ స్టర్ బీజేపీ నేత కృపాల్ జఘిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. సెప్టెంబర్ 4, 2022లో ఈ హత్య జరగ్గా.. ఆ మరుసటిరోజే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కుల్దీప్ను అరెస్ట్ చేశారు. అయితే.. పోలీసుల కస్టడీలో ఉన్న కుల్దీప్, సహనిందితుడు విజయ్‌పాల్‌ను ఇవాళ జైపూర్ జైలు నుంచి భరత్పూర్ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఓ వాహనంలో దూసుకొచ్చిన ప్రత్యర్థులు పోలీసుల కళ్లలో కారం కొట్టి.. కుల్దీప్ను కాల్చి చంపారు. మొత్తం పదిహేను రౌండ్ల కాల్పులు జరిపారు. కుల్దీప్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. విజయ్‌పాల్ గాయపడగా.. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జైపూర్-ఆగ్రా నేషనల్ హైవేపై అమోలీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపాక నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసుల బృందం.. సమీపంలోని గ్రామం నుంచి దుండగుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
పట్టించుకోవట్లేదని ప్రియుడి కళ్లలో కారం కొట్టింది!
-
పట్టించుకోవట్లేదని ప్రియుడి కళ్లలో కారం కొట్టింది!
ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలో చోద్యం చోటుచేసుకుంది. స్థానికంగా బిర్యానీ సెంటర్ నడుపుతున్న ఒక వ్యక్తిపై.. ఓ మహిళ కారం పొడితో దాడికి పాల్పడింది. అయితే దాడికి పాల్పడింది అతని ప్రియురాలే అని సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన యువరాజు.. సత్తుపల్లిలో ధమ్ బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. అతని భార్య కస్తూరి స్వగ్రామంలోనే ఉంటుంది. ఈ క్రమంలో యువరాజు తన హోటల్లో పనిచేస్తున్న సత్వవతి అనే మహిళతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బిర్యానీ సెంటర్ దగ్గరికి వచ్చి మరీ కారం పొడితో దాడి చేసింది సత్యవతి. తన వల్లే యువరాజు ఈ స్థాయికి వచ్చాడని, అలాంటి తననే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ సత్యవతి ఆందోళన చేపట్టింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొందరిపైనా ఆగ్రహం వెల్లగక్కింది. పైగా డబ్బులు మొత్తం అతని భార్య పిల్లలకే పంపిస్తున్నాడంటూ గోల చేసింది. ఈ క్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
మహిళ కళ్లల్లో కారం చల్లి..
-
సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానుషం
-
సూర్యాపేటలో సమాజం తలదించుకునే ఘటన
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. కంట్లో కారం చల్లి నడిరోడ్డుపై కర్రలతో దాడి చేస్తూ నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. ఇది గమనించిన ఎంపీటీసీ సభ్యురాలు బాధితురాలికి వస్త్రాలు ఇచ్చి రక్షించారు. ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు) జూన్ 11వ తేదీన జరిగిన ఓ హత్య కేసులో బాధితురాలు నిందితురాలిగా ఉంది. హత్యకు గురయిన వారి కుటుంబసభ్యులే మహిళపై ఈ అమానుష ఘటనకు పాల్పడ్డారని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. చదవండి: దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే -
పోలీసులపై కారం చల్లి..
సాక్షి, అనకాపల్లి : అనకాపల్లి మండలం తగరంపూడిలో మద్యం బెల్టు దుకాణం నిర్వాహకులు శుక్రవారం పోలీసులపై కారం చల్లి తిరుగుబాటు చేసింది. రూరల్ ఎస్ఐ పి.రామకృష్ణ కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తగరంపూడి గ్రామంలో మద్యం బెల్టు దుకాణం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారంఅందింది. తక్షణమే అదనపు ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు, హెచ్‌సీ మల్లేశ్వరి, కానిస్టేబుళ్లు కె.అప్పలనాయుడు, రాజ్‌కుమార్ గ్రామానికి చేరుకున్నారు. మద్యం విక్రయిస్తున్న కొప్పుల వెంకటలక్ష్మి దుకాణంలోకి ప్రవేశించి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.దీంతో అసహనానికి గురైన కొప్పుల వెంకటలక్ష్మి, భర్త ప్రసాదరావు, తల్లి భాషణ పార్వతి, సోదరుడు చిన్నారావు కానిస్టేబుళ్ళ కంటిపై కారం చల్లి తప్పించుకునే ప్రయత్నం చేశారని అదనపు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. -
ఢిల్లీ నడివీధుల్లో కళ్లల్లో కారంచల్లి..
సాక్షి, న్యూఢిల్లీ: అర్థరాత్రి సమయంలో ఢిల్లీ నడివీధుల్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనూహ్యమైన ప్రతిఘటన ఎదురైంది. రాత్రి బందోబస్త్ నిర్వహిస్తున్న పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారంచల్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి ఈస్ట్ ఢిల్లీ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానిక డీసీపీ మేఘన యాదవ్ వివరాలు వెల్లడిస్తూ.. ‘‘రాత్రి సమయంలో మా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వేళ నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి దగ్గరకు వెళ్లి ప్రశ్నించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో వారు మావాళ్లపై కారంతో దాడికి పాల్పడ్డారు. ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపాం’’ అని వివరించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి అరెస్ట్ చేశామని, దాడికి పాల్పడ్డవారంతో ఒకే కుంటుంబానికి చెందినట్లుగా విచారణలో తేలిందని డీసీపీ వెల్లడించారు. అయితే అరెస్ట్ వ్యక్తిని సజన్‌గా గుర్తించిన పోలీసులు అతనిపై ఇదివరకే పలు కేసులు నమోదయి ఉన్నట్లు తెలిపారు. గ్రూపులుగా ఏర్పడి వారంత దోపిడీలకు పాల్పడుతున్నారని.. రాత్రి సమయంలో బందోబస్త్‌ను మరింత కట్టుదిట్టం చేస్తామని ఆయన వెల్లడించారు. -
వింత ఆచారం.. ‘ఎర్రని’ అభిషేకం!
చెన్నై: కొన్ని ఆచారాలు వింత ఉంటాయి. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని నల్లంపల్లిలో పాటించే ఆచారం కూడా ఇలాంటిదే. స్థానిక కరుప్పస్వామి ఆలయంలో ఆడి(ఆషాడ) అమావాస్య సందర్భంగా అర్చకుడికి కారం కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తారు. ఏంటి నమ్మలేకపోతున్నారా! ప్రతి ఏటా ఆడి అమావాస్య రోజున ఆలయ ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. ఉత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిగా ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం నిర్వహించారు. అర్చకుడు ముందుగా ఓ ఆసనంపై కూర్చుని భక్తులకు ఉపదేశం చేయగా అక్కడే సిద్దంగా బిందెలలో ఉంచిన నీటిలో 75 కిలోల దంచిన ఎండు మిరపకాయల కారం పోసి కలిపారు. కారం కలిపిన జలంతో అర్చకుడికి గ్రామ పెద్దలు అభిషేకం చేశారు. భక్తులంతా ఈ ఘట్టాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. కారం కలిపిన నీటితో అభిషేకం చేస్తున్నా అర్చకుడు ఎటువంటి ఇబ్బంటి పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కారం మంట పెడుతున్నా కరుప్పస్వామిపై ఉన్న భక్తి వల్ల అర్చకుడుకి ఏమాత్రం బాధ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. తమ గ్రామంలో ఏళ్లు తరబడి వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగించటం ఆనందంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇలా చేయటం ద్వారా అర్చకుడి ఉపదేశ వాక్కు ఫలిస్తుందని వారినమ్మకమట. గ్రామస్తుల ఆచారాలు ఎలా ఉన్నా కారం నీళ్లతో మనిషికి అభిషేకం విచిత్రంగానే ఉంది. -
ముఖ్యమంత్రిపై కారంపొడితో దాడి
-
ముఖ్యమంత్రిపై కారంపొడితో దాడి
సాక్షి, న్యూఢిల్లీ :కారంపొడితో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి దిగాడు ఓ దుండగుడు. సాక్షాత్తూ సచివాలయంలోనే ఈ దాడి జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. అనిల్ కుమార్ అనే వ్యక్తి సిగరేట్ ప్యాకెట్లో కారం పొడి నింపుకొని సచివాలయంలోకి దూసుకొచ్చారు. భోజనం సమయం కావడంతో ముఖ్యమంత్రి తన గదిలో నుంచి బయటికి వస్తుండగా ఆయనపై కారంపొడి చల్లాడు. దీంతో అప్రమత్తమైన సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. కేజ్రీవాల్‌ను చంపేస్తానంటు గట్టిగా అరుస్తూ సీఎం వైపు పరుగెత్తాడు. ఈ ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కేజ్రీవాల్ కళ్లజోడు కిందపడి పగిలిపోయింది. అక్కడి భద్రతా సిబ్బంది అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా ఘటనపై ఆమ్ఆద్మీ తీవ్రంగా మండిపడింది. ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రికే భద్రతలేకుండా పోయింది ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రిపై ఘోరమైన దాడి జరిగింది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందా లేదా అన్నది ఇంకా తేలలేదనీ.. పూర్తి వివరాలు తెలియకుండా తాము ఎవరిపైనా ఆరోపణలు చేయబోమని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. -
పట్టుబడింది కల్తీ కారమే...
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కల్తీ కారం కేసు అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తాయన్న సమాచారంతో కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేసిన వేల బస్తాల కల్తీ కారాన్ని వ్యాపారులు రోడ్ల వెంబడి విసిరి వేశారు. ఆహార నియంత్రణ, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి, కోల్డ్‌స్టోరేజీలు, కారం మిల్లులలో తనిఖీ చేస్తే కళ్లు చెదిరే నిజాలు వెలుగు చూశాయి. కోల్డ్‌స్టోరేజిలో పెద్దఎత్తున కల్తీ కారం నిల్వ ఉన్నట్లు గుర్తించి, సీజ్ చేశారు. మొత్తం 97 శాంపిల్స్ సేకరించారు. అందులో 30 శాంపిల్స్ సురక్షితం కాదని, హానికరమైన పదార్థాలు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. 28 శాంపిల్స్‌లో నాణ్యత లేదని రాష్ట్ర పరిశోధన కేంద్రంలో ధ్రువీకరించారు. అయితే, దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది కారం మిల్లులు, కోల్డ్ స్టోరేజీ యజమానులు శాంపిల్స్‌ను మైసూరులోని కేంద్రీయ పరీక్ష కేంద్రానికి పంపాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొన్నారు. 18 శాంపిల్స్‌ను అక్కడకు పంపగా అందులో సైతం 14 శాంపిల్స్‌లో నాణ్యత లేదని, 4 శాంపిల్స్ సరక్షితం కాదని రావడంతో ఆహార నియంత్రణ అధికారులు ఫైనల్ చార్జీషీట్ దాఖలు చేసినట్లు సమాచారం. కేసును నాన్చడంతో పాటు, తారుమారు చేసేందుకు, ఓ అధికార పార్టీ నేత ఆ««ధ్వర్యంలో లక్షల రూపాయిలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఓ మం త్రితో పాటు, ఓ అధికార పార్టీనేత అధికారులపై ఒత్తిడి తెచ్చి నామమాత్రపు కేసులతో సరిపెట్టినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. 30 మందిపై క్రిమినల్ కేసుల నమోదు కల్తీ కారం కేసుకు సంబంధించి 30 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. 40 కేసులు జాయింట్ కలెక్టర్ కోర్టులో నడుస్తున్నాయి. ఇందులో 18 కేసుల్లో కారం మిల్లులతోపాటు, కోల్డ్‌స్టోరేజీ యజమానులను ఆయన రూ.50 లక్షల జరిమానా విధించారు. మిగిలిన కేసులు విచారణలో ఉన్నాయి. ఈ సమయంలోనే గత ఏడాది విజిలెన్స్ అధికారుల దాడుల్లో కల్తీ కారం మిల్లులో పల్టుబడింది. వీటికి ఫుడ్ సేఫ్టీ, మార్కెట్ యార్డు శాఖ ఇచ్చే లైసెన్సులు కూడా లేవని నిర్ధారించారు. కొలిక్కి వచ్చిన విచారణ కల్తీకారం కేసుకు సంబంధించి విచారణ కొలిక్కి వచ్చింది. మొత్తం 30 క్రిమినల్ కేసులు నమోదు చేశాం. జాయింట్ కలెక్టర్ కోర్టులో 40 కేసులు ఉన్నాయి. మైసూర్ ల్యాబ్‌కు పంపిన నమానాలు వచ్చాయి. దీంతో చార్జీషీట్ దాఖలు చేశాం.– షేక్ గౌస్‌మోద్దీన్, ఆహారనియంత్రణ అధికారి, గుంటూరు -
కారమే వారి ఆయుధం
అమీర్‌పేట్: ఆన్లైన్లో సెల్ఫోన్లు బుక్‌చేసుకుంటారు. వాటిని తీసుకుని వచ్చే డెలివరీ బాయ్స్‌కు నకిలీ డెబిట్ కార్డులు ఇచ్చి కళ్లల్లో కారం చల్లి వస్తువులను లాక్కొని పరారవుతారు. పసిగట్టిన పోలీసులు అరెస్టుచేసి రూ.1.5 లక్షలు విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూర్‌కు చెందిన సంగన కిషోర్ నగరంలోని గుడిమ ల్కపూర్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.రాజమండ్రి సీతమ్మపేట నివాసి మల్లిరెడ్డి శివశంకర్ డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగం కోసం వచ్చి చింతల్లో ఉంటున్నాడు. వీరికి పరిచయం ఏర్పడి జులాయిగా తిరుగుతున్నారు.అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న దుర్భుద్ది కలిగింది. ఆన్లైన్లో ఫ్లిప్‌కార్ట్,అమేజాన్ వెబ్సైట్ ద్వారా ఖరీదైన ఫోన్లను బుక్ చేసుకుంటారు. ఆ సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ వాటిని తీసుకుని వారికి ఫోన్ చేయగా జనసంచారం లేని ప్రాంతాలకు పిలిపించుకుంటారు. నకిలీ డెబిట్,క్రెడిట్ కార్డులను బాయ్‌కి ఇచ్చి వాటిని స్వైప్ చేస్తున్న సమయంలో కళ్లల్లో కారంచల్లి పార్సిళ్లను ఎత్తుకు వెళుతారని ఏసీపీ వివరించారు. ఎస్ఆర్నగర్, శంషాబాద్, జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో దోపిడీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని క్రైం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 5 స్మార్ట్ సెల్ఫోన్లు, ఒక ట్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. దొంగలను పట్టు కోవడంలో కీలకంగా వ్యవహరించిన డిటెక్టివ్ కిషోర్ పాటు డీఎస్సై జి.శ్రీనివాస్ ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఇన్స్పెక్టర్లు వహిదుద్దీన్, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీస్ స్టేషన్ లో నిర్భయను మించిన ఘోరం
శ్రీనగర్: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ ను మించిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే ఈ ఘటనలో నిందితులు సాక్షాత్తు పోలీసులే కావడం మరింత ఆందోళన రేకెత్తించింది. జమ్మూలోని కనాలాల్ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జమ్మూ కానాచక్ ప్రాంతానికి చెందిన చెందిన ఓ మహిళను (25) దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆమెపై నిర్హయ గ్యాంగ్ రేప్ తరహాలో తీవ్ర హింసను ప్రయోగించడంతోపాటు, లైంగికంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కస్టడీలో ఉన్నపుడు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించాడు. అయితే మే 6వ తేదీన బెయిల్ మంజూరు కావడంతో తనకు జరిగిన ఘోరంపై న్యాయవాది సహాయంతో పోరాటానికి సిద్దపడింది బాధితురాలు. స్టేషన్ ఎస్.ఓ.ఒ.రాకేశ్ శర్మ ఒక వారంపాటు తనను హింసించిన తీరును మీడియాకు బాధితురాలు వివరించింది. తీవ్రమైన హింసతోపాటు, లైంగిక దాడికి పాల్పడ్డాడని, ప్రయివేట్ పార్ట్స్ లో బీర్ బాటిల్ .. కారంపొడిని చల్లారని ఆరోపించింది.కస్టడీలో ఉన్నప్పుడు తినడానికి ఏమీ ఇవ్వలేదని బాధితురాలు వాపోయింది. నీళ్ళు అడిగితే, మూత్రం త్రాగమంటూ పోలీసులకు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించింది. తనపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, తల్లి, భర్త, పిల్లలను పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు కూడా ఆ మహిళ ఆరోపించింది. బాధితురాలి తరపు న్యాయవాది ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్భయ కేసులోమాదిరిగా పోలీసులు ప్రవర్తించారని మండిపడ్డారు. కాపాడాల్సిన పోలీసులే బాధితురాలపై క్రూరత్వాన్ని చాటుకున్నారని ఆయన ఆరోపించారు.మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వాన్ని వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ ఉదంతంపై ర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కల్తీ కారం దందా
-
గుంటూరులో కల్తీ కారం దందా
-
కంట్లో 'కారం'
* గుంటూరులో యథేచ్ఛగా కల్తీ కారం తయారీ * వ్యర్థాలకు రంగులద్ది.. ఆపై జనం నెత్తిన రుద్ది.. * తయారీలో ప్రమాదకర రసాయనాల వినియోగం * కోట్లల్లో వ్యాపారం.. ప్రమాదంలో ప్రజారోగ్యం * నియంత్రణ చర్యలు నామమాత్రం తోపుడుబళ్లు.. టిఫెన్ సెంటర్లలో తయారుచేసే ఆహార పదార్థాలు ఎర్రగా వర్రగా కనిపిస్తూ నోట్లో నీళ్లూరింపజేస్తాయి. వ్యాపారులు ఎదురుగా ప్రదర్శించే చికెన్ లేదా గోబీ మంచూరియాలకు రంగుల మసాలాలద్ది ఇట్టే ఆకట్టుకుంటారు. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లతో పోల్చితే ఇక్కడ రేట్లు కూడా తక్కువే. మరి ఇలాంటి కల్తీ కారాన్ని ఎలా తయారుచేస్తున్నారో తెలిస్తే గుండెలు బాదుకోవాల్సిందే. సాక్షి, అమరావతి బ్యూరో : ‘కాదేదీ కల్తీకనర్హం..’ అన్నట్లుంది జిల్లాలో పరి స్థితి. ప్రతి వస్తువులోను కల్తీ చేసి వ్యాపారులు అందినకాడికి దోచుకుం టున్నారు. నియంత్రించాల్సిన కొం దరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో వీటికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నిత్యావసరాలు నూనె, నెయ్యి, కందిపప్పు, కారం ప్రతిదానిలో కల్తీ చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. గుంటూరులో 100కు పైగా కారం మిల్లులు ఉన్నాయి. సగటున ఏడాదికి 40 వేల టన్నులకు పైగా కారంపొడిని తయారుచేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పంపుతారు. ఇందులో కొంతమంది కల్తీ కారం తయారుచేసి జనాలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. గురువారం మిల్లులు, కోల్డ్ స్టోరేజీలపై విజిలెన్స్ దాడుల నేపథ్యంలో కల్తీ కారం గురించి ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీకి శ్రీకారం చుడుతున్నారిలా.. కల్తీ కారాన్ని ప్రధానంగా రెండు పద్ధతుల్లో చేస్తున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా కంభం, మేదరమెట్లలో చైనా సాంకేతిక పరిజ్ఞానంతో మిరపకాయల నుంచి నేచురల్ ఎరుపు కలర్, ఆయిల్ తయారుచేస్తారు. ఈ నేచులర్ కలర్ ఫారిన్లో ఉపయోగిస్తారు. ఆయిల్‌ను టాబ్లెట్లపై ఉండే నున్నటి చిన్న పొరకు వినియోగిస్తారు. దీనిని తయారుచేసేటప్పుడు పెద్దఎత్తున వ్యర్థం వస్తుంది. ఇది రంపపు పొట్టు మాదిరి ఉంటుంది. దీనిని ఇక్కడి వ్యాపారులు చైనా కారం అని వాడుక భాషలో పిలుస్తారు. దీనికి కారానికి సంబంధించిన గుణాలు ఉండవు. ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థాన్ని దూరంగా తీసుకెళ్లి పారవేయాలి లేదా పాతిపెట్టాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పష్టంగా పేర్కొంది. పవర్ ప్లాంట్‌లో దీనిని ఉపయోగిస్తారు. దీంతో ఫ్యాక్టరీ యజమాన్యమే దీనిని బయట వేసేందుకు కిలోకు రెండు రూపాయల చొప్పున కాంట్రాక్టర్‌కు ఇస్తోంది. ఈ వ్యర్థాన్ని గుంటూరుకు చెందిన కొంతమంది కారం మిల్లుల యజమానులు కిలో రూ. 10–16 లకు కొనుగోలు చేసి కల్తీ కారం తయారు చేస్తున్నట్లు తెలిసింది. మిరపకాయలను ప్రాసెసింగ్ చేసేటప్పుడు కెమికల్స్ కలుపుతారు. అందువల్ల ఈ పొడిలో వ్యర్థాలు ఇమిడిపోతాయి. దీనివల్ల కిడ్నీ, లివర్ సంబంధ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తయారీ ఇలా... ఫ్యాక్టరీల నుంచి వచ్చిన పొట్టు (బూడిద) 85 శాతం, 10 శాతం కారం, 5 శాతం రెడ్ఆక్సైడ్ మిక్స్ చేసి కల్తీ కారం తయారు చేస్తారు. ఇంకో పద్ధతిలో మిరపకాయల కాడలు, తాలు కాయలను తీసుకుని పొడి చేస్తారు. ఇది కొద్దిగా మిర్చి వాసన వస్తుంది. దీనికి కొంచెం మంచి కారం, రెడ్ ఆక్సైడ్, సూడాన్‌ను కలిపి కారం తయారు చేస్తారు. మిరప తొడిమల్లో సైతం ఆఫ్లటెగ్జాన్ ఉండడంతో లివర్ సంబంధ వ్యాధులు వస్తాయి. మంచి కారం అంటే... క్యాపిన్ గాఢత 900 ఎస్‌హెచ్‌యూ, కలర్ వాల్యూ 70 యూనిట్లు ఆస్టా, ఆప్లటెగ్జిన్ 10 పీబీ నుంచి 30 పీబీ వరకు ఉండాలి. బూడిద (వ్యర్థం) 7 శాతం, తేమ 11 శాతం ఉండాలి. ఈ నకిలీ కారంలో క్యాపిన్ గాఢత, కలర్ వాల్యూ వంటివి ఏవీ ఉండనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బూడిద మాత్రం 90 శాతానికి పైగా ఉన్నట్లు సమాచారం. సరఫరా చేస్తున్నారిలా... తక్కువ ధర పేరుతో హోటళ్లు, తోపుడు బళ్లు, హాస్టళ్లకు ఈ కారం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో తోపుడుబళ్లపై దీనిని అమ్ముతున్నట్లు సమాచారం. కొన్ని రకాల బ్రాండ్ల పేరుతో కారం పొడి తయారుచేసి ఈ కల్తీ కారం విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. -
నకిలీ కారం పట్టివేత
* తయారు చేసే మిల్లులు, కోల్డ్స్టోరేజీపై విజిలెన్స్ దాడులు * కారం అక్రమ నిల్వల గుర్తింపు గుంటూరు రూరల్: నకిలీ కారం తయారు చేసే మిల్లులు.., నకిలీ కారం, చైనా కారం నిల్వ ఉంచిన కోల్డ్ స్టోరేజ్‌లపై విజిలెన్స్ ఎస్పీ శోభామంజరి ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 2 కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ కారం, చైనా కారం, అక్రమంగా నిల్వ ఉంచిన కారం నిల్వలను సీజ్ చేశారు. మిరప తొడాలతో నకిలీ కారం.. గుంటూరు నగరంలోని మిర్చి యార్డు సమీపంలోగల భువనేశ్వరి ఇండస్ట్రీస్ కారం మిల్లులో నకిలీ కారం తయారు చేస్తున్నారని అందిన సమాచారం మేరకు దాడులు చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ శోభామంజరి తెలిపారు. మిల్లులో మిరపకాయల తొడాలతో నకిలీ కారం తయారు చేసి, దానికి ఎరుపురంగును కలిపి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారని గుర్తించినట్లు తెలిపారు. మిల్లులోని 9 బస్తాల రంగు, 72 బస్తాల కల్తీ కారం, 52 బస్తాల తాలుమిరపకాయలు, 15 బస్తాల మిరపకాయల తొడాలను సీజ్‌చేశామని, వీటి విలువ రూ. 15 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. మిల్లు యజమాని కాశయ్యపై నకిలీ వస్తువుల తయారీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిరపకాయ పిప్పికి కెమికల్స్ కలిపి... అదేవిధంగా ఏటుకూరు గ్రామంలోని ఉదయ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఏసీ గోడౌన్‌పై దాడిచేసి ఏసీలో అక్రమంగా నిల్వ ఉంచిన 5 వేల బస్తాల నకిలీ చైనా కారం సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ తెలిపారు. ఈ నకిలీ చైనా కారం ఖమ్మం జిల్లాలో తయారవుతుందని, మిరపకాయలనుంచి నూనె, రంగు ఇతర కంటెన్స్ను వెలికి తీయగా మిగిలిన పిప్పికి ఎరుపు రంగును కలిపి విక్రయిస్తారన్నారు. ఈ పిప్పిలో పలు రకాల కెమికల్స్ కలిపి కారంగా మార్కెట్లోకి విడుదల చేస్తారన్నారు. ఈ కారం విలువ సుమారు కోటిన్నరకు పైగా ఉంటుందన్నారు. గతంలో చైనా కారంను 9 వేల బస్తాలకు పైగా ఇక్కడ నిల్వ ఉంచారని, అందులో సుమారు నాలుగు వేల బస్తాలను కల్తీ చేసి మార్కెట్లోకి విడుదల చేసినట్లు విచారణలో తేలిందని, ఏడుగురు వ్యక్తుల పేర్లపై గోడౌన్లో చైనా కారం నిల్వ ఉంచినట్లు రికార్డులు చెబుతున్నాయని, వివరాలు తేలాల్సిఉన్నాయన్నారు. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్‌లో లెక్కలు చూపని మిరపకాయలు, కారం సైతం నిల్వలున్నాయని, వాటి విలువ మరో రూ. 10 లక్షలకు పైగా ఉంటుం దని తెలిపారు. ఉదయ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కోల్డ్‌స్టోరేజ్ గోడౌన్ గుమస్తా అప్పారావును అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లెక్కలు చూపకుండా నిల్వ... లక్ష్మీగణపతి కోల్డ్ స్టోరేజ్‌కు చెందిన సుమారు 400 బస్తాల కారం రికార్డుల్లో లెక్కలు చూపకుండా నిల్వ చేశారని, గోడౌన్లో లక్ష్మిగణపతి పేరుతో ఉన్నా సరుకు తమదికాదని అంటున్నారని విచారించి వివరాలను వెల్లడిస్తామన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన సరుకు విలువ సుమారు రూ. 30 లక్షలవరకూ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఏటుకూరు పరిసర ప్రాంతాల్లో పత్తి గింజల పిప్పితో పశువుల దాణా తయారీ చేసే కేంద్రాలపై కూడా పలు ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి నకిలీలు, ప్రమాదభరితమైన ఆహారపదార్థాలైతే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. దాడులలో డీఎస్పీ రమణకుమార్, సీఐలు ఆంథోనిరాజు, కిషోర్‌బాబు, ఏవో వెంకటరావు, డీసీటీవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కళ్లలో కారం చల్లి రూ. 80 లక్షలు చోరీ
మనీ ఎక్స్చేంజ్ ఏజెన్సీ యజమాని పరార్ చెన్నై: చెన్నై నుంచి పుదుచ్చేరీకి రహస్యంగా తరలిస్తున్న రూ.80 లక్షల హవాల సొమ్మును దొంగలెత్తుకెళ్లడం నగరంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరి వాంజినాథన్ వీధికి చెందిన చోళియన్ (40). ఇతను విదేశీ కరెన్సీకి భారత కరెన్సీని ఇచ్చే మనీ ఎక్చ్సేంజ్ ఏజన్సీని పుదుచ్చేరీలో నడుపుతున్నాడు. ఇతని వద్ద అదే ప్రాంతానికి చెందిన షణ్ముగం (37) అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. పుదుచ్చేరీలో పెద్ద ఎత్తున సాగే కరెన్సీ మార్పిడి వ్యాపారంలో భాగంగా సదరు షణ్ముగం 15 రోజులకు ఒకసారి చెన్నైకి వచ్చి ఇక్కడి బ్రాడ్వేలోని ఒక ప్రముఖ మనీ ఎక్సేంజ్ ద్వారా హవాలా సొమ్ముగా మార్చుకుంటాడు. ఈ హవాలా సొమ్ముతో తిరిగి పుదుచ్చేరికి చేరుకుంటాడు. మనీ ఎక్సేంజ్కీ ఎలాంటి డాక్యుమెంటు అవసరం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తమ సంస్థకు వచ్చిన ఐరోపా దేశ యూరో కరెన్సీని భారత కరెన్సీగా మార్చేందుకు షణ్ముగం మంగళవారం చెన్నైకి వచ్చాడు. బ్రాడ్వేలోని మనీ ఎక్చ్సేంజ్‌కు వెళ్లి యూరోలను రూ.80 లక్షల భారత కరెన్సీగా మార్చుకుని సిటీ బస్సులో తిరువాన్మియూరు బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి పుదుచ్చేరీకి వెళ్లేందుకు మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అక్కడి వాల్మీకి మునీశ్వర ఆలయం వద్ద బస్ కోసం వేచి ఉన్నాడు. ఆ సమయంలో మూడు బైక్‌లలో వచ్చిన ఆరుగురు షణ్ముగం ముఖంపై కారం పొడి చల్లి రూ.80 లక్షలను లాక్కున్నారు. వెంటనే వారి సమీపంలోకి వచ్చిన ఒక కారులో ఇద్దరు పారిపోయారు. మరో ఇద్దరు బైక్‌లో పరారయ్యారు. తిరువాన్మీయూరు పోలీసులను షణ్ముగం ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పుదుచ్చేరీకి చెందిన ఒక ఎమ్మెల్యే అన్న కుమారుడికి కూడా రూ.80 లక్షల సొమ్ము వ్యవహారం తెలుసని, అతని ప్రోద్బలం ఉండవచ్చని షణ్ముగం పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. సొమ్ము చోరీకి గురికాగానే మనీ ఎక్చ్సేంజ్ ఏజెన్సీ యజమాని చోళియన్ పారిపోవడంతో పోలీసులు అతన్ని కూడా అనుమానిస్తున్నారు. మనీ ఎక్చ్సేంజ్ వ్యాపారం ద్వారా లెక్కల్లో చూపని రూ.80 లక్షల తరలింపు వెనుక మర్మం ఏమిటని పోలీసులు విచారిస్తున్నారు. -
బె‘ధర’గొడుతున్న ఆవకాయ!
* పచ్చళ్ల తయారీపై ధరల పోటు * కన్నీళ్లు తెప్పిస్తున్న కారం పొడి * రెట్టింపైన ఆవాలు, ధనియాలు, మెంతుల రేట్లు * మామిడికాయలదీ అదే దారి కామారెడ్డి: ప్రతి ఇంటా కనిపించే ఆవకాయ.. ఈసారి ఖరీదై పోయింది. పచ్చళ్ల తయారీపై ధర భారం పడింది. తొక్కుల తయారీలో ఉపయోగించే అన్ని వస్తువుల రేట్లకు రెక్కలొచ్చాయి. కారం పొడి, జీలకర్ర, మెంతు లు, ఆవాలు, ధనియాలకు తోడు మామిడికాయ ధరలు చుక్కలనంటుతున్నాయి. నోరూరించే ఆవకా య ప్రస్తుతం ఆర్థికంగా భారమైంది. ఏపూటకు ఆ పూట సర్దుకొనే పేద కుటుంబమైనా, ఆర్థికంగా స్థితిమంతులైనా సరే.. ప్రతి ఇంట్లో కచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ అన్నంతో పాటు ఆవకాయను ఆరగించాల్సిందే. కొందరు పేదలైతే పచ్చడితోనే పూట గడిపేస్తారు. ఓపూట కూర లేకున్నా ఆవకాయతో సర్దుకుంటారు. ముఖ్యంగా రైతులు, రైతు కూలీ లు ఏడాదికి సరిపడినంతగా పచ్చళ్లను తయారు చేసుకుంటారు. అయితే, ఈసారి పచ్చళ్ల తయారీకి వాడే వస్తువుల ధరలు అనూహ్యంగా పెరగడంతో తొక్కుల తయారీకి సిద్ధమైన పేద, మధ్య తరగతి వర్గాలు నిట్టూరుస్తున్నాయి. ఎన్నెన్ని రకాలో.. మామిడికాయతో రకరకాలు తొక్కులు, పచ్చళ్లు తయారు చేస్తారు. మామిడి కాయను తరిగి చేసే తొక్కును సొప్పు తొక్కు అంటారు. అలాగే, ఆవకాయ తొక్కు, ఎల్లిపాయ తొక్కు, ఉప్పావ, మెంతావ తదితర రకాల పచ్చళ్లు చేస్తారు. చక్కెర, కొబ్బరితోనూ రకరకాల తొక్కులు పెడతారు. పేదల ఇళ్లలో మాత్రం ఆవకాయ తొక్కే ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని ధరలు పెరిగినయి తొక్కులు పెట్టెతందుకు ముందుగళ్లనే అన్ని సామాన్లు తెచ్చి పొడులు తయారు చేసుకుంటం. ఇంతకు ముందు పెద్ద పెద్ద మడ్తమాన్లల్ల తొక్కులు పెట్టేటోళ్లం. ఇప్పుడు కొద్దిగంతనే పెట్టుకుంటున్నం. కారంపొడి, ఆవాలు, మెంతులు, ధనియాల ధరలు అడ్డగోలుగా పెరిగినయి. వేలకు వేలు పెట్టి తొక్కులు పెట్టడం భారంగా మారింది. - శేర్ల లక్ష్మి, భిక్కనూరు చుక్కలనంటుతోన్న ధరలు.. తొక్కుల తయారీలో జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి, ఆవాల పొడి, కారంపొడి, ఉప్పు, ఆవాలు, పల్లి నూనె వాడతారు. జీలకర్ర ధర గత యేడాది కిలోకు రూ.180 ఉంటే ఈసారి రూ.240కి చేరింది. మెంతులు నిరుడు రూ.60 ఉంటే ఇప్పుడు రూ.130కి చేరాయి. ధనియాల పొడి గతంలో రూ.120 ఉండగా, ఇప్పుడు రూ.170, కారంపొడి నిరుడు రూ.170 ఉంటే, ప్రస్తుతం రూ.240 కి చేరాయి. కుటుంబానికి సరిపడా తొక్కుల తయారీకి గతంలో రూ.2 వేల లోపు సరిపోయేది. ప్రస్తుతం పెరిగిన ధరలతో రూ.3-4 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామిడికాయల ధరలు సైతం.. వాతావరణ పరిస్థితులు సహకరించక ఈసారి మామిడి సరిగా కాయలేదు. కాసినా వడగళ్లు, ఈదురుగాలులతో రాలిపోయాయి. దీంతో మామిడికాయల కొరత ఏర్పడి, వాటి ధరకు రెక్కలొచ్చాయి. ఆవకాయ కోసం అవసరమైన చిన్న మామిడి కాయ ధర ఒక్కొక్కటి గతంలో రూ.2-3 ఉంటే, ప్రస్తుతం రూ.5-6 పలుకుతోంది. అలాగే సొప్పు తొక్కులు పెట్టే పెద్ద మామిడికాయలు గతంలో రూ5 ఉంటే, ఇప్పుడు రూ.10కి చేరింది. నిమ్మకాయలదీ అదే పరిస్థితి. మార్కెట్లో వాటి ధరలు అడ్డగోలుగా ఉన్నాయి. దీంతో తొక్కు అంటేనే జనం ముక్కు విరుస్తున్నారు. తొక్కులు పెట్టుకునేకన్నా అవసరం ఉన్నపుడు రెడీమెడ్ పచ్చళ్లు తెచ్చుకోవడమే ఉత్తమమని చాలా మంది తొక్కులకు దూరమవుతున్నారు. గతంలో ఏ ఇంట్లో అయినా 2-3 మడతమానుల నిండా పచ్చళ్లు పెట్టేవారు. ఇప్పుడు పెరిగిన ధరలతో తొక్కుల వాసన రావడం లేదు. -
కళ్లల్లో కారం కొట్టి లాక్కెళ్లాడు..
హైదరాబాద్ : కళ్లల్లో కారం కొట్టి ఓ మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన సంఘటన చిక్కడపల్లి పరిధిలోని రామ్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. రామ్‌నగర్‌లో స్మిత(32) అనే మహిళ షాప్‌లో ఉండగా మాస్క్ ధరించి వచ్చిన ఓ యువకుడు ఆమె కళ్లల్లో కారం కొట్టాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల మంగళసూత్రం తెంచుకెళ్లాడు. బాధిత మహిళ గట్టిగా అరవటంతో షట్టర్ మూసి పరారయ్యాడు. ఈ సంఘటన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటికి కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మాయిలూ.. కారంపొడి తీసుకెళ్లండి..!
తాండూరు (రంగారెడ్డి జిల్లా): పోకిరీల నుంచి తనను రక్షించుకునేందుకు ఆడపిల్లలు బయటకు వెళ్లేముందు వెంట కారంపొడిని తీసుకువెళ్లాలని తాండూరు ఏఎస్పీ చందనదీప్తి సూచించారు. పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్యూఐ నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేష్‌చారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ కార్యక్రమానికి ఏఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో అమ్మాయిలు, మహిళలు బయటకు వెళ్లేముందు కారంపొడి లాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే మహిళలు,విద్యార్థినిలు వేధింపులకు పాల్పడే వారి నుంచి పోలీసులు వచ్చేలోపు రక్షించుకునే వీలుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. వేధింపులకు పాల్పడే వారికి మొదటిసారైతే కౌన్సెలింగ్ చేస్తామని.. రెండోసారి పట్టుపడితే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు. కళాశాలలు,పాఠశాలలు, ఉద్యోగాలకు వెళ్లే అమ్మాయిలు, మహిళలను తమ సొంత అమ్మ, చెల్లిగా భావించాలని చెప్పారు. మహిళల వేధింపుల విషయంలో చట్టాలు కఠినంగా ఉన్నాయని, అనవసరమైన విషయాల్లో తలదూర్చి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువకులకు సూచించారు. ప్రభుత్వం ఈవ్‌టీజింగ్ నిర్మూలనకు 'షీ'టీమ్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. పోకిరిలు వేధిస్తున్న విషయాన్ని ధైర్యంగా 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని చెప్పారు. కళాశాల చైర్మన్ ఎం.రమేష్ మాట్లాడుతూ సమస్య ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
వామ్మో! 31 కిలోల కారం నీటితో అభిషేకం!!
వేలూరు(తమిళనాడు): వేలూరు సత్‌వచ్చారిలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఒక స్వామీజీ 31 కిలోల కారంపొడి కలిపిన నీటితో అభిషేకం చేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సత్వచ్చారి గంగమ్మ ఆలయం వద్దకు 4 నెలల క్రితం ఈ స్వామీజీ వచ్చారు. అక్కడికి సమీపంలోని ఒక తోటలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. ఈ స్వామీజీ పేరు, ఊరు ఎవరికీ తెలియదు. ఈ స్వామీజీ తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో మాట్లాడుతారు. ఈ స్వామీజీ ప్రత్యంగరా దేవిని ప్రతి రోజూ పూజిస్తుంటారు. మంగళవారం ఉదయం ప్రపంచ శాంతి కోసం ఆయన పూజించే ప్రత్యంగరా దేవికి ప్రత్యేక పూజలు చేశారు.తన ఇంట్లోనే కారంపొడి నీటితో అభిషేకం చేయించుకోబోతున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని తొలుత స్వామీజీ చేపట్టిన ప్రత్యంగరా దేవి ప్రత్యేక పూజలను తిలకించారు. అనంతరం స్వామీజీ ఒక అండా(పెద్దపాత్ర)లో కూర్చున్నారు. భక్తులు 31 కిలోల కారం పొడిని నీటిలో కలిపి వాటిని స్వామీజీపై పోసి అభిషేకం చేశారు. అనంతరం నీటితో కూడా స్వామివారికి అభిషేకం చేశారు. ** -
కళ్లలో కారం చల్లి 6 రౌండ్ల కాల్పులు
నల్లగొండ: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు, టీఅర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోనపురి రాములును హత్య చేసిన దుండగులు కళ్లలో కారం చల్లి ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు గన్‌మేన్ చెప్పారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పర్వతాలు కుతురు వివాహానికి వెళ్లిన రాములుని ఎంఏ బేగ్ ఫంక్షన్ హాల్లో హత్య చేసిన విషయం తెలిసిందే. మొత్తం 10 మంది వచ్చి కాల్పులు జరిపినట్లు గన్‌మేన్ చెప్పారు. కళ్లల్లో కారం చల్లేసరికి తమకేమీ తెలియలేదన్నారు. తాము కళ్లు తెరిచి చూసేసరికి అంతా అయిపోయిందని చెప్పారు. ఫంక్షన్ హాల్ బయటే పొదల్లో మాటువేసిన దుండుగులు దగ్గర నుంచే కాల్చి చంపారు. కాల్పుల్లో రాములు ఛాతీ, పొట్టలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. మాజీ మావోయిస్ట్ అయిన రాములుపై గతంలో అనేక సార్లు హత్యాయత్నం జరిగింది. దాంతో నయాం గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో రాములు ఇంటి వద్ద నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహీం అనుచరుల నుంచి రాములకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటి కార్యదర్శిగా పనిచేన సాంబశివుడు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. ఆ తరువాత అతను లొంగిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితం కొందరు దుండగులు ఆయనను నల్గొండ జిల్లా గోకారం గ్రామ సమీపంలో హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు రాములుని కూడా కాల్చిచంపారు. వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెంకు చెందిన మాజీ మావోయిస్టులైన అన్నదమ్ములు ఇద్దరూ హత్యకు గురికావడం విచారకరం.