
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. కంట్లో కారం చల్లి నడిరోడ్డుపై కర్రలతో దాడి చేస్తూ నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. ఇది గమనించిన ఎంపీటీసీ సభ్యురాలు బాధితురాలికి వస్త్రాలు ఇచ్చి రక్షించారు. ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు)
జూన్ 11వ తేదీన జరిగిన ఓ హత్య కేసులో బాధితురాలు నిందితురాలిగా ఉంది. హత్యకు గురయిన వారి కుటుంబసభ్యులే మహిళపై ఈ అమానుష ఘటనకు పాల్పడ్డారని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.
చదవండి: దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే
Comments
Please login to add a commentAdd a comment