Undressed
-
దళిత యువకుడిని చంపి.. తల్లిని వివస్త్రను చేసి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ కేసు విషయమై చెలరేగిన వివాదంలో దళిత యువకుడైన నితిన్ అహిర్వార్(18)ని కొట్టి చంపారు దుండగులు. మొదట అతడి ఇంటిని ధ్వంసం చేసిన ఆ ముఠా తర్వాత అతడిని కొట్టి చంపి అడ్డుకోబోయిన అతడి తల్లిని వివస్త్రను చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడి సోదరి చెప్పిన కథనం ప్రకారం.. విక్రమ్ సింగ్ ఠాకూర్ అనే యువకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ 2019లో కేసు దాఖలు చేసింది. ఈ కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడు కొంతమందితో కలిసి తన ఇంటికి వచ్చి మరీ బెదిరించాడని అందుకు ఆమెతోపాటు ఆమె తల్లి కూడా నిరాకరించిందని, దాంతో ఆ ముఠా తమ ఇంటిని నాశనం చేశారని తెలిపింది. వారంతా అక్కడి నుండి బస్‌స్టాండ్‌కు వెళ్లి అక్కడున్న తన సోదరుడు నితిన్ అహిర్వార్ను తీవ్రంగా గాయపరుస్తుండగా వారిని అడ్డుకోబోయిన ఆమె తల్లిని కూడా కొట్టి వివస్త్రను చేశారంది. వదిలేయమని ఎంతగా ప్రాధేయపడినా వినలేదని తనపై కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తాను తప్పించుకున్నానని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి హత్య కేసును నమోదు చేసి ప్రధాన నిందితుడితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశామని గ్రామపెద్ద భర్తతో సహా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నామని తెలిపారు అడిషనల్ ఎస్పీ సంజీవ్ ఉయికే. MP News : 'मामा' का राज, लाडलियों पर अत्याचार... @ChouhanShivraj || @BJP4MP || @MPDial100 || @OfficeOfKNath || @INCMP || @Zeepramod #MadhyaPradesh #LadliBehna #ShivrajSinghChouhan #CrimeNews #TopNews #ZeeMPCG For More Updates : https://t.co/uXPUZQobFo pic.twitter.com/sfDdDqnoQL — Zee MP-Chhattisgarh (@ZeeMPCG) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానుషం
-
సూర్యాపేటలో సమాజం తలదించుకునే ఘటన
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. కంట్లో కారం చల్లి నడిరోడ్డుపై కర్రలతో దాడి చేస్తూ నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. ఇది గమనించిన ఎంపీటీసీ సభ్యురాలు బాధితురాలికి వస్త్రాలు ఇచ్చి రక్షించారు. ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు) జూన్ 11వ తేదీన జరిగిన ఓ హత్య కేసులో బాధితురాలు నిందితురాలిగా ఉంది. హత్యకు గురయిన వారి కుటుంబసభ్యులే మహిళపై ఈ అమానుష ఘటనకు పాల్పడ్డారని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. చదవండి: దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే -
‘నగ్నంగా చూడాలని ఉందా?’.. ఇదో సరదా!
రోజుకో కొత్త టూల్, కొత్త ఫీచర్స్ యూజర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా సంచార జీవులు.. ఈ ఫీచర్స్‌ను కచ్చితంగా ట్రై చేస్తుంటారు కూడా. అయితే వీళ్ల బలహీనతలను క్యాష్ చేసుకునేందుకు ‘అతి’ పోకడలు ప్రదర్శిస్తున్నాయి కొన్ని కంపెనీలు. టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో.. అదే స్థాయిలో నష్టాలుంటాయని మరోసారి రుజువైంది. సరదా పేరుతో పుట్టుకొచ్చిన చెండాలపు టూల్ ‘న్యూడీఫైయింగ్’.. ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో పెద్ద చర్చకే దారితీసింది. సాక్షి, వెబ్‌డెస్క్: యూకే ఎంపీ మరియా మిల్లర్(57).. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ‘న్యూడీఫైయింగ్’ మీద పార్లమెంట్ చర్చకు పట్టుబట్టడం ఈ చర్చకు ఆజ్యం పోసింది. న్యూఢీఫైయింగ్ టూల్ అంటే.. నగ్నంగా మార్చేసే టూల్. ఈ టూల్ సాయంతో బట్టల్లేకుండా చేయొచ్చు. ఫొటోగానీ, వీడియోగానీ ఈ టూల్ ద్వారా అప్డేట్ చేస్తే.. స్కానింగ్ చేసుకుని నగ్నంగా మార్చేసి చూపిస్తుంది. డీప్సుకెబే అనే వెబ్సైట్ కిందటి ఏడాది ఈ టూల్‌ను తీసుకురావడం, ఇప్పటికే కోట్ల మంది ఆ టూల్‌ను ఉపయోగించడం జరిగిపోయింది . ఒక్క జూన్ నెలలోనే యాభై లక్షల మంది ఈ సైట్‌ను సందర్శించారంటే.. ఈ టూల్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆడవాళ్లే లక్క్ష్యంగా.. డీప్‌సుక్‌బే వెబ్సైట్ వెనుక ఎవరు ఉన్నదనేది తెలియదు. కానీ, న్యూడీఫైయింగ్ టూల్‌ను(ఏఐ-లెవెరేజ్డ్ న్యూడిఫైయ్యర్) దరిద్రమైన ప్రచారంతో ప్రజల్లోకి తీసుకొచ్చింది మాత్రం ఇదే. కేవలం ఆడవాళ్లను మాత్రమే చూపిస్తాం అంటూ ప్రచారం చేసుకుంది ఈ వెబ్సైట్. ‘బట్టల వెనుక దాగున్న నగ్న సత్యాలను చూపిస్తాం.. మగవాళ్ల కలలను నిజం చేస్తాం’ అంటూ ప్రమోషన్ చేసుకోవడంతో డీప్‌సుక్‌బే వెబ్‌సైట్‌కు విపరీతమైన పబ్లిసిటీ దక్కింది. పే అండ్ యూజ్ సౌకర్యం కావడంతో ప్రపంచం వ్యాప్తంగా చాలామంది, మరికొందరు వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సర్వీసుల ద్వారా ఈ టూల్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎవరినీ వదలకుండా.. దాదాపు అన్ని దేశాలకు చెందిన బాధితులు లక్షల్లో .. డీప్‌సుక్‌బే న్యూఢీఫైయింగ్ టూల్ బారిన పడ్డారనే విషయం వెలుగులోకి వచ్చింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, ఒలింపిక్ అథ్లెట్లు కూడా బాధిత జాబితాలో ఉండడం విశేషం. అందుకే ఈ టూల్ వ్యవహార శైలిపై అందరిలో ఆగ్రవేశాలు రగులుతున్నాయి. వాస్తవానికి న్యూడీఫైయర్ టూల్స్ కొత్తేం కాదు. ‘న్యూడ్ యువర్ ఫ్రెండ్’ సపోర్టింగ్ ఫీచర్ పేరుతో కొన్ని ఫొటో, వీడియో యాప్‌ల ద్వారా ఇలాంటి ఆమధ్య బాగా వైరల్ అయ్యాయి కూడా. అయితే డీప్‌న్యూడ్ అనే వెబ్సైట్ 2019లో ఈ టూల్‌ను తొలిసారిగా ఓన్ వెర్షన్‌తో లాంఛ్ చేసింది. ఆ టైంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. వెంటనే ఆ టెక్నాలజీని వెనక్కి తీసేసుకుంది. ఇక ఇలాంటి డిజిటల్ టెక్నాలజీ పట్ల ప్రపంచంలో ఎక్కడా న్యాయపరమైన చర్యలకు ఎలాంటి చట్టాలు లేవు. దీంతో యూకేలో ప్రత్యేక బిల్లు కోసం పోరాడాలని మరియా మిల్లర్ ప్రయత్నిస్తోంది. ఒక లెక్క ఉంటదా? న్యూఢీఫైయింగ్ టూల్.. ఇది హేతుబద్ధమైంది కాదు. కానీ, అడల్ట్ ఎంటర్టైన్మెంట్లో భాగంగా నడుస్తూ వస్తోంది. వివాదాలు-విమర్శలు-కేసులు ఏదేమైనా సరే.. న్యూడీఫైయింగ్ ఏఐ టూల్ సోర్స్ కోడ్ల అమ్మకం మాత్రం జోరుగా నడుస్తూనే ఉంది. ఏఐ టెక్నాలజీ ఏదైనా సరే.. లీగల్ అండ్ ఎథికల్‌గా ఉండాలనే నిబంధనను పాటించడం వల్లే చట్టాలూ కూడా ఇలాంటి టూల్స్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. అయితే ఏదిఏమైనా అశ్లీలతను.. అదీ అవతలివాళ్ల అనుమతి లేకుండా డిజిటల్‌గా ప్రోత్సహించడం తీవ్ర నేరంగా పరిగణించాలని, ప్రత్యేక చట్టాల ద్వారా అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే రివెంజ్ పోర్న్(ప్రతీకారంలో భాగంగా కోపంతో అవతలివాళ్ల మీద అశ్లీలతను ప్రమోట్ చేయడం) కేసులు చూస్తూ వస్తున్నాం. ఆన్లైన్ భద్రతా చట్టాలు కూడా కాపాడలేని స్టేజ్‌లో ఇలాంటి టెక్నాలజీ గనుక పేట్రేగిపోతే.. రివెంజ్ పోర్న్ లాంటి నేరాలను అడ్డుకోవడం కష్టమవుతుందనేది సైబర్ నిపుణులు చెప్తున్న మాట. -
పార్లమెంట్ జూమ్ మీటింగ్‌లో నగ్నంగా ఎంపీ: ఫోటో వైరల్
కరోనామహమ్మారి పుణ్యమాని నేరుగా కలిసి మాట్లాడటమే కరువైంది. అన్నీ మాటలు వర్చువల్‌గానే నిచ్చేస్తున్నారు. ఇక ఐటీ సంస్థలు, కంపెనీలు, విద్యాసంస్థలే కాదు న్యాయస్థానాలు..చట్టసభలు కూడా మూతపడ్డాయి. దీంతో కేసుల విచారణలు, అధికారుల సమావేశాలు, ఇలా ముఖ్యమైనవన్నీ జూమ్ కాల్స్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఏకంగా పార్లమెంట్ సమావేశాలు జూమ్ కాల్లో ఒక ఎంపీ నగ్నంగా దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ అనూహ్య పరిణామంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఘటన కెనడాలో జరిగింది. దీంతో పొరపాటు జరిగిందంటూ తన సహోద్యోగులందరికీ క్షమాపణలు చెప్పుకున్నాడు. అసలు అక్కడ ఏం జరిగింది ప్రపంచ దేశాలతో పాటు కరోనా కెనడాను కుదిపేస్తోంది. దీంతో పార్లమెంట్ సమావేశాల్ని జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో సమావేశాలు జరుగుతున్న సందర్భంలో విలియమ్ ఆమోస్ అనే ఎంపీ ఉదయాన్నే లేచి జాగింగ్ కు వెళ్లి ఆ రోజు లేట్‌గా ఇంటికి వచ్చాడు. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన సమయం దగ్గరపడటంతో స్నానం చేయకుండానే సమావేశాల్లో పాల్గొందామనుకున్నారు. తన ల్యాప్‌టాప్ కెమెరా ఆన్ చేసి ఇంకా కొంచెం టైమ్ ఉందిలే ఈ లోపు బట్టలు మార్చేసుకుందామని అనుకున్నారు. అలా బట్టలు మార్చుకునే సమయంలోనే జూమ్ వీడియో సడెన్‌గా ఆన్ అయ్యింది. దాంతో ఆమోస్ సమావేశాల్లో నగ్నంగా తెరపై దర్శనమిచ్చారు. దీంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా షాక్ అయ్యారు.దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటన పొరపాటున జరిగిందని హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యులు తనను క్షమించాలని సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. ఆ ఘటన తనను ఇబ్బందికి గురి చేసిందంటూ ట్వీట్ చేశారు. నిజాయితీగా తప్పును ఒప్పుకుంటున్నానని..మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఇంకా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. ( చదవండి: సెలవు కోసం భార్యకు విడాకులిచ్చిన భర్త...అది కూడా 3 సార్లు ) I made a really unfortunate mistake today & obviously I’m embarrassed by it. My camera was accidentally left on as I changed into work clothes after going for a jog. I sincerely apologize to all my colleagues in the House. It was an honest mistake + it won’t happen again.— Will Amos (@WillAAmos) April 14, 2021 -
బట్టలిప్పుకొని పనిచేయాలంటే ఇలా అర్థమైందా...!
మినిస్క్: తూర్పు యూరప్ దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో దేశంలోని ఉద్యోగులనుద్దేశించి ఇచ్చిన పిలుపు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఆయన భావగర్భితంగా ఇచ్చిన పిలుపును కాస్త ఉద్యోగులు మరో రకంగా తీసుకున్నారు. ఆయన భావాన్ని అర్థం చేసుకుండా ఆయన చెప్పిన మాటలను అక్షరాల అమలుచేస్తూ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి అంకితభావంతో కష్టపడి పనిచేయడం ఎంత అవసరమో స్ఫూర్తిదాయకంగా చెప్పేందుకు లుకషెంకో ప్రయత్నించి బోల్తాపడ్డారు. ‘గెట్ అన్‌డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ (బట్టలిప్పుకొని పనిచేయండి చెమటలు కక్కేదాక)’ అంటూ ఆయనిచ్చిన సందేశంలోని సారాంశాన్ని పట్టించుకోకుండా బెలారస్ ఉద్యోగులు ఆయన మాటలను అక్షరాల అమలు చేయడానికి ఆఫీసుల్లో బట్టలిప్పుకొని పనిచేస్తున్నారు. అలా పనిచేస్తున్న దృశ్యాలను ఫొటోలుతీసి మరి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో ఎడతెరపి లేకుండా పోస్ట్ చేస్తున్నారు. కామెంట్లు కూడా పెడుతున్నారు.. అయితే ఈ ఫొటోల్లో మగవాళ్లతోపాటు ఆడ ఉద్యోగులు కూడా బట్టలు లేకుండా ఫొటోలు దిగడం యూరప్‌లాంటి దేశంలో కూడా కొంత ఆశ్చర్యమే. కాకపోతే వారంతా తమ మానాన్ని రక్షించుకునేందుకు లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు అడ్డుగా పెట్టుకోవడం ఉన్నంతలో కాస్త మెరుగైన అంశం. ఇది ఒక్క ఉద్యోగస్థులకే పరిమితం కాలేదు. సంగీత కళాకారులు కూడా బట్టలిప్పేసి వాయిద్యాలతో మానాన్ని దుచుకుంటూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. వారిని భవన నిర్మాణ కార్మికులు కూడా అనుసరిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ‘బట్టలిప్పుకొని పనిచేయాలని మన దేశాధ్యక్షుడే చెబుతున్నారు’ లాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తమతో పాటు దేశాధ్యక్షుడు లుకషెంకో కూడా బట్టలిప్పుకొని పనిచేస్తున్నట్టు ఫొటోషాప్‌లో మార్పిడి చేసిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించేందుకు లుకషెంకో ప్రస్తుతానికి అందుబాటులో లేరు. -
దుస్తులు విప్పేస్తూ లండన్ వీధిలో..
లండన్: ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మంది తమ శరీరాకృతిని ఇష్టపడరని 2012 సెంటర్ ఫర్ అప్పీయరెన్స్ సర్వేలో వెల్లడైన విషయం. అయితే ఆ సమస్య నుంచి బయట పడ్డ ఒక అమ్మాయి ..తమ శరీరం ఆకృతి గురించి బాధపడుతున్న వారికోసం వినూత్నంగా ఆలోచించింది. 'ఈటింగ్ డిజార్డర్'(ఎప్పుడూ ఏదో తినాలనిపిస్తుండటం లేక అసలేమీ తినలేక పోవడం) నుంచి బయటపడ్డ జే వెస్ట్ అనే యువతి రద్దీగా ఉండే లండన్ పికాడిలి సర్కస్ కూడలిలో కళ్లకు గంతలు కట్టుకొని పై దుస్తులను తీసేసి నిలబడింది. తన పక్కకి ఒక ఫ్లకార్డును కూడా పెట్టింది. 'ఎవరైతే ఈటింగ్ డిజార్డర్, ఆత్మగౌరవ సమస్యలతో బాధపడుతున్నారో వారికోసమో ఇలా నిలుచున్నాను...ఎవరైనా నాలాంటి వారందరికి అండగా ఉండాలనుకుంటే 'లవ్ సింబల్'తో నా శరీరంపైన రాయండి అని' ఆ ఫ్లకార్డుపై రాసి ఉంచింది. అంతేకాకుండా ఆమె అలా లో దుస్తులతో నిలబడి ఉన్నప్పుడు ...అండగా ఉంటామని వచ్చిన వారు ఆమె శరీరం పై రాస్తున్నపుడు తీసిన వీడియోని ఆన్లైన్లో పెట్టింది. ఆ వీడియోని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తిలకించి జే వెస్ట్ కి, ఆ సమస్యతో బాధపడుతున్న వారికి అండగా ఉంటామంటూ లైక్‌లు కొడుతున్నారు.