భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ కేసు విషయమై చెలరేగిన వివాదంలో దళిత యువకుడైన నితిన్ అహిర్వార్(18)ని కొట్టి చంపారు దుండగులు. మొదట అతడి ఇంటిని ధ్వంసం చేసిన ఆ ముఠా తర్వాత అతడిని కొట్టి చంపి అడ్డుకోబోయిన అతడి తల్లిని వివస్త్రను చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
మృతుడి సోదరి చెప్పిన కథనం ప్రకారం.. విక్రమ్ సింగ్ ఠాకూర్ అనే యువకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ 2019లో కేసు దాఖలు చేసింది. ఈ కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడు కొంతమందితో కలిసి తన ఇంటికి వచ్చి మరీ బెదిరించాడని అందుకు ఆమెతోపాటు ఆమె తల్లి కూడా నిరాకరించిందని, దాంతో ఆ ముఠా తమ ఇంటిని నాశనం చేశారని తెలిపింది.
వారంతా అక్కడి నుండి బస్‌స్టాండ్‌కు వెళ్లి అక్కడున్న తన సోదరుడు నితిన్ అహిర్‌వార్‌ను తీవ్రంగా గాయపరుస్తుండగా వారిని అడ్డుకోబోయిన ఆమె తల్లిని కూడా కొట్టి వివస్త్రను చేశారంది. వదిలేయమని ఎంతగా ప్రాధేయపడినా వినలేదని తనపై కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా తాను తప్పించుకున్నానని తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించి హత్య కేసును నమోదు చేసి ప్రధాన నిందితుడితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశామని గ్రామపెద్ద భర్తతో సహా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నామని తెలిపారు అడిషనల్ ఎస్పీ సంజీవ్ ఉయికే.
MP News : 'मामा' का राज, लाडलियों पर अत्याचार... @ChouhanShivraj || @BJP4MP || @MPDial100 || @OfficeOfKNath || @INCMP || @Zeepramod
— Zee MP-Chhattisgarh (@ZeeMPCG) August 27, 2023
#MadhyaPradesh #LadliBehna #ShivrajSinghChouhan #CrimeNews #TopNews #ZeeMPCG
For More Updates : https://t.co/uXPUZQobFo pic.twitter.com/sfDdDqnoQL
ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే..
Comments
Please login to add a commentAdd a comment