
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు (ఆదివారం) మధ్యప్రదేశ్ చేరుకోనున్నారు. నేడు ఆయన ఛతర్‌పూర్‌లోని బాగేశ్వర్ థామ్‌లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు సాగే మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ స్థానిక బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు.
మధ్యప్రదేశ్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ బీహార్, అస్సాంలలోనూ పర్యటించనున్నారు. ఈరోజు(ఆదివారం) మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని మోదీ ఛతర్‌పూర్ చేరుకోనున్నారు. అక్కడి బాబా బాగేశ్వర్ థామ్‌లో ఒక ట్రస్ట్ తరపున నిర్మితవుతున్న క్యాన్సర్ ఆస్పత్రికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి రూ. 208 కోట్లు ఖర్చు కానుంది.
క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ భోపాల్ చేరుకోనున్నారు. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకోనున్నారు. సోమవారం ఉదయం గ్లోబల్ ఇన్వెంటర్స్ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం మోదీ.. అస్సాంకు బయలుదేరనున్నారు. ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ ఈరోజు 2:35కు మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం భోపాల్‌లో బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు
Comments
Please login to add a commentAdd a comment