పార్లమెంట్ జూమ్‌ మీటింగ్‌లో నగ్నంగా ఎంపీ: ఫోటో వైరల్‌‌ | Canada MP Appears Naked On Parliament Zoom | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ జూమ్‌ మీటింగ్‌లో నగ్నంగా ఎంపీ: ఫోటో వైరల్‌‌

Published Fri, Apr 16 2021 12:56 PM | Last Updated on Fri, Apr 16 2021 3:34 PM

Canada MP Appears Naked On Parliament Zoom - Sakshi

కరోనామహమ్మారి పుణ్యమాని నేరుగా కలిసి మాట్లాడటమే కరువైంది. అన్నీ మాటలు వర్చువల్‌గానే‌  నిచ్చేస్తున్నారు. ఇక ఐటీ సంస్థలు, కంపెనీలు, విద్యాసంస్థలే  కాదు న్యాయస్థానాలు..చట్టసభలు కూడా మూతపడ్డాయి. దీంతో కేసుల విచారణలు, అధికారుల సమావేశాలు, ఇలా ముఖ్యమైనవన్నీ జూమ్ కాల్స్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో  ఏకంగా పార్లమెంట్ సమావేశాలు జూమ్ కాల్‌లో  ఒక ఎంపీ నగ్నంగా దర్శనమివ్వడం హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఈ అనూహ్య పరిణామంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఘటన కెనడాలో జరిగింది. దీంతో పొరపాటు జరిగిందంటూ తన సహోద్యోగులందరికీ  క్షమాపణలు చెప్పుకున్నాడు.

అసలు అక్కడ ఏం జరిగింది
ప్రపంచ దేశాలతో పాటు కరోనా కెనడాను కుదిపేస్తోంది. దీంతో పార్లమెంట్ సమావేశాల్ని జూమ్ మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో సమావేశాలు జరుగుతున్న సందర్భంలో విలియమ్ ఆమోస్‌ అనే ఎంపీ  ఉదయాన్నే లేచి జాగింగ్ కు వెళ్లి ఆ రోజు లేట్‌గా ఇంటికి వచ్చాడు. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన సమయం దగ్గరపడటంతో స్నానం చేయకుండానే సమావేశాల్లో పాల్గొందామనుకున్నారు. తన ల్యాప్‌టాప్ కెమెరా ఆన్ చేసి ఇంకా కొంచెం టైమ్‌ ఉందిలే ఈ లోపు బట్టలు మార్చేసుకుందామని అనుకున్నారు. అలా బట్టలు మార్చుకునే సమయంలోనే జూమ్ వీడియో సడెన్‌గా ఆన్ అయ్యింది. దాంతో ఆమోస్ సమావేశాల్లో నగ్నంగా  తెరపై దర్శనమిచ్చారు. దీంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా షాక్ అయ్యారు.దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే ఈ ఘటన పొరపాటున జరిగిందని హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యులు తనను క్షమించాలని  సోషల్‌ మీడియా ద్వారా వేడుకున్నారు. ఆ ఘటన తనను ఇబ్బందికి గురి చేసిందంటూ ట్వీట్‌ చేశారు. నిజాయితీగా తప్పును ఒప్పుకుంటున్నానని..మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఇంకా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు.

( చదవండి: సెలవు కోసం భార్యకు విడాకులిచ్చిన భర్త...అది కూడా 3 సార్లు ) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement