Parliament meeting
-
పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలివే.
-
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలి: ఆర్.కృష్ణయ్య
కాచిగూడ(హైదరాబాద్): దేశ జనగణన లో భాగంగా కుల గణన చేపట్టే వరకు ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో 65 బీసీ సంఘాల, కుల సంఘాల సమావేశం జరిగింది. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కులగణన విషయమై కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్య త ప్రతిపక్ష పార్టీలదేనని అన్నారు. కులగణన, ప్రభుత్వసంస్థల ప్రైవేటీకరణపై కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ‘బీసీబంధు’ పథకాన్ని ప్రారంభించి అమలు చేయాలని కోరారు. -
పార్లమెంట్ జూమ్ మీటింగ్‌లో నగ్నంగా ఎంపీ: ఫోటో వైరల్
కరోనామహమ్మారి పుణ్యమాని నేరుగా కలిసి మాట్లాడటమే కరువైంది. అన్నీ మాటలు వర్చువల్‌గానే నిచ్చేస్తున్నారు. ఇక ఐటీ సంస్థలు, కంపెనీలు, విద్యాసంస్థలే కాదు న్యాయస్థానాలు..చట్టసభలు కూడా మూతపడ్డాయి. దీంతో కేసుల విచారణలు, అధికారుల సమావేశాలు, ఇలా ముఖ్యమైనవన్నీ జూమ్ కాల్స్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఏకంగా పార్లమెంట్ సమావేశాలు జూమ్ కాల్లో ఒక ఎంపీ నగ్నంగా దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ అనూహ్య పరిణామంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఘటన కెనడాలో జరిగింది. దీంతో పొరపాటు జరిగిందంటూ తన సహోద్యోగులందరికీ క్షమాపణలు చెప్పుకున్నాడు. అసలు అక్కడ ఏం జరిగింది ప్రపంచ దేశాలతో పాటు కరోనా కెనడాను కుదిపేస్తోంది. దీంతో పార్లమెంట్ సమావేశాల్ని జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో సమావేశాలు జరుగుతున్న సందర్భంలో విలియమ్ ఆమోస్ అనే ఎంపీ ఉదయాన్నే లేచి జాగింగ్ కు వెళ్లి ఆ రోజు లేట్‌గా ఇంటికి వచ్చాడు. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన సమయం దగ్గరపడటంతో స్నానం చేయకుండానే సమావేశాల్లో పాల్గొందామనుకున్నారు. తన ల్యాప్‌టాప్ కెమెరా ఆన్ చేసి ఇంకా కొంచెం టైమ్ ఉందిలే ఈ లోపు బట్టలు మార్చేసుకుందామని అనుకున్నారు. అలా బట్టలు మార్చుకునే సమయంలోనే జూమ్ వీడియో సడెన్‌గా ఆన్ అయ్యింది. దాంతో ఆమోస్ సమావేశాల్లో నగ్నంగా తెరపై దర్శనమిచ్చారు. దీంతో సభాధ్యక్షుడితో పాటు తోటి ఎంపీలంతా షాక్ అయ్యారు.దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటన పొరపాటున జరిగిందని హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యులు తనను క్షమించాలని సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. ఆ ఘటన తనను ఇబ్బందికి గురి చేసిందంటూ ట్వీట్ చేశారు. నిజాయితీగా తప్పును ఒప్పుకుంటున్నానని..మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఇంకా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. ( చదవండి: సెలవు కోసం భార్యకు విడాకులిచ్చిన భర్త...అది కూడా 3 సార్లు ) I made a really unfortunate mistake today & obviously I’m embarrassed by it. My camera was accidentally left on as I changed into work clothes after going for a jog. I sincerely apologize to all my colleagues in the House. It was an honest mistake + it won’t happen again.— Will Amos (@WillAAmos) April 14, 2021 -
పార్లమెంటు సస్పెన్షన్ ఎత్తివేత
కొలంబో: శ్రీలంకలో రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఈ నెల 16 వరకు పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేసిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెనక్కు తగ్గారు. గత షెడ్యూల్ ప్రకారమే సోమవారమైన నవంబర్ 5న యథావిధిగా పార్లమెంటు భేటీ కావాలని గురువారం అధ్యక్షుడు ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. పార్లమెంటు సోమవారమే భేటీ అవుతుందన్న సమాచారం అవాస్తవమనీ, ఇది ప్రజలను తప్పుదారి పట్టించే వార్త అని సిరిసేన పార్టీకి చెందిన నాయకుడు సుశీల్ ప్రేమజయంత అన్నారు. ఈ నిర్ణయంతో శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికీ తానే దేశానికి అసలైన ప్రధానిననీ, విశ్వాసపరీక్షలో తామే విజయం సాధిస్తామని పదవీచ్యుత ప్రధాని రణిల్ విక్రమసింఘే ధీమా వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ల క్రితం సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇటీవలి కాలంలో ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగిపోయాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న సిరిసేన.. గత నెలలో విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి దించేశారు. మాజీ అధ్యక్షుడు రాజపక్సతో సిరిసేన చేతులు కలిపి ఆయనను కొత్త ప్రధానిగా నియమించారు. దీంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్లమెంటులో అత్యధిక మంది సభ్యులు తమ పార్టీవారేననీ, ప్రజలు ఎన్నుకున్న అసలైన ప్రధానిని తానేనని విక్రమసింఘే వాదిస్తూ వచ్చారు. తనను పదవి నుంచి దించేస్తూ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అక్రమమని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకునేందుకు వెంటనే సభను సమావేశపరిచి విశ్వాసపరీక్షను నిర్వహించాలని విక్రమసింఘే గతంలో డిమాండ్ చేశారు. అయితే సిరిసేన అందుకు విరుద్ధంగా పార్లమెంటును ఈ నెల 16 వరకు సుప్తచేతనావస్థలోకి పంపారు. పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు తలెత్తుతాయని పార్లమెంటు స్పీకర్ కరూ జయసూర్య అధ్యక్షుణ్ని హెచ్చరించారు. విక్రమసింఘేనే ప్రధానిగా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రపంచ దేశాలు కూడా రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందిగా శ్రీలంక రాజకీయ పార్టీలను కోరాయి. ఫిరాయింపులు పూర్తయినట్లేనా? వాస్తవానికి శ్రీలంక పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విక్రమసింఘేను సిరిసేన పదవి నుంచి దించేయడంతో పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరిచి విశ్వాసపరీక్ష నిర్వహించాల్సిందిగా విక్రమసింఘే కోరారు. అందుకు విరుద్దంగా అధ్యక్షుడు పార్లమెంటును 16వ తేదీ వరకు సుస్తచేతనావస్థలోకి పంపారు. కాగా, పార్లమెంటులోని మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా, విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే సిరిసేన–రాజపక్సల పార్టీలు రెండూ కలిసినా పార్లమెంటులో వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘే పార్టీకి సొంతంగా 106 మంది సభ్యులు ఉండటంతోపాటు కొన్ని చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. దీంతో ఎక్కువ సమయం తీసుకుని మరింత మంది సభ్యుల మద్దతు కూడగట్టి విశ్వాసపరీక్షలో రాజపక్స నెగ్గేందుకే అధ్యక్షుడు సభను తాత్కాలికంగా రద్దు చేశారని వార్తలు ఉన్నాయి. ఇప్పటికే ఆరుగురు సభ్యులు విక్రమ సింఘే వైపు నుంచి రాజపక్స వైపుకు మారిపోయారు. మరోవైపు పార్లమెంటును 16 వరకు రద్దు చేసినప్పటికీ మళ్లీ సోమవారం అధ్యక్షుడు సమావేశపరుస్తున్నారు. అంటే బలపరీక్షలో గెలిచేందుకు అవసరమైనంత మంది సభ్యులను ఇప్పటికే రాజపక్స తనవైపునకు తిప్పుకున్నారా అని ప్రశ్న తలెత్తుతోంది. విశ్వాసపరీక్షలో ఎవరు నెగ్గుతారో తెలుసుకునేందుకు ఆ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
వర్గీకరణ కోసం పోరుబాట
మంద కృష్ణ మాదిగ వెల్లడి హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశంలో పెట్టించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులపై పోరుబాట సాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఎమ్మార్పీఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం రాంనగర్ చౌరస్తాలో ఘనంగా జరిగింది. ఎమ్మార్పీఎస్ జెండాను మంద కృష్ణ మాదిగ ఆవిష్కరించి, తన పుట్టినరోజు కేక్‌ను కట్ చేశారు. వర్గీకరణ డిమాండ్‌పై చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 16న ఏపీలో, 18న సీఎం కేసీఆర్ నివాసం ఎదుట నిరసన నిర్వహిస్తామన్నారు. ట్యాంక్‌బండ్‌పై గల అంబేడ్కర్ విగ్రహం నుంచి కేసీఆర్ ఇంటి వరకూ భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఈ నెల 19 నుంచి ఆగస్టు 12 వరకూ మాదిగ సమాజంలోని ప్రజలతో ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ దినదినాభివృద్ది చెంది జాతి ప్రయోజనాల కోసం పోరాడుతోం దన్నారు. తమ పోరాటాలతో అణగారిన వర్గాలన్నింటికీ న్యాయం జరుగుతోందన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాటం వల్లనే 2004లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని, దీని వల్ల అన్ని కులాల వారు నేడు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు. వృద్ధులు, వితంతువుల, విక లాంగుల పింఛన్లు పెంచారన్నారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.