పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించాలి: ఆర్‌.కృష్ణయ్య  | Telangana: krishnaiah Speech Over Parliament Meeting | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించాలి: ఆర్‌.కృష్ణయ్య 

Published Mon, Nov 15 2021 3:15 AM | Last Updated on Mon, Nov 15 2021 3:15 AM

Telangana: krishnaiah Speech Over Parliament Meeting - Sakshi

కాచిగూడ(హైదరాబాద్‌): దేశ జనగణన లో భాగంగా కుల గణన చేపట్టే వరకు ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంట్‌ సమావేశాలను బహిష్కరించాలని జాతీయ  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో 65 బీసీ సంఘాల, కుల సంఘాల సమావేశం జరిగింది.

ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ కులగణన విషయమై కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్య త ప్రతిపక్ష పార్టీలదేనని అన్నారు. కులగణన, ప్రభుత్వసంస్థల ప్రైవేటీకరణపై కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ ‘బీసీబంధు’ పథకాన్ని ప్రారంభించి అమలు చేయాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement