కెనడా ఎంపీ.. కన్నడలో ప్రమాణం | Chandra Arya Takes Oath In Kannada At Canada Parliament | Sakshi
Sakshi News home page

మాతృభాషపై ప్రేమ.. కన్నడలో ప్రమాణం చేసిన కెనడా ఎంపీ

Jun 10 2024 4:19 PM | Updated on Jun 10 2024 4:29 PM

Chandra Arya Takes Oath In Kannada At Canada Parliament

ఒట్టావా:  ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్‌లో ప్రమాణస్వీకారం చేసే రోజులివి. మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలుగా ఎన్నికైన వాళ్లు మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేయడం, ప్రసంగించడం తరచుగా చూస్తుంటాం. 

కానీ కెనడాలో ఎంపీగా ఎన్నికైన ప్రవాస కన్నడిగుడు చంద్రఆర్య అక్కడి పార్లమెంటులో కన్నడ భాషలో ప్రమాణస్వీకారం చేసి మాతృభాషపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. చంద్రఆర్య కన్నడలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సహచర ఎంపీలు ఆయనను సీట్లలో నుంచి లేచి అభినందించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్లినా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మరచిపోవద్దని నెటిజన్లు చంద్ర ఆర్య వీడియోనుద్దేశించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 pic.twitter.com/lYW3RDH4vO

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement