18వ లోక్‌సభలో భాషా సాంస్కృతిక వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణం చేశారు. అయితే తన భాష అయిన భోజ్‌పురిలో ప్రమాణం చేయలేకపోయినందుకు బీహార్‌లోని సారణ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ విచారం వ్యక్తం చేశారు.
లోక్‌సభలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ ఒరియాలతో సహా పలు భారతీయ భాషల్లో ప్రమాణం చేశారు. ఎంపీలు ఇంగ్లీషులో లేదా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా ప్రమాణం చేయవచ్చు. అయితే భోజ్‌పురి భాషకు ఎనిమిదవ షెడ్యూల్ జాబితాలో స్థానం దక్కలేదు. రాజీవ్ ప్రతాప్ రూడీ భోజ్‌పురిలో ప్రమాణం చేయకపోవడానికి కారణం ఇదే. ఎంపీలు మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని రూడీ అన్నారు.
ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీహార్‌లోని తూర్పు చంపారన్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షత వహించారు. కాగా రాజీవ్ ప్రతాప్ సింగ్ రూడీ హిందీలో ప్రమాణం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యపై రాజీవ్ ప్రతాప్ రూడీ విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment