Rajasthan Crime: Throw Chilli Powder at Police Shoot Gangster - Sakshi
Sakshi News home page

పోలీసుల కళ్లలో కారం కొట్టి.. 15 రౌండ్ల కాల్పులు.. కస్టడీలోనే ఖతం చేశారు

Jul 12 2023 2:59 PM | Updated on Jul 12 2023 3:32 PM

Rajasthan Crime: Throw chilli powder at police Shoot Gangster - Sakshi

ఘటనాస్థలం.. పక్కన మృతుడు కుల్దీప్‌

టోల్‌గేట్‌ వద్దకు వాహనం చేరుకోగానే.. వాహనంలో దూసుకొచ్చి కారం

క్రైమ్‌: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపింది ప్రత్యర్థి గ్యాంగ్‌.  రాజస్థాన్‌ భరత్‌పూర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు దీనిని ప్రతీకార హత్యగానే ప్రకటించారు. 

కుల్దీప్‌ అనే గ్యాంగ్‌ స్టర్‌ బీజేపీ నేత కృపాల్‌ జఘిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. సెప్టెంబర్‌ 4, 2022లో ఈ హత్య జరగ్గా.. ఆ మరుసటిరోజే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కుల్దీప్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే.. పోలీసుల కస్టడీలో ఉన్న కుల్దీప్‌, సహనిందితుడు విజయ్‌పాల్‌ను ఇవాళ జైపూర్‌ జైలు నుంచి భరత్‌పూర్‌ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్తున్నారు. 

ఈ ఓ వాహనంలో దూసుకొచ్చిన ప్రత్యర్థులు పోలీసుల కళ్లలో కారం కొట్టి.. కుల్దీప్‌ను కాల్చి చంపారు. మొత్తం పదిహేను రౌండ్ల కాల్పులు జరిపారు. కుల్దీప్‌ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. విజయ్‌పాల్‌ గాయపడగా.. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  జైపూర్‌-ఆగ్రా నేషనల్‌ హైవేపై అమోలీ టోల్‌ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపాక నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసుల బృందం.. సమీపంలోని గ్రామం నుంచి దుండగుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement