వ్యాపారి రమేష్‌ కుమార్‌ హత్య కేసులో ట్విస్ట్‌  | Accused in Realtor Ramesh Murder Case Escapes | Sakshi
Sakshi News home page

వ్యాపారి రమేష్‌ కుమార్‌ హత్య కేసులో ట్విస్ట్‌ 

Published Mon, Nov 4 2024 7:25 AM | Last Updated on Mon, Nov 4 2024 7:25 AM

Accused in Realtor Ramesh Murder Case Escapes

క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ కోసం నగరానికి నిందితులు 

పోచారంలోని బృందావన్‌  హోటల్‌లో బస 

 అదను చూసుకుని పారిపోయిన  ఓ నిందితుడు 

 కేసు నమోదు చేసిన ఐటీ కారిడార్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన వ్యాపారి రమేష్‌ కుమార్‌ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్ని కర్ణాటక పోలీసులు క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ కోసం గత గురువారం నగరానికి తీసుకువచ్చారు. వీరంతా పోచారంలోని బృందావన్‌ హోటల్‌లో బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కీలక నిందితుడు అంకుర్‌ రాణా తప్పించుకుని పారిపోయాడు. దీంతో కర్ణాటక పోలీసులు ఐటీ కారిడార్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెలుగులోకి వచి్చన అంశాల ప్రకారం కేసును ఇక్కడకు బదిలీ చేయాల్సి ఉండగా.. కర్ణాటక పోలీసులు చూపించిన అత్యుత్సాహం కారణంగానే ఇలా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

తుకారాంగేట్‌ టు సంస్కృతి టౌన్‌షిప్‌  
నగరంలోని తుకారాంగేట్‌కు చెందిన రమేష్‌ కుమార్‌ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్‌íÙప్‌లో ఒంటరిగా ఉండేవారు.  భువనగిరికి చెందిన ఆకుల లత చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఈమె బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఈ నేపథ్యంలోనే తన పేరును నిహారికగా మార్చుకుంది. గతంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని, వారి నుంచి వేరు పడిన నిహారికకు మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా రమే‹Ùతో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్‌ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్‌షిప్‌లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈమె తన రెండో భర్తతో కలిసి హరియాణాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి జైలుకు వెళ్లింది. అక్కడే ఈమెకు అంకుర్‌ రాణా అనే నేరగాడి తల్లితో పరిచయమైంది. ఆమెను కలవడానికి ములాఖత్‌కు వచ్చే అంకుర్‌తోనూ స్నేహం ఏర్పడింది. 

జర్మనీలో ఉద్యోగం కోసం నగదు అవసరమంటూ.. 
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వాసవీ నగర్‌ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్‌ వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్‌ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం వచి్చందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమే‹Ùతో చెబుతూ వస్తోంది. కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో డబ్బు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. రమేష్‌ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచ్చిన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం వేసింది. రమేష్‌ను హత్య చేయడం ద్వారా దీన్ని అమలు చేయాలని అంకుర్‌ రాణాను సంప్రదించింది. అతడు అంగీకరించడంతో ఇరువురూ కలిసి గత నెల 1న నగరానికి చేరుకున్నారు. 

పీర్జాదిగూడలో చంపి.. మృతదేహంతో 800 కి.మీ ప్రయాణించి..  
బోడుప్పల్‌ ప్రాంతంలో అంకుర్‌ బస చేయగా.. నిహారిక మాత్రం రమేష్‌ ఇంటికి వెళ్లింది. రెండు రోజుల పాటు వీరి మధ్య నగదు విషయంలో వాగ్వాదం జరిగింది. గత నెల 3 రాత్రిన తనను విమానాశ్రయంలో వదిలి రావాలంటూ నిహారిక కోరగా.. రమేష్‌ తన మెర్సిడిస్‌ బెంజ్‌ కారులో (టీఎస్‌ 07 ఎఫ్‌ఎస్‌ 5679) బయలుదేరారు. బోడుప్పల్‌–ఉప్పల్‌ మధ్యలో అంకుర్‌ వీరి వాహనం ఎక్కాడు. అతడిని తన సహోద్యోగిగా పరిచయం చేసింది. వీరి వాహనం పీర్జాదిగూడ కమాన్‌ వద్దకు చేరుకున్నాక వెనుక సీటులో కూర్చున్న అంకుర్‌ తన వద్ద ఉన్న వైరుతో రమే‹Ùకు ఉరి బిగించి చంపాడు. ఆపై వీళ్లు నిఖిల్‌ను సంప్రదించారు. అతడి సూచనల మేరకు మృతదేహాన్ని కారులో ఉంచుకుని దాదాపు 800 కి.మీ ప్రయాణించారు. ఊటీ సమీపంలోని సుంటికొప్పలో (కర్ణాటక) ఉన్న కాఫీ ఎస్టేట్‌లో పెట్రోల్‌ పోసి మృతదేహాన్ని దహనం చేసి కారుతో పారిపోయారు. గత నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు నిహారిక, నిఖిల్‌లను బెంగళూరులో, అంకుర్‌ను హరియాణాలో అరెస్టు చేశారు.

అవకాశం ఉన్నా బదిలీ చేయకుండా... 
నిందితుల విచారణ నేపథ్యంలో ఈ హత్య పీర్జాదిగూడలో జరిగినట్లు తేలింది. నిబంధనల ప్రకారం ఆ వెంటనే ఈ కేసును రాచకొండకు బదిలీ చేయాలి. కొడుగు పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ అలా చేయలేదు. దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ కోసం వారిని తీసుకుని నగరానికి వచ్చి పోచారంలోని బృందావన్‌ లాడ్జిలో బస చేశారు. గత గురువారం సంస్కృతి టౌన్‌షిప్, బోడుప్పల్, పీర్జాదిగూడల్లో వీరిని తిప్పారు. ఆ రోజు రాత్రి హోటల్‌ గదిలో అంతా నిద్రపోతుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అంకుర్‌ ఎస్కేప్‌ అయ్యాడు. దీంతో కర్ణాటక పోలీసులు దీనిపై పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులను తీసుకుని శనివారం కొడుగు వెళ్లిపోయారు. పరారైన అంకుర్‌ కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement