సాక్షి,హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాణా కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అక్టోబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధి సంస్కృతి టౌన్ షిప్‌లో నివాసం ఉంటున్న రియల్టర్ రమేష్ కుమార్ భార్య నిహారిక, ప్రియుడు రాణాల చేతులో దారుణ హత్యకు గురయ్యాడు.
హత్య అనంతరం నిందితులు రమేష్‌కుమార్ మృతదేహాన్ని కారులో కర్ణాటకు తరలించారు. అక్కడ నిహారిక మరో ప్రియుడు నిఖిల్ రెడ్డితో కలిసి కొడుగు జిల్లా సుంటికుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి నిప్పు పెట్టిన నిందితులు పారిపోయారు. నిందితులను సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించిన సుంటికుప్ప పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం నిందితులను 10రోజుల కస్టడీకి తీసుకున్నారు.
సీన్ రీ కన్‌స్ట్రషన్ కోసం అక్టోబర్ 30వ తేదీన నిందితులను పోచారం ఐటీకారిడార్ ఠాణాకు తీసుకువచ్చారు. దర్యాప్తు లో భాగంగా రెండు రోజుల పాటు ఇక్కడనే ఉండేందుకు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బృందావనం హోటల్‌లో 6 గదులను అద్దెకు తీసుకున్నారు. తెల్లవారుజామున నిందితుడు రాణా కానిస్టేబుల్ హరీష్ మొబైల్ తీసుకుని పారిపోయాడని ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం స్థానిక పోలీసులతో పాటు కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: స్నేహితుడితో కలిసి భర్తను చంపిన భార్య
Comments
Please login to add a commentAdd a comment