realtor murder
-
వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్ని కర్ణాటక పోలీసులు క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం గత గురువారం నగరానికి తీసుకువచ్చారు. వీరంతా పోచారంలోని బృందావన్ హోటల్లో బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కీలక నిందితుడు అంకుర్ రాణా తప్పించుకుని పారిపోయాడు. దీంతో కర్ణాటక పోలీసులు ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెలుగులోకి వచి్చన అంశాల ప్రకారం కేసును ఇక్కడకు బదిలీ చేయాల్సి ఉండగా.. కర్ణాటక పోలీసులు చూపించిన అత్యుత్సాహం కారణంగానే ఇలా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుకారాంగేట్ టు సంస్కృతి టౌన్షిప్ నగరంలోని తుకారాంగేట్‌కు చెందిన రమేష్ కుమార్ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్íÙప్లో ఒంటరిగా ఉండేవారు. భువనగిరికి చెందిన ఆకుల లత చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈమె బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఈ నేపథ్యంలోనే తన పేరును నిహారికగా మార్చుకుంది. గతంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని, వారి నుంచి వేరు పడిన నిహారికకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా రమే‹Ùతో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్‌షిప్‌లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈమె తన రెండో భర్తతో కలిసి హరియాణాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి జైలుకు వెళ్లింది. అక్కడే ఈమెకు అంకుర్ రాణా అనే నేరగాడి తల్లితో పరిచయమైంది. ఆమెను కలవడానికి ములాఖత్‌కు వచ్చే అంకుర్తోనూ స్నేహం ఏర్పడింది. జర్మనీలో ఉద్యోగం కోసం నగదు అవసరమంటూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్ వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం వచి్చందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమే‹Ùతో చెబుతూ వస్తోంది. కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో డబ్బు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. రమేష్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచ్చిన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం వేసింది. రమేష్‌ను హత్య చేయడం ద్వారా దీన్ని అమలు చేయాలని అంకుర్ రాణాను సంప్రదించింది. అతడు అంగీకరించడంతో ఇరువురూ కలిసి గత నెల 1న నగరానికి చేరుకున్నారు. పీర్జాదిగూడలో చంపి.. మృతదేహంతో 800 కి.మీ ప్రయాణించి.. బోడుప్పల్ ప్రాంతంలో అంకుర్ బస చేయగా.. నిహారిక మాత్రం రమేష్ ఇంటికి వెళ్లింది. రెండు రోజుల పాటు వీరి మధ్య నగదు విషయంలో వాగ్వాదం జరిగింది. గత నెల 3 రాత్రిన తనను విమానాశ్రయంలో వదిలి రావాలంటూ నిహారిక కోరగా.. రమేష్ తన మెర్సిడిస్ బెంజ్ కారులో (టీఎస్ 07 ఎఫ్ఎస్ 5679) బయలుదేరారు. బోడుప్పల్–ఉప్పల్ మధ్యలో అంకుర్ వీరి వాహనం ఎక్కాడు. అతడిని తన సహోద్యోగిగా పరిచయం చేసింది. వీరి వాహనం పీర్జాదిగూడ కమాన్ వద్దకు చేరుకున్నాక వెనుక సీటులో కూర్చున్న అంకుర్ తన వద్ద ఉన్న వైరుతో రమే‹Ùకు ఉరి బిగించి చంపాడు. ఆపై వీళ్లు నిఖిల్‌ను సంప్రదించారు. అతడి సూచనల మేరకు మృతదేహాన్ని కారులో ఉంచుకుని దాదాపు 800 కి.మీ ప్రయాణించారు. ఊటీ సమీపంలోని సుంటికొప్పలో (కర్ణాటక) ఉన్న కాఫీ ఎస్టేట్‌లో పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేసి కారుతో పారిపోయారు. గత నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు నిహారిక, నిఖిల్‌లను బెంగళూరులో, అంకుర్‌ను హరియాణాలో అరెస్టు చేశారు.అవకాశం ఉన్నా బదిలీ చేయకుండా... నిందితుల విచారణ నేపథ్యంలో ఈ హత్య పీర్జాదిగూడలో జరిగినట్లు తేలింది. నిబంధనల ప్రకారం ఆ వెంటనే ఈ కేసును రాచకొండకు బదిలీ చేయాలి. కొడుగు పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ అలా చేయలేదు. దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం వారిని తీసుకుని నగరానికి వచ్చి పోచారంలోని బృందావన్ లాడ్జిలో బస చేశారు. గత గురువారం సంస్కృతి టౌన్షిప్, బోడుప్పల్, పీర్జాదిగూడల్లో వీరిని తిప్పారు. ఆ రోజు రాత్రి హోటల్ గదిలో అంతా నిద్రపోతుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అంకుర్ ఎస్కేప్ అయ్యాడు. దీంతో కర్ణాటక పోలీసులు దీనిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులను తీసుకుని శనివారం కొడుగు వెళ్లిపోయారు. పరారైన అంకుర్ కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. -
రియాల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును చేధించిన పోలీసులు
-
రియల్టర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
కుత్బుల్లాపూర్: కాపు సంఘం నేత, రియల్ వ్యాపారి మధు హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. రియల్టర్ మధు ఈనెల 24న ఉదయం బయలుదేరి వెళ్లి అదే రోజు రాత్రి హత్యకు గురి కావడం కుత్బుల్లాపూర్‌లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈనెల 27వ తేదీన ‘ఎవరు చంపారు.. ఎందుకీ దారుణం’అనే కథనం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అందరితో కలివిడిగా ఉండే మధు హత్య విషయం వెలుగులోకి రావడంతో అసలు హత్య ఎలా జరిగింది.. ఎవరు చేశారు? అని చర్చించుకోవడం కనిపించింది. డ్రైవర్ రేణుకాప్రసాద్‌తో పాటు లిఖిత్ సిద్ధార్థరెడ్డి, మరో మైనర్‌తో కలిసి కారులో వెళ్లినట్లు గుర్తించారు. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు డ్రైవర్ రేణుకాప్రసాద్‌తో పాటు మరో ఇద్దరి జాడ దొరకలేదు. వారి ఫోన్లు సైతం స్విచ్చాఫ్ రావడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఒంటిపై ఉన్న సుమారు రూ.20లక్షల విలువచేసే నగలతో పాటు ఇంటి నుంచి తీసుకెళ్లిన రూ.5లక్షల నగదు సైతం మాయంకావడంపై విచారణ కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. బీదర్ సమీపంలో ఉన్న క్లబ్ బయటకు వస్తున్న దృశ్యాలను అక్కడ సీసీ కెమెరా నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్లు పుకార్లు.. మధు హత్య కేసులో కీలకంగా భావిస్తున్న డ్రైవర్ రేణుక ప్రసాద్ బీదర్ పోలీసులకు పట్టుబడ్డట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. డ్రైవరే ఈ హత్య చేసినట్లు పలువురు భావిస్తున్నారు. మధు భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తూ వస్తున్న డ్రైవర్ రేణుకాప్రసాద్ అందరితో ఇంట్లో కలివిడిగా ఉండేవాడు. కొంతమంది మధు పెద్ద కుమార్తెతో ప్రేమ వ్యవహారమే కారణమని చెబుతుండగా అటువంటిది ఏమీ లేదని కుటుంబ సభ్యులు కొట్టి పారేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్న పుకార్లు అని స్పష్టం చేశారు. హత్య కేసు మిస్టరీ త్వరలోనే ఛేదిస్తామని బీదర్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
ఆస్తిపై కన్నేసి.. ప్రేమను కాదన్నాడని కక్ష పెంచుకుని.. !
హైదరాబాద్, సాక్షి: రియల్టర్ మధు(48) హత్య కేసు సంచలనంగా మారింది. నగరానికి చెందిన బిల్డర్.. ఎక్కడో బీదర్‌లో హత్యకు గురికావడంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారొచ్చని అంతా భావించారు. అయితే.. మధుతో స్నేహం ఉన్నవాళ్లే ఈ హత్య చేసి ఉంటారన్న పోలీసులు అనుమానాలే నిజం అవుతున్నాయి. ఈ క్రమంలోనే విస్తుపోయే కోణం వెలుగు చూసింది.బిల్డర్ కుప్పాల మధుకు భార్యా, ఇద్దరు పిల్లలు. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉంటోంది మధు కుటుంబం. మధు రియల్ ఎస్టేట్‌తో పాటు ట్రావెల్స్ నిర్వహిస్తుంటారు. అలా మధు కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. ఈ క్రమంలో రేణుకా ప్రసాద్‌తో మధుకి పరిచయం పెరిగింది. రేణుకా గ్యాంగ్‌తో కలిసి మధు తరచూ కాసినో ఆటకు వెళ్తుంటారు. మధుకు నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది. కిందటి ఏడాది.. నవరాత్రుల టైంలో పూజలకు వెళ్లిన రేణుకా.. మధు చిన్నకూతురిపై కన్నేశాడు. ఆమెను సొంతం చేసుకుంటే.. మధు ఆస్తి కూడా దక్కుతుందని ప్లాన్ వేశారు. అలా.. ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించాడు. ఒకరోజు చిన్నకూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని మధును కోరాడు రేణుక. అయితే మధు అందుకు నిరాకరించాడు. అప్పటినుంచి రేణుక మధుపై కోపంతో రగిలిపోయాడు. దీనికితోడు ఈమధ్యే చిన్నకూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. దీంతో కక్ష పెంచుకున్న రేణుక.. మధును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.ముందుగా హైదరాబాద్‌లోనే మధును హత్య చేయాలని రేణుకా ప్రసాద్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నెలరోజులు హైదరాబాద్‌లో ఉంచాడు. అయితే.. హైదరాబాద్‌లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. క్యాసినో ఆడుదామని బీదర్‌కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.24న తేదీ..మధు వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న బీదర్ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. డ్రైవింగ్ కోసం తనతో పాటు చింతల్ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్(32), అతని స్నేహితులు వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డిని తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్ చేయగా హైదరాబాద్ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. తెల్లవారినా మధు రాలేదు. బీదర్ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద మృతదేహం కనిపించింది. కారు నంబరు ఆధారంగా మృతుడు మధు అని గుర్తించి.. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.అయితే.. హైదరాబాద్‌లో మధును హత్య చేయడం వీలుకాదని భావించిన రేణుక.. కాసినో కోసం బీదర్ వెళ్దామని చెప్పి మధును తీసుకెళ్లాడు. అక్కడ మధును దారుణంగా హత్య చేశారు. మన్నేకెళ్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధును పెద్ద బండరాయితో తలపై కొట్టి.. ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు వెల్లడించారు. మధు ఒంటిపై ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారం, ఆయన వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదు సైతం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల్ని విచారిస్తున్న పోలీసులు.. మీడియా సమావేశం ద్వారా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు
సాక్షి, హైదరాబాద్: అనుకున్నట్టుగానే ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.బాలకృష్ణారెడ్డిపై వేటు పడింది. సంచలనం రేపిన ఇబ్రహీంపట్నం కర్ణంగూడ రియల్టర్ల జంట హత్యల కేసులో విధుల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణ నేపథ్యంలో బాలకృష్ణారెడ్డిని అంబర్‌పేట సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ఎం.శంకరయ్యను నియమించారు. ఇదే వ్యవహారంలో ఇబ్రహీంపట్నం పీఎస్‌లో దీర్ఘకాలంగా విధుల్లో ఉన్న మరో పోలీసు అధికారిపై కూడా త్వరలోనే వేటు పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలోఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ విజయ్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణను అంబర్‌పేట హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సీరియస్.. కర్ణంగూడలోని లేక్‌విల్లా ఆర్చిడ్స్‌లో నెలకొన్న భూ వివాదాలపై అసోసియేషన్ ప్రతినిధులతో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డి గతంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కానీ, పోలీసులు శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పోలీసులకు భారీ స్థాయిలోనే ముడుపులు ముట్టాయని ఆరోపణలు వినిపించాయి. ఏం చేయలేని స్థితిలో మట్టారెడ్డి హత్యకు పథకం రచించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. పోలీసుల వ్యవహారంపై సీరియస్ అయిన సర్కారు.. శాఖాపరమైన విచారణకు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇక్కడ పరారీ..అక్కడ జైలులో.. హత్య జరిగిన 48 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు ప్రధాన నిందితుడు మట్టారెడ్డితో సహా ఖాజా మోహియుద్దిన్, బుర్రి భిక్షపతి, సయ్యద్ రహీమ్, సమీర్ అలీ, రాజు ఖాన్‌లను అరెస్ట్ చేయగా.. హత్యలో వినియోగించిన రెండు తుపాకులను తయారు చేసిన చందన్ సిబాన్, సోనులు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు నిందితుల కోసం బీహార్‌కు వెళ్లిన ప్రత్యేక బృందాలకు షాకింగ్ న్యూస్ తెలిసిందే. అప్పటికే నిందితులు ఇద్దరిపై బీహార్‌లో పలు కేసులు ఉండటంతో వారిద్దరు స్థానిక జైలులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఉత్తి చేతులతో తిరుగు ప్రయాణమైన రాచకొండ పోలీసులు.. పిటీ వారెంట్‌ను సమర్పించి నిందితులు ఇద్దరిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.∙ -
రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ?
సాక్షి, అల్వాల్, రసూల్‌పుర: హైదరాబద్‌లోని తిరుమలగిరి ఠాణా పరిధిలోని పెద్ద కబేళా ఖాళీ స్థలంలో శవమై కనిపించిన రియల్టర్ తోట విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్‌రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలు టెంపుల్ అల్వాల్‌లోని శ్రీనివాసనగర్‌కు చెందిన తోట విజయ భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని లావాదేవీలను ఇద్దరూ కలిసి, మరికొన్నింటిని ఎవరికి వారుగా చేసుకునే వారు. అయితే ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చాయి. దీంతో కొంత కాలంగా వీరి మధ్య మనస్పర్ధలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నరేందర్ వాటి నుంచి బయటపడటానికి, తనకు రావాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజుల క్రితం ఓ నాటు తుపాకీని ఖరీదు చేసిన నరేందర్ దాన్ని తన ఇంటి వెనుక ఉన్న చెరువు సమీపంలో పాతి పెట్టాడు. ఆది వారం దీన్ని బయటకు తీసి తన వద్ద ఉంచుకున్నాడు. చదవండి: అమ్మ లొంగలేదని అమ్మాయిని బలిగొన్న కామాంధుడు పథకం ప్రకారం.. సోమవారం ఉదయం తాను కొనుగోలు చేస్తున్న ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం నగదుతో ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయ్‌భాస్కర్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తరవాత శ్రీశైలం వెళ్లి దైవ దర్శనం చేసుకువస్తానంటూ ఇంట్లో చెప్పాడు. కొద్ది దూరంలో నివసించే నరేందర్‌ను తన కారులో ఎక్కించుకున్నాడు. నరేందర్‌రెడ్డి పథకం ప్రకారం విజయ్‌భాస్కర్‌రెడ్డిని పెద్ద కబేళా పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ తనకు రావాల్సిన కమీషన్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. అదును చూసి వెనుక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విజయ్‌భాస్కర్‌రెడ్డి తలలోకి కాల్చాడు. పుర్రెను చీల్చుకుంటూ దూసుకుపోయిన తూటా లోపలే ఉండిపోయింది. దీంతో ఆయన ముక్కు, చెవులు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. భాస్కర్‌రెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న నరేందర్ అక్కడ నుంచి నగదును తీసుకుని పారిపోయాడు. కారులో రక్తం మడుగులో ఉన్న విజయ్‌భాస్కర్‌ను సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గుర్తించిన స్థానికులు తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆయన అప్పటికే మరణించినట్లు గుర్తించారు. తుపాకీ ఎక్కడ? రంగంలోకి దిగిన పోలీసులు నరేందర్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడు నాటు తుపాకీని రహస్యంగా దాచినట్లు తేలడంతో దాని కోసం గాలిస్తున్నారు. మరోపక్క ఇతడికి ఎవరైనా సహకరించారా? అనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు. బుధవారం నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. విజయ్‌భాస్కర్‌రెడ్డి మృతితో శ్రీనివాసనగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఈయనకు భ్యార్య, కుమారుడు, కుమర్తె ఉన్నారు. కుమారుడు ఇటీవల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడని సన్నిహితులు పేర్కొన్నారు. -
అల్వాల్‌లో రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: అల్వాల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. తిరుమలగిరిలోని కారులో సోమవారం విజయ్ మృతదేహం లభ్యమైంది. కాగా సోమవారం ఉదయం 10 గంటలకు ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం పది లక్షల రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే కారులోనే దుండగులు కత్తితో విజయ్ రెడ్డి మెడపై పొడిచి చంపారు. కాగా సోమవారం నాడు ఉదయం 11 గంటలకే విజయభాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ మద్యవర్తులే చంపినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులకు తెలియజేశారు. మృతుడి బంధువు తోట నరేందర్ రెడ్డి, మరో వ్యక్తి అబ్రహంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్
-
కారుతోపాటు మృతదేహం కాల్చివేత: శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, మెదక్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. మృతుని భార్య వద్ద పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు ముందు కీలక నిందితుడు శివ.. హతుడి భార్యతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ భార్యకు శివ దూరపు బందువుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈకేసులో మొత్తం అయిదుగురి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు శివతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కాగా, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో ఇటీవల దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్‌దిగా గుర్తించారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని నిర్థారించారు. శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు వెల్లడైంది. చదవండి: కారు డిక్కీలో శవం... కేసును ఛేదించిన పోలీసులు Medak: కారు డిక్కీలో శవం.. ప్రధాన నిందితుడు అరెస్ట్ -
రియాల్టర్ హత్య: పరుష పదజాలమే ప్రాణం తీసిందా?
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: కేపీహెచ్పీ ప్రాంతానికి చెందిన రియల్టర్ విజయభాస్కర్‌రెడ్డి కిడ్నాప్, దారుణ హత్యకు సంబందించి గురూజీ విషయమై ఆయన వాడిన పరుష పదజాలమే కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నలుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మాజీ ఆర్మీ ఉద్యోగి నాగర్ కర్నూల్‌కు చెందిన మల్లేష్, విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధాకర్‌బాబు, హైదరాబాద్ బోరబండకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ శ్రావణ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణంరాజులను సోమవారం వరకు విచారించనున్నారు. ఈ కేసులో సూత్రధారిగా అనుమానిస్తున్న త్రిలోక్‌నాథ్ అలియాస్ గురూజీ కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. తమ కస్టడీలో ఉన్న నిందితుల ద్వారా అతడి కదలికలకు సంబంధించిన వివరాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్వయంగా శుక్రవారం కేపీహెచ్‌బీ ఠాణాకు వచ్చి విచారణను పర్యవేక్షించారు. విజయభాస్కర్ హత్య కారణాలను అన్వేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన గురూజీ మూలికా వైద్యంలో సిద్ధహస్తుడని, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేసేవాడని నిందితులు వెల్లడించారు. గురూజీకి రెండు రాష్ట్రాల్లోను భక్తులు ఉన్నారని, ఎక్కువ మంది ఆయన వద్దకు వైద్యం కోసం వచి్చన వారేనని చెప్పారు. ఆయనతో సన్నితంగా ఉండే విజయభాస్కర్‌రెడ్డి గురూజీని విమర్శిస్తుండటంతో పాటు పరుషపదజాలం వాడేవారని నిందితులు చెప్పినట్లు తెలిసింది. కొన్ని లావాదేవీల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయన్నారు. గొడవలు వద్దంటూ సర్ధిచెప్పేందుకు గత నెల 20న విజయభాస్కర్‌రెడ్డి ఉంటున్న హాస్టల్‌కు వెళ్లినట్లు తెలిపారు. అయితే విజయభాస్కర్‌రెడ్డి నిందితులతో పాటు వారి కుటుంబీకులను కించపరిచేలా మాట్లాడటంతోనే కిడ్నాప్, హత్యకు దారితీసినట్లు వెల్లడించారని తెలుస్తోంది. నిందితుల కస్టడీ ముగిసిన తర్వాతే మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అప్పటివరకూ ఏమీ చెప్పలేమని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
రియల్టర్ భాస్కర్ హత్య కేసు: విచారణలో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: రియల్టర్ భాస్కర్ హత్య కేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. త్రిలోక్‌నాథ్ బాబా సన్నిహితులను పోలీసులు విచారిస్తున్నారు. ప్రతి పౌర్ణమి నాడు నెల్లూరు కావలి సముద్ర తీరాన క్షుద్ర పూజలు నిర్వహించినట్లు తెలిసింది. పౌర్ణమి నాడు అర్ధరాత్రి పూజలో సుమారు 80 మంది వరకు హాజరయినట్లు తెలిసింది. వారిలో రియల్టర్లు, భక్తులతో పాటు రాజకీయ నేతలు కూడా పాల్గొనట్టు సమాచారం. గత పదేళ్లుగా భాస్కర్‌రెడ్డి కూడా పూజల్లో పాల్గొన్నట్టు తెలిసింది. లావాదేవీల విషయంలో త్రిలోక్‌నాథ్, భాస్కర్‌రెడ్డి మధ్య వివాదం జరిగినట్లు సమాచారం. కాగా, నగరంలో రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు త్వరగతిన ఈ కేసులో పురోగతి సాధించారు. హత్య కేసులో కీలక నిందితుడు త్రిలోక్‌నాథ్ బాబాను మహరాష్ట్రలో సైబరాబాద్ పోలీసుల అదుపులో తీసుకున్నారు. ఆయనతోపాటు మరో నిందితుడు కార్తీక్‌ని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భాస్కర్‌రెడ్డి హత్యకు ముందు అతను తిన్న ఆహారంలో కార్తీక్ మత్తు మందు కలిపినట్లు దర్యాప్తులో తేలింది. -
హత్య కేసులో పురోగతి.. పోలీసులకు చిక్కిన త్రిలోక్‌నాథ్ బాబా
సాక్షి, హైదరాబాద్: నగరంలో రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు త్వరగతిన ఈ కేసులో పురోగతి సాధించారు. హత్య కేసులో కీలక నిందితుడు త్రిలోక్‌నాథ్ బాబాను మహరాష్ట్రలో సైబరాబాద్ పోలీసుల అదుపులో తీసుకున్నారు. ఆయనతోపాటు మరో నిందితుడు కార్తీక్‌ని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భాస్కర్‌రెడ్డి హత్యకు ముందు అతను తిన్న ఆహారంలో కార్తీక్ మత్తు మందు కలిపినట్లు దర్యాప్తులో తేలింది. నలుగురు నిందితులు మల్లేష్, సుధాకర్.. కృష్ణంరాజు, ఆర్ఎమ్పీ డాక్టర్‌ను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు హైదరాబాద్ టు శ్రీశైలం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. సీసీ ఫుటేజ్, కాల్ సీడీఆర్ ఆధారంగా ఈ హత్యలో ఇతరుల పాత్రపై కూడా విచారణ జరపనున్నారు. గుప్తనిధులు, రియల్ ఎస్టేట్ గొడవలపై కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతా ప్లాన్ ప్రకారమే.. కాగా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి విజయ్‌భాస్కర్ రెడ్డి గత నెల కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ప్లాన్ ప్రకారం అతనికి ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా విజయ్‌భాస్కర్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. నలుగురు కలిసి భాస్కర్‌ను హత్య చేసినట్లు బయటపడింది. -
HYD: స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్, హత్య.. కుట్రలో ప్రముఖ గురూజీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి వ్యాపారి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన విజయ్‌భాస్కర్ కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. కేపీహెచ్‌బీ ఠాణా వెనకవైపు ఓ హాస్టల్లో ఉంటున్నాడు. గత నెల 20 నుంచి విజయ్‌భాస్కర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో ఆయన అల్లుడు జయ సృజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలంగా విజయ్‌భాస్కర్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజుతోపాటు మరొకరు.. మొత్తం నలుగురు కలిసి భాస్కర్‌ను హత్య చేసినట్లు బయటపడింది. మాజీ సైనికోద్యోగి మల్లేశ్ కుమారుడు భాస్కర్ ఉండే హాస్టల్లో చేరి నమ్మకంగా ఉంటూ ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. స్పృహ కోల్పోయిన విజయ్ను కొందరు కారులో తీసుకెళ్లి శ్రీశైలంలోని సున్నింపెట వద్ద కాటికాపరిని బెదిరించి మృతదేహాన్ని ఖననం చేయించారు. వీరి తీరుపై అనుమానంతో మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కాటికాపరి తన సెల్ఫోన్లోఫోటో తీసి ఉంచుకున్నాడు. కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ గురూజీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఇటీవల ఈ గురూజీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ ప్రముఖుడి స్థలంలో వెలికి తీసిన విలువైన లోహాన్ని విదేశీ కంపెనీకి విక్రయించడం కోసం పలువురు భక్తుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. విజయ్‌రెడ్డితోపాటు ఆయనకు తెలిసిన వారు కూడా పెద్ద మొత్తంలో డబ్బులిచనట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి నిధులొస్తాయంటూ కాలయాపన చేస్తున్నాడనే అనుమానంతో విజయ్ తన డబ్బు కోసం గురూజీపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దీంతో విజయ్‌పై గురూజీ కోపం పెంచుకొని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్‌లో స్థిరాస్థి వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. విజయ్‌భాస్కర్ హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు -
వ్యాపారంలో తలెత్తిన వివాదం.. రూ.లక్ష సుపారి ఇచ్చి అంతమొందించాడు
సాక్షి, గోల్కొండ(హైదరాబాద్): రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలో భాగస్వామిని హత్య చేసిన వ్యక్తితో పాటు హత్యలో పాల్గొన్న సుపారి హంతకులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గోల్కొండ పోలీసులు తెలిపిన మేరకు.. షేక్‌పేట్ గుల్షన్ కాలనీకి చెందిన నసీర్ అహ్మద్ ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రషీద్ ఖాన్‌తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే సంవత్సరం నుంచి వీరి మధ్య వివాదం నెలకొంది. తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలని రషీద్ ఖాన్.. నసీర్ అహ్మద్‌తో చెప్పేవాడు. అయితే డబ్బులు ఇచ్చేది లేదని నసీర్ అహ్మద్ ఖరాఖండిగా తేల్చేశాడు. దీంతో కక్ష పెంచుకున్నాడు. తన తమ్ముడు అంజద్ ఖాన్‌తో రషీద్ పథకం వేశాడు. రషీద్ ఆదేశాల మేరకు అంజద్ ఖాన్ సయ్యద్ షా అక్బర్ అలీ, నియాజ్ మహ్మజ్ హాజీ, మీర్జా ఫయాజ్ అలీ బేగ్, ఉమర్ ఫారూక్ రూ.లక్షకు సుపారి ఇచ్చి అంతమొందించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంజద్, రషీద్ ఆదేశాల మేరకు సుపారి హంతకుల ముఠా ఈనెల 2న గుల్షన్ కాలనీలో స్కూటర్ పై వెళ్తున్న నసీర్ అహ్మద్‌ను కత్తులతో పొడిచి పారిపోయారు. కాగా నసీర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రషీద్‌ఖాన్, అంజద్ ఖాన్‌తో పాటు సయ్యద్ షా, అక్బర్ అలీ, నియాజ్ మహ్మద్ హాజి, మీర్జా ఫయాజ్ అలీబేగ్, ఉమర్ ఫారూక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వీడిన రాంచంద్రారెడ్డి హత్యకేసు మిస్టరీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాంచంద్రారెడ్డి హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా రాంచంద్రారెడ్డి సమీప బంధువు ఐనా ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరుడు కిడ్నాప్‌కు పాల్పడి అనంతరం హత్య చేసినట్లు నిర్థారణ అయింది. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (షాద్‌నగర్‌లో రియల్టర్ దారుణ హత్య!) షాద్‌నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో 9 ఎకరాల 9 గుంటల భూ వివాదమే హత్యకు కారణంగా కాగా, దీని వెనుక ఇంకెవరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాంచంద్రారెడ్డి శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనను షాద్‌నగర్‌లో కిడ్నాప్ చేసిన దుండగులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల వద్ద హతమార్చారు. నిన్న షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాంచంద్రారెడ్డి హత్యపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
షాద్‌నగర్‌లో కిడ్నాప్.. కొత్తూరులో హత్య
షాద్‌నగర్ రూరల్: భూవివాదాల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఓ వ్యాపారిని శుక్రవారం షాద్‌నగర్‌లో కిడ్నాప్ చేసిన దాయాదులు కొత్తూరులో హత్య చేశారు. ఫరూఖ్‌నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి (55) కొన్నేళ్లుగా జడ్చర్లలో స్థిరపడి అక్కడే పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. సొంత గ్రామంలో వ్యవసాయ పొలం ఉండటంతో అప్పుడప్పుడు అన్నారానికి వచ్చి వెళ్తుండేవాడు. కాగా పొలం విషయంలో రాంచంద్రారెడ్డికి అన్నారంలోని తన దాయాదులతో గతంలో ఘర్షణలు జరిగాయి. దీనిపై షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా భూ విషయంలో మాట్లాడుకుందామని దాయాదులు చెప్పడంతో రాంచంద్రారెడ్డి మధ్యాహ్నం డ్రైవర్ పాషాతో కలసి తన ఇన్నోవా వాహనంలో షాద్‌నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ వైపు వచ్చాడు. దీంతో భూమి విషయం మాట్లాడేందుకు దాయాదులు ఇన్నోవా కారు ఎక్కి మాట్లాడుతుండగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో వారు తమ వద్ద ఉన్న కత్తులను చూపించి బెదిరించడంతో డ్రైవర్ పాషా వాహనం దిగి పారిపోయాడు. ఇదే అదునుగా భావించిన వారు రాంచంద్రారెడ్డిని ఆయన వాహనంలోనే కిడ్నాప్ చేసి షాద్‌నగర్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ వైపునకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సెల్‌ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా రాంచంద్రారెడ్డి కొత్తూరు మండలంలోని పెంజర్ల శివారులోని ఓ వెంచర్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి కారును పరిశీలించగా కత్తిపోట్లకు గురై కొనఊపిరితో ఉన్న రాంచంద్రారెడ్డిని ప్రైవేటు వాహనంలో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలోనే రాంచంద్రారెడ్డి మృతి చెందాడు. గతంలో మృతుడు బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. కొత్తూరులో సంఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీ సురేందర్ పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. -
షాద్‌నగర్‌లో రియల్టర్ దారుణ హత్య!
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్‌కు చెందిన రియల్టర్, కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆయన ఈ సాయంత్రం కిడ్నాపైనట్టు తొలుత వార్తలొచ్చాయి. భూ వివాదం నేపథ్యంలో ఆయనను కిడ్నాప్ చేసినట్టు, రామచంద్రారెడ్డి డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. షాద్‌నగర్‌లోని టీచర్స్ కాలనీలో నివాసముండే రామచంద్రారెడ్డిని ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కిడ్నాప్ చేసినట్టు అతను పోలీసులకు తెలిపాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్డారు. అంతలోనే కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డి హత్యకు గురైనట్టు సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. షాద్‌నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో చాలా కాలంగా ఓ భూ వివాదం నడుస్తోంది. ఇరువర్గాల గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామచంద్రారెడ్డి జడ్చర్ల సింగిల్ విండో చైర్మన్‌గా పనిచేశారు. (చదవండి: చైనా వస్తువుల బ్యాన్ తొందరపాటు చర్య: కేసీఆర్) -
రియల్టర్ దారుణ హత్య
ప్రకాశం, బేస్తవారిపేట: ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం వేకువ జామున 2 గంటల సమయంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జరిగింది. మండలంలోని కొత్తపేటకు చెందిన మద్దుల రమణారెడ్డి (46) ఆర్మీ ఉద్యోగి. పదవీ విరమణ అనంతరం భార్య లక్ష్మీకుమారి, ఇద్దరు పిల్లలతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న కాంప్లెక్స్‌లో 11 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు. ముగ్గురు దుండగులు ముఖానికి గుడ్డ చుట్టుకుని నివాస గృహం కటాంజనం తలుపు తాళం పగలకొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. నిద్రపోతున్న రమణారెడ్డిపై ముగ్గురూ కత్తులతో దాడి చేసి తలపై పొడిచారు. పక్కనే నిద్రపోతున్న భార్య లక్ష్మీకుమారి తేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమె తలపై కూడా కత్తితో పొడిచి పక్కకు నెట్టేశారు. కత్తులతో పొడిచి పారిపోతున్న ముగ్గురిని వెంబడిస్తూ దంపతులు గృహం ముందున్న రోడ్డుపైకి వచ్చారు. తీవ్ర కత్తి పోట్లకు గురైన రమణారెడ్డి రోడ్డుపై కుప్పకూలాడు. భార్య గట్టిగా కేకలు వేస్తూ స్థానికులను పిలిచి బంధువులకు ఫోన్లో సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దంపతులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే రమణారెడ్డి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. నగలు, డబ్బు ఇస్తామన్నా వదల్లేదు డబ్బు ఎంత కావాలన్నా ఇస్తామని వేడుకున్నానని, అలాగే నగలూ ఇస్తానని చెప్పినా దుండగులు పట్టించుకోకుండా తన భర్తను చంపేశారని మృతుడి భార్య లక్ష్మీకుమారి భోరున విలపిస్తోంది. అన్యాయంగా తమ కుమారుడి ప్రాణాలు తీశారని, తమ కుటుంబానికి దిక్కెవరంటూ మృతుడి తల్లిదండ్రులు వీరారెడ్డి, వెంకటమ్మ, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. కిరాయి హంతకుల పనా? రమణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వడ్డీకి నగదు ఇస్తుంటాడు. ఈ వ్యవహారాల్లో ఎవరితోనైనా వివాదం జరగడంతో హత్యకు దారితీసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ కంభం–బేస్తవారిపేట పరిసర ప్రాంతాల్లో వెంచర్లు వేసి ప్లాట్ల అమ్మకాలు చేస్తూ వచ్చాడు. ఇటీవల నుంచరి గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా రమణారెడ్డి వెంచర్లు వేశాడు. అక్కడే ఎక్కువ రోజులు గడుపుతున్నాడు. ఆర్థిక అంశాలతోనే కిరాయి హంతకులతో హత్య చేయించి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం స్వగ్రామం కొత్తపేటలో పీర్ల పండుగ కోసం వచ్చాడు. ఆధారాలు సేకరించిన పోలీసులు సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. తలుపు, తాళం, పలు వస్తువులపై వేలిముద్రలు సేకరించారు. దుండగులు ఇంట్లో వదిలేసిన చేతి రుమాలును పోలీసు జాగిలం వాసన చూసి వైఎస్సార్ నగర్ సమీపంలో నూతనంగా కడుతున్న ఓ గృహం వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి మృతుడి ఇంటి వద్దకు, అక్కడి నుంచి కడప–తోకపల్లె హైవేపై వెళ్లింది. ఉలిక్కిపడిన బేస్తవారిపేట 2012లో బంగారు నగల వ్యాపారి పచ్చిపులుసు వెంకట నారాయణరావును గాంధీ బజార్‌లోని ఆయన ఇంటికి సమీపంలో దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. అప్పుడు బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఇప్పుడు రియల్టర్‌ను ఇంట్లోకి చొరబడి దారుణంగా చంపడంతో బేస్తవారిపేట వాసులు భయాందోళన చెందుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ మార్కాపురం డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు, సీఐ వి.శ్రీరామ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండ చర్యలు తీసుకున్నారు. కంభం ప్రభుత్వ వైద్యశాలలో రమణారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య లక్ష్మీకుమారితో మాట్లాడారు. ఆర్థిక లావాదేవీల్లో ఎమైనా గొడవలు ఉన్నాయా, ఎవరి మీదనైనా అనుమానం ఉందా.. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ కిశోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీడిన మిస్టరీ
విజయనగరం టౌన్: జిల్లా కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల సంఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు బొత్స మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పోలీసులు స్వల్ప కాలంలోనే కేసును ఛేదించారు. ఈ సంఘటనలో మోహన్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉపయోగించిన గన్ను తగరపువలస వద్దనున్న గోస్తనీ నదిలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎస్పీ జి. పాలరాజు సోమవారం విలేకరుల ముందుకు తీసుకువచ్చి వివరాలు వెల్లడించారు. గత నెల 24వ తేదీ రాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ కార్యాలయంలో నమ్మి పైడిరాజు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై నిందితుడు బొత్స మోహన్ గన్‌తో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడ నుంచి పరారై గన్ను గోస్తనీ నదిలో పడేశాడు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడు మోహన్‌ను పట్టుకుంది. ఆయనతో పాటు తుపాకీ కొనుగోలుకు సహకరించిన కర్రోతు వెంకటరమణమూర్తి అలియాస్ రమేష్‌ను, సంఘటనా స్థలంలో కాల్పులు జరిపినప్పుడు కాపలాదారుగా వ్యవహరించడంతో పాటు కాల్పుల తర్వాత మోహన్‌ను నేరస్థలం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆశాన వెంకటరమణను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి రంగు సురేష్‌తో పాటు ఒడిశాకు చెందిన మరొకరు పరారీలో ఉన్నారు. కాల్పులకు కారణాలివే.. రియల్టర్ నమ్మి అప్పలరాజు, అతని మామయ్య ఉల్లంకుల శ్రీనివాసరావు కొన్నేళ్లుగా పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా నిందితుడు మోహన్ నుంచి రూ.16 లక్షలను 2014లో అడ్వాన్స్‌గా తీసుకున్నారు. అందుకు ప్రతిగా మండలంలోని వీటీ అగ్రహారంలో 55 చదరపు గజాల స్థలాన్ని గాని.. లేనిపక్షంలో ఏడాదిలో మోహన్ ఇచ్చిన సొమ్ముకు రెట్టింపు సొమ్ము (రూ.32 లక్షలు) ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అప్పలరాజు ఏడాదిలో అటు సొమ్ము ఇవ్వడంలో గాని, ఇటు స్థలం రిజిస్ట్రేషన్ చేయడంలో గాని విఫలమవ్వడంతో అప్పలరాజు, మోహన్ మధ్య అంతరం ఏర్పడింది. దీంతో ఇరువురి మధ్య ఎప్పటికప్పుడు వాగ్వాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మోహన్ ఈ విషయాన్ని కొంతమంది పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లడంతో గుండాలపేటలో ఉన్న 650 చదరపు గజాల స్థలాన్ని మోహన్ పేరుమీద అప్పలరాజు రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే హైవే రోడ్డు విస్తరణలో భాగంగా వంద గజాల స్థలం పోనుండడంతో మోహన్ నిరాశకు గురయ్యాడు. ఇందులో భాగంగా అప్పలరాజుపై అక్కసు పెంచుకున్నాడు. తనకు జరిగిన నష్టానికి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో కర్రోతు రమణమూర్తి అలియాస్ రమేష్ సహకారంతో రంగు రమేష్ ద్వారా తుపా కీ కొనుగోలు చేసే ప్రాం తాన్ని తెలుసుకుని ఒడిశా వాసి నుంచి తుపా కి, ఐదు రౌండ్ల బుల్లెట్లను కొనుగోలు చేశా డు. పథకం ప్రకారం ఆశాన వెంకటరమణ సాయంతో బాధితుడు అప్పలరాజు ఆఫీస్‌కు వెళ్లి మోహ న్ ఐదురౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. తుపాకీనీ తగరపు వలస గోస్తనీనదీలో పడేశాడు. గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సీసీ పుటేజీలు, సెల్‌ఫోన్ వినియోగంపై పోలీసులు దృష్టి సారించి నిందితుడితో పాటు మరో ఇద్దరిని తగరపువలస పరిసర ప్రాంతా ల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇది లా ఉంటే బాధితుడు నమ్మి అప్పలరాజు విశాఖలో కేర్ ఆస్పత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. సమావేశంలో ఏఎస్పీ వెంకటరమణ, ఓఎస్డీ విక్రాంత్‌పాటిల్, సీసీఎస్ డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి, పట్టణ డీఎస్పీ ఏవీ రమణ, తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు రివార్డులు కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా పనిచేసిన వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్సైఐలు జీఏవీ రమణ, ఎ.నరేష్, కానిస్టేబుల్ డి.శ్రీనివాసరావు, సీసీఎస్ ఎస్సైలు సింహాచలంనాయుడు, రాజారావు, హెచ్‌సీ శంకరరావు, పి.జగన్మోహనరావు, కానిస్టేబుల్ నాయుడు, ప్రసాద్, రూరల్ ఎస్సై రామకృష్ణ, టూటౌన్ ఎస్సై వి.అశోక్ కుమార్, నెల్లిమర్ల ఎస్సై హెచ్. ఉపేం ద్ర, బొబ్బిలి ఎస్సై అమ్మినాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జి.రామకృష్ణ, ఐటి కోర్ కానిస్టేబుల్ రవికుమార్, కానిస్టేబుల్ రమేష్, పూసపాటిరేగ మండలం బర్రిపేటకు చెందిన గజ ఈతగాళ్లు బర్రి దారయ్య, పైడిరాజు, గుంటి ఎరకయ్య, మరుపల్లి పారయ్య, సూరాడ చయ్య, ఆకుల రామాలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రోత్సాహక, నగదు రివార్డులను అందజేశారు. -
ఖాకీ ‘క్రాస్‌చెక్’
ఎల్బీనగర్ డీసీపీ జోన్ పరిధిలో వింత పరిస్థితి రెండు హత్యలు...మూడు ఠాణాల అధికారులపై ఆరోపణలు పోలీసులు, నిందితుల పాత్రపై ఇంకా నిగ్గు తేలని నిజాలు సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీనగర్ జోన్ పరిధిలో పోలీసులపై పోలీసులే ‘క్రాస్‌చెక్’ (దర్యాప్తు) చేసుకుంటున్న వింత పరిస్థితి దాపురించింది. ఒక పోలీసు అధికారిపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు మరో అధికారితో విచారణ జరిపిస్తుండగా...విచారణ అధికారిపై వచ్చిన ఆరోపణలపై వేరే అధికారితో విచారణ జరిపిస్తుండటం పోలీసులను నవ్వుల పాల్జేస్తోంది. రియల్టర్ వెంకట్‌రెడ్డి హత్య కేసులో వనస్థలిపురం ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తిపై ఆరోపణలు రాగా.. మీర్‌పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఇక ఆటో డ్రైవర్ జంగయ్య హత్య కేసులో ఇటు మీర్పేట్, అటు ఇబ్రహీంపట్నం పోలీసుల మధ్య ఆరోపణలు రావడంతో ఈ రెండు ఠాణాల నిగ్గు తేల్చేందుకు ఎల్బీనగర్ ఏసీపీ పి.సీతారాం దర్యాప్తు చేపట్టారు. రియల్టర్ హత్య కేసులో సీఐపై ఆరోపణలు... తన పరిధిలో జరిగిన హత్య కేసును తానే దర్యాప్తు చేసుకోలేని దుస్థితిలో వనస్థలిపురం ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి ఉన్నారు. బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన రియల్టర్ వెంకట్‌రెడ్డి ఈనెల 1న అదృశ్యమై దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును నిజానికి వనస్థలిపురం ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే హతుడి డైరీలో గోపాలకృష్ణమూర్తి అతడిని బెదిరించినట్టు ఉండటంతో ఈ హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు బాధ్యతలను మీర్‌పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డికి అప్పగించారు. ఇంకా ఈ కేసు కొలిక్కి రాలేదు. దర్యాప్తు స్టేజిలోనే ఉంది. ఆటో డ్రైవర్ హత్య కేసులో ... ఆటో డ్రైవర్ జంగయ్య హత్య కేసులో కూడా గోపాలకృష్ణమూర్తికి ఎదురైన పరిస్థితే మీర్‌పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డికి తలెత్తింది. ఈ హత్య కేసులో ఇటు మీర్‌పేట పోలీసులు, అటు ఇబ్రహీంపట్నం పోలీసులు వేర్వేరు నిందితులను అరెస్టు చూపించడమే ఇందుకు కారణం. గతనెల 30న మీర్‌పేటలో జంగయ్య హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ముగ్గురిని ఈనెల 16న మీర్‌పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి అరెస్టు చూపించారు. కాగా ఈనెల 19న ఇదే కేసులో వేరే నలుగురిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చూపించారు. ఒకే హత్యను ఇలా వేర్వేరు నిందితులు ఎలా చేస్తారనే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఇబ్రహీంపట్నం, మీర్‌పేట పోలీసులు జంగయ్య హత్య కేసు దర్యాప్తులో అనుసరించిన తీరుపై విచారణ జరపాలని ఎల్బీనగర్ ఏసీపీ పి.సీతారాంకు డీసీపీ విశ్వప్రసాద్ బాధ్యతలు అప్పగించారు. మూడు ఠాణాలపై ఆరోపణలు... రియల్టర్ వెంకట్‌రెడ్డి, ఆటో డ్రైవర్ జంగయ్య హత్య కేసులు వనస్థలిపురం, మీర్‌పేట, ఇబ్రహీంపట్నం పోలీసుల మెడకు చుట్టుకున్నాయి. ఈ రెండు హత్యలలో అసలు నిందితులు ఎవరో ఇంకా తేలలేదు. ఆరోపణలు మాత్రం పోలీసులపై రావడంతో తలలు పట్టుకుంటున్నారు. వెంకట్‌రెడ్డి హత్య కేసులో అసలు నిందితులే దొరకలేదు? దీంతో హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారనే విషయం ఇంకా మిస్టరీగానే ఉంది. ఇక జంగయ్య హత్య కేసులో మాత్రం రెండు ఠాణాల పోలీసులు వేర్వేరు వ్యక్తుల అరెస్టులు చూపడం వివాదానికి తెరలేపింది. జంగయ్య హత్య కేసులో పోలీసుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు జైలులో ఉన్న నిందితులకు పండుగ చేసుకునేలా ఉంది.