Realtor Vijay Bhasker Reddy Assassinated In Alwal | Hyderabad Crime News Today In Telugu - Sakshi
Sakshi News home page

అల్వాల్‌లో రియల్టర్‌ విజయ్‌ భాస్కర్‌రెడ్డి దారుణ హత్య

Published Tue, Nov 30 2021 11:05 AM | Last Updated on Tue, Nov 30 2021 11:59 AM

Realtor Vijay Bhasker Reddy Assassinated In Alwal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అల్వాల్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. తిరుమలగిరిలోని కారులో సోమవారం విజయ్‌ మృతదేహం లభ్యమైంది.  కాగా సోమవారం ఉదయం 10 గంటలకు ఓ ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం పది లక్షల రూపాయలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే కారులోనే దుండగులు కత్తితో విజయ్‌ రెడ్డి మెడపై పొడిచి చంపారు. కాగా సోమవారం నాడు ఉదయం 11 గంటలకే విజయభాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఫ్లాట్ రిజిస్ట్రేషన్‌ మద్యవర్తులే చంపినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్‌కు గత కొద్దిరోజులుగా ఆస్తి విషయంలో తన బంధువులతో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులకు తెలియజేశారు. మృతుడి బంధువు తోట నరేందర్ రెడ్డి, మరో వ్యక్తి అబ్రహంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement