సాక్షి, మెదక్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. మృతుని భార్య వద్ద పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు ముందు కీలక నిందితుడు శివ.. హతుడి భార్యతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ భార్యకు శివ దూరపు బందువుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈకేసులో మొత్తం అయిదుగురి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు శివతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
కాగా, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో ఇటీవల దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్‌దిగా గుర్తించారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని నిర్థారించారు. శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు వెల్లడైంది.
చదవండి: కారు డిక్కీలో శవం... కేసును ఛేదించిన పోలీసులు
Medak: కారు డిక్కీలో శవం.. ప్రధాన నిందితుడు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment