veldurthy mandal
-
శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్
-
కారుతోపాటు మృతదేహం కాల్చివేత: శ్రీనివాస్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, మెదక్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. మృతుని భార్య వద్ద పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు ముందు కీలక నిందితుడు శివ.. హతుడి భార్యతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ భార్యకు శివ దూరపు బందువుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈకేసులో మొత్తం అయిదుగురి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు శివతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కాగా, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో ఇటీవల దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్‌దిగా గుర్తించారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని నిర్థారించారు. శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు వెల్లడైంది. చదవండి: కారు డిక్కీలో శవం... కేసును ఛేదించిన పోలీసులు Medak: కారు డిక్కీలో శవం.. ప్రధాన నిందితుడు అరెస్ట్ -
కారు డిక్కీలో శవం... కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, మెదక్: కారు దగ్ధం కేసును పోలీసులు చేధించారు. శ్రీనివాస్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని నిర్థారించారు. కారులోనే శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి చంపిన నిందితులు మృతదేహాన్ని డిక్కీలో వేసుకుని 6 గంటలపాటు కారులోనే తిరిగారు. అనంతరం కారుకు నిప్పటించి పరారయ్యారు. శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణమని, లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించలేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. రూ.15 లక్షలు సుపారీ తీసుకుని దుండగులు శ్రీనివాస్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. వెల్దుర్తి–నర్సాపూర్ ప్రధాన రహదారిలో మంగళపర్తి గ్రామ శివారులో ప్రధాన రహదారి పక్కన సోమవారం రాత్రి 10:30 సమయంలో కారు తగలబడడాన్ని మంగళపర్తి గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ మొదట గుర్తించి తగలబడుతున్న ఆ కారు దృశ్యాలను తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. అదేరాత్రి గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. స్థానిక సర్పంచ్ రామకృష్ణారావు ఇచ్చిన సమాచారంతో మంగళవారం ఉదయం వెల్దుర్తి ఎస్ఐ మహేందర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా కారు డిక్కీలో శ్రీనివాస్ మృతదేహం కన్పించింది. దీంతో మెదక్ పట్టణంలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన పోలీసులు కుటుంబసభ్యుల నుంచి కొంత సమాచారం సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. పెట్టుడు పళ్ల ఆధారంగా గుర్తింపు మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడం, శరీరంపై ఆనవాళ్లు కూడా సరిగా కన్పించకపోవడంతో వైద్య సిబ్బంది సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీనివాస్‌కు మూడు పెట్టుడు దంతాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహం తన భర్తదేనని, వివాహేతర సంబంధాల వల్ల తమ మధ్య తరచు గొడవలు జరిగేవని చెప్పింది. ఇద్దరు మహిళలతో తన భర్తకు సంబంధం ఉందని, వారి కుటుంబసభ్యులే ఈ హత్య చేసి ఉంటారని శ్రీనివాస్ భార్య లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న గొడవలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చని ఆమె పేర్కొంది. -
తగులబెట్టిన కారు డిక్కీలో బీజేపీ నేత శవం
వెల్దుర్తి, మెదక్ జోన్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామశివారులో (యశ్వంతరావ్‌పేట రెవెన్యూ పరిధిలో) దారుణ హత్య జరిగింది. తగులబెట్టిన హోండాసిటీ కారు డిక్కీలో కన్పించిన శవం కలకలం రేపింది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని డిక్కీలో బెట్టి కారును తగులబెట్టారా? లేక సజీవదహనం చేశారా అనేది తెలియలేదు. ఎక్కడో హత్యచేసి మంగళపర్తి శివారులో కారుతో పాటు దహనం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కారుపై ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి మెదక్ పట్టణానికి చెందిన బీజేపీ నేత ధర్మాకర్ శ్రీనివాస్ (45) అలియాస్ కటికె శ్రీనుగా గుర్తించారు. సోమవారం రాత్రి సుమారు 10:30 సమయంలో జరిగినట్టుగా భావిస్తున్న ఈ హత్యోదంతం మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మెదక్ ఏఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్‌తో పాటు క్లూస్ టీం సంఘటన స్థలంలో వివరాలు సేకరించింది. సెల్ఫోన్లో చిత్రీకరించిన ఆటో డ్రైవర్ వెల్దుర్తి–నర్సాపూర్ ప్రధాన రహదారిలో మంగళపర్తి గ్రామ శివారులో ప్రధాన రహదారి పక్కన సోమవారం రాత్రి 10:30 సమయంలో కారు తగలబడడాన్ని మంగళపర్తి గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ మొదట గుర్తించాడు. నర్సాపూర్ నుంచి తన ఆటోలో స్నేహితుడితో కలిసి ఇంటికి వస్తూ కారు తగలబడుతున్న దృశ్యాలను తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. అదేరాత్రి గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. స్థానిక సర్పంచ్ రామకృష్ణారావు ఇచ్చిన సమాచారంతో మంగళవారం ఉదయం వెల్దుర్తి ఎస్ఐ మహేందర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా కారు డిక్కీలో శ్రీనివాస్ మృతదేహం కన్పించింది. దీంతో మెదక్ పట్టణంలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన పోలీసులు కుటుంబసభ్యుల నుంచి కొంత సమాచారం సేకరించారు. 9వ తేదీన శ్రీనివాస్ ఇంట్లో నుంచి ఎన్నిగంటలకు వెళ్లాడు? ఎప్పటివరకు ఫోన్ ఆన్‌లో ఉంది? తదితర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్ డైరీతో పాటు ఇంటివద్ద ఉన్న సీసీ టీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెట్టుడు పళ్ల ఆధారంగా గుర్తింపు మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడం, శరీరంపై ఆనవాళ్లు కూడా సరిగా కన్పించకపోవడంతో వైద్య సిబ్బంది సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీనివాస్‌కు మూడు పెట్టుడు దంతాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. అయితే మొదట తన భర్తకు రెండే పెట్టుడు పళ్లు ఉన్నాయని, మృతదేహం తన భర్తది కాదని చెప్పిన శ్రీనివాస్ భార్య హైందవి కాసేపటికి మాటమార్చింది. మృతదేహం తన భర్తదేనని, వివాహేతర సంబంధాల వల్ల తమ మధ్య తరచు గొడవలు జరిగేవని చెప్పింది. ఇద్దరు మహిళలతో తన భర్తకు సంబంధం ఉందని, వారి కుటుంబసభ్యులే ఈ హత్య చేసి ఉంటారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న గొడవలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చని పేర్కొంది. వెల్దుర్తి మండల పరిధిలోని మారెపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళపై అనుమానం వ్యక్తం చేసింది. శ్రీనివాస్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాలుగు బృందాల ఏర్పాటు: తూప్రాన్ డీఎస్పీ మంగళపర్తి హత్యోదంతం కేసును త్వరలోనే ఛేదిస్తామని తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ చెప్పారు. హంతకులను పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామన్నారు. శ్రీనివాస్‌ను ఎక్కడో హత్యచేసి తీసుకొచ్చి మంగళపర్తి శివారులో కారుతో పాటు దహనం చేసి ఉంటారని చెప్పారు. సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అతని సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయ్యిందన్నారు. -
డిక్కీలో మృతదేహం.. కారు దగ్దం: అక్రమ సంబంధమే కారణమా?
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో మంగళవారం తెల్లవారుజామున దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్‌దిగా గుర్తించారు. అతడు వేసుకున్న డ్రస్, పెట్టుడు బంగారు పళ్ల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇక అక్రమ సంబంధమే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పోలీసులు ఓ మహిళ, ఆమె భర్త, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. శ్రీనివాస్‌ను వేరేచోట హత్య చేసి.. ఆ తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచి దహనం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అటు వ్యాపార లావాదేవీల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కారుని దగ్ధం చేసిన దుండగులు.. డిక్కీలో డెడ్‌బాడీ
-
కారుని దగ్ధం చేసిన దుండగులు.. డిక్కీలో డెడ్‌బాడీ
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు మంగళవారం తెల్లవారు జామున కారుని తగలబెట్టేశారు. దగ్ధమైన కారుని పరిశీలించగా డిక్కీలో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. కారుతోపాటు గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం కాలిపోయి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహం ఎవరిదన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మంటల్లో కాలిబూడిదైన కాగా TS 05 EH 4005 అనే నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ధర్మకారి శ్రీనివాస్‌రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ నిన్న స్వగ్రామం నుంచి హైద్రాబాద్ వచ్చాడు. అయితే శ్రీనివాస్ మొబైల్ రాత్రి నుంచి స్విచ్చాఫ్‌లో ఉందని అతని భార్య తెలిపింది. కారులోని మృతదేహం ఎవరిదనే విషయంపై ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది. -
14 మంది మృతదేహాలకు ఒకే చోట ఖననం
అలంపూర్/ శాంతినగర్/రాజోళి: వెల్దుర్తి ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి రామాపురంలో కన్నీటి వీడ్కోలు పలికారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలు.. ఆప్తుల ఆర్తనాదాలతో గ్రామం శోకసంద్రాన్ని తలపించింది. రాజోళి మండలం పచ్చర్ల వాసి తుపాన్ డ్రైవర్ రంగస్వామి (40), వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన విజయ్‌తో పాటు శాలన్న (32), గోపీనాథ్ (21), చింతలన్న (60), తిక్కయ్య (38), పౌలన్న (45), కృష్ణ (30), నాగరాజు (35), రాముడు (55), భాస్కర్ (41), చిన్న సోమన్న (45), పరశురాముడు (28), మునిస్వామి (35), సురేష్ (28), వెంకట్రాముడు (41) అదే గ్రామానికి చెందిన శ్రీనాథ్ వివాహ నిశ్చయానికి శనివారం అనంతపురం జిల్లా గుంతకల్‌కు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి వారు స్వగ్రామానికి తుపాన్ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం విదితమే. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపలైన విజయ్ ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్‌లో రామాపురం తీసుకొచ్చారు. అక్కడ అందరికీ సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి ఇంటికి రాకుండానే.. మృతి చెందిన వారిని కడసారి ఇంటికి తీసుకురాకుండా నేరుగా శ్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివాహ నిశ్చయానికని ఇంటి నుంచి బయల్దేరిన వారు మృతి చెందిన తర్వాత ఇళ్లకు తీసుకురాలేకపోయారు. గ్రామంలో శ్మశానవాటిక చిన్నదిగా ఉండటంతో కష్టంగా మారింది. చివరకు కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు గ్రామంలోకి ప్రవేశించే చోట టెంట్లు వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు కడసారి చూపు చూసుకునే అవకాశం కల్పించారు. సమీపంలోనే అధికారులు జేసీబీతో ఏర్పాటుచేసిన గుంతల్లో మృతదేహాలను ఖననం చేయించారు. దీంతో మృతులు నివాసం ఉండే కాలనీలు నిర్మానుష్యంగా మారాయి. అక్కడ జనసంచారం లేకుండా బిక్కుబిక్కుమంటూ కనిపించాయి. కొత్త శ్మశానవాటికలో.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి కొత్త శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలోని పాత శ్మశానవాటిక చిన్నగా ఉడటంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బందిగా మారింది. దీంతో గ్రామస్తులు ఎప్పటి నుంచో శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ వచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం 14 మంది అంత్యక్రియలు నిర్వహించడం అక్కడ సమస్యగా ఉంటుందని భావించిన స్థానిక రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు గ్రామ శివారులోని సర్వే నం.326లో 4.1 ఎకరాలను గుర్తించారు. ఈ స్థలం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎంపిక చేసినా కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందులోని ఎకరాను శ్మశానవాటిక కోసం కేటాయించారు. కొత్తగా ఏర్పాటుచేసిన స్థలంలోనే మృతి చెందిన వారి అంత్యక్రియలు పూర్తి చేశారు. బంధువుల సూచన మేరకు.. ఈ సంఘటనలో మృతి చెందిన 14 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. బంధువుల సూచనల మేరకు ఎవరు ఎవ రి పక్కన ఖననం చేయాలనేది కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు అంత్యక్రియ లు నిర్వహించారు. 13 మందిని పక్క పక్కన, మరొకరిని కొంతదూరంలో ఖననం చేశారు. ముందుగా చింతలన్న, తిక్కన్న, మునిస్వామి, పరశురాముడు, చిన్న సోమ న్న, నాగరాజు, రాముడు, సురేష్, గోపీనా థ్, శాలన్న, కృష్ణ, భాస్క ర్, వెంకట్రాముడును ఒకరి తర్వాత ఒకరిని ఖననం చేయగా పౌలన్నను మాత్రమే సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
మాసాయిపేటలో విషజ్వరాలు
వెల్దుర్తి: మండలంలోని మాసాయిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న ఓ వాడలో విష జ్వరాలు సోకి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజుల నుంచి కొందరు మంచాన పడగా మరి కొందరు నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. కొంత మంది పేద రోగులు మంచాన పడి మూలుగుతున్నారు. దోమల కాటు వల్ల డెంగీ తదితర జ్వరాలు సోకాయని బాధితులు తెలిపారు. వాడలో ఇంటింటికీ గొర్ల కొట్టాలు ఉండడంతో పేడ, మురుగు వల్ల దోమలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణలో అధికారులు అశ్రద్ధ చేస్తున్నారని, రోగాల బారినపడిన వారికి సర్కారు వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. 15 రోజుల క్రితం సాయిప్రియ, శ్రీకాంత్, సుశీల, కవిత తదితరులకు విష జ్వరాలు సోకడంతో నగరంలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకొని వచ్చారు. అలాగే నందిని, నవీన, మౌనిక, మోక్షిత తదితరులు రోగాల బారిన పడి నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారని స్థానికులు తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాప వైద్యానికి రూ.30 వేలు ఖర్చు మా ఐదేళ్ల కూతురు సాయిప్రియకు 15 రోజుల క్రితం జ్వరం వచ్చింది. తగ్గక పోవడంతో టెస్టులు చేయించాం. రక్తంలో తెల్ల కణాలు తగ్గాయని, దీంతో డెంగీ సోకిందని డాక్టర్లు చెప్పారు. దీంతో హైదరాబాద్‌లోని సనత్‌నగర్ వద్ద సెయింట్ థెరిసా ఆసుపత్రిలో వైద్యం చేయించాం. అప్పు చేసి రూ. 30వేలు ఖర్చు చేశాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. - లలిత మనవరాలు ఆసుపత్రిలోనే ఉంది నామనవరాలు సరితకు జ్వరం వచ్చింది. పది రోజుల నుంచి పట్నంలోని ఆస్పత్రిలో ఉంది. ఇప్పటివరకు రూ. 20వేలు ఖర్చయ్యాయి. డెంగీ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. - కమలమ్మ మళ్లీ జ్వరం వస్తోంది నా కూతురు కవితకు పక్షం రోజుల క్రితం జ్వరం వచ్చింది. తూప్రాన్‌లో టెస్టులు తీసుకుంటే డెంగీ సోకిందని చెప్పిండ్రు. పట్నం తీసుకెళ్లి రూ. 25 వేలు ఖర్చు చేసి నయం చేయించి ఇంటికి వచ్చాం. మళ్లీ సాయంత్రం పూట చలి, జ్వరం రావడంతో మూలుగుతోంది. - లక్ష్మి -
ఉపాధి సిబ్బందికి జరిమానాలు
వెల్దుర్తి: ఉపాధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లకు రూ. 20, 576 వేల జరిమానాలు విధించారు. మండలంలో గత ఏడాది జరిగిన ఉపాధి పనులపై పది రోజులుగా గ్రామగ్రామాన ఆడిట్ నిర్వహించారు. ఈ నివేదికలపై బుధవారం ఉదయం నుండి రాత్రి రెండు గంటల వరకు ఎంపీపీ కార్యాలయంలో ప్రజా దర్భార్ నిర్వహించారు. ఈ కార్య క్రమానికి జిల్లా విజిలెన్స్ అధికారి శివయ్య, ప్రొసీడింగ్ అధికారిణి వసంత సుగుణలు హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం వహించడం వల్ల మేట్లు మస్టర్ రోల్లలో పనులు చేసిన కూలీలకు హాజరు వేయక, పనులు చేయకున్నా చేసినట్లు హాజరు వేసినట్లు గుర్తించారు. దీంతో అధికారులు ఆగ్రహించి అలాంటి మేట్లను తొలగిస్తూ, నిర్లక్ష్యం వహించిన టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఈ జరిమానాలు విధించారు.