
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో మంగళవారం తెల్లవారుజామున దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్‌దిగా గుర్తించారు. అతడు వేసుకున్న డ్రస్, పెట్టుడు బంగారు పళ్ల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఇక అక్రమ సంబంధమే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పోలీసులు ఓ మహిళ, ఆమె భర్త, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. శ్రీనివాస్‌ను వేరేచోట హత్య చేసి.. ఆ తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచి దహనం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అటు వ్యాపార లావాదేవీల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment