dead body inside
-
Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్!
బెంగళూరు: గోవాలో నాలుగేళ్ల కొడుకు చంపి, మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరుకు తీసుకువచ్చిన సీఈవో సూచనా సేథ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటలపాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12.30 సమయంలో గోవాలోని కండోలిమ్‌లో ఉన్న ‘సోల్ బన్యాన్ గ్రాండ్’అనే సర్వీస్ అపార్టుమెంట్ నుంచి డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జంటుగా బెంగళూరుకు తీసుకెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్లాడు. ఒంటి గంటకు సూచనా సేథ్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతోపాటు ఉన్న నల్ల రంగు బ్యాగు చాలా బరువుగా ఉంది. బ్యాగు గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. ‘మద్యం బాటిళ్లు గానీ ఉన్నాయా మేడం, బ్యాగు బరువుగా ఉంది’అని అడిగా. అందుకామె, అవును, మద్యం బాటిళ్లున్నాయి అని సమాధానమిచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తమ్మీద దాదాపుగా వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా–కర్ణాటక సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్‌తో 4 గంటలు లేటయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ, భయపడ్డట్లుగానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ‘ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదు’అని తెలిపాడు. ‘ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యమవుతుంది మేడం. అర్జంటు అన్నారు కదా, యూ–టర్న్ తీసుకుని ఎయిర్ పోర్టుకు పోనివ్వమంటారా? అని అడిగా. అయితే, ఆమె ఎయిర్‌పోర్టుకు వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాకే వెళ్దామని బదులిచ్చింది. అర్జంటుగా వెళ్లాలంటూనే, ట్రాఫిక్ సమస్య ఉన్నా సమస్య లేదనడం వింతగా అన్పించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోనొచ్చింది. కారులో ఉన్న మహిళతోపాటు బాబు ఉన్నాడా అని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్, ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్లావరణలో కారును ఆపడంతో, సూచన ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడుతామన్నారు’అని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. ‘పోలీసులు కారు సోదా చేసి, బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు’అని డిసౌజా చెప్పాడు. -
కొడుకు శవంతో 4 రోజులు వృద్ధుడి సహవాసం.. దుర్వాసన రావటంతో..!
చండీగఢ్: పిల్లలు లేకపోవటంతో బాలుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు ఓ 82 ఏళ్ల వృద్ధుడు. అమాయకత్వం, ఇతరులతో కలుపుగోలుగా ఉండకపోవటంతో పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అయితే, అనారోగ్యంతో దత్తత తీసుకున్న కుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందగా.. ఏం చేయాలో తెలియని వృద్ధుడు శవం వద్దే ఉండిపోయాడు. నాలుగు రోజుల తర్వాత ఇంట్లోంచి దుర్వాసన రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అపస్మారక స్థితిలో మృతదేహం వద్ద పడిపోయి ఉన్న వృద్ధుడిని సోమవారం రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘సమాచారం అందుకోవటంతో అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం. మృతదేహం వద్దే వృద్ధుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన ఏమీ చెప్పటం లేదు. మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఆయనకు అంతగా ఏమీ తెలిసేలా కనిపించటం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.’ అని పోలీసు అధికారి పాల్ చంద్ తెలిపారు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. మృతి చెందిన సుఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి బల్వాంత్ సింగ్‌కు దత్తపుత్రుడిగా స్థానికులు తెలిపారు. ‘వారిని ఇటీవల ఎవరైనా పలకరించారా అనే విషయం తెలియదు. గత నెల రోజులకుపైగా వృద్ధుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాం.’ అని వెల్లడించారు స్థానికులు. ఇదీ చదవండి: చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. -
శ్రీనివాస్ హత్యకు రూ.కోటిన్నర వ్యవహారమే కారణం
-
Medak: కారు డిక్కీలో శవం.. ప్రధాన నిందితుడు అరెస్ట్
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండల పరిధిలో కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దగ్ధం చేసిన కేసును జిల్లా పోలీసులు చేధించారు. మృతుడిని రియల్టర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. గొంతు కోసి శ్రీనివాస్‌ను చంపేసినట్లు తెలిపారు పోలీసులు. ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 10న యశ్వంత్ రావ్పేట గ్రామంలో మృతదేహం దొరికింది. ఆగస్టు 9 రాత్రి దగ్దం చేయడం జరిగింది. మృతదేహాన్ని రియల్టర్ శ్రీనివాస్‌దిగా గుర్తించాము. శ్రీనివాస్ భార్య మాకు ఫిర్యాదు ఇచ్చింది. ముగ్గురు నిందితులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రధాన నిందితుడు శివను అరెస్ట్ చేసాం. ఏ-2 పవన్, ఏ-3 నిఖిల్‌లు పరారీలో ఉన్నారు’’ అని తెలిపారు. ‘‘మృతుడు శ్రీనివాస్ మెదక్ నుంచి ఆగస్టు 9 న ఇంటి నుండి బయటకు వచ్చాడు. శివ, నిఖిల్ ఇద్దరు కార్లో శ్రీనివాస్‌ను ఎక్కించుకుని వెళ్లారు. కార్ దగ్దం చేసిన ప్రాంతంలోనే శ్రీనివాస్‌ను హత్య చేశారు. హత్య కు ప్రధాన కారణం వ్యాపార లావాదేవీలు. టెక్నీకల్ ఏవిడెన్స్, సయింటిఫిక్ ఏవిడెన్స్ ఆధారంగా కేసును ఛేదించాము. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివను పోలీసు కస్టడీకి తీసుకుంటాము. గతంలో శివపై రౌడీ షీట్ ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది’’ అని తెలిపారు. -
డిక్కీలో మృతదేహం.. కారు దగ్దం: అక్రమ సంబంధమే కారణమా?
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మంగళపర్తి గ్రామ శివారలో మంగళవారం తెల్లవారుజామున దుండగులు కారు డిక్కీలో మృతదేహాన్ని ఉంచి దహనం చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో కారులోని మృతదేహాన్ని ధర్మకారి శ్రీనివాస్‌దిగా గుర్తించారు. అతడు వేసుకున్న డ్రస్, పెట్టుడు బంగారు పళ్ల ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇక అక్రమ సంబంధమే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పోలీసులు ఓ మహిళ, ఆమె భర్త, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. శ్రీనివాస్‌ను వేరేచోట హత్య చేసి.. ఆ తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచి దహనం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అటు వ్యాపార లావాదేవీల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్రీజర్ కొంటే.. డెడ్ బాడీ వచ్చింది
వాషింగ్టన్: ఓ మహిళ చౌకగా వస్తోందని సెకండ్ హ్యాండ్ ఫ్రీజర్ కొనుగోలు చేయగా, అందులో మృతదేహం వచ్చింది. ఆమె ఫ్రీజర్‌ను ఇంటికి తీసుకెళ్లి డోర్ తెరిచి చూడగా, అందులో నరికిన మృతదేహం భాగాలు కనిపించాయి. ఈ భయంకర దృశ్యాన్ని చూసి ఆమె షాక్‌కు గురైంది. అమెరికాలో ఉత్తర కరోలినాలోని గోల్డ్స్బొరొలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు పక్కింటివాళ్ల గ్యారేజి నుంచి సెకండ్ హ్యాండ్ ఫ్రీజర్ కొనుగోలు చేసింది. దాదాపు రెండు వేల రూపాయలకు దీన్ని తీసుకుంది. పరిచయస్తులు కావడంతో ఆమె వారిపై నమ్మకంతో గ్యారేజిలో ఫ్రీజర్ డోర్ తెరిచి పరిశీలించలేదు. ఫ్రీజర్‌ను ఇంటికి తీసుకెళ్లి చూడగా, అందులో మృతదేహం కనిపించింది. భయంతో వణికిపోయిన ఆమె వెంటనే బయటకు పరిగెత్తింది. హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. చర్చ్ సండే స్కూల్ క్లాస్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని కొనుగోలు చేసినట్టు ఆమె చెప్పింది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఫ్రీజర్‌లోని మృతదేహాన్ని పక్కింటిచెందిన వృద్ధురాలిదిగా ఆమె గుర్తించారు. మృతురాలు కొన్నేళ్లుగా కుమార్తె దగ్గర ఉన్నట్టు తెలిపింది. పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నారు.