వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్.. పాలనలో తనదైనా మార్క్ చూపిస్తున్నారు. తాను చేసిందే శాసనం, తన నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. ట్రంప్ ఇప్పటికే టారిఫ్‌లు, ఆంక్షల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, తాజాగా అమెరికాలోని పలు సంస్థలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని కొన్ని సంస్థల్లో ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద సహాయ సంస్థ అయిన ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (USAID)లో ఏకంగా 9,700లకు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా పదివేల మందికి పైగా ఉద్యోగులున్నారు. దీంతో, ఈ సంఖ్యను తగ్గించాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ క్రమంలో కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండేలా సవరణలు కూడా చేసినట్టు తెలుస్తోంది.
🇺🇸 Trump Administration to Cut USAID Staff to Fewer Than 300: The agency employs 10,000 globally. 📉⚠️ - Financial Times #USAID
The US spends about $40bn annually on foreign assistance, which makes up less than 1% of the federal budget. Such aid is what make US different from… pic.twitter.com/gITKpTo59Y— TheNewsBreaks (@TheNewsBreaks) February 7, 2025
ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు ప్లాన్ ఫలిస్తోంది. ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (ఓపీఎం) ఇచ్చిన బైఅవుట్ ఆఫర్ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్టు సమాచారం. బైఅవుట్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ఈమేరకు ఒక ఈ-మెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. దీంతో, సుమారు 10-15శాతం మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ కార్యవర్గం భావించింది. ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment