భారతీయుల తరలింపుపై కేంద్రం రియాక్షన్‌ ఇదే | Parliament Session On 06 feb Live Updates | Sakshi
Sakshi News home page

భారతీయుల తరలింపుపై కేంద్రం రియాక్షన్‌ ఇదే

Published Thu, Feb 6 2025 10:54 AM | Last Updated on Thu, Feb 6 2025 2:16 PM

Parliament Session On 06 feb Live Updates

Parliament Session Live Updates..

అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అక్రమ వలసలపై రాజ్యసభలో ప్రకటన చేశారు. అక్రమ వలసలను అరికట్టడానికి మేం ప్రయత్నిస్తున్నాం. కొందరు అక్రమంగా వలసలు వెళుతున్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డిపోర్టేషన్‌ అనేది కొత్త విషయం కాదు. 2009 నుంచి జరుగుతుంది. అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోంది. ఈ జర్నీలో వారికి కావాల్సిన ఆహారం, మెడిసిన్‌ అందిస్తోంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అమెరికా విధానం’ అని జయశంకర్‌ వ్యాఖ్యానించారు. 

కేంద్రం ప్రకటన..

  • అమెరికా నుంచి భారతీయుల అమానవీయ తరలింపుపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్న కేంద్రం

  • మధ్యాహ్నం రెండు గంటలకి రాజ్యసభ, మూడు మూడు గంటలకి లోక్‌సభలో ప్రకటన చేయనున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌

  • అమెరికా నుంచి భారతీయులను అమానవీయంగా తరలించడంపై ఉదయం నుంచి పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన చేస్తున్న విపక్షాలు

పార్లమెంట్‌ వద్ద విపక్ష పార్టీ ఎంపీల నిరసన..

  • అమెరికా నుంచి భారతీయుల రాక విషయంపై విపక్ష పార్టీల నేతలు నిరనసలకు దిగారు. 

  • కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 

 పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

  • భారతీయులను అమానవీయంగా అమెరికా బహిష్కరించడం పై ఉభయసభల్లో సభలో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలు

  • అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడం, అగౌరవపరచడంపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. 

  • సభలో చర్చ జరపాలని వాయిదా తీర్మానాలు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు

  • కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఉభయసభల సభాపతులు

  • వాయిదా తీర్మానాలను తిరస్కరించడం పై కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల ఆందోళన

  • ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.

👉పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడంపై ఉభయ సభలో కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీంతో, లోక్‌సభలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.

 

👉పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్‌సభలో ఎంపీ మాణిక్యం ఠాగూర్‌, రాజ్యసభలో రేణుకా చౌదరి వాయిదా తీర్మానం అందజేశారు. దీనిపై ఉభయ సభల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement