
ఢిల్లీ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ప్రభుత్వానికి రూ.2002 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. తాజా కాగ్ నివేదికతో కోర్టు విచారణ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
కాగా, నవంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు నూతన మద్యం విధానం కొనసాగింది. కుంభకోణం వెలుగు చూడడంతో నూతన మద్యం విధానం రద్దయ్యింది. ఈ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు కీలక నేతలు జైలు శిక్షను అనుభవించారు.
Comments
Please login to add a commentAdd a comment