![AAP Atishi alleges power cuts after BJP won polls](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Atishi-1.jpg.webp?itok=_rGNehza)
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ఆప్ 22 స్థానాలతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఢిల్లీలో అప్పుడే కరెంట్ కష్టాల్లో మొదలయ్యాయంటూ ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషి(Atishi) ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఢిల్లీలో కరెంట్ కష్టాలు ఆరంభం అయ్యాయంటూ సెటైర్లు వేశారు.
బీజేపీకి ఎలా పరిపాలించాలో తెలియడం లేదు. ప్రధానంగా పరిస్థితిని బట్టి కరెంట్ సదుపాయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇవ్వడంలో బీజేపీ అప్పుడే విఫలమైంది. దీనిపై నాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులొచ్చాయి. చాలా ఏరియాల నుంచి పలు ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. ప్రజలు అప్పుడే కరెంట్ ఉంటుందనే నమ్మకం కోల్పోయారు. వారు ఇన్వెర్టర్లు కొనుగోలు చేయడం ఇప్పటికే ఆరంభించారు. . ఢిల్లీని యూపీ తరహాలో మార్చబోతున్నారు అనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆమె విమర్శించారు.
ఢిల్లీలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. ఇంకా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ప్రధాని మొదీ అమెరికా పర్యటన అనంతరం ఢిల్లీ సీఎంను ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎంగా బీజేపీ ఇంకా ఎంపిక చేయకుండానే, పూర్తి స్థాయి పరిపాలన బాధ్యతలు తీసుకోకుండానే ఆప్ విమర్శలు చేయడాన్ని కూడా పలువురు తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment