Manickam Tagore
-
పార్లమెంట్‌కు చేరిన ‘నోట్ల కట్టల జడ్జి’ వ్యవహారం
న్యూఢిల్లీ, సాక్షి: అధికారిక బంగ్లాలో కాలిపోయిన నోట్ల కట్టలతో వార్తల్లోకి ఎక్కిన జస్టిస్ యశ్వంత్ శర్మ వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. ఈ అంశంపై చర్చ జరగాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ ఘటన న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు కలిగించడంతో పాటు ఆ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్న ఆయన.. సంబంధిత న్యాయ శాఖ మంత్రి నుంచి ఈ వ్యవహారంపై వివరణ ఇప్పించాలని స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు లోక్‌సభ కార్యదర్శికి సోమవారమే లేఖ రాశారాయన. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. తీవ్ర అభ్యంతరాల నడుమే ఆయన్ని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు కొలిజీయం. అయితే జస్టిస్ వర్మను హైకోర్టులోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని అలహాబాద్ బార్ అసోషియేషన్ నిరసనకు సిద్ధమైంది. నివారమే ఈ వ్యవహారంపై ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజేఐ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువంటూ లేని ఈ కమిటీ విచారణ.. సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది.హోలీ రోజు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం జరగ్గా.. ఓ గదిలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ వీడియోను పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయకు సమర్పించగా.. ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫొటోలు, వీడియోలతో సహా తన వెబ్సైట్లో పెట్టింది. వెబ్సైట్లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు.. జస్టిస్ వర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీనిని పేర్కొన్నారు. -
భారతీయుల తరలింపుపై కేంద్రం రియాక్షన్ ఇదే
Parliament Session Live Updates..అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అక్రమ వలసలపై రాజ్యసభలో ప్రకటన చేశారు. అక్రమ వలసలను అరికట్టడానికి మేం ప్రయత్నిస్తున్నాం. కొందరు అక్రమంగా వలసలు వెళుతున్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డిపోర్టేషన్ అనేది కొత్త విషయం కాదు. 2009 నుంచి జరుగుతుంది. అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించి వేస్తోంది. ఈ జర్నీలో వారికి కావాల్సిన ఆహారం, మెడిసిన్ అందిస్తోంది. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అమెరికా విధానం’ అని జయశంకర్ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటన..అమెరికా నుంచి భారతీయుల అమానవీయ తరలింపుపై పార్లమెంట్లో ప్రకటన చేయనున్న కేంద్రంమధ్యాహ్నం రెండు గంటలకి రాజ్యసభ, మూడు మూడు గంటలకి లోక్‌సభలో ప్రకటన చేయనున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్అమెరికా నుంచి భారతీయులను అమానవీయంగా తరలించడంపై ఉదయం నుంచి పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన చేస్తున్న విపక్షాలుపార్లమెంట్ వద్ద విపక్ష పార్టీ ఎంపీల నిరసన..అమెరికా నుంచి భారతీయుల రాక విషయంపై విపక్ష పార్టీల నేతలు నిరనసలకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. #WATCH | MPs of the opposition parties including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi, Congress National President Mallikarjun Kharge, Samajwadi Party chief Akhilesh Yadav hold a protest outside the parliament over the issue of deportation of alleged illegal Indian… pic.twitter.com/aUCpbEOK1Q— ANI (@ANI) February 6, 2025 పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాభారతీయులను అమానవీయంగా అమెరికా బహిష్కరించడం పై ఉభయసభల్లో సభలో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలుఅమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడం, అగౌరవపరచడంపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. సభలో చర్చ జరపాలని వాయిదా తీర్మానాలు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలుకాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఉభయసభల సభాపతులువాయిదా తీర్మానాలను తిరస్కరించడం పై కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల ఆందోళనఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.👉పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేటి సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడంపై ఉభయ సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీంతో, లోక్‌సభలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది.Lok Sabha adjourned till 12 noon amid ruckus following Opposition MPs' demand to discuss the issue of deportation of Indian nationals who were allegedly illegally living in the US. pic.twitter.com/UTPMln1Mzp— ANI (@ANI) February 6, 2025 👉పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అమెరికా నుంచి భారతీయులను వెనక్కి పంపడంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. లోక్‌సభలో ఎంపీ మాణిక్యం ఠాగూర్, రాజ్యసభలో రేణుకా చౌదరి వాయిదా తీర్మానం అందజేశారు. దీనిపై ఉభయ సభల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.Congress MP Renuka Chowdhury gives Suspension of Business Notice in Rajya Sabha under Rule 267 to discuss the deportation of Indian nationals who were allegedly illegally living in the US. "The entire exercise of reportedly deporting 20,407 Indian immigrants could have… pic.twitter.com/rQoUbqReYY— ANI (@ANI) February 6, 2025 -
అదానీ, మోదీ పాత్రధారులతో... రాహుల్ మాక్ ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ: అదానీ అంశంపై విపక్షాలు సోమవారం పార్లమెంటు మకరద్వారం వద్ద వినూత్నంగా నిరసన తెలిపాయి. అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు పారిశ్రామికవేత్త గౌతం అదానీలా మాణిక్కం ఠాగూర్, ప్రధాన నరేంద్ర మోదీలా సప్తగిరి శంకర్ మాస్కులు ధరించారు. వారితో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాక్ ఇంటర్వ్యూ నిర్వహించారు. పార్లమెంటును ఎందుకు నడవనీకయకుండా చేస్తున్నారని అదానీ (ఠాగూర్)ను ప్రశ్నించారు. ‘‘ఇది అమిత్ భాయ్ (హోం మంత్రి అమిత్ షా)ను అడగాలి. కానీ ఆయన కని్పంచడం లేదుగా’’ అంటూ ఆయన బదులిచ్చారు. మీ మధ్య సంబంధమేమిటని రాహుల్ మరో ప్రశ్నించగా, ‘‘మేమిద్దరం ఒకటే. ఎయిర్పోర్టయినా, మరొకటయినా నేనేది అడిగినా చేస్తారాయన’’ అంటూ ఠాగూర్ మళ్లీ బదులిచ్చారు. దీనిపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాహుల్ రెట్టించగా, ‘‘ఆయన ఈ మధ్య చాలా టెన్షన్‌గా ఉంటున్నారెందుకో’’ అని సమాధానమిచ్చారు. -
చంద్రబాబుకు క్లీన్చిట్ ఎలా ఇస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు క్లీన్చిట్ ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ఆయన ప్రశి్నంచారు. ‘హై ప్రొఫైల్ కేసుల్లో చంద్రబాబు, అజిత్ పవార్లకు కేంద్ర సంస్థలు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాను.పవార్‌కు సంబంధించి రూ.1,000 కోట్ల ఐటీ బినామీ ఆస్తుల కేసు, రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబులకు క్లీన్చిట్ అంశం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల న్యాయబద్ధతపై సందేహాలను రేకెత్తిస్తోంది. మోదీ ప్రభుత్వం పవార్ పేరును క్లియర్ చేస్తే, ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచి్చంది. ఈ కేసుల్లో కేంద్ర సంస్థలు తగిన ప్రమాణాల మేరకు పనిచేశాయా? తగిన ప్రక్రియను అనుసరించాయా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ రెండు కేసుల్లో తగిన సాక్ష్యాధారాలు లేవని దర్యాప్తు సంస్థలు చెప్పడం వాటి విశ్వసనీయతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ నిర్ణయాలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలి’ అని నోటీసులో పేర్కొన్నారు. సభ మంగళవారానికి వాయిదా పడటంతో దీనిపై చర్చ జరుగలేదు. ఇదే అంశంపై ఓ వార్తా ఏజెన్సీతో మాట్లాడిన మాణిక్కం ఠాగూర్... ‘ఈడీ, సీబీఐల పారదర్శక విచారణ, పనితీరుపై విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం’ అని చెప్పారు. -
నోట్ల సమస్య!.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల (రూ.10, రూ.20, రూ.50 నోట్లు) కొరత తీవ్రంగా ఉందని.. కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ 'మాణిక్యం ఠాగూర్' (Manickam Tagore) ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మల సీతారామన్'కు లేఖ రాశారు.యూపీఐ, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10, రూ.20, రూ.50 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు నివేదికలు సూచించాయని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. ఈ ప్రభావం లక్షలాది మంది పౌరులను ప్రభావితం చేస్తోందని ఆయన సూచించారు. అంతే కాకుండా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు లేదా రోజువారీ వేతన జీవుల వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయని అన్నారు.ఇప్పటికి కూడా రోజువారీ వ్యాపారులలో చాలామందికి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు అందుబాటులో లేవు. అలాంటి వారి వ్యాపారాలు తక్కువ విలువ కలిగిన నోట్ల సమస్య దెబ్బతీస్తోంది. డిజిటల్ చెల్లింపులు ఉపయోగకరమే అయినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్కువ విలువ కలిగిన నోట్లను కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటనతక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల ముద్రణ, పంపిణీని పునఃప్రారంభించమని ఆర్బీఐని ఆదేశించడం ద్వారా తక్షణమే జోక్యం చేసుకోవాలని ఠాగూర్ కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ను కోరారు. ప్రజల డిమాండ్‌ను తీర్చడానికి ఈ నోట్లను తగినంతగా సరఫరా చేయాలని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి ఈ అత్యవసర విషయాన్ని పరిష్కరించాలని తన లేఖలో వివరించారు.Wrote a letter to Hon’ble Finance Minister @nsitharaman regarding the severe shortage of Rs. 10, 20, and 50 denomination notes, which is causing hardship in rural and urban poor communities. Urging for immediate intervention to resume 1/2 pic.twitter.com/NEYXsIOZ9d— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) September 21, 2024 -
పార్లమెంట్లో వర్షపు నీరు లీకేజీ!.. కాంగ్రెస్ వాయిదా తీర్మానం
పార్లమెంట్ భవనంలో వర్షపు నీరు లీకేజీ కావడం.. ఆ వీడియోలు కాస్త నెట్టింటకు చేరడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వానకు రాష్ట్రపతి ఛాంబర్ దగ్గరి లాబీలో పైకప్పు నుంచి నీరు కారుతోంది. అయితే.. ఈ లీకేజీపై పార్లమెంట్ నిర్వాహణ అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు కిందటి ఏడాది మే నెలలో సన్సద్ భవనం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ భవనం.. అందులో హంగుల కోసం 1,000 కోట్ల రూపాయల్ని వెచ్చించారు. అయితే.. ప్రస్తుతం వాటర్ లీకేజీ అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ వాటర్ లీకేజీ అంశాన్ని సభలో చర్చించాలని భావిస్తోంది. ఈ మేరకు.. వాటర్ లీకేజీ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ విప్ మాణిక్కం ఠాగూర్.. లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. Paper leakage outside, water leakage inside. The recent water leakage in the Parliament lobby used by the President highlights urgent weather resilience issues in the new building, just a year after completion. Moving Adjournment motion on this issue in Loksabha. #Parliament pic.twitter.com/kNFJ9Ld21d— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 1, 2024 -
Lok sabha elections 2024: మాణిక్కం ఠాగూర్ వర్సెస్ రాధిక
సాక్షి, న్యూఢిల్లీ: డీఎంకేతో పొత్తులో భాగంగా తమిళనాడులో పోటీ చేస్తున్న తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. శుక్రవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో విరుధునగర్ సహా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. విరుధునగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మరోసారి బరిలో దిగుతున్నారు. మరోవైపు ఈ స్థానాన్ని సినీ నటి రాధికా శరత్‌కుమార్‌కు కేటాయిస్తూ బీజేపీ కూడా శుక్రవారమే నిర్ణయం తీసుకుంది! దాంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. 2009లో కూడా ఇక్కడ మాణిక్కం నెగ్గారు. 2014లో డీఎంకే, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడంతో అన్నాడీఎంకే అభ్యర్థి టి.రాధాకృష్ణ భారీ గెలుపొందారు. 2019లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేయడంతో మాణిక్కం ఠాగూర్ మరోసారి నెగ్గారు. డీఎంకే మద్దతుతో ఈసారీ సునాయాసంగా నెగ్గుతామని కాంగ్రెస్ భావిస్తోంది. -
పరువు నష్టం దావాపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్/ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ తనపై పరువు నష్టం కేసు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఆయన అయోమయంలో ఉన్నారని.. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరే ఠాకూర్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ‘‘మాణిక్యం ఠాగూర్ అయోమయంలో ఉన్నారు. ఆయనపై తోటి కాంగ్రెస్ నాయకుడు.. ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి మీకు(మాణిక్యం ఠాగూర్‌ను ఉద్దశిస్తూ..) రూ. 50 కోట్లతో పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పారు. అదే మాట మీకు మళ్లీ గుర్తు చేస్తున్నా. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన ఆ వార్తలనే నేను ప్రస్తావించా. పైగా కోమటిరెడ్డి చేసిన ఆ ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి కూడా తీసుకోలేదు.. వివరణా ఇవ్వలేదు. Manickam Garu, Why are you in a confused mode and misdirecting these notices? It was your colleague congressman & MP Venkat Reddy who had alleged on record that Revanth Reddy bribed you and bought the PCC president post for ₹50 Crore I had merely quoted the same since it was… https://t.co/YtK6EY9EIj pic.twitter.com/gickKF8Euy — KTR (@KTRBRS) January 31, 2024 .. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుంది. నా చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండి అంటూ ఎక్స్‌లో కేటీఆర్ సూచించారు. ఇదిలా ఉంటే.. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని మాణిక్యం ఠాగూర్ నోటీసులు పంపారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని.. వారంరోజుల్లోగా అదిర జరగకపోతే తదుపరి చట్టపరమైన చర్యలకు ముందుకెళ్తామని నోటీసుల్లో హెచ్చరించారాయన. -
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఎన్టీఆర్, సాక్షి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. బుధవారం ఉదయం ఆశావహులు అప్లికేషన్లను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కు అందించారు. మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్ సమర్పించగా.. రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ ఇచ్చారు. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ సమర్పించే అవకాశం ఉందని మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. ‘‘ఏపీలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను నిర్ణయిస్తుంది. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది. మాజీలంతా నిజమైన కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పోటీ చేసే స్ధానంపై త్వరలోనే స్పష్టత వస్తుందని అని అన్నారాయన. -
మాణిక్‌రావ్ రాకతోనైనా ‘మారేనా’?
సాక్షి, హైదరాబాద్: మాణిక్యం ఠాగూర్ మారారు.. మాణిక్‌రావు ఠాక్రే వస్తున్నారు.. మరి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారుతుందా? మాణిక్యం కుదర్చలేని సమన్వయం మాణిక్రావ్తో సాధ్యమవు తుందా? మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లపాటు పనిచేసిన అనుభవంతో తెలంగాణ కాంగ్రెస్‌కు ఆయన ఎలాంటి చికిత్స చేయబోతున్నారనేది ఇప్పుడు టీకాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరు ణంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే రాకతోనైనా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మారుతుందా అని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్‌లో ఒకప్పుడు కీలకనేతగా గుర్తింపు పొందిన మాణిక్‌రావ్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరని తెలుస్తోంది. తన పని తాను చేసుకుని పోతున్న తరుణంలో అధిష్టా నం వెతికి మరీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలు అప్పజెప్పడానికి గల కారణమేంటనేది కూడా చర్చనీయాంశమైంది. గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరున్న ఠాక్రే ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడటం, సొంత పార్టీలో పరిస్థితులను చక్కబెట్టడంలో దిట్ట అని, తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కృషి చేశారనే చర్చ జరుగుతోంది. శరద్‌పవార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మహారాష్ట్ర హోంమంత్రిగా పనిచేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో పాలనానుభవం కూడా ఉందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ముందున్న ప్రధాన సవాల్ అయిన తెలంగాణ కాంగ్రెస్‌లోని గ్రూపు తగాదాలను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. వచ్చేవారం రాక.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హోదాలో మాణిక్‌రావ్ ఠాక్రే వచ్చేవారం తెలంగాణకు రానున్నారని తెలుస్తోంది. వచ్చీరాగానే పార్టీ ముఖ్య నేతలందరినీ కలుస్తారని సమాచారం. కాగా, కొత్త ఇన్చార్జితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం ఫోన్లో మాట్లాడారని, పార్టీ ఇన్చార్జిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు తెలంగాణకు రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది. -
Manickam Tagore: చక్కదిద్దలేక.. స్వచ్ఛందంగా..!
సాక్షి, హైదరాబాద్: మాణిక్యం ఠాగూర్.. కాంగ్రెస్ రాష్ట్రాల ఇన్చార్జుల జాబితాలో పాపులర్ అయిన పేరు ఇది. తెలంగాణ ఇన్చార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ మూడు కొట్లాటలు, ఆరు తగాదాలన్నట్టుగా నిత్యం వార్తల్లో నిలిచింది. 2020 సెప్టెంబర్‌లో బాధ్యతలు తీసుకున్న ఆయన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకునే వరకు ప్రతిరోజూ ఏదో ఒక తలనొప్పితోనే సతమతమయ్యారు. పార్టీ నేతలను సమన్వయం చేయలేక, పరిస్థితులను చక్కదిద్దలేక, అధిష్టానానికి ఏం చెప్పాలో అర్థం కాక నానా అవస్థలు పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత ఈ తలనొప్పులు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టడం, తెలంగాణ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలగడం చర్చనీయాంశమయ్యింది. ఆయన రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పుకుంటారని, కొత్త ఇన్చార్జి వస్తారనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. విఫల ఇన్చార్జిగా మిగిలిపోతానని..! రాష్ట్ర పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించేందుకు మాణిక్యం ఠాగూర్ విముఖత వ్యక్తం చేయడం వెనుక పలు కారణాలున్నాయని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పారీ్టలోని కయ్యాలు తన వ్యక్తిగత కెరీర్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన భావించినట్టు తెలుస్తోంది. తాను ఇన్చార్జిగా వచ్చిన తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ వైఫల్యం తనకు చుట్టుకుంటే తానో విఫల ఇన్చార్జిగా మిగిలిపోతాననే ఆందోళన ఆయన రాష్ట్ర పార్టీ నేతల వద్ద వ్యక్తం చేశారు. పార్టీ పరిస్థితులను చక్కదిద్దలేకపోయానని అధిష్టానం భావిస్తే సంస్థాగతంగా కూడా తనకు ఇబ్బంది అవుతుందని భావించే వారని మాణిక్యంతో సన్నిహితంగా ఉన్న నేతలు వెల్లడించారు. దీనికి తోడు లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నా.. తన సొంత నియోజకవర్గమైన విదురకు సమయం ఇవ్వలేకపోతున్నానని, కోరుకున్న విధంగా తమిళనాడు పీసీసీ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను నియోజకవర్గానికి వెళ్లిపోతానని ఆయన చెప్పేవారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. -
మాణిక్యం ఎగ్జిట్.. మాణిక్ ఎంట్రీ
సాక్షి,హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను అధిష్టానం తప్పించింది. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్‌రావ్ ఠాక్రేను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మాణిక్యం ఠాగూర్‌కు గోవా రాష్ట్ర వ్యవహారాలను అప్పగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాష్ట్రంలోని సీనియర్ నేతల ఒత్తిడితో పాటు, పార్టీ ఇన్చార్జిగా కొనసాగేందుకు మాణిక్యం సైతం విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో అధిష్టానం ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మాణిక్యంను తప్పిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు వెలువడడానికి కొద్దిగా ముందు, టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్‌రెడ్డి వేదాంత ధోరణిలో మాట్లాడడం పార్టీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘రేవంత్’ వేదాంతం.. పదవిలో ఉన్నా లేకున్నా పార్టీకి కట్టుబడి పనిచేస్తా. అధ్యక్షుడిగా వేరేవారిని నియమించినా భుజాలపై మోస్తా. పార్టీ కోసం పదవులను, అవసరమైతే ప్రాణాలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధం. అందరూ మానవమాత్రులే. అప్పుడప్పుడూ పొరపాట్లు జరుగుతాయి. వాటిని సరిదిద్దుకుంటాం. సీనియర్లు లేని శిక్షణ ‘హాథ్‌సే హాత్‌జోడో’ పాదయాత్రల గురించి చర్చించడంతో పాటు ధరణి పోర్టల్‌పై నేతలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు. ఏఐసీసీ సమన్వయకర్త గిరీష్ జోడంకర్ హాజరైన భేటీకి సీనియర్లు గైర్హాజరవడం చర్చనీయాంశమయింది. ఏఐసీసీ సమన్వయకర్త గిరీష్ జోడంకర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి తదితరులు హాజరు కాగా.. కారణాలేవైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు లాంటి నాయకులు పాల్గొనకపోవడం చర్చనీయాంశమవుతోంది. పలు అంశాలపై టీపీసీసీ చర్చ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో బుధవారం ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా జనవరి 26 నుంచి నిర్వహించాల్సిన ‘హాత్‌సే హాత్‌జోడో’ పాదయాత్రల గురించి నేతలు చర్చించారు. ధరణి పోర్టల్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేతలకు అవగాహన కల్పించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన పక్షంలో బీమా కల్పన, మీడియాతో సమన్వయం, ఎన్నికల నిబంధనలు తదితర అంశాలపై కూడా చర్చ జరిగింది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మల్లురవి, గాలి అనిల్‌కుమార్, సంపత్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి, అంజ¯న్‌కుమార్ యాదవ్, హర్కర వేణుగోపాల్, రాములు నాయక్, నిరంజన్‌లతో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పీసీసీ ప్రతిని«ధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ ఏ గట్టునుంటారో చెప్పండి: రేవంత్ ఈ సమావేశాన్ని రేవంత్‌రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరణ ద్వారా ప్రారంభించారు. సమావేశం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన వివాదాల విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ గట్టునుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. ‘గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ ఎటువైపు ? ఆస్తుల విభజనలో తెలంగాణ వైపా, ఆంధ్రప్రదేశ వైపా?’ అని ప్రశ్నించారు. ఎన్నో త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆ గట్టున చేరిన కేసీఆర్ తెలంగాణను ముంచాలనుకుంటున్నాడని విమర్శించారు. రెండుసార్లు ప్రజలు అధికారమిచి్చనా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని, కేసీఆర్ పాలనలో దగా పడని వర్గం లేదని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఉప్పెనలా కప్పేద్దాం కాంగ్రెస్ కార్యకర్తలంతా కార్యోన్ముఖులై కదలాలని, ఉప్పెనలా కేసీఆర్ కుటుంబాన్ని కప్పేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా తాను పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తానని, పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమని అన్నారు. పార్టీ ఏ ఆదేశాలిచ్చినా సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ కుటుంబానికి జానారెడ్డి పెద్దదిక్కులాంటి వారని, ఆయన సూచనల ప్రకారం నడుచుకుని పార్టీని రాష్ట్రంలోని అన్ని మూలలకు తీసుకెళ్దామని చెప్పారు. కొన్ని దుష్టశక్తులు ఆశించినట్టుగా తెలంగాణ సమాజానికి నష్టం చేయబోమని కాంగ్రెస్ శ్రేణులు నిరూపించారని, తెలంగాణ ప్రజలకు నష్టం కలిగేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించబోదని ఈ వేదిక నుంచి సందేశం ఇద్దామని అన్నారు. ఐక్యంగా పనిచేస్తే అధికారం: జోడంకర్ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా హాత్‌సే హాత్‌జోడో యాత్రలు చేయాలని గిరీష్ జోడంకర్ పిలుపునిచ్చారు. ఈ యాత్రలను ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోవాలని, హాత్‌సే హాత్‌జోడో యాత్రల విజయవంతం కోసం ఈనెల 8వ తేదీన జిల్లా, మండల, బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. పార్టీ నేతల మధ్య సమన్వయానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. నేతలందరూ ఐక్యంగా పనిచేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పారీ్టదే అధికారమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ పాదయాత్ర ఓ చరిత్ర అంతకుముందు సమావేశం ప్రారంభం సందర్భంగా సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర కాంగ్రెస్ పారీ్టదని, దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుయుక్తులను తిప్పికొట్టేందుకే రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర ఓ చరిత్రగా నిలిచి పోయిందని, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ యాత్ర తోడ్పడిందని తెలిపారు. వైఎస్సార్ స్ఫూర్తితో తెలంగాణలో పాదయాత్రలు చేద్దామని రేవంత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హాత్‌సే హాత్‌జోడో యాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రతి గడపను తట్టి రాహుల్‌గాంధీ ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పారు. కేడర్‌ను ఉత్తేజితుల్ని చేయండి టీపీసీసీ సమావేశానంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ఏఐసీసీ నియమించిన హాత్‌సే హాత్‌జోడో అభియాన్ సమన్వయకర్త గిరీష్ జోడంకర్, రేవంత్‌రెడ్డిలు సమావేశమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కేడర్‌ను ఉత్తేజితులను చేయాలని, జనవరి 26 నుంచి జరగనున్న పాదయాత్రలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అదే విధంగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్థానిక ప్రజలెదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చార్జిషీట్లు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారం దక్కించుకునే దిశలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా..మంత్రిగా.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మాణిక్‌రావు ఠాక్రే 2008 నుంచి 2015 వరకు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1985 నుంచి 2004 మధ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 2009 నుంచి 2018 మధ్య ఎమ్మెల్సీగా పని చేశారు. శరద్ పవార్, విలాస్ రావు దేశ్ ముఖ్, సుశీల్ కుమార్ షిండేల మంత్రి వర్గాల్లో మూడుసార్లు వివిధ శాఖల మంత్రిగా సేవలందించారు. మంత్రిగా పరిపాలన అనుభవంతో పాటు దాదాపు ఎనిమిదేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మాణిక్‌రావ్ ఠాక్రేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. మాణిక్‌రావు థాకరే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీ, శివసేన ప్రభుత్వాలను తీవ్రంగా తూర్పార బట్టిన నాయకుడిగా ఆయనకు పేరుంది. చదవండి: (వైఎస్సార్ పాదయాత్ర దేశ రాజకీయాలలో ఓ సంచలనం: భట్టి) -
ఇక సెలవు.. ఉంటా మరి..! టీ కాంగ్రెస్ నేతలకు బై చెప్పిన మాణిక్కం ఠాగూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్‌రావు థాకరేను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను నియమించింది. ఇదిలా ఉండగా, టీ కాంగ్రెస్‌లో వాట్సాప్ గ్రూప్ గందరగోళం నెలకొంది. ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వైదొలగినట్లు ప్రచారం సాగింది. లేదు.. వాట్సాప్ గ్రూప్‌లోనే ఉన్నారంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు వాదించారు. కొద్దిరోజుల క్రితం సాంకేతిక సమస్య వల్ల ఎగ్జిట్ అయ్యారంటూ మరి కొందరు తెలిపారు. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారని, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపించినట్లు ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్యం ఠాగూర్‌ను పంపించి.. ఆ స్థానంలో టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా మాణిక్‌రావు థాకరేను అధిష్ఠానం నియమించింది. ఠాగూర్‌ను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారు. వాట్సాప్ గ్రూప్‌ల నుంచి లెఫ్ట్ అయ్యే ముందు.. ఈ రోజు వరకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. -
దిద్దుబాటు ప్రారంభిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ట్రబుల్ షూటర్ దిగ్విజయ్‌సింగ్ తెలంగాణకు వచ్చి వెళ్లాక పార్టీలో ఏం జరుగుతుందనే ఆసక్తి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. టీపీసీసీలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం అధిష్టానం దూతగా వచ్చిన ఆయన ఏం చేస్తారన్నది ఇప్పుడు కాంగ్రెస్ కేడర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రానుంది. దిగ్విజయ్ పర్యటన అనంతరం హైలెవల్ కమిటీ ఆయనతో సమావేశమవుతుందని, ఆ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి రాష్ట్ర నేతలను ఒప్పించాకే దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయని సమాచారం. అయితే అందరినీ మూకుమ్మడిగా రమ్మంటారా? లేక విడివిడిగా పిలిచి మాట్లాడతారా? అన్నదానిపై స్పష్టత రాలేదు. మొత్తంమీద త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లో దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయని, మొదటగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ స్థానంలో కొత్తగా సీనియర్ నాయకుడిని పంపిస్తారనే చర్చ జరుగుతోంది. ఆ మాటల ఆంతర్యమేంటో? కాంగ్రెస్ అధిష్టానం దిగ్విజయ్‌కు పెద్ద బాధ్యతే అప్పగించిందని ఆయన మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతోంది. ఎవరూ పార్టీ విషయాలను బహిరంగంగా మాట్లాడితే ఎంత పెద్ద నాయకుడినైనా ఉపేక్షించేది లేదని దిగ్విజయ్ హెచ్చరించడంపై పలు చర్చలు జరుగుతున్నాయి. సీనియర్లను కంట్రోల్ చేయడంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక పీసీసీ అధ్యక్ష పదవిని సమర్థంగా నిర్వహించడం గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవిని నిర్వర్తించడంలో వయసుతో పనిలేదని, అనుభవం లేకపోయినా అందరినీ కలుపుకొని వెళ్తే విజయవంతం కావచ్చని ఆయన ఇచ్చిన సలహా రేవంత్ వ్యవహారశైలిని ఉద్దేశించి చేసిందేనని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఉన్నతస్థాయి కమిటీకి దిగ్విజయ్ నివేదిక! తన రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులను అవగాహన చేసుకున్న దిగ్విజయ్‌సింగ్... పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. పలు రాష్ట్రాల్లోని అంతర్గత అంశాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థాయి కమిటీకి ఆయన నివేదిక ఇస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ రావడానికి ముందే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌తోపాటు ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వచ్చాక 54 మందికిపైగా నేతలను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి దిగ్విజయ్ ఇచ్చిన నివేదికలో ఆయన పలు సిఫారసులు కూడా చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సిఫారసుల అమలుపై చర్చించడం కోసమే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులను త్వరలో ఢిల్లీకి పిలిచే అవకాశముందని తెలుస్తోంది. -
‘ఇందుకు మంత్రి కేటీఆర్, సీపీ సీవీ ఆనంద్లదే బాధ్యత’
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరిగే వార్‌రూమ్‌లో పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది టీపీసీసీ. కాంగ్రెస్ వార్ రూమ్‌పైన దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఈ క్రమంలోనే అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసులు సోదాలు చేసి సీజ్ చేయడాన్ని ప్రధానంగా తప్పు పట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఈ దాడులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని రేవంత్‌రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. మరొకవైపు ఈ ఘటనపై టీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు తెలంగాణ కాంగ్రెస్ వార్‌రూమ్‌పై దాడి చేశారని, 50 కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు. ప్రొసీజర్ లేకుండా తమ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు.అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదని, 41A CrPC నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ఈ అక్రమాలకు మంత్రి కేటీఆర్, సీపీ సీవీ ఆనంద్ బాధ్యత వహించాలన్నారు. ఇప్పుడు తాను కూడా అదే పోస్ట్ చేస్తానంటూ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. For this FB post Telangana Congress War room headed by #SunilKanugolu team at Hyderabad was raided and 50 computers taken … Data stolen … Five of our Proffesional partners arrested illegally without FIR .. Now I am posting the same let @TelanganaCMO arrest me …#HitlerKCR pic.twitter.com/6SonRAHRdZ — Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 14, 2022 -
టీపీసీసీ ‘జంబో జట్టు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో కార్యవర్గాన్ని ఎంపిక చేసింది. అన్ని సామాజిక వర్గాలను సమతుల్యం చేస్తూ.. జంబో జట్టును ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. ఇందులో 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు ఉండగా, 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అ«ధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల కమిటీలో 17 మంది సభ్యులు, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అంతేగాక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా 40 మందితో ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. ఇదీ జాబితా.. రాజకీయ వ్యవహారాల కమిటీ(22) : మాణిక్యం ఠాగూర్ (చైర్మన్), రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర సి. రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న ఎండీ అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్ రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (40) .. రేవంత్‌రెడ్డి (చైర్మన్), మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర రాజనరసింహ, రేణుకా చౌదరి, పి.బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, డి.శ్రీధర్‌బాబు, జి.చిన్నారెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎ.సంపత్ కుమార్, పి. సుదర్శన్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, నాగం జనార్దన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, సి.రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, జి.వినోద్, మహమ్మద్ అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్ గౌడ్, డి.సీతక్క, పొదెం వీరయ్య, ఎ.మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోదండరెడ్డి, ఈరవత్రి అనిల్‌కుమార్, వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని. టీపీసీసీ ఉపాధ్యక్షులు (24) .. పద్మావతిరెడ్డి, బండారు శోభా భాస్కర్, కొండ్ర పుష్పలీల, నేరెళ్ల శారదాగౌడ్, సీహెచ్.విజయ రమణారావు, చామల కిరణ్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌గౌడ్, దొమ్మటి సాంబయ్య, శ్రవణ్‌కుమార్ రెడ్డి, ఎర్ర శేఖర్, జి.వినోద్, గాలి అనిల్‌కుమార్, హర్కర వేణుగోపాల్‌రావు, జగదీశ్వరరావు, మదన్మోహన్రావు, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, పొట్ల నాగేశ్వరరావు, రాములు నాయక్, సంజీవరెడ్డి, సిరిసిల్ల రాజయ్య, టి.వజ్రేశ్ యాదవ్, తాహెర్‌బిన్ హందాని. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు (84) .. మధుసూదన్‌రెడ్డి, అద్దంకి దయాకర్, బి.కైలాశ్‌కుమార్, బి.సుభాష్‌రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, భూపతిగల్ల మహిపాల్, బొల్లు కిషన్, సీహెచ్. బాల్‌రాజు, చలమల కృష్ణారెడ్డి, చరణ్‌కౌషిక్ యాదవ్, చారుకొండ వెంకటేశ్, చేర్యాల ఆంజనేయులు, చిలుక మధుసూదన్‌రెడ్డి, చిలుక విజయ్‌కుమార్, చిట్ల సత్యనారాయణ, దారాసింగ్ తాండూర్, సుధాకర్ యాదవ్, దుర్గం భాస్కర్, ఈ.కొమురయ్య, ఎడవల్లి కృష్ణ, ఫక్రుద్దీన్, ఫిరోజ్‌ఖాన్, గడుగు గంగాధర్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గోమాస శ్రీనివాస్, గౌరీ శంకర్, జానంపల్లి అనిరుధ్‌రెడ్డి, జెరిపేటి జయపాల్, కె.నాగేశ్వరరెడ్డి, కైలాష్ నేత, కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్, కొండేటి మల్లయ్య, కోటంరెడ్డి వినయ్‌రెడ్డి, కోటూరి మానవతారాయ్, కుందూరు రఘువీరారెడ్డి, ఎం.నాగేశ్ ముదిరాజ్, ఎం.వేణుగౌడ్, ఎం.ఎ. ఫహీం, మొగల్‌గుండ్ల జయపాల్‌రెడ్డి, మహ్మద్ అబ్దుల్ ఫహీం, ఎన్.బాలు నాయక్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, నూతి సత్యనారాయణ, పి.హరికృష్ణ, పి.ప్రమోద్ కుమార్, పి.రఘువీర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి, పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, ప్రేమ్‌లాల్, ఆర్.లక్ష్మణ్ యాదవ్, నర్సాపూర్ రాజిరెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, రంగినేని అభిలాశ్‌రావు, రంగు బాలలక్ష్మిగౌడ్, రాపోలు జయప్రకాశ్, ఎస్.ఎ. వినోద్‌కుమార్, సంజీవ ముదిరాజ్, సత్తు మల్లేశ్, సొంటిరెడ్డి పున్నారెడ్డి, శ్రీనివాస్ చెక్లోకర్, తాటి వెంకటేశ్వర్లు, వల్లె నారాయణరెడ్డి, వెడ్మ భొజ్జు, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, జహీర్ లలాని, భీమగాని సౌజన్యగౌడ్, లకావత్ ధన్వంతి, ఎర్రబెల్లి స్వర్ణ, గండ్ర సుజాత, గోగుల సరిత వెంకటేశ్, జువ్వాడి ఇంద్రారావు, కందాడి జ్యోత్స్న శివారెడ్డి, కోట నీలిమ, మందుముల్ల రజితారెడ్డి, మర్సుకోల సరస్వతి, పి.విజయారెడ్డి, పారిజాత నర్సింహారెడ్డి, కుచన రవళిరెడ్డి, శశికళా యాదవ్, సింగారపు ఇందిర, ఉజ్మా షకీర్ జిల్లా అధ్యక్షులు (26) : సాజిద్ ఖాన్ (ఆదిలాబాద్), పొదెం వీరయ్య (భద్రాద్రి కొత్తగూడెం), ఎన్.రాజేందర్‌రెడ్డి(హనుమకొండ), వలీయుల్లా సమీర్ (హైదరాబాద్), ఎ.లక్ష్మణ్ కుమార్ (జగిత్యాల). పటేల్ ప్రభాకర్‌రెడ్డి (జోగుళాంబ గద్వాల), కైలాశ్ శ్రీనివాస్‌రావు (కామారెడ్డి), కె.సత్యనారాయణ (కరీంనగర్), రోహిన్‌రెడ్డి (ఖైరతాబాద్), జె.భరత్‌చంద్రారెడ్డి(మహబూబాబాద్), జి.మధుసూదన్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కె.సురేఖ (మంచిర్యాల), టి.తిరుపతిరెడ్డి (మెదక్), నందికంటి శ్రీధర్ (మేడ్చల్ మల్కాజ్గిరి), ఎన్.కుమారస్వామి (ములుగు), సి.వంశీకృష్ణ (నాగర్‌కర్నూల్), టి.శంకర్‌నాయక్(నల్లగొండ), శ్రీహరి ముదిరాజ్ (నారాయణపేట), ప్రభాకర్‌రెడ్డి (నిర్మల్), మానాల మోహన్‌రెడ్డి (నిజామాబాద్), ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్ (పెద్దపల్లి), ఆది శ్రీనివాస్ (రాజన్న సిరిసిల్ల), టి.నర్సారెడ్డి (సిద్దిపేట), టి.రామ్మోహన్‌రెడ్డి (వికారాబాద్), ఎం.రాజేంద్రప్రసాద్ యాదవ్ (వనపర్తి), కె.అనిల్‌కుమార్ రెడ్డి (యాదాద్రి భువనగిరి) -
ఎందుకింత ‘హస్త’వ్యస్తం?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పాటు అందించినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ అస్తవ్యస్తంగా మారడంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతుండటం, సంప్రదాయ ఓటు బ్యాంకు చేజారడం, నేతలు వీడుతుండటాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుత శీతాకాల సమావేశాల అనంతరం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో బీజేపీ పెద్దగా ఉనికి లేదనుకున్న చోట్ల కూడా ప్రభావం చూపుతోంది. ఈ విషయంలో పలువురు కాంగ్రెస్ నేతలు నేరుగా సోనియాగాంధీకి ఫిర్యాదులు చేశారు. ఇటీవల పార్టీని వీడిన మర్రి శశిధర్‌రెడ్డి ఆయా అంశాలను ప్రస్తావిస్తూ సుదీర్ఘ రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపారు. తర్వాత కొందరు సీనియర్ నేతలు కూడా ఫ్యాక్స్, ఈమెయిళ్ల ద్వారా పలు అంశాలను సోనియా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె ఈ వ్యవహారం ఏమిటో పరిశీలించాలని ఖర్గేకు సూచించినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఏడాదిన్నరగా కాంగ్రెస్ పరిస్థితిపై ఆయన నివేదిక తెప్పించుకున్నట్టు తెలిసింది. సాంప్రదాయ ఓటు బ్యాంకు ఏమైంది? 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 24 శాతం, 28.5 శాతం ఓట్లు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 29.5శాతం వచ్చాయి. ఉంది. తర్వాత జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలో 48శాతం, నాగార్జునసాగర్‌లో 42శాతం ఓట్లు సాధించగలిగింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు బ్యాంకు 35 శాతం నుంచి ఒక్క శాతానికి పడిపోయింది. మునుగోడులోనూ 49శాతం నుంచి 6 శాతానికి తగ్గిపోయింది. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక భారీ బహిరంగ సభలు నిర్వహించినా పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు ఎందుకు పడిపోయిందన్న దానిపై అధిష్టానం ప్రస్తుతం దృష్టి పెట్టింది. ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమవడం, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుండటంపై కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన చెందుతోంది. దీనిపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల సమీక్షించారు. పార్టీని చక్కదిద్దే పనిలో భాగంగా ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ ఇటీవల భేటీ అయ్యారు. సీనియర్ల మధ్య సమన్వయ లేమి, ఇటీవల కొందరు సీనియర్లను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో సీనియర్లను టార్గెట్ చేస్తూ పెడుతున్న పోస్టులపైనా చర్చించినట్టు సమాచారం. ఉప ఎన్నికల్లో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలు పనిచేయడకపోవడం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణలోని ఒక్కో ఉమ్మడి జిల్లాలో రెండేసి నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ పటిష్టంగా ఉందని.. మిగతాచోట్ల మూడో స్థానంలో నిలిచే పరిస్థితి ఉందని.. దీనికి కారణమేమిటనే దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే.. తెలంగాణ సీనియర్లతో తాను మాట్లాడుతానని ఖర్గే పేర్కొన్నట్టు తెలుస్తోంది. బీజేపీలోకి వలసలు మరింత పెరిగి నష్టం జరగకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఖర్గే భావిస్తున్నట్టు సమాచారం. మాణిక్యం ఠాగూర్‌ను తప్పించే యోచన? ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు సీనియర్లు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌పై వరుసగా ఫిర్యాదులు చేస్తుండటాన్ని ఏఐసీసీ పెద్దలు పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆయనను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్టు సమాచారం. ఆయనను ఒడిశా రాష్ట్ర ఇన్చార్జిగా పంపుతారనే ప్రచారం జరుగుతోంది. -
రేవంత్ ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమవుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. పార్టీలో ఏ పరిణామం జరిగినా పీసీసీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని చెప్పారు. పార్టీని నడిపించడంలో రేవంత్ ఫెయిల్ అయ్యాడని, ఆయనతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, తాను కూడా ఫెయిలేనని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా.. ప్రజా సమస్యలపై పోరాడే శక్తి ఉన్నా.. వ్యవస్థ బాగోలేదని, అంతా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న పది మంది కూడా ఒక్క దగ్గర కూర్చునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ వన్‌మ్యాన్ షో ప్రయత్నం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇంట్లో కూర్చుని జూమ్ సమావేశాలు పెడితే సరిపోదని.. పీసీసీ అధ్యక్షుడు గ్రామగ్రామానికి వెళ్లాలని పేర్కొన్నారు. రేవంత్ పాదయాత్రతో వన్ మ్యాన్ షో చేద్దామనుకుంటున్నారని, అలా చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. గతంలో వారానికో మీటింగ్ అని చెప్పారని, పీసీసీ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయని ప్రశ్నించారు. పీసీసీ, సీఎల్పీ మధ్య సమన్వయం లేదని, ఈ విషయంలో ఇన్చార్జిది కూడా తప్పేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని తాను చెప్పబోనన్నారు. అయితే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే మెడిసిన్ తన దగ్గర ఉందని, భవిష్యత్తులో తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఆ మందు బయటకు తీస్తానని పేర్కొన్నారు. నేతలు వెళ్తుంటే ఏం చేస్తున్నారు? శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటం పార్టీకి నష్టమని, ఇందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ సంస్థాగత ఇన్చార్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యత వహించాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. శశిధర్‌రెడ్డి పార్టీ వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడితే ఈ ముగ్గురూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత రేవంత్, భట్టి ఏం చేస్తారని నిలదీశారు. టీఆర్ఎస్, బీజేపీ బయట వాళ్ల ఆట వారు ఆడుతుంటే.. రేవంత్, భట్టి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ల ఆట ఆడుతున్నారని వ్యాఖ్యా నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తానొక్కడినే పనిచేశానని రేవంత్ చెప్పడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు. మునుగోడు ఓటమి బాధ్యతల నుంచి రేవంత్ తప్పించుకోలేడన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అన్ని ఖర్చులు తానే పెట్టుకుంటానని రేవంత్ చెప్పాడని.. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ చెరో రూ.100 కోట్లు పెడితే, రేవంత్ కనీసం రూ.50 కోట్లయినా ఖర్చు పెట్టి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. జనాల కాళ్లు మొక్కితే ఓట్లు పడే రోజులు పోయా యన్నారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత ఇద్దరూ పార్టీ నాయకులందరినీ పట్టించుకోకపోయినా, అసంతృప్తితో ఉన్న నాయకులతో అయినా మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీకి లేఖ రాశానని చెప్పిన జగ్గారెడ్డి.. ఆ లేఖ వివరాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. బీజేపీ, టీఆర్ఎస్లది కుక్కల కొట్లాట రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయని, వారిది కుక్కల కొట్లాట అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ అర్వింద్ రైతుల సమస్యలపై కొట్లాడుతున్నారా? ప్రజల సమస్యలు వదిలేసి సొంత దుకాణాలు పెట్టుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరినొకరు గిచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసేందుకే ఆట ఆడుతున్నారు’’అని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో కలకలం.. ఆరా తీసిన అధిష్టానం మునుగోడు ఉప ఎన్నిక, భారత్‌జోడో యాత్ర, పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి నిష్క్రమణ తదితర అంశాలపై జగ్గారెడ్డి చేసిన వ్యా ఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. దీనిపై ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ ఆరా తీసి నట్టు తెలిసింది. శనివారం సాయంత్రం జగ్గారెడ్డికి ఫోన్ చేసిన ఆయన.. ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే అంశాలపై వివరణ కోరినట్టు సమాచారం. ఇక పార్టీ నేతలు జూమ్ సమావేశాలతో ఏం చేస్తారని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి.. శనివారం సాయంత్రం జూమ్ ద్వారా జరిగిన పీసీసీ కీలక సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. -
ప్రజాస్వామ్య హననానికి మోదీ నాయకత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు ప్రధాని మోదీ ముందుండి నాయకత్వం వహిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి పోరాటాన్ని కొనసాగించాలంటూ మోదీ చెప్పినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆదివారం ఆయన ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. ‘రూ.18 వేల బొగ్గు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ డబ్బులతో రాజగోపాల్‌రెడ్డి రూ.150 కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు రూ.4 వేలు పంచారు. టీఆర్ఎస్ రూ.5వేలిచ్చింది. ఇప్పుడు పోరాటం కొనసాగించాలని సాహిబ్ (మోదీ) చెప్తున్నారు. పోరాటం చేయడమంటే మరిన్ని మైనింగ్ కాంట్రాక్టులు, ఓటుకు ఎక్కువ డబ్బులు ఇవ్వడమా?’అని తన ట్వీట్లో మాణిక్యం ఎద్దేవా చేశారు. -
Telangana Congress: మాణిక్యమేనా.. మారుతారా? లైన్లోకి చిదంబరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూరే కొనసాగుతారా లేక కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో గతంలో నియమితులైన సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జులందరూ వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ పదవులన్నింటినీ మళ్లీ ఖర్గే భర్తీ చేయనున్నారు. అందులోభాగంగానే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి పదవికి మాణిక్యం ఠాగూర్ కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణకు కొత్త ఇంచార్జి వస్తారా లేదా మాణిక్యమే కొనసాగుతారా అనే చర్చ మొదలైంది. చిదంబరంకు ఇస్తారా? రాష్ట్ర పార్టీ ఇన్చార్జి బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకుంటారనే చర్చ చాలాకాలంగా పార్టీలో జరుగుతోంది. ఆయన తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా వెళ్లే అవకాశం ఉందని, ఆయన స్థానంలో కొత్తవారికి బాధ్యతలు ఇస్తారనే చర్చ ఉంది. అన్ని పదవులను భర్తీ చేసే అధికారం కొత్త అధ్యక్షుడు ఖర్గేకు కట్టబెడుతూ నేతలంగా రాజీనామా చేసిన నేపథ్యంలో మాణిక్యం ఠాగూర్‌ను మళ్లీ కొనసాగిస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. పార్టీలోని కొందరు ఆయన మళ్లీ కొనసాగుతారని, సంప్రదాయంలో భాగంగానే ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం గతం నుంచే ఆయన్ను మార్చాలనే ప్రతిపాదన ఉందని, అందువల్ల మార్పు జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. చదవండి: ఫామ్‌హౌజ్ ఘటన.. టీఆర్ఎస్పై కిషన్‌రెడ్డి కౌంటర్ ఎటాక్ రాష్ట్ర పార్టీ వ్యవహారాలను నేరుగా ప్రియాంకాగాంధీ పర్యవేక్షిస్తున్నందున ఆమె అభిప్రాయమే కీలకమవుతుందని, ఆమె సిఫారసును బట్టి ఖర్గే నిర్ణయం తీసుకుంటారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అయితే, కొందరు సీనియర్ నేతలు మాణిక్యం వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన్ను మార్చి చిదంబరం లాంటి సీనియర్‌కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని కూడా అంటున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరనుండటం, రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందనే అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో ఉన్న పరిస్థితుల్లో గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన సీనియర్‌ను పంపుతారనే చర్చ జరుగుతోంది. మరి, కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మాణిక్యం కొనసాగుతారా? లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది. -
మాణిక్య టాకుర్ తో స్ట్రెయిట్ టాక్
-
మీకో దండం ఠాగూర్ బాబు.. మమ్మల్ని వదిలి వెళ్లండి!
ఎవ్వరినీ నొప్పించకుండా.. కావాల్సిన పని జరిపించుకునేవాడే పార్టీ ఇన్చార్జ్. కానీ ఇక్కడి ఇన్చార్జ్ అందరి మీద కస్సు బుస్సులాడుతున్నారట. దీంతో పార్టీ నాయకులంతా ఈ ఇన్చార్జ్ మాకొద్దు. వెంటనే తీసేయమంటున్నారట. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్ మీద రాష్ట్ర నేతలకు అంత కోపం ఎందుకు వచ్చింది? కాంగ్రెస్‌లో ఇంఛార్జ్ అంటే మామూలు విషయం కాదు. తాను ఎంత చెబితే పార్టీలో అంత. ఒకప్పుడు గులాంనబీ అజాద్, ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ ఇలా.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎందరో సీనియర్ల కీ రోల్ పోషించారు. పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తే ఇంఛార్జ్ కలగజేసుకుని పరష్కరించేవారు. అయితే ఇప్పుడు టీ కాంగ్రెస్‌లో పరిస్థితి మారిపోయింది. ఇంఛార్జే సమస్యగా మారాడు అంటూ గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరినీ సముదాయించాల్సిన నేతే కనిపించినవారందరి మీదా కస్సుబుస్సులాడితే ఇక పార్టీలో పనులు ఎలా చేస్తారంటూ ప్రశిస్తున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలు ఉంటే పరిష్కారమయ్యేవిధంగా మాట్లాడాల్సిందిపోయి.. తానే ఆ వివాదాల్ని పెద్దవి చేస్తే పార్టీ ఎలా బలపడుతుందని కొందరు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (గుడివాడలో టీడీపీ నేతల ఓవరాక్షన్.. చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన మాగంటి బాబు) కొద్ది రోజుల క్రితం ఇంఛార్జ్ ఠాగూర్ అధ్యక్షతన గాంధీ భవన్లో జరుగుతున్న మీటింగ్‌కు.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు నేత వచ్చారట. రాష్ట్ర నాయకులకు ఢిల్లీ నుంచి వచ్చిన ఆ నేతను ఠాగూర్ పరిచయం చేస్తూ విమర్శించే విధంగా మాట్లాడారట. దీంతో అందరి ముందు నన్ను అవమానిస్తావా అంటూ ఆ నేత మీటింగ్ నుంచి బయటకు వచ్చి ఠాగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారట. ఆ తర్వాత ఏఐసీసీ కార్యదర్శి వెళ్లి సదరు నేతను సముదాయిస్తే కానీ ఠాగూర్ రాజేసిన చిచ్చు చల్లారలేదు. మునుగోడు ఉప ఎన్నికపై జరిగిన పార్టీ ముఖ్యనేతల మీటింగ్‌లో కూడా.. కాంగ్రెస్ గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తున్న నేతపై చమత్కార బాణాలు వేశారట ఠాగూర్. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ నేత ఠాగూర్ వ్యవహార శైలిని తప్పుపడుతూ మీటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయారట. ఆ తర్వాత ఒకరిద్దరు పార్టీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోకుండా ఆగ్రహంతో అక్కడి నుంచి నిష్క్రమించారట. దీంతో సీరియస్‌గా జరుగుతున్న మీటింగ్‌లో ఠాగూర్ సెటైర్లు వేయడం ఏంటని గాంధీభవన్‌లో చర్చలు జరుగుతున్నాయట. అందరిని కలుపుకొని పోవాల్సిన ఇంఛార్జ్ ముఖ్య నేతలపై సెటైర్లు వేస్తే వారు ఊరుకుంటారా? అందుకే మాకొద్దు ఈ ఇంఛార్జ్ అంటూ హైకమాండ్‌ను కోరుతున్నారట. చదవండి: (ఏలూరులో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలు.. ఇద్దరికి తీవ్రగాయాలు) -
టార్గెట్.. 76 వేల ఓట్లు
చౌటుప్పల్ రూరల్: ‘మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు 90 రోజులకుపైగా సమయం ఉంది. రెండు బూత్‌లకో ఇన్చార్జిని, పది బూత్‌లకో క్లస్టర్ ఇన్చార్జిని, మండలానికో టీపీసీసీ నేతను పెట్టాం. వచ్చే వారం రోజుల్లో గ్రామాలవారీగా తిరగాలి. 25 మంది సభ్యులతో బూత్ కమిటీని వేయాలి. అందులోంచి ఇద్దరు యువకులను గుర్తించాలి. వారి సాయంతో ఓటరు లిస్టు ఆధారంగా కాంగ్రెస్ కుటుంబాలను గుర్తించాలి. కనీసంగా బూత్‌కు 254 ఓట్లను సాధించాలి. ఈ లెక్కన మునుగోడులో మొత్తంగా 76 వేల ఓట్లువస్తే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది’అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో మంగళవారం టీపీసీసీ సమీక్షా సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావేద్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జె.గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ, సంపత్‌కుమార్, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, అంజన్‌కుమార్‌యాదవ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, పాల్వాయి స్రవంతితో పాటు 107మంది బూత్ ఇన్చార్జిలతో ఉప ఎన్నికపై సమీక్షించారు. కాంగ్రెస్ ఓటర్లను గుర్తించాలి.. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఉప ఎన్నికలకు 22 రోజుల గడువు మాత్రమే ఉండే. అక్కడ కూడా ఇలాగే పనిచేసినం. 26వేల ఓట్లు వచ్చాయి. కానీ, ఆరు బూతుల్లోనే మెజారిటీ ఓట్లు సాధించినం. ఆ బూత్ ఇన్చార్జులకు తగిన గుర్తింపునిచ్చాం, పార్టీ పదువులిచ్చినం. మునుగోడులోనూ పనిచేసిన వారికి గుర్తింపునిస్తాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌కు 76వేల ఓట్లు వచ్చాయి. బూత్‌కు కనీసంగా 254 ఓట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ నెల 18 నుంచి బూత్ ఇన్‌చార్జులంతా కార్యక్షేత్రంలోకి దిగాలి. బూత్‌లవారీగా కాంగ్రెస్ ఓటర్లను గుర్తించాలి. వారం రోజుల్లోగా ఇదంతా పూర్తి చేయాలి. ఈ నెల 25న మరోసారి మండలాల వారీగా సమీక్షిస్తాం. కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించి వెళ్లిపోయిన రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ది చెప్పాలి. రాష్ట్రంలో 13రోజుల పాటు సాగే రాహుల్‌గాంధీ జోడో యాత్రను విజయవంతం చేయాలి’అని ఠాగూర్ కోరారు. సమావేశంలో ఇంకా టీపీసీసీ నాయకులు విజయరమణారావు, గండ్ర సత్యనారాయణ, అనిల్‌కుమార్, ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
80 లక్షల ఓట్లు.. 78 స్థానాల్లో గెలుపు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది.. రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో 41 లక్షల మంది పార్టీ సభ్యులుగా చేరారు. 42 వేల మంది క్రియాశీల సభ్యులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాకు 80 లక్షల ఓట్లు వస్తాయి. 78 స్థానాల్లో విజయం సాధిస్తాం.టీఆర్ఎస్ను ఓడించే సత్తా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..’అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బుడగలాంటిదని, ఆ పార్టీకి డబుల్ డిజిట్ రాదని, సింగిల్ డిజిట్‌కే పరిమితమని చెప్పారు, తెలంగాణ సమాజం బీజేపీని ఎప్పటికీ అంగీకరించదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే పార్టీ అభ్యర్థి ఖరారు కోసం ప్రియాంకాగాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రానికి వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్ర ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు, ప్రియాంకా గాంధీ రంగ ప్రవేశం, రాష్ట్ర కాంగ్రెస్‌లో తన పాత్ర గురించి విపులంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బీజేపీకి భవిష్యత్తు లేదు బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు క్యూ కడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. బీజేపీలోకి వెళుతున్న నేతలు కాంగ్రెస్ పార్టీలో నిరర్ధక ఆస్తుల్లాంటి వారు. వారు వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదు. బీజేపీ అంటేనే అల్లర్లు సృష్టించడం... బీజేపీ అంటేనే అస్థిరత అనే భావనలో తెలంగాణ ప్రజలున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తే లేదు. మేమొస్తే కొంగొత్త తెలంగాణ.. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారు. బంగారు తెలంగాణలో బంగారం కేసీఆర్ కుటుంబానికి వెళితే తెలంగాణ మాత్రమే ప్రజలకు మిగిలింది. రాష్ట్రంలో మేం అధికారంలోకి వస్తే కొంగొత్త తెలంగాణను ఏర్పాటు చేస్తాం. యువకులు, రైతులు, మహిళలకు అవసరమైన సురక్షిత ప్రగతిశీల తెలంగాణ కోసం కృషి చేస్తాం. మునుగోడులో విజయం మాదే.. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రజల కోసం బీజేపీలోకి వెళ్లలేదు. కాంట్రాక్టుల కోసం వెళ్లారు. అక్కడ పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యనే జరుగుతుంది. టీఆర్ఎస్తో పాటు రాజగోపాల్‌రెడ్డిపై కూడా అక్కడ వ్యతిరేకత ఉంది. కుటుంబంలో కలహాలు కామన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఓ కుటుంబం లాంటిది. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు, కలహాలు సర్వసాధారణం. అయినా ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు. అలా మాట్లాడిన వారు కూడా మా కుటుంబ సభ్యులే. అందులో వాస్తవం లేదు.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని అధిష్టానం సులువుగా నిర్ణయించలేదు. అన్ని విధాలా సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంది. నేను ఆయనకు అనుగుణంగా వ్యవహరిస్తున్నానని అనడంలో వాస్తవం లేదు. కొందరికి కొన్ని లక్ష్యాలుంటాయి. వారు వారి లక్ష్యాల కోసం అనేకం మాట్లాడుతుంటారు. వాటితో నాకు సంబంధం లేదు. ధోని కెప్టెన్‌గా ఉన్న భారత క్రికెట్ టీంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ కూడా సభ్యులుగా కొనసాగిన విషయాన్ని అందరూ గ్రహించాలి. మోదీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అప్పుడే పార్టీ నుంచి పంపించేద్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. వెంకట్‌రెడ్డితో నాకు ఎలాంటి విభేదాల్లేవు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో ఇద్దరం కలిసి బిర్యానీ కూడా తిన్నాం. అద్దంకి దయాకర్‌నే కాదు, పార్టీ నుంచి ఎవరినీ సస్పెండ్ చేసే ఆలోచన లేదు. అధిష్టానానికి, రాష్ట్ర కాంగ్రెస్‌కు మధ్య వారధిని.. పార్టీ అధిష్టానానికి, రాష్ట్రంలోని సీనియర్లకు మధ్య నేను అడ్డుగోడగా నిలబడ్డానన్న దాంట్లోనూ వాస్తవం లేదు. నేను అధిష్టానానికి, తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు మధ్య వారధిని. నేను హోమియో డాక్టర్‌ను కాను. సర్జరీ చేయడానికి వచ్చిన సర్జన్‌ను. నేను స్టార్ హోటల్లో ఉండే ఇన్చార్జిని కాను. సెకండ్ క్లాస్‌లో ప్రయాణించి 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉండే సోనియాగాంధీ ప్రతినిధిని. నేను తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలో, తెలంగాణ ఇన్చార్జిగా ఉండాలో సోనియాగాంధీ నిర్ణయిస్తారు. ఆమె ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే.. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణను చాలా కీలకంగా భావిస్తోంది. అందుకే రాహుల్ ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టారు. వచ్చే నెలలో 14 రోజుల పాటు దాదాపు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. తాజాగా ప్రియాంకాగాంధీ కూడా రంగంలోకి వచ్చారు. ఆమె కూడా రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే. -
సాగదీయొద్దు.. సాగనంపుదాం!
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య వైరాన్ని మరింత పెంచుతున్నట్లే కనబడుతోంది. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది మొదలు మొన్నటి హోంగార్డు వ్యాఖ్యల వరకు అన్నింటినీ సమర్ధిస్తూ వస్తున్నారంటూ తనపై విమర్శలు గుప్పిస్తున్న వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సాగనంపేందుకు మాణిక్యం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఢిల్లీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వద్ద సోమవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల భేటీలోనూ వెంకట్‌రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగానే వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపే విషయమై మాణిక్యం కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడారని కాంగ్రెస్‌లోని అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి. భేటీ సందర్భంగా ప్రియాంకతో ప్రత్యేకంగా మాట్లాడిన మాణిక్యం ‘వెంకట్‌రెడ్డికి పీసీసీ రాలేదన్న అక్కసును తొలి నుంచి వెళ్లగక్కుతున్నారు. నాపైనా విమర్శలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వైఖరితో కేడర్‌లో తీవ్ర అయోమయం నెలకొంటోంది. పీసీసీ అధ్యక్షుడు నిర్వహిస్తున్న భేటీలకు ఆయన హాజరుకావడం లేదు. ఇంకా ఉపేక్షిస్తే పార్టీకే నష్టం. ఆయన పార్టీని వీడాలనుకుంటే వీడనిద్దాం’అని అన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వెంకట్‌రెడ్డి పార్టీలో ఉన్నా ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో నిలిచే సోదరుడు రాజగోపాల్‌రెడ్డి గెలుపునకే కృషి చేస్తారని, అది జరుగకుండా ఉండాలంటే వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి సాగనంపడమే మేలనే అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా పేర్కొంటున్నాయి. ప్రియాంక జోక్యంతో నేడు చర్చలు ఎంపీ కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అంశంపై చర్చ జరిగినా ప్రియాంక సహా కొందరు నేతలు తీవ్రంగా తప్పుపట్టినట్లు తెలుస్తోంది. సస్పెండ్ చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సానుభూతి పెరిగి అది రాజగోపాల్‌రెడ్డికి లాభం చేకూరుస్తుందని కొందరు చెప్పినట్లుగా సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్‌లను వెంకట్‌రెడ్డితో చర్చించేందుకు పంపాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలు బుధవారం ఆయనతో చర్చించే అవకాశాలున్నాయి. చర్చలు ఎందుకంటూ ప్రియాంక ముందే మాణిక్యం అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఇదే సమయంలో సీనియర్ నేతలతో సఖ్యత విషయంలో వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అందరినీ కలుపుకొనిపోవాలని రేవంత్‌కు ప్రియాంక చెప్పినట్లు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు వద్దని, సొంతపార్టీ నేతలపై వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తంగా ఉండాలని సూచించారని తెలిసింది. -
మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బైబై! సోనియాకు లేఖ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య వివాదం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవటంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘రేవంత్ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ నాశనమయ్యింది. ఆయనతో వేదిక పంచుకోలేకనే.. సమావేశానికి హాజరుకాలేదు. అనుచరులతో రేవంత్ అవమానకరంగా మాట్లాడిస్తున్నారు. మాకు ప్రాధాన్యత లేదు.. అందుకే మునుగోడు ప్రచారానికి వెళ్లను. మాణిక్కం ఠాగూర్‌ను తెలంగాణ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలి. ఆయన స్థానంలో కమల్‌నాథ్ లాంటి వాళ్లకు ఇన్‌ఛార్జ్‌గా ఇవ్వాలి. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.’ అని లేఖలో సోనియాకు ఫిర్యాదు చేశారు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి. ఇదీ చదవండి: పొలిటికల్ హీట్..హాట్ సీట్‌గా ఖమ్మం.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్? -
కాంగ్రెస్‌లో ముసలం: ‘కోమటిరెడ్డి’ బాటలోనే అనిరుధ్‌రెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. ‘నేర చరిత్ర కలిగిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌తో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేను.. ఆయనతో కలిసి వేదికను పంచుకోలేను’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు గురువారం జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ రాయడం కలకలం సృష్టించింది. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సొంత పార్టీ నాయకులు విమర్శలు గుప్పించడం.. దీటుగా ఆయన స్పందించడం.. ఆ తర్వాత పార్టీలో క్రమక్రమంగా అసమ్మతి సెగలు రాజుకోవడం వంటి తదితర పరిణామాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీ దూకుడు పెంచడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి విధేయుడిగా ఉన్న అనిరుధ్‌రెడ్డి లేఖ సంధించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఏడాదికిపైగా అనిశ్చితి.. మాజీ ఎమ్మెల్యే మరాఠి చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ గతేడాది జూలైలో బీజేపీని వీడారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన క్రమంలో ఆయనను కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జడ్చర్ల కాంగ్రెస్‌లో విభేదాలు గుప్పుమన్నాయి. నేరచరిత్ర కలిగిన ఎర్రశేఖర్‌ను పార్టీకి ఎలా చేర్చుకుంటారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధిష్టానానికి అప్పట్లో లేఖ రాయడంతో దుమారం చెలరేగింది. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో గతేడాది అక్టోబర్ 12న జరిగిన బహిరంగసభలో రేవంత్ సమక్షంలో చేరాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది. చదవండి: (మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్) అనంతర కాలంలో శేఖర్‌పై ఉన్న కేసును కోర్టు కొట్టివేయడంతో కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైంది. ఈ ఏడాది జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో రేవంత్‌రెడ్డి తదితర నేతల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత అటు అనిరుధ్‌రెడ్డి, ఇటు ఎర్రశేఖర్ వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపట్టిన దీక్షలో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క గత నెల 22న మహబూబ్‌నగర్‌కు వచ్చినప్పుడు ఆ ఇద్దరు వేర్వేరుగానే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా సుమారు ఏడాదికి పైగా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. సయోధ్య కుదిరినట్లేనని భావించినా.. తొలి నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు కోమటిరెడ్డి ద్వారా ఎర్రశేఖర్ రాకను అనిరుధ్‌రెడ్డి అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో రెండు నెలల క్రితం అమెరికాలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) సభలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో పాటు అనిరుధ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరిగాయని.. సయోధ్య కుదిరినట్లేనని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అనిరుధ్‌రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాయడంతో మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. చదవండి: (కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు?) టీడీపీ వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నారంటూ.. ‘పార్టీకి ఎవరూ అండగా లేని రోజుల్లో తాను శ్రమించానని.. కాంగ్రెస్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీలోకి దించి గెలిపించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించానని.. కానీ తన అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎర్రశేఖర్‌ను పార్టీలోకి తీసుకున్నారు.’ అని లేఖలో అనిరుధ్‌రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చే వాళ్లకు ప్రాభవం లేకున్నా ప్రాధాన్యం ఇస్తున్నారని.. సీత దయాకర్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరుతున్నారని.. మొదటి నుంచి ఉన్న మాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సమంజసం కాదని.. తాను స్థానికుడిని అని ఏదిఏమైనా కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడుతానని, పార్టీ టికెట్ రాకున్నా పోటీలో ఉంటానని’ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘కోమటిరెడ్డి’ బాటలోనే అనిరుధ్‌రెడ్డి నడుస్తారా అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అనిరుధ్‌రెడ్డి లేఖపై కాంగ్రెస్‌లోని పలువురు నేతలు మండిపడుతున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి బంగ్ల రవి, ఎంపీటీసీల సంఘం నాయకుడు రాంచంద్రయ్య, నాయకులు రాజేశ్ తదితరులు నవాబ్‌పేటలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన తీరును ఖండించారు. అనతి కాలంలోనే ప్రజలకు చేరువ కావడంతోనే జీర్ణించుకోక ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరింతగా భగ్గుమనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మర్రి శశిధర్‌రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందన
-
మన మునుగోడు.. మన కాంగ్రెస్.. ఉప ఎన్నికలో ఇదే నినాదంతో
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్ని కలో ‘మన మునుగోడు–మన కాంగ్రెస్’నినా దంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మునుగోడు ఉప ఎన్నిక డిసెంబర్ రెండో వారంలో జరుగుతుందని అంచనా వేస్తు న్న ఆ పార్టీ నేతలు, దానికోసం 100 రోజుల కార్యాచరణను రూపొందించారు. ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి పురస్కరించుకుని నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో ఒకేసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కనీసం 30 వేల కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసేలా ప్రణాళిక రూపొందించారు. డిసెంబర్లో రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర కూడా జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంతో ఉప ఎన్నికను ఎదుర్కోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మాణిక్యం వరుస భేటీలు మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ బుధవా రం గాంధీభవన్‌లో వరుస సమావేశాలు నిర్వహించారు. ముందుగా నియోజకవర్గంలోని పార్టీ మండల ఇన్చార్జులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత గ్రామాల వారీగా నియమించిన సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించా రు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన ఠాగూర్.. ఆజాదీ గౌరవ్ యాత్ర, ధరల పెరుగుదలపై ఆందోళనల గురించి చర్చించారు. ఆజాదీ గౌరవ్ యాత్ర ను విజయవంతంగా నిర్వహించిన జిల్లా అధ్యక్షులను కండువాలు కప్పి సన్మానించా రు. అనంతరం పలువురు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. గతంలో ఉమ్మడి నల్ల గొండ జిల్లా ఇన్చార్జిగా పనిచేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, మాజీమంత్రి వినోద్‌తో ఉప ఎన్నికపై చర్చించారు. ప్రియాంక కోసం ఎదురు చూస్తున్నాం రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జిగా ప్రియాంక వస్తే స్వాగతిస్తామని, ఆమె రాక కోసం తాము కూడా ఆత్రుతతో ఎదురుచూస్తున్నామని మాణిక్యం ఠాగూర్ చెప్పారు. గ్రామ సమన్వయకర్తలతో సమావేశం అనంతరం ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్‌లతో కలిసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రియాంక ఇప్పటికే తెలంగాణ వ్యవహారాలపై దృష్టి సారించారని, ఇటీవల పార్టీ చేరికల్లో కూడా ఆమె క్రియాశీలకంగా పాలుపంచుకున్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేస్తామంటూ.. 100 రోజుల కార్యాచరణ, ఇతర అంశాలు వివరించారు. పలు రూపాల్లో ప్రచారం నిర్వహిస్తామన్నా రు. అందరితో కలిసి ముందుకు వెళ్తామని, అవసరమనుకున్నప్పుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సహా అందరు ముఖ్య నేతలు ఎన్నికల్లో పాలు పంచుకుంటారని చెప్పారు. కాళేశ్వరం చూపించేందుకు భయమెందుకు? సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల బృందం ప్రాజెక్టుల సందర్శనకు వెళితే అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని మాణిక్యం పేర్కొన్నారు. అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పుకునే కాళేశ్వరంను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. పోలీసుల నిర్బంధకాండను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తాను రాష్ట్ర పార్టీకి సోనియాగాంధీ ప్రతినిధినని, ఎవరి ఏజెంట్‌ను కానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వదంతులకు, బీజేపీలోకి వెళ్లిన, వెళ్లాలనుకుంటున్న నాయకులు చేసే ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. చదవండి: కులమతాల పేరిట దేశాన్ని విడదీయటం మంచిది కాదు -
మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్
సాక్షి, హైదరాబాద్: ఠాగూర్ రేవంత్‌రెడ్డికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారంటూ మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పందించారు. నేను సోనియాకు మాత్రమే ఏజెంట్‌ని, ఇంకెవరికీ ఏజెంట్‌ను కాదని తెలియజేశారు. ఈ మేరకు ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చాలా మంది సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీకి నాయకులు కాదు.. పార్టీనే ముఖ్యం. టీపీసీసీ చీఫ్ కెప్టెన్ మాత్రమే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు మంచి మిత్రుడు. ఇంటికి పిలిచి మరీ బిర్యానీ పెట్టాడు. బీజేపీలో చేరిన వాళ్లే నాపై ఏదైనా మాట్లాడతారు. తెలంగాణలో పార్టీ పరిస్థితుల్ని సోనియా, రాహుల్, ప్రియాంక తెలుసుకుంటున్నారు. ప్రియాంక గాంధీ తెలంగాణకి వస్తా అంటే వెల్కమ్ చెప్తాను. ఇక్కడ నుంచి పోటీచేయాలని రాహుల్, ప్రియాంకను రిక్వెస్ట్ చేస్తే వాళ్లు ఆలోచిస్తారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా ప్రియాంక గాంధీ వస్తే సంతోషమేనని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. చదవండి: (కాంగ్రెస్‌లో ట్విస్ట్.. రేవంత్ రెడ్డికి ఊహించని షాకిచ్చిన మర్రి శశిధర్ రెడ్డి) -
మునుగోడుపై సర్వేల ఎఫెక్ట్.. స్పీడ్ పెంచిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత పాలిటిక్స్ మొత్తం మునుగోడుపైనే చర్చిస్తోంది. రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే పార్టీలు అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మునుగోడులో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ కీలక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నిక అంశంపై కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సెక్రటరీలతో మంగళవారం రాత్రి ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సమావేశమయ్యారు. సర్వే నివేదికల ఆధారంగా నేతల అభిప్రాయాలపై సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. గాంధీభవన్‌లో బుధవారం కూడా మాణిక్యం ఠాగూర్.. కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఉదయం మునుగోడుకు సంబంధించి స్ట్రాటజీ కమిటీని నియమించింది. ఈ కమిటీలోని సభ్యులతో బుధవారం ఉదయం ఠాగూర్ సమావేశం కానున్నారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా ఠాగూర్ భేటీ కానున్నారు. అయితే, ఈ వరుస భేటీల్లో మునుగోడుపైనే చర్చించనున్నట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో ఆయన వెంటనే ఎంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారు, పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇక, మునుగోడు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ఇన్చార్జీలను నియమించి ఈ నెల 20వ తేదీన ప్రతీ గ్రామంలో పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక, గురువారం కూడా ఠాగూర్ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. అయితే, ఈ సమావేశాల్లో టీపీసీసీ రేవంత్ రెడ్డి పాల్గొనడం లేదు. కరోనా కారణంగా కాంగ్రెస్ సమావేశాలకు రేవంత్ దూరంగా ఉన్నారు. ఇది కూడా చదవండి: జనగామలో హై టెన్షన్.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ -
Telangana: రిపోర్టింగ్ టు ప్రియాంక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలపై అధిష్టానం దృష్టి సారించింది. టీపీసీసీ నేతల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాలను పరిష్కరించి అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు పార్టీ ఇన్చార్జి కార్యదర్శిగా ఇటీవల నియమించిన నదీమ్ జావేద్‌ను రంగంలోకి దింపింది. దీంతో గత రెండు రోజులుగా పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన అందులో భాగంగా సోమవారం టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో దాదాపు రెండున్నర గంటలపాటు భేటీ అయినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీతోనూ నదీమ్ జావేద్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ బలోపేతం కోసం నదీమ్ జావేద్ పాదయాత్రలు, బస్తీ పర్యటనలు చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ నేతల ఫీడ్‌బ్యాక్‌ను ఆయన నేరుగా ప్రియాంక గాంధీకి అందిస్తుండటం గాంధీ భవన్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే సీనియర్లందరితో కలసి బస్సు యాత్రను జావేద్ ప్రతిపాదించారని, దీన్ని అధిష్టానం పరిశీలిస్తోందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. మాణిక్యంపై నివేదిక? ఇటీవలి వరకు ఏఐసీసీ కార్యదర్శి హోదాలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన శ్రీనివాస కృష్ణన్ అధిష్టానానికి కీలక నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. తనను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరిన ఆయన ఇప్పుడు పార్టీ వ్యవహారాలకే దూరంగా ఉంటున్నారు. తాను వెళ్లిపోయే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలి, నేతల బలాబలాలు, ఆయా నాయకుల వ్యూహాలు, ప్రాధాన్యతలపై నివేదిక ఇచ్చారని, దీన్ని పరిశీలించాకే తెలంగాణపై దృష్టి పెట్టే బాధ్యతను ప్రియాంకకు అధిష్టా్టనం అప్పజెప్పిందనే చర్చ ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. నేడు వరుస భేటీలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన బుధవారం గాంధీ భవన్లో వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం మండలాలవారీగా నియమించిన ఇన్చార్జులతో ముందుగా భేటీ కానున్న ఆయన... ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గంలో పర్యటించే 175 గ్రామాల సమన్వయకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ కార్యక్రమాల అమలు, ఆజాదీ గౌరవ్‌యాత్రలు, ఇతర అంశాలపై డీసీసీ అధ్యక్షులతోనూ సమావేశం కానున్నారు. ఏఐసీసీ కార్యదర్శులుగా నియమితులైన నదీమ్ జావేద్, రోహిత్ చౌదరిలతో కూడా ఠాగూర్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. -
‘మునుగోడు’కు మండలాల వారీ ఇన్చార్జులు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఒక్కో మండలానికి ఇద్దరు కీలక నేతలను కేటాయించింది. ఆయా మండలాలను పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించనుంది. ఇటీవల గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను మొత్తం 14 మందికి బాధ్యతలను అప్పగించనుంది. మునుగోడు ప్రచార కమిటీ కన్వీనర్ మధుయాష్కీగౌడ్ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇంచార్జులుగా బాధ్యతలు తీసుకున్న నాయకులు పూర్తి స్థాయిలో ఆయా మండలాల్లోనే మకాం వేస్తారని, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి పూర్తయ్యేంతవరకు పర్యవేక్షిస్తారని తెలిపాయి. -
Telangana Congress: మాణిక్యం ఠాగూర్ ఔట్.. ప్రియాంక ఇన్..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌ను త్వరలోనే మార్చే ఆలోచనలో ఏఐసీసీ వర్గాలు ఉన్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికకు ముందే మాణిక్యం ఠాగూర్ స్థానంలో ప్రియాంక గాంధీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. వారం రోజుల్లో టి.కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఏఐసీసీ అధిష్టానం ఇప్పటికే ఇద్దరు సెక్రటరీలను మార్చింది. చదవండి: (రేవంత్ బహిరంగ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్ ఏంటంటే..) అయితే గత కొద్దిరోజులుగా అనేక మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఠాగూర్ ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయేటపుడు ఠాగూర్, రేవంత్‌లపై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే అధిష్టానం ఇంచార్జి మార్పు అనివార్యంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: (Revanth Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ) -
కోమటిరెడ్డి ‘బ్రదర్స్’ ఎఫెక్ట్.. రేవంత్‌పై ఢిల్లీ పెద్దలు సీరియస్!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ప్రకటన అనంతరం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనను అనవసరంగా రెచ్చగొట్టొద్దని, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ ఇంతవరకు రేవంత్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆయన్ను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నట్టు వెంకట్‌రెడ్డి సన్నిహితవర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ స్పందించకపోవడాన్ని కూడా వెంకట్‌రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తనను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన కొందరు కాంగ్రెస్ నేతల వద్ద సైతం ఆయన రేవంత్ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో తప్పుపట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్న తనను, తన కుటుంబాన్ని అవమాన పరిచేలా రేవంత్ మాట్లాడినా, మాణిక్యం ఠాగూర్ తప్పుపట్టకపోవడాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రేవంత్‌తో లాభం ఏమీ ఉండదు! పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను నియమించాక ఆయన వ్యవహారం అంతా వివాదాస్పదంగానే ఉందని, సీనియర్లను కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారని, ఆయనతో పార్టీకి నష్టం తప్పితే, ఒనగూరే లాభం ఏమీ ఉండదని సన్నిహితుల వద్ద వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అనేక చోట్ల పార్టీల్లో గ్రూపులు ప్రోత్సహించడం, హైకమాండ్ నిర్ణయాలకు విరుద్ధంగా అభ్యర్థులను ప్రకటించడం, నేతలెవరికీ అందుబాటులో ఉండక పోవడం, మాణిక్యం ఠాగూర్‌తో చేసుకున్న చీకటి ఒప్పందాలతో పార్టీ పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని అన్నట్టు చెబుతున్నారు. రేవంత్ తీరుపై అసంతృప్తితో ఉన్న ఐదారుగురు సీనియర్ నేతలతో మాట్లాడిన సమయంలో వారూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. పార్టీ ఏ పని అప్పగిస్తే ఆ పని నిర్వర్తించేందుకు సిద్ధమని ప్రకటించాక కూడా రేవంత్ క్షమాపణ చెప్పకపోవడాన్ని సీనియర్లు తప్పుపట్టినట్లు చెబుతున్నారు. రేవంత్‌పై అధిష్టానం ఆగ్రహం? కోమటిరెడ్డి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు, తాజాగా కోమటిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, సీనియర్లను కలుపుకొని మునుగోడులో విజయంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తమ్ముడి రాజీనామాతో(కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి) సంబంధం లేదు.. నా తమ్ముడి రాజీనామాతో నాకు సంబంధం లేదు. కాంగ్రెస్‌కు విధేయుడిగా, పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తా. నేను పార్టీ మారతానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా కుటుంబంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని మీడియాతో వెంకట్‌రెడ్డి చెప్పారు. ఇది కూడా చదవండి: ఆ విషయంలో బీజేపీ వెనుకంజ! -
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. వేకువజామున 4 గంటలకు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచినట్టు కనిపిస్తోంది. నేరుగా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూరే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే తాను బస చేస్తున్న హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆయన బయటకు వెళ్లడం సంచలనం రేపుతోంది. మాణిక్యం ఠాగూర్ ఎక్కడికి వెళ్లారు? ఆయన వెంట ఎవరెవరు ఉన్నారని ఇప్పుడు పార్టీలోని సీనియర్ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వేకువజామున 4 గంటల ప్రాంతంలో మాణిక్యం ఠాగూర్ ఒక్కరే బయటకు వచ్చి ఓ కారులో వెళ్లినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ కారులో పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్ సునీల్ కనుగోలు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిద్దరు కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, చేరికల కమిటీ చీఫ్, మాజీ మంత్రి జానారెడ్డిని కలిసినట్టు చర్చించుకుంటున్నారు. ఈ నలుగురు కలిసి ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారన్నది మాత్రం బయటకు పొక్కనీయ లేదు. ఏ పార్టీ నేతను కలిశారు? రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే మాణిక్యం ఠాగూర్, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, సునీల్ కనుగోలు కలిసి అధికార టీఆర్ఎస్కు చెందిన నేతల ఇంటికి వెళ్లి ఉంటారా? ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న వారిని టార్గెట్ చేసి తీసుకువచ్చేలా ఆ పార్టీ నేతతో చర్చించారా అన్నది తేలలేదు. అయితే మరికొందరు మాత్రం బీజేపీలోని ఓ సీనియర్ నేత ఇంటికి వెళ్లి ఉంటారంటున్నారు. చాలారోజులుగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు వెళ్లి ఉంటారని అంటున్నారు. అంతా రహస్యంగా... సాధారణంగా మాణిక్యం ఠాగూర్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలన్నీ పార్టీ ప్రొటోకాల్ విభాగం చూసుకుంటుంది. ఆయన ఎవరిని కలవాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ప్రొటోకాల్ విభాగం నేతలు ఏర్పాట్లు చేస్తారు. కానీ ఆదివారం తెల్లవారు జామున 4 నుంచి 11 గంటల మధ్య మాణిక్యం ఠాగూర్ ప్రొటోకాల్ విభాగానికి అందుబాటులో లేరని సమాచారం. ఆ ఏడు గంటలు ఎక్కడికి పోయారన్న విషయం ఆసక్తి రేపుతోంది. ఇంత రహస్యంగా ఏ స్థాయి నేతను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. -
ఆగస్టులో రాహుల్ సభ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రైతాంగానికి ఏం చేస్తామో చెప్తూ రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిరుద్యోగుల కోసం డిక్లరేషన్ ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మరోసారి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆగస్టు 21న సిరిసిల్లలో రాహుల్ సభ నిర్వహించే అవకాశముందని, అయితే తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ జరిగే భారీ బహిరంగసభలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఏఐసీసీ నుంచి సమాచారం అందిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో పొలిటికల్ అఫైర్స్, రాష్ట్ర కార్యవర్గం, డీసీసీల సమావేశం జరిగింది. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ ఇన్చార్జి కార్యదర్శి బోసు రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అనంతరం మహేశ్‌కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ కల్పన అంశాలతోపాటు అనేక విషయాలను డిక్లరేషన్‌లో రాహుల్ ప్రకటిస్తారని తెలిపారు. ఈ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో గురించిన కొన్ని అంశాలను కూడా వెల్లడించే అవకాశాలున్నాయన్నారు. నేడు కాంగ్రెస్ నేతలకు విందు రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గం ఏర్పాటై ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్ క్లబ్లో పార్టీ నాయకులకు విందు ఏర్పాటు చేసినట్టు మహేశ్‌గౌడ్ తెలిపారు. పీఏసీ సభ్యులు, మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు.. ఇలా నేతలంతా ఒకచోట కలిసి మాట్లాడుకోవడానికిగాను ఈ విందు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతు డిక్లరేషన్‌లో ఉన్న అంశాలను రచ్చబండ ద్వారా 70 శాతం గ్రామాల్లో ప్రజలకు వివరించామని, అయితే డీసీసీల అభ్యర్థన మేరకు మరికొన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని పీసీసీ పొడిగించిందని చెప్పారు. అసమ్మతిపై హైకమాండ్ సీరియస్ రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందనే విషయం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అసమ్మతి నేతలు మీడియాతో మాట్లాడుతున్న వ్యవహారాన్ని ఏఐసీసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, ఇలాంటివాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని, ఇది పార్టీ అధిష్టానం హెచ్చరిక అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చెప్పినట్లు సమాచారం. పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదన్న అంశాలపై అధిష్టానానికి నివేదిక అందిన తర్వాతే పార్టీలోకి చేరికలు ఉంటున్నాయని, దీనిపై నేతలు ఇష్టారాజ్యంగా బహిరంగంగా మాట్లాడితే బహిష్కరణ వేటుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. అదే విధంగా రాహుల్ సభ తేదీలపై మరింత క్లారిటీ తీసుకోవాల్సి ఉందని, పార్లమెంట్ సమావేశాలు, ఇతర రాష్ట్రాల్లో రాహుల్ పర్యటనలను దృష్టిలో పెట్టుకొని తేదీలను ఫైనల్ చేయాల్సి ఉందని మాణిక్యం చెప్పినట్టు తెలిసింది. -
టిఫిన్‌కి జానారెడ్డి ఇంటికి.. లంచ్‌కి కోమటిరెడ్డి ఇంటికి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల తీరు కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. నాయకుల కీచులాటలు, పరస్పర విమర్శలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎప్పుడు.. ఏ నేత.. ఎవరిపై ఎలా మాట్లాడతాడో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. అప్పుడే బాగున్నట్టు కనిపిస్తారు.. అంతలోనే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తుంటారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఏకంగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చి గాంధీభవన్‌లో చేసిన సూచనలను సైతం గాలికొదిలేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నేతలందరినీ ఐకమత్యంగా ఉంచి ఒక గాడిలో పెట్టేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ముఖ్యనేతలు ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. టిఫిన్ అక్కడ.. లంచ్ ఇక్కడ.. డిన్నర్ మరోచోట.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో టిఫిన్‌కి ఆహ్వానించారు. అయితే ఇది ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమమా? లేక పార్టీ అంతర్గత నిర్ణయం ప్రకారం జరుగుతోందా.. అన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు. నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇది అని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇకపోతే లంచ్ ఏర్పాట్లు భువనగిరి ఎంపీ, పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో జరుగుతున్నాయి. మాణిక్యం ఠాగూర్‌తో పాటు ముఖ్య నేతలందరూ మధ్యాహ్న భోజనానికి అక్కడికి హాజరుకావాలన్న సమాచారం పార్టీ నుంచి వెళ్లినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమం కూడా ఐకమత్యం కోసమేనన్న టాక్ వినిపిస్తోంది. అలాగే పార్టీ కార్యవర్గం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డిన్నర్‌ను జూబ్లీహిల్స్‌లోని క్లబ్లో ఏర్పాటు చేశారు. దీనికి కూడా కీలక నేతలు, సీనియర్ నాయకులంతా హాజరవుతారు. కలరింగ్.. కవరింగ్.. అధిష్టానం నియమించిన ఇన్చార్జీల దగ్గరగానీ, వారు పాల్గొనే సమావేశంలో గానీ రాష్ట్ర నేతల కలరింగ్, కవరింగ్ ఒక స్థాయిలో ఉంటుందని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా కనిపిస్తుందని నేతలు చర్చించుకుంటున్నారు. తీరా ఇన్చార్జి నేతలు హైదరాబాద్ నుంచి విమానం ఎక్కగానే ఆ రోజు రాత్రి నుంచే కీచులాటలు, ఫిర్యాదుల పర్వం మొదలవుతుందని, ఒకరిపై ఒకరు దూషించుకోవడం చేస్తున్నారని పార్టీ అధిష్టానికి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. తాజాగా ఆదివారం జరగబోయే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. వ్యవహారాలు ఏ స్థాయిలో పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకువస్తాయన్నదానిపై కేడర్‌లో ఆసక్తి నెలకొంది. -
కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి: మాణిక్యం ఠాగూర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజుల రాహుల్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. ఆయన శని వారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ పర్యటనను సక్సెస్ చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిదేళ్ల పాటు టీఆర్ఎస్కు అధికారం ఇచ్చినప్పటికీ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందన్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. -
టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న ప్రచారం పూర్తి అవాస్తవమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. బీజేపీ, టీఆర్ఎస్లపై పోరాటం చేయడంలో కాంగ్రెస్ పార్టీ అంగుళం కూడా వెనక్కి తగ్గదని ఆయన ఆదివారం ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ తప్పుడు ప్రచారాలన్నీ ఆ రెండు పార్టీలే చేస్తున్నాయని తెలిపారు. తమ బలమేంటో మే 6న జరిగే వరంగల్ ప్రదర్శనలో నిరూపిస్తామని తెలిపారు. -
పోరాటాలు, యాత్రలపై దృష్టి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇందుకోసం పార్టీ ముఖ్యనేతలు వరుసగా రెండు రోజులపాటు సమావేశాలు జరుపుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీల్లో రాష్ట్రంలో రాహుల్ పర్యటన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు, పార్టీ నేతల యాత్రలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులోభాగంగా శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాణిక్యం ఠాగూర్‌తోపాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం, రాహుల్ పర్యటనపై రెండున్నర గంటల పాటు చర్చించారు. రాష్ట్రంలో పార్టీ సభ్యులుగా చేరిన 40లక్షల మందికి పైగా కార్యకర్తలకు బీమా అందేలా చూడాలని, ఇందుకోసం గాంధీభవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీఏసీ సభ్యులు, మాజీ మంత్రులు, పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులతో శనివారం సమావేశాలు నిర్వహించనున్నారు. 6, 7 తేదీల్లో రాష్ట్రానికి రాహుల్ వచ్చే నెల 6,7 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ రెండు తేదీల్లో ఆయన టూర్ దాదాపు ఖరారు కాగా, ఆయా తేదీలను నేడు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. రాహుల్ తన పర్యటనలో వరంగల్ రైతు బహిరంగసభలో పాల్గొనడంతో పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కుత్బుల్లాపూర్ లేదా ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ధాన్యంపై టీఆర్ఎస్, బీజేపీ డ్రామా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్, బీజేపీలు కలసి డ్రామా ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్ష పేరుతో రాజకీయ డ్రామా చేయాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. శనివారం ఏఐసీసీ కార్యాలయంలో మాణిక్యం ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం, డ్రామాలు చేయడంలో కేసీఆర్ మహాదిట్ట అని దుయ్యబట్టారు. పబ్లిసిటీ స్టంట్లకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు కోసం రూ.10 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులకు అండగా నిలబడుతుందని, ఈ అంశంపై మద్దతు ఇచ్చేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. -
కేసీఆర్ ఫ్రంట్ ఉత్తదే: కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్
నిర్మల్: బంగారు తెలంగాణ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు బంగారు భారత్ అంటూ దేశాన్ని దోచుకునేందుకు బయలుదేరారని, కేసీఆర్ ఫ్రంట్ ఉత్తదే నని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో డిజిటల్ సభ్యత్వ లక్ష్యాన్ని పూర్తిచేసిన కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన నిర్మల్‌లో సమావేశమయ్యారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏక్ పోలింగ్ బూత్–ఏక్ ఎన్‌రోలర్’లెక్కన డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మొత్తం 34,498 మంది ఎన్‌రోలర్స్‌ను నియమించామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 78 సీట్లు గెలువడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలౖపై పార్టీలోనే చర్చించుకోవాలి తప్పా బహిర్గతం చేయొద్దన్నారు. అవినీతి మంత్రులు బీజేపీలో చేరుతారు.. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని, ఢిల్లీలో ఒకమాట, గల్లీలో ఒకమాటగా మాట్లాడతారని ఠాగూర్ ఆరోపించారు. టీఆర్ఎస్ అవినీతి మంత్రులంతా రక్షణ కోసం బీజేపీలో చేరుతారని చెప్పారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లాలో చెరువులు, గుట్టలను కబ్జా చేశారని, డీ–వన్ పట్టాలతో ప్రభుత్వ భూములనూ బినామీల పేరిట చెరబట్టారని ఆరోపించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈ.అనిల్ పాల్గొన్నారు. -
మాణిక్యం ఠాగూర్ ముఖం చాటేశారా.?
-
బీజేపీ ఆలోచనలే కేసీఆర్ మాటలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరస నగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసన కార్య క్రమాన్ని చేపట్టారు. సోమవారం ఢిల్లీలోని పార్ల మెంట్ ఆవరణలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్‌లు ‘రాజ్యాంగాన్ని రక్షించండి– కేసీఆర్‌ను శిక్షించండి’ అంటూ ప్లకార్డులను పట్టు కుని ఆందోళన చేశారు. గిరిజన, దళిత, బలహీన వర్గాలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన రక్ష ణను, హక్కుల్ని తొలగించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే ఆ పార్టీ ఆలోచనలను కేసీఆర్ ద్వారా మాట్లాడించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యల అం శంలో రాష్ట్రపతి, ప్రధాని వెంటనే స్పందించి చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానాలు ఇస్తామన్నారు. పరిశీలనలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని కేంద్రం తెలిపింది. ఆర్థిక ఆమోదం కోసం ప్రస్తుతం ఈ ఫైల్ ఆర్థికశాఖ వద్ద ఉందని, వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించాక యూజీసీ నిధులు కేటాయిస్తుందని సహాయ మంత్రి సుభాష్ సర్కార్.. రేవంత్‌రెడ్డి ప్రశ్నకు బదులిచ్చారు. -
బీజేపీకి లేని కోవిడ్ ఆంక్షలు కాంగ్రెస్‌కేల?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు ద్వం ద్వ నీతిని పాటిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహా రాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. సంఘ్ పరివార్ సమావే శానికి 300 మంది నేతలు హాజరైతే వారికి రక్షణ కల్పించి మరీ అనుమతినిచ్చారని, తాము 120– 150 మంది నాయకులకు శిక్షణ కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి నిరాకరించారని శుక్రవారం ట్వీట్ చేశారు. ఢిల్లీలో దోస్తీ చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీ చేస్తున్నాయని అన్నారు. కాగా, మాణిక్యం ఠాగూర్ ట్వీట్‌పై రాష్ట్ర డీజీపీ స్పందించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సంఘ్ పరివార్ కార్య కర్తల సమావేశానికి అనుమతిచ్చి తమకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. -
సానుకూల పరిస్థితులున్నాయ్.. సమష్టిగా సాగుదాం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిస్థితులున్నాయి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని పలు సర్వేల్లో తేలింది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలి. అంతర్గత కలహాలకు అవకాశం ఉండకూడదు. టీపీసీసీ అధ్యక్షుడు అన్ని వర్గాల నాయకులను సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలి..’ అని టీపీసీసీ నేతలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ దిశా నిర్దేశం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాకెక్కి మాట్లాడితే సహించేది లేదని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధిష్టానం నిర్ణయించిందన్నారు. బుధవారం ఠాగూర్ అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జూమ్ యాప్ ద్వారా జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డితో పాటు కన్వీనర్ షబ్బీర్ అలీ, పీఏసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా ఈ భేటీలో ఏఐసీసీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ‘పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయాలి. కాంగ్రెస్ తలపెట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లాలి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నిత్యావసర సరు కుల ధరల పెరుగుదల అంశాలను ప్రజలకు వివరించాలి. ఈనెల 10నుంచి నిర్వహించే ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. జన జాగరణ పాదయాత్రలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా తప్పనిసరిగా నిర్వహించాలి. ఏఐసీసీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొని విజయవంతం చేయాలి..’ అని ఠాగూర్ పిలుపునిచ్చారు. మార్చి 31లోగా సభ్యత్వ నమోదు ‘సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగం పెంచాలి. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా నిర్దేశించాం. ఇప్పటివరకు 6 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి. మార్చి 31 నాటికి మిగతా లక్ష్యాన్ని పూర్తిచేయాలి. సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తకు రూ.2 లక్షల ప్రమాద బీమా వస్తుంది..’ అని తెలిపారు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జంగ్ సైరన్, దళిత దండోర, వరి దీక్షలు, కల్లాల్లో కాం గ్రెస్ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని అభినందించారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అన్ని స్థాయిల్లో క్రమశిక్షణ పాటించాలి. అంతర్గత కలహాలతో రచ్చకెక్కొద్దు. ఇబ్బందులు తలెత్తితే నాకు లేదా ఏఐసీసీ కార్యదర్శికి, లేదా సోనియాగాంధీకి లేఖ ద్వారా అభిప్రాయాలను తెలపాలి..’ అని సూచించారు. కాగా క్రమశిక్షణ కమిటీ పనితీరుపై పార్టీ సీనియర్లు వీహెచ్, పొన్నాల అసంతృప్తి వ్యక్తం చేశారు. జంగా రాఘవరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని వారు ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామని, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు చెప్పారు. ‘ఏఐసీసీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. వీటితో పాటు టీపీసీసీ తరఫున కూడా పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం..’ అని తెలిపారు. షబ్బీర్‌అలీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ కూడా మాట్లాడారు. వైఖరి నచ్చకుంటే తప్పుకుంటా: జగ్గారెడ్డి ఇటీవల రేవంత్‌రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టిన జగ్గారెడ్డి ఈ సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. తాను ఏం మాట్లాడిందీ, ఎందుకు మాట్లాడిందీ వివరించారు. ఒకవేళ తన వ్యవహారశైలి పార్టీ అధిష్టానానికి నచ్చకపోతే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పినట్లు తెలిసింది. సీనియర్ నేతలు జానారెడ్డి, శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని ఎవరూ తప్పుకోవాల్సిన అవసరం లేదని, కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేద్దామని అన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ లక్ష్యం.. 35 లక్షలు
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ కేడర్, నాయకులు పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలోని 35 లక్షల మందిని కాంగ్రెస్‌లో సభ్యులుగా చేర్పించాలి. ఈసారి మన బ్యాలెట్ బాక్సుల్లో 80 లక్షల ఓట్లు పడాలి. అప్పుడే మనం నిర్దేశించుకున్న 78 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. ఆ దిశలో పార్టీ కేడర్ ముందుకెళ్లాలి’అని ఆయన కోరారు. కాంగ్రెస్ రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరంలో భాగంగా మొదటిరోజు మంగళవారం కొంపల్లిలోని ఒయాసిస్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించుకుని పనిచేయాలని కోరారు. నేను గొప్ప అంటే నేనే గొప్ప అంటూ గొడవలు పెట్టుకోవద్దని, కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. నియోజకవర్గ ఇన్ చార్జీలను కొనసాగించబోమని.. బ్లాక్, మండల, నగర, పట్టణ, జిల్లా అధ్యక్షులే కలిసికట్టుగా పార్టీని నడిపిస్తారని చెప్పారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకే ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల కష్టం వల్లే నాయకులుగా తాము పదవులను అనుభవిస్తున్నామని, కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణ గీత దాటితే సహించేది లేదని హెచ్చరించారు. కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, పనిచేయని వారికి ఉద్వాసన తప్పదని అన్నారు. జనవరి 26 తర్వాత ఈ చర్యలు తీసుకోవడం మొదలుపెడతానని చెప్పారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన వారు చచ్చినవారితో సమానమని, కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుం టానని వెల్లడించారు. పేర్లు మార్చారని ఆందోళన: కాంగ్రెస్ సదస్సుకు జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి బ్లాక్, మండల అధ్యక్షులతో హాజరయ్యారు. అయితే.. అప్పటికే రాత్రికి రాత్రే బ్లాక్, మండల కమిటీలో పేర్లు వచ్చినవారు సదస్సుకు వచ్చా రు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాఘవరెడ్డి.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను నిలదీయడమే గాక ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసు కోవడం గమనార్హం. అయితే.. అందరితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని రేవంత్ వారికి హామీ ఇచ్చారు. తర్వాత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై రాఘవరెడ్డి వర్గం తీవ్ర విమర్శలు చేస్తూ వెళ్లిపోవడం కనిపించింది. శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్సే... దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చి పోతుం టాయి కానీ శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు.. కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేయగల శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని భట్టి చెప్పారు. తొలిరోజు పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సహా 1,200 మందికి పైగా బ్లాక్, మండల, పట్టణ, నగర, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఘన చరిత.. కాంగ్రెస్‌దే భవిత.. తొలిరోజు శిక్షణలో భాగంగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘కాంగ్రెస్ పార్టీ చరిత్ర– దేశ నిర్మాణంలో పాత్ర’అనే అంశంపై ఇచ్చిన ప్రెజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. పార్టీ ఆవిర్భావంతో పాటు స్వాతంత్య్ర పోరాటం నుంచి దేశాన్ని బలమైన ఆర్థిక, సామాజిక పునాదులపై కాంగ్రెస్ ఎలా నిలబెట్టిందనే అంశంపై ఆయన కూలంకషంగా వివరించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశంలోనే ఘన చరిత ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్ర లేక ఇతర పార్టీల చరిత్రను తనదిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. -
రూ.2 లక్షల బీమా.. ఐడీ కార్డు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకునే కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డు ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పించనున్నారు. సభ్యత్వం తీసుకునే ప్రతి కార్యకర్తకు బీమా కల్పించాలన్న ఉద్దేశంతో ఏఐసీసీ అనుమతి తీసుకుని ఈ సౌకర్యాన్ని కల్పించాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 26 వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా పెట్టుకోగా, ఫొటో, ఇతర సమాచారంతో సభ్యత్వం ఇచ్చేలా టీపీసీసీ డేటా అనలిటికల్ విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. కార్యక్రమ అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పదవులు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ పార్టీలో సభ్యత్వం మాత్రం శాశ్వతం’అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సభ్యత్వం ఉన్నవారికి సంక్షేమ పథకాల్లో తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సభ్యత్వ నమోదుపై ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా, మండల పార్టీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్డు కాదు.. గౌరవం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే కేవలం కార్డు మాత్రమే కాదని, అది ఒక గౌరవమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఏఐసీసీ సూచనలకు అనుగుణంగా పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించామని, కార్యకర్తలు, నేతలందరూ షెడ్యూల్ ప్రకారం సభ్యత్వాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
స్టేషన్ మహబూబ్‌నగర్: 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో పార్టీ పార్ల మెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 78 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ప్రజాధనాన్ని దోచుకుంటోందని విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని చెప్పారు. 30 లక్షల సభ్య త్వాలు లక్ష్యంగా డిజిటల్ మెంబర్షిప్ నిర్వహిస్తు న్నామని వివరించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా నవంబర్ 14 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రంలో జనజాగరణ పేరిట పాదయాత్ర లు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డి, బోసు రాజు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి వేం నరేందర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, శివకుమార్‌రెడ్డి, వంశీకృష్ణ, శంకర్‌ప్రసాద్, నర్సింహారెడ్డి, పార్టీ నాయకులు ఎన్పీ వెంకటేశ్, దుష్యంత్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, సీజే బెనహర్, శ్రీహరి, ప్రదీప్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్నికల కమిషన్ నియంత్రణ కోల్పోయింది’
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎన్నికల సంఘం నియంత్రణ కోల్పోయిందని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అన్నారు. సోమవారం ఆయన హుజూరాబాద్‌లోని వెంకటసాయి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉపఎన్నికను తమపార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని అన్నారు. నగదు, మద్యం, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్–బీజేపీ అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా.. స్పందించడం లేదని ధ్వజమెత్తారు. దసరా సందర్భంగా నియోజకవర్గంలో పంచిన తాయిలాలను పట్టించుకోలేదన్నారు. తామంతా యువకుడు, నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి యువనేత బల్మూరి వెంకట్‌ను ఈ ఉప ఎన్నికలో గెలిపించేందుకు కంకణం కట్టుకున్నామని తెలిపారు. ఈ ఉప ఎన్నిక ద్వారా నిరుద్యోగ సమస్యల విషయంలో టీఆర్ఎస్ను, పెట్రోల్–డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో బీజేపీల తీరును హుజూరాబాద్ ప్రజల ముందు నిలదీస్తామన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎలాంటి ఆశలు లేవన్నారు. ఈ ఉప ఎన్నిక ఓడిపోతారని ముందే తెలిసే.. తమకు హుజూరాబాద్ ఫలితం చాలా చిన్న విషయం అంటూ వ్యాఖ్యానిస్తున్నారని గుర్తుచేశారు. అంతా అనుకుంటున్నట్లుగా ఈ ఉప ఎన్నిక పోరు టీఆర్ఎస్–బీజేపీ మధ్య కాదని, ఇది కాంగ్రెస్–బీజేపీల మధ్యేన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన అవినీతి డబ్బును హుజూరాబాద్ ఎన్నికల్లో పారిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం బీజేపీ–టీఆర్ఎస్లకు వంతపాడుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా అభ్యర్థి ప్రకటనలో జాప్యం ఏమంటారు? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఠాగూర్ స్పందించారు. వాస్తవానికి తమ కంటే ఆలస్యంగా బీజేపీ తన అభ్యర్థిని ఈటల రాజేందర్ అని ప్రకటించిందని గుర్తుచేశారు. నాలుగు నెలలుగా బీజేపీ–టీఆర్ఎస్ హుజూరాబాద్‌లో ప్రచారం చేస్తున్నాయి. ప్రచారం విషయంలో మీపార్టీ వెనకబడిందని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు మాణిక్కం స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి చివరి పది రోజులు చాలని అన్నారు. తమకు ఇంకా 224 గంటల సమయం మిగిలి ఉందని, ఇది తాము శక్తిమేరకు ఈ సమరంలో పోరాడుతామని స్పష్టంచేశారు. ఈటల రాజేందర్, హరీశ్‌రావులు తమ అక్రమ సంపాదనను హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు. అందుకే.. తాము ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని యువకుడు, నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు చేసిన విద్యార్థి నేత అయిన బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా పోటీలో దింపామన్నారు.అదే విధంగా నిరుద్యోగ సమస్యలో తెలంగాణ దక్షిణ భారతదేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. ప్రతీ ఇంట్లో ఉన్న నిరుద్యోగుల సమస్యను ఎలుగెత్తి చాటుతామని వివరించారు. బీజేపీ– టీఆర్ఎస్లు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్, ఉప ఎన్నిక సమన్వయ కమిటీ చైర్మన్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరి్సంహ, ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, మంథని, ములుగు శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: హుజూరాబాద్‌లో దళితబంధుకు బ్రేక్ -
దళితుల పట్ల కేసీఆర్ వివక్ష
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మనువాదాన్ని పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఓట్ల కోసమే వాడుకుంటున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. దళితులపై కేసీఆర్ కుటుంబానికి నిజంగా ప్రేమ ఉంటే మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖను దళిత నాయకుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం అధ్యక్షతన జరిగిన ఎస్సీ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క దళితుడికి మాత్రమే అవకాశం ఇచ్చారని, ఆయన దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. కీలకమైన సాగునీరు, విద్య, వైద్యం, పురపాలక శాఖలను దళితులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటైతే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పిన కేసీఆర్ సీఎల్పీ నాయకుడిగా దళిత నేత భట్టి విక్రమార్కను నియమిస్తే చూడలేక కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. పంజాబ్‌లో దళితుడిని ముఖ్యమంత్రిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని, దళిత నాయకులకు రాజ్యసభలో, తెలంగాణలో ప్రతిపక్ష నాయకులుగా అవకాశం ఇచ్చింది కూడా తామేనని అన్నారు. దళిత సాధికారత కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా ఎస్సీ సెల్‌నేతలు కృషి చేయాలని మాణిక్యం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయలేదు: రేవంత్ ఇతర పార్టీల్లో దళిత విభాగం ఆరోవేలులా ఉంటుందని, కానీ కాంగ్రెస్ పార్టీనే దళితుల పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలను కాంగ్రెస్ ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదని, కానీ టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఈ వర్గాల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. ‘కాంగ్రెస్ కూడబెట్టిన ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి రిజర్వేషన్లు లేకుండా చేయాలని ఒకవైపు మోదీ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, ఉస్మానియా, కాకతీయలాంటి యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి టీఆర్ఎస్ నేతలకు యూనివర్శిటీలు ఇచ్చి రిజర్వేషన్లు అమలు కాకుండా పేదలకు చదువు దూరం అయ్యేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’అని ధ్వజమెత్తారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఎస్సీ సెల్ నేతలు గ్రామగ్రామాన పార్టీ నిర్మాణం కోసం పాటుపడాలని చెప్పారు. దళితులపై జరిగే దాడులను ప్రశ్నించేందుకు గ్రామాల్లో ఎస్సీ కమిటీలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి, వేంనరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగ్గారెడ్డి తీరుపై గాంధీభవన్‌లో వాడివేడి చర్చ
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం గాంధీ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీరుపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్ సమక్షంలో జగ్గారెడ్డి, మల్లు రవి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్న పరిస్థితి తలెత్తింది. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో చోటు చేసుకున్న పరిణామంపై చర్చించారు. పార్టీ అంతర్గత విషయాలను, రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడడం వంటి అంశాలను మల్లు రవి తప్పు పట్టారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఏఐసీసీ కార్యకర్తలు ఇద్దరిని సముదాయించి సమీక్ష సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. సాయంత్రం జరిగే పీఏసీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మానిక్కం ఠాగూర్ పాల్గొననున్నారు. (చదవండి: నివురుగప్పిన నిప్పు: రేవంత్ వర్సెస్ సీనియర్లు) పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. జగ్గారెడ్డి విమర్శలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆరా తీశారు. ఆయన మాట్లాడిన వీడియో క్లిపులను తెప్పించుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో పీసీసీ చీఫ్ టూర్‌కు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు జిల్లాలో కార్యక్రమం గురించి ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. వన్ మ్యాన్ షో లా చేస్తే కుదరదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: దో షేర్.. దో బకరే -
TS: ‘కోర్’ స్థానంలో పీఏసీ
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరో కొత్త కమిటీ ఏర్పాటయ్యింది. గతంలో ఉన్న టీపీసీసీ కోర్ కమిటీ స్థానంలో రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కమిటీ చైర్మన్‌గా మాజీ మంత్రి షబ్బీర్ అలీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జీవన్‌రెడ్డి, రేణుకాచౌదరి, పి.బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్‌బాబు, పొడెం వీరయ్య, అనసూయ (సీతక్క), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కూడిన ఈ కమిటీ తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటనలో తెలిపారు. కన్వీనర్ నియామకంపై చర్చ కమిటీ కూర్పులో తేడా కనిపించకపోయినా ఉన్నట్టుండి అధిష్టానం నుంచి ప్రకటన రావడం, ఈ కమిటీలో కొత్తగా కన్వీనర్ హోదా కల్పించడంపై గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఉండే కోర్ కమిటీల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి చైర్మన్‌గా, టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఇతరులు సభ్యులుగా ఉండేవారు. కానీ, తాజాగా నియమించిన పీఏసీకి కొత్తగా కన్వీనర్‌ను నియమించి ఆ బాధ్యతలను మొదటి నుంచీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తోన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీకి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కన్వీనర్ హోదాలో షబ్బీర్ అలీ ఏం చేస్తారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్య నేతలకు ఉపశమనం ఈ కమిటీ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం మరో సంకేతాన్ని కూడా పంపిందన్నది రాజకీయ వర్గాల భావనగా కనిపిస్తోంది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ వ్యవహారాల్లో గతంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల చరిష్మా కొంత మేర తగ్గిందని, అయితే తాజా కమిటీలో ముఖ్యులందరికీ స్థానం కల్పించడంతో ఆయా శిబిరాల్లో కొత్త జోష్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు సీనియర్లకు కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలను అధిష్టానం దీనిద్వారా పంపిందని అంటున్నారు. గతంలో కోర్ కమిటీలో ఉన్నట్టే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ ప్రకటించిన ఇతర కమిటీల చైర్మన్లకు తాజా కమిటీలో సైతం ప్రాతినిధ్యం లభించడంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో అసలు ఆట మొదలయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కలసి పనిచేయండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నాయకులు సమష్టిగా పనిచేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ టీపీసీసీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేపడుతూనే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. బుధవారం మధ్యాహ్నం 3:30కు ఢిల్లీలోని తన నివాసంలో పీసీసీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. ఈ భేటీలో వివిధ అంశాలపై నేతలందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పార్టీ చేపట్టిన కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలనూ ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ నూతన కమిటీ ఏర్పాటయ్యాక రాహుల్‌గాంధీతో ఇదే తొలి సమావేశం కావడం గమనార్హం. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, అజారుద్దీన్, మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాగా.. ఈ భేటీకి ముందు మాణిక్యం ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌లతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. రాహుల్‌తో సమావేశం తర్వాత రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి పార్టీ రాష్ట్ర నేతలకు తన నివాసంలో విందు ఇచ్చారు. రాష్ట్ర సంపదను మింగేస్తున్నారు: రేవంత్ రాహుల్‌గాంధీతో సమావేశం జరిగిన తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం పెద్ద అనకొండలా మారి రాష్ట్ర సంపద మింగేస్తోందని ఆరోపించారు. గత ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు చీకటిమయం అయ్యాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నిర్మించే టీఆర్ఎస్ కార్యాలయం ఎప్పటికీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక కాబోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఇప్పటికే జిల్లా, రాష్ట్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని.. ఇప్పుడు ఢిల్లీలో కేంద్రం ఇచ్చిన స్థలంలో పార్టీ ఆఫీసు కట్టుకుంటున్నారని రేవంత్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాలన్నీ కేసీఆర్ కుటుంబ ఆస్తులే తప్ప.. వాటితో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అధికారంలోకి వచ్చి ఏడున్నర ఏళ్లు అయినా.. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవమైన అమరవీరుల స్థూపాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. అమరువీరులను గౌరవించే ఉద్దేశం బీజేపీకి ఉంటే.. అమరవీరుల స్థూపం నిర్మించుకునేందుకు ఎకరం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అండగా నిలిచేది కాంగ్రెసే ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, రైతులు, దళితులకు కాంగ్రెస్ పార్టీనే అండగా నిలబడి పోరాడుతోందని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో సమస్యలు, అవినీతి, ప్రాజెక్టుల్లో కుంభకోణాల వంటి అంశాలను రాహుల్‌గాంధీకి వివరించి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించామన్నారు. పార్టీ బలోపేతంపై రాహుల్ సూచనలు, సలహాలు తీసుకున్నామని.. మూడు నెలలకోసారి రాష్ట్రంలో పర్యటించాలని ఆయనను కోరామని రేవంత్ వెల్లడించారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఈనెల 17న గజ్వేల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్ రాజ్యసభాపక్షనేత మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే మోదీతో భేటీ ప్రధాని మోదీని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ టూర్లో రాష్ట్ర విభజన చట్టం లోని అంశాలపై చర్చించలేదని, వాటిపై ప్రధాని నుంచి ఎలాంటి హామీ పొందలేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ఎన్ని స్థానాల్లో నిలబెట్టాలన్న విషయంగా మోదీ, అమిత్ షాల నుంచి కేసీఆర్ సూచనలు తీసుకొన్నారని..అసదుద్దీన్ ఓవైసీని బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. -
బీజేపీ-టీఆర్ఎస్: గల్లీమే కుస్తీ... ఢిల్లీ మే దోస్తీ
సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ల వ్యవహా రం గల్లీలో కుస్తీ, ఢిల్లీ లో దోస్తీ అన్న చందంగా ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను సీఎం కేసీఆర్ కలిసిన ఫొటోలు జతచేసి, రెండు పార్టీలు ఒకటేనని మరోసారి రుజువైందన్నారు. -
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ?
సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక, ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేత ఈటల ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల అధికార టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యం ఉన్న యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. చదవండి: Huzurabad Bypoll: లెక్కలు వేసి.. ఎంపిక చేసి.. ముగ్గురు నేతల పేర్లతో కూడిన జాబితా మాణిక్యం ఠాగూర్‌కు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఓసీ అభ్యర్థుల పేర్లు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. బీసీ కేటగిరి నుంచి కొండా సురేఖ, ఓసీ కేటగిరి నుంచి కృష్ణారెడ్డి, ఎస్సీ కేటగిరి నుంచి సదానందం పేర్లను సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Huzurabad Bypoll: ‘రాజేందరన్న నువ్వు బాధపడకు.. గెలిచేది మనమే’ -
‘హుజురాబాద్’లో టీఆర్ఎస్ను బొందపెట్టాలి: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేశాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏం న్యాయం చేశావని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యావైద్యాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌కు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఇచ్చి పేద విద్యార్థులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ‘దళిత అధికారులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు మరో న్యాయం చేశావు. ఐఏఎస్ మురళిని అవమానించావ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అవమానిస్తే ఆయన ఐపీఎస్ పదవికి రాజీనామాలు చేశారు. దళిత ఓట్ల కోసమే దళిత బంధు పెట్టాడు. రేపు జరగబోయే హుజురాబాద్‌లో టీఆర్ఎస్కు బొంద పెడతారు’ అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ బుధవారం ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభ’ జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో సభా వేదికకు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కమ్ ఠాగూర్ వచ్చారు. సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, దళిత, గిరిజనులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికార పార్టీ దళిత, గిరిజనులకు అన్యాయం చేస్తోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్‌కు సూటిగా ‘ఏడేళ్ల పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు?’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం (కాంగ్రెస్) దళితులకు ఇచ్చిన భూములను టీఆర్ఎస్ లాక్కుంటోందని ఆరోపించారు. వాటిని వ్యాపారవేత్తలకు రూ.కోట్లకు అమ్ముకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, అద్దంకి దయాకర్ తదితరులు ఉన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చింది. చదవండి: గాంధీభవన్‌లో దండోరా సభ పాస్‌ల గొడవ చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి -
సోనియాగాంధీ నిర్ణయాన్ని అందరూ అమోదించాలి: భట్టి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ నిర్ణయాన్ని పార్టీలోని అందరూ ఆమోదించాలని అన్నారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, విధానాలను అమలు చేయడం కోసం పార్టీలోని ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాగూర్‌పై ఆరోపణలు చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అభాండాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ శాసనసభలో కౌషిక్ రెడ్డికి వచ్చిన 61,121 ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. హుజూరాబాద్‌కు జరిగే ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్-బీజేపీల మధ్య ఓట్లు చీలినా.. స్థిరమైన ఓట్ బ్యాంక్‌తో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందనడంలో సందేహం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కౌశిక్‌రెడ్డి.. మధురై కోర్టుకు స్వాగతం: ఠాగూర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పరువు నష్టం దావాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీస్ పంపించిన విషయం తెలిసిందే. మాణిక్యం రూ.25 కోట్లు తీసుకొని రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. అయితే తాజాగా సోమవారం కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి కూడా రేవంత్‌కి పదవి ఇప్పించేందుకు మాణిక్యం ఠాగూర్ రూ.50 కోట్లు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఠాగూర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించి, కాంగ్రెస్‌ను గెలిపించడం తన ప్రాథమిక కర్తవ్యం కాబట్టే సీఎం చంద్రశేఖర్‌రావుకు విధేయులైన వారు ఎప్పుడూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తారని ఠాగూర్ విమర్శించారు. ఈ వ్యవహారంలో తన న్యాయవాదులు కౌశిక్‌రెడ్డికి పరువు నష్టం నోటీసు జారీ చేస్తారని, మదురైలో ఫిర్యాదు నమోదు అవుతుందన్నారు. వారికి మదురై కోర్టుకు స్వాగతమని మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యానించారు. -
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాణిక్కం ఠాగూర్ సీరియస్..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ సీరియస్ అయినట్లు తెలిసింది. సీనియర్లకు ఫోన్ చేసి.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న కోమటిరెడ్డి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇకపై తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిపోయిందంటూ కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో ఎలా లాబీయింగ్ చేశాడో.. పీసీసీ పదవిని కూడా అలాగే తెచ్చుకున్నాడని రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పీసీసీ పదవిని రాష్ట్ర ఇంఛార్జ్ ఠాగూర్ అమ్ముకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలు సరికాదు: మల్లు రవి టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. అధిష్టానం ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని రోజుల తరబడి అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డి నియామకం విషయంలో కోమటిరెడ్డి.. టీపీసీసీ ఇంచార్జి మణిక్కం ఠాగూర్‌ను నిందించడం పార్టీ క్రమశిక్షణ రాహిత్యమన్నారు. ఏదైనా అభిప్రాయబేధాలు ఉంటే పార్టీ అంతర్గతంగా చర్చించాలని మల్లు రవి అన్నారు. చదవండి: రేవంత్‌కు పోస్ట్: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్! -
తెలంగాణ కాంగ్రెస్ సారథి ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు ముగిసిన వేళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి పేరును ఖరారు చేసి సాగర్ ఉప ఎన్నిక ముగిసేంతవరకు వాయిదా వేసిన అధిష్టానం మళ్లీ ఈ ఫైలును ఏ క్షణమైనా తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అటు ఆశావహుల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే, ఈసారి కూడా జీవన్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటిస్తారా? లేదా నిర్ణయం మార్చుకుని ఇంకొకరికి అవకాశం ఇస్తారా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టీపీసీసీ చీఫ్ రేసులో ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలతో పాటు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పిలుపుతో షురూ... టీపీసీసీ అధ్యక్ష వ్యవహారం మళ్లీ ఢిల్లీ పిలుపులతో ప్రారంభమవుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో కూడా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మళ్లీ తెలంగాణపై దృష్టి సారించనున్నారు. మరో వారం రోజుల్లోపు ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయని, అప్పటి నుంచే మళ్లీ టీపీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. టీపీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డిని ఎంపిక చేస్తూ సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు కనుక మళ్లీ ఆయన్నే కొనసాగించాలా లేదా మార్చాలా అన్న దానిపై సీనియర్లతో మరోమారు అభిప్రాయ సేకరణ జరపనున్నట్టు సమాచారం. ఈ మేరకు 20 మందికిపైగా సీనియర్లకు అధిష్టానం నుంచి పిలుపు వస్తుందని తెలుస్తోంది. ఈ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే టీపీసీసీ చీఫ్ ఎవరన్నది తేలుతుంది. ఈ వ్యవహారం పూర్తయ్యేందుకు మరో నెలన్నర రోజులన్నా పడుతుందనే చర్చ జరుగుతోంది. రేవంత్‌కు ఖాయం జీవన్‌రెడ్డి పేరును మార్చాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేయాలన్నది అధిష్టానానికి కత్తిమీద సాముగానే మారనుంది. సాగర్ ఎన్నికల్లో జానారెడ్డి గెలిచినట్టయితే ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడం దాదాపు ఖరారైనా ఆయన ఓటమితో ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. రేసులో ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి ఇప్పటికే గట్టిగానే ఉన్నారు. ఆ పదవి తమకే కావాలంటూ పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చి మరొకరికి ప్రచార కమిటీ చైర్మన్ హోదా ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా అధిష్టానం పరిశీలించనుంది. మరోవైపు మాజీ మంత్రి, టీపీసీసీ నేతలతో పెద్దగా భేదాభిప్రాయాలు లేని శ్రీధర్‌బాబును కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడిగా తప్పుకోనున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు కూడా కొత్త అధ్యక్షుని ఎంపిక వ్యవహారంలో కీలకం కానుంది. మరి ఏం జరుగుతుందో.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే! -
'రాములోరి సాక్షిగా వాళ్లను తిరిగి రానివ్వం'
సాక్షి, ఖమ్మం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా పార్టీ ఫిరాయించిన నేతలను తిరిగి పార్టీలోకి రానివ్వమని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతో గెలిచిన వారు పార్టీని వదిలిపెట్టడం బాధాకరమని, వారిని తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ గుర్తు మీద గెలిచి ఫిరాయించిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశాన్ని ఇక్కడ ఆదివారం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ.. 'మన బూత్‌లో గెలవడం మన గౌరవాన్ని పెంచుకోవడం' అన్న నినాదంతో పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్లు తెలంగాణలో కొట్లాడుకుంటున్నట్లు నటిస్తున్నా, ఢిల్లీలో స్నేహం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్‌పై విచారణకు ఆదేశిస్తామని, అవినీతి నేతలను శిక్షిస్తామని ఠాగూర్ హెచ్చరించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా టీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులను టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేవరకు కాంగ్రెస్ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో భావప్రకటనా స్వేచ్ఛ కరువైందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం కార్పొరేషన్‌ను గెలిపించుకుని కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. (చదవండి: ఖమ్మం సమావేశానికి కాంగ్రెస్ అతిరథ, మహారధులు) -
ఖమ్మం సమావేశానికి కాంగ్రెస్ అతిరథ, మహారధులు
ఖమ్మం, ఫిబ్రవరి 6: పేదల కోసం ఇచ్చిన జీవోలను అడ్డం పెట్టుకుని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూములను రెగ్యులరైజ్ చేయించుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. ఖమ్మం పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, దీపక్ చౌదరి, బాల గంగాధర్ తిలక్, పుచ్చకాయల వీరభద్రం, మలీద్ వెంకటేశ్వర్లు, నూతి సత్యనారాయణ, ఎర్రబోలు శ్రీను, మొక్క శేఖర్ గౌడ్, బొందయ్య తదితరాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల మీద రేపు బూత్ కమిటీ స్థాయి సమావేశం జరగనుందని ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, 33 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కమిటీల అధ్యక్షులు వస్తున్నారని భట్టి మీడియాకు వివరించారు. ఖమ్మం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో భట్టి విమర్శలు చేసారు. పట్టణంలో సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై భట్టి నిప్పులు చెరిగారు. ప్రశ్నించిన వాళ్లపై కేసులు, అరెస్ట్ చేయిస్తున్నారని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. సొంత కాంట్రాక్ట్ సంస్థకు.. లేదంటే ఆయన మద్దతుదారులకు మాత్రమే కాంట్రాక్ట్ పనులు కేటాయిస్తున్నారని అన్నారు. మంత్రి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని అన్నారు. మంత్రి తీరుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. పేదల కోసం ఇచ్చిన జీవో 58, 59ని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారని భట్టి విమర్శలు చేసారు. వ్యాపారాల కోసం మంత్రి పదవిని అడ్డం పెట్టుకోవడం దుర్మార్గమని భట్టి అన్నారు.అభివృద్ధి పనులను నాసిరకంగా చేస్తూ.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వున్నారు. మంత్రి అజయ్ చేస్తున్న అక్రమాలపై పూర్తి స్థాయిలో సేకరించి విజిలెన్స్ కు అందిస్తామని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించాలి రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారని భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతురేక నల్ల చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేయడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోసం సమాయత్తం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నట్లు భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా నాయకులతో రేపు మధ్యాహ్నం సమావేశం ఉంటుందని అన్నారు. ఖమ్మం పట్టణంలో ఉన్న నిరుద్యోగులు.. వాళ్ళ కోసం.. త్వరలో భారీ ర్యాలీ చేస్తున్నట్లు ప్రకటించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: ఆధిపత్య పోరు.. కారు పార్టీలో కలకలం -
నేడు రాష్ట్రానికి మాణిక్కం ఠాగూర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. అటునుంచి నేరుగా ఖమ్మం చేరు కుని ఆదివారం అన్ని డీసీసీల అధ్యక్షులతో రాజకీయ పరిస్థితులు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉపఎన్నిక, ఖమ్మం, వరం గల్ కార్పొరేషన్ ఎన్నికలపై చర్చిస్తారు. ఆపై ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై ఆ జిల్లా నేతలతో.. సాగర్ ఉపఎన్నికపై మిర్యాలగూడలో నల్లగొండ జిల్లా నేతలతో భేటీ అవుతారు -
బీజేపీ, టీఆర్ఎస్పై ఉత్తమ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించుకుని యువతను బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు మోసం చేశాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివసేనారెడ్డితో పాటు కార్యవర్గం నేతలు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు భారీగా గాంధీభవన్‌కు రావడంతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ సీఎల్పీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, అఖిల భారత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.(చదవండి: పార్టీ మారడం లేదు : చిన్నపరెడ్డి) ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ యువతకు నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. అప్పుడు యువతను మోసం చేసి, ఇప్పుడు ఉద్యోగులకు తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ పైనే ఉందన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ నాయకత్వంలో పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జానారెడ్డి కోరారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని శివసేనారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎటువైపు ఉందో చెప్పాలి: మాణిక్యం ఠాగూర్ సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్‌తోపాటు మరో 15 పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎటువైపు ఉంటుందో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ డిమాండ్ చేశారు. బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ కొనసాగుతోందా లేదా అన్న విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని గురువారం ట్విట్టర్లో ప్రశ్నించారు. -
సాగర్ ఉప ఎన్నిక వరకు వాయిదానే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి అభిప్రాయాన్ని గౌరవించి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగేంత వరకు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక విషయంలో జానారెడ్డికి చిన్న ఇబ్బంది కలిగినా అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని, ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారాన్ని తేల్చకపోవడమే మంచిదని వారు స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌తో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఈ భేటీ రేవంత్ మినహా మిగిలిన నలుగురు హాజరై తమ అభిప్రాయాలను చెప్పారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తామని, అయితే సాగర్ ఉప ఎన్నిక కూడా రెండు నెలల్లోపు ముగిసే అవకాశం ఉన్నందున అప్పటివరకు అధ్యక్షుడు ఎవరన్న దానిపై అధికారిక ప్రకటన చేయకపోవడమే మేలని దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో మాణిక్కంకు వారు చెప్పినట్టు తెలిసింది. ఈ సమావేశానికి ముందే పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవాలని సీఎల్పీ నేత భట్టికి హైకమాండ్ నుంచి ఆదేశాలొచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన భట్టి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను రాష్ట్ర ఇన్చార్జికి చెప్పినట్టు సమాచారం. పార్టీలోని ఒకరిద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సాగర్ ఉప ఎన్నిక వరకు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని ఆయన వెల్లడించారు. అలాగే ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చలు జరిపారు. ప్రకటనలో ఆలస్యం వద్దని.. వెంటనే వెల్లడిస్తే బాగుంటుందని సంపత్ అభిప్రాయపడగా, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, వంశీలు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని చెప్పారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఇన్చార్జీ.. ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని నేతలకు చెప్పి సమావేశాన్ని ముగించారు. ఈ నేపథ్యంలో సోనియా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసేంత వరకు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక, ఇతర కమిటీల నియామక ప్రక్రియలు వాయిదా పడటం లాంఛనమే. -
కాంగ్రెస్‌లో వీహెచ్ వ్యాఖ్యల దుమారం
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై కాంగ్రెస్ సీనీయర్ నేత వీహెచ్ హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దూమారం రేపుతున్నాయి. వీహెచ్ వ్యాఖ్యలపై పార్టీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ వ్యాఖ్యలపై కార్యదర్శి బోస్‌రాజును ఠాగూర్ నివేదిక కోరారు. దీంతో హనుమంతరావు వ్యాఖ్యలు, పేపర్ క్లిప్పింగ్స్‌ను బోస్‌రాజు ఠాగూర్‌కు పంపించారు. ఈ క్రమంలో వీహెచ్‌కు నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా టీపీసీసీ చీఫ్ ఎంపిక నేపథ్యంలో మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన రగడ.. అభిప్రాయ సేకరణలో తను ఇచ్చిన ఆధారాలను అధిష్టానానికి చేరకుండా ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అడ్డుకున్నాడని వీహెచ్ విమర్శించారు. ఆయన అధిష్టానానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని, ప్యాకేజీకి అమ్ముడుపోయాడని మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరిని వరిస్తుందనే దానిపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లు హస్తిన వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందువరుసలో ఉన్నారు. వీరితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మల్లుభట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. చదవండి: రేవంత్‌కన్నా నాకే క్రేజ్ ఎక్కువ ఉంది.. -
టీపీసీసీ చీఫ్ ఎంపిక దాదాపు పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియ కొలిక్కి వస్తోంది. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్‌కుమార్ రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియను ఏఐసీసీ దాదాపు పూర్తి చేసింది. కాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ మరికొద్ది రోజులు సాగనుంది. కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో సుమారు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ల బృందం అధిష్టానానికి తమ నివేదికను సమర్పించింది. అయితే గత రెండ్రోజులుగా ఠాగూర్ సమర్పించిన ఆశావహుల జాబితా నివేదికపై ఏఐసీసీ స్థాయిలో పెద్ద ఎత్తున సమాలోచనలు జరిగాయి. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసన్‌లు రెండుసార్లు సమావేశమయ్యారు. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు, ఇతర రాజకీయపక్షాలకు ధీటుగా పార్టీని నడిపించగల సామర్థ్యం ఉన్న వారినే నియమించాలని ఈ సమావేశంలో ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ కీలక నేత తెలిపారు. మరోవైపు ఈ విషయంపై చర్చించేందుకు అధినేత్రి సోనియాగాంధీతో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే అనేకసార్లు భేటీ అయ్యారు. చదవండి: (వాజ్‌పేయి ఆలోచనలకు మోదీ పాలనలో పట్టం) అసంతృప్తి తగ్గించడం ఎలా..? అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ నేతలకు రాష్ట్ర స్థాయిలో లేదా ఏఐసీసీ స్థాయిలో మెరుగైన పదవులు కట్టబెట్టడం ద్వారా అసంతృప్తి తగ్గించవచ్చని పెద్దలు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా రాహుల్ గాంధీ స్వయం గా ఆశావహులతో మాట్లాడిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటారని, శని, ఆదివారాల్లో ఆయన వారితో మాట్లాడుతారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే టీపీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నేతల్లో ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లడంతో రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీలాంటి వారి పేర్లు కూడా ఏఐసీసీ సమావేశాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం. చదవండి: (బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా) పార్టీ బలోపేతంపై దృష్టి.. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్పై వచ్చిన వ్యతిరేకతను బీజేపీ కంటే ముందే తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. అందులో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు 2021 జనవరి 1 నుంచి కొత్త యాక్షన్ ప్లాన్‌తో రంగంలోకి దిగాలని ఏఐసీసీ ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. తొలుత మండల స్థాయి అ«ధ్యక్షుల నియామకాలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న సుమారు 589 మండలాలకు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులను కొనసాగించాలా లేదా కొత్త అధ్యక్షులను నియమించాలా అనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. మండల స్థాయి నియామకాలు పూర్తయ్యాక జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలు జరుగుతాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. వివిధ స్థాయిల్లో జరిగే నియామకాలతో పాటు సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి సంబంధించి మండల, జిల్లా స్థాయిల్లోనూ ప్రత్యేక నియామకాలు జరుగుతాయని తెలిసింది. పీసీసీ కమిటీల్లో భారీ కోతలు.. ప్రస్తు తం భారీగా ఉన్న పీసీసీ కమిటీలో కోతలు ఉండే అవకాశం ఉంది. 60 మంది అధికార ప్రతినిధులు, 300 మందికి పైగా సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, 27 మం ది ప్రధాన కార్యదర్శుల సంఖ్యను కుదించనున్నారు. జిల్లా స్థాయి లో ఓ అధికార ప్రతినిధి, పీసీసీ స్థాయిలో 6 నుంచి 8 మంది అధికార ప్రతినిధులను కొత్త కమిటీలో నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. -
అధ్యక్షుడి ఎంపిక.. ఆలస్యం!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. అధిష్టానానికి నివేదిక సమర్పించేందుకు ఇంకా సమయముందన్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియపై ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రా రంభించి ఇప్పటివరకు 18 కేటగిరీల్లోని రాష్ట్రానికి చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు 162 మంది నేతల అభిప్రాయాల ను సేకరించాం.. అయితే ఈ కసరత్తు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. రాష్ట్రం లో సేకరించిన అభిప్రాయాల ఆధారంగా నివేదికను సిద్ధం చేసి సోనియా, రాహుల్ గాంధీలకు అందిస్తాం. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అందరి అభిప్రాయాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది..’అని చెప్పారు. పీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తుపై రాష్ట్ర నాయకులకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే, పార్టీ అధిష్టానాన్ని నేరుగా కలిసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాణిక్యం ఠాగూర్ అన్నారు. ‘క్షేత్రస్థాయిలో ఏమాత్రం ప్రజాదరణ లేని నాయకులే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నారు. సంస్థాగతమైన లోపాల కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి బలహీనంగానే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అవుతారని మేం ముందుగా చెప్పినట్లే జరిగింది. ఢిల్లీలో దోస్తీ.. గల్లీ మే కుస్తీ అన్నట్టుగా టీఆర్ఎస్–బీజేపీల వ్యవహారశైలి ఉంది.’ అని మాణిక్యం వ్యాఖ్యానించారు. -
టీపీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. ఇప్పటివరకు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామని అన్నారు. తెలంగాణకు చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తెలుసుకున్నామని ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించామన్నారు. సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్ గాంధీలకు అందజేస్తానని వెల్లడించారు. ఈ కసరత్తు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని ఠాగూర్ చెప్పుకొచ్చారు. తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. తమ సంప్రదింపుల్లో ‘పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుందో చెప్పాలని’ నేతల్ని కోరామని తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఎవరికైనా పీసీసీ ఎంపిక కసరత్తుపై ఇబ్బందిగా ఉంటే నేరుగా పార్టీ అధిష్ఠానాన్ని కలవొచ్చని సూచించారు. టీఆర్ఎస్-బీజేపీ వైఖరి ఢిల్లీలో దోస్తీ-గల్లీ మే కుస్తీ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్-మోదీ భేటీ ద్వారా ఈ విషయం తెలుస్తోందని అన్నారు. ఇక టీఆర్ఎస్ నేతలపై మరో 6 నెలల పాటు ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఉండవని అర్ధమైందని ఠాగూర్ తెలిపారు. (చదవండి: నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు!) మోదీ-కేసీఆర్ భేటీపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చెబుతారో చూడాలని అన్నారు. ప్రజాదరణ లేని నాయకులు కాంగ్రెస్‌ను వీడుతున్నారని, అలాంటి వారితో తమ పార్టీకి నష్టమేమీ లేదని పేర్కొన్నారు. ప్రజాదరణ కలిగిన బలమైన నేతలు వీడితేనే ప్రమాదమని చెప్పారు. అసలైన కాంగ్రెస్ నేతలెవరూ తమ పార్టీని ఎట్టి పరిస్థితిలో వీడరని ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. సంస్థాగతమైన లోపాల కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, అందుకు బాధ్యత వహిస్తూ జీహెచ్ఎంసీ విభాగం అధ్యక్షుడు రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. (చదవండి: హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఏమైంది? ) -
ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక
సాక్షి, హైదరాబాద్ : కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. బంతి అధిష్టానం కోర్టుకు చేరడంతో సీన్ ఢిల్లీకి మారుతోంది. కాంగ్రెస్ ‘మార్కు’రాజకీయం మొదలైంది. ‘అయిననూ పోయి రావలె హస్తిన’కు అన్నట్లుగా నాయకులు ఢిల్లీ బాట పట్టనున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపిన పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ వెళ్లిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వైపు మళ్లింది. ఫలానా నాయకుడికి ఈ పదవి వస్తోందనే ఊహాగానాల నేపథ్యంలో... అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిం చాలని కోరుతూ అధిష్టానాన్ని కలిసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు సోమవారం ఢిల్లీకి బయలుదేరనున్నట్టు సమాచారం. వీరి వెనుకే మంగళవారం జగ్గారెడ్డి కూడా హస్తిన బాట పట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా సోనియా, రాహుల్‌గాంధీల అపాయింట్మెంట్ కోరి రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ జరిగిన తీరుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందరినీ ఎలా అడుగుతారు? టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలిపోయిందని పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పార్టీకి సేవ చేస్తున్న వారినే ఈ పదవికి ఎంపిక చేయాలని కొందరు, పార్టీకి ఊపు తెచ్చే స్పీడున్న నాయకుడికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. పాతకాపులకే పగ్గాలు ఇవ్వాలని కోరుతున్న నాయకులు అసలు అభిప్రాయ సేకరణే సరిగా జరగలేదని అంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కోర్ కమిటీ సభ్యుల నుంచి మాత్రమే అభిప్రాయాలు సేకరించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా మొత్తం 160 మందిని పిలవడం ఏఐసీసీ నియమావళికి విరుద్ధమని వారంటున్నారు. ఈ మేరకు సోనియా, రాహుల్‌లకు ఇచ్చేందుకు ఫిర్యాదును కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, పార్టీని ఉత్తేజపరిచే నాయకుడికి బాధ్యతలు అప్పగించాలంటోన్న మరోవర్గం మాత్రం పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ కీలక నేత సాయంతో ఢిల్లీలో పావులు కదుపుతోంది. ఈ రెండు గ్రూపుల ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం ప్రస్తుతం రక్తి కడుతోంది. నాయకుల ఢిల్లీ బాటలపై ఓ ముఖ్యనేత ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘టీపీసీసీ అధ్యక్ష ఎంపిక ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లడం సహజమే. ఫిర్యాదు చేసేందుకు వెళ్లడం లేదు. పార్టీ ఇన్చార్జి మాణిక్యం మరో రెండు రోజుల్లో తన నివేదికను అధిష్టానానికి ఇచ్చే అవకాశముంది. అప్పుడు మమ్మల్ని ఢిల్లీ పెద్దలు పిలిచి ముఖ్యులతో మాట్లాడిన తర్వాత మాత్రమే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని వ్యాఖ్యానించారు. ఈ ఎపిసోడ్ ఎప్పటికి ముగుస్తుందో... కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు, ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఆ తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్‌ను రోడ్డుపాలు చేసే కుట్ర..
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ పదవిపై కాంగ్రెస్‌లో హీట్ పెరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అంశంపై అభిప్రాయసేకరణ కొనసాగుతుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్యం ఠాకూర్ దీనిపై గాంధీభవన్‌లో పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆయనను సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ శనివారం కలిశారు. (చదవండి: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్) అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా సరే ఏకాభిప్రాయంతోనే జరగాలని.. వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటే పార్టీకే నష్టమని స్పష్టం చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారినే అధ్యక్షుడ్ని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను రోడ్డుపాలు చేసే కుట్ర జరుగుతోందని, సోనియా, రాహుల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఠాకూర్‌తో తాడోపేడో తేల్చుకుంటామని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. (చదవండి: పీసీసీ ఇస్తే పార్టీని గాడిలో పెడతా: కోమటిరెడ్డి) ‘‘కాంగ్రెస్ పార్టీలో అన్ని మామూలే సీఎల్పీలో సమావేశం ఎందుకు అనేది బయటకు చెప్పలేను.ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ చీలిపోకుండా ఉండేందుకు ఇంచార్జ్ ఠాకూర్‌ను కలిశాం. ఎమ్మెల్యేలు, ఎంపీ కోమటిరెడ్డితో కలిసి మా మనసులో ఉన్నది చెప్పాం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వివరించాం. రేపు చాలా ఎన్నికలు రాబోతున్నాయి. వాటిని ఎదుర్కొవాలి. ఠాగూర్ అన్ని వివరించాం. ఆయన అన్ని నోట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతుంది అందరికీ తెలిసిందే. ప్రజలు అన్ని గమనించాలి. సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవద్దు. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లేది ఇప్పుడే చెప్పలేం. సీఎల్పీ, పీసీసీ అధ్యక్షుడిని మేము ఇన్వాల్వ్ చేయడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఎంపిక మెజార్టీ అభిప్రాయం కాకుండా.. ఏకాభిప్రాయం సాధించాలి. ఒక ఇంచార్జ్ జిల్లా స్థాయి నేతలతో మాట్లాడటం తప్పు కాదు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు.. మా అభిప్రాయం చెప్పాం. ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ.. కలిశాం. జరుగుతున్న ప్రచారం దృష్ట్యా.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పాం. ఏకాభిప్రాయంతో్ ఎలాంటి పేరు చెప్పలేదు. సోనియాగాంధీ.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని’’ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అం శంపై అభిప్రాయసేకరణ వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. కాంగ్రె స్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ దీనిపై గాంధీభవన్‌లో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అను బంధ సంఘాల చైర్మన్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు... ఇలా దాదాపు 80 మంది నాయకులు శుక్రవారం ఠాగూర్‌ను కలిసి అభిప్రాయాలను తెలియజేశారు. గత ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్య ర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో కూడా ఆయన శని వారం మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసు కుంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కొండా దంపతుల భేటీ కాగా, శుక్రవారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు మాణిక్యం ఠాగూర్‌తో భేటీ అయ్యారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై తమ అభిప్రాయాలు చెప్పిన కొండా దంపతులతో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి మాణిక్యం చ ర్చించారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, జిల్లా లోని అందరు నేతలతో సమ న్వయం చేసుకోవాలని కొండా దంపతులకు ఆయన చెప్పినట్టు తెలిసింది. బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా గాంధీభవన్‌కు వచ్చి మాణిక్యంను కలిశారు. పార్టీ మారే అంశంపై విలేకరులు మహేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించగా, తా ను పార్టీ మారేటట్లయితే ఇప్పుడు గాంధీభ వన్‌కు ఎందుకు వస్తానని, ఈ ప్రచారం ఎలా జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. పారిశ్రామిక పార్కులు అమ్మే కుట్ర: షబ్బీర్ సాక్షి, హైదరాబాద్: రాజధాని చుట్టుపక్కల పారిశ్రామిక పార్కులకు కేటాయించిన భూములను ఐటీ పార్కుల పేరిట ప్రైవేటు కంపెనీలకు అమ్మేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. కూకట్పల్లి, గాంధీనగర్, బాలానగర్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మౌలాలీ, పటాన్చెరు, రామచంద్రాపురం, సనత్‌నగర్, కాటేదాన్ ప్రాంతాల్లోని భూములను మంత్రి కేటీఆర్ స్నేహితులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ పారిశ్రామిక పార్కుల్లో చాలాకాలంగా వేలాది పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న వారి పరిస్థితి ఏంటన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ‘టీఆర్ఎస్తో బీజేపీకి చీకటి ఒప్పందం’ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తో బీజేపీకి చీకటి ఒప్పందం ఉందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో బీజేపీని తిట్టే కేసీఆర్ రాత్రికి ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షాలతో మంతనాలు జరుపుతారని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మా ట్లాడారు. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు అనేది అవాస్తవమని, సోనియా, రాహుల్ గాంధీలు తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఇలా మాట్లాడ గలిగేవాడా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. -
అవకాశం ఇస్తే పార్టీని నిలబెడతా: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేపట్టిన అభిప్రాయ సేకరణ వరుసగా రెండో రోజూ కొనసాగింది. రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ గురువారం కూడా గాంధీభవన్‌లోనే మంతనాలు జరిపారు. కోర్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులతో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం కూడా కొనసాగనుంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఆయన శుక్రవారం సమావేశమవుతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ అందరితో చర్చలు పూర్తయిన తర్వాత పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై నివేదికను తీసుకుని ఆయన శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ తర్వాత అధిష్టానం స్థాయిలో కసరత్తు పూర్తయి కొత్త అధ్యక్షుడు ఎవరనేది తేలనుంది. ఇందుకు ఈనెలాఖరు వరకు పడుతుందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. చదవండి: (నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్) నాకు అవకాశం ఇస్తే పార్టీని నిలబెడతా • టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశమివ్వాలని పార్టీని కోరానని, అధిష్టానం అనుమతినిస్తే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని మళ్లీ నిలబెడతానని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. 35 ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్న తనకు అధిష్టానం ఈ అవకాశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌ను గాంధీభవన్‌లో గురువారం కలిసి టీపీసీసీ అధ్యక్ష ఎంపికపై తన అభిప్రాయా న్ని తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన మా ట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తనను నియమిస్తే టీఆర్ఎస్ వైఫల్యాలు, సీఎం కేసీఆర్ అసమర్థతపై జనంలోకి వెళతానన్నారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నానన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి 2023లో పార్టీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. చదవండి: (సిద్దిపేటలో ఎయిర్‌పోర్టు : కేసీఆర్) అంజన్‌కుమార్ రాజీనామా.. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. గురువారం గాంధీభవన్‌లో మాణిక్యం ఠాగూర్‌ను కలసి తన రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం అంజన్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందనే అపనింద పడటం ఇష్టం లేకనే రాజీనామా చేశానన్నారు. తనకు ప్రమోషన్ కావాలని పార్టీని అడిగానని, పీసీసీ అధ్యక్షుడిగా అవకాశమివ్వాలని కోరినట్టు వెల్లడించారు. తాను సికింద్రాబాద్, హైదరాబాద్‌కు మాత్రమే అధ్యక్షుడినని, గ్రేటర్‌కు కాదని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లో పోనని స్పష్టం చేశారు. కాగా, గురువారం మాణిక్యం ఠాగూర్‌ను కలసి పీసీసీ అధ్యక్ష పదవి కోసం తమ అభిప్రాయాలను చెప్పిన వారిలో కోర్ కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, సంపత్, వంశీచందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులున్నారు. -
పీసీసీ ఇస్తే పార్టీని గాడిలో పెడతా: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. అధ్యక్షుడి పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతుండగా.. హైకమాండ్ అందరి అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలో మకాం వేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ గురువారం గాంధీ భవన్లో మరోసారి కోర్‌కమిటీ నేతలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ సభ్యులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్‌తో ఆయన భేటీ కానున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందో చెప్పాలని కోర్‌కమిటీని కోరారు. (చదవండి : పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుంది?) పీసీసీ ఇవ్వాలని కోరా: ఎంపీ కోమటిరెడ్డి పీసీసీ పదవి తనకు ఇవ్వాలని మాణిక్యం ఠాగూర్‌ను కోరానని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానికి తెలియజేశానన్నారు. తనకు పీసీసీ పదవి ఇస్తే పార్టీలో పెట్టగలనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షుడి నియామకం విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రాకపోయినా తాను మాత్రం బీజేపీలో చేరేది లేదని మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. (చదవండి : కోమటిరెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఉత్తమ్) -
కోమటిరెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : గాంధీభవన్‌లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. బుధవారం సాయంత్రం టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, వీహెచ్, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. కొత్త పీసీపీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. కోర్ కమిటీ సభ్యులు తమ తమ అభిప్రాయాలను మాణికం ఠాగూర్‌కు తెలియజేశారు. సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోర్ కమిటీ సమావేశంలో తన అభిప్రాయం చెప్పలేదని, సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటే తనది అదే నిర్ణయం అని చెప్పారు. అంతకు ముందు మణికం ఠాగూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం ఉత్తమ్ చాలా కష్టపడ్డారని ప్రశంసించారు. దుబ్బాక గెలుపు కోసం ఉత్తమ్ తీవ్రంగా కృషి చేశారన్నారు. కొత్త పీసీసీ ఎంపిక జరిగే వరకు చీఫ్‌గా ఉత్తమ్ కుమారే కొనసాగుతారని స్పష్టం చేశారు. కాగా, పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి తో పాటు రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హైదరాబాద్‌లో మత సామరస్యాన్ని చెడగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణికం ఠాగూర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేస్తోందని, వారి అవినీతి రోజురోజుకు పెరిగిపోతోందని దుయ్యబాట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ప్రొజెక్టులోను టీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని అది అవినీతి ప్రభుత్వమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై అమిత్ షా సీబీఐ విచరణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ బండి సంజయ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని, మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ది పొందాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. చదవండి: ఆ కుటుంబాలకు రూ.25 లక్షలు అందిస్తాం: కాంగ్రెస్ మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆయన అనుచరులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ మతం, టీఆర్ఎస్ అవినీతితో పూర్తిగా కూడుకొని ఉందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని అంటున్నారు. అలాంటప్పుడు ఐటీ,ఈడీ, సీబీఐ కేంద్ర విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని సూటిగా ప్రశ్నించారు. ప్రతీ కేంద్ర మంత్రి తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ అవినీతికి పాల్పడినట్టు మాట్లాడుతున్నారని, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్టుగా రాజకీయాలు చేస్తున్నాయిని ఠాగూర్ ధ్వజమెత్తారు. ప్రజలను బీజేపీ మతపరంగా విభజించాలని, టీఆర్ఎస్ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేయాలని చూస్తుందన్నారు. తమ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి బల్దియాలో విజయం అందిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ అన్ని వర్గాలవారితో జీవనం సాగించే నగరమని గుర్తు చేశారు. దేశంలో ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటని తెలిపారు. -
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదివారం ట్వీట్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడిందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల్లో కొందరిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రలోభపెట్టి, మరికొందరిని భయపెట్టి టీఆర్ఎస్లోకి తీసుకున్నారని, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి పార్టీలో కి ఫిరాయింపులు చేయించారని రాములమ్మ ఆరోపించారు. కాంగ్రెస్‌ను బలహీనపరచడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్‌కు.. ఇప్పుడు బీజేపీ సవాలు విసిరే స్థాయికి వచ్చిందని అన్నారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు వర్తిస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ మరికొంత ముందుగా వచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మెరుగ్గా ఉండేవని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని కాలం, ప్రజలే నిర్ణయించాలని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. -
ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు చావోరేవో!
సాక్షి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చావోరేవో లాంటిదని, ఆరునూరైనా గెలిచి తీరాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ అన్నారు. మెదక్ జిల్లాలోని చేగుంట మండలం శివనూర్‌లో మంగళవారం దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాల బూత్ ఇన్చార్జీల సమావేశంలో ఠాగూర్ మాట్లాడారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ గతానికి భిన్నంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను బూత్ కమిటీ ఇన్‌చార్జీలుగా నియమించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఈ ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకమని, ఇక్కడ ఫలితాన్ని అనుకూలంగా రాబట్టి కొత్త ఉత్సాహంతో భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఇన్చార్జీలు ఎవరూ వారికి అప్పగించిన గ్రామాలు, మండలాల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో ఈసారి పాత సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ ప్లాన్ చేసిందన్నారు. నియోజకవర్గంలోని 146 గ్రామాలకు పీసీసీలోని 146 మంది ముఖ్యనాయకులను ఇన్‌చార్జీలుగా నియమించామన్నారు. ఇక ఏడు మండలాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కీలక నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించినట్లు ఆయన వివరించారు.