సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్ని కలో ‘మన మునుగోడు–మన కాంగ్రెస్’నినా దంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మునుగోడు ఉప ఎన్నిక డిసెంబర్ రెండో వారంలో జరుగుతుందని అంచనా వేస్తు న్న ఆ పార్టీ నేతలు, దానికోసం 100 రోజుల కార్యాచరణను రూపొందించారు. ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి పురస్కరించుకుని నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో ఒకేసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
ఈ ప్రచార కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతో పాటు పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కనీసం 30 వేల కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసేలా ప్రణాళిక రూపొందించారు. డిసెంబర్‌లో రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర కూడా జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంతో ఉప ఎన్నికను ఎదుర్కోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
మాణిక్యం వరుస భేటీలు
మునుగోడు ఉప ఎన్నికపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ బుధవా రం గాంధీభవన్‌లో వరుస సమావేశాలు నిర్వహించారు. ముందుగా నియోజకవర్గంలోని పార్టీ మండల ఇన్‌చార్జులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత గ్రామాల వారీగా నియమించిన సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించా రు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన ఠాగూర్.. ఆజాదీ గౌరవ్ యాత్ర, ధరల పెరుగుదలపై ఆందోళనల గురించి చర్చించారు. ఆజాదీ గౌరవ్ యాత్ర ను విజయవంతంగా నిర్వహించిన జిల్లా అధ్యక్షులను కండువాలు కప్పి సన్మానించా రు. అనంతరం పలువురు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. గతంలో ఉమ్మడి నల్ల గొండ జిల్లా ఇన్‌చార్జిగా పనిచేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి, మాజీమంత్రి వినోద్‌తో ఉప ఎన్నికపై చర్చించారు.
ప్రియాంక కోసం ఎదురు చూస్తున్నాం
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ప్రియాంక వస్తే స్వాగతిస్తామని, ఆమె రాక కోసం తాము కూడా ఆత్రుతతో ఎదురుచూస్తున్నామని మాణిక్యం ఠాగూర్ చెప్పారు. గ్రామ సమన్వయకర్తలతో సమావేశం అనంతరం ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్‌లతో కలిసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రియాంక ఇప్పటికే తెలంగాణ వ్యవహారాలపై దృష్టి సారించారని, ఇటీవల పార్టీ చేరికల్లో కూడా ఆమె క్రియాశీలకంగా పాలుపంచుకున్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేస్తామంటూ.. 100 రోజుల కార్యాచరణ, ఇతర అంశాలు వివరించారు. పలు రూపాల్లో ప్రచారం నిర్వహిస్తామన్నా రు. అందరితో కలిసి ముందుకు వెళ్తామని, అవసరమనుకున్నప్పుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సహా అందరు ముఖ్య నేతలు ఎన్నికల్లో పాలు పంచుకుంటారని చెప్పారు.
కాళేశ్వరం చూపించేందుకు భయమెందుకు?
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల బృందం ప్రాజెక్టుల సందర్శనకు వెళితే అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని మాణిక్యం పేర్కొన్నారు. అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పుకునే కాళేశ్వరంను కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. పోలీసుల నిర్బంధకాండను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తాను రాష్ట్ర పార్టీకి సోనియాగాంధీ ప్రతినిధినని, ఎవరి ఏజెంట్‌ను కానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వదంతులకు, బీజేపీలోకి వెళ్లిన, వెళ్లాలనుకుంటున్న నాయకులు చేసే ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
చదవండి: కులమతాల పేరిట దేశాన్ని విడదీయటం మంచిది కాదు
Comments
Please login to add a commentAdd a comment