సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌ను త్వరలోనే మార్చే ఆలోచనలో ఏఐసీసీ వర్గాలు ఉన్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికకు ముందే మాణిక్యం ఠాగూర్ స్థానంలో ప్రియాంక గాంధీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. వారం రోజుల్లో టి.కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఏఐసీసీ అధిష్టానం ఇప్పటికే ఇద్దరు సెక్రటరీలను మార్చింది.
చదవండి: (రేవంత్ బహిరంగ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్ ఏంటంటే..)
అయితే గత కొద్దిరోజులుగా అనేక మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఠాగూర్ ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయేటపుడు ఠాగూర్, రేవంత్‌లపై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే అధిష్టానం ఇంచార్జి మార్పు అనివార్యంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: (Revanth Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ)
Comments
Please login to add a commentAdd a comment