ప్రియాంక గాంధీ వస్తే నిరసన చేపడతాం: ఎమ్మెల్సీ కవిత వార్నింగ్‌ | MLC Kavitha Sensation Comments Over Congress Govt | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌, కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్‌

Published Sat, Feb 3 2024 11:33 AM | Last Updated on Sat, Feb 3 2024 1:25 PM

MLC Kavitha Sensation Comments Over Congress Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ నాయకులను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. పార్టీ సభ కోసం ప్రభుత్వ నిధులను ఎలా ఖర్చు చేస్తారు. 60 రోజుల్లో కాంగ్రెస్‌ చేసింది ఏమిటి? అని డిమాండ్‌ చేశారు. 

కాగా, ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద, జాగృతిపైనా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు నాపై చేశాడు. పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారు. అధికారికంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్లి పార్టీ సభ పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని పిలిస్తే నిరసన తెలియజేస్తాం. 

వేదిక, కుర్చీలు, లైట్లు పెట్టినందుకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా?. ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత?. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌ నిత్యం ఢిల్లీకి ప్రత్యేక విమానం, చార్టెడ్‌ ఫ్లైట్స్‌లో వెళ్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఖర్చుతోనే వెళ్తున్నారు కదా?. జై సోనియా అంటున్నారు కానీ.. జై తెలంగాణ అనే మాట రేవంత్‌ రెడ్డి నోటి నుంచి రాలేదు. కాంగ్రెస్‌ నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. సీఎం సోదరులు జిల్లా రివ్యూల్లో ఎలా పాల్గొంటారు. 60 రోజుల్లో ఒకే ఒకరోజు ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు రేవంత్‌ రెడ్డిని యూటర్న్‌ సీఎం అని పిలుస్తున్నారు.

మలి దశ ఉద్యమంలో అమరులైన అమరులకు కుటుంబాలకు రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్‌ ఒక్కరోజు కూడా అమరులకు నివాళులు అర్పించలేదు. ఒక్క అమరవీరుడి కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. మాది కుటుంబ పార్టీ అంటున్న రేవంత్‌, కాంగ్రెస్‌ నేతలు.. హస్తం పార్టీలోని 22 కుటుంబాలకు ఎమ్మెల్యే టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతలు, వారి కుటుంబ సభ్యుల వివరాలను చదివి వినిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement