నోట్ల సమస్య!.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ | Congress MP writes to FM Sitharaman For Shortage of Lower Denomination Currency Notes | Sakshi
Sakshi News home page

నోట్ల సమస్య!.. కేంద్ర ఆర్థిక మంత్రికి కాంగ్రెస్ ఎంపీ లేఖ

Published Sat, Sep 21 2024 7:21 PM | Last Updated on Sat, Sep 21 2024 7:47 PM

Congress MP writes to FM Sitharaman For Shortage of Lower Denomination Currency Notes

గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల (రూ.10, రూ.20, రూ.50 నోట్లు) కొరత తీవ్రంగా ఉందని.. కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ 'మాణిక్యం ఠాగూర్' (Manickam Tagore) ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మల సీతారామన్‌'కు లేఖ రాశారు.

యూపీఐ, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10, రూ.20, రూ.50 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు నివేదికలు సూచించాయని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. ఈ ప్రభావం లక్షలాది మంది పౌరులను ప్రభావితం చేస్తోందని ఆయన సూచించారు. అంతే కాకుండా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు లేదా రోజువారీ వేతన జీవుల వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయని అన్నారు.

ఇప్పటికి కూడా రోజువారీ వ్యాపారులలో చాలామందికి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు అందుబాటులో లేవు. అలాంటి వారి వ్యాపారాలు  తక్కువ విలువ కలిగిన నోట్ల సమస్య దెబ్బతీస్తోంది. డిజిటల్ చెల్లింపులు ఉపయోగకరమే అయినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్కువ విలువ కలిగిన నోట్లను కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటన

తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల ముద్రణ, పంపిణీని పునఃప్రారంభించమని ఆర్‌బీఐని ఆదేశించడం ద్వారా తక్షణమే జోక్యం చేసుకోవాలని ఠాగూర్ కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ను కోరారు. ప్రజల డిమాండ్‌ను తీర్చడానికి ఈ నోట్లను తగినంతగా సరఫరా చేయాలని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి ఈ అత్యవసర విషయాన్ని పరిష్కరించాలని తన లేఖలో వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement