denomination
-
నోట్ల సమస్య!.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల (రూ.10, రూ.20, రూ.50 నోట్లు) కొరత తీవ్రంగా ఉందని.. కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ 'మాణిక్యం ఠాగూర్' (Manickam Tagore) ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మల సీతారామన్'కు లేఖ రాశారు.యూపీఐ, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10, రూ.20, రూ.50 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు నివేదికలు సూచించాయని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. ఈ ప్రభావం లక్షలాది మంది పౌరులను ప్రభావితం చేస్తోందని ఆయన సూచించారు. అంతే కాకుండా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు లేదా రోజువారీ వేతన జీవుల వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయని అన్నారు.ఇప్పటికి కూడా రోజువారీ వ్యాపారులలో చాలామందికి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు అందుబాటులో లేవు. అలాంటి వారి వ్యాపారాలు తక్కువ విలువ కలిగిన నోట్ల సమస్య దెబ్బతీస్తోంది. డిజిటల్ చెల్లింపులు ఉపయోగకరమే అయినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్కువ విలువ కలిగిన నోట్లను కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటనతక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల ముద్రణ, పంపిణీని పునఃప్రారంభించమని ఆర్బీఐని ఆదేశించడం ద్వారా తక్షణమే జోక్యం చేసుకోవాలని ఠాగూర్ కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ను కోరారు. ప్రజల డిమాండ్‌ను తీర్చడానికి ఈ నోట్లను తగినంతగా సరఫరా చేయాలని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి ఈ అత్యవసర విషయాన్ని పరిష్కరించాలని తన లేఖలో వివరించారు.Wrote a letter to Hon’ble Finance Minister @nsitharaman regarding the severe shortage of Rs. 10, 20, and 50 denomination notes, which is causing hardship in rural and urban poor communities. Urging for immediate intervention to resume 1/2 pic.twitter.com/NEYXsIOZ9d— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) September 21, 2024 -
రూ.7,409 కోట్ల విలువైన 2,000 నోట్లు ఇంకా ప్రజల్లోనే..
ముంబై: ఉపసంహరించిన రూ. 2000 డినామినేషన్ బ్యాంకు నోట్లలో 97.92 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం తెలిపింది. ప్రజల వద్ద ఇప్పటికీ రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఉపసంహరణ ప్రకటించిన గత ఏడాది మే 19న బిజినెస్ వ్యవహార సమయం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఈ ఏడాది జూలై 31న ఇదే సమయానికి ఈ విలువ రూ.7,409 కోట్లకు తగ్గింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం, లేదా మార్చుకునే సౌకర్యం దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో 2023 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంది. అటుపై 2023 అక్టోబర్ 9వ తేదీ నుండి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్నాయి. ప్రజలు రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపడానికి తగిన సౌలభ్యతను కూడా కలి్పంచడం జరిగింది. 2016 నవంబర్‌లో అప్పుడు అమలులో ఉన్న రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. -
రూ.500 దొంగనోట్లు పెరుగుతున్నాయ్: తస్మాత్ జాగ్రత్త!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 79,669 రూ. 500 డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపని ఆర్బీఐ వార్షిక నివేదిక తెలిపింది. ఇక రెండువేల నోట్ల విషయంలో గుర్తించిన నకిలీ సంఖ్య 13,604గా ఉంది. 2020–21తో పోల్చితే ఈ సంఖ్య 54.6 శాతం అధికం. 2016లో అమలులో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు ప్రధాన లక్ష్యాలలో ఒకటి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టడం కావడం గమనార్హం. కాగా, ఇందుకు సంబంధించి తాజా పరిస్థితి ఏమిటన్నది గణాంకాల్లో పరిశీలిస్తే... ► 2020–2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 2,08,625 నకిలీ నోట్లను గుర్తిస్తే, 2021–22లో ఈ సంఖ్య 2,30,971కి చేరింది. ► 2020–21తో పోల్చితే 2021–22లో రూ.10, రూ.20, రూ.200, రూ.500 (కొత్త డిజైన్), రూ. 2,000ల విలువ కలిగిన నకిలీ నోట్లలో వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.9 శాతం, 54.6 శాతం పెరుగుదల నమోదైంది. ► అయితే ఇదే కాలంలో రూ.50, రూ.100 దొంగ నోట్లు వరుసగా 28.7%, 16.7% తగ్గడం గమనార్హం. ► 2021–22లో గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించగా, 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు పసిగట్టాయి. ► 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చి 31 వరకు కరెన్సీ ప్రింటింగ్‌పై చేసిన మొత్తం వ్యయం రూ. 4,984.8 కోట్లు. అంతకుముందు సంవత్సరం (2020 జూలై 1 నుండి 2021 మార్చి 31 వరకు) ఈ మొత్తం రూ. 4,012.1 కోట్లు. 2021 మార్చికి ముందు ఆర్బీఐ జూలై–జూన్ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేది. అయితే 2021 ఏప్రిల్ నుంచి ‘ఏప్రిల్–మార్చి’ని ఆర్థిక సంవత్సరంగా మార్చారు. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో పాడైపోయిన నోట్లను వెనక్కు తీసుకోడానికి సంబంధించిన సంఖ్య 88.4 శాతం పెరిగి 1,878.01 కోట్లకు చేరింది. 2020–21లో ఈ సంఖ్య 997.02 కోట్లు. -
భారీగా పట్టుబడ్డ పాత నోట్లు..
కోయంబత్తూర్ : డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇలంగో కుమారుడు ఆనంద్ ఇంటిపై కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి 250 రద్దైన రూ 1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అవనశి నియోజకవర్గానికి ఇలంగో గతంలో ప్రాతినిధ్యం వహించారు. నిషేధించిన నోట్లను కోయంబత్తూర్‌లో ఆనంద్‌కు చెందిన ప్రాంగణంలో దాచారు. డీఎస్పీ వేల్మురుగన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం ఆదివారం రాత్రి ఆనంద్ నివాసంపై దాడి చేసి రద్దు చేసిన పాత నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇంటి యజమాని ఆనంద్‌తో పాటు అద్దెకు ఉంటున్న రషీద్, షేక్‌లపై కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆనంద్ ఇతరులతో కలిసి పాత నోట్లను తన నివాసంలో ఉంచి వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 2016 నవంబర్‌లో రూ 1000, రూ 500 నోట్లను మోదీ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
మువ్వల నగలు
మువ్వలు సవ్వడి కాలికే అనేది నిన్నటి మాట. నేడు.. మెడలో హారంలా, చెవులకు జాకాల్లా, చేతికి గాజుల్లా.. నవ్వులతో పోటీ పడుతూ చేసే మువ్వల సందడి ఇంతంత కాదు. ఇది వివాహ వేడుకల సమయం. మెడ నిండుగా కళ్లకు పండగలా మువ్వల హారాలు సందడి చేస్తున్నాయి. -
నోట్లరద్దు తర్వాత కన్నా రెండింతలైంది
-
రూ. 1000 నోట్లపై తాజా క్లారిటీ!
న్యూఢిల్లీ: కొత్తగా వెయ్యి రూపాయల నోట్లు ప్రవేశపెట్టబోమని కేంద్రం ప్రకటించింది. 1000 రూపాయల నోట్లను తిరిగి చెలామణిలోకి తెచ్చేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. రూ. 500, తక్కువ విలువ కలిగిన నోట్ల తయారీ, సరఫరాపైనే దృష్టి పెట్టామని వెల్లడించారు. ఏటీఏంలో నగదు ఖాళీ అవుతుండడంతో సమస్యలు తలెత్తున్నాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తమకు ఎంత అవసరమో అంతే మొత్తంలో నగదు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి డబ్బులు డ్రా చేయడం వల్ల అవసరమైనవారికి నగదు అందకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 1000 రూపాయల నోట్లను తిరిగి ప్రవేశపెడతారని జరుగుతున్న ప్రచారానికి శక్తికాంత్ దాస్ ప్రకటనతో తెర పడినట్టైంది. -
‘డిజిటల్ విధానాన్ని అమలు చేయాలి’
హైదరాబాద్: ప్రజలకు బ్యాంకులు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఐసీఐసీఐ బ్యాంకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల సమస్యలను అధిగమించేందుకు డిజిటల్ విధానాన్ని తక్షణం అమలు చేయాలని సూచించారు. నగదు రహిత లావాదేవీల కోసం అందరినీ సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
బెంగళూరులోనే ఎక్కువగా దొరికాయి
న్యూఢిల్లీ: పాత పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారుల నుంచి రూ. 2 వేల కోట్ల అప్రకటిత ఆదాయం వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఆదాయం వెల్లడించని వారిపై చర్యలు కొనసాగుతున్నాయని, 400 కేసులను ఆదాయపన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు రూ. 130 కోట్ల నగదు, పెద్ద మొత్తంలో ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించింది. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఈడీ అధికారులు ఎక్కువ మొత్తంలో అక్రమ నగదును పట్టుకున్నారని తెలిపింది. -
కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట
-
కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట
న్యూఢిల్లీ: కరెన్సీ బ్యాన్ తో ఉద్భవించిన అనివార్య పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. దేశ ప్రజలకు నగదును అందుబాటులో ఉంచేందుకుగా చర్యలు వేగం చేసింది. మూడు నెలల క్రితం నమోదైన కరెంట్ ఖాతాలకు నగదు విత్ డ్రా పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించి చిన్న వ్యాపారుదారులకు భారీ ఊరట నిచ్చారు. బ్యాంకింగ్ కరస్పాండెట్స్ విత్ డ్రా పరిమితి రూ.50వేలకు, రోజువారి పరిమితి.2.5 లక్షలకు పెంచుతున్నట్టు శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అలాగే డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద లావాదేవీ ఛార్జీలు రద్దుచేయాల్సిందిగా బ్యాంకులు కోరినట్లు విలేకరులతో చెప్పారు. కనీసం మూడు నెలల పాత ఖాతాలలో నగదు ఉపసంహరణ పరిమితి పెంచుతున్నట్టు ప్రకటించారు. వారానికి రూ. 50,000 డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కార్మికుల వేతనాలు, వారాంతపు వ్యాపార చెల్లింపులు తదితర వ్యయాల నిమిత్తం కరెంట్ ఖాతా ఉన్న వ్యాపార సంస్థల పరిమితిని పెంచినట్టు దాస్ చెప్పారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 18 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆయన వెల్లడించారు. ప్రజల ఇబ్బదుల దృష్టిలో పెట్టుకొని నగదు సరఫరా నిమిత్తం దేశవ్యాప్తంగా కొత్త మైక్రో ఏటీఎంలు అందుబాటులో ఉంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ మీడియాకు వివరించారు.