
రూ. 1000 నోట్లపై తాజా క్లారిటీ!
న్యూఢిల్లీ: కొత్తగా వెయ్యి రూపాయల నోట్లు ప్రవేశపెట్టబోమని కేంద్రం ప్రకటించింది. 1000 రూపాయల నోట్లను తిరిగి చెలామణిలోకి తెచ్చేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. రూ. 500, తక్కువ విలువ కలిగిన నోట్ల తయారీ, సరఫరాపైనే దృష్టి పెట్టామని వెల్లడించారు.
ఏటీఏంలో నగదు ఖాళీ అవుతుండడంతో సమస్యలు తలెత్తున్నాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తమకు ఎంత అవసరమో అంతే మొత్తంలో నగదు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవసరానికి మించి డబ్బులు డ్రా చేయడం వల్ల అవసరమైనవారికి నగదు అందకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 1000 రూపాయల నోట్లను తిరిగి ప్రవేశపెడతారని జరుగుతున్న ప్రచారానికి శక్తికాంత్ దాస్ ప్రకటనతో తెర పడినట్టైంది.