కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట
న్యూఢిల్లీ: కరెన్సీ బ్యాన్ తో ఉద్భవించిన అనివార్య పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. దేశ ప్రజలకు నగదును అందుబాటులో ఉంచేందుకుగా చర్యలు వేగం చేసింది. మూడు నెలల క్రితం నమోదైన కరెంట్ ఖాతాలకు నగదు విత్ డ్రా పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించి చిన్న వ్యాపారుదారులకు భారీ ఊరట నిచ్చారు. బ్యాంకింగ్ కరస్పాండెట్స్ విత్ డ్రా పరిమితి రూ.50వేలకు, రోజువారి పరిమితి.2.5 లక్షలకు పెంచుతున్నట్టు శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అలాగే డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద లావాదేవీ ఛార్జీలు రద్దుచేయాల్సిందిగా బ్యాంకులు కోరినట్లు విలేకరులతో చెప్పారు. కనీసం మూడు నెలల పాత ఖాతాలలో నగదు ఉపసంహరణ పరిమితి పెంచుతున్నట్టు ప్రకటించారు. వారానికి రూ. 50,000 డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కార్మికుల వేతనాలు, వారాంతపు వ్యాపార చెల్లింపులు తదితర వ్యయాల నిమిత్తం కరెంట్ ఖాతా ఉన్న వ్యాపార సంస్థల పరిమితిని పెంచినట్టు దాస్ చెప్పారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 18 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆయన వెల్లడించారు. ప్రజల ఇబ్బదుల దృష్టిలో పెట్టుకొని నగదు సరఫరా నిమిత్తం దేశవ్యాప్తంగా కొత్త మైక్రో ఏటీఎంలు అందుబాటులో ఉంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ మీడియాకు వివరించారు.