current accounts
-
జూన్ త్రైమాసికంలో క్యాడ్ 2.8 శాతం
ముంబై: భారత్ కరెంట్ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువలో)గా నమోదయ్యింది. విలువలో ఇది 23.9 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కరెంట్ అకౌంట్ 6.6 బిలియన్ డాలర్ల (జీడీపీలో 0.9 శాతం) మిగుల్లో ఉండడం గమనార్హం. ఆర్బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో క్యాడ్ 13.4 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.5 శాతం). ఎగుమతులకన్నా దిగుమతుల పరిమాణం భారీగా పెరుగుతుండడం తాజా సమీక్షా త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ తీవ్రతకు కారణం. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
’కరెంటు అకౌంట్’ నిబంధనల మార్పు,ప్రైవేట్ బ్యాంకులకు ఊతం!
ముంబై: గత రెండేళ్లుగా ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు నగదు నిర్వహణ సేవల (సీఎంఎస్) విభాగంలో తమ వాటాను పెంచుకునేందుకు కరెంటు ఖాతాల నిబంధనల్లో మార్పులతో ఊతం లభించింది. 2020లో దేశీయంగా సీఎంఎస్‌లో వీటి వాటా 35 శాతంగా ఉండగా 2022లో ఇది 40 శాతానికి చేరింది. క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంకులు–కార్పొరేట్ల మధ్య కనీస లావాదేవీల స్థాయిని నిర్దేశిస్తూ 2020లో ఆర్బీఐ సర్క్యులర్ విడుదల చేసింది. బడా బ్యాంకులకు తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు దీనితో పాటు గత కొన్నేళ్లుగా అవి వినూత్న డిజిటల్ సర్వీసులు అందిస్తుండటం కూడా కొంత కారణమని క్రిసిల్ నివేదిక వివరించింది. 2020లో నిర్వహించిన సర్వేలో దేశీ సీఎంఎస్‌కు సంబంధించి 656 మంది, 2022లో 518 మంది పాల్గొన్నారు. బడా కార్పొరేట్ బ్యాంకింగ్ విషయంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ ర్యాంక్ దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత స్థానంలో ఉన్నాయి. మధ్య స్థాయి కార్పొరేట్ బ్యాంకింగ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలోనూ, ఐసీఐసీఐ .. యాక్సిస్ బ్యాంకులు తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశీ కార్పొరేట్లు కొత్తగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఇటు వర్కింగ్ క్యాపిటల్‌ను, అటు ఆదాయవ్యయాల నిర్వహణపైనా మరింతగా దృష్టి పెడుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. -
రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తే పాన్/ఆధార్
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా తెరవడానికి, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు పాన్/ఆధార్ నంబర్ ఇవ్వడడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించుకున్నా బ్యాంకుకు పాన్ లేదా ఆధార్ ఏదో ఒకటి సమర్పించాలి. అలాగే, బ్యాంకు, పోస్టాఫీసులో కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరవాలన్నా వీటిని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల లావాదేవీల్లో మరింత పారదర్శకత వస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ సెహగల్ అన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీలు రూ.20 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీలను ఆదాయపన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘డిపాజిట్లు, ఉపసంహరణకు పాన్‌ను తీసుకోవడం అంటే వ్యవస్థలో నగదును గుర్తించే విషయంలో ప్రభుత్వానికి సాయంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అనుమానిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను కఠినతరం చేస్తుంది’’అని సెహగల్ వివరించారు. -
కస్టమర్లకు గట్టి షాక్ ఇచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఖాతాదారులకు అందించే సేవలకు సంబంధించిన చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. కనీస ఖాతా బ్యాలన్స్, బ్యాంక్ లాకర్ ఛార్జీలు, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు పెంచిన జాబితాలో ఉన్నాయి. కనీస బ్యాలెన్స్: మెట్రో ప్రాంతంలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్(క్యూఎబి) పరిమితిని ₹10,000కు పెంచారు. ఇంతకు ముందు పరిమితి ₹5,000గా ఉండేది. త్రైమాసిక కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు గ్రామీణ ప్రాంతాల్లో రుసుమును ₹200 నుంచి ₹400కు, పట్టణ & మెట్రో ప్రాంతాల్లో ₹300 నుంచి ₹600పెంచినట్లు పీఎన్బీ తెలిపింది. బ్యాంక్ లాకర్ ఛార్జీలు: పీఎన్బీ గ్రామీణ, సెమీ అర్బన్, పట్టణ & మెట్రో ప్రాంతాల్లో తన లాకర్ అద్దె ఛార్జీలను కూడా పెంచింది. పట్టణ ప్రాంతాల్లో లాకర్ ఛార్జీలను ₹500 పెంచారు. బ్యాంక్ లాకర్: జనవరి 15, 2021 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చిన తర్వాత లాకర్ ని ఏడాదికి ఉచితంగా చూసే సంఖ్య 12(ఇంతకముందు 15)కు తగ్గుతుంది. ఆ తర్వాత లాకర్ తెరిచిన ప్రతిసారి ₹100 చెల్లించాల్సి ఉంటుంది. కరెంట్ అకౌంట్ మూసివేత ఛార్జీలు: కరెంటు ఖాతా తెరిచిన 14 రోజుల తర్వాత ఖాతాను రద్దు చేస్తే రూ.800 అపరాధ రుసుము చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.600గా ఉండేది. కరెంటు ఖాతా తెరిచిన 12 నెలల తరువాత రద్దు చేస్తే ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. పొదుపు ఖాతా లావాదేవీల రుసుము: జనవరి 15 నుంచి పీఎన్బీ నెలకు 3 ఉచిత లావాదేవీలను చేసుకునే అనుమతిస్తుంది. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి ₹50/(బీఎన్ఏ, ఏటీఎమ్, సిడీఎమ్ వంటి ప్రత్నామ్నాయ ఛానళ్లు మినహాయించి) ఛార్జ్ చేస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్ ఖాతాలకు ఇది వర్తించదు. ఇంకా పొదుపు, కరెంట్ ఖాతాల్లో లావాదేవీ ఫీజులను కూడా పెంచింది. ప్రస్తుతం బ్యాంక్ బేస్, నాన్-బేస్ బ్రాంచ్‌లకు ప్రస్తుతం 5 ఉచిత లావాదేవీలను బ్యాంకు అనుమతిస్తుంది. ఆ తర్వాత ఆపై చేసే ప్రతి లావాదేవీకి రూ.25 ఛార్జ్ చేస్తుంది. క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు: పొదుపు, కరెంట్ ఖాతాల రెండింటిపై కూడా నగదు డిపాజిట్ పరిమితిని తగ్గించింది. రోజుకు ఉచిత డిపాజిట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న ₹2 లక్షల నుంచి ₹1 లక్షకు తగ్గించింది. (చదవండి: శాంసంగ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ సేవలు పూర్తిగా బంద్..!) -
బ్యాంక్ అకౌంట్లపై సెబీ కీలక ఉత్తర్వులు
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో తగినన్ని కరెంటు ఖాతాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు నిర్వహించాలని సెబీ కోరింది. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను స్వీకరించేందుకు.. అదే విధంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులను తిరిగి చెల్లించేందుకు, డివిడెండ్ చెల్లింపులు సులభంగా ఉండేందుకే సెబీ ఈ మేరకు ఉత్తర్వులు తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి వచ్చిన అభ్యర్థనకు వీలుగా ఈ మేరకు వివరణ ఇస్తున్నట్టు సెబీ స్పష్టం చేసింది. తప్పనిసరిగా బ్యాంకుల్లో తగినన్ని కరెంటు ఖాతాలను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన బ్యాంకును ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుందని.. దీనివల్ల వేగంగా నిధుల బదిలీకి వీలు పడుతుందని తెలిపింది. క్రెడిట్ సదుపాయాలను (నగదు, ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో) వినియోగించుకున్న కస్టమర్లకు కరెంట్ ఖాతాలను తెరవొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన విషయాన్ని ఫండ్స్ పరిశ్రమ సెబీ దృష్టికి తీసుకెళ్లింది. అయితే, ఆ తర్వాత సమీక్షలో భాగంగా.. నూతన ఫండ్ పథకాలు, డివిడెండ్ చెల్లింపులు, షేర్ల బైబ్యాక్ తదితరాలకు ఖాతాలు తెరవొచ్చని ఆర్బీఐ స్పష్టం చేయడం గమనార్హం. నిబంధనల అమలుకు మరింత గడువు బ్యాంకులు కరెంట్ ఖాతాలకు సంబంధించి మార్పులను అమలు చేసేందుకు ఈ ఏడాది అక్టోబర్ వరకు గడువును ఆర్బీఐ పొడిగించింది. గత కొన్ని రోజులుగా బ్యాంకుల్లో కరెంట్ ఖాతాల స్తంభనతో చిన్న వ్యాపార సంస్థలు ఇబ్బంది పడుతున్నట్టు తెలియడంతో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. రుణాల పరంగా రుణ గ్రహీతల్లో క్రమశిక్షణను పెంచడం, రుణాలపై బ్యాంకుల నుంచి మరింత పర్యవేక్షణకు వీలుగా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు తెలిపింది. వ్యాపార సంస్థల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వాటి కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా ఈ నిబంధనలను ఆచరణలో పెట్టాలని కోరింది. -
మైండ్ ‘బ్లాక్’!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కొత్త తరహా సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఖాతాలతో ముడిపడి ఉన్న సిమ్‌కార్డుల్ని బ్లాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు వాటిని ఖాళీ చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే సికింద్రాబాద్, అమీర్‌పేట ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల ఖాతాల నుంచి సైబర్ క్రిమినల్స్ రూ.88 లక్షలకు పైగా కాజేయడం కలకలం రేపింది. ఇలాంటి ‘నయా’ వంచనకు పాల్పడుతున్న వారిలో నైజీరియన్లతో పాటు ఉత్తరాదికి చెందిన కొన్ని ముఠాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ‘బ్లాక్’తో డమ్మీవి తీసుకుంటున్నారు... ఉత్తరాదికి చెందిన కొందరు యువకుల్ని వివిధ నగరాలకు పంపి కరెంట్ ఖాతాలు తెరిపిస్తున్న సూత్రధారులు బ్యాంకుల పేర్లను పోలి ఉండే యూఆర్‌ఎల్స్‌తో వెబ్‌సైట్స్ రూపొందిస్తున్నారు. వీటి ద్వారా వల వేసి వినియోగదారుడి ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ తరవాతే అసలు అంకం ప్రారంభిస్తున్నారు. తమ వల్లో పడిన బాధితుల సిమ్‌కార్డుల్ని చాకచక్యంగా బ్లాక్ చేయిస్తున్నారని తేలింది. దీనికోసం అతడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో అక్క డ లేదా మరో ప్రాంతంలో సర్వీస్ ప్రొవైడర్లను వారి (బాధితుడి) మాదిరిగానే ఆశ్రయిస్తున్నారు. అప్పటికే ఖాతాదారుడికి సంబంధించిన పూర్తి సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు వెబ్సైట్ ద్వారా వీరి వద్దకు చేరి ఉంటోంది. ఈ వివరాలతో బోగస్ ధ్రువీకరణలు తయారు చేసి వాటిని జత చేస్తూ తమ సిమ్‌కార్డు పోయింద ని, మరోటి ఇ ప్పించమంటూ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ అందిస్తున్నారు. సెల్ కంపెనీల వారు వివరాలు సరిచూడకుండానే ఆ నంబర్‌తో పని చేస్తున్న సిమ్‌ను బ్లాక్ చేసి మరోటి ఈ నేరగాళ్లకు అందచేస్తున్నారు. ఓటీజీఎస్ పద్ధతిలో భారీ మొత్తం స్వాహా... ఆ సిమ్‌ను వినియోగించి బ్యాంకుకు కాల్ చేస్తున్న నేరగాళ్లు... ఓ సంస్థకు రియల్–టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) పద్ధతిలో భారీ మొత్తాన్ని బదిలీ చేయనున్నామని, దీనికోసం ఓటీపీ పంపాల్సిందిగా కోరుతున్నారు. ఖాతాదారుడి నంబర్ నుంచే ఫోన్ రావడం, వారు అడిగిన వివరాలు చెప్పడంతో బ్యాంకు సిబ్బంది ఓటీపీ ఇచ్చేస్తున్నా రు. ఇలా సమస్తం తమ చేతికి వచ్చిన తరవాత టార్గెట్ చేసిన ఖాతా ను ఆన్లైన్ ద్వారా యాక్సిస్ చేసి బోగస్ కరెంట్ ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తు న్నారు. వెంటనే దీన్ని డ్రా చేసుకుని ఖాతా మూసేస్తున్నారు. సేవింగ్స్ ఖాతాలనూ ఇదే పంథాలో ద్వారా ఖాళీ చేస్తున్నారు. మైక్రో సిమ్‌కార్డుల ఆధారంగా మరోలా... ఇటీవల అన్ని సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు మైక్రో సిమ్‌కార్డుల్ని అందిస్తున్నారు. సెల్ఫోన్లన్నీ ఇవి పట్టేలా డిజైన్ అవుతుండటంతో పెద్దగా ఉన్న పాత వాటిని ‘రీ–ప్లేస్’చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీన్ని సైతం నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సిమ్ బ్లాకింగ్ కోసం మైక్రోకార్డు ‘విధానాన్ని’అవలంభిస్తున్నారు. ఈ మార్పిడి కోసం ఎమ్టీ మైక్రో సిమ్‌కార్డుల్ని తీసుకునే వినియోగదారులు దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ సిమ్ ఐడెంటిటీ (ఐసీఐడీ) నంబర్‌ను పాత పెద్ద సిమ్ నుంచి సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే తమ తెలివి తేటలు ప్రదర్శిస్తున్న సైబర్ నేరగాళ్లు మైక్రో సిమ్ తీసుకుంటున్నారు. వినియోగదారుల్ని సర్వీసు ప్రొవైడర్ల మాదిరిగా సంప్రదించి తెలివిగా ఐసీఐడీని సంగ్రహించి మైక్రోసిమ్ యాక్టివేట్ చేస్తున్నారు. వినియోగదారులు మేల్కొనే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ తరహా నేరాలు ఇటీవల భారీగా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబు తున్నారు. ఎవరిదైనా సిమ్‌కార్డు హఠాత్తుగా బ్లాక్ అయితే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తు న్నారు. ముందుగా బ్యాంకు ఖాతాను భద్రం చేసుకోవడంతో పాటు సెలవు దినమైనప్పటికీ అధికారుల్ని ఆశ్రయించాలని స్పష్టం చేస్తున్నారు. మనీమ్యూల్స్ సాయంతో స్వాహా సైబర్ నేరగాళ్లు ఈ కరెంట్, సేవింగ్స్ ఖాతాలను తమ అధీనంలోకి తీసుకుంటూ వాటిలోని నగదును ‘మనీమ్యూల్స్’ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు. ఉత్తరాదికి చెందిన అనేక మంది నిరుద్యోగుల్ని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా బోగస్ ధ్రువీకరణలు తయారు చేయించి, వీటి ఆధారంగా ఖాతాలు తెరిపిస్తున్నారు. నగదు ట్రాన్స్ఫర్ పూర్తికాగానే వారి ద్వారా తక్షణం డ్రా చేయించేస్తున్నారు. సాంకేతికంగా మనీమ్యూల్స్‌గా పిలిచే వీరికి స్వాహా చేసిన సొమ్ములో 10 నుంచి 30 శాతం కమీషన్ ఇస్తున్నారు. ఎప్పుడైనా విషయం పోలీసుల వరకు వెళ్లి, వారు దర్యాప్తు చేస్తూ వచ్చినా ఈ మనీమ్యూల్స్ మాత్రమే చిక్కుతారు తప్ప అసలు సూత్రధారులు వెలుగులోకిరారు. బాధితులు నగదు బదిలీ విషయాన్ని గుర్తించేలోపే నేరగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. కేంద్రం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో నగదు విత్‌డ్రాపై ఆంక్షలు వచ్చాయి. దీంతో సైబర్ నేరగాళ్లు నగదు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, డ్రా చేయడం తగ్గించారు. అయినా ఆన్లైన్లో విలువైన వస్తువులు ఖరీదు చేసి, బోగస్ చిరునామాల్లోనే, కొరియర్ వారిని తప్పుదోవ పట్టించో తమ ఉనికి బయటకు రాకుండా వాటిని తీసుకునే ఆస్కారం లేకపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
మళ్లీ కరెంట్ అకౌంట్ లోటు భయాలు
ముంబై: దేశంలో మళ్లీ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) భయాలు తలెత్తే పరిస్థితి కనబడుతోంది. 2017–18లో క్యాడ్ మూడు రెట్లు పెరిగింది. గడచిన ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.9 శాతంగా (విలువలో 48.7 బిలియన్ డాలర్లు) నమోదయ్యింది. 2016–17లో క్యాడ్ 0.6 శాతం (విలువలో 14.4 బిలియన్ డాలర్లు) కావడం గమనార్హం. అంటే ఏమిటి?: ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు (ఎఫ్ఐఐ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ)లు మినహా ఒక దేశానికి సంబంధించి విదేశీ మారకద్రవ్యం స్వీకరణ, చెల్లింపుల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. దీనిని జీడీపీ విలువలో ఇంత శాతమని చెబుతారు. క్యాడ్ పెరిగితే ఒక దేశం ప్రపంచ దేశాలకు నికర రుణగ్రస్థ దేశంగా ఉంటుంది. ఇది రూపాయి బలహీనత, ధరల పెరుగుదల వంటి ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. జీడీపీలో క్యాడ్ 5 శాతానికి చేరడంతో 2013 దేశ ఆర్థిక రంగంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రూడ్ ధరల తీవ్రత క్యాడ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పెరుగుదలకు కారణం..? దేశం నుంచి ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడం దీనితో వాణిజ్యలోటు పెరగడం గత ఏడాది క్యాడ్ పెరుగుదలకు ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. ఒక్క మార్చి త్రైమాసికంలోనే క్యాడ్ భారీగా 13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. -
సేవింగ్ ఖాతా ఆంక్షలపై ఆర్బీఐ తాజా మాట!
-
సేవింగ్ ఖాతా ఆంక్షలపై ఆర్బీఐ తాజా మాట!
త్వరలోనే విత్‌డ్రా ఆంక్షలు ఎత్తివేత ముంబై: నగదు ఉపసంహరణలకు సంబంధించి సాధారణ ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చే కొన్ని నిర్ణయాలను ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరెంటు ఖాతాల నుంచి విత్‌డ్రాయిల్ పరిమితుల్ని పూర్తిగా ఎత్తివేసిన ఆర్బీఐ.. తాజాగా పొదుపు ఖాతాల నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను కూడా త్వరలోనే ఎత్తివేస్తామని ప్రకటించింది. సేవింగ్ అకౌంట్స్ విత్‌డ్రా ఆంక్షలను త్వరలో ఎత్తివేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తాజాగా తెలిపారు. బ్యాంకుల నుంచి నగదు విత్డ్రాయిల్పై ఉన్న ఆంక్షలు గురించి వివరాలు మరోసారి మీ కోసం.. ♦ సేవింగ్స్ అకౌంట్‌కు సంబంధించి ఒకేరోజు ఖాతాదారు రూ.24,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే వారం పరిమితి (రూ.24,000)లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. తాజా నిర్ణయం ఫిబ్రవరి 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ రోజువారీ విత్‌డ్రాయిల్ పరిమితి రూ. 10,000 మాత్రమే. సేవింగ్స్ ఖాతాల వారం విత్‌డ్రాయిల్ పరిమితుల సడలింపుపై తదుపరి రోజుల్లో సమీక్షిస్తామని ఆర్బీఐ గతంలో తెలిపింది. అతి త్వరలోనే ఈ ఆంక్షలను కూడా ఎత్తివేస్తామని తాజాగా వెల్లడించింది. ♦ ఒకేరోజు విత్‌డ్రాయిల్ పరిమితులను తొలగించినా... ఇందుకు సంబంధించి తగిన పరిమితులను స్థిరీకరించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పించడం జరిగింది. ♦ ఇక కరెంట్ అకౌంట్లు, క్యాష్ క్రెడిట్ అకౌంట్లు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్ల నుంచి నగదు ఉపసంహరణ పరిమితులను అన్నింటినీ ఆర్బీఐ తొలగించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ కరెంటు ఖాతాల నుంచి వారానికి రూ. 1 లక్ష మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలనే పరిమితి వుండగా, ఇకనుంచి ఈ ఖాతాల ద్వారా ఎంతైనా తీసుకోవొచ్చు. ♦ పేమెంట్ల విషయంలో డిజిటలైజేషన్వైపు కస్టమరు నడిచేలా బ్యాంకులు తగిన ప్రయత్నాలు చేయాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. -
కరెంటు ఖాతాలపై విత్‌డ్రా పరిమితుల ఎత్తివేత
సేవింగ్స్ ఖాతాల రోజువారీ ఏటీఎం విత్‌డ్రా పరిమితి రూ. 24 వేలకు పెంపు వారం పరిమితులు యథాతథం... ఫిబ్రవరి 1 నుంచీ అమలు ముంబై: నగదు ఉపసంహరణలకు సంబంధించి సాధారణ ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చే కొన్ని నిర్ణయాలను సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకుంది. కరెంటు ఖాతాల నుంచి విత్‌డ్రాయిల్ పరిమితుల్ని పూర్తిగా ఎత్తివేసింది. సేవింగ్స్ ఖాతాల నుంచి మాత్రం రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయిల్ పరిమితిని పెంచింది. ఈ ఖాతాల వారం పరిమితిని మాత్రం యధాతథంగా అట్టిపెట్టింది. వివరాలు... ♦ సేవింగ్స్ అకౌంట్‌కు సంబంధించి ఒకేరోజు ఖాతాదారు రూ.24,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే వారం పరిమితి (రూ.24,000)లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. తాజా నిర్ణయం ఫిబ్రవరి 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ రోజువారీ విత్‌డ్రాయిల్ పరిమితి రూ. 10,000 మాత్రమే. సేవింగ్స్ ఖాతాల వారం విత్‌డ్రాయిల్ పరిమితుల సడలింపుపై తదుపరి రోజుల్లో సమీక్షిస్తామని ఆర్బీఐ తెలిపింది. ♦ ఒకేరోజు విత్‌డ్రాయిల్ పరిమితులను తొలగించినా... ఇందుకు సంబంధించి తగిన పరిమితులను స్థిరీకరించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పించడం జరిగింది. ♦ ఇక కరెంట్ అకౌంట్లు, క్యాష్ క్రెడిట్ అకౌంట్లు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్ల నుంచి నగదు ఉపసంహరణ పరిమితులను అన్నింటినీ ఆర్బీఐ తొలగించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ కరెంటు ఖాతాల నుంచి వారానికి రూ. 1 లక్ష మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలనే పరిమితి వుండగా, ఇకనుంచి ఈ ఖాతాల ద్వారా ఎంతైనా తీసుకోవొచ్చు. ♦ పేమెంట్ల విషయంలో డిజిటలైజేషన్వైపు కస్టమరు నడిచేలా బ్యాంకులు తగిన ప్రయత్నాలు చేయాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. -
ఆ ఖాతాదారుల వివరాలివ్వండి
► కరెంట్ ఖాతాల్లో రూ.12.5 లక్షలు, అంతకుమించి డిపాజిట్ చేసినవారిపై ఐటీ శాఖ నజర్ ► సేవింగ్ ఖాతాల్లో రూ. 2.5 లక్షలు, అంతకన్నా ఎక్కువ జమచేసిన వారిపైనా కన్ను ► ఈ నెల 31లోపు వివరాలు అందించాలని బ్యాంకర్లకు ఆదేశం ► సమాచారం పంపకుంటే విచారణ తప్పదని హెచ్చరిక ► ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌పై బ్యాంకర్లకు శిక్షణ సాక్షి, హైదరాబాద్: నల్లధనంపై ఆదాయపు పన్ను శాఖ పోరును వేగవంతం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిసెంబర్ 31 వరకు లెక్కకు మించిన సొమ్ము పలు ఖాతాల్లో డిపాజిట్ అయినట్టు గుర్తించింది. ఈ మేరకు బ్యాంకర్ల నుంచి సంబంధిత ఖాతాదారుల వివరాలను అందించాలని ఆదేశించింది. ఆ ఖాతాదారుల వివరాలను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తమకు చేరవేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై బుధవారం హైదరాబాద్‌లో బ్యాంకర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా హాజరైన బ్యాంకర్లకు ఐటీ ఇంటెలిజెన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ బీవీ గోపీనాథ్ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చాలా బ్యాంకులు తాము అడిగిన వివరాలివ్వడంతో ఆలసత్వం ప్రదర్శిస్తున్నాయని, ఈ నెలాఖరుకల్లా ఖాతాదారుల పూర్తి వివరాలను ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయాలని స్పష్టంచేశారు. అడిగిన వివరాలు ఇవ్వని ఏపీజీవీబీ, దక్కన్ గ్రామీణ బ్యాంక్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నవంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోని కరెంట్ అకౌంట్లో రూ.12.5 లక్షలు, అంతకు మించి డిపాజిట్ అయిన ఖాతాదారుల వివరాలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఈ నెలాఖరుల్లా అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే సేవింగ్ బ్యాంక్ ఖాతాదారులకు సంబంధించి రూ.2.5 లక్షలు, అంతకుమించి జమ చేసినట్టుగా ఉంటే వారి వివరాలను పంపాలని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు అంటే నవంబర్ 1 నుంచి నవంబర్ 8 వరకు ఖాతాదారులు డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ వివరాలు కూడా పంపాలని ఆదేశించారు. ఈ డిపాజిట్‌దారుల ఆర్థిక మూలాలు, ఇతరత్రా వివరాలపై ఐటీ శాఖ విచారణ జరుపుతుందని తెలిపారు. విచారణ, జరిమానా కూడా.. తాము అడిగే వివరాలను బ్యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 31లోపు పంపించాలని, లేకపోతే బ్యాంకులపై విచారణ జరపాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఐటీ శాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. తమకు సహకరించని బ్యాంకులకు భారీ స్థాయిలో జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంచేశారు. డేటాబేస్‌లో కోటి మంది జాబితా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ శాఖ చేస్తున్న కసరత్తులో భాగంగా కోటి మంది ఖాతాదారుల జాబితాను డేటాబేస్‌లో నిక్షి ప్తం చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కోటి మందిలో ఐటీ నిబంధనలు ఉల్లం ఘించిన వారి వివరాలను సేకరిస్తున్నా మని, త్వరలోనే సంబంధిత డిపాజిట్‌దా రులను విచారించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. -
ఏటీఎంలలో విత్‌డ్రా పరిమితి పెంపు
-
ఏటీఎంలలో విత్‌డ్రా పరిమితి పెంపు
► ఏటీఎం నుంచి ఇక 10 వేలు ► అయితే.. వారానికి 24 వేలే! ► కరెంట్ అకౌంట్ల పరిమితి రూ. లక్షకు పెంపు ► పాత నోట్లు డిపాజిట్ చేసుకునేందుకు ఎన్నారైలకు అదనపు సమయం ముంబై: ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితిని రూ. 10 వేలకు పెంచుతూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వారంలో విత్‌డ్రా పరిమితి రూ. 24 వేలను కొనసాగించింది. అలాగే కరెంట్ అకౌంట్ల నుంచి వారానికి రూ. లక్ష వరకు తీసుకోవచ్చని వెల్లడించింది. దీంతో చిన్న స్థాయి వర్తకులకు కాస్త ఊరట లభించనుంది. ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే పెద్ద నోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, దేశ పౌరులకు తమ వద్ద ఉన్న పాత రూ. 500, రూ. 1,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అదనపు సమయం ఇచ్చింది. నవంబర్ 9న పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2,500గా ఉన్న విత్‌డ్రా పరిమితిని ఆర్బీఐ జనవరి 1 నుంచి రూ. 4,500కు పెంచిన సంగతి తెలిసిందే. కరెంట్ అకౌంట్లలో వారానికి రూ. 50 వేలుగా ఉన్న పరిమితిని ప్రస్తుతం రూ. లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లు రద్దు అయ్యి డిసెంబర్ 30కు 50 రోజులు పూర్తయినా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. -
కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట
-
కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట
న్యూఢిల్లీ: కరెన్సీ బ్యాన్ తో ఉద్భవించిన అనివార్య పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. దేశ ప్రజలకు నగదును అందుబాటులో ఉంచేందుకుగా చర్యలు వేగం చేసింది. మూడు నెలల క్రితం నమోదైన కరెంట్ ఖాతాలకు నగదు విత్ డ్రా పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించి చిన్న వ్యాపారుదారులకు భారీ ఊరట నిచ్చారు. బ్యాంకింగ్ కరస్పాండెట్స్ విత్ డ్రా పరిమితి రూ.50వేలకు, రోజువారి పరిమితి.2.5 లక్షలకు పెంచుతున్నట్టు శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అలాగే డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద లావాదేవీ ఛార్జీలు రద్దుచేయాల్సిందిగా బ్యాంకులు కోరినట్లు విలేకరులతో చెప్పారు. కనీసం మూడు నెలల పాత ఖాతాలలో నగదు ఉపసంహరణ పరిమితి పెంచుతున్నట్టు ప్రకటించారు. వారానికి రూ. 50,000 డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కార్మికుల వేతనాలు, వారాంతపు వ్యాపార చెల్లింపులు తదితర వ్యయాల నిమిత్తం కరెంట్ ఖాతా ఉన్న వ్యాపార సంస్థల పరిమితిని పెంచినట్టు దాస్ చెప్పారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 18 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆయన వెల్లడించారు. ప్రజల ఇబ్బదుల దృష్టిలో పెట్టుకొని నగదు సరఫరా నిమిత్తం దేశవ్యాప్తంగా కొత్త మైక్రో ఏటీఎంలు అందుబాటులో ఉంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ మీడియాకు వివరించారు.