కరెంటు ఖాతాలపై విత్‌డ్రా పరిమితుల ఎత్తివేత | RBI removes cash withdrawal limits at ATMs, current accounts | Sakshi
Sakshi News home page

కరెంటు ఖాతాలపై విత్‌డ్రా పరిమితుల ఎత్తివేత

Published Tue, Jan 31 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

కరెంటు ఖాతాలపై విత్‌డ్రా పరిమితుల ఎత్తివేత

కరెంటు ఖాతాలపై విత్‌డ్రా పరిమితుల ఎత్తివేత

సేవింగ్స్‌ ఖాతాల రోజువారీ ఏటీఎం విత్‌డ్రా  పరిమితి రూ. 24 వేలకు పెంపు
వారం పరిమితులు యథాతథం...
ఫిబ్రవరి 1 నుంచీ అమలు


ముంబై: నగదు ఉపసంహరణలకు సంబంధించి సాధారణ ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చే కొన్ని నిర్ణయాలను సోమవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. కరెంటు ఖాతాల నుంచి విత్‌డ్రాయిల్‌ పరిమితుల్ని పూర్తిగా ఎత్తివేసింది. సేవింగ్స్‌ ఖాతాల నుంచి మాత్రం రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయిల్‌ పరిమితిని పెంచింది. ఈ ఖాతాల వారం పరిమితిని మాత్రం యధాతథంగా అట్టిపెట్టింది. వివరాలు...

సేవింగ్స్‌ అకౌంట్‌కు సంబంధించి ఒకేరోజు ఖాతాదారు రూ.24,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే వారం పరిమితి (రూ.24,000)లో మాత్రం ఎటువంటి మార్పు లేదు.  తాజా నిర్ణయం ఫిబ్రవరి 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ రోజువారీ విత్‌డ్రాయిల్‌ పరిమితి రూ. 10,000 మాత్రమే.  సేవింగ్స్‌ ఖాతాల వారం విత్‌డ్రాయిల్‌ పరిమితుల సడలింపుపై తదుపరి రోజుల్లో సమీక్షిస్తామని ఆర్‌బీఐ తెలిపింది.

ఒకేరోజు విత్‌డ్రాయిల్‌ పరిమితులను తొలగించినా... ఇందుకు సంబంధించి తగిన పరిమితులను స్థిరీకరించుకునే వెసులుబాటును బ్యాంకులకు కల్పించడం జరిగింది.

ఇక కరెంట్‌ అకౌంట్లు, క్యాష్‌ క్రెడిట్‌ అకౌంట్లు, ఓవర్‌డ్రాఫ్ట్‌ అకౌంట్ల నుంచి నగదు ఉపసంహరణ పరిమితులను అన్నింటినీ ఆర్‌బీఐ తొలగించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ కరెంటు ఖాతాల నుంచి వారానికి రూ. 1 లక్ష మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలనే పరిమితి వుండగా, ఇకనుంచి ఈ ఖాతాల ద్వారా ఎంతైనా తీసుకోవొచ్చు.

పేమెంట్ల విషయంలో డిజిటలైజేషన్‌వైపు కస్టమరు నడిచేలా బ్యాంకులు తగిన ప్రయత్నాలు చేయాలని బ్యాంకుల్ని ఆర్‌బీఐ ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement