
బెంగళూరులోనే ఎక్కువగా దొరికాయి
న్యూఢిల్లీ: పాత పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారుల నుంచి రూ. 2 వేల కోట్ల అప్రకటిత ఆదాయం వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఆదాయం వెల్లడించని వారిపై చర్యలు కొనసాగుతున్నాయని, 400 కేసులను ఆదాయపన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది.
పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు రూ. 130 కోట్ల నగదు, పెద్ద మొత్తంలో ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించింది. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఈడీ అధికారులు ఎక్కువ మొత్తంలో అక్రమ నగదును పట్టుకున్నారని తెలిపింది.