Ministry of Finance
-
బడ్జెట్లో పన్ను లాభాలు కల్పించాలి
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక బడ్జెట్లో పన్ను లాభాలు, ప్రోత్సాహకాలు కల్పించవలసిందిగా దేశీ బీమా రంగ కంపెనీలు ఆర్థిక శాఖను కోరుతున్నాయి. బీమా పాలసీల కొనుగోలుదారులకు పన్ను లాభాలు, విక్రయ సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించవలసిందిగా అభ్యర్థిస్తున్నాయి. భారత బీమా అభివృద్ధి, అధికారిక నియంత్రణ సంస్థ(ఐఆర్డీఏఐ) గణాంకాల ప్రకారం 2023–24లో దేశీయంగా బీమా విస్తృతి 3.7 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2022–23)లో నమోదైన 4 శాతంతో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది. జీవిత బీమా రంగంలో 3 శాతం నుంచి 2.8 శాతానికి వెనకడుగు వేయగా.. ఇతర బీమా పరిశ్రమలో విస్తృతి యథాతథంగా 1 శాతంగానే నమోదైంది. కొత్త తరహా పాలసీలతో బీమా పరిశ్రమకు ప్రోత్సాహకాలివ్వడం ద్వారా మరింతమంది కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బీమా సంస్థలకు వీలుంటుందని జోపర్ సహవ్యవస్థాపకుడు, సీవోవో మయాంక్ గుప్తా పేర్కొన్నారు. కొత్తతరహా పాలసీల సృష్టి, పంపిణీలో టెక్నాలజీ వినియోగానికి బీమా కంపెనీలను అనుమతించవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. విభిన్న బీమా పాలసీలతోపాటు.. ఫైనాన్షియల్ ప్రొడక్టులను సైతం విక్రయించేందుకు వీలు కల్పిస్తే పంపిణీ వ్యయాలు తగ్గుతాయని తెలియజేశారు. అంతేకాకుండా పాలసీలు, ప్రొడక్టులు మరింత అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా జీవిత బీమా మరింతమందికి అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు రీన్యూబయ్ సహవ్యవస్థాపకుడు, సీఈవో బాలచందర్ శేఖర్ పేర్కొన్నారు. బీమా పాలసీల కొనుగోలులో పన్ను మినహాయింపులు ప్రకటించడం ద్వారా ప్రోత్సాహాన్నిందించాలని కోరారు. తద్వారా భద్రత, దీర్ఘకాలిక మూలధనానికి వీలుంటుందని తెలియజేశారు. అతితక్కువ విస్తృతిగల గ్రామీణ ప్రాంతాలలో బీమాకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రభావవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీమా రంగంలో అత్యధిక సంస్కరణలకు వీలున్నట్లు ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుప్ రావు పేర్కొన్నారు. ఐఆర్డీఏఐ ఇప్పటికే ‘2047కల్లా అందరికీ బీమా’ పేరుతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ప్రస్తావించారు. వెరసి బీమా కంపెనీలు అందుబాటులో కొత్తతరహా పాలసీలకు రూపకల్పన చేయవలసి ఉన్నట్లు తెలియజేశారు. దేశీయంగా దేశీయంగా 26 జీవిత బీమా కంపెనీలు, 25 సాధారణ బీమా సంస్థలకుతోడు స్టాండెలోన్ ఆరోగ్య బీమా సంస్థలు 8 కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా 2024 మార్చి31కల్లా.. 12 రీఇన్సూరెన్స్, విదేశీ రీఇన్సూరెన్స్ బ్రాంచీలు, రెండు ప్రత్యేక సంస్థలు రిజిస్టరై ఉన్నాయి.జీ20 దేశాలలో భారత్ భేష్ బీమా రంగంలో జీ 20 దేశాలలోకెల్లా భారత్ వేగవంత వృద్ధి సాధిస్తున్న మార్కెట్‌గా నిలుస్తున్నట్లు స్విస్ రే నివేదిక అంచనా వేసింది. 2025–29 మధ్య కాలంలో వార్షికంగా సగటున ప్రీమియంలో 7.3 శాతం పురోగతితో ముందు నిలవగలదని అభిప్రాయపడింది. రానున్న ఐదేళ్లలో నిజ ప్రాతిపదికన(ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి) జీవిత బీమా, ఇతర బీమా కలిపి మొత్తం ప్రీమియం పరిమాణం సగటున ఏటా 7.3 శాతం పుంజుకోవచ్చని అంచనా వేసింది. జీవిత బీమా ప్రీమియంలు 6.9 శాతం, నాన్‌లైఫ్ ప్రీమియంలు 7.3 శాతం చొప్పున వృద్ధి సాధించలగలవని అభిప్రాయపడింది. కాగా.. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలకు బడ్జెట్లో తిరిగి పెట్టుబడులు ప్రకటిస్తే సానుకూల పరిణామంకాగలదని ఇక్రా లిమిటెడ్ ఫైనాన్షియల్ రంగ రేటింగ్స్ విభాగం హెడ్ నేహా పారిఖ్ అంచనా వేశారు. వీటి బలహీన సాల్వెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఇది ప్రయోజనకరంగా నిలవగలదని పేర్కొన్నారు. బీమా రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ప్రధానంగా తక్కువ విలువగల పాలసీలకు బూస్ట్ లభిస్తుందని తెలియజేశారు. ఇది బీమా విస్తృతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. -
UPI Transactions: 11 నెలల్లో రూ.223 లక్షల కోట్లు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) 2024 జనవరి నుంచి నవంబర్ వరకు ఏకంగా రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనడానికి ఈ లావాదేవీలు ఓ ఉదాహరణ అనే చెప్పాలి. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా.. నేపాల్, భూటాన్, యూఏఈ, సింగపూర్, శ్రీలంక, మారిషన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా జరుగుతున్నాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా 2016లో ప్రారంభమైన యూపీఐ.. మల్టిపుల్ బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేయడం ద్వారా చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇది వినియోగదారులకు తక్షణ నగదు బదిలీలకు మాత్రమే కాకుండా.. వ్యాపార లావాదేవీలకు కూడా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటియూపీఐ అనేది భారతదేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. అక్టోబర్ 2024లోనే రికార్డు స్థాయిలో 16.58 బిలియన్ ఆర్థిక లావాదేవీలను యూపీఐ ప్రాసెస్ చేసింది. దీని విలువ మొత్తం రూ.23.49 లక్షల కోట్లు. రాబోయే రోజుల్లో ఈ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అర్థమవుతోంది.Driving the #DigitalPayment revolution, UPI achieved 15,547 crore transactions worth Rs. 223 lakh crore from January to November, 2024, showcasing its transformative impact on financial transactions in India.⁰#FinMinYearReview2024⁰#BankingInitiatives⁰#ViksitBharat pic.twitter.com/Bkbag6542k— Ministry of Finance (@FinMinIndia) December 14, 2024 -
ఎన్పీఏ కేసులు.. ఆర్థిక శాఖ కీలక సూచనలు
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), జాతీయ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) వద్ద ఎన్పీఏ కేసుల సత్వర పరిష్కారానికి వీలుగా బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచనలు చేసింది. విధానపరమైన జాప్యం, కేసుల విచారణలో వాయిదాలను సాధ్యమైన మేర తగ్గించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, ఆయా కేసుల పురోగతిని పర్యవేక్షించాలని కోరింది.వసూలు కాని నిరర్థక రుణ ఖాతాలను ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించడం లేదంటే దివాలా పరిష్కార చర్యలు కోరుతూ ఎన్సీఎల్టీ ముందుకు బ్యాంక్‌లు తీసుకెళ్లడం తెలిసిందే. ఎన్సీఎల్టీలో కేసుల తాజా సమాచారాన్ని బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కార్పొరేట్ శాఖ ఒక పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఎన్ఏఆర్సీఎల్, ఎన్సీఎల్టీలో కేసుల పరిష్కార యంత్రాంగం సమర్థతను పెంచడం, నిర్వహణ సవాళ్ల పరిష్కారం కోసం కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు అధ్యక్షతన తాజాగా సమావేశం జరిగింది.కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే విషయమై ఇందులో చర్చించినట్టు ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. రూ.95,711 కోట్ల విలువతో కూడిన 22 మొండి ఖాలాలను ఎన్ఏఆర్సీఎల్ సొంతం చేసుకోగా, రూ.1.28 లక్షల కోట్ల విలువ చేసే మరో 28 ఎన్పీఏ ఖాతాలను బ్యాంక్‌లు పరిష్కరించుకున్నట్టు సమావేశంలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. -
మూలధన వ్యయాల వృద్ధిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ మూలధన వ్యయాల వేగవంతంపై కేంద్రం దృష్టి సారించింది. రూ. 500 కోట్లకు మించిన వ్యయానికి సంబంధించిన నిబంధనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సడలించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 11.11 లక్షల కోట్ల క్యాపెక్స్‌ను(మూలధన వ్యయం) బడ్జెట్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే ఇది 11.1 శాతం ఎక్కువ. సార్వత్రిక ఎన్నికల కారణంగా కొన్ని నెలలపాటు మందగించిన ప్రభుత్వ వ్యయాలను తిరిగి వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 15 నెలల కనిష్ట స్థాయిలో 6.7 శాతంగా నమోదుకావడానికి ఎన్నికల సందర్భంగా మూలధన వ్యయాల్లో నెమ్మదే కారణమన్న విశ్లేషణలు వచ్చిన సంగతి తెలిసిందే. మూలధన వ్యయాలకు సంబంధించి అనుమతించిన తాజా సడలింపులను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ), సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సీఎన్ఏ), మంత్లీ ఎక్స్పెండిచర్ ప్లాన్ (ఎంఈపీ), స్కీమ్ అలాగే నాన్–స్కీమ్ ఖర్చుల కోసం మంత్రిత్వ శాఖలు రూపొందించిన త్రైమాసిక వ్యయ ప్రణాళిక (క్యూఈపీ)లు సీలింగ్‌ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలు మరోవైపు రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్), టెలికాం శాఖ కోసం బడ్జెట్ మూలధన వ్యయాలపై జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వివిధ మంత్రిత్వ శాఖలు క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరమని అన్నారు. సంవత్సరంలో మిగిలిన నెలల్లో వ్యయాలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ క్యాపెక్స్ కేటాయింపులు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.42 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుత 2024–25లో 90% వృద్ధితో రూ. 2.72 లక్షల కోట్లకు ఎగశాయి. 2024–25కు సంబంధించిన క్యాపెక్స్ ప్రణా ళికల గురించి ఎంఓఆర్టీహెచ్ సెక్రటరీ కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వివిధ చర్యల ద్వారా ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆస్తుల రీసైక్లింగ్ లక్ష్యాలను కూడా చేరుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్థికమంత్రికి సెక్రటరీ తెలియజేసినట్లు సమాచారం. క్యాపెక్స్ వ్యయాల వేగవంతంపై ఆర్థిక మంత్రి వివిధ మంత్రిత్వశాఖలు, సమావేశమవుతున్నారు. -
ప్రతి పేద కుటుంబానికీ రూ.46,715.. నిజమేనా?
‘దేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ ఇదీ వాట్సాప్‌లో విస్తృతంగా చలామణి అవుతోన్న ఓ సందేశం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందించింది. నిజమా.. ఫేకా అన్నది తేల్చేసింది.దేశంలో రోజుకో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చిన వార్తలను కొందరు అవగాహనలేని వాళ్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వార్త ఒకటి వాట్సాప్‌లో హల్ చల్ చేస్తోంది. దేశంలోని ప్రతి పేద కుంటుంబానికీ కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,715 ఆర్థికసాయం అందిస్తోందనేది దాని సారాంశం. అంతటితో ఆగకుండా వ్యక్తిగత వివరాలను కోరుతూ ఓ లింక్ సైతం అందులో ఉంది.ఇది పూర్తిగా ఫేక్ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనేది చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనధికార లింక్‌లలో వ్యక్తగత వివరాలను అందిస్తే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.A #WhatsApp message with a link claims to offer financial aid of ₹46, 715 to the poor class in the name of the Ministry of Finance and, is further seeking the recipient's personal details#PIBFactCheck✔️This message is #FAKE✔️@FinMinIndia has announced no such aid! pic.twitter.com/rFrYeBsbfd— PIB Fact Check (@PIBFactCheck) August 25, 2024 -
అస్థిరంగా రుతుపవనాలు.. స్థిరంగానే ఆర్థిక వృద్ధి
న్యూఢిల్లీ: రుతుపవనాలు కొంత అస్థిరంగా ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక పురోగమనం యథాతథంగా కొనసాగుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై నెలవారీ నివేదిక తెలిపింది. ఆర్థిక సర్వే అంచనాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలోనే నమోదవుతుందన్న ధీమాను వ్యక్తం చేసింది.ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరం గడచిన నాలుగు నెలల్లో ఎకానమీ పురోగమనం సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. ప్రత్యేకించి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు (రూ.7.39 లక్షల కోట్లు) పూర్తి సానుకూల నమోదుకావడం హర్షణీయ పరిణామమని అభిప్రాయపడింది. తయారీ, సేవల రంగాలు సైతం పురోగతి బాటలో ఉన్నాయని వివరించింది. తాజా 2024–25 బడ్జెట్ దేశ ద్రవ్య, ఆర్థిక పటిష్టతకు బాటలు వేస్తుందని భరోసాను ఇచ్చింది.ద్రవ్యోల్బణం కట్టడి (ఐదేళ్ల కనిష్ట స్థాయిలో జూలైలో 3.4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు) సానుకూల అంశంగా వివరించింది. రిజర్వాయర్‌లో నీటి మట్టాలు భారీగా పెరగడం వల్ల ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ పంటల ఉత్పత్తి విషయంలో మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్న నివేదిక, రాబోయే నెలల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో ఈ పరిణామం మరింత దోహదపడుతుందని విశ్లేషించింది. -
సివిల్ సర్వీస్ హిస్టరీలో ఇదే తొలిసారి.. ఆమె పేరు మారింది..జెండర్ మారింది
సాక్షి,హైదరాబాద్ : ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ సివిల్ సర్వీస్ (సీనియర్ ఐఆర్ఎస్)ఉద్యోగి తన పేరుతో పాటు జెండర్‌ను మార్చుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతివ్వడం ఆసక్తికరంగా మారింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నీ రికార్డ్స్‌లలో సదరు ఉద్యోగి పేరు,జెండర్ ఇతర వివరాలు మారిపోనున్నాయి.హైదరాబాద్ కేంద్రంగా కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ (సీఈఎస్‌టీఏటీ) విభాగంలో 35ఏళ్ల అనసూయ సీనియర్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.అయితే తన పేరును అనుసూయకు బదులు తన పేరును ఎం అనుకతిర్ సూర్యగా, జెండర్‌ను సైతం మార్చాలని కేంద్రానికి అభ్యర్ధించారు.అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. అనుసూర్య పేరును ఎం.అనుకతిర్ సూర్యగా మార్చడంతో పాటు జెండర్ సైతం మార్చేందుకు అంగీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్గాఅనుకతిర్ సూర్య లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. సూర్య 2013 డిసెంబర్లో చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమీషనర్‌గా పదోన్నతి పొందారు. గతేడాది హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. అనుకతిర్ సూర్య చదువుఅతను చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీని,2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. -
పేటీఎంకు కేంద్రం భారీ షాక్
ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (ppbl)కు భారీ షాక్ తగిలింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా(FIU-IND) పీపీబీఎల్‌కు భారీ జరిమానా విధించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘింపు కారణమే ఈ జరిమానా అని తెలిపింది. మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది . కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 1న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. తన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి ఆన్లైన్లో లావాదేవీలు, లావాదేవీలను సులభతరం చేయడంతో సహా కొన్ని సంస్థలు చట్ట విరుద్దంగా వ్యాపార కార్యకాలాపాలు చేస్తున్నాయంటూ పలు ప్రభుత్వ ఏజెన్సీల నుండి సమాచారం వచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై దృష్టిసారించాం. తాము చేసిన విచారణలో పీపీబీఎల్‌లోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి వచ్చిన డబ్బు అంటే అసాంఘీక కార్యకాలపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పలు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పలు అకౌంట్లకు మళ్ళించిటన్లు తాము గుర్తించామని’, కాబట్టే చర్యలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అందించిన పలు ఆధారాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎఫ్ఐయూ-ఐఎన్డీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు కేంద్ర ఆర్ధిక వెల్లడించింది. -
జనవరిలో జీఎస్టీ @ రూ.1.72 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జనవరిలో 10.4 శాతం పెరిగి రూ.1,72,129 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. 2017 జూలైలో కొత్త పరోక్ష పన్నుల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇవి రెండవ అతిపెద్ద భారీ వసూళ్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.70 లక్షల కోట్లుపైబడిన వసూళ్లు ఇది మూడవసారి కావడం మరో విశేషం. జనవరి 31వ తేదీ 5 గంటల సమయం వరకూ చూస్తే, ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ నుంచి జనవరి 2024 వరకూ జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం పెరిగి 16.69 లక్షల కోట్లకు ఎగసింది. 2023 ఏప్రిల్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు చోటుచేసుకున్నాయి. -
Budget 2024-2025: వ్యయ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వ్యయ వివరాలు అందించాలని వివిధ మంత్రిత్వ శాఖలను ఆర్థికశాఖ కోరింది. 2024–25 మధ్యంతర బడ్జెట్‌పై కసరత్తు, బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రక్రియను ప్రారంభించినట్లు ఒక సర్క్యులర్ పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నందున మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. జూలై 2019లో తన మొదటి పూర్తి బడ్జెట్‌ను సమరి్పంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రానున్నది ఆరవ బడ్జెట్. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి, 2024–24కు సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తుంది. ‘‘వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన ప్రీ–బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 2023 రెండవ వారంలో ప్రారంభమవుతాయి. దాదాపు 2023 నవంబర్ మధ్య వరకు కొనసాగుతాయి’’ అని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో పనిచేసే బడ్జెట్ డివిజన్ సర్క్యులర్ (2024–25) ఒకటి వివరించింది. ప్రీ–బడ్జెట్ సమావేశాల్లో అంచనాల ఖరారు సెప్టెంబర్ 1 నాటి ఈ సర్క్యులర్ ప్రకారం, అవసరమైన అన్ని వివరాలను అక్టోబర్ 5 లోపు సమరి్పంచేలా ఆర్థిక సలహాదారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత ప్రీ–బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల అనంతరం 2024–25 మధ్యంతర బడ్జెట్‌కు సంబంధించి అంచనాలు తాత్కాలిక ప్రాతిపదికన ఖరారవుతాయి. ప్రీ–బడ్జెట్ సమావేశాల సందర్భంగా, మంత్రిత్వ శాఖలు లేదా శాఖల ఆదాయాలతో పాటు వ్యయాలకు నిధుల ఆవశ్యకతపై చర్చించడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 2024–25 మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమరి్పంచే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరి–చివరిలో బడ్జెట్‌ను సమర్పించే వలస పాలన సంప్రదాయాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 సంవత్సరంలో ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను సమరి్పంచే విధానాన్ని ప్రారంభించారు. తాజా ప్రక్రియతో ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపు నిధులు అందుబాటులో ఉంటాయి. గతంలో ఫిబ్రవరి చివరిలో బడ్జెట్‌ను సమరి్పంచినప్పుడు మూడు–దశల పార్లమెంట్ ఆమోద ప్రక్రియ... వర్షాల ప్రారంభానికి వారాల ముందు మే మధ్యలో పూర్తయ్యేది. దీనితో ప్రభుత్వ శాఖలు వర్షాకాలం ముగిసిన తర్వాత ఆగస్టు–ఆఖరు లేదా సెపె్టంబర్ నుండి మాత్రమే ప్రాజెక్టులపై వ్యయాలను ప్రారంభించేవి. -
సానుకూలమైనా... సవాళ్లూ ఉన్నాయ్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 మొదటి నెల– ఏప్రిల్‌లో శుభారంభం చేసిందని ఆర్థికశాఖ ఏప్రిల్ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. అయితే భారత్ వృద్ధి బాటకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం సవాళ్లు పొంచి ఉన్నాయని పేర్కొంది. వినియోగం స్థిరంగా ఉండడం విస్తృత ప్రాతిపదికన వృద్ధి నమోదుకావడానికి దోహదపడే అంశమైనా, పెట్టుబడుల్లో సామర్థ్యం సృష్టి, రియల్టీలో పెట్టుబడులు వంటి అంశాలపై అనిశ్చితి ఉందని పేర్కొంది. దేశీయంగా అన్నీ సానుకూల అంశాలేనని పేర్కొంటున్న నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ఆర్థిక సంవత్సరం శుభారంభం మొత్తం సంవత్సరానికి ఆర్థిక ఫలితాలను అంచనా వేయడానికి ఏప్రిల్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. అయితే ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను తీసుకుంటే, ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలతోనే ప్రారంభమైందని భావించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని పరిగణనలోకి తీసుకోవాలి. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్‌లో రికార్డు సృష్టించాయి. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. అన్ని పరోక్ష పన్నులనూ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ, 2017 జూలైలో కొత్త పన్ను విధానం ప్రారంభంమైన తర్వాత ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. 2022 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 12 శాతం పెరిగాయి. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ప్రశంసనీయం. ఆర్థిక వ్యవస్థకు ఇది శుభ వార్త. తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ, పన్నుల వసూళ్లు నెలవారీగా ఈ స్థాయికి పెరగడం జీఎస్టీ పట్ల వ్యవస్థలో పెరిగిన విశ్వాసాన్ని, ఆమోదనీయోగ్యతను, సమ్మతిని సూచిస్తోంది. భారత్ ఎకానమీ పటిష్ట పురోగతిని ఇది సూచిస్తోంది. ఐఐపీ భరోసా గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసింకంలో (2022–23 జనవరి–మార్చి) పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ) అందులో దాదాపు 44 వెయిటేజ్ ఉన్న ఎనిమిది పరిశ్రమల కీలక గ్రూప్ ( క్రూడ్ ఆయిల్, విద్యుత్, సిమెంట్, బొగ్గు, ఎరువులు, స్టీల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టŠస్ ) స్థిరమైన వృద్ధి తీరును కనబరిచాయి. అంతక్రితం రెండు త్రైమాసికాలతో పోల్చితే (జూలై–డిసెంబర్) వినియోగ సామర్థ్యం 75 శాతం పెరిగింది. కార్యకలాపాలలో స్థిరమైన వృద్ధి, సామర్థ్య వినియోగం పెరుగుదల సానుకూలతలతో కార్పొరేట్లు కొత్త పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి. భారీ యంత్రసామాగ్రి డిమాండ్, ఉత్పత్తికి సంబంధించిన క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ రంగాలు 4వ త్రైమాసికంలో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. మూలధన వస్తువుల దిగుమతుల్లోనూ పెరుగుదల నమోదయ్యింది. సేవలు, తయారీ, వ్యవసాయమూ.. ప్లస్సే... తయారీ, సేవల రంగం మాదిరిగానే వ్యవసాయ రంగానికి కూడా అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సాధారణ రుతుపవనాల అంచనా, మిగులు నీటి నిల్వ స్థాయిలు, విత్తనాలు– ఎరువులు తగినంత లభ్యత, పటిష్టమైన ట్రాక్టర్ విక్రయాలు జూన్ 2023 నుండి ప్రారంభమయ్యే ఖరీఫ్ విత్తన సీజన్‌కు శుభసూచికలు. అకాల వర్షాలు నమోదవుతున్నప్పటికీ, గోధుమల సేకరణ సజావుగా సాగుతోంది. ఇది ఆహార భద్రతకు ఊతమిస్తోంది. గ్రామీణ డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీల అమ్మకాలు పటిష్టంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలలో అంకెల వృద్ధి నమోదయ్యింది. ఖరీఫ్ సీజన్‌కు మంచి అవకాశాలు, పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) పెరగడం, ప్రభుత్వం బడ్జెట్లో పెంచిన వ్య యం రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు గ్రా మీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం అదుపులోకి... 18 నెలల పాటు రెండంకెల్లో పయనించిన టోకు ద్రవ్యోల్బణం ప్రస్తుతం పూర్తిగా అదుపులోనికి వచ్చింది. ఏప్రిల్‌లో 33 నెలల కనిష్ట స్థాయిలో –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక నవంబర్, డిసెంబర్ మినహా 2022 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కట్టడి పైన కొనసాగిన రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చింది. ముడి పదార్థాల తగ్గుదలను ఇది సూచిస్తోంది. ఖరీఫ్ దిగుబడుల భారీ అంచనాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత దిగివచ్చే అవకాశం ఉంది. ఎగుమతులు భేష్... తీవ్ర పోటీ, అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్ ఎగుమతులు మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. ప్రొడక్ట్ లింక్డ్ స్కీమ్ (పీఎల్ఐ) మద్దతుతో భారత్ నుండి వస్త్ర, రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు కూడా భారీగా పెరుగుతున్నాయి. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల పునరేకీకరణ, కొత్త మార్కెట్లకు అనుగుణంగా శుద్ధి చేసిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. -
గ్రీన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి వనరులపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు దోహదంచేసే (గ్రీన్ క్లైమేట్) ప్రాజెక్టుల్లోకి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా తగిన మిశ్రమ ఫైనాన్స్ ఇన్‌స్ట్రమెంట్ల ద్వారా నిధులు సమీకరించడానికిగాను ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని వర్గాలు తెలిపాయి. 2070 నాటికి కర్బన్ ఉద్గారాలను నికర సున్నాకి తగ్గించాలనే ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ఈ కసరత్తు జరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది కేంద్ర క్యాబినెట్ ఇందుకు సంబంధించి ఒక కీలక విధానాన్ని ఆమోదించింది. మెరుగైన వాతావరణం నెలకొల్పాలన్న లక్ష్యంలో భాగంగా గ్లాస్గో సదస్సులో ప్రధానమంత్రి ప్రకటిత ’పంచామృతం’ వ్యూహానికి అనుగుణంగా క్యాబినెట్ ఆమోదించిన జాతీయ విధాన రూపకల్పన ఉంది. ఈ విధానం ప్రకారం, ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి నుండి 2030 నాటికి 45 శాతం తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉంది. 2030 నాటికి శిలాజ రహిత ఇంధన వనరుల నుండి 50 శాతం విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలన్నది లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆయా లక్ష్యాల సాధన దిశలో సస్టైనబుల్ ఫైనాన్స్, క్లైమేట్ ఫైనాన్స్‌పై జారీ చేయాల్సిన మార్గదర్శకాల కోసం ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఐఎస్ఎస్బీ)తో సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంప్రతింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐఎస్ఎస్బీ రాబోయే రెండు నెలల్లో క్లైమేట్ ఫైనాన్స్ కోసం ప్రమాణాలను ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కాగా, అంతర్జాతీయంగా ఉద్ఘారాలను తగ్గించడానికి చేసే నియమ నిబంధనవాళి, ఇన్స్ట్రమెంట్లు అభివృద్ధి చెందిన– చెందుతున్న దేశాల మధ్య వివక్ష చూపేవిగా ఉండరాదని కూడా భారత్ కోరుకుంటోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
సింపుల్‌గా కోట్లు కొట్టేస్తున్నారు.. టాప్‌లో మహారాష్ట్ర
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ నేరాలు భారత దేశంలోనూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. చిరు ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ సైబర్ నేరగాళ్లు వదలడంలేదు. కంప్యూటర్, ఫోన్లతోనే సింపుల్‌గా పని కానిచ్చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సైబర్ మోసగాళ్లు రూ.731.27 కోట్లు దోచేశారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడేళ్లలో 2.13 లక్షల సైబర్ మోసాలు జరిగినట్లు తెలిపింది. ఏటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్, బ్యాంక్ సర్వర్ నుంచి కస్టమర్ల సమాచారాన్ని హ్యాకింగ్ చేయడం ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తోందని, డిజిటల్ చెల్లింపు భద్రతా నిబంధనలను అమలు చేయాలని బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు, సైబర్ మోసాల నిరోధం, కంప్యూటర్ భద్రతపై జాతీయ నోడల్ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివిధ చర్యలను చేపట్టినట్లు తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికం గత మూడేళ్లలో మహారాష్ట్రలో అత్యధికంగా 83,974 సైబర్ మోసాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో రూ.240 కోట్లు కొట్టేసినట్లు చెప్పింది. ఆ తరువాత తమిళనాడులో 18,981 సైబర్ మోసాల్లో రూ.69.84 కోట్లు దోచుకున్నారు. హరియాణలో 18,573 కేసుల్లో రూ.66.98 కోట్లు, కర్ణాటకలో 11,916 మోపాల్‌లో రూ.60.75 కోట్లు కాజేశారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాల సంఖ్య తక్కువగానే ఉంది. తెలంగాణలో 6,900 మోసాల్లో రూ.21.76 కోట్లు కాజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1,885 సైబర్ మోసాల్లో రూ.5.69 కోట్లు కాజేసినట్లు పేర్కొంది. సైబర్ మోసాల కట్టడికి తీసుకున్న చర్యలు ♦ అన్ని రకాల సైబర్ నేరాలపై ఫిర్యాదులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రారంభం ♦ బాధితులకు సహాయం చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ♦ వినియోగదారుల డేటాను గోప్యంగా ఉంచాలని బ్యాంకులకు సూచన ♦ డిజిటల్ సేవల ప్రక్రియను సురక్షితంగా ఉంచడానికి నియంత్రణ చర్యలు చేపట్టాలని బ్యాంకులకు ఆదేశం ♦ సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో పోస్టర్లు ♦ అన్ని లావాదేవీలకు ఆన్లైన్ హెచ్చరికలను తప్పనిసరి ♦ లావాదేవీల మొత్తంపై రోజువారీ పరిమితులు -
ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక శాఖ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధిపతులతో కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి వివేక్ జోషి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జన సురక్ష, ముద్రా యోజన వంటి వివిధ ఆర్థిక స్కీములను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని బీమా పథకాల్లో మరింత మందిని చేర్చే దిశగా బ్యాంకులు తమ బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లోన వీటి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జోషి సంనట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రోజంతా సాగిన ఈ సవవేశంలో పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్, హౌసింగ్ తదితర శాఖల సీనియర్ అధికారులు, నాబార్డ్ చైర్మన్, ఎన్పీసీఐ సీఈవో మొదలైన వారు కూడా పాల్గొన్నారు. స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి తదితర స్కీముల పురోగతిని సైతం ఇందులో సమీక్షించారు. -
బ్యాంకుల్లో రూ.35 వేల కోట్ల డిపాజిట్లు.. వారసులకు అందేదెలా?
కోటీ, రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.35 వేల కోట్లు. బ్యాంకుల్లో పదేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తమిది. డిపాజిట్‌దారులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యుల(వారసులు)కు కూడా తెలియని డిపాజిట్లు కొన్నయితే, వారసులు ఎవరో తేలక బ్యాంకులోనే ఉండిపోయినవి కొన్ని. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఎవరూ క్లెయిమ్ చేయని ఈ డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లుగా కేంద్ర ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. 10,24,00,599 ఖాతాలకు చెందిన ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిబంధనల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు పేర్కొంది. ఈ సొమ్ము మృతుల వారసులకు చెందాల్సి ఉందని తెలిపింది. ఈ క్లెయిమ్‌లను పరిష్కరించడంలో కుటుంబ సభ్యులకు సహకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. మృతుల ఖాతాలకు సంబంధించి చట్టపరమైన ప్రాతినిధ్యం లేకుండా క్లెయిమ్‌లు పరిష్కరించరు. ఇందుకోసం నిర్దిష్టమైన దరఖాస్తు, నిబంధనలు ఉంటాయి. వీటిని మృతుల కుటుంబ సభ్యులు సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించినట్లు ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ దరఖాస్తులు సరైన వివరాలు లేకుండా, అసంపూర్తిగా ఉంటే వాటిని బ్యాంకులు తిరస్కరిస్తాయని, అయితే వాటిని తిరస్కరించడానికి కారణాలను క్లెయిమ్‌దారులకు బ్యాంకులు తెలియజేయాలని, సక్రమంగా నమోదు చేయడానికి సహకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థి క శాఖ పేర్కొంది. ఈ ఖాతాల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పింది. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, చట్టబద్ధమైన వారసులను కనుగొనేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఒక సంవత్సరానికంటే ఎక్కువ కాలం కార్యకలాపాలు లేని ఖాతాలను ప్రతి ఏడాదీ సమీక్షించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిందని తెలిపింది. ఆ ఖాతాదారులను సంప్రదించి కారణాలను తెలుసుకోవడంతో పాటు ఎటువంటి లావాదేవీలు జరగలేదని లిఖితపూర్వకంగా నిర్ధారించుకోవాలని సూచించినట్లు చెప్పింది. -
రుణాలపై పర్యవేక్షణ కీలకం
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్‌లోని కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో అగ్రశ్రేణి రుణాలపై సరైన పర్యవేక్షణ ఉండాలని, బడా కార్పొరేట్లు తాకట్టు పెట్టిన షేర్లకు సంబంధించి తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోరింది. సమయానుకూల చర్యలను తీసుకోడానికి తాకట్టు పెట్టిన సెక్యూరిటీల మార్కెట్ డేటాను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ తరహా చొరవలు తక్షణం సవాళ్ల నిర్వహణకు దోహదపడే విధంగా ఉంటుందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలపై బ్యాంకింగ్ చీఫ్‌లతో సమా వేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్షోభ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యూహాలను రూపొందించడానికి తగిన అవకాశాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ఆమె బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేశారు. -
నియంత్రణ సంస్థల సేవలు ప్రశ్నార్థకం
ఆర్థికపరమైన అవకతవకలపై తిరుగులేని అధికారాలు చలాయిస్తున్న నియంత్రణా సంస్థగా ‘సెబీ’కి పేరుంది. కానీ వివిధ ప్రభుత్వాల పాలనా కాలాల్లో అది మౌనం పాటించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్పడమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం. అలాంటిది స్వయం నియంత్రణా సంస్థలే తమ విధులను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభిప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? ఈ రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటున్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకం. ప్రపంచంలోనే అత్యున్నత అధికారం చలాయిస్తున్న నియంత్రణా సంస్థల్లో మన ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఒకటి. ఆర్థిక పరమైన అవకతవకలపై శోధన, స్వాధీనం, దాడులు, అరెస్టులకు సంబంధించి తిరుగులేని అధికారాలను సెబీ కలిగి ఉంటోంది. అనుమానాస్పదమైన ట్రేడింగ్ కార్యకలాపాలను, రియల్ టైమ్ ప్రాతిపదికన షేర్ల విలువను తారు మారు చేయడాన్ని పసిగట్టడంలో సెబీకి విస్తృత మైన నిఘా వ్యవస్థ తోడుగా ఉంటోంది. అయిన ప్పటికీ విభిన్న రాజకీయ పాలనా కాలాల్లో ఈ రెగ్యులేటరీ సంస్థ మౌనం పాటిస్తూ వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా, సెబీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం పనిచేస్తూ వచ్చింది. ప్రత్యేకించి యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రె సివ్ అలయెన్స్) రెండో పాలనా కాలంలో ఇది కొట్టొచ్చినట్లు కనబడుతుంది. లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో కో– లొకేషన్ (కోలో) స్కామ్ విషయంలో కానీ, సత్యం కుంభకోణంలో కానీ సెబీ కార్యకలాపాలు ఎలాంటి పబ్లిక్ లేదా రాజకీయ తనిఖీ రాడార్‌లో లేకుండా కొనసాగుతూ వచ్చాయి. ఇటీవలే ఇలాంటి ప్రశ్నలను పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ప్రతిభావంతంగా లేవనెత్తారు. గత రెండేళ్లలో స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీల విలువ అమాంతంగా పెరిగిపోవడంపై ఆమె ప్రశ్నలు సంధించారు. కానీ సెబీ మాత్రం ఈ విషయంలో కనీస అధ్యయనం కూడా చేయనట్లు కనిపిస్తోంది. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ రూ. 20,000 కోట్ల విలువైన అత్యంత భారీ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)ని ఒక కంపెనీ ప్రతిపాదించడాన్ని సెబీ ఎలా అనుమతించిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సరిగ్గానే ప్రశ్నించారు (అయితే ఆ ప్రతిపాద నను తర్వాత ఉపసంహ రించుకున్నారు.) ఆర్థిక అవకతవకలపై అత్యంత క్రియాశీలకంగా ఉండే రెగ్యులేటరీ సంస్థ సెబీ తన విశ్వసనీయత ప్రశ్నార్థకమైన సమయంలో, తన గమనింపునకు వచ్చి నప్పుడు ఈ విషయమై పరిశీలిస్తానంటూ ముభావంగా స్పందించిందే తప్ప అంతకుమించిన విచారణ జరపలేదు. ఎందుకు విచారించలేదనే కీలక ప్రశ్నకు కూడా ఇప్పటికీ అది సమాధాన మివ్వడం లేదు. చర్యలు తీసుకున్న దాఖలా లేదు సెబీ నిద్రపోతోందంటూ సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకు విఫలమవుతోందన్న అంశంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్ప డమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం. సరళీకరణ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున బొగ్గు, భూమి, విద్యుత్, టెలి కమ్యూనికేషన్లు, స్పెక్ట్రమ్, పెట్రోలయం, సహజ వాయువు, స్టాక్ మార్కెట్లు, పెన్షన్ నిధులు– వీటి నిర్వహణ, విమానాశ్రయాలు వగైరా ఎన్నో అంశాలు రెగ్యురేటరీ పరిశీలనా చట్రం పరిధిలోకి వచ్చాయి. అయితే ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లాంటిది కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలిగే అధికారం కలిగివుంటోంది. మరోవైపు విద్యుత్ కమిషన్లు తమ సేవల మార్కెట్లపై అధికారం చలాయించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సెబీ, కాంపిటీషన్ కమి షన్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని కేసులలో తప్పితే నిబంధనలు పాటించకపోవడంపై చర్యలు తీసు కునే శిక్షాత్మక అధికారాలు ఇప్పటికీ బలహీనంగానే ఉంటున్నాయి. స్వయం నియంత్రణా సంస్థలు తమ విధు లను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభి ప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? చాలావరకు ఈ రెగ్యులేటరీ సంస్థలే అక్రమాలకు పాల్పడుతున్నా యనే ఆరోపణలు ఉంటున్నాయి. నిబంధనలను అతిక్రమించే సభ్యులకు వ్యతిరేకంగా ఐసీఏఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) లేదా ఎమ్సీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) వంటి ప్రొఫెషనల్ సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇక క్రీడా సంస్థల విషయానికి వస్తే అవి జీవితకాలం పదవుల్లో ఉండే వ్యక్తులతో కూడుకుని ఉంటు న్నాయి. పైగా వీటి ఆర్థిక సమగ్రతపై సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపున ప్రభుత్వం నియమించిన చట్టబద్ధమైన నియంత్రణాధికార సంస్థలు కూడా లోపరహితమైన స్థాయికి చేరలేక పోతున్నాయి. విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లు,కాంపిటీషన్, సెక్యూరిటీల విషయంలో సంబంధిత కమిషన్ల ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్స్ వంటివి అప్పీలేట్ ట్రిబ్యునల్స్‌కి వెళుతున్నాయి తప్ప నేరుగా హైకోర్టుల ముందుకు వెళ్లడం లేదు. దీని వల్ల జాప్యం జరగడమే కాకుండా కమిషన్ అసలు ఉద్దేశాన్ని పలుచన చేస్తున్నాయి. డిప్యుటేషన్ మరో సమస్య ప్రభుత్వ విభాగాలు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అనేక ఉదంతాల్లో రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. రెగ్యు లేటరీ సంస్థల ఛైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ దీనికి ఒక కారణం కావచ్చు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటు న్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటోంది. ఇలాంటి విభాగాల్లో నియమితులైన వారిని నాటుకుపోయిన ప్రభుత్వ విధేయ సంస్కృతి నుంచి బయటపడవేయలేరా? చాలావరకు రెగ్యులేటరీ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది ప్రభుత్వ ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్ పై వచ్చినవారు. వీరు రెగ్యులేషన్ లో తమకు కెరీర్ ఉందని భావించడం లేదు. అలా భావించే కొద్దిమందే ఈ విభాగాల సభ్యులుగానూ లేదా ఛైర్మన్లుగానూ ఎదుగుతున్నారు. ఈ తరహా రెగ్యులేటరీ విభాగాలు మరొక ప్రభుత్వ సంస్థలానే తరచుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ విభాగాలలోని కీలక స్థానాలు పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్లకు, ప్రభుత్వ అధికారులకు పదవీ విరమణ అనంతరం దక్కించుకునే హోదాలుగా మారిపోయాయి. దీని ఫలితంగా పెద్దగా స్వాతంత్య్రం లేకపోవడం, సంబంధిత రంగాల నియంత్రణాధికారుల్లో సాహసం లేక విజ్ఞానం లేకపోవడం జరుగుతోంది. ప్రభుత్వ ప్రతిష్ఠ పైన మాత్రమే కాకుండా, భారత వృద్ధి గాథపై కూడా ఇది ప్రభావం చూపుతున్నందు వలన, దేశంలోని రెగ్యులేటరీ సంస్థల విశ్వస నీయతను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్న మైంది. నీలూ వ్యాస్ వ్యాసకర్త సీనియర్ టీవీ యాంకర్,కన్సల్టింగ్ ఎడిటర్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
అన్‌రిజిస్టర్డ్ వ్యక్తులకూ ఇక జీఎస్టీ రిఫండ్స్!
న్యూఢిల్లీ: రద్దయిన కాంట్రాక్టులు లేదా బీమా పాలసీలకు సంబంధించి నమోదుకాని (అన్‌రిజిస్టర్డ్) వ్యక్తులు కూడా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వాపసులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)తో జీఎస్టీ పోర్టల్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను పొందాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటనలో సూచించింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తోపాటు, రిఫండ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ రద్దయిన సందర్భంలో తాము అప్పటికే భరించిన పన్ను మొత్తాన్ని వాపసు కోసం క్లెయిమ్ చేయడానికి ఒక సదుపాయాన్ని (ఫెసిలిటీ) కల్పించాలని రిజిస్టర్ కాని కొనుగోలుదారులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపింది. రెండేళ్ల కాల వ్యవధి... తాజా నిర్ణయంతో ఫ్లాట్, భవనం నిర్మాణం లేదా దీర్ఘకాలిక బీమా పాలసీ రద్దుకు సంబంధించి అప్పటికే చెల్లించిన జీఎస్టీని ఇకపై అన్ రిజిస్టర్డ్ వ్యక్తులూ తిరిగి పొందే (రిఫండ్) వెసలుబాటు కలిగింది. నమోదవ్వని పన్ను చెల్లింపుదారు సంబంధిత తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు వాపసుల కోసం ఫైల్ చేయవచ్చని సీబీఐసీ వివరించింది. వస్తువులు, సేవలను స్వీకరించిన తేదీ లేదా ఒప్పందం రద్దయిన తేదీ నుంచి ఇది ఈ రెండేళ్ల కాల వ్యవధి వర్తిస్తుందని వివరించింది. డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ అత్యున్నత స్థాయి 48వ సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా తాజాగా సీబీఐసీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ‘‘రిజిస్టర్ చేయని కొనుగోలుదారులు సరఫరా జరగని చోట జీఎస్టీ వాపసు పొందడానికి తాజా నిర్ణయం అనుమతిస్తుంది. వారిపై ఇప్పటి వరకూ ఉన్న అనవసరమైన వ్యయ భారాన్ని నివారించడంలో సహాయపడుతుంది’’ అని అని భారత్‌లో కేపీఎంసీ ప్రతినిధి (పరోక్ష పన్ను) అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. -
ప్రపంచ ఆర్థిక పరిణామాలపై జాగరూకత
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక పరిణామాలు వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అవుట్‌లుక్‌ను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వే నివేదిక శుక్రవారం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నవంబర్ నెలవారీ నివేదిక హెచ్చరించింది. అయితే కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాస) కట్టడిలోనే ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. బలమైన సేవల ఎగుమతులు, దేశానికి వచ్చే రెమిటెన్సులు ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు 100 బిలియన్ డాలర్లకు తాకే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్ పేర్కొన్న విషయాన్ని నివేదిక ప్రస్తావించింది. -
భారత్ వృద్ధికి ఢోకా లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ద్రవ్య, పరపతి విధానాలు కఠినంగా ఉన్నప్పటికీ, స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మెరుగైన స్థితిలో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక గురువారం తెలిపింది. ఖరీఫ్ పంట చేతికి అందడంతో రానున్న నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుందని, అదే సమయంలో వ్యాపార అవకాశాలు మెరుగుపడటంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 2022కు సంబంధించి నెలవారీ నివేదికను విడుదల చేసింది. అమెరికా వడ్డీరేట్లు పెంపు ‘‘భవిష్యత్ ఇబ్బంది’’కి సంబంధించినది పేర్కొంటూ, స్టాక్ ధరలు తగ్గడానికి దారితీసే అంశం ఇదని పేర్కొంది. దీనితోపాటు బలహీన కరెన్సీలు, అధిక బాండ్ ఈల్డ్స్, అధిక వడ్డీరేట్ల సమస్యలు పలు ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనాల్సి రావచ్చని పేర్కొంది. వృద్ధి అవకాశాల మందగమనం, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రపంచాన్ని మాంద్యం ముందు నిలబెట్టే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. భారత్ ఎగుమతులపై ఇది ప్రభావం చూపినప్పటికీ, దేశీయ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్ సైకిల్ పటిష్టత, వ్యవస్థాగత సంస్కరణలు భారత్‌కు రక్షణగా ఉంటున్నట్లు పేర్కొంది. -
రుణ లక్ష్యాన్ని తగ్గించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని రూ.10,000 కోట్లు కుదించుకుంది. పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడం దీనికి కారణం. భారీ పన్ను వసూళ్ల వల్ల ఉచిత రేషన్ పంపిణీపై అదనపు వ్యయం రూ.44,762 కోట్లు భర్తీ అయ్యే పరిస్థితి నెలకొందని, ఇది కేంద్ర రుణ లక్ష్యాన్ని తగ్గించుకోడానికి సైతం దోహదపడిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విండ్‌ఫాల్ ట్యాక్స్ కూడా ఖజానాకు లాభం ఒనగూర్చనుందని వివరించింది. 2022–23 బడ్జెట్ రూ.14.31 లక్షల కోట్ల మార్కెట్ రుణ సమీకరణలను నిర్దేశించుకుంది. తాజా కేంద్ర నిర్ణయంతో ఇది రూ.14.21 లక్షల కోట్లకు తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–మార్చి మధ్య రూ.5.92 లక్షల కోట్ల (రూ.14.21 లక్షల కోట్లలో రూ.41.7 శాతం) రుణ లక్ష్యాలను జరపాల్సి ఉంది. ఇందులో ఒక్క సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా రూ.16,000 కోట్ల సమీకరణలు జరపనుంది. కాగా, సెప్టెంబర్ 17 నాటికి 30 శాతం అధికంగా (2020–21తో పోల్చి) రూ.8.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. -
21న బ్యాంకర్లతో ఆర్థికశాఖ సమీక్షా సమావేశం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 21వ తేదీన (బుధవారం) ప్రభుత్వ రంగ బ్యాంక్ చీఫ్‌లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనుంది. పీఎస్‌బీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఎంపిక ప్రణాళకలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ప్రొక్యూర్మెంట్ పక్రియపై కూడా ఈ సమావేశం చర్చిస్తుంది. ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరగనున్న ఈ వర్చువల్ సమావేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థల చీఫ్‌లు పాల్గొంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న ప్రత్యక ‘స్వచ్ఛతా’ కార్యక్రమ 2.0 ప్రచారం, సన్నద్ధతపై కూడా సమావేశం చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. -
చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గాను (జూలై–సెప్టెంబర్) ఈ స్కీమ్‌లపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2020–21 ఏడాది తొలి త్రైమాసికం నుండి ఈ రేట్లను కేంద్రం సవరించలేదు. మూడు నెలలకు ఒకసారి ఆర్థిక శాఖ ఈ వడ్డీరేట్లను నోటిఫై చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా మే, జూన్ నెలల్లో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీరేటు రెపోను ఏకంగా 0.9 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా తమ డిపాజిట్, రుణ రేట్ల పెంపునకు తెరతీశాయి. ఇండియన్ బ్యాంక్ రుణ రేట్ల పెంపు ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ గురువారం నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచింది. అన్ని కాలపరమితులకు సంబంధించి రుణ రేట్లు పెరగనున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. పెరిగిన రేట్లు ఆదివారం నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంక్ ప్రకటన ప్రకారం, వినియోగ రుణ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 7.40 శాతం నుంచి 7.55 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్ నుంచి 6 నెలల మధ్య కాలవ్యవధుల రుణ రేట్లు 6.75 శాతం నుంచి 7.40 శాతం శ్రేణిలో పెరిగాయి. వీటితోపాటు బ్యాంక్ ట్రజరీ బిల్స్ ఆధారిత (టీబీఎల్ఆర్) రుణ రేటును, బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్ఆర్) కూడా పెంచింది. 3 నెలల నుంచి మూడేళ్ల కాలానికి పెంపు శ్రేణి 5 నుంచి 6.10 శాతం వరకూ ఉంది. పెంపు 0.40 శాతం నుంచి 0.55% వరకూ నమోదయ్యింది. ఇక బేస్ రేటు 8.30 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. -
గురుకులం.. ఇక కొలువుల కోలాహలం!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల జాతరకు వేళ అయింది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రక్రియ పట్టాలెక్కింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల సొసైటీల పరిధిలో బోధన సిబ్బంది కేటగిరీలో 9,096 ఉద్యోగ నియామకాలకు గతవారం ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యం లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పనలో సొసైటీలు తలమునకలయ్యాయి. అనుమతించిన పోస్టులు, జోన్లవారీగా విభజన, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లకు సంబంధించి మరోమారు పరిశీలన చేపట్టాయి. ఒకట్రెండు రోజుల్లో వీటిని నిర్ధారణ చేసుకున్న తర్వాత గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం బీసీ గురుకుల విద్యాసంస్థలు 261, ఎస్సీ 230, ఎస్టీ 105, మైనారిటీ విద్యాసంస్థలు 207 ఉన్నాయి. బీసీ గురుకులాల్లో అత్యధిక పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాసంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. విద్యాసంస్థల మంజూరు సమయంలోనే శాశ్వత ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. ఏటా 25 శాతం చొప్పున నాలుగేళ్లలో అన్ని సొసైటీల్లో రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. నియామకాల కోసం ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ)ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయగా, తాజాగా మరో 9,096 ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న కొలువుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధికంగా 238 బీసీ గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీసీ గురుకులాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. బీసీ గురుకుల సొసైటీకి 3,870, ఎస్సీ 2,267, ఎస్టీ 1,514, మైనార్టీ సొసైటీలో 1,445 చొప్పున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. సొసైటీలవారీగా ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత గురుకుల నియామకాల బోర్డు వాటిని అన్నివిధాలా పరిశీలించి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయనుంది. -
ఏపీలో మే జీఎస్టీ వసూళ్లు రూ.3,047 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధి సాధించినట్లు కేంద్ర ఆర్థికశాఖ బుధవారం వెల్లడించింది. మే నెలలో రూ.3,047 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు తెలిపింది. గత ఏడాది మే నెలలో వసూలైన జీఎస్టీ రూ.2,074 కోట్లతో పోలిస్తే 47 శాతం పెరిగిందని పేర్కొంది. తెలంగాణలోనూ జీఎస్టీ వసూళ్లలో 33 శాతం వృద్ధి ఉన్నట్లు తెలిపింది. గత ఏడాది మే నెలలో రూ.2,984 కోట్ల జీఎస్టీ వసూలు కాగా ఈ ఏడాది రూ.3,982 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా రూ.1,40,885 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా మే నెలలో జీఎస్టీ రూ.1,40,885 కోట్లు వసూలైనట్లు తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.97,821 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం అధికమని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 43 శాతం, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం 44 శాతం పెరిగినట్లు వివరించింది. జీఎస్టీ వసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి కాగా.. ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా మూడోసారని వెల్లడించింది. -
రెవెన్యూ, ద్రవ్య లోటు తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ, ద్రవ్యలోటును తగ్గించడమే లక్ష్యంగా ఆర్థిక శాఖ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం)లో ఇటీవల సవరణలు చేసింది. ప్రస్తుత సంవత్సరపు ఆర్థిక విధాన వ్యూహం, మధ్యకాలిక ఆర్థిక విధానాన్ని ఎఫ్ఆర్బీఎం పత్రంలో ఆర్థిక శాఖ దీనిని వెల్లడించింది. 2025–26 ఏడాది నాటికి రెవెన్యూ లోటును 2.4 శాతానికి.. ద్రవ్యలోటును 3.5 శాతానికి తగ్గించనున్నట్లు అందులో పేర్కొంది. అప్పుల శాతం కూడా తగ్గింపు ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులను 2025–26 నాటికి 35.5 శాతానికి తగ్గించాలని కూడా ఆర్థిక శాఖ లక్ష్యంగా నిర్ధారించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది (2022–23)లో ఎఫ్ఆర్బీఎం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 36.30గా ఉంది. అయితే, దీనిని 32.79 శాతానికే పరిమితం చేయనున్నట్లు రాష్ట్ర ద్రవ్య విధాన పత్రంలో ఆర్థికశాఖ పేర్కొంది. అంతకుముందు 2021–22 బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35% ఉంటాయని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు అప్పులు 32.51 శాతానికి తగ్గాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ద్రవ్యలోటు 5% ఉంటుందని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు ద్రవ్యలోటు 3.18 శాతానికి తగ్గింది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం చట్టాల్లో సవరణలు చేసుకున్నాయి. అదే తరహాలో ఏపీ కూడా సవరణలు చేయడమే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ద్రవ్య, రెవెన్యూ లోటును తగ్గించాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. పన్ను ఎగవేతలను, లీకేజీలను నిరోధించడం ద్వారా రాష్ట్ర సొంత ఆదాయం పెంచుకోవాలని, లావాదేవీల వ్యయాన్ని తగ్గించడంతో పాటు మరింత సమర్ధవంతంగా పన్ను, పన్నేతర ఆదాయాలను రాబట్టుకోవాలని నిర్ణయించింది. -
ఖజానాకు రుణగండం!
►ఆర్బీఐ మంగళవారం నిర్వహించిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బాండ్ల వేలంలో తెలంగాణ పాల్గొనలేకపోయింది. దీంతో రాష్ట్రం ఆశించిన రూ. 3 వేల కోట్లు రాలేదు. తొలి త్రైమాసికంలో రూ. 8 వేల కోట్ల రుణాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు రూపాయి కూడా సమకూరలేదు. ►రుణ సమీకరణ జరగక సాధారణ ఖర్చులకు నిధులు కూడా గగనంగా మారింది. ఉద్యోగుల వేతనాల చెల్లింపులూ ఆర్థిక శాఖకు కష్టతరమవుతోంది. ఇక ఎఫ్ఆర్బీఎం పరిధిలో రుణాలు తీసుకునే విషయంలో కూడా కేంద్రం మెలిక పెట్టడం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రుణ సమీకరణ కష్టంగా మారింది. సాధారణ రెవెన్యూ ఖర్చులతో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం నిధులు సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రుణాలు సమీకరించుకునేందుకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గతంలో లేని ఆంక్షలు, నిబంధనలు విధించడమే ఇందుకు కారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే ప్రారంభమైన ఈ ఆర్థిక కష్టాలు ఎన్నాళ్లు కొనసాగుతాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు)ను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఆర్థిక శాఖ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక అవసరాల మేరకు ఎఫ్డీలను ఉపసంహరించుకున్నా తాత్కాలికంగానే గట్టెక్కనుంది. రానున్న 10 నెలల కాలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ చాలా కష్టతరం కానుంది. దీంతో అప్పులు తెచ్చుకునే విషయంలో కేంద్రం విధించిన అనవసరపు ఆంక్షల సడలింపు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేంద్రం వివక్షపై ప్రశ్నిస్తున్నా.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కూడా ఈ విషయమై ధ్వజమెత్తారు. రుణాల సమీకరణకు అవకాశం ఇవ్వకుండా ప్రగతికి ప్రతిబంధకాలు వేస్తున్నారంటూ ఆయన అన్ని రాష్ట్రాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమక్షంలోనే ఆరోపణలు చేశారు. 15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయకపోయినా కేంద్రం పనిగట్టుకుని అకస్మాత్తుగా ’ఆఫ్ బడ్జెట్’అప్పులను (నేరుగా ప్రభుత్వం కాకుండా ప్రభుత్వ గ్యారెంటీతో కా>ర్పొరేషన్లు తీసుకునే రుణాలు) రాష్ట్రాల అప్పులుగానే పరిగణిస్తామని చెప్పడం అత్యంత కక్షపూరిత చర్య అని విమర్శించారు. వెంటనే రుణసమీకరణకు అనుమతి ఇవ్వాలని ఆ సమావేశంలో గట్టిగా డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఇవే విషయాలను ఉటంకిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అయినా కేంద్ర వైఖరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలంలో పాల్గొనలేకపోయింది. ఇతర రాష్ట్రాలను వేలానికి అనుమతించిన ఆర్బీఐ తెలంగాణను అనుమతించలేదు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి ఎలా తెస్తారు? మూలధన వ్యయం కింద చేసే ఖర్చు కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందే తప్ప నేరుగా రుణం తీసుకోదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ బడ్జెట్ రుణాలను ఎఫ్ఆర్బీఎం (జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) పరిధిలోకి ఎలా తెస్తారని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇలా పరిగణించడం ద్వారా 5 – 6 వేల కోట్ల రూపాయల వరకు రుణాలు తగ్గిపోతాయని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటోంది. ఎఫ్‌డీల ఉపసంహరణపై మల్లగుల్లాలు! ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కొత్త చర్చకు తావిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను వెంటనే తమకు పంపాలని, బ్యాంకుల ఎంప్యానెల్మెంట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఎఫ్‌డీల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని అన్ని శాఖల అధిపతులకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది. కొన్ని శాఖల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ నేఫథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ ఉత్తర్వులు వచ్చాయనే అభిప్రాయం ఉన్నా.. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్డీలు ఉపసంహరించుకుంటుందా? అనే చర్చ కూడా ఆర్థిక నిపుణుల్లో జరుగుతోంది. అయితే ఎఫ్‌డీల ఉపసంహరణ వరకు ప్రభుత్వం వెళ్లకపోవచ్చని, ఇతర మార్గాలను అన్వేషిస్తున్నామని కొందరు ఆర్థిక శాఖ అధికారులు చెపుతున్నారు. ఎఫ్డీలు ఉపసంహరణతో పాటు ఆంక్షల సడలింపు కోసం కోర్టుకు వెళ్లే అంశంపై కూడా ప్రభుత్వం బుధవారం ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. -
ఖాళీ పోస్టు ఉంటేనే... క్రమబద్ధీకరణ!
♦క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ఆర్థిక శాఖ 15 అంశాలతో కూడిన ప్రొఫార్మాను ప్రభుత్వ శాఖలకు పంపింది. వీటిని ఆయా ప్రభుత్వ శాఖలు.. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చి వివరాలు, ఆధారాలను సేకరించాయి. ♦ప్రొఫార్మాలోని ఏడవ పాయింట్ ప్రకారం.. సదరు కాంట్రాక్టు ఉద్యోగి పనిచేస్తున్న పోస్టును ప్రభుత్వం ఏ జీఓ ఆధారంగా మంజూరు చేసిందనే దానికి ఆధారాలను, సంబంధిత వివరాలను సమర్పించాల్సి ఉంది. అయితే మెజారిటీ కాంట్రాక్టు ఉద్యోగులు ఈ పాయింట్‌కు సమాధానం ఇవ్వలేదు. సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఆర్థిక శాఖ మెలిక పెట్టింది. ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి పనిచేస్తున్న చోట ప్రభుత్వం అప్పటికే పోస్టు మంజూరు చేసి, అది ఖాళీ (వేకెంట్)గా ఉన్నప్పుడే క్రమబద్ధీకరణను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న 11 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి 11 వేల మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారాన్ని సేకరించి ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 11 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొనగా.. వారిలో ప్రస్తుతం ఎంతమంది సర్వీసులో ఉన్నారు?, ఎక్కడెక్కడ ఏయే హోదాలో పనిచేస్తున్నారు? తదితర పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రత్యేక ఫార్మాట్‌ను తయారు చేసి ప్రభుత్వ శాఖలకు పంపింది. లెక్కలు తేల్చిన శాఖలు ప్రొఫార్మా ప్రకారం క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించిన ప్రభుత్వ శాఖలు.. లభించిన సమాచారం మేరకు ప్రస్తుతం ఆయా శాఖల్లో జిల్లాల వారీగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల ఖాళీలు, రోస్టర్ ఆధారంగా అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, రోస్టర్ మినహాయింపులతో అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, మొత్తంగా క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల లెక్కలను ప్రాథమికంగా తేల్చాయి. వాటిని మరోమారు పరిశీలిస్తున్న శాఖలు అతి త్వరలో ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపేందుకు సిద్ధమవుతున్నాయి. భారీగా తగ్గుతున్న అర్హులు! ప్రభుత్వం గుర్తించిన 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతో పోలిస్తే.. ప్రభుత్వ శాఖలు గుర్తించిన క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న వారి సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీ)ను 2003లో నియమించారు. ఈ పద్ధతిలో నియామకాలు చేపట్టగా.. తెలంగాణ ఏర్పాటు నాటికి 1,237 మంది ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్న ఖాళీలు 901 ఉండగా.. రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల వారీగా అర్హత ఉన్న సీఆర్టీలు 159 మంది మాత్రమే కాగా, రోస్టర్ మినహాయింపుతో (కొన్నిరకాల సవరణలతో అవకాశం ఉన్నవారు) మరో 42 మందికి అర్హత ఉన్నట్లు గుర్తించింది. మొత్తంగా 201 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నట్లు అంచనా వేసింది. అంటే 1,237 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో అర్హత సాధిస్తున్నవారు 201 మంది (16 శాతం) మాత్రమేనన్నమాట. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదే తరహాలో అర్హతలున్న కాంట్రాక్టు ఉద్యోగుల సం ఖ్యకు భారీగా కోత పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ పెట్టిన మెలిక ఏళ్లుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మెజారిటీ కాంట్రాక్టు ఉద్యోగులకు నిరాశే మిగల్చనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ క్రమబద్ధీకరించాలి దాదాపు 18 ఏళ్లుగా సీఆర్టీలుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ టీచర్ల నియామకానికి సమానంగా అన్ని రకాల అర్హతలను పరిశీలించి మమ్మల్ని నియమించారు. క్రమబద్ధీకరణపై ఆశతోనే అతి తక్కువ వేతనం ఇచ్చినా ఇన్నేళ్లుగా సర్దుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో ఎంతో సంతోషించాం. కానీ నామమాత్రంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తే మా సీఆర్టీల్లో దాదాపు 85 శాతం మంది అవకాశాన్ని కోల్పోతాం. వివిధ రకాల మెలికలు పెట్టి కోత పెడితే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ వయసులో మాకెవరూ ఉద్యోగాలు ఇవ్వరు. కాబట్టి ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ క్రమబద్ధీకరించాల్సిందే. – మాలోతు సోమేశ్వర్, రాష్ట్ర అధ్యక్షుడు, సీఆర్టీ అసోసియేషన్ -
తెలంగాణపై ఆర్థిక వివక్ష తగదు
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా రుణాల సమీకరణకు అవకాశం ఇవ్వకపోవడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అడ్డుపడడమేనని ధ్వజమెత్తింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సోమ వారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. మూలధన వ్యయం కోసం 2022–23 సంవత్సరానికి రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, రుణాలు తీసుకునే మార్గదర్శకాలు, కేంద్ర ప్రాయోజిత పథ కాలకు నిధుల కోసం ఒకే నోడల్ ఏజెన్సీ నమూనా వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఇది కొనసాగింది. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ మాట్లాడుతూ.. రాష్ట్రాలు జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు అదనంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూర్చుకుని, ఆ అప్పులను రాష్ట్రాల నిధుల నుండి చెల్లిస్తున్నాయని చెప్పారు. అందువల్ల ఆ అప్పులను కూడా రాష్ట్రాల అప్పులుగానే భావిస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రభుత్వ వాదనను గట్టిగా వినిపించారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాదని కేంద్రమే చెప్పింది.. మూలధన వ్యయం కింద 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్లు , 2021–22లో రూ.15 వేల కోట్లు , 2022–23లో లక్ష కోట్లను రుణాల రూపేణా రాష్ట్రాలకు ఇస్తూ.. వాటిని మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిధిలోనికి రాదని గతంలో కేంద్రమే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా మూలధన వ్యయానికి సంబంధించినవేనని తెలిపారు. ప్రధానంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్ , తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు చెందిన వివిధ దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే ఆయా కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారంటీలపై పొందిన రుణాలను తిరిగి చెల్లించగల స్థితికి వస్తాయని వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా సేకరించే అప్పులను రాష్ట్ర అప్పులుగా ఎలా పరిగణిస్తారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్‌సీడీసీలు ఇచ్చే రుణాల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నప్పటికీ వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోకి తీసుకురాలేదని చెప్పారు. కానీ వాటిలో కొన్ని అప్పులను ఎఫ్ఆర్బీఎం పరిధిలో చూపడం, మరికొన్నింటిని చూపకపోవడం వివక్షే అవుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి వివక్షపూరిత చర్యలు సరికావని పేర్కొన్నారు. మూలధన వ్యయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇది అత్యంత కక్షపూరిత చర్య 15వ ఆర్థిక సంఘం ఎలాంటి సిఫారసులు చేయకపోయినా కేంద్రం పనిగట్టుకుని అకస్మాత్తుగా ’ఆఫ్ బడ్జెట్’ (ప్రభుత్వం నేరుగా తీసుకోని అప్పులు) అప్పులను రాష్ట్రాల అప్పులుగా పరిగణిస్తామని చెప్పడం అత్యంత కక్షపూరిత చర్య అని రామకృష్ణా రావు పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల సమీకరణకు నిబంధనల పేరుతో బంధనాలు వేయడం తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపే వివక్షగానే భావించాల్సి వస్తుందని చెప్పారు. ఒకవేళ నూతన నిబంధనలను అమలుపరచదలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేయాలి కానీ గత సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పడం ఏ మాత్రం తగదన్నారు. రాజ్యాంగం ప్రకారం అప్పు తీసుకునేందుకు అవసరమైన అనుమతులను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏ నిబం ధనలు పాటిస్తుందో అవే నిబంధనలు తెలంగాణ ప్రభుత్వం కూడా పాటిస్తుందని చెప్పారు. -
జీఎస్టీ శుభారంభం
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏప్రిల్‌లో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రికార్డు స్థాయిలో రూ.1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి నెలతో పోల్చితే ఈ మొత్తం 25 శాతం అధికం. వ్యాపార క్రియాశీలత మెరుగుదలను గణాంకాలు సూచిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రకటన ప్రకారం... ►ఏప్రిల్‌లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1,67,540 కోట్లు. ►వాటిలో సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.33,159 కోట్లు. ►స్టేట్ జీఎస్టీ వసూళ్లు రూ.41,793 కోట్లు. ►ఇంటిగ్రేటెడ్ వసూళ్లు రూ.81,939 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.36,705 కోట్లుసహా). ►సెస్ రూ.10,649 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.857 కోట్లు సహా). ►ఇప్పటి వరకూ గత ఆర్థిక సంవత్సరం చివరినెల మార్చిలో రూ.1.42 లక్షల కోట్ల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మరుసటి నెల్లోనే ఆ పరిమాణాన్ని తాజా గణాంకాలు అధిగమించడం గమనార్హం. -
జీపీఎస్‌తోనే ఉద్యోగులకు మెరుగైన పెన్షన్
సాక్షి, అమరావతి: సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల న్యాయబద్ధమైన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా.. వారి ఆర్థిక అభ్యున్నతికి స్థిరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తద్వారా ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ మరోవైపు సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ పొందేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను ప్రతిపాదించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో భారీగా ఉంది. సీపీఎస్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని వర్తింపచేస్తే.. రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి వేతనాలు, పెన్షన్లకు వ్యయమవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రజలతోపాటు ఆర్థిక వ్యవస్థ భరించలేవని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగుల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్‌ను ప్రతిపాదించింది. జీపీఎస్‌తోనే అధిక పెన్షన్ ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మూల వేతనం (బేసిక్)లో 20 శాతం పెన్షన్ వస్తోంది. సీపీఎస్ వల్ల ఎంత పెన్షన్ వస్తుందనేది పూర్తిగా వడ్డీ రేట్లమీద ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే వచ్చే పెన్షన్ మొత్తం కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేస్తే 8 శాతం వరకు వడ్డీ ఇచ్చేవారు. ఈ 8 శాతం వడ్డీ ప్రస్తుతం 4 శాతానికి తగ్గిపోయింది. ఇదే ధోరణి కొనసాగితే ఇంకా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌లో అయితే మూల వేతనంలో 33% పెన్షన్ రానుంది. దీనివల్ల పెన్షన్ 65 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఉదాహరణకు ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్‌కు పదవీ విరమణ అనంతరం పెన్షన్ రూ.15,647 వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత జీపీఎస్‌లో అయితే సెకండరీ గ్రేడ్ టీచర్‌కు పదవీ విరమణ అనంతరం రూ.25,856 పెన్షన్ రానుంది. అదే ఆఫీసర్ సబార్డినేట్ ఉద్యోగికి ప్రస్తుత సీపీఎస్‌లో పదవీ విరమణ అనంతరం రూ.9,579 పెన్షన్ వస్తుండగా, అదే ఉద్యోగికి ప్రతిపాదిత జీపీఎస్‌లో రూ.15,829 పెన్షన్ రానుంది. రాష్ట్ర జనాభా, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఆచరణ సాధ్యం కాకే.. సీపీఎస్‌తో ఉద్యోగులతోపాటు వివిధ ఉద్యోగ సంఘాలు కోరుతున్న మేరకు పాత పెన్షన్ పథకాన్ని వర్తింప చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆచరణ సాధ్యం కాదని ఆర్థిక శాఖ గణాంకాలతో సహా వివరించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాత పెన్షన్ పథకాన్ని సీపీఎస్ ఉద్యోగులకు వర్తింపచేయడం అసాధ్యమని వెల్లడించింది. ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగుల 20 శాతం కంట్రిబ్యూషన్ కొనసాగిస్తూ పాత పెన్షన్ పథకం వర్తింపచేస్తే 2100 నాటికి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.21,88,047 కోట్లు అవుతుందని వివరించింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 119 శాతంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం ఏకంగా 395 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 20 శాతం కంట్రిబ్యూషన్ లేకుండా సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపచేస్తే 2100 నాటికి వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.22,81,207 కోట్లు అవుతుందని తెలిపింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 124 శాతమని వెల్లడించింది. కాగా, రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం 446 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. జీపీఎస్ వల్ల మేలు ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కరోనా, రాష్ట్ర ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులుగా మనం ప్రభుత్వం గురించి కూడా కొంత ఆలోచించాలి. ప్రతిదానిపై వ్యతిరేకంగా ఆలోచించడం సరికాదు. ప్రభుత్వానికి ఉద్యోగులపై కక్ష ఉండదు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుంది. మన గురించి ఆలోచించే ప్రభుత్వానికి సహకరించడం మంచిది. – కళ్లేపల్లి మధుసూదనరాజు, అధ్యక్షుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం జీపీఎస్‌ను ఆహ్వానిస్తున్నాం.. మెజారిటీ రాష్ట్రాల్లో సీపీఎస్ అమలవుతోంది. అయితే తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం వైఎస్ జగన్ జీపీఎస్‌ను ప్రతిపాదించారు. పాత పెన్షన్ విధానంలో బేసిక్‌పై 50 శాతం పెన్షన్ ఇచ్చేవారు. జీపీఎస్ కింద ఇప్పుడు 33.5 శాతం పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన చాలా బాగుంది. ఉద్యోగులు రిటైర్ అయ్యాక మంచిగా ఉండాలని తాను ఆలోచిస్తున్నట్లు పీఆర్సీ ప్రకటించే సమయంలోనే సీఎం ఉద్యోగ సంఘాలతో చెప్పారు. సీపీఎస్ విషయంలో బాధపడుతున్న ఉద్యోగులకు 33.5 శాతం పెన్షన్ గ్యారంటీ ఆహ్వానించదగ్గ విషయం. – కె.జాలిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ -
జలం.. పుష్కలం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో ఒక నియోజకవర్గంలో ప్రజలకు శాశ్వత తాగునీటి కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌కు రూపకల్పన చేసింది. తద్వారా వచ్చే 30 ఏళ్ల వరకు(2054) నీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించే వాటర్ గ్రిడ్ పథకానికి ప్రభుత్వం రూ.2,400 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపర ఉత్తర్వులను ఫిబ్రవరిలోనే జారీ చేసింది. దీంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సమగ్ర నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. ఐదు నియోజకవర్గాల్లోని 4,938 పల్లెలు, రెండు మున్సిపాలిటీలకు తాగునీరు అందుతుంది. నిధుల వినియోగం ఇలా రూ.2,400 కోట్ల వ్యయంతో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, ఈ రెండు జిల్లాల్లోని మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు అమలు చేస్తారు. ఈ పనులకు సంబంధించి రూ.1,550 కోట్లతో పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో రూ.850 కోట్ల పనులకు పాలనాపర అనుమతి రావాల్సి ఉంది. రూ.1,550 కోట్లలో కేంద్రం జల్‌జీవన్ మిషన్ కింద రూ.755 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.755 కోట్లు ఖర్చు చేయనుంది.్ల గండికోట రిజర్వాయర్ నుంచి 3.37 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి ఇంటింటికి శుద్ధిచేసిన జలాన్ని కుళాయిల ద్వారా అందిస్తారు. పైప్‌లైన్ ఇలా: మామిళ్లవారిపల్లె రీట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి ఎడమవైపు పైప్‌లైన్ ద్వారా గుర్రంకొండ, వాయల్పాడు, కలికిరి, కలకడ, కేవీపల్లె, పీలేరు, సదుం, రొంపిచర్ల, పులిచర్ల మండలాలకు,కుడివైపు పైప్‌లైన్ ద్వారా పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, కురబలకోట మీదుగా మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, పుంగనూరు, చౌడేపల్లె, సోమల వరకు సాగుతుంది. 165 కిలోమీటర్ల పైప్‌లైన్ వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నుంచి జిల్లాలోని గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు కృష్ణా జలాలను తరలించేందుకు 165 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మిస్తారు. నీటి తరలింపు కోసం గండి, కొండప్పగారిపల్లె, గాలివీడు, కార్లకుండ, గాలివీడు, కలిచర్ల వద్ద 25వేల కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన సంపులు నిర్మిస్తారు. రూ.850 కోట్లకు అనుమతి రావాలి మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో వాటర్‌గ్రిడ్ అమలు కోసం రూ.850 కోట్లకు ప్రభుత్వం నుంచి పాలనాపరమైన అనుమతి రావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతానికి మంజూరైన ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పనుల అమలు ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించాం. –ఎండీ.అబ్దుల్ మతీన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, మదనపల్లె -
ప్రైవేటీకరణకు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు!
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణకు వచ్చే ప్రభుత్వరంగ కంపెనీలను మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థ కొనుగోలు చేయకుండా కేంద్ర ఆర్థిక శాఖ నిషేధాన్ని విధించింది. యాజమాన్య నియంత్రణ ఒక ప్రభుత్వరంగ సంస్థ నుంచి మరో ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ అయితే, సహజసిద్ధంగా ఉన్న అసమమర్థతలన్నవి కొనసాగొచ్చని.. ఇది నూతన ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్ఈ) విధానానికి విరుద్ధమని పేర్కొంది. గతంలో కొన్ని సీపీఎస్ఈల్లో తనకు ఉన్న మెజారిటీ వాటాలను అదే రంగంలో పనిచేసే మరో ప్రభుత్వరంగ సంస్థకు విక్రయించడం గమనార్హం. ఆర్ఈసీలో తన వాటాలను పీఎఫ్సీకి విక్రయించడం తెలిసిందే. అలాగే, హెచ్పీసీఎల్లో వాటాలను ఓఎన్జీసీకి కట్టబెట్టింది. -
‘ఉపాధి’ బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సచివాలయ, రైతుభరోసా కేంద్రాల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను సిద్ధంచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో జరిగే ఈ పనులకు సంబంధించి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు విడుదల రావాల్సి ఉన్నప్పటికీ.. పనులు చేసిన కాంట్రాక్టర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందస్తుగా అడ్వాన్స్ రూపంలో రూ.1,000 కోట్లను గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించింది. వీటి విడుదలకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నిధులు కూడా ఒకట్రెండు రోజుల్లో జమయ్యే అవకాశం ఉందని ఆ శాఖాధికారులు వెల్లడించారు. రావాల్సింది రూ.3,350 కోట్లు ఇక ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరిలో కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవ్వాల్సిన బకాయిలతో కలిపి మొత్తం రూ.3,350 కోట్ల వరకు రాష్ట్రానికి విడుదల చేయాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో గత ఏడాది నవంబరు నెలాఖరు వరకు జరిగిన పనులకు సుమారు రూ.1,510 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అడ్వాన్స్ రూపంలో విడుదల చేసిన రూ.1,000 కోట్లకు తోడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలుగా గత ఏడాదికి సంబంధించి విడుదలైన రూ.320 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలా మొత్తంమీద గత ఏడాది నవంబరు వరకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,510 కోట్లకు గాను ప్రస్తుతం రూ.1,320 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వద్ద సమకూరడంతో చాలావరకు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లింపు 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిధులు లేకపోయినా ఆ పార్టీ నేతల కోసం పెద్దఎత్తున పనులు మంజూరు చేసింది. వీటికి సంబంధించి దాదాపు రూ.1,500 కోట్ల బకాయిలను గత కొన్ని నెలలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. -
రుణమాఫీ బిల్లులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ సొమ్ము విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాది మాఫీ చేయాల్సిన సొమ్ములో కొంత మేరకు ఆర్థిక శాఖ నిలిపేయడమే ఇందుకు కారణం. మార్చి 31 నాటికే రూ. 50 వేలలోపు రైతుల పంట రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు ఉన్న పంట రుణాలనే ప్రభుత్వం మాఫీ చేసింది. రూ. 37 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉన్న రుణాల మాఫీ కోసం మరో రూ. 857 కోట్లు అవసరం ఉంది. ఈ సొమ్ము విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖకు బిల్లులు సమర్పించగా నిధుల కొరత వల్ల ఫైల్ నిలిచిపోయిందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వం రెండోదశ రుణమాఫీ కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయింది. మరోవైపు తమకు మాఫీ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో రాలేదంటూ అనేక మంది రైతులు వ్యవసాయశాఖ చుట్టూ తిరుగుతున్నారు. మాఫీ అయింది రూ.1,144.38 కోట్లే... 2018 ఎన్నికల సమయంలో రూ. లక్ష వరకు ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నాలుగేళ్లలో రుణమాఫీ కోసం రూ. 20,164.20 కోట్లు కేటాయించినా అందులో కేవలం రూ. 1,144.38 కోట్లనే విడుదల చేసింది. వాటితో 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. 2020లో రూ. 25 వేలలోపు రుణాల కోసం రూ. 408.38 కోట్లు రుణమాఫీకి బదిలీ చేసింది. 2021 ఆగస్టులో రూ. 25 వేల నుంచి రూ. 50 వేల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ. 1,790 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 25 వేల నుంచి రూ. 37 వేల లోపు రైతులకు చెందిన రూ. 763 కోట్ల రుణాలనే మాఫీ చేసింది. ఇంకా రూ. 1,027 కోట్ల నిధులు అందించి రైతులకు మాఫీ చేయాల్సి ఉంది. అందులో రూ. 857 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా మిగిలిన వాటికి బిల్లులు ఇవ్వాల్సి ఉంది. -
రెండేళ్లు రిటైర్మెంట్లు లేవు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో 2022, 2023 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగి కూడా రిటైర్ కావడం లేదు. అయితే 2024 నుంచి 2031 వరకు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేయనుండటంతో పెన్షన్ల వ్యయం భారీగా పెరగనుంది. ఆ సమయంలో ఏటా దాదాపు 13 వేల నుంచి 16 వేల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కానున్నారు. ఏకంగా 1,17,355 మంది పదవీ విరమణ చేయనున్నారు. పెన్షన్ల వ్యయం ప్రస్తుతం రూ.17,204.79 కోట్లు వరకు ఉండగా 2024లో ఏకంగా రూ.25,520.04 కోట్లకు పెరగనుంది. ఇటీవల అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య విధాన పత్రంలో ఆర్థిక శాఖ ఈ అంశాలను వెల్లడించింది. 2031లో పెన్షన్ల వ్యయం రూ.34,251.89 కోట్లకు చేరుతుందని ఆర్ధిక శాఖ పేర్కొంది. 2022 నుంచి 2031 వరకు పెన్షన్లకు మొత్తం రూ.2,73,780.40 కోట్లు వ్యయం కానుందని తెలిపింది. పెంపుతో ఉద్యోగులకు భారీ ప్రయోజనం పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచడంతో ఉద్యోగులకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. సగటున నెలకు రూ.లక్ష వేతనం పొందుతున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచడంతో రూ.24 లక్షల మేర ప్రయోజనం కలగనుంది. సగటు ఉద్యోగికి రెండేళ్లలో రూ.14.40 లక్షల చొప్పున ఆర్థిక ప్రయోజనం కలగనుంది. -
గతి శక్తి, పీఎల్ఐ స్కీమ్‌తో ఎకానమీకి రక్ష
న్యూఢిల్లీ: గతిశక్తి, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు భారత్ ఎకానమీని అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తాయని ఆర్థికశాఖ పేర్కొంది. దీనితోపాటు సంబంధిత పథకాలు దేశంలో పెట్టుబడులను పెంచుతాయని విశ్లేషించింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన పునరుద్ధరణ, అధిక వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. కాగా భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, వాటి ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, ఎరువులు, ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతాయని నెలవారీ విశ్లేషణా నివేదిక పేర్కొంది. దీని పర్యవసాన ప్రభావం ప్రపంచవ్యాప్త వృద్ధి అవుట్‌లుక్‌పై పడుతుందని తెలిపింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఇంధన ధరల తీవ్రత, ఆహార మార్కెట్లో సరఫరాల సమస్యలు ఆర్థిక సంవత్సరంలో ఎంతకాలం కొనసాగుతాయన్న అంశం భారత్ ఎకానమీకి కీలకం. అయితే తాత్కాలిక అవాంతరాలు దేశ వాస్తవిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టత దీనికి కారణం. ► భారత్ ఎకానమీకి సవాళ్లు ఎదరయినప్పటికీ, వీటి తీవ్రతను తగ్గించడానికి గతిశక్తి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లు దోహదపడతాయి. పెట్టుబడులు, వేగవంతమైన రికవరీ, పటిష్ట వృద్ధికి ఈ పథకాలు సహాయపడతాయి. దీనికితోడు గత కొన్నేళ్లుగా తీసుకున్న నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా సరఫరాల సవాళ్లు తగ్గుతాయని భావిస్తున్నాం. ► శ్రామిక శక్తి వినియోగం మెరుగుదల, నిరుద్యోగం రేటు తగ్గడం, ఆర్థికంగా పేదలకు నిరంతర మద్దతు అందించడానికి ప్రభుత్వ పటిష్ట చర్యలు (పీఎం గరీబ్ కళ్యాణ్ యోజనను సెప్టెంబర్ 2022 చివరి వరకు మరో ఆరు నెలల పాటు పొడిగించడం) ఎకానమీని విస్తృత స్థాయిలో సుస్థిర వృద్ధి బాటలో ముందుకు నడుపుతాయి. ► వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు మార్చి 2022లో రూ. 1.4 లక్షల కోట్లను దాటి రికార్డు సృష్టించాయి. రికవరీ అనంతర వృద్ధి ప్రారంభాన్ని ఇది సూచిస్తోంది. రాష్ట్రాలు క్రమంగా మహమ్మారి ప్రేరేపిత పరిమితులను సడలిస్తుండడం ఎకానమీకి లాభిస్తోంది. ముడి పదార్థాల ధరల పెరిగినా, సేవల రంగం పటిష్టంగా ఉంది. ఇన్పుట్స్ వ్యయం 11 సంవత్సరాల గరిష్ట స్థాయికి నమోదయినప్పటికీ ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరిలో 51.8 వద్ద ఉంటే, మార్చిలో 53.6కు ఎగసింది. వ్యాక్సినేషన్ విస్తృతితో కోవిడ్–19 కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇవన్నీ ఎకానమీ వేగవంతమైన పురోగతిని సూచిస్తున్నాయి. ► ప్రైవేట్ వినియోగంలో వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీఐ లావాదేవీల విలువలు, పరిమాణాలు 2021– 22లో రెండింతలు పెరిగాయి. మార్చి 2022లో యూపీఐ లావాదేవీల పరిమాణం మొదటిసారిగా ఒక నెలలో 5 బిలియన్లను దాటింది. ► ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మూలధన పెట్టుబడులు మహమ్మారి ప్రేరిత, అంతకుముందు ఆర్థిక సంవత్సరాల (2019–20, 2020–21) స్థాయిలను అధిగమించాయి. ప్రైవేటు పెట్టుబడులు కూడా మరింత ఊపందుకునే వీలుంది. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ భారీగా ఆకర్షిస్తోంది. ఆర్థిక వ్యవస్థలోకి స్థూల ఎఫ్‌డీఐల ప్రవాహం 2021 ఏప్రిల్– 2022 జనవరి మధ్య 69.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ)ద్వారా పెట్టుబడుల్లో 2021 ఏప్రిల్– 2022 ఫిబ్రవరి మధ్య (అంతక్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి) 29.7 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనివల్ల భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 630 డాలర్లకుపైగా పెరిగాయి. ఇవి 12 నెలలకుపైగా దిగుమతులకు సరిపోతాయి. ► 2022 జనవరిలో నికర ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారుల సంఖ్య 15.3 లక్షలుగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 37.4 శాతం అధికం. ఇది విస్తృత ఆర్థిక పునరుద్ధరణ ఉపాధి అవకాశాల వృద్ధిని కూడా పెంచిందని సూచిస్తోంది. ఆర్థికరంగం బాగుంది భారత్ ఎకానమీ పరిస్థితి ప్రస్తుతం బాగుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునే స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని తట్టుకోగలిగిన స్థాయిలో దేశం ఆర్థిక రంగం ఉంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై అధిక దృష్టి అవసరం. – బిమల్ జలాన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ -
జీఎస్టీ వసూళ్లు.. రికార్డ్
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మార్చి నెల్లో ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదుచేశాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం రూ.1.42 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం పురోగతి నమోదయ్యింది. ఎకానమీ రికవరీ, పటిష్ట అమ్మకాలను గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. దీనికితోడు పన్ను ఎగవేతల నిరోధానానికి కేంద్రం తీసుకున్న పలు చర్యలూ తగిన ఫలితాలు ఇస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2022లో జనవరిలో నమోదయిన వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు ఇప్పటి వరకూ రికార్డుగా ఉన్నాయి. తాజా గణాంకాలు ఈ అంకెలను అధిగమించాయి. ► మొత్తం రూ.1,42,095 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.25,830 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.32,378 కోట్లు ఇంటిగ్రేటెడ్ (రెండూ కలిసి) వాటా రూ.74,470 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.39,131 కోట్లుసహా). సెస్ రూ.9,417 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలయిన రూ.981 కోట్లుసహా). ► 2022 మార్చిలో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 25 శాతం అధికం. దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ఆదాయాలు 11 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. ► 2022 ఫిబ్రవరిలో మొత్తం ఈ–వే బిల్లుల సంఖ్య 6.91 కోట్లు. ఇది వ్యాపార కార్యకలాపాల వేగవంతమైన రికవరీని సూచిస్తోంది. ► గత ఆర్థిక సంవత్సరం రూ. లక్ష కోట్లపైన జీఎస్టీ వసూళ్లు ఇది వరుసగా తొమ్మిదవ నెల. మే, జూన్ మినహా మిగిలిన పది నెలల్లో వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి. ఇక వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లను దాటడం ఆర్థిక సంవత్సరంలో ఆరవసారి. -
త్వరలో ఆర్టీసీ సర్వీసింగ్ సెంటర్లు
సాక్షి, అమరావతి: ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా ఆర్టీసీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న విలువైన భూములను వాణిజ్య అవసరాలకోసం సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించింది. ఆర్థిక శాఖ సూచనలతో ఈ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలను ప్రైవేట్ వాహనాల సర్వీసింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఆర్టీసీకి ప్రస్తుతం రాష్ట్రంలో విలువైన ప్రదేశాల్లో గ్యారేజీలు, డిపోలు ఉన్నాయి. ఒక్కో గ్యారేజీ పది ఎకరాల్లోను, డిపోలు ఆరేడు ఎకరాల్లోను విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల సర్వీసింగ్ చేస్తున్నారు. అదే గ్యారేజీలు, డిపోల్లో ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్ సేవలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్టీసీ విజయనగరం, ఏలూరు, కర్నూలుల్లో టైర్ సర్వీసింగ్ సెంటర్లను నిర్వహిస్తోంది. అదే రీతిలో రాష్ట్రంలోని ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలలో పూర్తిస్థాయిలో ఆటోమొబైల్ సర్వీసింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ చేపట్టేందుకు అధికారుల కమిటీని నియమించింది. తక్కువ చార్జీతో మెరుగైన సేవలు ప్రైవేటు సర్వీసింగ్ సెంటర్ల కంటే మెరుగైన రీతిలో తక్కువ ధరకు వాహనాల సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. సాధారణ సర్వీసింగ్, అన్ని రకాల రిపేర్లు, బాడీ పెయింటింగ్, వాటర్ సర్వీసింగ్ మొదలైన సేవలు అందిస్తారు. ఆర్టీసీ టెక్నికల్ స్టాఫ్ స్కిల్డ్ సేవలు అందిస్తారు. అన్‌స్కిల్డ్ సేవల కోసం అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తారు. ప్రస్తుతం గ్యారేజీల్లో ఉన్న మౌలిక వసతులతోపాటు అవసరమైన యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తారు. ఆర్టీసీ వాహనాలు, ప్రైవేటు వాహనాలకు వేర్వేరుగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీ వాహనాల స్పేర్ పార్టులు, ప్రైవేటు వాహనాల స్పేర్ పార్టులకు వేర్వేరుగా స్టోర్ రూమ్‌లు, రికార్డులు నిర్వహిస్తారు. తద్వారా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూస్తారు. తొలిదశలో భారీ వాహనాలకు సర్వీసింగ్ సేవలను అందుబాటులోకి తెస్తారు. అనంతరం కార్లు, ఎస్‌యూవీలు, ఇతర వాహనాల సర్వీసింగ్ అందిస్తారు. తొలిదశలో నాలుగైదు కేంద్రాల్లో రెండు నెలల్లో సర్వీసింగ్ సేవలను ప్రారంభించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అనంతరం అన్ని ఆర్టీసీ డిపోలు, గ్యారేజీల్లో ప్రైవేటు వాహనాల సర్వీసింగ్ సేవలను విస్తరించనున్నారు. ప్రైవేటు సర్వీసింగ్ కేంద్రాల కంటే మెరుగైన రీతిలో తక్కువ చార్జీలకు ఆర్టీసీ ఆటోమొబైల్ సర్వీసింగ్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ కృష్ణమోహన్ చెప్పారు. -
కౌలు రైతులకు రుణాలపై మరింత దృష్టి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు రుణాల మంజూరుపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. శుక్రవారం సచివాలయంలో ఆయన ఆధ్వర్యంలో 218వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. బ్యాంకుల సహకారం ప్రభుత్వానికి బాగా లభిస్తోందని, ఇదే తోడ్పాటును ఇక ముందూ అందించాలని కోరారు. వార్షిక రుణ ప్రణాళికలో బ్యాంకులు ఇప్పటివరకు మంచి ప్రగతిని సాధించాయని అభినందించారు. అలాగే సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం తమ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని.. దీనికి ఇతోధికంగా సహకారం అందించాలని కోరారు. జగనన్న కాలనీలు, వైఎస్సార్ చేయూత పథకాలకు బ్యాంకులు సహాయ సహకారాలు అందించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయాన్ని పెంచాలని.. వారికి అందించే పథకాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రైవేటు బ్యాంకులూ భాగస్వాములు కావాలి.. ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా పథకాల్లో భాగస్వాములు కావాలని.. తద్వారా రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలని మంత్రి బుగ్గన సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఆర్బీకేల ద్వారా బ్యాంకు రుణం పొందేలా ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుందని తెలిపారు. దీనికి బ్యాంకులు సహకారం అందించాలని కోరారు. సహకార బ్యాంకుల పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వాటికి కావాల్సిన షేర్ క్యాపిటల్ రూ.270 కోట్లకు కూడా సహకారం అందించామన్నారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన సాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాలన వికేంద్రీకరణకు దోహదం చేస్తుందన్నారు. అంతేకాకుండా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడానికి ఊతం ఇస్తుందని తెలిపారు. ప్రయోగాత్మకంగా 13 ప్రాంతాల్లోని ఆర్బీకేల వద్ద ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టిందన్నారు. ఇవి రైతులు గ్రామాల్లో బ్యాంకు సేవలు పొందడానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ ఎస్ఎస్ రావత్, ఆర్బీఐ జీఎం యశోద బాయి, నాబార్డు జీఎం రమేష్ బాబు, ఇతర బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలకు పదివేల మంది బదిలీ
సాక్షి, అమరావతి: ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించేందుకు జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల ప్రొవిజనల్ కేటాయింపు కసరత్తు పూర్తయింది. నూతన రెవెన్యూ డివిజన్లలో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులను జనాభా ప్రాతిపదికన పూర్తి చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు సుమారు పది వేల మంది ఉద్యోగులు ప్రొవిజనల్ కేటాయింపుతో పాటు బదిలీలు కానున్నట్లు ఆర్ధిక శాఖ అంచనా వేసింది. ప్రొవిజనల్ కేటాయింపులో కొత్త జిల్లాలకు బదిలీ చేసే ఉద్యోగులు, అధికారుల సర్వీసు సీనియారిటీతో పాటు ఇతర సర్వీసు అంశాలన్నీ యథాతథంగా ఉంటాయి. కొత్త జిల్లాలు, డివిజన్లకు ప్రొవిజనల్ కేటాయింపులతో బదిలీ అయ్యే ఉద్యోగుల స్థానికత యథాతధంగా ఉంటుందని ఆర్ధిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. సీనియారిటీ, పదోన్నతులపై ప్రభావం లేకుండా.. ఉదాహరణకు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రంగాల్లో 90 పోస్టులుంటే కొత్తగా ఏర్పాటవుతున్న సత్యసాయి జిల్లాకు జనాభా ప్రాతిపదికన ఆ పోస్టులను విభజిస్తారు. ఆ పోస్టుల విభజన మేరకు ఉద్యోగులను ప్రొవిజనల్‌గా కేటాయిస్తారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు ఉద్యోగుల ప్రొవిజనల్ కేటాయింపుల కోసం ప్రస్తుత జిల్లాలు, డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లను తీసుకున్నారు. ఒకే పోస్టుకు ఎక్కువ మంది ఆప్షన్లు ఇస్తే రివర్స్ విధానంలో జూనియర్లను బదిలీ చేస్తారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు ప్రొవిజనల్ కేటాయింపుల్లో వెళ్లే ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతులపై ఎటువంటి ప్రభావం చూపదు. ప్రొవిజనల్ కేటాయింపుల్లో కొత్త జిల్లాలు, డివిజన్లకు బదిలీ అయ్యే ఉద్యోగులు, అధికారులకు బదిలీ ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. కొత్తజోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ బదిలీలన్నీ తాత్కాలికంగా ప్రొవిజనల్‌గా పనిచేయడానికి మాత్రమేనని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. 31న తుది నోటిఫికేషన్ కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుకు ఈ నెల 31వ తేదీన తుది నోటిఫికేషన్ జారీ కానుంది. ఆ వెంటనే కొత్త జిల్లాలకు, డివిజన్లకు ప్రొవిజనల్‌గా ఉద్యోగులను బదిలీ చేస్తూ సంబంధిత శాఖలు ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. ప్రస్తుతం 13 జిల్లాల్లో ఆసరా–సంక్షేమ జాయింట్ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిని కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు రెవెన్యూ ఆఫీసర్లు (డీఆర్వో)గా నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుత జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ లేదా డిప్యుటీ డైరెక్టర్‌ను కొత్త జిల్లాలకు కేటాయిస్తే వారిని జిల్లా వ్యవసాయ అధికారిగానే పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కొత్త జిల్లాకు కేటాయిస్తే జిల్లా మహిళా శిశు సంక్షేమ ఆఫీసర్‌గా పరిగణిస్తారు. కొత్త జిల్లాలకు బదిలీ అయ్యే ఉద్యోగులు, అధికారుల వివరాలను ఈ విధంగానే రూపొందించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగి పేరు, గుర్తింపు నెంబర్, క్యాడర్, హోదా, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం, ప్రొవిజనల్‌గా కేటాయిస్తున్న జిల్లా పేరుతో జాబితాలను రూపొందించనున్నారు. -
ఏప్రిల్ నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులన్నింటినీ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనమండలిలో బుధవారం ప్రకటించారు. గ్రాట్యుటీ, జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, ఇతర పింఛను ప్రయోజనాలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి బకాయిలు లేవని, నిర్ధిష్ట సమయంలోనే వాటి చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపులలో కొంత జాప్యం చోటు చేసుకుంటుందని చెప్పారు. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని, ఏప్రిల్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితే ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎగుమతుల్లో పురోభివృద్ధి ఎగుమతుల విషయంలో మన రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకినట్టు మంత్రి బుగ్గన శాసనమండలిలో తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,04,829 కోట్లు, 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,24,745 కోట్లు, 2021 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 7 నెలల కాలంలో రూ.1,69,404 కోట్లు విలువైన ఎగుమతులు రాష్ట్రం నుంచి జరిగాయని వివరించారు. -
ఐదేళ్ల జీఎస్టీ పరిహారం చెల్లిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనల ప్రకారం ఐదేళ్లపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. పొందూరు ఖాదీకి జీఐ గుర్తింపు ఇవ్వాలి పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగింగ్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ డిమాండు చేశారు. ఎలక్ట్రికల్ చార్జింగ్ ఏర్పాటు చేయాలి కేంద్రం తిరుపతిలో ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. పాయకరావుపేటలో వెదురు క్లస్టర్‌పై లేఖ పాయకరావుపేటలో వెదురు క్లస్టర్ ఏర్పాటు నిమిత్తం ఏపీ బ్యాంబూ మిషన్ డైరెక్టర్‌కు నేషనల్ బ్యాంబూ మిషన్ లేఖ రాసినట్లు వ్యవసాయశాఖ సహాయమంత్రి శోభా కరాంద్లాజే తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువులకు చర్యలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువులకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర సహాయమంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప ప్రశ్నకు జవాబు ఇచ్చారు. స్మారక కట్టడాలను సంరక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్‌లోని 135 స్మారక కట్టడాలను సంరక్షిస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, ఎన్.రెడ్డెప్ప, గురుమూర్తి, గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. ఏపీ నుంచి రూ.15.48 కోట్ల యూసీలు గిరిజన సబ్ స్కీం కింద కేంద్రం ప్రత్యేక సాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.15.48 కోట్లకు యూసీలు పంపిందని కేంద్ర సహాయమంత్రి రేణుక సింగ్ సరూతా తెలిపారు. 2020–21కి గిరిజనుల ఆరోగ్యం, విద్య, శానిటేషన్, మంచినీరు పంపిణీ, నైపుణ్యాభివృద్ధి తదితరాలకు రూ.49.54 కోట్లు విడుదల చేశామన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో అడ్డతీగల, రంపచోడవరంలలో ఏకలవ్య పాఠశాలలు నడుస్తున్నాయని తెలిపారు.ఎంపీలు బాలశౌరి, మార్గాని భరత్ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. -
ఏపీ జీఎస్టీ వసూళ్లు రూ.3,157 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: గత ఏడాది కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది. 2021 ఫిబ్రవరితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో 19% వృద్ధితో ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,157 కోట్ల మేర జీఎస్టీ సమకూరింది. తెలంగాణలో 13% వృద్ధితో రూ.4,113 కోట్ల మేర జీఎస్టీ ఆదాయం సమకూరింది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో కోవిడ్–19 ఆంక్షలు కొనసాగినప్పటికీ జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే ఐదోసారి జీఎస్టీ ఆదాయం రూ.1.30 లక్షల కోట్ల మార్క్ దాటింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయం సేకరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఇది 18% అధికం. ఫిబ్రవరిలో జీఎస్టీ స్థూల రాబడి రూ.1,33,026 కోట్లు కాగా, ఇందులో సీజీఎస్టీ (కేంద్ర జీఎస్టీ) రూ.24,435 కోట్లు, ఎస్జీఎస్టీ (రాష్ట్ర జీఎస్టీ) రూ. 30,779 కోట్లు, వస్తువుల దిగుమతిపై రూ.33,837 కోట్ల వసూళ్లతో కలిపి మొత్తం ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ) రూ.67,471 కోట్లు, సెస్ రూ.10,340 కోట్లు ఉన్నాయి. అంతేగాక గత నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం గతేడాది కంటే 38% ఎక్కువగా ఉంది. -
ఐదోసారి 1.30 లక్షల కోట్ల మార్క్ దాటిన జీఎస్టీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఐదోసారి జీఎస్టీ వసూళ్లు రూ.1.30 లక్షల కోట్ల మార్క్ దాటా యి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు 18% అధికంగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.1,33,026 కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయం సేకరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఒమ్రికాన్ వేరియంట్ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో కోవిడ్–19 ఆంక్షలు కొనసాగినప్పటికీ జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైంది. మరోవైపు 2021 ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో 13% వృద్ధితో రాష్ట్రానికి రూ.4,113 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరింది. 2020 ఫిబ్రవరి జీఎస్టీ రాబడి కంటే ఈ ఏడాది 26% అధికంగా వచ్చింది. గత నెల జీఎస్టీ స్థూల రాబడి రూ.1,33,026 కోట్లు కాగా ఇందులో సీజీఎస్టీ (కేంద్ర జీఎస్టీ) రూ.24,435 కోట్లు, ఎస్జీఎస్టీ (రాష్ట్ర జీఎస్టీ) రూ.30,779 కోట్లు, వస్తువుల దిగుమతిపై చేసిన రూ.33,837 కోట్ల వసూళ్లతో కలిపి మొత్తం ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ) రూ.67,471 కోట్లు, సెస్ రూ. 10,340 కోట్లు ఉన్నాయి. గత నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం గతేడాది కంటే 38% ఎక్కువగా ఉన్నది. -
బాబు చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పా?
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు ప్రభుత్వం చేస్తే ఒప్పు.. అప్పుడు కాగ్ ఎత్తి చూపినా తప్పులు కనిపించవు.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తే అంతా తప్పు’.. ఇదా రామోజీ గురివింద నీతి అంటూ ఆర్థికశాఖ వర్గాలు విస్తుపోతున్నాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏటా బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశారని, కేటాయింపుల్లేకుండానే ఖర్చుచేశారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు ఎత్తి చూపినా ఆ ఐదేళ్లలో ఈనాడుకు అసలు కనిపించనే లేదు. ఐదేళ్లలో ఒక్కరోజు కూడా బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశారని ఈనాడు ఒక్క ముక్కా రాయలేదు. ఇప్పుడే ఏదో ఘోరం జరిగిపోతోందంటూ.. ఇప్పుడే కొత్తగా బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశారంటూ ఈనాడు రాసిన కథనాన్ని చూసి ఆర్థికశాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అస్మదీయుడైన చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలాగ.. తస్మదీయులైన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉంటే మరోలా ఈనాడు కథనాలు రాయడం చూస్తుంటే.. ఎంత వివక్ష, పక్షపాతంతో ఉందో అర్థం అవుతోందని వ్యాఖ్యానిస్తున్నాయి. ఏటా బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలపై కాగ్ నివేదికలు రూపొందించే ముందు ఆర్థికశాఖను వివరణ కోరుతూ లేఖలు రాయడం సాధారణమేనని, ఇది ప్రతి ప్రభుత్వంలోనూ జరుగుతుందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడే కొత్తగా కాగ్ ఆర్థిక శాఖకు లేఖ రాసినట్లు, గతంలో ఎప్పుడూ లేఖ రాయనట్లు ఈనాడు కథనం ఉందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బాబు ప్రభుత్వ హయాంలో ఈనాడు ఇలాంటి వార్త ఒక్కటి కూడా రాయలేదని, ఇప్పుడే ఎందుకు రాసిందో అందరికీ అర్థమవుతోందని పేర్కొన్నారు. బాబు హయాంలో దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్న కాగ్ ► చంద్రబాబు ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు బడ్జెట్ కేటాయింపులకు మించి రూ.1,62,828.70 కోట్లు వ్యయం చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ వ్యయంపై కాగ్ ఏమందంటే.. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన కేటాయింపులకు మించి అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పునరావృత మవుతున్నాయి. ఇది శాసనసభ అభీష్టానికి విరుద్ధం కనుక దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఊహించిన పరిమితులను దాటి వేస్ అండ్ అడ్వాన్స్‌లు తీసుకోవడం వలన గత ఐదేళ్లలో కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు అవుతూనే ఉంది. అదనపు నిధులు అవసరమని భావిస్తే శాసనసభ నుంచి ముందస్తు ఆమోదం తీసుకోవాలి. ఈ అంశాన్ని గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నివేదికలోనూ ప్రస్తావిస్తున్నప్పటికీ తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ► చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015–16, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయింపుల్లేకుండానే వరుసగా రూ.1,592.76 కోట్లు, రూ.1,053.08 కోట్లు, రూ.2,790.08 కోట్లు వ్యయం చేశారని కాగ్ నివేదికలు స్పష్టం చేశాయి. దీనిపై కాగ్ ఏమందంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మాన్యువల్ ప్రకారం నిధుల కేటాయింపు జరగకుండా ఏదైనా పథకం, సేవపై ఖర్చు చేయకూడదు. ఈ చర్య బడ్జెట్ ప్రక్రియ, శాసన సంబంధిత నియంత్రణల గౌరవాన్ని భంగపరచింది. ► చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లపాటు కేటాయింపుల మేరకు వ్యయం చేయకుండా పెద్ద ఎత్తున మిగులును చూపెడుతోందని కాగ్ నివేదిక ఎత్తి చూపింది. ఈ మిగుళ్లు బడ్జెట్ ప్రతిపాదనల్లో కచ్చితత్వం, విశ్వసనీయతలపై సందేహాలను రేకిత్తిస్తున్నాయని కాగ్ స్పష్టం చేసింది. ఉదాహరణకు 2018–19లో సాంఘిక, బీసీ సంక్షేమం, వ్యవసాయం, పాఠశాల విద్య, రహదారులు తదితర 11 అంశాల్లో కేటాయింపుల్లో రూ.2 వేల కోట్లకు మించి వ్యయం చేయకపోగా.. రూ.47,670.66 కోట్లు మిగిలి ఉన్నాయని కాగ్ ఎత్తి చూపింది. -
బ్యాంకుల్లో డిపాజిట్లు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని వివరాలను వెంటనే తమకు పంపాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, స్థానిక సంస్థలు, జిల్లా కలెక్టర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ల వివరాలు, ఆయా అకౌంట్లలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను వెంటనే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జీవో నంబర్ 18ని జారీ చేశారు. తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ నేపథ్యంలో బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై పలు జాగ్రత్తలను సూచిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న బ్యాంకు అకౌంట్లన్నింటినీ ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకునే తెరిచారా.. లేదా? ప్రస్తుతమున్న అకౌంట్లను సమీక్షించి అవసరం లేని అకౌంట్లను మూసివేసే అంశాలపై వచ్చే నెల 10వ తేదీ కల్లా నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆయా బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల పరిస్థితిని పరిశీలించాలని, డిపాజిట్ చేసిన మేరకు నగదు ఉందో లేదో తనిఖీ చేయడంతో పాటు ఆయా బ్యాంకుల నుంచి తాజాగా సర్టిఫికెట్లు తీసుకుని తమకు పంపాలని ఆర్థిక శాఖ సూచించింది. ఒకే బ్యాంకులోకి డిపాజిట్లు.. అదే విధంగా ఒక శాఖ లేదా సంస్థకు పలు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంటే వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్యానెల్మెంట్ చేసిన ఏదైనా ఒకే బ్యాంకులోకి మార్చాలని, ఈ క్రమంలో వడ్డీ తగ్గకుండా చూసుకోవాలని కోరింది. ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్‌ను క్లోజ్ చేసే అవకాశం లేకపోతే ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకోవాలని పేర్కొంది. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వివరాలన్నింటినీ ప్రతి నెలా 10వ తేదీ కల్లా అప్డేట్ చేయాలని వెల్లడించింది. ఇక నుంచి ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కొత్తగా బ్యాంకు అకౌంట్లు తెరవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను డిపాజిట్ల రూపంలోకి ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని, డిపాజిట్ల ఉపసంహరణ కాలపరిమితి ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫిక్స్డ్ డిపాజిట్ లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లో నగదు రూపంలో లావాదేవీలు జరగకూడదని, కచ్చితంగా ప్రభుత్వ అధికారిక ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను లింక్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులపై వచ్చిన వడ్డీని ఆ పథకం కిందనే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది. వడ్డీ కింద వచ్చిన మొత్తాన్ని ఖర్చు చేసే విషయంలో వార్షిక ఆడిట్ నివేదికలో స్పష్టంగా నమోదు చేయాలని ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
రూ. 10 కాయిన్ చెల్లుతుందా..చెల్లదా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
మనం దగ్గరలోని మార్కెట్‌కి వెళ్లినప్పుడు సదరు షాప్ యజమానికి రూ.10 నాణెం ఇస్తే...ఇది చెల్లదు అంటూ..వేరే రూ. 10 నోట్ ఇస్తూ ఉంటాం. అంత ఎందుకు మనలో కొంతమంది రూ. 10 కాయిన్‌ను తీసుకోవాలంటే వెనకముందు అవుతుంటాం. రూ.10 నాణెం చెల్లుతుందా? లేదా? అన్న అనుమానాలు ఇప్పటికీ సామాన్యుల్లో ఉన్నాయి. రూ.10 కాయిన్ చెల్లుతుందని కొందరు, చెల్లదని ఇంకొందరు... ఈ వాదనలు చాలాకాలంగా ఉన్నవే. ఇక రూ.10 నాణెం చెల్లుబాటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అనేక సార్లు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా రూ. 10 నాణేంపై కేంద్రం స్పందించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇదే..! ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక వ్రాతపూర్వక సమాధానంలో రూ. 10 నాణెంపై స్పందించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించబడిన, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా పంపిణీ చేయబడిన వివిధ రకాల రూ. 10 నాణేలు చట్టబద్ధమైనవని తెలిపారు. అన్ని లావాదేవీలలో చట్టపరమైన టెండర్‌గా ఉపయోగించవచ్చునని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రూ. 10 నాణేలను నకిలీవిగా భావించి అంగీకరించడం లేదని రాజ్యసభలో ఎంపీ ఎ. విజయకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. రూ. 10 నాణెం అంగీకరించకపోవడంపై కొన్ని ఫిర్యాదులు ఎప్పటికప్పుడు సాధారణ ప్రజల నుంచి స్వీకరించామని తెలిపారు. ప్రజలలో అవగాహన కల్పించడానికి, అపోహలను తొలగించడానికి ఆర్బీఐ కాలానుగుణంగా పత్రికా ప్రకటనలను జారీ చేస్తుందని వివరణ ఇచ్చారు. ప్రజలు రూ. 10 నాణేలపై ఎటువంటి సంకోచం లేకుండా లీగల్ టెండర్‌గా అంగీకరించాలని కోరారు. రూ. 10 నాణేంపై గతంలో కూడా ఆర్బీఐ అనేక సార్లు వివరణ ఇచ్చింది. అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10 నాణెం మొత్తం 14 డిజైన్లు చెల్లుబాటు అవుతాయని , లావాదేవీలకు చట్టబద్ధమైన టెండర్ అని చెప్పింది. ఆర్బీఐ తొలిసారిగా రూ. 10 కాయిన్‌ను 2005లో ప్రవేశపెట్టింది. చదవండి: ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈ రూపీ పరిమితి భారీగా పెంపు -
క్రిప్టోకి ఎప్పటికీ నో ఎంట్రీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ డిజిటల్ కరెన్సీల చట్టబద్ధతపై స్పష్టతనిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలు ఎన్నటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు కాబోవని ఆయన స్పష్టం చేశారు. ‘క్రిప్టో ఎప్పటికీ లీగల్ టెండర్ కాబోదు. లీగల్ టెండర్ అంటే చట్టం ప్రకారం రుణాల సెటిల్మెంట్ కోసం ఆమోదయోగ్యమైనదని అర్థం. క్రిప్టో అసెట్ల విషయంలో భారత్ అలా చేయబోదు. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ రూపీకి మాత్రమే లీగల్ టెండర్ హోదా ఉంటుంది‘ అని సోమనాథన్ పేర్కొన్నారు. బంగారం, వజ్రాలలాగే విలువైనవే అయినప్పటికీ వాటిలాగే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు అధికారిక గుర్తింపు ఉండదని తెలిపారు. 2022–23 బడ్జెట్లో వర్చువల్ డిజిటల్ అసెట్స్ మీద వచ్చే లాభాలపై 30 శాతం పన్నులు, నిర్దిష్ట పరిమాణానికి మించిన లావాదేవీలపై 1 శాతం ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) విధించేలా ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. క్రిప్టో ఆదాయాలను వెల్లడించేందుకు ఆదాయ పన్ను రిటర్నుల్లో ప్రత్యేక కాలమ్ కూడా ఉండనుంది. గత శీతాకాల పార్లమెంటు సెషన్లో క్రిప్టో నియంత్రణ బిల్లును అంశాన్ని లిస్టు చేసినప్పటికీ .. తాజా బడ్జెట్ సెషన్ జాబితాలో దాన్ని చేర్చకపోవడంపై స్పందిస్తూ.. ‘దీన్ని చట్టం చేయడానికి ముందు నియంత్రణ స్వభావం ఎలా ఉండాలి, నియంత్రణ ఉండాలా లేక పన్ను మాత్రమే విధించాలా వంటి అంశాలపై మరింత విస్తృతంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది‘ అని ఆయన తెలిపారు. గ్లోబల్‌గా ఏకాభిప్రాయం కావాలి.. క్రిప్టోకరెన్సీలను నియంత్రించేందుకు దేశీయంగా తీసుకునే చర్యలు సరిపోవు కాబట్టి, ప్రపంచ దేశాల ఏకాభిప్రాయానికే భారత్ మొగ్గుచూపుతోందని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అజయ్ సేఠ్ చెప్పారు. ఇలాంటి సాధనాలు ఏ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి రాకుండా ఆన్లైన్లో ట్రేడవుతుండటమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రించాలా లేదా నిషేధించాలా .. క్రిప్టో కరెన్సీల విషయంలో పాటించాల్సిన విధానాలపై కసరత్తు జరుగుతోంది. ఇవి ఎప్పటికీ తేలతాయన్నది ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుత బడ్జెట్ సెషన్లో అయితే జరగకపోవచ్చని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. క్రిప్టోలను నియంత్రించడంపై చర్చలు జీ20 సదస్సులో ప్రారంభం కావచ్చని సేఠ్ పేర్కొన్నారు. మరోవైపు, సీమాంతర లావాదేవీలు కూడా జరుగుతాయి కాబట్టి క్రిప్టోకరెన్సీల నియంత్రణపై అంతర్జాతీయంగా కూడా ఏకాభిప్రాయం అవసరమవుతుందని సోమనాథన్ చెప్పారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన చేశాక దానిపై అభిప్రాయాలు తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంటోంది. వాటి ఆధారంగా ఏం చేయాలి, ఎలా చేయాలన్న దానిపై తుది నిర్ణయానికి వస్తుంది. అయితే, అప్పటివరకూ పన్నులపై స్పష్టత ఇవ్వకుండా కూర్చోవడం కుదరదు. ఎందుకంటే, క్రిప్టో కరెన్సీల లావాదేవీల పరిమాణం భారీగా పెరిగిపోతోంది‘ అని ఆయన పేర్కొన్నారు. -
ఏపీ ప్రయోజనాలు విస్మరించిన కేంద్రం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను విస్మరించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర బడ్జెట్లో విస్మరించడం తీవ్ర నిరాశపరిచిందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల కోసం బడ్జెట్లో కనీసం ప్రస్తావించకపోవడం పట్ల ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్నారు. కానీ, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకపోవడం సమంజసం కాదని అన్నారు. కరోనా పరిస్థితులు, పరిమిత వనరులు, రుణాలపై ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి భారీగా నిధుల కేటాయింపు, రుణ సేకరణకు పరిమితులు పెంచి ఉంటే బాగుండేదని తెలిపారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహద పడేదని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఎరువులు, ఆహార సబ్సిడీ తదితర వాటిలో రాష్ట్రాలకు కేంద్రం కోత విధించిందన్నారు. జలజీవన్ మిషన్, జాతీయ విద్యా మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర ప్రాజెక్టులకు నిధులు పెంచినప్పటికీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అవి ఏమాత్రం చాలవన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు మరిన్ని నిధుల అవసరం ఉందన్నారు. జాతీయ రహదారులకు నిధులు రెండింతలు చేయడం, రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసేందుకు పెట్టుబడి నిధులను రూ.లక్ష కోట్లకు పెంచడం హర్షణీయమన్నారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్–మౌలిక సదుపాయాలు అనే ఏడు రంగాలను చోదక శక్తులు (గ్రోత్ ఇంజన్స్)గా చేసుకొని జాతీయ మాస్టర్ ప్లాన్ రూపొందించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించేలా తగినన్ని నిధులు కేటాయిస్తేæ జాతి నిర్మాణంలో రాష్ట్రాలు మరింత సమర్ధవంతమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు. అత్యవసర పరపతి హామీ పథకాన్ని 2023 మార్చి వరకు పొడిగించడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయం కోసం పరపతి మొత్తాన్ని పెంచడం ఆర్థిక వృద్ధికి తోడ్పాటునిస్తుందన్నారు. రక్షణ, రక్షణ పరిశోధనకు అవసరమైన వాటిని దేశీయంగా సమకూర్చుకోవాలని నిర్ణయించడం ముదావహమని అన్నారు. రక్షణ రంగానికి గత బడ్జెట్లో కేటాయింపులు రూ. 13.89 లక్షల కోట్ల నుంచి రూ.15.23 లక్షల కోట్లకు పెంచడం, రైల్వేలకు కేటాయింపులు రూ. 2.04 లక్షల కోట్ల నుంచి 2.39 లక్షల కోట్లకు పెంచడం సానుకూల పరిణామమని చెప్పారు. కానీ వడ్డీ చెల్లింపుల కోసం కేటాయింపులు రూ. 8.14 లక్షల కోట్ల నుంచి రూ. 9.41 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కల్గిస్తోందని అన్నారు. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడంతో ఈ ఏడాది స్థూల పన్ను రాబడి రూ. 17.65 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 2020–21లో రూ. 197.46 లక్షల కోట్లుగా ఉన్న జీడీపీ 2021–22లో రూ. 232.18 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. జీడీపీలో ద్రవ్య లోటు 2020–21లో 9.21 శాతం ఉండగా, 2021–22లో 6.85 శాతానికి తగ్గిందని తెలిపారు. రెవెన్యూ లోటు 2020–21లో జీడీపీలో 7.34 శాతం ఉండగా, 2021–22లో 4.,69 శాతానికి తగ్గడం ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. -
కరోనా పరిస్థితుల్లో సమ్మెతో ఇబ్బంది
సాక్షి, అమరావతి: ‘ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెకు వెళితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ప్రతి ఉద్యోగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోవిడ్ అనంతర పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రుల నుంచి బయటికి వచ్చే కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోవిడ్ ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే ఊపం దుకుంటున్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు భంగం కలుగుతుంది. సమ్మె వల్ల రాష్ట్రం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. అర్థం చేసుకోండి’ అని ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్‌శర్మ ఉద్బోధించారు. సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆందోళన విరమించేలా సంఘాలను ఒప్పించాలని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయం నుండి ఆయన ఆర్థిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. మనమంతా ఒక కుటుంబమని ఉద్యోగులకు చెప్పారు. అందరం ప్రభుత్వంలో భాగమని, మెరుగైన సేవల ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని తెలిపారు. ఉద్యోగులుగా మనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక యంత్రాంగం ఉందని ఉద్యోగ సంఘాలకు తెలపాలని కలెక్టర్లకు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉందనే విషయాన్ని తెలియజేసి అందరూ కలిసి పని చేద్దామని చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ కూడా పాల్గొన్నారు. -
AP: సెలవైనా.. శరవేగంగా
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రెజరీ కార్యాలయాలు సెలవు రోజైన ఆదివారం సైతం శరవేగంగా బిల్లుల ప్రాసెస్ నిర్వహించాయి. ఆర్థికశాఖ ఆదేశాలతో ప్రత్యక్షంగా కలెక్టర్లే రంగంలోకి దిగి ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నెలాఖరు కావడంతో సాయంత్రం కల్లా పూర్తి చేసేలా అన్ని జిల్లాల్లో ప్రాసెస్ జరుగుతోంది. శని, ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రెజరీ ఉద్యోగులు బిల్లులను అప్లోడ్ చేశారు. ట్రెజరీల్లో సుమారు 2 లక్షల బిల్లులు కొత్త పీఆర్సీ ప్రకారం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పే అండ్ అకౌంట్స్‌లో 50 వేల బిల్లులను అధికారులు ప్రాసెస్ చేశారు. ఆర్థికశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బిల్లులు సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి పెన్షనర్ల బిల్లులను ఉద్యోగులు సిద్ధం చేయనున్నారు. కాగా, 1వ తేదీ వరకు ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ సన్నద్ధమవుతుంది. కొత్త జీతాలతో వాస్తవాలు వెల్లడి.. కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలను అందుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలను అర్థం చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. అందరి జీతాలు పెరిగాయని స్పష్టం చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయం. అందుకనే శరవేగంగా జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. కొన్ని రాజకీయ శక్తులు పన్నిన కుట్రలకు ఉద్యోగులు బలి కాకుండా కాపాడుకుంటూ నిజం ఏమిటో తెలియజేసేలా చర్యలు చేపట్టింది. జీతాలు తగ్గుతాయన్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన మొత్తాలను ఫిబ్రవరి 1 నాటికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనికి అడ్డుపడే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని గట్టి సంకేతాలనిచ్చింది. విజయనగరంలో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించిన డీడీవోలకు మెమోలిచ్చారు. తమ ఎత్తుగడలు పారవనే కొన్ని సంఘాలు ఉద్దేశపూర్వకంగా జీతాల బిల్లుల ప్రాసెస్ పనులకు అడ్డుపడుతున్నట్లు తెలిసింది. విజయనగరంలో మెమోలు విజయనగరం జిల్లాలో జనవరి వేతనాల ప్రక్రియ పనులను చేపట్టకుండా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఆర్థిక శాఖ ఆదేశాలను అమలు చేయని 175 మంది డీడీవోలకు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మెమోలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ట్రెజరీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానమైన 177 కార్యాలయాల సిబ్బందికి సంబంధించిన డీడీవోల వివరాలను సేకరించారు. 2 విభాగాల నుంచి మాత్రమే వేతనాల పనులను పూర్తి చేయగా మిగిలిన 175 శాఖల డీడీఓలు ప్రారంభించలేదని గుర్తించి వారందరికీ మెమోలను జారీ చేశారు. సోమవారం కూడా సమయం ఉన్నందున బిల్లుల ప్రాసెస్ జరిగేలా చర్యలు చేపట్టారు. చిత్తూరులో సజావుగా.. చిత్తూరు జిల్లాలో కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లుల చెల్లింపు జరిగేలా కలెక్టర్ హరినారాయణన్ పర్యవేక్షించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం, 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఆదివారం పనిచేసినట్లు చెప్పారు. అలసత్వం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించామన్నారు. ఉత్తర్వులు పాటించాల్సిందే.. ప్రకాశం జిల్లాలో అన్ని శాఖల డీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పని చేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లా అధికారులకు డీడీవోలతో పని చేయించాలని, లేనిపక్షంలో మెమోలు జారీ చేయాలని ఆదేశించామన్నారు. పనిచేయని డీడీవోలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఉత్తరాంధ్రలో వేగంగా.. విశాఖపట్నం జిల్లాలో బిల్లుల ప్రక్రియను సోమవారం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్వో శ్రీనివాసమూర్తి తెలిపారు. మొత్తం 1,299 మంది డీడీవోలుండగా ఇప్పటి వరకు 227 మంది వేతన బిల్లుల ప్రక్రియను ప్రారంభించారన్నారు. 39 మంది డీడీవోలు తమ పనిని పూర్తి చేశారు. మిగిలిన ప్రక్రియ సోమవారం పూర్తి కానుంది. పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి డీడీఓలు 1,068 మంది ఉండగా ఇప్పటివరకు 180 మంది బిల్లుల పని ప్రారంభించారు. వీరిలో 31 మంది పూర్తి చేశారు. ఉభయ గోదావరిలో రెండు రోజులుగా.. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 15 సబ్ ట్రెజరీల్లో 145 మంది ట్రెజరీ ఉద్యోగులు విధుల్లో పాల్గొని పోలీసు, అగ్నిమాపక, ట్రెజరీ, విజలెన్స్, ఏసీబీ తదితర విభాగాల్లో 1,200 మంది ఉద్యోగుల బిల్లులను ప్రాసెస్ చేశారు. 26,800 మంది పింఛనుదారుల బిల్లులను సైతం ప్రాసెస్ చేసినట్టు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ట్రెజరీతో పాటు సబ్ ట్రెజరీల్లో రెండు రోజులుగా పోలీసు, ఏపీఎస్పీ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, న్యాయశాఖ ఉద్యోగుల జీతాల బిల్లులు 8 వేల వరకు పూర్తి చేశారు. పెన్షన్లకు సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్లైన్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఆదేశాలను కచ్చితంగా పాటిస్తాం గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను ఖాతాల్లో జమ చేసే పనిలో ఖజానా శాఖ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలతోపాటు కలెక్టరేట్లోని ఖజానా కార్యాలయంలోనూ విధులు నిర్వహిస్తున్నట్లు ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.రాజగోపాలరావు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1కల్లా జిల్లాలోని 39 వేల మంది పెన్షనర్ల ఖాతాల్లోకి నగదు మొత్తం జమ అవుతుందన్నారు. జిల్లాలో 35,706 మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో డీడీవోలు 50 బిల్లులను ప్రాసెస్ చేశారని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,283 డీడీవోల పరిధిలో 34,346 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 16,392 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. అనంత, కర్నూలు, నెల్లూరుల్లోను.. అనంతపురం జిల్లాలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో డీడీఓలు, ఎస్టీఓలు విధుల్లోకి వచ్చారు. కర్నూలు జిల్లాలో జనవరి నెల వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు పంపాలని అన్ని శాఖల డీడీవోలను ఆదేశించినట్టు కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి బిల్లులు రాగా ట్రెజరీ అధికారులు ప్రాసెస్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పలు శాఖలకు చెందిన 200 మంది డీడీవోలు జనవరి జీతాల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీకి పంపినట్టు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు చెప్పారు. మిగతావి కూడా సిద్ధమవుతున్నాయని, సోమవారం వరకు అవకాశం ఉన్నందున మోమోలు ఇవ్వలేదని చెప్పారు. -
జీతాలు, పెన్షన్ల చెల్లింపులో నిర్లక్ష్యంపై సర్కారు కన్నెర్ర
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లులు రూపొందించి, ప్రాసెస్ చేయడం, ఆమోదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కొరఢా ఝళిపించింది. ఎన్ని సార్లు ఆదేశాలు జారీ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లను, విభాగాధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శనివారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. జీతాలు పెరగలేదని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం సరికాదని నిరూపించాలని ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది. జనవరి 1న తీసుకున్న వేతనం, ఫిబ్రవరి 1న తీసుకునే వేతనంతో పోల్చి చూసుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలు గ్రహిస్తారని భావిస్తోంది. అందరికీ జీతాలు పెరిగాయన్న ప్రభుత్వ వాదన నిజమేనని ఉద్యోగులు తెలుసుకోవడం ద్వారా అసంతృప్తి తగ్గుతుందని ఈ ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఉద్యోగ సంఘాల వెనుక ఉన్న రాజకీయ ప్రమేయం, వాళ్లను రాజకీయంగా వాడుకోవాలని చూస్తుండటం తదితర విషయాలన్నీ ఉద్యోగులు గ్రహిస్తారని.. అందుకోసమే ఎలాగైనా ఫిబ్రవరి 1న జీతాలు చెల్లించేలా చూడాలని ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. రెండు నెలల మధ్య జీతంలో తేడా ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా అత్యధిక శాతం ఉద్యోగులు వాస్తవాలు గ్రహిస్తారని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం జారీ అయిన మెమోలోని వివరాలు ఇలా ఉన్నాయి. ► ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నుంచి పెరిగిన వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించాలి. ► ఇందుకోసం కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేళ్లు నిర్ధారించి ప్రాసెస్ చేసి.. వేతనాలు, పెన్షన్ బిల్లులను ఆమోదించడానికి పలు సార్లు నిర్ధిష్ట టైమ్‌లైన్‌తో ఆదేశాలు జారీ చేశాం. అయినా అందుకు అనుగుణంగా విధులు నిర్వహించడంలో చాలా మంది డీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించి బిల్లులు రూపొందించలేదు. వేతన బిల్లులను ఎస్టీవోలు ఆమోదించ లేదు. ఇలాంటి వారందరినీ ఉపేక్షించేది లేదు. ► కోవిడ్ క్లిష్ట సమయంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పూర్తి, పార్ట్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, రోజు వారీ వేతన కార్మికులు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన సర్వీస్ ప్రొవైడర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి కల్పించిన అధికారులు, ఉద్యోగులపై సీసీఏ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి. ► శనివారం సాయంత్రం 6 గంటల వరకు వేచి చూసి, విధి నిర్వహణలో వైఫల్యం చెందిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించేందుకు అవసరమైతే ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్ ఆఫీసర్ ప్రతిపాదించాలి. -
వేతనాలు, పింఛన్లు ఫిబ్రవరి 1న చెల్లించాల్సిందే
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ జీవోలను అనుసరించి, కొత్త పేస్కేళ్ల ప్రకారం ఉద్యోగులకు పెన్షనర్లకు ఫిబ్రవరి 1న జీతాలు, పింఛన్లు చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇందుకోసం నిర్దేశిత సమయంలోగా వేతనాలు, పింఛన్ల బిల్లుల రూపకల్పన జరగాలని పేర్కొంది. లేదంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని తాజాగా సర్క్యులర్ మెమోలో హెచ్చరించింది. వాస్తవానికి కొత్త జీవోల ప్రకారం జనవరి నుంచి ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. కొత్త జీతాలు వస్తే ఈ వాస్తవం బయటపడుతుంది. ఈ కారణంతోనే కొందరు కొత్త జీవోల ప్రకారం జీతాలు విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో కొత్త పీఆర్సీ జీవోలను అనుసరించి వెంటనే బిల్లులు రూపొందించి, జనవరి వేతనాలను ఫిబ్రవరిలో చెల్లించాలని ఆర్థిక శాఖ ఇంతకు ముందే ఆదేశించింది. అయితే, బిల్లుల రూపకల్పనను సమీక్షించగా చాలా వెనుకబడి ఉన్నట్లు తేలిందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ తాజా మెమోలో తెలిపారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సచివాలయ విభాగాలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు, డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులు, ట్రెజరీ అధికారులు సమయంలోగా బిల్లుల రూపకల్పన, ప్రాసెస్‌తో పాటు జనవరి వేతనాలు, పెన్షన్లను ఫిబ్రవరి 1న చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీడీవోలు, ట్రెజరీ ఆఫీసర్లు, పీఏవోలు గురువారంలోగా కొత్త పేస్కేళ్లను నిర్ధారించి, శుక్రవారంలోగా బిల్లులను ఆమోదించి అప్లోడ్ చేయాల్సి ఉందని, వేతనాలు, పెన్షన్లను ఫిబ్రవరి 1న చెల్లించాల్సి ఉందని చెప్పారు. నిర్దేశిత సమయంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో, ఆర్థిక శాఖ ఆదేశాలను పాటించడంలో విఫలమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు.. ఏపీ ఆర్థికశాఖ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు, పింఛన్లను ఫిబ్రవరిలో చెల్లించాలని, అందుకు అనుగుణంగానే వీటికి సంబంధించిన బిల్లులను రూపొందించాలని ఆర్థిక శాఖ మరోసారి స్పష్టం చేసింది. వాస్తవానికి జనవరి నెల నుంచి ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. కొత్త జీతాలు వస్తే ఈ వాస్తవం బయటపడుతుందన్న కారణంతోనే కొందరు కొత్త జీవోల ప్రకారం జీతాలు విడుదల కా కుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికశాఖ తాజా ఉత్తర్వులు జారీచేసింది. నిర్దేశించిన సమయంలోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ మెమో జారీ చేసింది. జీవోలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది. ► ప్రభుత్వశాఖలు, విభాగాలు, విశ్వవిద్యాలయా లు, సొసైటీలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన మినిమమ్ టైమ్‌స్కేల్ మేరకు జనవరి వేతనాలు చెల్లించాలని తెలిపింది. ► ఫుల్ టైమ్, ఎన్ఎంఆర్, రోజువారీ వేతనాలు, కన్సాలిడేటెడ్, పార్ట్ టైమ్ ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం మినిమమ్ టైమ్‌స్కేల్ మేరకు జనవరి వేతనాలను చెల్లించాలని స్పష్టం చేసింది. ► ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలపై జారీ చేసిన జీవో ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరిలో చెల్లించాలని పేర్కొంది. -
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.786 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలను కూడా పెంచింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. వేతనాల పెంపు ద్వారా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏటా అదనంగా రూ.786 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. దళారీ వ్యవస్థ లేకుండా.. రాష్ట్రంలో 1,00,996 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. దళారీ వ్యవస్థతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను గుర్తించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఏపీసీఓఎస్)ను ఏర్పాటు చేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఈ కార్పొరేషన్ కిందకు తీసుకురావడమే కాకుండా ప్రతీ నెలా 1వ తేదీనే వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లప్రస్తుతం వేతనాల రూపంలో ఏటా రూ.1,860 కోట్లు చెల్లిస్తున్నారు. ఇప్పుడు 11వ వేతన సవరణ ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో ఏడాదికి అదనంగా రూ.430 కోట్ల మేర ప్రయోజనం పొందనున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మూడు కేటగిరిలుగా వర్గీకరించి వేతనాలను పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మినిమమ్ టైమ్ స్కేల్ అమలు.. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా 11వ వేతన సవరణ ప్రకారం మినిమమ్ టైమ్ స్కేలును అమలు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెలువరించింది. వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.661 కోట్లు చెల్లిస్తోంది. ఈ నెల నుంచి పెరిగిన వేతనాల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు ఏటా రూ.356 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నవారు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని ఆర్ధిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పూర్తి సమయం, ఎన్ఎంఆర్, రోజువారీ వేతనం, కన్సాలిడేటెడ్ పే, పార్ట్ టైం ఉద్యోగులకు కూడా 11వ వేతన సవరణ మేరకు మినిమమ్ టైమ్ స్కేలు అమలు చేస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వులను కూడా ఇచ్చింది. వీరికి కూడా ఈ నెల నుంచే మినిమమ్ టైమ్ స్కేలును వర్తింప చేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేటగిరీల వారీగా పెరిగిన వేతనాలు కేటగిరి–1 (పెరిగిన నెల వేతనం రూ. 21,500) సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో,సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్,డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ కేటగిరి–2 (పెరిగిన నెల వేతనం రూ. 18,500) డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్, సూపర్వైజర్, మేనేజర్ కేటగిరి–3 (పెరిగిన నెల వేతనం రూ. 15,000) ఆఫీస్ సబార్టినేట్, వాచ్మెన్, కుక్, వాచ్మెన్, కుక్ చౌకీదార్, సైకిల్ ఆర్డర్లీ, లిఫ్ట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, దఫేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్ -
త్వరలో పీఆర్సీ అమలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు సాధ్యమైనంత త్వరలో పీఆర్సీ అమలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆర్థిక, సర్వీసెస్ శాఖ ము ఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలుపై శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ అ ధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. సుమారు పదహారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మూడు విడతల్లో మూడు గ్రూపులుగా జరిగిన ఈ సమావేశంలో ఫిట్మెంట్, పీఆర్సీ, నగదు ప్రయోజనాలు అమలు తేదీలు, నగదు రూపేణా ఎప్పటి నుండి అందజేయాలి తదితర అంశాలను సమగ్రంగా చర్చించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సేవలు) పి.చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక, ఏపీ సచివాలయం సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.వెంట్రామిరెడ్డి, సూర్యనారాయణ, మిగతా ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశాల పేరుతో కాలయాపన పీఆర్సీపై సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంతో ఎలాంటి ఉపయోగం లేదు. వారం పది రోజుల్లో పీఆర్సీ ఇస్తామని సీఎం తిరుపతిలో చెప్పారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎంత పీఆర్సీ ఇస్తారో చెప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నారు. సీఎస్ కమిటీ సిఫారసు ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌పైనే మాట్లాడుతున్నారు. దీనిని మేము పరిగణనలోకి తీసుకోలేం. 27 శాతానికి పైనే పీఆర్సీ ఇస్తేనే చర్చలకు వస్తాం. ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే ఉద్యమాన్ని కొనసాగిస్తాం. జనవరి 3న జరిగే జేఏసీ సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. – బండి శ్రీనివాసులు, ఏపీ జేఏసీ చైర్మన్ అలా చెప్పటం అన్యాయం ఉద్యోగులను అవమానించడానికే చర్చలు నిర్వహిస్తున్నట్టుంది. ఈరోజు సమావేశంలో అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడా తగ్గలేదు. రూ.75 వేల కోట్లు ఉద్యోగుల కోసమే ఖర్చు చేస్తున్నామంటున్నారు. ఇది రాష్ట్ర ఆదాయంలో 33 శాతం మాత్రమే. వంద శాతం ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తున్నామనడం దుర్మార్గం. వారం రోజుల్లో సీఎం వద్దకు తీసుకెళ్తామని ఇప్పటివరకు పట్టించుకోలేదు. గతంలోనే ఎక్కువ జీతం తీసుకున్నారు.. దానికి తగ్గకుండా ఇస్తామని చెప్పటం అన్యాయం. అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులను వెంటనే య«థాతథంగా అమలు చేయాలి. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ అధికారుల నిర్లిప్త ధోరణి శాఖాధికారుల నిర్లిప్త ధోరణితో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. సర్వీస్ ప్రయోజనాలను ఉద్యోగులకు భిక్ష వేయడం లేదు. చాయ్ పే చర్చ తరహా సమావేశాలతో ఎలాంటి ఉపయోగం ఉండదు. డిసెంబర్ 31 వరకు వేచి చూస్తాం. జనవరి నుంచి జిల్లా, తాలూకా స్థాయిలో ఉద్యోగుల చైతన్య యాత్ర నిర్వహిస్తాం. ఒక్క పీఆర్సీ అంశంపైనే కాకుండా అన్నింటిలో ఏపీలో ఉద్యోగ సంఘాల మధ్య అనైక్యత ఉంది. చర్చలు విఫలమైనప్పుడే ఆందోళనకు వెళ్లాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల్లో కరపత్రాల ద్వారా కార్యాచరణ ప్రకటిస్తాం. – కె.సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు త్వరలోనే పీఆర్సీ అంశానికి ముగింపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై ప్రభుత్వం చర్చించింది. కొద్ది రోజుల్లోనే పీఆర్సీ అంశానికి ముగింపు ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా ఉద్యోగ సంఘాలకు వివరించాం. త్వరలోనే ప్రభుత్వం నుంచి పీఆర్సీపై ప్రకటన వస్తుంది. ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి. – చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు -
స్థానికతనూ పరిగణించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీతో పాటు స్థానికతను తప్పకుండా పరిగణించాలని జాతీయ బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను పాటించకపోవడం, విభజన ప్రక్రియ పూర్తికాకముందే కేటాయింపులు జరపడం వంటి అవకతవకలు జరిగాయంటూ పలువురు ఉద్యోగులు జాతీయ బీసీ కమిషన్‌ను ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన కేటాయింపులను నిలిపివేయాలని కోరారు. దీనిపై స్పందించిన జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) సోమవారం విచారణ చేపట్టింది. ఎన్సీబీసీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో విచారణ సాగింది. పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హాజరు కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రోస్ హాజరయ్యారు. విచారణ అనంతరం ఎన్సీబీసీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీ మాత్రమే కాకుండా వయసు, స్థానికతను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. పదవీ విరమణకు దగ్గరున్న ఉద్యోగులను అక్కడే కొనసాగించాలన్నారు. అటవీ, గిరిజన ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగుల స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా వారిని మైదాన ప్రాంతాలకు, మైదాన ప్రాంతాల్లో పనిచేసే వారిని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయన్నారు. ఉద్యోగుల వినతులను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్దేశించిన చోట చేరాలని బలవంతం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాకముందే ఉద్యోగ కేటాయింపులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు. -
‘కటకటా’యింపులే!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల లెక్క తప్పుతోంది. పద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, కేంద్ర సర్కారు కేటాయింపులకు పొంతన లేకుండాపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 38 వేల కోట్లకు పైగా వస్తాయని రాష్ట్రం ఆశిస్తే గత 7 నెలల్లో కేంద్రం రూ. 5 వేల కోట్లే ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఇంకో 5 నెలల్లో మరో 10 శాతానికి మించి నిధులు రావని, అంతపెద్ద మొత్తం సమకూర్చుకోవడం కష్టమని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. సమకూర్చుకోవడం కష్టం గత రెండేళ్లుగా రాష్ట్ర సర్కారు ప్రతిపాదించిన నిధుల కన్నా ఎక్కువగానే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను కేంద్రం మంజూరు చేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం రూ.8,177 కోట్లను రాష్ట్రం బడ్జెట్లో ప్రతిపాదిస్తే కేంద్రం రూ. 11,598 కోట్లు.. 2020–21లో రూ.10,525 కోట్లు ప్రతిపాదిస్తే రూ. 15,471 కోట్లు ఇచ్చింది. అయితే ఈసారి రూ. 38,669 కోట్ల పద్దు కోరగా గత 7 నెలల్లో (2021 అక్టోబర్ 31 వరకు) రూ.5,155.98 కోట్లే కేంద్రం ఇచ్చినట్టు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఇచ్చిన నిధులు ప్రతిపాదిత మొత్తంలో 13 శాతం మాత్రమేనని, చివరి 3 నెలల్లో కొంత మేర నిధులను పెంచినా ఇంకో 10 శాతం (రూ. 4 వేల కోట్లు) మాత్రమే వస్తాయిన ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతా కలిపితే ఈసారి రూ.10 వేల కోట్లు దాటకపోవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే బడ్జెట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కిందనే రూ.23 వేల కోట్లకు పైగా లోటు ఉంటుందని, ఇంత భారీ మొత్తాన్ని ఇతర రూపాల్లో సమకూర్చుకోవడం సాధ్యమయ్యే పనికాదని చెబుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ పాలిత రాష్ట్రాల తరహాలో రాష్ట్రానికీ ఉదారంగా నిధులను కేంద్రం మంజూరు చేయాల్సి ఉందని అంటున్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే? రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్ల రూపంలో చేసే సాయాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు అంటారు. సాయం, విరాళం లేదా భాగస్వామ్యం రూపంలో ఒక ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వానికి ఈ నిధులు బదిలీ అవుతాయి. నేరుగా ప్రభుత్వానికి లేదా ఏదైనా పథకాన్ని అమలు చేసే ప్రభుత్వ సంస్థకు, ఆ సంస్థల ప్రతినిధులకు పంపే వెసులుబాటు ఉంది. ప్రభుత్వాలతో పాటు పంచాయతీరాజ్ విభాగాలకూ ఈ నిధులు అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బులను తమ వెసులుబాటు మేరకు వాడుకునే అవకాశం ఉంటుంది. -
ఒమిక్రాన్ అలజడి..! భారత్‌ను కుదిపేయనుందా...?
కోవిడ్-19 భారత ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్నే చూపింది. వ్యవసాయం, మత్స్యరంగం, మినహా దేశంలో సకల రంగాలూ 2020–21 ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలోనే వున్నాయని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. కాగా తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రపంచదేశాలు భయపడిపోతున్నాయి. మైనస్ 7.3 శాతంగా వృద్ధిరేటు..! కరోనా మహమ్మారి ఫస్ట్‌వేవ్‌ను ఎదుర్కోవడం కోసం వచ్చిన లాక్‌డౌన్‌తో దేశ వృద్ధి రేటు మైనస్ 7.3 శాతంగా నమోదు అయింది. కరోనా సెకండ్ వేవ్‌లో కూడా గ్రోత్ రేట్ కాస్త మెరుగైంది. వేగవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియనే ఆయా దేశాలను ఆర్థిక సంక్షోభాల నుంచి కాపాడుతుందని ప్రపంచ ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. సరైన జాగ్రత్తలు తీసుకొకుంటే ఒమిక్రాన్ వేరియంట్ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై భారీగానే ప్రభావం చూపుతోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వేగవంతమైన వ్యాక్సినేషన్..! భారత్‌లో ఇప్పటివరకు 33 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో టీకా వేగాన్ని పెంచడంతో ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ- నవంబర్ 2021 నెలవారీ ఆర్థిక నివేదికలో పేర్కొంది. మార్కెట్ సెంటిమెంట్లు, వేగవంతమైన టీకా కవరేజ్, బలమైన బాహ్య డిమాండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రానున్న త్రైమాసికాల్లో భారత్ ఆర్థికంగా బలపడుతుందని అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో 8.4 శాతం గ్రోత్..! గత ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్ స్థూల జాతీయోత్పత్తి (GDP) 8.4 శాతానికి పెరిగింది. సుమారు 100 శాతానికి పైగా జీడీపీ పుంజుకుంది. సేవ రంగం, తయారీ రంగాల్లో పూర్తి పునరుద్ధరణ, వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధి కారణంగా జీడీపీ పుంజుకోవడానికి సహాయపడింది. ప్రైవేట్ రంగంలో రికవరీ మొదటి త్రైమాసికంలో 88 శాతం నుంచి రెండో త్రైమాసికంలో 96 శాతానికి పెరిగింది. సరఫరా విభాగంలో వ్యవసాయ రంగంలో జీవీఏ దాని ప్రీ-పాండమిక్ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతోంది. తయారీ , నిర్మాణ రంగాలు కూడా వాటి ప్రీ-పాండమిక్ స్థాయిలను అధిగమించి భారత వృద్ధికి కీలక చోదకాలుగా ఉద్భవించాయి. చదవండి: ద్రవ్యోల్బణం ఆందోళనలు ? పడిపోతున్న రూపాయి విలువ ! -
పరస్పర బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: వివిధ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఉద్యోగుల పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరస్పర బదిలీలకు వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా సడలించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ తొలి, రెండో వేవ్ నేపథ్యంలో 2020 మే, 2021 మే నెలల్లో సాధారణ బదిలీలకు అనుమతించడం సాధ్యం కాలేదని, ఈ నేపథ్యంలో పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు పాక్షికంగా సడలింపు ఇస్తూ పరస్పర బదిలీలకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తిరిగి జనవరి 5వ తేదీ నుంచి సాధారణ బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారికే.. ఉద్యోగులు పరస్పర బదిలీల నిమిత్తం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. పరస్పర బదిలీలు కోరుకునే వారిద్దరూ ప్రస్తుతం పనిచేసే చోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. బదిలీలు అదే కేడర్ పోస్టులకు ఉండాలి. వారి బదిలీలను ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు పరస్పర బదిలీలకు అనర్హులు. పరస్పర బదిలీలను సంబంధిత శాఖలు, శాఖాధిపతులు పారదర్శకంగా, ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనలకు ఆస్కారం లేకుండా చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ ప్రక్రియ అమలు పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది. పరస్పర బదిలీలన్నీ వారి విజ్ఞప్తి మేరకు చేస్తున్నందున ఎటువంటి టీటీఏ, ఇతర బదిలీ ప్రయోజనాలు వర్తించవు. కాగా, ప్రభుత్వం ఉద్యోగుల పరస్పర బదిలీలకు అవకాశం కల్పించడంపై ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక హర్షం వ్యక్తం చేసింది. సీఎంకు వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
క్రిప్టోకరెన్సీ బిల్లు..! ఆర్థిక శాఖ కీలక వ్యాఖ్యలు..!
పార్లమెంట్లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. క్రిప్టోకరెన్సీపై, ఆర్బీఐ తెస్తోన్న డిజిటల్ కరెన్సీపై జబల్పూర్ పార్లమెంట్ సభ్యులు రాకేష్ సింగ్ చౌదరీ, ఉత్తర ప్రదేశ్ పార్లమెంటు సభ్యురాలు జగదాంబిక పాల్ లోక్‌సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్రోత్సహించే ఉద్ధేశ్యం లేదు..! క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. భారత్‌లో క్రమబద్ధీకరించబడని క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ పరిశ్రమను నియంత్రించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. క్రిప్టోకరెన్సీ సెక్టార్‌పై డేటాను ప్రభుత్వం సేకరించట్లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీ నియంత్రణ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కరెన్సీపై ఆధారపడడం తగ్గుతోంది..! త్వరలోనే రిజర్వ్ బ్యాంకు తీసుకువస్తోన్న డిజిటల్ కరెన్సీపై అడిగిన ప్రశ్నకు కూడా పంకజ్ సమాధానమిచ్చారు. కరెన్సీపై ఆధారపడడం తగ్గించేందుకు ఈ డిజిటల్ కరెన్సీ ఉపయోగపడుతోందని అన్నారు. డిజిటల్ కరెన్సీ పరిచయంతో తక్కువ లావాదేవీ ఖర్చుల కారణంగా అధిక సీగ్నియరేజ్, తగ్గిన సెటిల్మెంట్ రిస్క్ వంటి ముఖ్యమైన ప్రయోజనాలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని పంకజ్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ కరెన్సీ మరింత దృఢమైన, సమర్థవంతమైన, విశ్వసనీయమైన, నియంత్రిత, చట్టపరమైన టెండర్ ఆధారిత చెల్లింపుల ఎంపికగా నిలుస్తోందని ఆయన అన్నారు. చదవండి: 22 కోట్ల ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..! -
‘ఈనాడు’ సొమ్ములు పోయాయా? ఏది నిజం?
‘ప్రభుత్వం డబ్బులు పోయినా పర్వాలేదు!. ఇంటిదొంగలు మింగేస్తే మింగేయనీయండి!. వాటిని సురక్షితంగా ప్రభుత్వం దగ్గరే ఉంచితే మాత్రం... మేం ఊరుకోం’... అన్నట్టుంది ‘ఈనాడు’ తీరు. ఒక వంక ప్రభుత్వ సంస్థల్లో కొందరి కారణంగా కోట్ల రూపాయల డిపాజిట్లు పక్కదోవ పట్టిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరోపక్క గత ప్రభుత్వాలు కమీషన్లకు కక్కుర్తి పడి... ఫలానా బ్యాంకులోనే డిపాజిట్లు చేయండంటూ ఇచ్చిన ఆదేశాలు కూడా కొంప ముంచిన సందర్భాలున్నాయి. వీటన్నిటికీ చెక్‌పెడుతూ రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక శాఖ పరిధిలో వాటిని ప్రభుత్వం వద్దే ఉంచే ప్రయత్నాలు మొదలెట్టింది. పైపెచ్చు ఇలా ఉంచిన సొమ్ముకు మిగతా బ్యాంకులకన్నా ఎక్కువ వడ్డీనే ఆఫర్ చేస్తోంది. దీనివల్ల పారదర్శకతతో పాటు ప్రభుత్వ సొమ్ముకు భద్రతా పెరుగుతుంది. ఆర్థికశాఖ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది కనక మెరుగైన రాబడీ వస్తుంది. కానీ ‘ఈనాడు’కు మాత్రం ఇది నచ్చడం లేదు. అంతే!!... ప్రభుత్వ నిర్ణయానికి వక్రభాష్యం చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఓ ఊహాజనిత కథనాన్ని వండేసింది. ‘డిపాజిట్ల మళ్లింపు’ శీర్షికతో సోమవారం మొదటి పేజీలో అచ్చేసింది కూడా. మిగులు నిధుల్ని ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు మళ్లించాలని ఆదేశించినా కొన్ని సంస్థలు వినలేదని, దీంతో ఈ ఉత్తర్వులిచ్చారని పేర్కొంటూ ‘ఈనాడు’ వండి వార్చిన ఈ కథనంలో నిజమెంత? ఏది నిజం? ఒకసారి చూద్దాం... రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.9.6 కోట్లను అధికారులు కాజేశారు. ఓ ప్రైవేటు బ్యాంకులో ఖాతా తెరిచి... అందులోకి మళ్లించి... అక్కడి నుంచి డ్రా చేసుకుని మింగేశారు. అదే తరహాలో ఏపీ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ డిపాజిట్ చేసిన రూ.5 కోట్లను కూడా ఇంటిదొంగలు కాజేశారు. పాలకవర్గానికి తెలియకుండా నకిలీ ఎఫ్డీ రసీదులతో వాటిని సొంత ఖాతాలకు మళ్లించేసుకున్నారు. ఇలాంటి సంఘటనలను గతంలో పలు సార్లు ‘కాగ్’ నివేదికలు కూడా బయటపెట్టాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇష్టానుసారం బ్యాంకు ఖాతాలు తెరిచి, నిధులు వెచ్చిస్తున్నాయి.. భారీగా అక్రమాలకూ పాల్పడుతున్నాయి’ అని పలుమార్లు కాగ్ నివేదికలు తప్పుబట్టాయి. ఇదిగో... ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాధనం దుర్వినియోగమయిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ... ఇకపై అలా కాకుండా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ మిగులు నిధులను ‘ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్’లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థల నిధులు వినియోగంపై ఎన్నో ఏళ్లుగా సరైన పర్యవేక్షక వ్యవస్థ లేదు. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పలుమార్లు అప్పటి ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చింది కూడా!. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో సరైన ఆర్థిక నిపుణులు గానీ తగినంత మంది సిబ్బంది గానీ ఉండరు. ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుభవం ఉండదు. నిధుల డిపాజిట్, విత్‌డ్రాలపై సరైన పర్యవేక్షణ ఉండదు. పై అధికారి ఓకే చేస్తే ఏమైనా చేయొచ్చని గతంలో ఎన్నో ఉదంతాలు నిరూపించాయి. గతంలో పలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, కొన్ని జిల్లాల్లో డీసీసీబీల నిధులు దుర్వినియోగమైన ఉదంతాలూ బయటపడ్డాయి. తాజాగా తెలంగాణలో తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారం సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల మిగులు నిధులన్నీ ‘ఏపీఎస్ఎఫ్సీ’ ఖాతాలో డిపాజిట్ చేస్తే.. ఏకీకృత వ్యవస్థ ద్వారా పటిష్టంగా పర్యవేక్షించవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. అక్కడ ఆర్థిక నిపుణులూ ఉంటారు కనక మెరుగైన నిర్వహణ సాధ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ సంస్థలు మినహా మిగతా శాఖలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులు, ట్రస్టులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నూరు శాతం యాజమాన్య సంస్థ అయిన ఏపీఎస్‌ఎఫ్‌సీకి జమ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదేమీ ప్రయివేటు బ్యాంకు కాదు కదా? ప్రభుత్వ రంగ సంస్థల మిగులు నిధులను ప్రభుత్వ సంస్థే అయిన ‘ఏపీఎస్ఎఫ్సీ’కి మళ్లిస్తే ‘ఈనాడు’ ఇంతలా ఎందుకు గుండెలు బాదుకుంటోందన్నది ఎవ్వరికీ అర్థం కాదు. ఇదేమైనా ప్రయివేటు బ్యాంకో, ఎన్బీఎఫ్సీనో అయితే ‘ఈనాడు’ అభ్యంతరం చెప్పినా అర్థం ఉండేదన్నది నిపుణుల మాట. నిజానికి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ప్రైవేటు రంగంలోకి ‘యాక్సిస్ బ్యాంకు’లో డిపాజిట్ చేయాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై అప్పట్లో ఆర్థిక నిపుణులు అభ్యంతరాలు వ్యక్తంచేసినా పట్టించుకోలేదు. చంద్రబాబు ఒత్తిడితో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపినా.. ‘ఈనాడు’కు మాత్రం అదేమీ తప్పుగా అనిపించలేదు. శ్రీవారి భక్తుల విరాళాలకు ముప్పు ఉంటుందన్న ఆలోచనే కనిపించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. ఆ నిధులన్నిటినీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయించింది. అదీ ప్రజాధనం పట్ల వై.ఎస్.జగన్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత. -
22న రాష్ట్రాలకు రూ.95 వేల కోట్లు: నిర్మలా సీతారామన్
సాక్షి, న్యూఢిల్లీ: మూలధన వ్యయం పెంచాలని పలు రాష్ట్రాలు కోరిన మేరకు ఒక ముందస్తు వాయిదాతో కలుపుకుని మొత్తం రూ.95,082 కోట్లను ఈ నెలలో రాష్ట్రాలకు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక పునరుద్ధరణపై మేధోమథనం చేసేందుకు సోమవారం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి 15 రాష్ట్రాల సీఎంలు, మూడు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఇందులో మూలధన వ్యయాన్ని పెంచాలని రాష్ట్రాలు కోరాయి. ఈ సమావేశానంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా రాష్ట్రాలకు విడుదల చేసే రూ.47,541 కోట్లకు బదులు నవంబర్ 22న రాష్ట్రాలకు మరో విడత అదనంగా ఇవ్వాలని ఆర్థిక కార్యదర్శికి సూచించినట్లు తెలిపారు. దీంతో ఈనెల 22న మొత్తం రూ.95,082 కోట్లు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. దీంతో రాష్ట్రాల వద్ద ఉండే మూలధనం పెరుగుతున్న కారణంగా, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చుచేయడాన్ని పరిగణించవచ్చని ఆమె వెల్లడించారు. ఇక ప్రస్తుతం వసూలుచేస్తున్న పన్నులో 41 శాతం 14 వాయిదాల్లో రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నట్లు ఆర్థిక కార్యదర్శి సోమనాథన్ తెలిపారు. అంతేగాక.. ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పెట్రోల్ ధరలో రూ.5, డీజిల్ ధరలో లీటరుకు రూ.10 నాన్–షేరబుల్ పోర్షన్ నుంచి తగ్గించామన్నారు. రూ. 20వేల కోట్ల వీజీఎఫ్ కార్పస్‌ను రూపొందించాలి: బుగ్గన ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. బుగ్గన మాట్లాడుతూ.. ఒక కీలక ప్రతిపాదనను ఉంచారు. జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల తరహాలో రూ. 20,000 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కార్పస్‌ను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతిపాదించారు. ఈ నిధుల ద్వారా సుమారు రూ.5 లక్షల కోట్ల ఏకీకృత పెట్టుబడి సామర్థ్యంతో 10 వ్యూహాత్మక ప్రాజెక్టులను బలోపేతం చేయడం ద్వారా గొప్ప ప్రభావాన్ని సృష్టించవచ్చని వివరించారు. ఇది అనేక ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా దేశంలోని అన్ని రంగాలలో స్పిన్–ఆఫ్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రేరేపిస్తుందని.. అంతేగాక, ఇది ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు దారి తీస్తుందన్నారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, మల్టీ–లేటరల్ ఫైనాన్సింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల వంటి వినూత్న ప్రాజెక్టు ఫైనాన్సింగ్ ఎంపికల ద్వారా సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ, అవి ఆశించిన ఫలితాలివ్వలేదని బుగ్గన రాజేంద్రనాథ్ సమస్యను ఎత్తిచూపారు. కాకినాడలో రూ.39,200 కోట్లతో ప్రతిపాదించిన హెచ్‌పీసీఎల్–గెయిల్ పెట్రో కాంప్లెక్స్ ప్రాజెక్ట్ కేసును ఉటంకిస్తూ, గత మూడేళ్లుగా రూ.5,700 కోట్ల వీజీఎఫ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకుపోయిందని తెలిపారు. ఈ భారీ పెట్రో ప్రాజెక్టు సాకారమైతే ఆంధ్రప్రదేశ్‌లోకి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించవచ్చని తెలిపారు. -
ఉద్యోగుల జీతాలు ఎక్కడా ఆగలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కడా ఆగలేదని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ‘కోవిడ్ కారణంగా అంతర్జాతీయంగా ఇబ్బందులు వచ్చాయి. మనమూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా చెల్లిస్తున్నాం. ఈ విషయంలో ఉద్యోగుల నుంచి సహకారం ఉంది. దీనిని కూడా ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదని సంక్షేమ పథకాల ద్వారా డబ్బు ఇచ్చాం’ అని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో మంత్రి బుగ్గన మంగళవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బుగ్గన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఏపీఎస్డీసీ ద్వారా రుణాలు సంక్షేమానికే.. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) ఏర్పాటు చేసిందే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు కోసం. ఈ కార్పొరేషన్ ఏర్పాటుపై చట్టమే చేశాం. అందులో అన్ని విషయాలూ ఉన్నాయి. దీని ద్వారా తీసుకున్న రుణాలను అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒప్పందాలన్నీ గవర్నర్ పేరు మీదే పరిపాలన అంతా ఎప్పుడూ గవర్నర్ పేరు మీదనే సాగుతుంది. అప్పులు తీసుకున్నా, జీవోలు జారీ చేసినా, ఎలాంటి ఒప్పందాలయినా గవర్నర్ పేరు మీదే జరుగుతాయి. గత ప్రభుత్వాలు ఎవరి పేరుతో అప్పులు చేశాయి? భూములు తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకోవడం కూడా అత్యంత సహజం. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రభుత్వ నిధుల వినియోగంపై కాగ్ అభ్యంతరాలు చాలా సహజం. వాటికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉంది. ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ జీఎస్టీ అమల్లో ఉన్నందున ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ ఉండాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామే నాతో ఈ విషయాన్ని చెప్పారు. ఆయన ఏమీ బాధ పడటంలేదు. పన్నుల వసూళ్ల గురించి డీలర్ బేస్‌పై ప్రాథమికంగా చర్చించాం. ముఖ్యమంత్రి కొత్తగా ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష చేశాను. రాష్ట్రానికి ఇంతవరకు జీఎస్టీ కింద రూ.3,274 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇంకా రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు జీఎస్టీ బకాయిలు రావాలి. -
భారత్ బాండ్ ఈటీఎఫ్‌తో రూ.10,000 కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్రం డిసెంబర్‌లోగా భారత్ బాండ్ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ద్వారా రూ.10,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశం ఉందని ఆర్థిక శాఖలో ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పురోగతి ప్రణాళికలకు ఈ నిధులను వినియోగిస్తారు. ఇదే జరిగితే భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ ఇది మూడవ విడత అవుతుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల సులభతర రుణాలకు సంబంధించి ఒక పెట్టుబడి సాధనం. ఈటీఎఫ్ ప్రస్తుతం ప్రభుత్వ రంగ కంపెనీల ’ఏఏఏ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. 2020 జూలైలో రెండవ విడత భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ జరిగింది. మూడురెట్లకుపైగా ఇది ఓవర్సబ్స్రై్కబ్ అయ్యింది. రూ.11,000 కోట్ల సమీకరణలు జరిగాయి. ఇక 2019 డిసెంబర్లో వచ్చిన తొలి ఆఫర్ ద్వారా రూ.12,400 కోట్ల సమీరణలు జరిగాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌కు మొదటి విడతలో మూడు, పది సంవత్సరాల మెచ్యూరిటీ ఆప్షన్లు ఉండగా, రెండవ విడతకు ఐదు, 12 సంవత్సరాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎడెల్వైస్ అసెట్ మేనేజ్మెంట్ ఈ పథకం ఫండ్ మేనేజర్. -
IBPS Exam: 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంక్ క్లర్క్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్ రిక్రూట్మెంట్లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్ రిక్రూట్మెంట్లలో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. క్లరికల్ కేడర్ కోసం పరీక్షలు ప్రాంతీయ భాషలలో నిర్వహించే విషయాన్ని పరిశీలించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమిటీ సిఫార్సులు అందుబాటులోకి వచ్చే వరకు ఐబీపీఎస్ ప్రారంభించిన పరీక్ష ప్రక్రియను నిలివేయాలని నిర్ణయించారు. -
సావరిన్ రేటింగ్ పెంచండి..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ ప్రతినిధులతో సెపె్టంబర్ 28న భారత్ ఆర్థికశాఖ అధికారులు సమావేశంకానున్నారు. దేశ సావరిన్ రేటింగ్ పెంపు చేయాలని ఈ సందర్భంగా మూడీస్ ప్రతినిధులకు భారత్ అధికారులు విజ్ఞప్తి చేయనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నుంచి ఎకానమీ వేగంగా రికవరీ చెందుతోందని మూడీస్ ప్రతినిధులకు వివరించే అవకాశం ఉంది. సంస్కరణలను, రికవరీ వేగవంతానికి ఆయా సంస్కరణలు ఇస్తున్న తోడ్పాటు వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చకు వచ్చే వీలుంది. దేశం 2021–22 బడ్జెట్ తీరు, ద్రవ్యలోటు, రుణ పరిస్థితులు కూడా సమావేశంలో చోటుచేసుకోనున్నాయి. ప్రతియేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. వచ్చే వారం సమావేశం కూడా ఈ తరహాలో జరుగుతున్నదేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది నెలల క్రితం మరో రేటింగ్ దిగ్గజం– ఫిచ్‌తో కూడా ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం ‘బీఏఏ3’ రేటింగ్... 13 సంవత్సరాల తర్వాత నవంబర్ 2017లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. ‘బీఏఏ3’ జంక్ (చెత్త) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. రేటింగ్ దిగ్గజ సంస్థలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తున్నాయి. భారత్ దీనిపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను పెట్టుబడిదారులు తీసుకుంటారు. -
ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయని ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్ సవాళ్లు విసిరినప్పటికీ భారత్ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ఎకానమీ ‘వీ’ (V) నమూనా వృద్ధి తీరును ఇది ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మూడవ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో మహమ్మారి నియంత్రణ, నిర్వహణ యంత్రాంగాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. డెల్టా వేరియంట్ పెద్ద సవాళ్లని వస్తున్న వార్తలు తీవ్ర అప్రమత్తత పాటించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. పండుగల వాతావరణం కావడంతో ప్రజలు మాస్‌్కలు ధరించడం, భౌతిక దూరం పాటించడంసహా కోవిడ్–19 మార్గదర్శకాలను తు.చ.తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం చక్కటి పనితీరును పోషిస్తోంది. వర్షపాతంలో 9 శాతం లోటు ఉన్నప్పటికీ, ఖరీఫ్ సాగు సెపె్టంబర్ 3 నాటికి సాధారణ స్థాయిలో ఉంది. ► రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, ట్రాక్టర్ కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ రానున్న నెలల్లో పటిష్టం అవుతుందన్న సంకేతాలను ఇస్తోంది. ► ఇక పారిశ్రామిక రంగం కూడా స్థిరంగా పురోగమిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ విస్తృత ప్రాతిపదికన మెరుగుపడుతున్న సంకేతాలు ఉన్నాయి. ఉత్పత్తి విలువలు 2019 జూన్ స్థాయికి రికవరీ అవుతున్నాయి. జూలైలో ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి రేటు 9.4 శాతం వృద్దిరేటును నమోదుచేసుకుంది. క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టులు మినహా అన్ని రంగాలూ కోవిడ్–19 ముందస్తు స్థాయిని అధిగమించాయి. ► ద్యుత్ వినియోగం, రైల్వే రవాణా, రహదారుల టోల్ వసూళ్లు, ఈ–వే బిల్లులు, డిజిటల్ లావాదేవీలు, విమాన ప్రయాణీకులు సంఖ్య, జీఎస్టీ వసూళ్లు ఇలా ప్రతి విభాగంలోనూ సానుకూల రికవరీ సంకేతాలు ఉన్నాయి. సేవలు, తయారీ కలగలిపిన ఇండియా పీఎంఐ కాంపోజిట్ ఇండెక్స్ కూడా 55.4కు పెరగడం హర్షణీయ పరిణామం. -
ఏపీ: రెవెన్యూ పరిధిలోనే ఆ రెండు శాఖలు
సాక్షి, అమరావతి: కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు ఆర్థికశాఖకు బదిలీ జీవోను ప్రభుత్వం అబియన్స్‌లో పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు యథాతథంగా రెండు శాఖలు రెవెన్యూ శాఖ పరిధిలోనే కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. -
జీఎస్టీ పరిహారంగా రాష్ట్రాలకు రూ.75,000 కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.75,000 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. లగ్జరీ, ఆల్కహాల్, పొగాకు వంటి సిన్ గూడ్స్ నుంచి వసూలు చేసే వాస్తవిక సెస్ (ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం లక్ష కోట్లు ఉంటుందని అంచనా) నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి విడుదల చేసే జీఎస్టీ పరిహారానికి ఇది అదనమని ప్రకటన వివరించింది. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం రూ.2.59 లక్షల కోట్లుగా ఉంటుందన్నది కేంద్రం అంచనా. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.1.59 లక్షల కోట్ల రుణ సమీకరణ జరిపి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయాలని మే 28వ తేదీన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. మిగిలిన పరిహారాన్ని స్థిర వాయిదాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ ఆరు నెలల కాలంలో విడుదల చేయనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు, కేంద్రం పాలిత ప్రాంతాలు కోల్పోయే ఆదాయాలను కేంద్రం భర్తీ చేయాలన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ‘‘అంగీకరించిన రూ.1.59 లక్షల కోట్ల బదలాయింపుల్లో దాదాపు సగం మొత్తాన్ని ఒకే ఇన్స్టాల్మెంట్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేయడం జరిగింది’’ అని ఒక ట్వీట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
ఆర్థిక శాఖ పరిధిలోకి డీపీఈ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను ఆర్థికంగా పటిష్టం చేసి.. త్వరితంగా ప్రైవేటీకరణ చేసేందుకు వీలుగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థల విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్/డీపీఈ)ను కేంద్ర ఆర్థిక శాఖలో విలీనం చేసింది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలపై ఆర్థిక శాఖకు పూర్తి నియంత్రణకు మార్గం ఏర్పడింది. ఈ నిర్ణయంతో ఆర్థిక శాఖ కింద ప్రస్తుతం ఆరు విభాగాలు ఉన్నట్టు అవుతుంది. డీపీఈ ఆర్థిక శాఖ కిందకు రావడం వల్ల మూలధన నిధుల వ్యయాలపై మెరుగైన పర్యవేక్షణకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్తుల విక్రయం, ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగా బలపడేందుకు వీలుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఉప విభాగంగా ‘డీపీఈ (లోక్ ఉద్యమ్ విభాగ్)’ను చేర్చినట్టు కేబినెట్ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర మంత్రివర్గం విస్తరణకు ముందుగా ఈ నిర్ణయం చోటు చేసుకుంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ కింద ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, వ్యయాలు, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ, ఆర్థిక సేవల విభాగాలున్నాయి. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఏర్పాటు చేయగా.. దాన్ని సైతం ఆర్థిక శాఖలో విలీనం చేసిన విషయం విదితమే. దీనికితోడు విదేశీ పెట్టుబడుల నిర్వహణ విభాగాన్ని కూడా ఆర్థిక శాఖ కిందకు తీసుకొచ్చారు. భారీ పరిశ్రమల శాఖ కింద 44 సంస్థలు భారీ పరిశ్రమల శాఖ ప్రధానంగా క్యాపిటల్ గూడ్స్ రంగానికి సంబంధించి కొనసాగనుంది. బీహెచ్ఈఎల్, సిమెంట్ కార్పొరేషన్, స్కూటర్స్ ఇండియా, హెచ్ఎంటీ, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ తదితర 44 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు భారీ పరిశ్రమల శాఖ కింద కొనసాగుతాయి. ఈ శాఖ కింద ఉన్న కంపెనీల్లో చాలా వరకు మూతపడి, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల్లో ఉన్నవి కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వరం 2021–22 బడ్జెట్లో నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఎల్ఐసీ మెగా ఐపీవోతోపాటు ఐడీబీఐలో వాటాల ఉపసంహరణ, బీపీసీఎల్, బీఈఎంల్, రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థ ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలోని 8 శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు వీరి పదవీకాలం పొడిగింపునకు అనుమతినిస్తూ ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. -
ఐడీబీఐ బ్యాంక్ అమ్మకానికి కేంద్ర కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఎల్ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయానికి(డిజిన్వెస్ట్‌మెంట్) కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అనుమతిని తెలియజేసింది. అంతేకాకుండా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ ముందస్తు అనుమతినిచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీలకు సంయుక్తంగా 94 శాతం వాటా ఉంది. ఎల్ఐసీ విడిగా 49.21 శాతం వాటాను కలిగి ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో ఐడీబీఐ బ్యాంకుతోపాటు మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటైజ్ చేసేందుకు ప్రతి పాదించిన విషయం విదితమే. 2019లో..: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ 2019 జనవరిలో ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. కాగా.. ప్రభుత్వంతోపాటు బ్యాంకులో వాటాను విక్రయించేందుకు ఎల్ఐసీ బోర్డు సైతం అనుమతించింది. అంతేకాకుండా యాజమాన్య నియంత్రణను సైతం వదులుకునేందుకు అంగీకరించింది. వీటితోపాటు నియంత్రణ సంబంధ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులో వాటాను తగ్గించుకునేందుకు నిర్ణయించింది. బ్యాంకులో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్న వ్యూహాత్మక కొనుగోలుదారుడు బిజినెస్‌ను పెంపొందించేందుకు వీలుగా పెట్టుబడులతోపాటు.. కొత్త టెక్నాలజీ, ఉత్తమ నిర్వహణ తదితరాలకు తెరతీసే వీలుంది. తద్వారా ఐడీబీఐ బ్యాంక్ భవిష్యత్‌లో పెట్టుబడులు లేదా ఇతర సహాయాల కోసం ప్రభుత్వం, ఎల్ఐసీలపై ఆధారపడవలసిన అవసరముండదని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా.. బ్యాంక్ ఐదేళ్ల తదుపరి గతేడాది(2020–21) నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇదే కాలంలో 2017 మేలో ఆర్బీఐ విధించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి సైతం 2021 మార్చిలో బయటపడడం గమనార్హం! ఈ వార్తలతో ఐడీబీఐ బ్యాంకు షేరు ఎన్ఎస్ఈలో 4.5% జంప్‌చేసి రూ. 38 వద్ద ముగిసింది. చదవండి: (ఆర్థిక సంక్షోభంగా మారకూడదు!: నిర్మలా) -
రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు వడ్డీలేని రుణం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు మూల ధన వ్యయం కింద రూ.15 వేల కోట్లు సమకూర్చనున్నట్లు కేంద్రం తెలిపింది. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం కింద రూ.15 వేల కోట్లు అదనపు మొత్తాన్ని సమకూర్చాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆర్థిక శాఖ వ్యయ విభాగం ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం పేరుతో 2021–22 సంవత్సరానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం కింద వడ్డీ లేకుండా 50 సంవత్సరాల రుణం రూపంలో ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారు. దీనికోసం 2020–21 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. దీంట్లో రూ.11,830 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశారు. గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి కాలంలో రాష్ట్రస్థాయిలో మూలధన వ్యయానికి ఇది సహాయపడింది. ఈ పథకానికి వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ పథకాన్ని 2021–22 సంవత్సరానికి కూడా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రత్యేక సహాయ పథకం కింద మూడు విభాగాలు ఉన్నాయి. మొదటి విభాగం ఈశాన్య, కొండప్రాంత రాష్ట్రాలకు సంబంధించినది. ఈ విభాగానికి రూ. 2,600 కోట్ల రూపాయలు కేటాయించారు. రెండో విభాగంలోని రాష్ట్రాల కోసం రూ. 7,400 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం అవార్డు మేరకు కేంద్రపన్నులలో వాటి దామాషా ప్రకారం కేటాయిస్తారు. మూడో విభాగం కింద రాష్ట్రాలకు మానిటైజేషన్, మౌలిక సదుపాయాల ఆస్తుల రీసైక్లింగ్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ (ఎస్పీఎస్ఈసీ)ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ విభాగం కింద ఈ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రాలు అసెట్ మానిటైజేషన్, లిస్టింగ్, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకున్న దానిలో 33 శాతం నుంచి 100 శాతం వరకు మొత్తాన్ని 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణంగా పొందుతాయి. చదవండి: (కరోనా సంక్షోభం: 16 ఏళ్ల తర్వాత భారత్‌లో కీలకమార్పు) -
సాగునీటి పనుల్లో స్పీడ్ పెరగాలి
సాక్షి, అమరావతి: ఎర్రబల్లి ఎత్తిపోతల పథకం, గాలేరు నగరి నుంచి హంద్రీనీవా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. వేంపల్లి భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.92 కోట్లు వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. 2019, 2020ల్లో మైదుకూరు, రాయచోటి, కడప, పులివెందుల పర్యటనలో భాగంగా జిల్లాలో నిర్వహించిన శంకుస్థాపనలు, పనుల ప్రగతిని సీఎం పరిశీలించారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ(పాడా)పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్ష వివరాలివీ.. ► పులివెందుల మెడికల్ కాలేజీకి ఈ వారంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలి. ► వేంపల్లి, పులివెందుల్లో ఒక్కొక్కటి రూ.కోటి వ్యయంతో మోడల్ రైతుబజార్ల మంజూరు. ► పులివెందులలో క్రికెట్ స్టేడియానికి 14 ఎకరాల భూమి ► పులివెందుల మోడల్ టౌన్ టెండర్లు ఈ నెల 25వతేదీలోగా పిలిచి ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు పనులు ప్రారంభించాలి. ► పెన్నా నదిపై ఆర్టీపీపీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్‌ప్లాంట్‌కు రహదారి, హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆదేశం. ► దీర్ఘకాలంగా ఆగిపోయిన వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీ కొత్త భవనాలకు రూ.66 కోట్లు మంజూరుకు ఆదేశం. ► కడప ఎయిర్‌పోర్ట్‌లో విమానాల నైట్ ల్యాండింగ్ కోసం భూసేకరణ నిధులు చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశం. ► బద్వేల్, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై కూడా సీఎం సమీక్షించారు. -
జీఎస్టీ... రికార్డు వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను వసూళ్ల రికార్డులు కొనసాగుతున్నాయి. మార్చిలో వసూళ్లు రూ.1.23 లక్షలుగా నమోదయినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారికాగా, 2020 ఇదే నెలతో పోల్చితే 27 శాతం అధికం. 2020 మార్చిలో జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.97,590 కోట్లు. ఎకానమీ వేగంగా పురోగమిస్తోందనడానికి జీఎస్టీ గణాంకాలు సంకేతమని ఆర్థికశాఖ తెలిపింది. నకిలీ బిల్లింగ్ నిరోధం, జీఎస్టీ, ఆదాయపు పన్ను, కస్టమ్స్ ఐటీ వ్యవస్థలుసహా సూక్ష్మ స్థాయిలో డేటా విశ్లేషణ, పటిష్టమైన పన్ను యంత్రాంగం కూడా జీఎస్టీ వసూళ్లు క్రమంగా పురోగమించడానికి కారణమని ఆర్థికశాఖ వివరించింది. ముఖ్యాంశాలు చూస్తే... ► మార్చి నెలలో జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.1,23,902 కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో సెంట్రల్ జీఎస్టీ రూ.22,973 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.29,329 కోట్లు. ఏకీకృత జీఎస్టీ రూ. 62,842 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.31,097 కోట్ల వసూళ్లు కలిపి), సెస్ రూ.8,757 కోట్లు (వస్తు దిగుమతులపై రూ. 935 కోట్ల వసూళ్లు కలిపి). ► వార్షికంగా 2020 మార్చితో పోల్చితే తాజా సమీక్షా నెలలో వస్తు దిగుమతల నుంచి ఆదాయం 70 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల నుంచి రెవెన్యూ 17 శాతం పెరిగింది. ► కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు 2020 మార్చి చివరి వారం నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తర్వాతి నెల ఏప్రిల్‌కు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు రూ.32,172 కోట్లకు పడిపోయాయి. లాక్డౌన్ నియంత్రణలను క్రమంగా సడలిస్తూ రావడంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదే జీఎస్టీ వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. ► పెద్ద రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్లలో 6–15 శాతం మధ్య వృద్ధిని చూపించాయి. వరుసగా జీఎస్టీ ఆదాయాలు వృద్ధిని చూపిస్తుండడం ఆర్థిక వ్యవస్థ సామర్థ్యంపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. అలాగే, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా తిరిగి మొదలయ్యాయని, వస్తు, సేవలకు డిమాండ్ అధికంగా ఉండడాన్ని తెలియజేస్తోంది. పారిశ్రామిక రంగం తిరిగి సాధారణ స్థితికి వస్తోందని కూడా జీఎస్టీ ఆదాయంలో వృద్ధి తెలియజేస్తోంది. ద్రవ్యలోటు కట్టడికి దోహదం 2020–21లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం(ద్రవ్యలోటు) రూ.18.5 లక్షల కోట్లు ఉంటుం దని (జీడీపీలో 9.5%) 2021 ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టిన బడ్జెట్ సవరించిన గణాంకాలు పేర్కొన్నాయి. మార్చిలో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్ల నేపథ్యంలో.. ద్రవ్యలోటు నిర్దేశిత స్థాయిలోనే ఉండొచ్చు. ప్రభుత్వ ఆదాయాలకు సంబంధించి తగిన నగదు సమతౌల్యతతో 2021–22 ప్రారంభం అవుతున్నట్లు తాజా పరిస్థితి సూచిస్తోంది. – అదితి నాయర్, ఇక్రా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ -
అనవసర వ్యయం వద్దు: ఏపీ ఆర్ధికశాఖ
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో అనవసర వ్యయాన్ని కట్టడి చేయాలని అన్ని శాఖలకు ఆర్ధికశాఖ సూచించింది. కోవిడ్ వల్ల ఆదాయ వనరులు తగ్గిపోయినందున ప్రాధాన్యతలను గుర్తించి ఆ రంగాలకే వ్యయం చేయాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఓటాన్ అకౌంట్ కేటాయింపుల మేరకే పనులకు సంబంధించిన బిల్లులను సమర్పించాలని, కేటాయింపుల్లేని పనులకు బిల్లులను సమర్పించరాదని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు ‘ఓటాన్ అకౌంట్’లో తిరిగి కేటాయింపులకు అనుమతించేది లేదన్నారు. వేతనాలు, పెన్షన్లు, గౌరవ వేతనాలు తదితరాలకు నియంత్రణ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. -
రూ.70,983.11కోట్లతో ఓటాన్ అకౌంట్
సాక్షి, అమరావతి: రానున్న ఆర్థిక సంవత్సరం 2021 – 22లో తొలి మూడు నెలల (ఏప్రిల్ – జూన్) కాలానికి వివిధ శాఖలు, రంగాల వారీగా వ్యయానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.70,983.11 కోట్లను కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చిలో నిర్వహించడం సాధ్యం కాలేదు. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇంకా మిగిలిపోయి ఉండటం, కోవిడ్ – 19 వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో 2021 – 22 తొలి మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీకి శుక్రవారం కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపగా ఆదివారం ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో న్యాయశాఖ ఆర్డినెన్స్ గెజిట్ పబ్లికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఏప్రిల్ నుంచి జూన్ వరకు అన్ని రంగాల వ్యయానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ కేటాయింపులతో ఆదివారం జీవో జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరంలో తొలి మూడు నెలలకు రూ.70,983.11 కోట్ల వ్యయం అవుతుందని కానుందని ఓటాన్ అకౌంట్లో పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నవరత్నాలకు సంబంధించి వివిధ పథకాలకు ఓటాన్ అకౌంట్లో వ్యయాలను ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవల కోసం అదనంగా రూ.7,955.66 కోట్లను మంజూరు చేస్తూ ఆర్డినెన్స్‌కు కూడా గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. -
జీఎస్టీ వసూళ్లు రూ.1.13 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ చక్కని వృద్ధి పథంలో కొనసాగాయి. వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న రూ.1.05 లక్షల కోట్లతో పోల్చి చూస్తే.. 7 శాతం వృద్ధితో రూ.1.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది జనవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1,19,875 కోట్లుగా ఉండగా, 2020 డిసెంబర్లో రూ.1.15లక్షల కోట్ల మేర వసూలైంది. రూ.లక్ష కోట్లకు పైన జీఎస్టీ వసూళ్లు కావడం వరుసగా ఐదో నెల కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థూల జీఎస్టీ రూ.1,13,143 కోట్లు కాగా.. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.21,092 కోట్లుగాను, రాష్ట్రాల జీఎస్టీ రూ.27,273 కోట్లు, ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ రూ.55,253 కోట్ల చొప్పున ఉంది. రూ.9,525 కోట్లు సెస్సు రూపంలో సమకూరింది. జీఎస్టీ పెరుగుదల ఆర్థిక రికవరీని సూచిస్తోందని, నిబంధనల అమలు దిశగా పన్నుల అధికారులు తీసుకున్న ఎన్నో చర్యల ప్రభావం కూడా కనిపిస్తోందంటూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘‘జీఎస్టీ వసూళ్లలో గత ఐదు నెలలుగా ఉన్న రికవరీ ధోరణి కొనసాగింది. దిగుమతులపై జీఎస్టీలో 15 శాతం వృద్ధి నమోదు కాగా, దేశీయ లావాదేవీలపై జీఎస్టీ 5 శాతం పెరిగింది’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రతిబింబించే జీఎస్టీ వసూళ్లు గతేడాది కరోనా లాక్డౌన్ అమలు చేసిన ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లకు పడిపోయిన విషయం తెలిసిందే. ఆరోగ్యకరమే.. ‘‘జీఎస్టీ వసూళ్లు ఫిబ్రవరిలో కాస్త నెమ్మదించినా కానీ.. ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు తగినట్టు ఆరోగ్యకరమైన స్థాయిలోనే ఉన్నాయి’’ అని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితినాయర్ పేర్కొన్నారు. -
అప్పులు తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: యేటా పెరుగుతున్న అప్పుల భారం ఖజానాకు మరింత గుదిబండ కాకూడదనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) నుంచి క్రమంగా రుణ ప్రతిపాదనలు తగ్గించాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాన్ని పెంచుకునే దిశలో కసరత్తు చేయాలన్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించారు. రానున్న రెండేళ్ల పాటు ఊహాజనిత అంచనాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ అంచనాలకు మాత్రమే పరిమితం కావాలని, అనివార్య ఖర్చులు, సంక్షేమ పథకాల అమలుకు రూ.95 వేల కోట్లు అవసరం కానున్న నేపథ్యంలో ఆచితూచి బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకాలు, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి అమల్లోకి రాని భూముల మార్కెట్ విలువల సవరణ, మైనింగ్ వేలం లాంటి ప్రతిపాదనలతో పాటు రాష్ట్రంలోని కార్పొరేషన్లకు స్వీయ రాబడులు పెంచే మార్గాలు, ఎక్సైజ్ ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశలో ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. వీలున్నంతగా రాష్ట్ర ఆదాయ వనరులను శాశ్వతంగా పెంచడమే లక్ష్యంగా ఈసారి బడ్జెట్ అంచనాలు ఉంటాయని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు అప్పులు ప్రతిపాదనలు తగ్గుతాయని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. రూ.20 వేల కోట్లయినా... అప్పుల జోలికి పెద్దగా వెళ్లే పనిలేకుండా సొంత రాబడులు ఎలా పెంచుకోవాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ భూముల వేలం ద్వారా రూ.15 వేల కోట్లకు పైగా సమీకరించవచ్చనే ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం ముందు సిద్ధంగా ఉన్నాయి. గత రెండేళ్లుగా ఈ ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ అమలు సాధ్యం కాలేదు. దీంతో పాటు నిరర్థక ఆస్తుల అమ్మకాలు, గనుల వేలం, వాణిజ్య పన్నుల శాఖలో పేరుకుపోయిన బకాయిల సెటిల్మెంట్లు, ఎక్సైజ్ రాబడి పెంపు, పన్నేతర రాబడుల విషయంలో ప్రత్యేక కార్యాచరణ, కార్పొరేషన్ల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడకుండా ఆయా కార్పొరేషన్లే సొంతంగా నిధులు సమకూర్చుకునే ప్రణాళికలు... లాంటివి రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి భూముల మార్కెట్ విలువలు సవరించలేదు. గత ఏడేళ్లలో బహిరంగ మార్కెట్లో ఉన్న భూముల విలువకు, ప్రభుత్వ మార్కెట్ విలువకు పొంతనలేకుండా పోయింది. ఈ విలువల సవరణపై రిజిస్ట్రేషన్ల శాఖ చాలాకాలంగా ప్రతిపాదనలు పంపుతున్నా సీఎం కేసీఆర్ తిరస్కరిస్తున్నారు. ఈ విలువలను సవరించడం ద్వారా ప్రతి యేటా కనీసం రూ.2,500 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా. దీంతో ఈసారి భూముల మార్కెట్ విలువల సవరణ ఖాయమని ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగతా ప్రణాళికలను కూడా అమలు చేయడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.40 వేల కోట్ల వరకు సమీకరించవచ్చని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నా, కనీసం రూ.20 వేల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా అప్పుల భారం తగ్గించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. పెరిగిన వడ్డీల భారం రాష్ట్ర ఖజానాపై అప్పులు, వడ్డీల భారం పడుతోంది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో రాబడికి అదనంగా అప్పులు సమీకరించాల్సి వస్తుండటంతో వార్షిక బడ్జెట్లో దాదాపు 10% నిధులను వడ్డీల కిందే చెల్లించాల్సి వస్తోందని కాగ్ గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో చెల్లించిన వడ్డీ మొత్తంతో పోలిస్తే 2020–21లో చెల్లించాల్సింది మూడింతలు పెరగడంతో అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా దెబ్బకు ఈ ఏడాది అప్పుల పద్దు భారీగా పెరగడంతో.. భవిష్యత్తులో ఆదాయ మార్గాలను అన్వేషించడం ద్వారా అప్పులపై ఎక్కువగా ఆధారపడొద్దన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసం బడ్జెట్లో వీలున్నంత తక్కువ రుణసమీకరణ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఎఫ్‌ఆర్‌బీఎంలోని నిబంధనలకు అనుగుణంగా అప్పులు తెచ్చుకుని రాష్ట్ర అభివృద్ధి, మనుగడకు ఖర్చు పెట్టే పద్ధతి దశా బ్దాల నుంచే వస్తోంది. 2014–15లో అప్పులకు వడ్డీల కింద రూ.5,195 కోట్లు చెల్లించగా, అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.15 వేల కోట్ల వరకు చేరింది. గత డిసెంబర్ వరకే రూ.11,500 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అనివార్యమయితే తప్ప అప్పుల ప్రతిపాదన చేయవద్దని, సొంత ఆదాయాలను సమకూర్చుకునే మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. చదవండి: (ఎన్నికల కోడ్.. 50 వేల ఉద్యోగాల భర్తీ ఎలా?) -
ఆ రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరంలోని చివరి మూడు నెలల రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పీఆర్సీతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే ఆదాయాన్ని బట్టి 2021–22 బడ్జెట్ అంచనాలు, కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇప్పటివరకు 2020–21 బడ్జెట్లో అప్పులు, ఆదాయం మొత్తం కలిపి రూ.1.04 లక్షల కోట్లు ఖజానాకు చేరగా, జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల ఆదాయం నిలకడగా వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల వరకు చేరవచ్చని ఆ శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. మరికొంత మొత్తం అప్పుల రూపంలో సమకూరినప్పటికీ 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను రూ.1.83 లక్షల కోట్ల నుంచి రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించాల్సి ఉంటుందని వారంటున్నారు. అంచనాలు తలకిందులు కరోనా కొట్టిన దెబ్బతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అంచనాలు తలకిందులయ్యాయి. అంతా సవ్యంగా ఉంటే మరో రూ.30 వేల కోట్ల వరకు సొంత పన్నుల ఆదాయం పెరిగేది. ఈ పరపతి భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఉపయోగపడేది. కానీ, కరోనా కాటుతో కీలక రంగాలు దెబ్బ తినడం, ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థిక ఆశలు ఆవిరి అయ్యాయి. అయితే గత ఆరు నెలలుగా (జూలై, 2020 నుంచి) వస్తుసేవల పన్ను (జీఎస్టీ), ఎక్సైజ్ ఆదాయం నిలకడగా ఉండడం, ఈ రెండూ కలిపి సగటున రూ.4,000 కోట్ల వరకు ఆదాయం వస్తుండడంతో కొంత మేర ప్రభుత్వ ఖజానా ఊపిరి పీల్చుకుంది. వీటికి తోడు గత రెండు నెలలుగా స్టాంపు, రిజిస్ట్రేషన్ల గల్లా కూడా కళకళలాడుతోంది. డిసెంబర్లో రూ.661 కోట్లు, జనవరిలో రూ.800 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరాయి. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.2 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మొత్తం మీద ఈ మూడు శాఖల ద్వారా నెలకు సగటున రూ.5వేల కోట్ల చొప్పున రూ.15 వేల కోట్ల వరకు వస్తాయని ఆ శాఖ లెక్కలు కడుతోంది. సగటున రూ.10 వేల కోట్ల రాబడి గత 3 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ రాబడులను పరిశీ లిస్తే సగటున నెలకు రూ.10 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతోంది. అక్టోబర్‌లో రూ.10,178 కోట్లు, నవంబర్‌లో రూ.10,239 కోట్లు, డిసెంబర్లో రూ.20,103 కోట్లు వచ్చాయి. అయితే, డిసెంబర్లో సొంత పన్నులు, కేంద్ర సాయం, ఇతర ఆదాయాలు కలిపి రూ.10 వేల కోట్లకు పైగా ఉండగా, మరో రూ.10 వేల కోట్లు అప్పులు కింద సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఈ లెక్కన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా సగటున రూ.10 వేల కోట్లు చొప్పున మూడు నెలల్లో రూ.30 వేల కోట్ల వరకు వస్తాయని, అప్పులు ఇంకో రూ.7–8 వేల కోట్ల వరకు తెచ్చుకున్నా, అంతా కలిపి రూ.1.45 లక్షల కోట్ల వరకు బడ్జెట్ చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు గడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2020–21 వార్షిక బడ్జెట్‌ను రూ.1.43 లక్షల కోట్ల వరకు సవరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరోవైపు 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చే నెలలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ జనవరి, ఫిబ్రవరి రాబడులను బట్టి కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలైన జీఎస్టీ, ఎక్సైజ్ ఆదాయాలు నెలల వారీగా..(రూ.కోట్లలో) (మొత్తం వార్షిక బడ్జెట్ అంచనాల్లో డిసెంబర్ నెలాఖరు వరకు జీఎస్టీ 53.7% రాగా, ఎక్సైజ్ డ్యూటీ ఆదాయం 65.27 శాతానికి చేరింది) -
జీఎస్టీ వసూళ్లలో నూతన రికార్డు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం నూతన గరిష్టాలకు చేరింది. 2021 జనవరి నెలకు రూ.1.20 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘2021 జనవరి నెలకు జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.1,19,847 కోట్లు (జనవరి 31 సాయంత్రం 6 గంటల సమయానికి) వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూ.21,923 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.29,014 కోట్లు ఐజీఎస్టీ రూ.60,288 కోట్లు (ఇందులో దిగుమతులపై వచ్చిన రూ.27,424 కోట్లు కూడా) వసూలైంది. మరో రూ.8,622 కోట్లు సెస్సు రూపంలో వచ్చింది’’ అంటూ ఆర్థిక శాఖ వెల్లడించింది. మరిన్ని జీఎస్టీ విక్రయ రిటర్నులు నమోదైతే వసూళ్ల ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత 5 నెలలుగా జీఎస్టీ వసూళ్లు పుంజుకుంటున్న ధోరణి జనవరిలోనూ కొనసాగినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. -
ముగ్గురు కేంద్ర మంత్రులతో ఆర్థిక మంత్రి బుగ్గన భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మూడో రోజైన బుధవారం పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. ఆర్థికశాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఆయన వెంట ఉన్నారు. వరి ఎగుమతికి సహకరించండి.. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం సందర్భంగా వరి సేకరణకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరారు. నివర్ తుపాన్ వల్ల రంగు కోల్పోయిన వరి ధాన్యం నాణ్యతలో సడలింపులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సేకరించిన వరిని రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తిపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారని బుగ్గన తెలిపారు. న్యాయ వర్సిటీని కేటాయించండి.. కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బుగ్గన కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుండటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. బెంగళూరులోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని నల్సార్, భోపాల్, జోధ్పూర్లలో మాదిరిగా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్ బకాయిల సమస్యను పరిష్కరించాలి.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)లకు సంబంధించి అప్పులను రీస్ట్రక్చర్ చేసుకోవడానికి సహకరించాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్‌తో శ్రమశక్తి భవన్లో సమావేశంసందర్భంగా బుగ్గన కోరారు. అంతర్ రాష్ట్ర విద్యుత్ బకా యిల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత సర్కారు హయాంలో చేసుకున్న ఒప్పందాలలో థర్మల్ విద్యుత్ ధర అధికంగా ఉందని, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నివేదించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాల గురించి తెలుసుకున్న కేంద్రమంత్రి అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించారని బుగ్గన తెలిపారు. -
రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీతో విడివిడిగా భేటీ అయ్యారు. నార్త్ బ్లాక్‌లోని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌ను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో కలిసి సుమారు 50 నిమిషాలపాటు బుగ్గన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటును భర్తీ చేయాలని, వివిధ అంశాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరామని బుగ్గన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి న్యాయపరంగా రావాల్సిన నిధులపై ఇప్పటికే ఆయా మంత్రులను కలిసి చర్చించామన్నారు. భూసేకరణ, పునరావాసానికి సంబంధించి 1985లో సేకరించిన అంచనాల వివరాలనే గత ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఎంత ఖర్చవుతుందో అంత చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని కేంద్రం దృష్టికి రాష్ట్రం తీసుకెళ్లిందని వివరించారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వానికి వాస్తవాలు అర్థం కాలేదని తాము భావిస్తున్నామని, అందుకే వివిధ నివేదికలు, ప్రాజెక్టు రిపోర్టులు, స్పెషల్ ప్యాకేజీల విషయంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో కేంద్రానికి వివరాలను సమర్పించారన్నారు. ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయిన దృష్ట్యా అక్కడి నుంచి ఇండిగో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీని కోరినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించామని, ఆ స్థలాల్లో పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించాలని కోరామన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీ సానుకూలంగా స్పందించారని వివరించారు. కాగా, స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పు కరోనా వారియర్స్ విజయంగా, ప్రజా విజయంగా మంత్రి బుగ్గన అభివర్ణించారు. -
ఎంత ఫిట్‌మెంట్‌కు ఎంత భారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలు వైపు అడుగులు పడ్డాయి. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ తమ నివేదికను సిద్ధం చేయగా, ఆర్థిక శాఖ ఎంత ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేస్తే ఎంత మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందన్న అంచనాలపై కసరత్తు చేస్తోంది. నిత్యావసర ధరల పెరుగుదల సూచీ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపుదల చేయడమే ఫిట్మెంట్ అయినా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పీఆర్సీ కమిటీ ఎంత సిఫారసు చేస్తుంది.. సీఎం కేసీఆర్ ఎంత ఖరారు చేస్తారన్న దానిపై ఉద్యోగుల్లో చర్చ జోరందుకుంది. మొత్తంగా 5.29 లక్షల మందికి.. ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతిని (ఐఆర్) అమలు చేస్తున్న నేపథ్యంలో అంతకంటే తక్కువ ఇస్తే ఇక్కడ ఉద్యోగులు ఒప్పుకోరన్న వాదన ఉంది. దీంతో 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎంత ఫిట్‌మెంట్‌కు ఎంత మొత్తం వెచ్చించాల్సి వస్తుంది.. ప్రభుత్వంపై పడే అదరపు భారం ఎంత అన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది. వారికి ఒక్క శాతం ఫిట్మెంట్ అమలు చేస్తే ఏటా అదనంగా రూ.225 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఒక్క శాతం నుంచి మొదలుకొని 35 శాతం వరకు ఫిట్మెంట్ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై అంచనాలు వేస్తున్నాయి. ఆ లెక్కన రాష్ట్రంలోని ఉద్యోగులకు 20 శాతం ఫిట్మెంట్ ఇస్తే రూ.4,500 కోట్లు, 22 శాతం ఇస్తే రూ.4,950 కోట్లు, 24 శాతం ఇస్తే రూ.5,400 కోట్లు, 25 శాతం ఇస్తే రూ.5,625 కోట్లు, రూ.27 శాతం ఫిట్మెంట్ ఇస్తే రూ.6,075 కోట్లు, 30 శాతం ఇస్తే 6,750 కోట్లు, 35 శాతం ఇస్తే రూ.7,875 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని లెక్కలు వేస్తున్నాయి. అవి భర్తీ అయితే రూ.9 వేల కోట్లకు.. ఇక ఇప్పటికే ఉద్యోగులకు రెండు కరువు భత్యాలను (డీఏ) చెల్లించాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం శాఖల వారీగా మంజూరైన పోస్టులు, పని చేస్తున్న ఉద్యోగుల లెక్కలను సేకరిస్తోంది. ఈ రెండేళ్లలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులు రిటైరయ్యారు. దాని ప్రకారమే 1 శాతం ఫిట్‌మెంట్‌కు రూ.225 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో శాఖల వారీగా మంజూరైన పోస్టుల ప్రకారం లెక్కిస్తే 1 శాతం ఫిట్‌మెంట్‌కు రూ.300 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన 30 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం ఏటా రూ.9 వేల కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
నవరత్నాలకు దండిగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలకు ఎలాంటి నిధుల సమస్య రాకుండా చట్ట సవరణలు తెచ్చినట్టు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం శాసనసభలో తెలిపారు. మనబడి, ఆస్పత్రులు, అమ్మ ఒడి, రైతుభరోసా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్టు చెప్పారు. ఏపీ అభివృద్ధి సంస్థ బిల్లును, ఏపీ విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ సవరణ (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ – ఎఫ్ఆర్బీఎం) బిల్లును సభ ఆమోదించింది. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ ఉద్దేశాలను వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రకారం 3 శాతం మాత్రమే అప్పుచేసే అవకాశం ఉందని, మన వడ్డీ, మనకు ఉన్న రెవెన్యూ రశీదులు 10 శాతం ఉంటే అప్పు చేయవచ్చని తెలిపారు. ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు సవరణలు చేస్తున్నట్టు చెప్పారు. దీనికి అనుగుణంగా అప్పు చేసుకునే వెసులుబాటు పరిధి పెరుగుతుందని తెలిపారు. కోవిడ్ కారణంగా ఈ సవరణలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే కేంద్రం 2 శాతానికి అనుమతించిందని చెప్పారు. కమీషన్లకు కక్కుర్తిపడి ‘పోలవరం’పై రాజీపడ్డ చంద్రబాబు పోలవరంపై చర్చ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ చంద్రబాబుది ఆర్భాటపు, ఆవేశపు, అసమర్థ ప్రభుత్వమని, తమది సహనం ఉన్న సమర్థ ప్రభుత్వమని చెప్పారు. చంద్రబాబు కమీషన్ల కోసం ప్యాకేజీకి కక్కుర్తిపడి ప్రత్యేక హోదా అంశంతోపాటు పోలవరం ప్రాజెక్టుపై రాజీపడ్డారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన ఆ దుర్మార్గపు చర్యే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో సమస్యలను తీసుకువచ్చిందన్నారు. 2014లో కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా పోలవరం నిర్మిస్తామన్న కేంద్రం 2016 సెపె్టంబర్లో మాత్రం.. 2014 నాటి ధరలమేరకే భరిస్తామంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు. పైగా 2018 జనవరి 12న అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాస్తూ 2014 నాటి ధరల ప్రకారం నివేదిక సమర్పించాం.. దాన్ని ఆమోదించాలని కోరడం ఏమిటని నిలదీశారు. 27 సార్లు ఢిల్లీ వెళ్లానని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు పోలవరం విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ఎందుకు అడ్డుకోలేదని, ఆనాడు కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని, ప్రాజెక్టును పూర్తి చేసితీరతామని ఆయన చెప్పారు. -
ఆర్బీఐ గుప్పిట్లోకి.. లక్ష్మీ వి‘లాస్’!
ముంబై: ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్వీబీ)పై కేంద్రం మంగళవారం మారటోరియం అ్రస్తాన్ని ప్రయోగించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌పై మంగళవారం నుంచి (17వ తేదీ) నుంచి 30 రోజులపాటు– డిసెంబర్ 16 వరకూ మారటోరియం అమల్లో ఉంటుంది. ఆర్థికశాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఒక బ్యాంక్ ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా, కేవలం రూ.25,000 వరకూ మాత్రమే (30 రోజుల వరకూ) వెనక్కు తీసుకోగలుగుతాడు. అయితే ఆరోగ్య వ్యయాలు, ఉన్నత విద్యకు చెల్లింపులు, వివాహ ఖర్చుల వంటి అత్యవసరాలకు ఆర్బీఐ ముందస్తు అనుమతితో ఖాతాదారుడు రూ.25,000కు మించి తన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బ్యాంక్ బోర్డ్‌ను పక్కనబెట్టి కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సలహా మేరకు కేంద్రం ఈ అత్యవసర నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌గా కెనరాబ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్ నియమితులయ్యారు. ప్రత్యామ్నాయం లేకే...: ఆర్బీఐ ‘‘బ్యాంకుకు సంబంధించి విశ్వసనీయ పునరుద్ధరణ ప్రణాళికలేని పరిస్థితుల్లో డిపాజిటర్ల ప్రయోజనాలు, బ్యాంకింగ్ స్థిరత్వం, ఫైనాన్షియల్ వ్యవహారాల పటిష్టత ముఖ్యం. ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 45 కింద బ్యాంక్‌పై మారటోరియం విధించాలని కేంద్రానికి సిఫారసు చేయడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆర్బీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 17వ తేదీ నుంచి 30 రోజులపాటు... అంటే డిసెంబర్ 16వ తేదీ వరకూ అమలుజరిగే విధంగా బ్యాంక్‌పై మారటోరియం విధించింది’’ అని ఈ పరిణామానికి సంబంధించి వెలువడిన ఆర్బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. తాజా మారటోరియం ప్రకారం, సేవింగ్స్, కరెంట్ లేదా మరే డిపాజిట్ అకౌంట్ నుంచీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ తనకు తానుగా, ఆర్బీఐ నుంచి అనుమతి పొందకుండా రూ.25,000 మించి ఖాతాదారుకు చెల్లించలేదని కూడా స్పష్టం చేసింది. డీబీఎస్ బ్యాంక్‌తో విలీన ప్రతిపాదన తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకింగ్ సేవల దిగ్గజం... డీబీఎస్ బ్యాంక్ ఇండియా (డీబీఐఎల్)తో విలీనానికి సంబంధించి ముసాయిదా పథకాన్ని కూడా ఆర్బీఐ వెలువరించింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. భారత్‌లో తమ అనుబంధ సంస్థ డీబీఐఎల్ రూ. 2,500 కోట్ల మేర నిధులు ఇవ్వనున్నట్లు డీబీఎస్ వెల్లడించింది. సర్వత్రా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ విలీన డీల్‌తో ఎల్వీబీ డిపాజిటర్లు, కస్టమర్లు, ఉద్యోగులకు కొంత ఊరట లభించగలదని పేర్కొంది. అలాగే డీబీఐఎల్ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను మరింతగా పెంచుకునేందుకు ఇది తోడ్పడగలదని తెలిపింది. బీఎస్ఈలో బ్యాంక్ షేరు మంగళవారం 1% నష్టంతో రూ. 15.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఆర్బీఐ మారటోరియం ఆదేశాలు వెలువడ్డాయి. బ్యాంక్ వ్యాపారం ఇలా... రిటైల్, మిడ్–మార్కెట్, కార్పొరేట్ రంగాల్లో బిజినెస్ చేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు– వీఎస్ఎన్ రామలింగ చెట్టియార్ నేతృత్వంలో ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో స్థాపించారు. 2019 జూన్ 30వ తేదీ నాటికి 569 బ్రాంచీలు ఉన్నాయి. ఇందులో ఏడు కమర్షియల్ బ్యాంక్ బ్రాంచీలుకాగా, ఒకటి శాటిలైట్ బ్రాంచ్. ఐదు ఎక్స్టెన్షన్ కౌంటర్లు, ఏడు ప్రాంతీయ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకుకు బ్రాంచీలు ఉన్నాయి. దాదాపు 1,047 ఏటీఎంలు సేవలు అందిస్తున్నాయి. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి బ్యాంక్ వ్యాపారం రూ.37,595 కోట్లు. నికర నష్టాలు రూ.397 కోట్లు. స్థూల మొండిబకాయిల (ఎన్పీఏ)ల పరిమాణం 24.45 శాతంగా ఉంటే, నికరంగా చూస్తే ఇది 7.01 శాతంగా ఉంది. బ్యాంకులో దాదాపు నాలుగువేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
తాండవకు గోదారమ్మ
సాక్షి, అమరావతి: ఏలేరు, తాండవ రిజర్వాయర్ల ఆయకట్టును అనుసంధానం చేయడం ద్వారా 2,33,465 ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.500 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలను ఆర్ధిక శాఖకు జలవనరుల శాఖ పంపింది. ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ అనంతరం పనులు చేపట్టేందుకు జలవనరుల శాఖ పరిపాలన అనుమతి ఇస్తుంది. ఈ రెండు రిజర్వాయర్ల ఆయకట్టు అనుసంధానం ద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదాకా విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేయడానికి మార్గం సుగమం అవుతుంది. విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం జీకే గూడెం వద్ద తాండవ నదిపై 4.96 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించి.. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 51,465 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల నదిలో నీటిలభ్యత తగ్గుతుండటంతో ఆయకట్టుకు ఇప్పటివరకు సరిగా నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. ఈ రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా రైతులను ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి తాండవ ఆయకట్టు స్థిరీకరణతో పాటు ఏలేరు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒక ప్రతిపాదన.. బహుళ ప్రయోజనాలు ► ఏలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 24.1 టీఎంసీలు. ఏలేరు పరీవాహక ప్రాంతంలో 17.92 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన అధికారులు ఎడమ కాలువ కింద 1.14 లక్షల ఎకరాలు, కుడి కాలువ కింద 10 వేల ఎకరాలకు నీళ్లు అందించేలా ప్రాజెక్టును రూపొందించారు. అయితే ఇప్పటివరకు ఏనాడూ పూర్తి ఆయకట్టుకు నీళ్లందించిన దాఖలాలు లేవు. ఎడమ కాలువ పనుల్లో లోపాల వల్ల దీనికింద 1.14 లక్షల ఎకరాలకు గాను కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందిస్తున్నారు. ఏలేరు రిజర్వాయర్ వద్ద ఎడమ కాలువ ప్రవాహ సామర్థ్యం వెయ్యి క్యూసెక్కులు. చివరకు వచ్చేసరికి 220 క్యూసెక్కులు ఉండేలా పనులు చేపట్టారు. కానీ కాలువను ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల 450 క్యూసెక్కులకు మించి సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. కుడికాలువ పనులు పూర్తి కాలేదు. ► ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఎడమ కాలువ వెడల్పు, లైనింగ్ పనులు చేపట్టి సరఫరా 1,250 క్యూసెక్కులకు పెంచేలా జలవనరుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తద్వారా కాలువ కింద పూర్తి ఆయకట్టు అంటే 1.14 లక్షల ఎకరాలకే కాకుండా కొత్తగా ఏడు వేల ఎకరాలకు వెరసి మొత్తం 1.21 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చునని, రోజుకు 250 క్యూసెక్కుల చొప్పున ఎత్తిపోయడం ద్వారా తాండవ ఆయకట్టు చివరి భూములకు కూడా నీళ్లందించవచ్చని, రెండు ప్రాజెక్టుల కింద ఆయకట్టు సస్యశ్యామలం చేయవచ్చునని అధికారులు తెలిపారు. ► పోలవరం ఎడమ కాలువ నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటికే ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలిస్తుండటం వల్ల రిజర్వాయర్‌కు నీటి లభ్యత సమస్య ఉండదు. దీనివల్ల ఏలేరు ఆయకట్టుకు, విశాఖపట్నం తాగు, పారిశ్రామిక అవసరాలకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేసేందుకు వీలవుతుంది. ఈ పనులు చేపట్టడానికి ఒక్క ఎకరా భూమిని కూడా సేకరించాల్సిన అవసరం లేదు. రూ.500 కోట్లతో ఎత్తిపోతల పనులు పూర్తి చేయవచ్చునని అధికారులు ప్రతిపాదించారు. ► ఈ అనుసంధానం పనుల వల్ల తాండవ ఆయకట్టుతో పాటు ఏలేరు ఆయకట్టుకూ పూర్తిస్థాయిలో నీటిని అందించవచ్చు. ఏలేరు కుడి కాలువను పూర్తి చేయడం ద్వారా పది వేల ఎకరాలకు నీళ్లందించవచ్చు. రిజర్వాయర్ దిగువన ఏలేరు పరివాహక ప్రాంతంలో 51 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. వర్షాకాలంలో ఖరీఫ్ పంటల సాగుకు ఇబ్బంది లేకున్నా, రబీకి ఇబ్బంది అవుతోంది. ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆరు టీఎంసీలను నదిలోకి విడుదల చేయడం ద్వారా దిగువన ఉన్న 51 వేల ఎకరాలకు కూడా సమర్థవంతంగా నీటిని అందించవచ్చునని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
2021 బడ్జెట్ సంప్రదింపులు ఈ–మెయిల్ ద్వారానే...
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్‌ను రూపొందించడానికి ముందు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, వ్యాపార వాణిజ్య వర్గాలు, తదితర రంగాల్లోని నిపుణులతో ఆర్థిక మంత్రి నార్త్ బ్లాక్‌లో స్వయంగా సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తీసుకోవడం సాంప్రదాయకంగా వస్తోంది. ఇందుకు వేర్వేరు తేదీల్లో ఆర్థికమంత్రి సమావేశాలూ నిర్వహించేవారు. అయితే కరోనా మహమ్మరి వల్ల ఈ సాంప్రదాయానికి ఈ దఫా ‘విరామం’ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. 2021 బడ్జెట్ రూపకల్పన విషయంలో పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ఆర్థికవేత్తలు, నిపుణులు తగిన సలహాలు ఇవ్వడానికి ఇందుకు త్వరలో ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీ రూపకల్పన జరుగుతున్నట్లు శుక్రవారం ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీ’’ ఏర్పాటు విషయంలో త్వరలో ఒక నిర్దిష్ట ప్రకటన వెలువరిస్తామని కూడా ప్రకటన వివరించింది. 15 నుంచి 30 వరకూ అందుబాటులో 'MyGov.in' పోర్టల్ అలాగే రానున్న బడ్జెట్‌పై వివిధ రంగాల్లో నిపుణులైన ప్రజల నుంచీ సలహాలను తీసుకోడానికి ప్రభుత్వ 'MyGov.in' పోర్టల్‌నూ ఒక వేదికగా వినియోగించుకోనున్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకూ ఈ పోర్టల్ ప్రజా సూచలనకు అందుబాటులో ఉంటుందని ఆర్థికశాఖ ప్రకటన తెలిపింది. ‘‘సాధరణ ప్రజలు తమతమ వ్యక్తిగత హోదాల్లో 'MyGov.in' పోర్టల్‌లో తమ పేరును నమోదుచేసుకుని 2021–22 బడ్జెట్‌కు సంబంధించి తమ సలహాలను సమర్పించవచ్చు. ఆయా సూచనలు, సలహాలను సంబంధిత మంత్రిత్వశాఖలు, విభాగాలూ పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటాయి’’ అని ప్రకటన వివరించింది. తమకు అందిన సూచనలు, సలహాలపై అధికార వర్గాలు ఏదైనా వివరణ కోరదలిస్తే, సూచలను చేసిన నిర్దిష్ట వ్యక్తులను ఈ మెయిల్ లేదా ఫోన్ నెంబర్ (రిజిస్ట్రేషన్ సమయంలో వారు సమర్పించిన) ద్వారా సంప్రదిస్తారని కూడా ఆర్థికశాఖ తెలియజేసింది. కత్తిమీద సామే! యథాపూర్వం 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు సమర్పిస్తారని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూలతలు, ఉద్దీపన చర్యలు, ఆదాయాలు–వ్యయాలకు మధ్య భారీగా పెరిగిపోనున్న ద్రవ్యలోటు, మౌలిక రంగంపై భారీ నిధుల కేటాయింపులకు భారీ అవరోధాలు వంటి అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు తాజా బడ్జెట్ కత్తిమీద సాములాగా కనిపిస్తోంది. నిర్మలా సీతారామన్‌తోపాటు మోదీ 2.0 ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్. బడ్జెట్ ముందస్తు/సవరించిన అంచనాల సమావేశాలు అక్టోబర్ 16 నుంచి ప్రారంభమై, నవంబర్ మొదటి వారం వరకూ కొనసాగాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇతర శాఖల కార్యదర్శులతో సంప్రదింపుల తర్వాత వ్యయ విభాగం కార్యదర్శి 2021–22 బడ్జెట్ అంచనాలను ఖరారు చేస్తారు. ఈ దశలోనే కేంద్ర ఆర్థికశాఖ నిపుణుల సలహాలను ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీ ద్వారా స్వీకరించనుంది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో ఎనానమీ 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో... 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం నుంచి 15 శాతం వరకూ క్షీణిస్తుందని ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు అంచనావేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌తో ముగిసే నెలకు ద్రవ్యలోటు 114.8 శాతానికి చేరడం గమనార్హం. 2019–20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతం. అయితే, ద్రవ్యలోటు 2020–21లో రెండంకెలకు పెరిగిపోయే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. -
పోలవరం బకాయిల విడుదలకు మార్గం సుగమం
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సోమవారం కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. ఎలాంటి షరతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలకు అంగీకరించింది. రూ. 2234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు మెమో పంపింది. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన ప్రక్రియను పీపీఏ పూర్తి చేయాలని జలశక్తి శాఖను ఆదేశించింది. ( పోలవరం ప్రాజెక్టుకు మేం అడ్డుకాదు.. కానీ ) కాగా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,805 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం చేసిన ఖర్చును ధ్రువీకరిస్తూ కాగ్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు తెలిపారు. (పోలవరం: పెట్టుబడి అనుమతి ఇవ్వాలి) -
చక్రవడ్డీ మాఫీపై ఆర్థిక శాఖ వివరణ
న్యూఢిల్లీ: మారటోరియం వ్యవధిలో రుణాలపై చక్రవడ్డీ మాఫీపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. సాధారణ వడ్డీ, చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని రుణ గ్రహీతల ఖాతాల్లో బ్యాంకులు జమ చేసే అంశంపై స్పష్టతనిచ్చింది. ఎక్స్‌గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29 నాటికి బాకీ ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. రూ. 2 కోట్ల దాకా ఎంఎస్ఎంఈ, విద్య, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల బకాయిలు మొదలైన వాటికి ఈ స్కీము వర్తిస్తుంది. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఇవి మొండిపద్దులుగా మారి ఉండకూడదు. మార్చి 1 నుంచి ఆగస్టు 21 దాకా కాలానికి (184 రోజులు) రీఫండ్ చేస్తారు. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. నవంబర్ 5 కల్లా రుణగ్రహీతల ఖాతాల్లో ఎక్స్‌గ్రేషియా జమ చేయాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని బ్యాంకులకు కేంద్రం తర్వాత రీయింబర్స్ చేస్తుంది. -
బడ్జెట్ తయారీ ప్రక్రియకు శ్రీకారం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో... తన మూడవ బడ్జెట్ తయారీ ప్రక్రియకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జరిగిన మొట్టమొదటి సమావేశంలో ఆర్థిక సేవలు, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గృహ, ఉక్కు, విద్యుత్ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆర్థికమంత్రిత్వశాఖ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 12వ తేదీనాటికి బడ్జెట్ తయారీలో కీలక సమావేశ ప్రక్రియ పూర్తవుతుంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సవరిత అంచనాలు (ఆర్ఈ), 2021–22 బడ్జెట్ అంచనాలు (బీఈ) దాదాపు నెలరోజుల్లో ఖరారవుతాయి. ప్రభుత్వ ఆదాయాలు పడిపోవడం, ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రెండంకెలకు చేరే అవకాశాలు కనిపిస్తుండడం వంటి అంశాల నేపథ్యంలో తాజా బడ్జెట్ రూపకల్పనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో ఎనానమీ 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో... 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.5 శాతం నుంచి 15 శాతం వరకూ క్షీణిస్తుందని ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు అంచనావేసిన సంగతి తెలిసిందే. కాగా బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో జరగనున్న సమావేశాలకు అన్ని శాఖల నుంచి గరిష్టంగా ఐదుగురు సభ్యులకన్నా ఎక్కువమంది హాజరుకాకుండా నియంత్రణలు విధించనున్నట్లు ఆర్థిక శాఖలో బడ్జెట్ విభాగం పేర్కొంది. అదీ డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ స్థాయి వ్యక్తులకే ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కోవిడ్–19 తీవ్రత నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్మలా సీతారామన్‌తోపాటు మోదీ 2.0 ప్రభుత్వానికి కూడా ఇది మూడవ బడ్జెట్. ఫిబ్రవరి 1వ తేదీన 2021–22 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
భారత్‌లో ‘వీ’ నమూనా ఆర్థికాభివృద్ధి!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న భారత్ ఆర్థిక వ్యవస్థ, తిరిగి ‘వీ’ (V) తరహా వృద్ధి రేటును చూస్తోందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. కోవిడ్–19పై సమరానికి అమలు చేసిన కఠిన లాక్డౌన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి మైనస్ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఒక్క భారత ఆర్థిక వ్యవస్థే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ప్రతికూల పరిస్థితే నెలకొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 33 శాతం, బ్రిటన్ 21.7 శాతం, ఫ్రాన్స్ 18.9 శాతం, స్పెయిన్ 22.1 శాతం, ఇటలీ 17.7 శాతం, జర్మనీ 11.3 శాతం నష్టపోగా. యూరో ప్రాంతం దాదాపు మైనస్ 15 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. జపాన్ విషయంలో ఈ క్షీణ రేటు 9.9 శాతంగా ఉంది. ► ఇక లాక్డౌన్ వల్ల ప్రయోజనాల విషయానికి వస్తే, కోవిడ్–19 ప్రతికూల పరిస్థితులపై ఈ కాలంలో ఒక స్పష్టమైన అంచనాలకు రాగలిగాం. మరణాల రేటు తగ్గడానికి తగిన చర్యలు తీసుకున్నాం. ప్రపంచంలో కోవిడ్–19 ప్రేరిత మృతుల రేటు (శాతాల్లో) భారత్‌లోనే తక్కువ ఉంది. ఆగస్టు 31 వరకూ చూస్తే, భారత్‌లో మృతుల రేటు కేవలం 1.78 శాతంగా ఉంటే, అమెరికాలో ఈ రేటు 3.04 శాతంగా ఉంది. బ్రిటన్‌లో ఈ రేటు ఏకంగా 12.35 శాతం. ఫ్రాన్స్‌లో 10.09 శాతం. జపాన్‌లో 1.89 శాతం. ఇటలీలో 13.18 శాతం. ► ప్రస్తుతం భారత్ ‘వీ’ (ఠి) తరహా వృద్ధి పురోగమనంలో ఉంది. ఇందుకు తగిన గణాంకాలు కనిపిస్తున్నాయి. ఆటో, ట్రాక్టర్, ఎరువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. రైల్వే రవాణా పెరుగుతోంది. స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరుగుతోంది. ఈ– వే బిల్స్ బాగున్నాయి. జీఎస్టీ వసూళ్ల విషయంలో సానుకూలత కనిపిస్తోంది. రహదారులపై రోజూవారీ టోల్ వసూళ్లు మెరుగుపడుతున్నాయి. రిటైల్ ఫైనాన్షియల్ లావాదేవీలు, తయారీ పర్చేజింగ్ మేనుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ పరిస్థితి బాగుంది. మౌలిక రంగాలు సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. పెట్టుబడులు మెరుగుపడుతున్నాయ్. ఎగుమతులు వృద్ధి బాటలోకి వెళ్లే పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యవసాయ రంగంలో మంచి పురోగతి కనబడుతోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు చరిత్రాత్మక రికార్డు స్థాయిల్లో (ఆగస్టు 28వ తేదీతో ముగిసిన వారంలో చరిత్రాత్మక రికార్డు స్థాయి 541.431 బిలియన్ డాలర్లు)కొనసాగుతున్నాయి. 14 నెలలకుపైగా దిగుమతులకు ఇవి సరిపోతాయి. ► దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా కేంద్రం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ► అయితే ఇంకా కొన్ని కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలు, మౌలిక రంగం, స్టార్టప్స్, మానవ వనరుల నైపుణ్యత, ఆరోగ్య భద్రత వంటి రంగాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉంది. భూ, న్యాయ, కార్మిక, క్యాపిటల్ మార్కెట్ విభాగాల్లో మరిన్ని వ్యవస్థాగత సంస్కరణలు అవసరం. నిరుద్యోగ సమస్యసహా సమస్యల పరిష్కారానికి కేంద్రం అధిక దృష్టి కేంద్రీకరించింది. రూపాయికి 33 పైసలు లాభం ఈక్విటీ మార్కెట్ భారీగా నష్టపోయినా, శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 33 పైసలు బలపడి 73.14 వద్ద ముగిసింది. దీనితో వారం వారీగా రూపాయి 25 పైసలు లాభపడినట్లయ్యింది. రూపాయి వరుసగా నాలుగు వారాల నుంచీ బలపడుతూ వస్తోంది. ఈ నెల మొత్తం ఐపీఓల ద్వారా దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయన్న అంచనాలే రూపాయి బలోపేతానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రిసెర్చ్ డిప్యూటీ హెచ్ దేవర్‡్ష వికెల్ అభిప్రాయపడుతుండడం గమనార్హం. 25 శాతం రెవెన్యూ వృద్ధి లక్ష్యంగా భారత్: వుయ్ వర్క్ కోవిడ్–19 తీవ్ర సవాళ్లు విసురుతున్నప్పటికీ, భారత్ ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో 25 శాతం రెవెన్యూ వృద్ధి లక్ష్యంతో ఉందని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న రియల్టీ సంస్థ– ఎంబసీ గ్రూప్ అనుబంధ విభాగం వుయ్ వర్క్ అంచనావేసింది. దీనిని సాధించే అవకాశాలు కూడా భారత్‌కు ఉన్నాయని అభిప్రాయపడింది. అయితే రాబడీ–వ్యయాలను చూస్తే 2019 కన్నా, 2020లో కొంత ప్రతికూలతలు తప్పవని తెలిపింది. -
పన్నుల వ్యవస్థలో విప్లవాత్మకం... జీఎస్టీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ ప్రవేశపెట్టడంతో పన్నుల భారం తగ్గిందని, దీనితో సరళతర పన్ను వ్యవస్థలో పన్నులు చెల్లించే వారి సంఖ్య దాదాపు రెట్టింపై 1.24 కోట్లకు పెరిగిందనీ ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. ఆర్థికశాఖ మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మొదటి వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ పలు ట్వీట్స్ చేసింది. దాదాపు 17 రకాల స్థానిక లెవీలు, 13 సెస్‌ల ఉపసంహరణలతో 2017 జూలై 1న జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు బాధ్యతల్లో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్‌జైట్లీ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ తాజా ట్వీట్స్ సారాంశాన్ని పరిశీలిస్తే... ► జీఎస్టీ ప్రవేశపెట్టకముందు అమల్లో ఉన్న బహుళ పరోక్ష పన్నుల వ్యవస్థ– వ్యాల్యూయాడెడ్ ట్యాక్స్ (వీఏటీ), ఎక్సైజ్, అమ్మకపు పన్ను వాటికి సంబంధించిన ఇతర చార్జీల వల్ల దేశ పౌరులపై అధిక పన్ను భారం ఉండేది. 31 శాతం వరకూ ఉన్న అధిక స్థాయి పన్ను రేటు ధరలపై ప్రభావం చూపేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పోయింది. తాజా వస్తు,సేవల పన్ను విధానం అటు వినియోగదారుకు అటు పన్ను చెల్లింపుదారుకూ స్నేహపూర్వకమైంది. ► జీఎస్టీకి ముందు అధిక పన్ను భారం వల్ల ఈ చట్రంలోకి రావడానికి వెనుకడుగు వేసే పరిస్థితి. అయితే సరళతర జీఎస్టీ వ్యవస్థలో పన్ను భారం తగ్గింది. దీనితో పన్ను చెల్లింపుదారు బేస్ కూడా పెరిగింది. ► జీఎస్టీ తొలినాళ్లలో అసెస్సీల సంఖ్య 65 లక్షలయితే, ఇప్పుడు ఈ సంఖ్య 1.24 కోట్లను దాటింది. ► జీఎస్టీ అమల్లో అరుణ్‌జైట్లీ పాత్ర కీలకమైనది. భారత్ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక చరిత్రాత్మక సంస్కరణ. అప్పట్లో వివిధ రాష్ట్రాలు విధించే విభిన్న పన్ను రేట్లు తీవ్ర వ్యయ భరితంగా ఉండేవి. ప్రజలు పన్నులు చెల్లించే స్థాయికి రేట్లను జీఎస్టీ తగ్గించింది. అప్పట్లో రెవెన్యూ న్యూట్రల్ రేటు 15.3 శాతం అయితే, దానితో పోల్చితే ఇప్పుడు జీఎస్టీ రేటు 11.6 శాతానికి తగ్గింది. ► రూ.40 లక్షల వరకూ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారాలపై ఇప్పుడు జీఎస్టీ మినహాయింపు ఉంది. ప్రారంభంలో ఇది రూ.20 లక్షలుగా ఉండేది. దీనికితోడు రూ.1.5 కోట్ల వరకూ టర్నోవర్ ఉన్న ఒక కంపెనీ కాంపోజిషన్ స్కీమ్ కింద కేవలం ఒక శాతం పన్నును మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది. ► జీఎస్టీ అమల్లోకి రావడంతోటే అనేక వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం జరిగింది. 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న దాదాపు 230 వస్తువుల్లో దాదాపు 200 వస్తువులను తక్కువ స్లాబ్స్ రేట్లలోకి మార్చడం జరిగింది. హౌసింగ్ రంగాన్ని 5 శాతం శ్లాబ్‌లో ఉంచగా, చౌక గృహాలకు సంబంధించి జీఎస్టీ రేటును ఒక శాతానికి తగ్గింది. ► జీఎస్టీకి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తిగా ఆటోమేటెడ్ చేయడం మరో విషయం. ప్రస్తుతం 50 కోట్ల రిటర్న్స్‌ను ఆన్లైన్లో దాఖలు చేయడం జరిగింది. 313 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. స్థిరంగా పెరుగుతున్న రెవెన్యూ 2017 జూలై 1వ తేదీ అర్థరాత్రి నుంచీ భారత పన్నుల వ్యవస్థలో చరిత్రాత్మక మార్పు. ఒకే మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించింది. బహుళ పన్ను వ్యవస్థకు తెరపడింది. ప్రస్తుతం 480 వస్తువులు పన్ను రహిత లేదా 5 శాతంలోపు పన్ను రేట్లలో ఉన్నాయి. 221 వస్తువులు 12 శాతం రేటు వద్ద, 607 వస్తువులు 18 శాతం రేటు వద్ద ఉండగా, కేవలం 29 వస్తువులు మాత్రమే 28% రేటు వద్ద ఉన్నాయి. ఆయా సడలింపుల నేపథ్యంలో పన్ను గడచిన మూడేళ్లలో పన్ను బేస్ పెరిగింది. 2017–18 తొమ్మిది నెలల్లో (జూలై–మార్చి) సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు. 2018–19లో నెలకు సగటు రెవెన్యూ 10% పెరిగి మొత్తంగా ఆదాయాలు రూ.97,100 కోట్లకు చేరాయి. 2019–20లో ఈ ఆదాయం ఏకంగా రూ.1,02,000కోట్లకు ఎగసింది. రేట్ల తగ్గింపు, పలు సడలింపులు ఇస్తున్నప్పటికీ, జీఎస్టీ స్థిరంగా పెరుగుతూ వస్తున్న విషయం గమనార్హం. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో, జీఎస్టీ భారం తగ్గడానికి ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ప్రవేశపెట్టింది. – అరుణ్‌జైట్లీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక ఆర్టికల్‌లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ -
రుణ లక్ష్యం రూ.2,51,600 కోట్లు
సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక (2020–21) సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక రూ.2,51,600 కోట్లుగా నిర్ధారించారు. సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి అధ్యక్షతన బుధవారం తన క్యాంపు కార్యాలయంలో 211వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆర్థిక ఏడాది వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వ్యవసాయ రంగానికి పెద్దపీట ► 2020–21లో మొత్తం రుణాల లక్ష్యం రూ.2,51,600 కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.78 శాతం పెంపు. వ్యవసాయ రంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే 11.9% అధికం. ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు)కు రూ.39,600 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం. ఇది గత ఏడాదితో పోలిస్తే 10 శాతం పెంపు. ► విద్యా రుణాల కింద రూ.1,900 కోట్లు, ఇళ్ల రుణాల కింద రూ.9,710 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.410 కోట్లు, పునరుత్పాదక ఇంధన (రెన్యువబుల్ ఎనర్జీ) రంగానికి రూ.454 కోట్లు, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ.3,400 కోట్లు ఇవ్వాలని లక్ష్యం. ► మొత్తం మీద ప్రాధాన్యతా రంగానికి రూ.1,87,550 కోట్లు ఇవ్వాలని లక్ష్యం కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 10.88 శాతం అధికం. ప్రాధాన్యేతర రంగానికి రూ.64,050 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే 6.75 శాతం పెంపు. సకాలంలో రుణ వివరాలు ఇవ్వాలి ► 2019–20లో రుణాల లక్ష్యం రూ.2,29,200 కోట్లు. ఇందులో రూ.2,27,882 కోట్లు రుణాలుగా ఇచ్చారు. మొత్తమ్మీద 99.42 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. వ్యవసాయ రంగంలో రూ.1,15,000 కోట్ల లక్ష్యం మేరకు రూ.1,13,997 కోట్లు రుణాలుగా ఇచ్చారు. లక్ష్యంలో 99.13 శాతం సాధ్యమైంది. ► రైతులకు సున్నా వడ్డీ సకాలంలోనే ఇవ్వాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును రబీ నాటికి చెల్లిస్తామని, రబీ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీని ఖరీఫ్ నాటికి చెల్లిస్తామని, ఇందుకు సంబంధించిన వివరాలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులు బ్యాంకర్లను కోరారు. ► గ్రామాల్లో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ తదితర ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీని కోసం తగిన సహాయం అందించాలన్నారు. ► ప్రతి ఆర్బీకేలో ఈ సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నామని, ప్రతి మండలానికీ కోల్డు స్టోరేజీ, కోల్డు రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతుల ఉత్పత్తుల సమాచారాన్ని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేసి వారి మార్కెటింగ్‌కు సహకారం అందిస్తామన్నారు. నీటి ప్రాజెక్టులకు సాయం అందించాలి ► రాష్ట్రంలో చేపడుతున్న సాగు నీటి ప్రాజెక్టులకూ తగిన సహకారం అందించాలని ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లను కోరారు. గోదావరిలో వరద జలాలను వినియోగించుకోవడానికి బృహత్ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దీనికి తగిన విధంగా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతుల రుణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ► ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, ఎస్ఎల్బీసీ కన్వీనర్, బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్ సీజీఎం సుధీర్‌కుమార్ పాల్గొన్నారు. ► వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేశ్‌కుమార్ గార్డ్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ తదితరులు పాల్గొన్నారు. -
గతేడాది జీఎస్టీ పరిహారంగా ఏపీకి రూ.3,028 కోట్లు
సాక్షి, అమరావతి : 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ పరిహారంగా రాష్ట్రానికి రూ.3,028 కోట్లు చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకూ జీఎస్టీ పరిహారంగా రూ.1,65,302 కోట్లు చెల్లించినట్టు నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. వాస్తవంగా జీఎస్టీ పరిహారం కోసం విధించే సెస్ రూ.95,444 కోట్లు వచ్చినా, రూ.1.65 లక్షల కోట్లు చెల్లించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రూ.3,054 కోట్లు, కర్ణాటక రూ.18,628 కోట్లు, తమిళనాడు రూ.12,305 కోట్లు పరిహారంగా పొందాయి. -
వచ్చే నెల 1నే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. వచ్చే నెల 1నే వారికి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెలా ఒకటినే వారికి జీతాలు ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డేటా సక్రమంగా ఉందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ట్రెజరీ అధికారులను శనివారం ప్రభుత్వం ఆదేశించింది. ► ఇచ్చిన మాట మేరకు సీఎం వైఎస్ జగన్ ఈ నెల 3న ప్రత్యేకంగా ఔట్సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ► ఈ నెల 3 నాటికి 50 వేలకు పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చారు. ► కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులకు వచ్చే నెల 1 నుంచి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా వేతనాలను చెల్లించనున్నారు. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించి కార్పొరేషన్ సమర్పించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డేటాను పే అండ్ అకౌంట్ ఆఫీసర్లు పరిశీలించాల్సిందిగా ట్రెజరీ, అకౌంట్స్ డైరెక్టర్ ఆదేశించారు. ► జిల్లా కార్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూషన్స్కు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డేటాను జిల్లా ట్రెజరీ అధికారులు పరిశీలించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ► ఆయా పోస్టులకు విద్యార్హతలతోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు. ఆర్థిక శాఖ అనుమతితోనే ఉద్యోగులను తీసుకున్నారా, లేదా, మంజూరైన పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారా, లేదా చూడాలని సూచించారు. ► డేటాను పూర్తిగా పరిశీలించి జిల్లా ట్రెజరీల డిప్యూటీ డైరెక్టర్లు నివేదికను వచ్చే నెల 9లోగా ఆన్లైన్లో పంపించాలన్నారు. ఇక నియామకాలు కార్పొరేషన్ ద్వారానే.. ► ఇక ప్రభుత్వ రంగంలో ఏ శాఖ లేదా సంస్థకైనా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరమైతే ఈ కార్పొరేషన్ ద్వారానే తీసుకోనున్నారు. దీని వల్ల ఏజెన్సీలు, దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ► గతంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కావాలంటే అభ్యర్థులు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అలాగే జీతాలకు ఆ ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు ఇచ్చేది. ఏజెన్సీలు ఉద్యోగులకు జీతం పూర్తిగా ఇవ్వకుండా మిగుల్చుకునేవి. ► ఇప్పుడు ఉద్యోగాలకు, జీతాలకు పైసా లంచం లేకుండా పూర్తి పారదర్శకంగా కార్పొరేషన్ నిర్వహించనుంది. ► వివక్షకు తావులేకుండా 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వడంతోపాటు, వాటన్నింటిలో 50 శాతం మహిళలకు ఇవ్వనున్నారు. ► అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఈఎస్ఐ, ఈపీఎఫ్‌ను కార్పొరేషన్ సక్రమంగా నిర్వహించనుంది. -
మండల, జిల్లా పరిషత్‌లకూ నిధులు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చల్లని కబురు పంపింది. పంచాయతీరాజ్ సంస్థలకు మూడంచెల్లో నిధులు సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్లూ 100 శాతం ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకే విడుదల చేసిన కేంద్ర సర్కారు.. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత మేర వాటాను మండల, జిల్లా పరిషత్‌లకు కూడా కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్థానిక సంస్థలకు వాటాల వారీగా నిర్దేశించుకోవాలని సూచించింది. పంచాయతీలకు 70 నుంచి 85 శాతం, మండల పరిషత్‌లకు 10 నుంచి 25 శాతం, జిల్లా పరిషత్‌లకు 5 నుంచి 15 శాతం మధ్యన ఖరారు చేసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలకు 85%, మండల పరిషత్‌లకు 10%, జిల్లా పరిషత్‌లకు 5% నిష్పత్తిలో వాటా ఖరారు చేస్తూ ఉత్తర్వులు (జీవో నం.215) జారీ చేసింది. ఈ ఏడాది నుంచి మనుగడలోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం జనాభా ప్రాతిపదికన మన రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు రూ.1,847 కోట్లు కేటాయించింది. దీంట్లో గ్రామ పంచాయతీలకు రూ.1,569.95 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.184.7 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.92.35 కోట్ల నిధులు రానున్నాయి. స్థానిక సంస్థలకు ఊరట.. గత ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం మొత్తం నిధులను నేరుగా పంచాయతీలకే బదలాయించేది. దీంతో ఇతర వనరుల్లేక, ఆర్థిక సంఘం నిధులు కూడా రాక అభివృద్ధి పనులు చేయలేక మండల, జిల్లా పరిషత్‌లు చతికిలపడ్డాయి. అయితే, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ సంస్థలకు ఊరటనిచ్చింది. 13వ ఆర్థిక సంఘం వరకు మూడంచెల వ్యవస్థలైన పంచాయతీ, మండల, జెడ్పీలకు నిర్దేశిత నిష్పత్తిలో నిధులను కేంద్రం విడుదల చేసింది. కేంద్రం లో మోదీ సర్కారు అధికారంలోకి రాగానే ఈ విధానానికి స్వస్తి పలికింది. ఆర్థిక సంఘం నిధుల నుంచి మండల, జిల్లా పరిషత్‌లకు కోత విధించి మొత్తం నిధులను పంచాయతీలకే బదలాయించింది. కాగా, 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఆధారంగా 2020–21 ఆర్థిక సంవత్స రానికి దేశంలోని 28 రాష్ట్రాలకు రూ.60,750 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు రూ.1,847 కోట్లు నిర్దేశించింది. ఈ నిధులకు సమానంగా మ్యాచింగ్ గ్రాంటు రూపేణా రాష్ట్ర సర్కారు సర్దుబాటు చేయనుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం (టైడ్ గ్రాంట్) నిధులను ప్రజల మౌలిక అవసరాలకు ఖర్చు చేయాలని, మిగతా నిధుల (బేసిక్ గ్రాంట్)ను శాశ్వత పనులకు వెచ్చించాలని స్పష్టం చేసింది. ఈ నిధులను రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. -
33 కోట్ల మందికిపైగా ప్రత్యక్ష నగదు బదిలీ
న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్యాకేజీ నిధులను విడుదల చేసింది. 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష నగదు బదిలీ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద రూ. 31,235 కోట్లు, 20 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లను బదిలీ చేసినట్టు తెలిపింది. 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు, పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లను బదిలీచేశామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ. 162 కోట్లు బదిలీ చేసినట్టు తెలిపింది. -
ఆర్థిక సంవత్సరం పొడిగింపు... నిజంకాదు!
న్యూఢిల్లీ: ఏప్రిల్ 2019 నుంచీ ప్రారంభమై మార్చి 2020తో ముగిసే 2019–2020 ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు అంటే జూన్ నెలాంతం వరకూ పొడిగించినట్లు సోమవారం వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక వివరణాత్మక ప్రకటన చేసింది. ఆర్థిక సంవత్సరం పొడిగింపు జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆర్థికశాఖ కింద పనిచేస్తున్న రెవెన్యూ శాఖ 30వ తేదీన ఇండియన్ స్టాంప్స్ యాక్ట్‌లో కొన్ని సవరణలకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి. ‘‘స్టాక్ ఎక్సే్చంజీలు లేదా క్లీనింగ్ కార్పొరేషన్ల ద్వారా జరిగే సెక్యూరిటీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ల లావాదేవీలపై స్టాంప్ డ్యూటీ వసూళ్లకు 2020 ఏప్రిల్ 1 నుంచీ పటిష్ట యంత్రాంగం అమల్లో ఉంటుందని గత నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ యంత్రాగం అమలును 2020 జూలై 1వ తేదీ వరకూ వాయిదా వేయడం జరిగిందని రెవెన్యూ శాఖ మార్చి 30వ తేదీన ఒక ప్రకటన ఇచ్చింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి’’ అని ఆర్థికశాఖ ప్రకటన మంగళవారం వివరణ ఇచ్చింది. -
గుండెల్లో కొండంత బాధ ఉన్నా వృత్తి ధర్మాన్ని..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగుల్లో నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేసే వారు చాలా తక్కువగా ఉంటారు. కొంతమంది మాత్రమే తమ వృత్తి పట్ల అపారమైన గౌరవంతో అంకిత భావంతో పనిచేస్తుంటారు. ఆ కోవలోకి చెందినవారే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుల్దీప్ శర్మ. తండ్రి చనిపోయారని తెలిసినా... ఇంటికి వెళ్లకుండా వృత్తి పట్ల అంకితభావంతో పనిలో నిమగ్నమయ్యారు. గుండెల్లో కొండంత బాధ ఉన్నా వృత్తి ధర్మాన్ని పాటించారు. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న 2020-21 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి న పత్రాల ముద్రణను ఆర్థికశాఖ ప్రారంభించింది. ఇక్కడ పని చేసే మొత్తం సిబ్బంది బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ బయటికి వెళ్లడానికి వీలు ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో, ఈ-మెయిల్ లాంటి వాటిల్లోనూ సంప్రదింపులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వరు. బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ వారికి బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఇక్కడ పని చేసే సిబ్బందిలో కుల్దీప్ శర్మ ఒకరు. డిప్యూటీ మేనేజర్ హోదాలో పని చేస్తున్న కుల్దీప్ శర్మ తండ్రి జనవరి 26న మృతి చెందారు. ఈ విషయాన్ని ఆర్థికశాఖ కార్యాలయం కుల్దీప్కు తెలియజేసింది. ఇంటికి వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఇంటికి వెళ్లలేదు. తాను చేయాల్సిన పని పూర్తి అయ్యాకనే ఇంటికి వెళ్తానని అధికారులకు తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ సమయంలో దగ్గరపడుతుండడంతో తన పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని ఆర్థికశాఖ కార్యాలయం ట్వీట్ చేసింది. వృత్తి పట్ల కుల్దీప్కు ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమని ప్రశంసించింది. సాంప్రదాయక హల్వా రుచుల ఆస్వాదనతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–2021) బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ ఈనెల 20న ప్రారంభమైంది. హల్వా కార్యక్రమం అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ హల్వా రుచిచూసే కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడటానికి వీలుండదు. పార్లమెంట్ నార్త్ బ్లాక్ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది. అంత గోప్యత ఎందుకు? ఎంతో పకడ్బందీగా తయారయ్యే ఈ బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. -
బంగారంపై బాదుడు తగ్గేనా..?
న్యూఢిల్లీ: పసిడిపై ప్రస్తుతం అమల్లో ఉన్న 12.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ (దిగుమతి సుంకం)ని సాధ్యమైనంత మేర తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో ప్రవేశపెట్టనున్న 2020–21 కేంద్ర బడ్జెట్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విన్నవించినట్లు విశ్వసనీయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఇప్పటికే ఈ రేటును 4 శాతానికి తగ్గించాలని దేశీయ రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే కాగా, పరిశ్రమను ఆదుకోవడం కోసం ఈ తగ్గింపు తప్పనిసరని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విన్నపాన్ని ప్రభుత్వం మన్నిస్తే.. సుంకాల కోత మేర బంగారం ధరల్లో తగ్గింపు ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే, భారత్‌లో అధిక శాతం సప్లై దిగుమతుల ద్వారానే కొనసాగుతోంది. ఏడాదికి 800–900 టన్నుల పసిడిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. ఎందుకింత రేటు..: గతేడాది బడ్జెట్‌కు ముందు బంగారంపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. అయితే, విదేశాల నుంచి ఈ కమోడిటీ దిగుమతులు గణనీయంగా పెరిగిపోతూ ఉండడం వల్ల కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) అదుపు తప్పుతోందని, దీనిని కట్టడి చేయడంలో భాగంగా గత బడ్జెట్లో 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ పెంపు తరువాత ఫలితాలు కేంద్రం అనుకున్న విధంగా ఉన్నప్పటికీ.. దేశీయ రత్నాభరణాల పరిశ్రమకు మాత్రం తగిన ప్రోత్సాహం లభించలేదు. ఏప్రిల్–నవంబర్ కాలంలో ఈ రంగ ఎగుమతులు 1.5% తగ్గడం ఇందుకు నిదర్శనం. దిగుమతి సుంకాలు అధికంగా ఉన్న కారణంగా పలు కంపెనీలు సరిహద్దు దేశాలకు వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంతటి రేటు ఉండడం సమంజసం కాదని వాణిజ్య శాఖ కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. -
పరిశ్రమ వర్గాలతో ప్రి–బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (నేడు) నుంచి పరిశ్రమవర్గాలు, రైతు సంఘాలు, ఆర్థికవేత్తలు మొదలైనవారితో సమావేశం కానున్నారు. వినియోగానికి, వృద్ధికి ఊతమిచ్చేందుకు తీసుకోతగిన చర్యల గురించి చర్చించనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే ప్రి–బడ్జెట్ సమావేశాలు డిసెంబర్ 23 దాకా కొనసాగుతాయని, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం నాడు స్టార్టప్స్, ఫిన్‌టెక్, డిజిటల్ రంగ సంస్థలు, ఆర్థిక రంగం.. క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సమావేశమవుతారు. వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు, ప్రైవేట్ పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు, వృద్ధికి ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యల గురించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. పరిశ్రమల సమాఖ్యలతో డిసెంబర్ 19న సమావేశమవుతారు. 2019–20 రెండో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో.. రాబోయే బడ్జెట్లో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే చర్యలపై మరింత దృష్టి పెట్టవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్‌లను గణనీయంగా తగ్గించినందున.. వేతనజీవులకు సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లపరంగా ఊరటనిచ్చే చర్యలేమైనా ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వస్తువులు, సేవలకు డిమాండ్ పెంచే విధంగా ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి. అలాగే, డిడక్షన్ పరిమితులను కూడా ప్రస్తుత రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచిన పక్షంలో.. పెట్టుబడులకు ఊతం లభించగలదని ఆశిస్తున్నాయి. -
బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీనానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అదీనంలోని ఆర్థిక సేవల విభాగం ఒక లేఖ రాసిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తమకు కూడా ఆర్థిక సేవల విభాగం నుంచి లేఖ అందిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బ్యాంక్‌ల విలీనం కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సంఖ్య 12కు తగ్గింది. 2017లో ఈ బ్యాంక్‌ల సంఖ్య 27గా ఉంది. -
జీఎస్టీ వసూళ్లు పడిపోయాయ్
న్యూఢిల్లీ:వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో పెరక్కపోగా క్షీణతను నమోదుచేసుకున్నాయి.ఆగస్టుతో పోల్చితే ఈ మొత్తం రూ.98,202 కోట్ల నుంచి రూ.91,916 కోట్లకు తగ్గినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. 2018 సెప్టెంబర్‌తో పోల్చి చూసినా, తాజా సమీక్షా నెల్లో వసూళ్లు తగ్గడం గమనార్హం. అప్పట్లో ఆ మొత్తం రూ.94,442 కోట్లు. అంటే వార్షికంగా 2.67 శాతం తగ్గిందన్నమాట. జీఎస్టీ వసూళ్లు పెరక్కపోగా క్షీణతలోకి జారడం ఇది వరుసగా రెండవనెల. మొత్తం వసూళ్లను విభాగాలుగా చూస్తే... ►సీజీఎస్టీ ఆదాయం: రూ. 16,630 కోట్లు ►ఎస్జీఎస్టీ ఆదాయం : రూ.22,598 కోట్లు ►ఐజీఎస్టీ ఆదాయం : రూ.45,069 కోట్లు (దిగుమతులపై వసూలయిన రూ.22,097 కోట్లు సహా) ►కాంపన్సేషన్ సెస్ : రూ.7,620 కోట్లు (దిగుమతులపై వసూళ్లయిన రూ.728 కోట్లు సహా) ►సెప్టెంబర్ 30వ తేదీ వరకూ చూస్తే, దాఖలైన జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్ (సమ్మరీ ఆఫ్ సెల్ఫ్ అసిస్డ్ రిటర్న్) సంఖ్య 75.94 లక్షలు. ►తాజా పరిస్థితిని పరిశీలిస్తే, 2019–20లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తిలో 3.3 శాతానికి కట్టడి చేయడం కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద (మార్చి వరకూ) ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లకు కట్టడి చేయాలని 2019–20 బడ్జెట్ నిర్దేశించుకుంటే, ఆగస్టు ముగిసే నాటికే 5,53,840 కోట్లకు (78 శాతానికి) చేరింది. ►పండుగల సీజన్ కావడంతో అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఆర్బీఐ రెపోరేటు కోత, డిమాండ్ పుంజుకోడానికి కేంద్రం చర్యలు ఇందుకు మద్దతునిస్తాయని అంచనా. -
సీఈఓలపై క్రిమినల్ చర్యలు!
న్యూఢిల్లీ: మొండి బకాయిల విషయమై ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సీఈఓలకు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది. రూ.50 కోట్లకు మించిన మొండి పద్దులను బ్యాంక్ సీఈఓలు గుర్తించాలని, అలా చేయని పక్షంలో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించినట్లు తెలియవచ్చింది. రూ.2,000 కోట్ల మేర బ్యాంక్ రుణాలను స్వాహా చేసినందుకు భూషణ్ స్టీల్ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. అలాగే ప్రస్తుతం పన్నెండుకు పైగా కంపెనీలపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్ 120బి ప్రకారం చర్యలు.... పరిశోధన సంస్థల దర్యాప్తులో బ్యాంక్ రుణాలకు సంబంధించిన మోసాలు వెలుగులోకి వస్తే... సదరు బ్యాంక్ సీఈఓలపై భారత శిక్షాస్మృతి(ఐపీసీ) సెక్షన్ 120బి ప్రకారం చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సలహాను బ్యాంక్ సీఈఓలు అదనపు ముందు జాగ్రత్తగా పరిగణించాలని, న్యాయ వివాదాల్లోకి మునిగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆ వర్గాలు తెలిపాయి. మొండి బకాయిల విషయమై అలక్ష్యం వహిస్తే, బ్యాంక్ సీఈఓలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడం నిజమేనని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. భూషణ్ స్టీల్, మరో రియల్టీ కంపెనీ విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. మొండి బకాయిల విషయమై సీఈఓలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే, రుణగ్రస్తుల గత ఐదేళ్ల లావాదేవీలను క్షుణ్నంగా పరిశీలించాలని ఆయన సూచించారు. అవసరమైతే, బ్యాంక్‌లు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించాలని పేర్కొన్నారు. తనిఖీల్లో వెల్లడవుతున్న అవకతవకలు... భూషణ్ స్టీల్ ప్రమోటర్ చేసినట్లే పలు కంపెనీల ప్రమోటర్లు కూడా బ్యాంక్ రుణాల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని మరో ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ అవకతవకల కోసం సదరు ప్రమోటర్లు తమ కంపెనీల అనుబంధ కంపెనీలను వినియోగించుకున్నారనడానికి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న కంపెనీల ఖాతా పుస్తకాలను ఎస్ఎఫ్ఐఓ తనిఖీ చేస్తోందని వివరించారు. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా దివాలా కంపెనీలపై విస్తృతమైన ఆడిటింగ్ జరుగుతోందని, ఈ తనిఖీల్లో పలు ఆర్థిక పరమైన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐఓకు మరిన్ని అధికారాలు... భారత బ్యాంక్‌లు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మొండి బకాయిల సమస్యతో సతమతమవుతున్నాయి. మొత్తం మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లకు పెరిగాయని అంచనా. వీటికి తోడు పలు బ్యాంక్ రుణాలకు సంబంధించి మోసాలు, కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన విషయం తెలిసిందే. కాగా గత ఏడాది జూన్‌లో ఆర్బీఐ 12 ఒత్తిడి ఖాతాలను గుర్తించింది. ఒక్కో ఖాతాలో రూ.5,000 కోట్లకు మించిన రుణాలున్నాయి. ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్టసీ కోడ్(ఐబీసీ) కింద తక్షణం చర్యలు చేపట్టిన మొత్తం బ్యాంక్‌ల మొండి బకాయిల్లో ఈ మొత్తం 12 ఖాతాల రుణాలు... నాలుగోవంతు వరకూ ఉంటాయని అంచనా. ఇక అదే ఏడాది డిసెంబర్లో మొండి బకాయిలకు సంబంధించి 28 కంపెనీలతో కూడిన మరో జాబితాను ఆర్బీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. కంపెనీల చట్టం కింద మోసాలకు, వైట్ కాల ర్ నేరాలకు పాల్పడిన వారిని విచారించే ఎస్‌ఎఫ్‌ఐఓకు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో మరిన్ని అధికారాలు ఇచ్చింది. కంపెనీ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసే అధికారాన్ని ఎస్‌ఎఫ్‌ఐఓకు కేంద్రం ఇచ్చింది. కాగా ఇప్పటివరకూ ఐబీసీ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 655 కేసుల్లో నిర్ణయం తీసుకుంది. -
ఏపీకి మరోసారి మొండిచేయి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఎన్ని పోరాటాలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని సూచనప్రాయంగా వెల్లడించింది. సెంటిమెంట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోబోమని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం అందుతోంది. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం ఇప్పట్లో కుదరదని, గతంలో ప్రకటించిన ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. నాలుగేళ్లలో ఏపీకి రూ. 12,500 కోట్లు ఇచ్చామని, ఒక్క రూపాయికి కూడా టీడీపీ ప్రభుత్వం లెక్కచెప్పలేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్టు రాయితీలు ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఏపీకి కొత్తగా పన్నులు రాయితీలు ఇవ్వడం సాధ్యపడకపోవచ్చని స్పష్టం చేశాయి. ఆత్మగౌరవం పేరిట రాజకీయ సెగ రాజేసి ఏపీ నేతలు సతమవుతున్నారని పేర్కొన్నాయి. తెలుగు సెంటిమెంట్ అంటున్నారు తర్వాత తమిళం, మలయాళ సెంటిమెంట్ అంటారా అని ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో ఏపీ ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వరుసగా రెండోరోజు పార్లమెంట్ ఉభయ సభల్లో, ఢిల్లీలోనూ ప్రధాన రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. -
ఒకే దెబ్బకు రెండు జాక్పాట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వరప్రదాయిని వంటి పోలవరం ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా నడుస్తోంది. పనులు నత్తనడకన సాగుతుంటే.. అవినీతి, కమీషన్ల వ్యవహారాలు రాకెట్ వేగంతో పరుగులు పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఒకే దెబ్బకు రెండు పిట్టలు కాదు రెండు జాక్పాట్లు కొట్టేలా సర్కారు పెద్దలు వ్యూహం రచించారు. అవేమిటంటే.. పోలవరం జలాశయంలో కాంక్రీట్ పనులను నవయుగకే నామినేషన్ పద్ధతిలో అప్పగించడం. కేంద్రం కళ్లకు గంతలు కట్టి దీన్ని ఓకే చేయించుకున్నారు. ఇక పోలవరం జలాశయం పనులు 2019 నాటికి పూర్తవుతాయనే భ్రమ కల్పించడం ద్వారా ఆర్థికశాఖ అభ్యంతరాలకు చెక్ పెట్టి... రూ.5,338.95 కోట్ల విలువైన జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు టెండర్లను అదే సంస్థకు కట్టబెట్టడానికి చాకచక్యంగా కథ నడిపించడం.. ఈ తతంగం పూర్వాపరాలేమిటో పరిశీలిద్దాం.. నవయుగకే దక్కేలా.. పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు రూ.3,157.93 కోట్లను అంతర్గత అంచనా విలువ(ఐబీఎం)గా నిర్ణయించిన ఏపీ జెన్కో(విద్యుదుత్పత్తి సంస్థ) గతేడాది జనవరి 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.. తాను ఎంపిక చేసిన సంస్థకే పనులు దక్కేలా టెండర్లలో ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారు. గతేడాది సెప్టెంబరు 15న సాంకేతిక బిడ్, అక్టోబర్ 11న ఆర్థిక బిడ్‌ను తెరిచారు. ముందే అనుకున్నట్లుగానే.. 4.83 శాతం అధిక ధరలకు నవయుగ, 12.92 శాతం అధిక ధరలకు మేఘ, 14.85 శాతం అధిక ధరలకు కోట్ చేస్తూ టాటా పవర్ షెడ్యూళ్లను దాఖలు చేశాయి. తక్కువ ధరకు షెడ్యూళ్లు దాఖలు చేసి ‘నవయుగ’ ఎల్–1గా నిలిచింది. టెండర్లు ముగిశాక అంచనా పెంపు.. టెండర్ల ప్రక్రియ ముగిసి.. నవయుగ సంస్థకు పనులు దక్కాక అంచనా వ్యయం పెంచాలంటూ సర్కారు పెద్దలు ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తాళలేని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అంచనా పెంచేశారు. 2016–17 ధరల ప్రకారం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టును జీఎస్టీ, లేబర్ సెస్ వంటి పనులతో కలిపి రూ. 3,903.81 కోట్లకు పూర్తి చేయవచ్చని ప్రతిపాదించారు. అక్కడితో సంతృప్తి చెందని చంద్రబాబు అంచనా వ్యయం మరింత పెంచాలంటూ వత్తిడి తెచ్చారు. ప్రాజెక్టు పనులు చేస్తున్న సమయంలో పెట్టుబడిపై వడ్డీతో కలిపి అంచనా వ్యయం రూ.5,358.23 కోట్లకు అధికారులు పెంచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అంచనా వ్యయం రూ. 1454.42 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతుంది. ఈ ప్రాజెక్టుకు ఆర్ఈసీ (రెన్యువబుల్ ఎనర్జీ కార్పొరేషన్) రూ.3,965.11 కోట్ల రుణం ఇచ్చిందని, మిగతా రూ.1,373.84 కోట్లను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని జెన్కో వివరించింది. ఆర్థిక శాఖ అభ్యంతరాలు.. జెన్కో ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బహిరంగ మార్కెట్లో తక్కువ వడ్డీకే రుణం లభ్యమవుతున్నప్పుడు.. ఆర్ఈసీ వద్ద 10.95 శాతం అధిక వడ్డీకి రుణం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం జలాశయం పనులు డిసెంబర్, 2019 నాటికి పూర్తయ్యే అవకాశాలు లేవని.. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టును ఇప్పుడు చేపట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని.. అధిక వడ్డీ భారం పడుతుందని అభిప్రాయపడింది. టెండర్ల ప్రక్రియ ముగిశాక ఐబీఎం, అంచనాల పెంపుపై అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతోనూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తోనూ సంప్రదింపులు జరిపామని, డిసెంబర్, 2019 నాటికి పోలవరం జలాశయం పనులు పూర్తవుతాయని ఆర్థిక శాఖకు జెన్కో వివరించింది. జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్లు ఏప్రిల్, 2021 నాటికి.. 12 యూనిట్లు అక్టోబర్, 2022 నాటికి ఉత్పత్తి చేసేలా పనులను పూర్తి చేస్తామని తెలిపింది. జెన్కో వివరణలపై అధ్యయనం చేసిన ఆర్థికశాఖ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం జలాశయం పనులను పూర్తి చేయడం, నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ అమలుపై సందేహాలు వ్యక్తం చేసింది. జలాశయం పనులు సకాలంలో పూర్తి కాకపోతే జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. అభ్యంతరాలే అస్త్రాలు.. పీపీఏ, ఆర్థిక శాఖ వ్యక్తం చేసిన అభ్యంతరాలనే అస్త్రాలుగా మల్చుకుని.. మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రభుత్వ పెద్దలు శ్రీకారం చుట్టారు. పోలవరం జలాశయం పనుల్లో రూ.1,483.22 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే.. వాటిని రద్దు చేసి రూ.2,800 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో నవయుగకు కట్టబెట్టాలని నిర్ణయించారు. జలాశయం పనులు చేస్తున్నదన్న సాకు చూపి అదే సంస్థకు జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులను కూడా కట్టబెడుతూ టెండర్లను ఖరారు చేయాలన్నది సర్కారు పెద్దల ఎత్తుగడ. ఇక ఐబీఎంను పెంచడం ద్వారా టెండర్ల సమయంలో నవయుగకు రూ.1454.42 కోట్ల లబ్ధి చేకూర్చడమే కాక పట్టిసీమ ‘బోనస్’ వ్యూహాన్ని ఇక్కడా అమలు చేయడానికి పూనుకున్నారు. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులో ప్రతి నెలా నిర్దేశించిన పని కంటే అధికంగా చేస్తామని.. అధికంగా చేసిన పని విలువలో 50 శాతం బోనస్ ఇవ్వాలని నవయుగ సంస్థతో ప్రతిపాదింపజేశారు. చేసిన పనులకు 30 రోజుల్లోగా కాకుండా 20 రోజుల్లోనే బిల్లులు ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ నిర్దేశించిన పని కన్నా తక్కువగా చేస్తే.. తక్కువ పడే పని విలువలో 50 శాతాన్ని జరిమానా విధించాలని సూచించారు. కానీ.. డిజైన్ల ఆమోదం, భూసేకరణ, జలాశయం పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపులో ఆలస్యమైతే తమది తప్పు కాదని.. అది సర్కారుదే బాధ్యతని మెలిక పెట్టారు. దీనివల్ల సకాలంలో ప్రాజెక్టు పూర్తవుతుందని.. వడ్డీ భారం తగ్గుతుందని నవయుగ ప్రతిపాదించింది. ఉదాహరణకు ఒక నెలలో రూ.100 కోట్ల విలువైన పని చేయాలని సర్కార్ లక్ష్యంగా నిర్దేశిస్తే.. కాంట్రాక్టర్ రూ.120 కోట్ల విలువైన పని చేస్తే.. అదనంగా చేసిన రూ.20 కోట్ల పనికిగానూ కాంట్రాక్టర్‌కు రూ.పది కోట్లు బోనస్‌గా సర్కార్ ఇవ్వాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ ఒకవేళ ఆ మేరకు పనులు చేయకపోతే జరిమానా విధించే అవకాశమే ఉండదు. ఎందుకంటే.. డిజైన్ల ఆమోదంలోనో, బిల్లుల చెల్లింపులోనో, భూసేకరణలోనో జాప్యాన్ని చూపి కాంట్రాక్టర్ తప్పించుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఏ కాంట్రాక్టర్‌పై జరిమానా విధించకపోవడమే దీనికి తార్కాణం. కాంట్రాక్టర్ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయాలని జెన్కో అధికారులపై ప్రభుత్వ పెద్దలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. జెన్కో అధికారులు అంగీకరించని నేపథ్యంలో కేబినెట్ తీర్మానం ద్వారా టెండర్లపై ఆమోదముద్ర వేసి.. కమీషన్లు రాబట్టుకోవడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. ఆర్థిక శాఖ ఆక్షేపణ.. పోలవరం జలాశయం పనులు డిసెంబర్, 2019 నాటికి పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదని.. ఇప్పటికిప్పుడు రూ.5,338.95 కోట్లతో జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో ఔచిత్యమేమిటని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులపై వడ్డీల భారం పడుతుందన్న సాకు చూపిస్తూ హైడల్ ప్రాజెక్టు పనులను నవయుగకు అప్పగించేలా టెండర్లను ఖరారు చేసే యత్నాలకు అభ్యంతరం తెలిపింది. కానీ సీఎం ఇలా అంటున్నారు పోలవరం జలాశయంలో 31 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పాత ధరలకే చేసేందుకు నవయుగ ముందుకొచ్చిందని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అందువల్ల ఆ సంస్థకే కాంక్రీట్ పనులు నామినేషన్‌పై అప్పగిస్తున్నామన్నారు. -
ఈ ఏడాది విస్మరించరాని సంవత్సరం
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆర్థికంగా విస్మరించరాని సంవత్సరమని ఆర్థిక మంత్రిత్వ శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిందని, ప్రపంచ బ్యాంక్ రూపొందించిన వ్యాపారం సులభతర నిర్వహణలో మంచి ర్యాంక్ పొందామని, మూడీస్ సంస్థ మన సావరిన్ రేటింగ్‌ను పెంచిం దని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రాథమిక లక్ష్యంగా ఏడవ వేతన సంఘ సిఫారసులను ఆమోదించామని, ఫలితంగా 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. 13 ఏళ్ల తర్వాత రేటింగ్ పెంపు: దాదాపు 13 ఏళ్ల విరామానంతరం మూడీస్ రేటింగ్ సంస్థ మన సావరిన్ రేటింగ్‌ను పెంచిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. ఇక ప్రపంచ బ్యాంక్ రూపొందించిన నివేదికలో వ్యాపారం సులభతర నిర్వహణలో 30 స్థానాలు ఎగబాకామని పేర్కొంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సత్ఫలితాలు కనిపించడం మొదలైందని వివరించింది. వివిధ కేంద్ర, రాష్ట్ర్ట ప్రభుత్వాల పరోక్ష పన్నులన్నింటినీ తొలగించి ఒకే దేశం.. ఒకే పన్ను వ్యవస్థగా జీఎస్టీని అమల్లోకి తెచ్చామని తెలిపింది. ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్ తేనున్నామని వివరించింది. ఆర్బీఐ మోనేటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)ని ఏర్పాటు చేసిందని, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్(ఎఫ్ఐపీబీ)ని రద్దు చేశామని తెలిపింది. -
అదనపు లిక్విడిటీ వినియోగంపై కేంద్రం సమీక్ష
న్యూఢిల్లీ: వ్యవస్థలో ఉన్న అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వినియోగంపై శుక్రవారం బ్యాంకింగ్‌తో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక సమీక్ష నిర్వహించింది. ఇందుకు సంబంధించి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్)ని ప్రవేశపెట్టే అంశంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కొందరు బ్యాంకర్లు దీనికి అంగీకరించగా, మరికొందరు స్కీమ్ మొత్తాన్ని మదింపు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. ఎక్సే్ఛంజీలో ఎటువంటి హామీ అవసరం లేకుండా, అదనపు ద్రవ్య లభ్యతను వ్యవస్థ నుంచి వెనక్కు తీసుకోడానికి ఈ స్కీమ్‌ను ప్రతిపాదిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు బ్యాంకుల చీఫ్‌లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన భారీ డిపాజిట్ల వల్ల బ్యాంకుల వద్ద అధిక ద్రవ్య లభ్యత పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. -
‘ఉపాధి’ యాతన
నెలన్నరగా వేతనాల చెల్లింపులు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం ⇒ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.310.58 కోట్లు ⇒ కాంట్రాక్టర్లకు మాత్రం రూ.877.52 కోట్లు విడుదల ⇒ కేంద్ర నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ డబ్బులు రాక, తిండి దొరక్క అవస్థల పాలవుతున్న కూలీలు ⇒ పనుల కోసం పక్క రాష్ట్రాలకు వలసబాట పడుతున్న కూలీలు సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. కరువు కోరల్లో చిక్కి వలసబాట పడుతున్న ప్రజలకు సొంత ఊళ్లలోనే పనులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌కు సాక్షాత్తూ ప్రభుత్వమే తూట్లు పొడుస్తోంది. కూలీలకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తేనే వారి కడుపుల్లోకి నాలుగు మెతుకులు వెళ్లే పరిస్థితి. అలాంటిది నెలన్నర రోజులుగా ప్రభుత్వం కూలి డబ్బులు చెల్లించకుండా నిలిపివేసింది. దీంతో నిరుపేద కూలీలు పస్తులతో అల్లాడిపోతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నమ్ముకోలేక పనుల కోసం పక్క రాష్ట్రాలకు సైతం వలస వెళ్తున్నారు. ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు. కూలీలకు చెల్లించడానికి డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం ఇదే పథకం కింద మెటీరియల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రం బకాయిల చెల్లింపునకు రూ.877.55 కోట్లు విడుదల చేయడం గమనార్హం. నిలిచిపోయిన చెల్లింపులు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన వారికి ఫిబ్రవరి రెండో తేదీ నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ నెలన్నర రోజులకు కూలీలకు రూ.310 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న నిధులను రాష్ట్ర సర్కారు ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఉపాధి హామీ పథకంలోనే మెటీరియల్ పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు చెల్లిస్తూ కూలీలకు మాత్రం మొండిచేయి చూపుతోంది. ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వం రూ.877.55 కోట్లు విడుదల చేసింది. అయితే, కూలీలకు పైసా కూడా ఇవ్వకుండా మొత్తం నిధులను ఉపాధి హామీ పథకంలో చేపట్టే సిమెంట్ రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్ల బకాయిలకే చెల్లించారు. ఫిబ్రవరి 2వ తేదీ తర్వాత ఆ నెలలో పని చేసిన 13,99,331 కూలీలకు రూ.160.56 కోట్లు, మార్చిలో 17వ తేదీ నాటికి 14,96,161 మందికి రూ.150.02 కోట్ల మేర వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్ల కోసం ఎనిమిది సార్లు నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే మెటీరియల్ (కాంట్రాక్టు) పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.877.55 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 21 నుంచి మార్చి 17వ తేదీ మధ్య ఆర్థిక శాఖ ఎనిమిది విడతల్లో నిధులిచ్చింది. ఈ మేరకు జీవోలు కూడా జారీ చేసింది. తొమ్మిది నెలలైనా కూలి డబ్బులు రాలేదు ‘‘మా ఇంట్లో నలుగురం ఫారంపాండ్ గుంతలు తవ్వే పని చేశాం. పనులు పూర్తయి తొమ్మిది నెలలైనా ఇంకా డబ్బులు రాలేదు. నెలల తరబడి కూలి డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?’’ – సుంకమ్మ, ఉపాధి కూలీ,ఉప్పర్లపల్లి, కర్నూలు జిల్లా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం ‘‘ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన మాకు కూలీ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిన్నమొన్నటి వరకూ పనులు ప్రారంభించలేదు. నెల రోజులుగా అడపాదడపా మాత్రమే పనులు దొరుకుతున్నాయి. వీటికి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఒక్కోసారి కనీస వేతనం రోజుకు రూ.60 కూడా రావట్లేదు’’ – బి.వెంకటమ్మ, ఉపాధి హామీ పథకం కూలీ, అమరాం గ్రామం, రాజాం మండలం, శ్రీకాకుళం జిల్లా ఎప్పటికైనా డబ్బులు ఇస్తారని వెళ్తున్నాం ‘‘నెలల తరబడి కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో వేరే పనులకు వెళ్లిపోవాలని అనుకున్నాం. స్థానికంగా వ్యవసాయ పనులు కూడా లేకపోవడంతో ఎప్పటికైనా డబ్బులు ఇస్తారు కదా అనే ఆశతో భారంగానే రోజూ ఉపాధి పనులకు వెళ్తున్నాం. పనులకు వెళ్లకపోతే జాబ్‌కార్డులు రద్దు అవుతాయని అంటున్నారు. అందుకే తప్పనిసరై వెళ్లాల్సి వస్తోంది’’ – కలికోట పార్వతి, ఉపాధి కూలీ, మామిడిపల్లి గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా డబ్బులు ఇవ్వకపోతే వలస వెళ్లాల్సిందే.. ‘‘ఉపాధి హామీ పథకం కింద పది వారాలుగా పనులు చేసినా వేతనాలు అందలేదు. వారానికొకసారైనా డబ్బులు అందకపోతే బతుకు వెళ్లదీయడం కష్టంగా మారుతోంది. కూలీ సొమ్ము ఎప్పటికప్పుడు చెల్లించకపోతే మూటాముల్లె సర్దుకొని వలసవెళ్లక తప్పదు. బ్యాంకు ఖాతాలతో అంతా గందరగోళంగా ఉంది. పోస్టాఫీస్‌కు వెళితే బ్యాంక్‌లో పడతాయని, మా వద్దకు రావొద్దని చెబుతున్నారు. బ్యాంకుకు వెళితే డబ్బులు లేవంటున్నారు. తిరగలేక చస్తున్నాం’’ – మల్లపురెడ్డి వెంకట్లు, ఉపాధి కూలీ, వల్లూరు గ్రామం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా కూలీ డబ్బులు రాకపోతే ఎట్లా బతకాలి? ‘‘డిసెంబర్ నుంచి తొమ్మిది వారాలు ఫారంపాండ్ గుంతలు తవ్వే పనికిపోయాం. ఇంతవరకు ఒక్క రూపాయి కూలీ డబ్బులు కూడా ఇవ్వలేదు. తొమ్మిది వారాలుగా కూలీ డబ్బులు రాకపోతే మేము ఎట్లా బతకాలి? ప్రభుత్వం వెంటనే మాకు కూలీ డబ్బులు చెల్లించి ఆదుకోవాలి’’ – పెద్ద రంగన్న, ఉపాధి కూలీ, ఉప్పర్లపల్లి, కర్నూలు జిల్లా -
ఈఏపీ రూపంలో ఏపీకి ప్రత్యేక సాయం
-
ఈఏపీ రూపంలో ఏపీకి ప్రత్యేక సాయం
- కేంద్ర మంత్రివర్గం ఆమోదం - పోలవరం ఖర్చు చెల్లించేందుకు అంగీకారం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయాన్ని ఎక్స్టర్నల్ ఎయిడెడ్(విదేశీ రుణ సాయం) ప్రాజెక్టుల(ఈఏపీ) రూపంలో అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం సాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును చెల్లించేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక సాయాల అమలుపై మార్గదర్శకాలను కేబినెట్ ఆమోదించింది. ఈఏపీల ద్వారా..: 2015–16 నుంచి 2019–20 మధ్య కాలంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా భరించి ఉంటే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో ఆ మేరకు ప్రయోజనం కలిగేలా ఏపీకి ప్రత్యేక సాయం చేస్తామని ప్రకటన చేశారు. 2015–16 నుంచి 2019–20 మధ్య కాలంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మేరకు రుణ చెల్లింపు కోసం కేంద్రం ప్రత్యేక సాయం చేస్తుందన్న ఆర్థిక శాఖ ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది. నాణ్యత బాధ్యత పోలవరం ప్రాజెక్టు అథారిటీదే: పోలవరం ప్రాజెక్టుకు 01.04.2014 నాటి వరకు ఉన్న అంచనా వ్యయం ప్రకారం ఆ తరువాత వెచ్చించే వ్యయంలో నీటి పారుదల పద్దు కింద అయ్యే ఖర్చును 100 శాతం భరించేందుకు ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 01.04.2014 నాటికి సాగునీటి పద్దు కింద ఉన్న అంచనా వ్యయాన్ని లెక్కకట్టడంలో కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతుంది. ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ సర్కారు అమలు చేస్తుంది. అయితే సమన్వయం, నాణ్యత, డిజైన్ అంశాలు, పర్యవేక్షణ, అనుమతులు తదితరు అంశాలను కేంద్ర జల వనరుల శాఖ పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చూస్తుంది. -
జైట్లీని ప్రధాని సంప్రదించారో లేదో చెప్పం!
న్యూఢిల్లీ: 2016 నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తూ ప్రకటన చేసే ముందు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సంప్రదించారో లేదో తాము చెప్పబోమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పీటీఐ వార్తా సంస్థ ఈ విషయంపై దాఖలు చేసిన ఒక సమాచార హక్కు దరఖాస్తుకు గతంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో), భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)లు కూడా ఇలాగే స్పందించాయి. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఆ సమాచారం ఇచ్చేందుకు నిరాకరించింది. ‘సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8 (1) (ఎ) ప్రకారం మీరు కోరిన సమాచారం ఇవ్వలేం’అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పీటీఐ దరఖాస్తుకు సమాధానమిస్తూ చెప్పింది. అయితే పీటీఐ కోరిన సమాచారం ఆ సెక్షన్ కిందకు ఎలా వస్తుందో మాత్రం పేర్కొనలేదు. -
13న బడ్జెట్!
9 లేదా 10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 9 లేదా 10 నుంచి ప్రారంభం కాను న్నాయి. 13న అసెంబ్లీ బడ్జెట్‌ను ప్రవే శపెడతారు. అయితే సమావేశాల తేదీలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 10 నాటికి బడ్జెట్ ముద్రణ ప్రతులను సిద్ధం చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మార్చి 8 నుంచి సమావేశాలు ప్రారంభించి, 10న బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథ మికంగా తేదీలను ఖరారు చేసింది. కానీ బడ్జెట్ తుది కసరత్తులో జాప్యం జరగడంతో సమావేశాలు ఒకట్రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌కు తుది కసరత్తు: శాఖలవారీగా తమకు అందిన ప్రతిపాదనలతో పాటు ఇటీ వల వరుసగా జరిగిన సమీక్షల్లో సీఎం చేసిన సూచనలకు అనుగుణంగా ఆర్థిక శాఖ అధికా రులు బడ్జెట్‌కు తుది రూపమిచ్చే పనిలో ఉన్నారు. శాఖలు, పథకాల వారీగా కేటా యింపులు కొలిక్కిరావటంతో సీలింగ్ బడ్జెట్ ను ఖరారు చేశారు. అన్ని శాఖలు, హెచ్‌వోడీ లకు బుధవారం సాయంత్రంలోగా సీలింగ్ బడ్జెట్ వివరాలను అందించాలని నిర్ణయించా రు. ఆ బడ్జెట్‌కు అనుగుణంగా శాఖలు ఇచ్చే సమాచారంతో తుది కేటాయింపులు, బడ్జెట్ పద్దులు రూపొందిస్తారు. అనంతరం బడ్జెట్ ప్రతుల ముద్రణకు కనీసం వారం పడుతుం దని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖకు పోలీస్ భద్రత... సచివాలయంలోని డీ బ్లాక్‌లోని ఆర్థిక శాఖకు ప్రభుత్వం పోలీస్ భద్రతను ఏర్పాటు చేసిం ది. మంగళవారం నుంచి గేట్లను మూయటం తోపాటు ప్రధాన ద్వారం వద్ద పోలీసులను కాపలాగా ఉంచింది. బడ్జెట్ తయారీ విభా గంలో పనిచేసే అధికారులు, సిబ్బంది విధు లకు ఆటంకం కలుగకుండా సందర్శకులు, మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమానికే పెద్దపీట: మంత్రి ఈటల అణగారిన వర్గాలను ఆదుకునేలా బడ్జెట్ ఉం టుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ‘‘19–20 శాతం ఆర్థికవృద్ధి ఉంది. అదే స్థాయిలో బడ్జెట్ కూడా పెరుగుతుంది. జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం ఉన్నా గత బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్ భారీగానే ఉంటుంది..’’ అని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ట్రెజరీ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘కొత్త రాష్ట్రంలో ప్రజలు చాలా ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారు. వాటన్నింటినీ నెరవేర్చడానికి మనం కృషి చేయాలి. ఆర్థిక ప్రగతిలో దేశంలో నంబర్ వన్ స్థానం సంపా దించుకున్నాం. దీన్ని నిలబెట్టుకోవాలి. కష్టప డి పనిచేయాలి’’ అని పేర్కొన్నారు. -
10 రోజుల పనికి 103.50 కోట్లా?!
⇒ రెయిన్ గన్లపై రైతు సంఘాల నేతల విస్మయం ⇒ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘సాక్షి’ కథనం సాక్షి, అమరావతి: గత ఖరీఫ్ సీజన్లో కేవలం 10 రోజులు వినియోగించిన రెయిన్ గన్ల నిర్వహణకు రూ.103.50 కోట్లు ఖర్చు చేశారా? రెయిన్ గన్లకు నిర్వహణ నిజంగా అంత ఖర్చవుతుందా? అని రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు నివ్వెరపోతున్నారు. ఒక్క ఎకరం పంటనైనా కాపాడలేకపోయిన ఈ చినుకు తుపాకుల పేరిట ఖర్చు చేసిన సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందోనని చర్చించుకుంటున్నారు. ‘చినుకు తుపాకుల చిల్లర ఖర్చు రూ.103.50 కోట్లు’ పేరిట ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ( ‘చినుకు’ తుపాకుల చిల్లర ఖర్చు 103 కోట్లు ) ఇంత అన్యాయమా? ప్రజాధ నాన్ని మింగేస్తారా? అంటూ రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెయిన్ గన్ల కొనుగోలుకు రూ.163 కోట్లు కాగా, నిర్వహణ, ఇతరత్రా అవసరాలకు రూ. 103.50 కోట్లు వెచ్చించడం ఏమిటని మండిపడ్డారు. ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రెయిన్గన్ల కొనుగోలు, నిర్వహణపై శ్వేత పత్రం విడుదల చేసి, రైతుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కేవీవీ ప్రసాద్, ఏపీ రైతు సంఘం నేత రామారావు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. -
‘చినుకు’ తుపాకుల చిల్లర ఖర్చు 103 కోట్లు
-
‘చినుకు’ తుపాకుల చిల్లర ఖర్చు 103 కోట్లు
రెయిన్ గన్ల నిర్వహణ పేరుతో స్వాహాకు రంగం సిద్ధం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో కోట్ల రూపాయలు వెచ్చించి ఎక్కడా ఒక్క ఎకరం పంటను కాపాడలేని రాష్ట్ర ప్రభుత్వం.. రెయిన్ గన్ల నిర్వహణ పేరుతో తాజాగా మరో భారీ దోపిడీకి తెర తీసింది. రెయిన్గన్ల నిర్వహణ, రబ్బర్లు, ట్యూబుల కోసమంటూ రూ.103 కోట్లు విడుదల చేసింది. చిన్న చిన్న పరికరాల మరమ్మతుల పేరుతో భారీగా నిధులు గత ఏడాది జూలై 9న రాసిన లేఖకు ఈ ఏడాది జనవరి 31న ఆర్థిక శాఖ ఆమోదం తెలుపడంతో రాష్ట్ర విపత్తుల విభాగం ఈ మేరకు నిధులు కేటాయిస్తూ ఈనెల 13న ఉత్తర్వులు జారీ చేసింది. సూక్ష్మ నీటి పారుదల పరికరాల సంస్థల సాంకేతిక సిబ్బందికి, స్పింకర్లు, ఆయిల్ ఇంజన్లు, పంపులు, గుర్తించిన కరవు పీడిత గ్రామాల్లోని పొలాలకు నీటిని తోలే ట్రక్కుల నిర్వహణకు ఈ నిధులు వాడుకోవచ్చు. ట్రాక్టర్ల అద్దె, పైపులకు అవసరమైన రబ్బర్ వాషర్లు, క్లాంపులు, తాళ్లు, మోకులు, పని ముట్లు, ఇంజిన్ ఆయిల్, తదితర వస్తువుల కోసం కూడా ఈ నిధులు వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ రెయిన్గన్లు, పరికరాలు ఎక్కడ ఎన్ని ఉన్నాయో వ్యవసాయ శాఖ అధికారులకే సరిగా తెలియదు. అలాంటి వాటి నిర్వహణకు ఈ నిధులు కేటాయించడం చూస్తుంటే.. ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి ప్రజా ధనాన్ని దోచిపెట్టడానికేనని రైతు సంఘాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి. ఏ గన్ను ఎక్కడుందో తెలీదు.. గత ఖరీఫ్‌లో కరువులో చిక్కుకున్న పది లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా 13,650కి పైగా రెయిన్గన్లను రూ.163 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇచ్చింది. కొనుక్కుంటా మన్న రైతులకు సబ్సిడీపై సరఫరా చేసింది. ఎకరాకు నీటిని పిచికారి చేసేందుకు రూ.3 వేల వ్యయం అవుతుందని ఖరారు చేసింది. ఇందులో సగం అంటే రూ.1,500లను సబ్సిడీగా ప్రకటించింది. ఇప్పుడవి ఎక్కడు న్నాయో తెలియదు. సీఎం చేసిన హడా వుడి తర్వాత రెయిన్గన్ల ఆచూకీ లేకుండా పోయింది. కొన్ని రైతుల వద్ద ఉండి పోగా, మ రికొన్ని వ్యవసాయ శాఖ వద్ద.. ఇంకొన్ని గిడ్డం గుల్లో, ఆ శాఖ కార్యా లయాల్లో పోగుపడ్డాయి. ఏ గన్ను ఎక్కడుందో తెలియ కుండా సిబ్బందిని నియమిస్తామనడం విడ్డూరం. ఎవరి కోసం.. ఎందు కోసమంటే.. కోర్టు కేసులు, పరస్పర ఆరోపణలు, లోకాయుక్తాలో ఫిర్యాదుల అనంతరం అప్పట్లో రెయిన్గన్లు తెరపైకి వచ్చాయి. నిబంధనల ప్రకారం టెండరు ఏపీకి చెందిన ఓ సంస్థకు దక్కాల్సి ఉండగా సూక్ష్మ నీటి పారుదల విభాగంలో కీలక వ్యక్తి చక్రం తిప్పి మహారాష్ట్ర సంస్థకు దక్కేలా చేశారు. దీని వెనుక పెద్ద తతంగమే నడిచిందని, భారీగా డబ్బు చేతులు మారిందని ఆరోపణలు వచ్చాయి. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత.. ఆ రెయిన్గన్ల వల్ల ఎక్కడా పంట చేతికందకపోయినా.. నిర్వహణ ఖర్చంటూ ఇపుడు మైక్రో ఇరిగేషన్ సంస్థలకు ఈ నిధుల్ని కట్టబెట్టి తద్వారా ముడుపులు తీసుకునేందుకేనని రైతులు ఆరోపిస్తున్నారు. కింది నుంచి పై వరకు అందరూ అంతో ఇంతో పంచుకునేందుకే ఈ నిధుల మంజూరు అని ఓ ప్రముఖ రైతు నాయకుడు పేర్కొన్నారు. 4 లక్షల ఎకరాల్ని కాపాడారా? రెయిన్ గన్లతో 4 లక్షల ఎకరాల్లో పంటల్ని.. ప్రత్యేకించి వేరుశనగను కాపాడామని సాక్షాత్తు సీఎం చెబితే వంతపాడడంలో ముందుండే రాష్ట్ర సమాచార మంత్రి 7 లక్షల ఎకరాలంటూ పల్లవి అందుకున్నారు. ఇన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే ఎన్ని లక్షల ట్రాక్టర్లు కావాలో, ఎన్ని లక్షల ట్యాంకర్లు కావాలో, ఎన్ని లక్షల లీటర్ల నీళ్లు కావాలో కూడా యోచించకుండా అర్థం పర్థం లేని వాదనలు చేశారు. పూటకో మాట చెప్పి ప్రజల్ని తప్పు దోవ పట్టించినా ఎక్కడా ఒక్క ఎకరం కాపాడలేకపోయారన్నది నగ్నసత్యం. రాష్ట్రంలో గత ఏడాది ఆగస్టు 28 నాటికి 309 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. లక్షలాది ఎకరాల్లో మెట్ట పంటలు వాడుముఖం పట్టాయి. దీనిపై అంతకు ముందెన్నడూ దృష్టి సారించని ముఖ్యమంత్రి.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా పంట ఎండిన తర్వాత రెయిన్‌గన్‌లంటూ హడావుడి చేశారు. కరవును జయించామని ప్రకటించారు. వేరుశనగ పూత.. పిందె దశలో ఉన్నప్పుడు ఎకరానికి కనీసం 25 మిల్లీమీటర్ల మేర వర్షం (నీళ్లు) కావాలి. జూలై 15 నుంచి ఆగస్టు 28 వరకు వర్షం లేక కాయ ఊరడం ఆగిపోయింది. మొక్కలు ఎండిపోయాయి. రెయిన్గన్లతో రక్షిత తడి కల్పించినా అది 5 – 6 మిల్లీమీటర్లకు మించలేదు. 20 లక్షల ట్రాక్టర్లు ఎక్కడివో చెప్పండి? ఎకరంలో పంటను కాపాడేందుకు నాలుగు పదున్లు అసవరమవుతాయి. ఒక పదును అంటే 25 మిల్లీమీటర్ల వర్షం. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెయిన్గన్లతో ఇచ్చిన నీళ్లు కేవలం 5 మిల్లీమీటర్ల మేర మాత్రమే. అంటే కళ్లాపి జల్లినట్టు అన్నమాట. వాస్తవానికి ఇది అసంబద్ధం. ఈ నీళ్లతో పంటను బతికించుకోలేం. ఈ లెక్కన 5 మిల్లీమీటర్ల వర్షం మేర నీళ్లివ్వాలనుకుంటే ఒక్కో ఎకరాకు 25 వేల లీటర్లు కావాలి. ఒక ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా అత్యధికంగా 5 వేల లీటర్లు సరఫరా చేశారనుకున్నా 25 వేల లీటర్ల సరఫరాకు 5 ట్రాక్టర్లు కావాలి. అదే లక్ష ఎకరాలకైతే 5 లక్షల ట్రాక్టర్లు కావాలి. ముఖ్యమంత్రి చెప్పినట్టు 4 లక్షల ఎకరా>లకైతే 20 లక్షల ట్రాక్టర్లు కావాలి. రాష్ట్రం మొత్తం వెతికినా ఇన్ని ట్రాక్టర్లు ఉండవు. అయినా ముఖ్యమంత్రి మాత్రం 4 లక్షల ఎకరాలకు రెయిన్గన్ల ద్వారా నీరిచ్చి కరవును జయించామని పదే పదే టముకు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న లెక్కల ప్రకారం లక్ష ఎకరాలకైతే 250 కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. ఆ సమయంలో రాష్ట్రంలో ఎక్కడా వానలు పడలేదు. ఏ చేలోనూ పంట కుంటలు లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చినట్టు? ఈ నీటి సరఫరాకు ప్రభుత్వం పెట్టుకున్న గడువు వారం నుంచి పది రోజులు. ఈ గడువు లోపల 20 లక్షల ట్రాక్టర్లు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది ఎవరికీ అంతుబట్టని విషయం. మరో మాటలో చెప్పాలంటే కరువును జయించామంటున్న ముఖ్యమంత్రికే తెలియాలి. అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను రెయిన్గన్లతో కాపాడామని ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఏకంగా నిర్వహణకు రూ.103.5 కోట్లను విడుదల చేశారంటే దీని వెనకున్న నిగూడార్ధం ముడుపులేనని ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. రెయిన్ గన్స్ అంటే... బిందు, తుంపర సేద్యానికి ఉపయోగించే పరికరం లాంటిదే ఇదీనూ. నిజానికిదో సూక్ష్మ నీటి పారుదల పరికరం. తక్కువ నీటిని ఎక్కువ ప్రాంతానికి విరజిమ్మవచ్చు. ఆరడుల ఎత్తున ఓ రెయిన్‌గన్‌ను అమర్చితే దాని చుట్టుపక్కల సుమారు 45 మీటర్ల వరకు నీటిని విరజిమ్మ వచ్చు. 45 సెంట్ల పొలాన్ని తడిపేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. 5 హెచ్‌పీ ఇంజిన్ కావాలి. ఇందుకోసం ప్రతి రెయిన్ గన్‌కు ఒకటి చొప్పున రూ.23 కోట్లతో ఆయిల్ ఇంజన్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. నీళ్లున్న చోటు నుంచి రెయిన్ గన్ వరకు సరఫరా చేసేందుకు హెచ్‌డీపీఇ, క్యూపీసీ పైపులను ఉపయోగిస్తారు. ఏ పంటకు నీళ్లు చల్లుతున్నామనే దాన్ని అనుసరించి రెయిన్ గన్ స్టాండ్లను అమర్చుతారు. జొన్న, సజ్జ, చెరకు వంటి వాటికైతే ఐదారు అడుగులు, మిర్చి, పత్తి వంటి వాటికైతే రెండు మూడు అడుగుల ఎత్తులో స్టాండ్లు అమర్చి వాటికి రెయిన్గన్లను పెట్టి నీటిని పిచికారి చేస్తారు. బోర్లు, బావులు, కాలువలు, చెరువుల్లో నీరున్నప్పుడే వీటిని వినియోగించడం సాధ్యమవుతుంది. లేదంటే ఎక్కడి నుంచైనా ట్యాంకర్లతో తెచ్చుకోవాలి. ‘తుక్కు’గన్లు! రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన రెయిన్గన్లు, డీజిల్ ఇంజన్లు, స్ప్రింక్లర్ సెట్లు, పైపులను అధికార తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన రైతులు తుక్కు కింద అమ్మేసుకుంటున్నారు. గత ఖరీఫ్ లో వాటిని దక్కించుకున్న వారిలో 80 మంది టీడీపీ సానుభూతిపరుతే. మళ్లీ వ్యవసాయ శాఖకు అప్పగించాల్సి ఉన్నప్పటికీ ‘ప్రభుత్వం మాది.. ఆ పరిక రాలు కూడా మావే’ అని తేల్చి చెబుతు న్నారు. మరికొందరు పాత పరికరాలను అప్పగిస్తున్నారు. అప్పట్లో సరైన ప్రణాళిక లేకుండా హడావుడిగా పరికరాలను సరఫరా చేయడంతో రికార్డుల్లో వివరాలు సరిగా లేవు. మాకు పరికరాలు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉన్నాయా? మా సంతకాలు చూపించండి? అని రైతులు ప్రశ్నిస్తుండ టంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. కొన్నిచోట్ల రెయిన్ గన్లు చోరీకి గురయ్యాయి. పంపిణీ చేసిన పరికరా లకు లెక్క తేలలేదని.. సగం పరికరాలు అందవచ్చని అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి పరికరాలను తిరిగి రాబట్టేందుకు పోలీస్, రెవెన్యూ, వ్యవసా య శాఖల అధికారులతో కమిటీని నియమించినా ఫలితం లేదు. ‘ప్రభుత్వం రైతులకు సరఫరా చేసిన రెయిన్గన్లను వారి నుంచి తిరిగి సేకరించే బాధ్యత ఆయా జిల్లా అధికారులదే. ఏ జిల్లాల్లో ఎంతవరకు రైతుల నుంచి రాబట్టారో మాకు తెలియదు. రూ.86 కోట్ల విలువైన రెయిన్గన్లను మేము సరఫరా చేశాం’ అని ఏపీ ఎంఐపీ ఓఎస్డీ వెంకటేశ్వర్లు తెలిపారు. -
పనులు చేసి మూడేళ్లు...ఇప్పటికీ పాస్‌కాని బిల్లులు!
రూ.4.41 కోట్ల పంచాయతీరాజ్ బిల్లులను పట్టించుకోని ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పద్దుల కింద చేపట్టిన పనులను పూర్తిచేసినా, సదరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 13వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులతో 2014–15లో అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామీణ రహదా రుల నిర్మాణాన్ని, మరమ్మతులను చేపట్టింది. రాష్ట్రా నికి వచ్చిన నిధుల కంటే ఎక్కువ మొత్తంలో పనుల ను చేపట్టడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగిపోయాయి. కాంట్రాక్టర్లకు బకాయిపడ్డ రూ.4.41 కోట్లను గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిం చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి 2015–16లో ప్రతిపాదనలు పంపిన ప్పటికీ ఆర్థికశాఖ కొర్రీలు వేయడంతో నిధుల విడుద ల నిలిచిపోయింది. కనీసం ఈ ఏడాదైనా తమ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందో లేదోనని పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేసిన పనులకు మూడేళ్లయినా బిల్లులు రానందున ప్రభుత్వం ఈ ఏడాది చేపడుతున్న రహదారుల నిర్మాణ పనులను చేసేందుకు కాంట్రాక్టర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. -
పోలీస్ నియామకాలకు నిధుల కొరత!
⇒ పోలీస్ పరీక్ష ఫలితాల ఆలస్యానికి నిధుల కొరతే కారణం ⇒ శిక్షణలో ఉన్నవారికి స్టైఫండ్ పెంచాలన్న పోలీస్ శాఖ ⇒ ఖజానాలో నిధుల్లేవన్న ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి నిధుల కొరత అడ్డంకిగా మారింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారీ స్థాయిలో నియామకాలకు పోలీస్ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. గతేడాది ప్రారంభమైన ఈ ప్రక్రియలో తుది ఫలితాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే ఫలితాల వెల్లడిపై పెద్ద నోట్ల రద్దు, ఖజానాలో నిధులలేమి ప్రభావం పడినట్టు కనిపిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలోనే పోలీస్ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ ఖజానాలో నిధుల్లేకపోవడంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే శిక్షణ ప్రారంభించాలని ప్రభుత్వం పోలీస్ శాఖకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ కారణం వల్లే జనవరిలో వెలువడాల్సిన పోలీస్ పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతున్నట్లు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయో తెలియక అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. నిత్యం 150 నుంచి 200 మంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులకు ఫోన్లుచేసి ఫలితాలపై ఆరాతీస్తున్నారు. స్టైఫండ్ పెంచలేం... కాగా, ఇప్పటికే శిక్షణలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐలకు చాలీచాలని స్టెఫండ్ ఇస్తున్నామని, దీన్ని పెంచాలని పోలీస్ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న కానిస్టేబుల్‌కు రూ.4వేలు స్టెఫండ్ చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.9వేలకు పెంచాలని పోలీస్ శాఖ ప్రతిపాదించింది. అదే విధంగా సబ్ఇన్స్పెక్టర్లకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.9వేల స్టైఫండ్‌ను రూ.15 వేలకు పెంచాలని కోరింది. అయితే రాష్ట్ర ఖాజానాలో నిధుల్లేవని, ఇంత మొత్తంలో స్టెఫండ్ పెంచడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ఆర్థిక శాఖ ఆ ఫైలును తిప్పిపంపినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో శిక్షణ సమయం నుంచే జీతభత్యాలు చెల్లిస్తుండగా, ఇక్కడ కనీసం స్టెఫండ్ అయినా పెంచాలని తాము కోరామని, కానీ ఆ ప్రతిపాదనను ఆర్థిక శాఖ పక్కనబెట్టడం ఇబ్బందిగా మారిందని అధికారులు స్పష్టంచేశారు. -
ఆర్థిక శాఖ సలహాదారుగా సంజీవ్ సన్యాల్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సంజీవ్ సన్యాల్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్(ఏసీసీ) ఆమోదించిందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయన వేతన స్కేలు రూ.67,000–79,000 అని పేర్కొన్నారు. సంజీవ్ సన్యాల్.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఆక్స్ఫర్డ్,సెయింట్ జాన్స్ కాలేజ్‌ల్లో విద్యనభ్యసించారు. గతంలో సంజీవ్ సన్యాల్ డాషే బ్యాంక్ ఎండీగా పనిచేశారు.పలు పుస్తకాలను ఆయన రచించారు. ల్యాండ్ ఆఫ్ ద సెవెన్ రివర్స్: ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ జియోగ్రఫీ, ద ఇండియన్ రినైసెన్స్: ఇండియాస్ రైజ్ ఆఫ్టర్ ఏ ధౌజండ్ ఇయర్స్ ఆఫ్ డిక్లైన్, ద ఇన్క్రెడిబుల్ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ జియోగ్రఫీ తదితర పుస్తకాలను ఆయన రచించారు. రాయల్ జియోగ్రఫికల్ సొసైటీ(లండన్) ఫెలోగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. పట్టణ అంశాలపై ఆయన చేసిన కృషికి గాను 2007లో ఐసెన్‌హోవర్ ఫెలోషిప్ లభించింది. 2014 వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో సింగపూర్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. -
పాతవి రద్దు.. కొత్త వాటికి ఆమోదం!
2న కేబినెట్ ముందుకు రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు మల్లన్నసాగర్ సహా నాలుగు రిజర్వాయర్లకు ఆమోదం తెలిపే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రీ ఇంజనీరింగ్ చేస్తున్న సాగునీట ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీ ఇంజనీరింగ్‌తో రద్దయిన పనులను తొల గించడం, కొత్త వాటికి అనుమతి, సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నెల 2న జరిగే కేబినెట్ సమావేశంలో రీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. కేబినెట్లో చర్చకు వచ్చే అంశాలపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ప్రాజెక్టుల రీ ఇంజనీరిం గ్‌తో సవరణల భారం అదనంగా రూ.34 వేల కోట్లకు వరకు ఉండనుండగా, దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. 4 రిజర్వాయర్లపై ప్రకటన?.. మల్లన్నసాగర్ సహా మరో 4 రిజర్వాయర్లపై కేబినెట్లో కీలక నిర్ణయం చేసే అవకాశం ఉంది. 50 టీఎంసీల మల్లన్న సాగర్‌కు రూ.7,308 కోట్లు, 3 టీఎంసీల రంగనాయక సాగర్‌ను రూ.550 కోట్లు, 7 టీఎంసీల కొండ పోచ మ్మకు రూ.521.50 కోట్లు, 9.86 టీఎంసీల గంధమలకు రూ.8 98.50 కోట్లు, 11.39 టీఎంసీల బస్వా పూర్‌కు రూ.1803 కోట్ల తో అంచనాలు సిద్ధమయ్యాయి. వీటికి మొత్తంగా రూ.11,081 కోట్ల అంచనా వేయగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీనిపై కేబినెట్ లో ఆమోదం తెలిపి అనం తరం అధికారిక ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. -
తేడా కొంచెమే!
కొత్త విధానంలో బడ్జెట్ రూపకల్పనకు రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు 2016–17 బడ్జెట్‌తో మోడల్ ప్రయోగం ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులను.. ప్రగతి, నిర్వహణ పద్దులుగా విభజన రూ.లక్షా 30 వేల కోట్లలో తేడా వచ్చింది రూ.9 వేల కోట్లే! హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ స్వరూపం మారిపోతోంది. కేంద్రం నిర్దేశించిన మార్గద ర్శకాల ప్రకారం ప్రణాళిక, ప్రణాళికేతర పద్దు ల వర్గీకరణ తొలగిపోతుంది. స్థూలంగా అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమా లకు అద్దం పట్టేది ప్రణాళిక వ్యయం.. ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చు లను నిర్వచించేది ప్రణాళికేతర వ్యయం. ఈసారి నుంచి వీటి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులు అమల్లోకి రాబోతున్నాయి. దీంతో కొత్త బడ్జెట్ ఎలా ఉండబోతోందనే అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ప్రగతి పద్దులో ఏముంటాయి, నిర్వహణ పద్దులో ఏం ఉండబోతున్నాయి, గతంతో పోలిస్తే బడ్జెట్ గణాంకాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయా.. అనే అంశాలపై ఇటీవలే ఆర్థిక శాఖ కసరత్తు చేసింది. గతేడాది మార్చిలో ప్రవేశపెట్టిన 2016–17 బడ్జెట్‌ను తీసుకుని... కొత్త స్వరూపానికి అనుగుణంగా సర్దుబాటు చేసి, నమూనా బడ్జెట్‌ను రూపొందించింది. ఈ లెక్కన బడ్జెట్లో పద్దుల మధ్య రూ.9 వేల కోట్ల వరకు మాత్రమే మారుతున్నట్లు లెక్క తేలింది. గతేడాది పెట్టిన రూ.1.3 లక్షల కోట్ల బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం రూ.63 వేల కోట్లు, ప్రణాళిక వ్యయం రూ.67 వేల కోట్లు. అదే కొత్త బడ్జెట్ విధానం ప్రకారం సర్దుబాటు చేస్తే ప్రగతి (ప్రణాళిక) పద్దు కిందకు సుమారు రూ.76 వేల కోట్లు.. నిర్వహణ (ప్రణాళికేతర) పద్దు కిందకు రూ. 53 వేల కోట్లు వస్తున్నాయి. కొన్ని ఖర్చుల పద్దులను మార్చాల్సి రావడంతో ఈ తేడా వచ్చింది. దీంతో కొత్త బడ్జెట్ విధానంతో పెద్ద ప్రయోజనమేమీ లేదని, ప్రభుత్వం మరింత గొప్పలు చెప్పుకునేందుకే పనికొస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమేం చేర్చారు? ఈసారి ప్రభుత్వం విధిగా చెల్లించాల్సిన ఖర్చులన్నింటినీ నిర్వహణ ఖర్చుగా లెక్క గట్టారు. ఏ ప్రభుత్వమొచ్చినా, విధానాలు మారినా తప్పనిసరిగా చెల్లించాల్సిన ఉద్యోగు ల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, అప్పు లపై వడ్డీలు వంటివి ఇందులో చేర్చారు. ఇక ప్రభుత్వ గ్రాంట్లు, తమ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఇచ్చే సబ్సిడీలు, రాయితీలు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఖర్చులన్నిం టినీ ప్రగతి పద్దులో పొందుపరిచారు. తేడా ఎక్కడ? ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, రాయితీలను ప్రణాళికేతర వ్యయంలో చూపించే సంప్రదాయం ఉంది. వ్యవసాయ విద్యుత్, సన్న బియ్యం వంటి రాయితీలన్నీ ఇకపై ప్రగతి ఖర్చులో చూపించాల్సి ఉం టుంది. గతంలో యూనివర్సిటీ ఉద్యోగుల జీతభత్యాలు, కొన్ని శాఖల ఉద్యోగుల జీతాలను ప్రణాళిక వ్యయంలో చూపించారు. ఇప్పుడు వాటిని నిర్వహణ పద్దుకు బదిలీ చేస్తారు. తయారీలోనూ కొత్త పంథా! బడ్జెట్ తయారీ విధానం మారడంతో నిక్కచ్చిగా లెక్కలు తెలుసుకునేందుకు ఆర్థిక శాఖ ఈసారి కొత్త పంథాను అనుసరిస్తోంది. ‘‘ముందుగా ఆర్థిక శాఖ రాష్ట్ర ఆదాయ వనరులు, రాబడి అంచనాలను సిద్ధం చేస్తుంది. అందులోంచి ప్రణాళికేతర వ్యయాన్ని తీసివేసి.. మిగిలిన ఆదాయాన్ని ‘బ్యాలెన్స్ ఫ్రం కరెంట్ రెవెన్యూ (బీసీఆర్)’గా చూపిస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే అప్పులు కూడా కలిసి ఉంటాయి. ఈ బీసీఆర్ మొత్తాన్ని ప్రభుత్వ ప్రాధాన్యాలను బట్టి శాఖల వారీగా, రంగాల వారీగా పథకాలకు కేటాయిస్తుంది. మొత్తం వ్యయాన్ని చూపించిన తర్వాత వివిధ పథకాల అమలుకు నికర బడ్జెట్ నుంచి మదింపు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ బడ్జెట్‌ను నిర్వహణ పద్దు.. ప్రగతి పద్దుగా వర్గీకరిస్తాం..’’అని ఇటీవలే శాసనసభ అంచనాల కమిటీకి ఆర్థిక శాఖ నివేదించింది. -
‘ఉపాధి’ నిధుల్లో సర్కారుకు చుక్కెదురు
కూలీల ఖాతాల్లోకి నేరుగా రూ.200 కోట్లకు పైగా నిధులు జమ సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఇచ్చే ఉపాధిహామీ పథకం నిధులను తాత్కాలికంగా ఇతరత్రా పథకాలు, కార్యక్రమాల కోసం మళ్లించేందుకు అలవాటుపడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎన్‌ఈఎఫ్‌ఎంసీ)ను అమలు చేస్తూ కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈ నిధుల్లో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేరకు నిధులు నేరుగా కూలీల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితులున్నప్పటికీ ఇతరత్రా పథకాలు, కార్యక్రమాలకు మళ్లించే పరిస్థితి లేకుండా పోయిందని ఆర్థిక శాఖ తలపట్టుకుంటోంది. రాష్ట్రంలో దాదాపు 40లక్షల మందికిపైగా ఉన్న ఉపాధి హామీ కూలీలకు ఏటా రూ.1,300 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మేరకు కేంద్రం నుంచి నిధులు విడుదలవుతున్నాయి. ఇప్పటివరకు ఇవి నేరుగా ప్రభుత్వ కన్సాలిడేట్ ఫండ్‌లో జమయ్యేవి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో రైతుల రుణమాఫీ, ఆసరా ఫించన్లు, ఇతర ప్రాజెక్టులకు చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను దారి మళ్లించింది. దీంతో దాదాపు 9లక్షల మంది కూలీలకు నెలపాటు చెల్లింపులు ఆగిపోయాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు కేంద్రం ఎన్ఈఎఫ్ఎంసీను అమల్లోకి తెచ్చింది. నేరుగా కూలీల ఖాతాల్లోకి మస్టర్ రోల్ ప్రకారం నిధులను 48గంటల్లో చెల్లించాలని నిర్ణయించింది. ఎన్‌ఈఎఫ్‌ఎంసీ వివరాల నమోదు బాధ్యతను గ్రామీణాభి వృద్ధి శాఖకు అప్పగించింది. ఈ పరిస్థితి గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఎంసీ నమోదు చేసే సమయంలో రాష్ట్ర సంచితనిధి ఖాతా నంబర్‌ను ఎంట్రీ చేయాలని అధికారుల ను ఆదేశించింది. వీటిని కొన్ని జిల్లాల అధికారులు అనుసరించగా కొందరు కేంద్రం నిర్దేశించినట్లుగా కూలీల ఖాతా నంబర్లు ఇచ్చారు. దీంతో ఈ నెలారంభం నుంచే కూలీల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. మరికొన్ని నిధులు రాష్ట్ర సంచిత నిధిలో జమయ్యాయి. ఈ ఏడాది దాదాపు రూ.200కోట్లకుపైగా కూలీల ఖాతాలకు, మిగతాది రాష్ట్ర ఖజానాలో జమవుతుందని అంచనా వేస్తున్నారు. -
‘కొత్త’ సార్లకు జీతాల్లేవు!
♦ నూతన జిల్లాల్లో పోలీస్ అధికారుల తిప్పలు ♦ ఇంకా అందని డిసెంబర్ జీతం ♦ ఆర్థిక శాఖ నుంచి పీఏవోకు రాని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లా.. కొత్త పోస్టు.. మొదటి అధికారి.. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ సార్‌కు మూడో తేదీ వచ్చినా జీతం లేదు. ఇప్పుడీ పరిస్థితితో దాదాపు 140 మం ది పోలీస్ అధికారులు తంటాలు పడుతున్నా రు. దసరా నుంచి ఆరంభమైన నూతన జిల్లా ల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు ఇప్పటి వరకు డిసెంబర్ నెల జీతాలు అందలేదు. నూతన జిల్లాల్లో కొత్త సబ్ డివిజన్లు, కొత్త సర్కిళ్లు, కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఆ పోస్టులకు సంబంధిం చిన జీత భత్యాల ఆదేశాలు మాత్రం వెలువ రించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నెల కుదరదు రాష్ట్ర వ్యాప్తంగా 26 సబ్డివిజన్లు, 24 సర్కిల్ పోలీస్ కార్యాల యాలు, 92 పోలీస్స్టేషన్లు నూతన జిల్లాల్లో భాగంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో మంజూరయ్యాయి. ఈ పోస్టులకు సంబం« దించి చెల్లించే జీతభత్యాలకు సంబంధించిన ఆదేశాలు మాత్రం ఇంకా ఆర్థిక శాఖ నుంచి వెలువడలేదని పీఏవో (పే అండ్ అకౌంట్స్) అధికారులు తెలిపారు. దీనివల్ల ఈ పోస్టుల్లో పనిచేస్తున్న డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించిన జీతభత్యా లను చెల్లించడం కష్టసాధ్యంగా ఉందని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ నుంచి జీతభత్యాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో పోలీస్ శాఖ తన సొంత బడ్జెట్ నుంచి ఒక మెమో ద్వారా జీతభత్యాలను చెల్లిస్తున్నారు. ఇలా అక్టోబర్, నవంబర్ నెల జీతా లను నానా తంటాలు పడి చెల్లిం చారు. కానీ గడిచిన డిసెంబర్ జీతా లు మాత్రం చెల్లించడం సా«ధ్యప డదని బడ్జెట్ అధికారులు తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఇంతమంది అధికారు లకు ఆర్థిక శాఖ నుంచి కాకుండా సొంత ఖాతా నుంచి జీతాలు చెల్లిస్తే మిగతా కార్య క్రమాలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ఉన్నతాధికారులకు బడ్జెట్ సిబ్బంది తేల్చి చెప్పినట్టు తెలిసింది. ‘కొత్త’లోనే చేదు అనుభవం.. పీఏవోకు ఆర్థిక శాఖ నుంచి జీత భత్యాల ఆదేశాలు వెళ్లకపోవడంతో ఈ పరిస్థితి ఏర్ప డిందని తెలిసినా.. జీతాలు అందుకోని అధికారులు మాత్రం అవమానకరంగా భావిస్తు న్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. జీతాలు అందుకున్న అధికారులు కొత్త సంవత్సరం ఎంజాయ్ చేస్తే తామేం పాపం చేశామో అన్న ట్టుగా ఉందని పలువురు అధికారులు ఉన్న తాధికారులకు మొరపెట్టకున్నట్టు తెలిసింది. -
‘నగదు రహితం’ అనివార్యం!
- అవగాహనా సదస్సులో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వందనా గాంధీ - రద్దయిన కరెన్సీ విలువలో మొత్తం కొత్త కరెన్సీ 30 శాతమేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘నోట్ల రద్దు’ పరిణామాల నేపథ్యంలో సాధారణ ప్రజలు నగదు రహిత లావా దేవీల వైపు మరలడం అనివార్యమవుతోందని.. ఈ దిశగా ప్రజానీకాన్ని ప్రోత్సహించాలని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ వందనా గాంధీ పేర్కొన్నారు. రద్దు చేసిన నోట్లలో రూ.14 లక్షల కోట్లు ఇప్పటికే బ్యాంకుల్లోకి వచ్చాయన్నారు. అయితే రద్దయిన నోట్లలో 90 శాతం బ్యాంకులకు చేరినా.. వాటి స్థానంలో 30 శాతం మాత్రమే కొత్త కరెన్సీ సరఫరా కానుందని చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలకు వెళ్లక తప్ప దని సూచించారు. ‘నగదు రహిత లావాదేవీల’పై ప్రచా రంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం సచివా లయంలో విలేకరులకు ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించింది. ఎస్బీఐ, ఎస్‌బీహెచ్‌ల అధికారులు ఈ సదస్సులో పాల్గొని తమ సంస్థల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మొబైల్ యాప్‌లు, నెట్ బ్యాంకింగ్ సేవలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలు, మొబైల్ వ్యాలెట్, ప్రీపెయిడ్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వందనా గాంధీ మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 31 వరకు ఎలాంటి చార్జీలూ ఉండవని చెప్పారు. మొబైల్ ఫోన్ ద్వారా నగదు రహిత లావాదేవీల నిర్వహణ కోసం స్టేట్ బ్యాంక్ పలు యాప్‌లను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఆన్లైన్ లావాదేవీలు ఎంతో సురక్షితమని నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ పట్ల భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆన్లైన్ ద్వారా పన్నులు, బిల్లులు, మ్యూచువల్ ఫండ్స్, ఫీజులు చెల్లించవచ్చన్నారు. తమ స్టేట్ బ్యాంక్ ఫ్రీడం యాప్ ద్వారా ఖాతాలోని బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్, ఈ–డిపాజిట్స్, బిల్లుల చెల్లింపులు, మొబైల్ టాపప్, డీటీహెచ్–రీచార్జీల వంటి సేవలు పొందవచ్చన్నారు. స్టేట్ బ్యాంక్ బడ్డీ యాప్ ద్వారా కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు, మొబైల్ రీచార్జీతోపాటు వివిధ రకాల బిల్లులు, విమాన టికెట్లు, హోటల్స్ బుకింగ్, చెల్లింపులు, సినిమా, రైల్వే, బస్ టికెట్లు వంటివి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీహెచ్ చీఫ్ మేనేజర్ అనిరుధ్ అగ్నిహోత్రి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో రైల్వే చార్జీల పెంపు?
న్యూఢిల్లీ: నిధుల కొరత ఎదుర్కొంటున్న రైల్వే శాఖ త్వరలో చార్జీలను పెంచే అవకాశముంది. ప్రత్యేక భద్రత నిధి, రైల్వే ట్రాక్‌ల బలోపేతం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం తదితరాల కోసం రూ. 1,19,183 కోట్లు కేటారుుంచాలని రైల్వే శాఖ ఆర్థిక శాఖకు ఇటీవల లేఖ రాసింది. రైల్వే ప్రతిపాదనలను ఆర్థిక శాఖ తిరస్కరించడంతో రైల్వే చార్జీల పెంపు తప్పనిసరైనట్లు తెలుస్తోంది. -
త్వరలో ప్రయాణికులపై 'రైల్వే 'పన్ను వడ్డన ?
-
నగదు రహితానికి యూఎస్ఎస్డీ
25 నుంచి ఉపయోగించాలని సీఎంల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపులకు ఫీచర్ మొబైల్ ఫోన్లలో ఉన్న అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా(యూఎస్ఎస్డీ) వెర్షన్ (ూ99#) అత్యుత్తమమైందని డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు ఏర్పాటు చేసిన సీఎంల కమిటీ అభిప్రాయపడింది. నోట్ల రద్దు నేపథ్యంలో ఈ వెర్షన్‌ను ఈ నెల 25 నుంచి నగదు రహిత లావాదేవీలకు వాడేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆధునిక ‘యూఎస్ఎస్డీ’ వెర్షన్‌ను ఈ నెల 25 నుంచి ప్రారంభించాలి అని ఆర్థిక శాఖకు సమర్పించిన సిఫార్సులో సూచించింది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు కన్వీనర్‌గా ఉన్న సీఎంల కమిటీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కమిటీ రెండో సమావేశం నీతి ఆయోగ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఉడాయ్ టీసీఎస్ సహకారంతో ఆధార్‌తో చెల్లింపులు చేసే (ఏఈపీఎస్) అప్లికేషన్‌ను తయారు చేసిందని తెలిపింది. దీన్ని వ్యాపారులంతా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే దీన్ని ఉపయోగించాలంటే స్మార్ట్ ఫోన్, వేలిముద్ర స్కానర్ అవసరమని తెలిపింది. కాగా, ఎలక్ట్రానిక్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు లక్కీ డ్రాలను నిర్వహించాలని ఎన్పీసీఐ (భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్)ను నీతి ఆయోగ్ సూచించింది. -
భారీగా బయటపడుతున్న బంగారం
-
భారీగా బయటపడుతున్న బంగారం
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడు, ఆయనచేతే టీటీడీ బోర్డు సభ్యుడుగా నియమితుడైన వ్యాపారవేత్త జె. శేఖర్ రెడ్డి ఇంట్లో భారీగా కొత్త కరెన్సీ, బంగారం బయటపడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. చెన్నైలోని శేఖర్‌రెడ్డి సహా నలుగురు తెలుగు వ్యాపారవేత్తలకు చెందిన ఆరు ఇళ్లు, రెండు ఆఫీసుల్లో ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) తనిఖీలు జరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ఒక వైపు ఏపీ సీఎం చంద్రబాబు నగదు రహిత వ్యవస్థపై ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీకీ నేతృత్వం వహిస్తుండగా.. ఆయన ఆప్తుల ఇండ్లల్లో ‘నల్ల’సోమ్ము వెలుగులోకి వస్తుండటం గమనార్హం. ఇప్పటివరకుఆయా నివాస స్థలాల నుంచి రూ. 106.52 కోట్ల నగదు(ఇందులో రూ. 9.63 కోట్ల విలువైన కొత్త రెండు వేల రూపాయల నోట్లు ఉండగా, 96.89 కోట్ల పాత పెద్ద నోట్లు ఉన్నాయి)తోపాటు రూ. 36.29 కోట్ల విలువ చేసే 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. అప్రకటిత ఆస్తులకు సంబంధించిన మరికొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నామని, సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలోనే సంచలనం పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పెద్ద మొత్తంలో దొరికిన సొమ్ము ఇదేనని ఆదాయపన్నుశాఖ వెల్లడించింది. మొత్తం రూ.142 కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ మొత్తం డబ్బు, బంగారం అంతా తనదేనని శేఖర్‌రెడ్డి చెబుతున్నాడని ఐటీశాఖ పేర్కొంది. ఇదంతా తన ఆస్తులేనని శేఖర్‌రెడ్డి చెబుతున్నా.. వీటికి సంబంధించి ఎలాంటి లెక్కలు లేవని ఐటీశాఖ నిర్ధారించింది. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన శేఖర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ సభ్యుడిగానేకాక తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో కీలక నేతగానూ కొనసాగుతున్నారు. ఇసుక, గనుల వ్యాపారాలు చేస్తోన్న శేఖర్ రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ లోకి సులువుగా వెళ్లగలిగే అతికొద్ది మందిలో ఒకరని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ సభ్యుడిగా నియమించారు. శేఖర్ రెడ్డి తమిళనాడులో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేపట్టినట్టు తెలుస్తోంది. -
నోట్ల రద్దుపై టాస్క్‌ఫోర్స్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వివిధ విభాగాల అధికారులు, బ్యాంకర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర స్థారుులో ఈ కమిటీని నియమించినట్లుగా పేర్కొంటూ ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఎస్ఎల్బీసీ కన్వీనర్, ఆర్బీఐ ప్రతినిధి, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్, ఆంధ్రాబ్యాంక్, ఎస్బీఐ జోనల్ హెడ్లు సభ్యులుగా ఉంటారు. -
పోలవరం కమీషన్ల పరం!
-
పోలవరం కమీషన్ల పరం!
పాత కాంట్రాక్టర్లపై 60సీ కింద వేటువేసి అస్మదీయులకు అప్పగిస్తోన్న సర్కారు సాక్షి, అమరావతి: పోలవరం పేరుతో మరో రూ.3825.44 కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకోసం ఆర్థిక శాఖ అభ్యం తరాలు, స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సూచనలను సర్కారు తోసిపుచ్చింది. పోలవరం కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.2240.68 కోట్ల నుంచి రూ.4375.77 కోట్లకు.. ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.1954.74 కోట్ల నుంచి రూ.3645.15 కోట్లకు పెంచేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాలతో ముడిపడిన పత్యేక హోదా ను తాకట్టు పెట్టి.. పోలవరం నిర్మాణ బాధ్య తలు దక్కించుకున్న 24 గంటల్లోనే ప్రధాన పనులు (హెడ్ వర్క్స్) అంచనా వ్యయం రూ.1482 కోట్లు పెంచేసి.. కాంట్రాక్టర్ అరుున టీడీపీ ఎంపీ రాయపాటి నుంచి పర్సెంటేజీలు దండుకున్న ‘ముఖ్య’ నేత తాజాగా మరో అడుగు ముందుకేశారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను చేజిక్కించు కోవడం వెనుక దాగిన రహస్య అజెండాను ప్రభుత్వం నిస్సిగ్గుగా అమలుచేస్తోంది. పనులు చేయడం లేదనే సాకు చూపి పాత కాంట్రాక్టర్లపై జలయజ్ఞం నిబంధన 60సీ కింద వేటు వేసి.. అస్మదీయులకు అప్పగించి పర్సెంటేజీలు దండుకోవడానికి వ్యూహా త్మకంగా పావులు కదుపుతోంది. పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఐదో ప్యాకేజీ కాం ట్రాక్టర్‌పై ఇప్పటికే వేటు వేసి.. పీఎస్కే- హెచ్‌ఈఎస్(జారుుంట్ వెంచర్) సంస్థకు రూ.142 కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ నవంబర్ 30న ఉత్తర్వు లు జారీ చేయడమే అందుకు తార్కాణం. -
బెంగళూరులోనే ఎక్కువగా దొరికాయి
న్యూఢిల్లీ: పాత పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారుల నుంచి రూ. 2 వేల కోట్ల అప్రకటిత ఆదాయం వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఆదాయం వెల్లడించని వారిపై చర్యలు కొనసాగుతున్నాయని, 400 కేసులను ఆదాయపన్ను శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు రూ. 130 కోట్ల నగదు, పెద్ద మొత్తంలో ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించింది. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఈడీ అధికారులు ఎక్కువ మొత్తంలో అక్రమ నగదును పట్టుకున్నారని తెలిపింది. -
పన్నుల వాటా సర్దుబాటు
కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1813 కోట్లు సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో భారీగా ఆదాయం కోల్పోయిన తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఊర ట లభించింది. డిసెంబర్‌కు సంబంధించి పన్నుల వాటా కింద కేంద్ర ప్రభుత్వం రూ.1813 కోట్లు విడుదల చేసింది. గత నెలలో రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో కేంద్రం భారీగా కోత పెట్టిన విషయం తెలిసిందే. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం, తమ పన్నుల వాటాలో 42 శాతం పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి ప్రతి నెలా సగటున రూ.997 కోట్లు పన్నుల వాటా కింద కేటారుుస్తుంది. ప్రతి నెల ఒకటో తారీఖున ఈ డబ్బు రాష్ట్ర ఖజానాలో జమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు నిర్ణీత వాటాను విడుదల చేసిన కేంద్రం, అనూహ్యంగా నవంబర్‌లో భారీగా నిధుల కోత పెట్టింది. కేవలం రూ.450 కోట్లు విడుదల చేసి మిగతా రూ. 547 కోట్లు కోత విధించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగానే స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్నుల వాటాలో కోత పెట్టిన విషయాన్ని ఆయన ఇటీ వల ఢిల్లీకి వెళ్లిన సంద ర్భంలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్రం పన్ను ల వాటా చెల్లింపులను సవరించింది. సగటున రావాల్సిన నిధులతో పోలిస్తే అదనంగా రూ.816 కోట్లు విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం రూ.1813 కోట్లు కేటా రుుంచింది. ముందుగా ఏప్రిల్, మే, జూన్‌లో వచ్చిన పన్నుల ఆదాయాన్ని లెక్క గట్టి కోత పెట్టిన కేంద్రం.. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల ఆదాయాన్ని సైతం పరిగణనలోకి తీసుకొని పన్నుల వాటా విడుదల చేసినట్లు అధికార వర్గా లు చెబుతున్నారుు. దీంతో నవంబర్‌లో కోత పెట్టిన రూ.547కోట్లు సర్దుబాటు కాగా,అదనంగా రూ.269కోట్లు రాష్ట్రానికి చెల్లించినట్లు స్పష్టమవుతోంది. రూ.450 కోట్ల నాబార్డ్ రుణం రాష్ట్రానికి రూ.450 కోట్ల నాబార్డ్ రుణం మంజూరైంది. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బెనిఫిట్ ప్రోగ్రామ్‌కు ఈ నిధు లు కేటారుుంచింది. మరోవైపు హెచ్ఎం డీఏ పరిధిలో వాటర్ వర్క్స్‌కు హడ్కో నుంచి తీసుకున్న రుణానికి సంబంధిం చిన వడ్డీ చెల్లింపులకు ఆర్థిక శాఖ రూ.142కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
విశాఖ, తిరుపతికి విమానాల్లో డబ్బులు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు వేతనాల చెల్లింపు నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాష్ట్రానికి శుక్రవారం రూ.2,400 కోట్ల కొత్త నోట్లను పంపించింది. హైదరాబాద్ నుంచి ఈ డబ్బు రోడ్డు మార్గంలో విశాఖపట్టణం, తిరుపతిలకు చేరేందుకు సమయం పడుతుందనే భావనతో ఆర్థిక శాఖ ఈ రెండు పట్టణాలకు విమనాల్లో డబ్బులను తరలించింది. హైదరాబాద్ నుంచి టర్బో విమానాల్లో శుక్రవారం విశాఖపట్టణానికి రూ. 240 కోట్లు, తిరుపతికి రూ. 200 కోట్లు చేరవేశారు. ఈ రెండు విమానాలకు చార్జీల రూపంలో ఆర్థిక శాఖ రూ.14 లక్షలు చెల్లించింది. అరుుతే ఆర్బీఐ కేటారుుంచిన 2,400 కోట్ల రూపాయలు మొత్తం కొత్త రెండు వేల నోట్లేనని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశారుు. -
'వంద'ల పాట్లు
80% ఏటీఎంల్లో నో క్యాష్.. వంద నోట్ల జాడలేదు - ఏటీఎంలే కాదు బ్యాంకుల్లోనూ ‘నో క్యాష్’ బోర్డులు - రాజధాని ప్రాంతం విజయవాడ బ్యాంకుల్లోనే స్వైపింగ్ మిషన్లు లేవు - వెలగపూడి సచివాలయం ఎస్బీఐలో నో క్యాష్ బోర్డు - 1వ తేదీ రావడంతో ఉద్యోగులు, సామాన్య ప్రజల్లో టెన్షన్.. టెన్షన్ - సచివాలయ ఉద్యోగులు వేతనాలు తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఒకేసారి 24 వేల రూపాయలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ చర్యలు సాక్షి, అమరావతి: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 రోజులైనా నోట్ల సంక్షోభం వీడలేదు. ఒకటవ తేదీ వచ్చినా ఏటీఎంలోను, బ్యాంకుల్లోను నగదు దొరక్కపోవడంతో ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజానీకంలో టెన్షన్ పెరిగిపోతోంది. గురువారం బ్యాంకు ఖాతాల్లో వేతనం పడుతుందని, దాన్ని తీసుకోవడం ఎలా అనే విషయంపైనే ఉద్యోగులు బుధవారం నుంచి హైరానా పడుతున్నారు. ఏటీఎంల్లో రోజుకు రూ.2500 మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది. కానీ ఏదైనా ఏటీఎంలో నగదు వస్తోందంటే అదీ ఒక్క రెండు వేల నోటు మాత్రమే. బ్యాంకుల్లో వారానికి 24 వేల రూపాయలు తీసుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ... నగదు కొరత నేపథ్యంలో ఒకేసారి 24 వేల రూపాయలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నారుు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పేదలు, సామాన్య ప్రజానీకం... అందరిలోనూ ఆందోళనే. ఒకటవ తేదీన ఇంటి అద్దె చెల్లించడానికి, పిల్లల ఫీజులు కట్టడానికి, పాలు పోసే వారికి ఇవ్వడానికి నగదు ఎలాగంటూ సతమతమవుతున్నారు. ఇంటి అద్దె చెక్‌ల రూపంలో చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సలహా ఇచ్చిందని, అరుుతే ఇంటి యజమానులెవ్వరూ చెక్‌లు తీసుకోరని, నగదు ఇవ్వాలని పట్టుపడతారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నారుు. బ్యాంకు రుణాలు చెల్లించడానికై తే చెక్‌లు ఇస్తామని, మిగతా వాటికి నగదు ఎలాగంటూ ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో స్వైపింగ్ మిషన్ల ద్వారా అకౌంట్ నుంచి నగదు తీసుకోవచ్చునని చెబుతున్నప్పటికీ ఆచరణలో సాధ్యం కావడం లేదు. విజయవాడలోనే చాలా బ్యాంకుల్లో స్వైపింగ్ మిషన్లు లేకపోవడం గమనార్హం. నగరంలోని సూర్యారావు పేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో స్వైపింగ్ మిషన్ లేకపోవడం ఇందుకు ఉదాహరణ మాత్రమే. బుధవారం విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో 80 శాతం ఏటీఎంల్లో నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చారుు. మిగతా 20 శాతం ఏటీంఎల్లో రెండు వేల నోట్లు తప్ప వంద నోట్లు జాడే కనిపించలేదు. సాక్షాత్తు పరిపాలన కేంద్రమైన వెలగపూడి సచివాలయంలోని స్టేట్ బ్యాంకు ఇండియా బ్రాంచిలో నో క్యాష్ బోర్డు పెట్టారు. ఏమిటని అడిగితే నగదు అరుుపోందని సిబ్బంది పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఒకేసారి రూ.24 వేలు ఇప్పించేందుకు ఏర్పాట్లు ఇలా ఉండగా సచివాలయ ఉద్యోగులు ఒకేసారి 24 వేల రూపాయలు బ్యాంకులు ఇప్పించాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంను బుధవారం కోరారు. సచివాలయ ఉద్యోగులందరికీ స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా బ్యాంకుల్లోనే వేతన ఖాతాలున్నాయని, ఆ బ్యాంకుల ద్వారా ఒకేసారి 24 వేల రూపాయలు ఇప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కల్లం బ్యాంకు అధికారులతో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. వెలగపూడి సచివాలయంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ బ్రాంచి లేనందున గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు ఆ బ్యాంచి అధికారులను వెలగపూడి రప్పించి అక్కడే విత్ డ్రా ఫారాలను ఉద్యోగుల నుంచి తీసుకుని తగిన నగదు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. అలాగే ఉండవల్లి, తుళ్లూరు, మంగళగిరి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ బ్రాంచీల్లో సచివాలయ ఉద్యోగులు వెళ్లి 24 వేల రూపాయల చొప్పున నగదు తీసుకునేందుకు ఏర్పాటు చేశారు. సచివాలయంలోని ఆంధ్రా బ్యాంకు బ్రాంచితో పాటు ఆయా బ్యాంకుల్లో సరిపడా నగదును అందుబాటులో ఉంచనున్నారు. ఇక రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు కూడా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంను కలిసి ప్రధానంగా గ్రామాల్లో, మండలాల్లో, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు నగదు రూపంలో వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం నాటికి కరెన్సీ చెస్ట్‌ల్లో రూ.1480 కోట్లు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కరెన్సీ చెస్ట్‌ల్లో కేవలం రూ.1480 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశారుు. ఇందులో 90 శాతం మేర నగదు రెండు వేల నోట్ల రూపంలోనే ఉందని బ్యాకింగ్ అధికారులు తెలిపారు. చిన్న నోట్ల సమస్య ఇప్పట్లో తీరదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నారుు. ఆర్బీఐ నిబంధనల మేరకు సగం చిన్న నోట్లను, సగం పెద్ద నోట్లను పాటిచాల్సి ఉందని, అరుుతే 2005 సంవత్సరం నుంచి ఆర్బీఐ నగదు ముద్రణ వ్యయాన్ని తగ్గించడంలో భాగంగా చిన్న నోట్ల ముద్రణను తగ్గించేసి పెద్ద నోట్ల ముద్రణను చేపట్టిందని ఉన్నతస్థారుు అధికారి తెలిపారు. దీంతో పెద్ద నోట్లు శాతం 86 ఉండగా చిన్న నోట్ల శాతం 14 శాతానికి పడిపోరుుందని, దీంతో చిన్న నోట్ల సమస్య తలెత్తిందని, ఇప్పటికిప్పుడు చిన్న నోట్ల సరిపడా అందుబాటులోకి రావడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొన్నారుు. -
రైతులు, రుణగ్రహీతలకు ఊరట
-
రైతులు, రుణగ్రహీతలకు ఊరట
విత్తనాల కొనుగోలుకు పాత 500 నోటు వాడొచ్చు - పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు మరో 15 రోజులు గడువు - గృహ, కారు, పంట రుణాల చెల్లింపునకు 60 రోజుల అదనపు గడువు - ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాలకు రూ. 50 వేల విత్‌డ్రా పరిమితి న్యూఢిల్లీ/ముంబై: పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల్ని సోమవారం కేంద్రం కరుణించింది. రబీ సీజన్ నేపథ్యంలో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా విత్తనాల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు వాడుకోవచ్చంటూ సడలింపునిచ్చింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విత్తన విక్రయ కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ నియంత్రణలోని సంస్థలు, జాతీయ, రాష్ట్ర విత్తన కార్పొరేషన్లు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్)లో తగిన ఆధారాలు చూపి పాత నోట్లు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయొచ్చని ఆర్థిక శాఖ తెలిపింది. ఎరువులకు పాతవి అనుమతించాలి: రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును మరో 15రోజులు పొడిగించింది. రబీ సీజన్లో రైతులకు తగిన వసతులు కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఏపీఎంసీ(వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ)లో నమోదైన వర్తకులు వారానికి రూ. 50 వేల వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. అరుుతే ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు కూడా పాత నోట్లను వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. రబీ సీజన్ వేళ నగదు కొరతతో ఇబ్బందిపడుతున్నామని, తక్షణం నిర్ణయం ప్రకటించాలంటూ ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో పాల్గొన్న రైతులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రుణ వారుుదాలకు వెసులుబాటు: నోట్ల రద్దు కారణంగా రుణ బకారుుల వారుుదా చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఆర్బీఐ శుభవార్త ప్రకటించింది. గృహ, వాహన, వ్యవసాయ.. తదితర రుణాల వారుుదా చెల్లింపు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ఉన్నవారికి.. వారుుదా చెల్లింపుల్లో అదనంగా 60 రోజుల వెసులుబాటు కల్పిస్తూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కోటి రూపాయల లోపు రుణం ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అన్ని బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్(ఎన్బీఎఫ్సీ), ఎమ్ఎఫ్ఐ(మైక్రో ఫైనాన్స ఇనిస్టిట్యూషన్స)లో తీసుకున్న రుణాల వారుుదాలు ఈ వెసులుబాటు పరిధిలోకి వస్తారుు. టెర్మ్ లోన్స(నిర్ణీత కాలవ్యవధి రుణాలు) ఏవైనా సరే మొత్తం మంజూరైన మొత్తం రూ. కోటి అంతకంటే తక్కువ ఉండాలి. 60 రోజుల అనంతరం రుణ వారుుదా చెల్లిస్తే ఎలాంటి పెనాల్టీ విధించకూడదు. వ్యక్తిగత ఓవర్‌డ్రాఫ్ట్‌కు వర్తించని 50 వేల విత్‌డ్రా నగదు విత్‌డ్రాకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ తాజాగా మరికొన్ని సడలింపులు చేసింది. ఓవర్‌డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాదారులు వారంలో రూ. 50 వేల వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. గతవారం రూ. 50 వేల వరకూ కరెంట్ ఖాతాదారులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ సదుపాయం ఓవర్‌డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాలకు కూడా వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. వ్యక్తిగత ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. ఈ మొత్తాలకు రూ. 2 వేల నోట్లు మాత్రమే ఇవ్వొచ్చని పేర్కొంది. పనిచేయని ఏటీఎంలు సోమవారం బ్యాంకుల వద్ద రద్దీ తగ్గినా... ఏటీఎంల వద్ద మాత్రం క్యూలు కొనసాగారుు. బ్యాంకుల్లో కూడా నగదు అరుుపోవడంతో చాలామంది నిరాశగా వెనుదిరిగారు. బ్యాంకుల నుంచి వారానికి రూ.24 వేల విత్‌డ్రా పరిమి తి ఉన్నా... డబ్బుల్లేవంటూ తక్కువ మొత్తాలే ఇచ్చా రు. ఏటీఎంలు పనిచేయకపోవడం, నగదు వెంటనే అరుుపోవడంతో చాలా చోట్ల ప్రజలు సిబ్బందితో గొడవపడ్డారు. సగానికి పైగా ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులే కనిపించాయి. రూ. 10 వేల అడ్వాన్సలు తీసుకున్న ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ గ్రూప్- సీ ఉద్యోగులు నవంబర్ నెల జీతంలో రూ. 10 వేలను అడ్వాన్సగా తీసుకోవచ్చనే నిర్ణయం మాత్రం సోమవారమే అమలైంది. హోం శాఖలో పనిచేసే దాదాపు వెరుు్య మంది ఉద్యోగులు రూ. 10 వేల నగదు అడ్వాన్స తీసుకున్నారు. అన్ని మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ముందస్తు జీతం తీసుకుంటున్నారని ఓఉన్నతాధికారి తెలిపారు. పీఓఎస్ల్లో రూపే కార్డులు వాడుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న పీఓఎస్(పారుుంట్ ఆఫ్ సేల్) మిషన్లలో రూపే డెబిట్ కార్డులు వాడుకోచవ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) స్పష్టం చేసింది. దాదాపు 600కు పైగా బ్యాంకులు రూపే డెబిట్ కార్డుల్ని జారీచేస్తున్నాయని ఆ కార్డుల్ని పీఓఎస్ పారుుంట్లతో పాటు ఆన్లైన్ కొనుగోళ్లకు వాడుకోవచ్చని ఎన్పీసీఐ పేర్కొంది. ఉర్జిత్ రాజీనామా చేయాలి! చెన్నై: నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చిన్న నోట్లను సరైన మొత్తంలో ప్రజలకు అందుబాటులో ఉంచటంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ విఫలమయ్యారని అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) విమర్శించింది. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘ప్రధాని, ఆర్థిక మంత్రికి నోట్ల రద్దుపై పూర్తిగా తెలియకపోవచ్చు. బ్యాంకింగ్ రంగాన్ని సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వానికి ఆర్బీఐ గవర్నర్ సలహా ఇచ్చి ఉండాలి’అని ఏఐబీఈఏ సీనియర్ ఉపాధ్యక్షుడు డి. థామస్ ఫ్రాన్కో తెలిపారు. ‘పెళ్లి’ విత్‌డ్రాకు సవాలక్ష ఆంక్షలు పెళ్లిళ్లకు రూ. 2.5 లక్షల విత్‌డ్రాకు సంబంధించి ఆర్బీఐ సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. 1. నవంబర్ 8కి ముందు ఖాతాలో ఉన్న మొత్తం నుంచే నగదు తీసుకోవాలి. 2. డిసెంబర్ 30 అంతకంటే ముందు జరిగే వివాహాలకు మాత్రమే బ్యాంకులు రూ.2.5 లక్షలు చెల్లించాలి.తల్లి లేదా తండ్రి లేదా పెళ్లి చేసుకునే వ్యక్తి... ఎవరో ఒకరి ఖాతా నుంచి మాత్రమే నగదు విత్‌డ్రా చేసుకోవాలి. 3. బ్యాంకు ఖాతాలేనివారికి మాత్రమే నగదు ద్వారా చెల్లింపులు జరపాలి. నగదు విత్‌డ్రా చేసుకునే వ్యక్తి ఆ డబ్బును పెళ్లి ఖర్చు కోసం ఎవరెవరికి చెల్లిస్తున్నారో తెలుపుతూ బ్యాంకుకు జాబితా సమర్పించాలి. 4. పెళ్లి ఖర్చు చెల్లించే వ్యక్తికి బ్యాంకు ఖాతా లేకపోతే వారి నుంచి డిక్లరేషన్ తీసుకుని బ్యాంకుకు ఇవ్వాలి. దేనికోసం ఎంత ఖర్చుపెడుతున్నారో జాబితాలో తప్పకుండా పేర్కొనాలి. 5. పెళ్లి ఖర్చును నగదు రహిత మార్గాలైన చెక్కులు, డ్రాప్టులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ప్రీపెరుుడ్ కార్డులు, మొబైల్ ట్రాన్స ఫర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా జరిగేలా బ్యాంకులు ప్రోత్సహించాలి. 6. విత్‌డ్రాకు చెందిన అన్ని వివరాల్ని సాక్ష్యాల కోసం బ్యాంకులు కచ్చితంగా నమోదు చేయాలి. అవసరమైతే వివరాలు సరిచూసుకునేందుకు ఉన్నతాధికారులకు ఆ వివరాలు సమర్పించాలి. 7. వివాహ ఆహ్వాన పత్రిక, కళ్యాణ మండపం, కేటరింగ్‌కు ముందస్తు అడ్వాన్స రశీదులు జతపరచాలి. పెళ్లిళ్లు జరిగే కుటుంబాలు రూ. 2.5 లక్షల వరకూ విత్ డ్రా చేసుకోవచ్చంటూ గతవారం కేంద్రం ప్రకటించినా... ఆ సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు. నవంబర్ 10 -18 వరకు.. బ్యాంకుల్లో డిపాజిట్లు, మార్పిడి రూ. 5.44 లక్షల కోట్లు నోట్ల మార్పిడితో మార్చినది రూ.33,006 కోట్లు ప్రస్తుతం బ్యాంకుల్లోని డిపాజిట్లు 5,11,565 కోట్లు బ్యాంకులు, ఏటీఎంల ద్వారా ప్రజలకు చేరినది రూ. 1,03,316 కోట్లు -
పెళ్లితో సంబంధం లేకుండా పెన్షన్
వికలాంగ పిల్లల పెన్షన్‌పై ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ సాక్షి, అమరావతి: మానసిక, అంగ వైకల్యం గల కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్‌ను పెళ్లితో సంబంధం లేకుండా మంజూరు చేయనున్నారు. గతంలో కుటుంబ పెన్షన్‌ను పెళ్లయ్యాకనే ఇచ్చేవారు.కేంద్రంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కుటుంబ పెన్షన్ నిబంధనల్లో సవరణలు తీసుకురావాలని నిర్ణరుుంచాయి. ప్రభుత్వ ఉద్యోగి అంగ వైకల్యం లేదా, మానసిక వైకల్యం గల కుమారుడు, కుమార్తెకు పెళ్లితో సంబంధం లేకుండానే కుటుంబ పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయిస్తూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
గృహ నిర్మాణ సంస్థ రద్దు!
ఇతర శాఖలకు ఉద్యోగుల కేటాయింపు - తాగునీటి పథకాలన్నీ మిషన్ భగీరథ పరిధిలోకి.. - సర్వేయర్ల భర్తీకి తక్షణ చర్యలు - స్త్రీ, శిశు, వికలాంగ శాఖల విలీనంపై పునః పరిశీలన - శాఖల పునర్వ్యవస్థీకరణ చర్యలకు కేసీఆర్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆ సంస్థ ఉద్యోగులను ఇతర శాఖలకు కేటాయించాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణపై గత గురువారం నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. వాటి ప్రకారం అధికారులు పలు చర్యలు చేపట్టారు. ఆ వివరాలు.. ► రాష్ట్రంలోని తాగునీటి పథకాలన్నింటినీ మిషన్ భగీరథ ఆధ్వర్యంలో చేపట్టాలి. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నీటిపారుదల శాఖ వ్యవహరించాలి. ► పర్యాటక, సాంస్కృతిక శాఖ వ్యవహారాలను జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) చేపట్టాలి. ► క్రీడలు, ఎన్సీసీ, యువజన వ్యవహారాలను యువజన సంక్షేమ అధికారి పర్యవేక్షించాలి. ► ప్రతి జిల్లాలో ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో)ను ప్రణాళిక శాఖ నియమించాలి. ► జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ, 108, 104, ఎన్ఆర్హెచ్ఎం విభాగాల నిర్మాణంపై ఆరోగ్య శాఖ పరిశీలన జరపాలి. ►ఎమ్మార్వోను తహసీల్దార్‌గా, డిప్యూటీ తహసీల్దార్‌ను నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ను గిర్దావర్‌గా, ఎమ్మార్వో కార్యాలయాన్ని తహసీల్ కార్యాలయంగా పేర్లు మార్చాలి. సర్వేయర్ల నియామకాలను వేగంగా పూర్తి చేయాలి. ► ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుపై పరిశ్రమల శాఖ పునః పరిశీలన జరపాలి. ► 13 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన జిల్లా కార్యాలయాలను ప్రాంతీయ యూనిట్ కార్యాలయాలుగా మార్చాలి. ► పశు సంవర్థక, మత్స్య శాఖలను వేర్వేరుగా కొనసాగించాలి. ► స్త్రీ, శిశు, వికలాంగులు, వయోజనుల సంక్షేమ శాఖల విలీనంపై పునః సమీక్ష జరపాలి. ► ఆర్థిక శాఖ ట్రెజరీ, పీఏవో కార్యాలయాల సంఖ్యను పెంచాలి. పని ఒత్తిడి ఆధారంగా ఎస్టీవో కార్యాలయాలకు ఉద్యోగులను కేటాయించాలి. ప్రతి జిల్లాకో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ అవసరమా, కాదా పరిశీలించాలి. ►పని ఒత్తిడి ఆధారంగా మైనారిటీ, అటవీ, గిరిజన, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల స్టాఫ్ ప్యాటర్న్‌ను కొత్తగా ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లాల్లో ఒకే విధంగా స్టాఫ్ ప్యాటర్న్ ఉండాల్సిన అవసరం లేదు. ► పారదర్శకత కోసం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సేవల పట్టికను రూపొందించుకోవాలి. -
మధ్యాహ్న భోజన పథకం నిధులకు ఆంక్షలు!
- రూ.115.47 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లోనే.. - మూడు నెలలుగా భోజనం - వండి పెట్టేందుకు ఏజెన్సీల ఇక్కట్లు సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల బిల్లుల మంజూరుపై ఆంక్షలు విధించిన ఆర్థిక శాఖ మధ్యాహ్న భోజన పథకం నిధులకు ఆంక్షలు విధించడంతో రాష్ట్రంలో ఈ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలల్లో విద్యార్థులకు వండిపెట్టినందుకు చెల్లించాల్సిన బిల్లులపై ఆంక్షలు విధించడంతో మధ్యాహ్న భోజన పథకంను నిర్వర్తిస్తున్న ఏజెన్సీలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మూడు నెలలుగా విద్యార్థులకు భోజనం వండిపెట్టేందుకు అయిన ఖర్చులను కూడా విడుదల చేయకపోవడంతో చేసిన అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఏజెన్సీలు వాపోతున్నాయి. గత మే నెల నుంచి కుకింగ్ చార్జీల కింద రూ. 98 కోట్లు, వండి పెట్టిన కార్మికులకు గౌరవ వేతనం కింద రూ. 17.47 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ. 115.47 కోట్లు చెల్లించాల్సి ఉందని, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు బిల్లులు సిద్ధం చేసినా, ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వని కారణంగా వాటి చెల్లింపులు ఆగిపోయాయని విద్యాశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. నిధులు విడుదల చేయాలి: రమాదేవి మధ్యాహ్న భోజన పథ కంపై ఆర్థిక శాఖ విధించిన ఆంక్షలు వెంటనే తొలగించి ఈ దసరాలోపే నిధులు విడుదల చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం నాయకురాలు రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఏజెన్సీలు మరింత ఇబ్బందులు పడతాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లు మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
హోదా లేదు... ప్యాకేజీయే!
-
హోదా లేదు... ప్యాకేజీయే!
⇒ పునర్వ్య్వస్థీకరణ చట్టం హామీల పరిష్కారం దిశగా.. ⇒ రాయితీలు... గ్రాంటు శాతం పెంపు ప్రతిపాదనలు ⇒ కేంద్ర సంస్థలు, రైల్వేజోన్ ఏర్పాటుకు సుముఖం.. ⇒ ముగిసిన కేంద్రం కసరత్తు.. ముసాయిదా సిద్ధం.. ⇒ ప్రధాన మంత్రికి నివేదించిన ఆర్థిక శాఖ ⇒త్వరలో వెలువడనున్న ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు లేనే లేవని కేంద్ర ప్రభుత్వ వర్గాల అందుతున్న సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం చేయాల్సిన ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు తదితర అన్ని అంశాలతో కలిపి రూపొందించిన ముసాయిదాను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించి ఆయన సమ్మతిని తీసుకున్నట్టు తెలుస్తోంది. తగిన న్యాయ సలహా తీసుకుని సాధ్యమైనంత త్వరగా దీనిపై ప్రకటన చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ ముసాయిదాలో ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డుపడుతున్న కారణాలను పొందుపరిచినట్టు సమాచారం. ఇక చట్టబద్ధంగా వివిధ శాఖల ద్వారా మౌలిక వసతుల ఏర్పాటుకు ఇవ్వాల్సిన సాయం, రైల్వేజోన్ సహా అంశాల వారీగా ముసాయిదాలో పేర్కొంటూ ప్యాకేజీని తయారుచేసినట్టు సమాచారం. వెనకబడిన జిల్లాలకు ఇప్పటివరకు ఇస్తున్న అభివృద్ధి సాయాన్ని పెంచినట్టు తెలుస్తోంది. ముసాయిదాలో ఏముంది? పునర్వ్య్వస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1) కింద కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడేందుకు వీలుగా పన్ను ప్రోత్సాహకాలు సహా సముచితమైన ఆర్థికపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 15 శాతం అదనపు డిప్రీసియేషన్, 15 శాతం పెట్టుబడి అలవెన్స్‌ను కేంద్రం ప్రకటించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి సరిపోవని, హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పారిశ్రామిక వృద్ధి కోసం ఇచ్చిన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించాలని ఏపీలో ప్రతిపక్షం డిమాండ్ చేస్తూ వచ్చింది. పన్ను ప్రోత్సాహకాలను రాష్ట్రం మొత్తానికి వర్తింపజేయాలని కోరుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రాయితీలను మరికొంత పెంచుతూ ముసాయిదాలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ► ఏపీ పునర్వ్య్వస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపరిచిన మౌలికవసతుల ఏర్పాటుకు సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ నగరంలో, విజయవాడ-తెనాలి-గుంటూరు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై కూడా స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ► పునర్వ్య్వస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమయ్యే వనరులను దృష్టిలో ఉంచుకుని సముచిత రీతిలో గ్రాంట్లను విడుదల చేయాల్సి ఉంది. వెనకబడిన జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రూపంలో ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు కల్పించాల్సి ఉంది. విభజన జరిగిన తొలి సంవత్సరంలో రాష్ట్రం ఏర్పాటు నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు ఆమోదంలోకి వచ్చేంతవరకు రెవెన్యూ లోటును 2014-15 కేంద్ర బడ్జెట్లోనే కేటాయించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన లెక్కలు కూడా తేల్చి ఇంకా రావాల్సి ఉన్న బకాయిలను చెల్లించేందుకు కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ► స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించలేకపోతున్నందున కేంద్రం.. రాష్ట్రాలకు చేసే ఆర్థిక సాయంలో గ్రాంటు శాతాన్ని పెంచేలా నిర్ణయం జరిగిందని.. ఇది కేవలం ఏపీకి వర్తించేలా చేసినట్టు తెలుస్తోంది. కోరాపుట్-బొలాంగిర్-కలహండి (కేబీకే) తరహాలో.. ► వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ... కోరాపుట్-బొలాంగిర్-కలహండి(కేబీకే) ప్రత్యేక ప్రణాళిక తరహాలో, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని ఆనాటి ప్రధాని రాజ్యసభలో చెప్పారు. కానీ కేంద్రం జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని జిల్లాలకు విడుదల చేస్తూ వచ్చింది. వాస్తవానికి కేబీకే ప్రత్యేక ప్రణాళిక, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ కింద ఆయా ప్రాంతాలకు దాదాపు రూ. 10 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందినట్టు అంచనా. ఈమేరకు ముసాయిదాలో ఈ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా చేర్చినట్టు సమాచారం. ► పునర్వ్య్వస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయంతోపాటు పునరావాసానికి కూడా కేంద్రం కేటాయిస్తుందని ఆ చట్టం చెబుతోంది. రాష్ట్ర విభజన తరువాత నాలుగేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్రాజెక్టుకు నామమాత్రంగా నిధులు చెల్లిస్తూ వచ్చింది. నాబార్డు ద్వారా ప్రత్యేక రుణాన్ని తీసుకుని పోలవరంపై వెచ్చించేలా కేంద్రం నిర్ణయించింది. ఇదే అంశాన్ని ముసాయిదాలో పొందుపరిచారని తెలుస్తోంది. ► సెక్షన్ 94(3) ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, తదితర అవసరమైన మౌలిక వసతులు సహా కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఉద్యోగులకు ఇళ్లు, సామాజిక మౌలిక వసతులు నిర్మించుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు రూ. 5 వేల కోట్లు కేటాయించాలని అడిగింది. రాజధాని అవసరాల కోసం ముసాయిదాలో దాదాపు రూ. 4 వేల కోట్ల మేర ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ► రాష్ట్రంలో పలు జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు ఏపీ పునర్వ్య్వస్థీకరణ చట్టం హామీ ఇచ్చింది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెట్రోలియం యూనివర్శిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఐటీ వంటి జాతీయ ప్రాధాన్యత గల సంస్థలు ఏర్పాటుచేయాల్సి ఉంది. ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ బోధానాసుపత్రిని, అలాగే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాల్సి ఉంది. వీటన్నింటికీ అయ్యే వ్యయంపై చేసే సాయాన్ని కూడా ముసాయిదాలో పొందుపరిచినట్టు సమాచారం. రైల్వే జోన్ కూడా.. పునర్వ్య్వస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలు సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ఇతర నగరాలకు ర్యాపిడ్ రైల్, రోడ్ కనెక్టివిటీని ఏర్పాటుచేస్తామని 13వ షెడ్యూలు హామీ ఇచ్చింది. వీటికి ముసాయిదాలో పరిష్కారం చూపినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. -
కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: భారత్‌లో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకోవాలని నిపుణుల సంఘం సూచించింది. విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించిన నిబంధనలు సరళీకరించాలని, సెన్సెక్స్, నిఫ్టీలలాగా కార్పొరేట్ బాండ్ ఇండెక్స్‌ను ఏర్పాటు చేయాలని, ఈ మార్కెట్ ద్వారా కంపెనీలు నిధులు సమీకరించడాన్ని తప్పనిసరి చేయాలని... ఇలా ఈ సంఘం పలు సూచనలు చేసింది. రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ తదితర సంస్థల నామినీలతో కూడిన ఈ సంఘం ఈ మేరకు తన నివేదికను ఫైనాన్షియల్ స్టెబిలిటి అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎఫ్ఎస్డీసీ) చైర్మన్ అయిన రఘురామ్ రాజన్‌కు సమర్పించింది. ఈ నివేదికను సెబి చైర్మన్ యు.కె. సిన్హా గురువారం విడుదల చేశారు. నిపుణుల సంఘం సూచనల్లో కొన్ని., ♦ మోసాలు జరిగినప్పుడు సకాలంలో వాటిని వెల్లడించేలా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నిబంధనలను సరళీకరించాలి. ♦ కంపెనీలు తమ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు కావలసిన నిధుల్లో కొంత భాగాన్ని ఈ బాండ్ మార్కెట్ నుంచే సమీకరించేలా నిబంధనలు రూపాందించాలి. ♦ లిస్ట్ కాని డెట్ సెక్యూరిటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ఫెమా నిబంధలను సవరించాలి. ♦ కార్పొరేట్ బాండ్లలో నేరుగా ట్రేడింగ్ చేయడానికి విదేశీ ఇన్వెస్టర్లును అనుమతించేలా ఫెమా, సెబి నిబంధనలను సరళీకరించాలి. -
ఎస్టీ గురుకులాలకు 1,515 పోస్టులు
మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్ : కొత్తగా ప్రారంభించనున్న 50 ఎస్టీ గురుకుల (బాలురు, బాలికలు) పాఠశాలల్లో శాశ్వత ప్రాతిపదికన 1,500 మంది టీచింగ్ , నాన్‌టీచింగ్ పోస్టులను, ఎస్టీ గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో 15 మందిని భర్తీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది. ఆయా విధులను నిర్వహించేందుకు ఔట్సోర్సింగ్ కింద 256 మంది సేవలను వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. మంగళవారం ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన 1,515 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను, ఔట్సోర్సింగ్ కింద మంజూరు చేసిన 256 మందిని 2016-19 (మూడేళ్లకాలంలో)లో భర్తీచేస్తారు. ఎస్టీ గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో... ఎస్టీ గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో 15 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఒక అడిషనల్ డెరైక్టర్, ఒక జాయింట్ డెరైక్టర్, 2 డిప్యూటీ డెరైక్టర్లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 2 అసిస్టెంట్ సెక్రటరీలు, ఒక కంటెంట్ మేనేజర్, 3 సూపరింటెండెంట్, 4 సీనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. వీటన్నింటినీ 2016-17లోనే భర్తీ చేస్తారు. ఔట్సోర్సింగ్ సేవలివే : ఔట్సోర్సింగ్ కింద వినియోగించుకునే సేవలివీ.. వాటిలో 50 మంది ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు, 50 మంది జూనియర్ అసిస్టెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 100 మంది ల్యాబ్ అసిస్టెంట్లు, 50 మంది ఆఫీస్ సబార్డినేట్ల సేవలను ఉపయోగించుకోనున్నారు. ఎస్టీ గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో నలుగురు జూనియర్ అసిస్టెంట్లు/డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్ల సేవలను వినియోగించుకుంటారు. 2016-17లో 156 మంది సేవలను, 2018-19లో వంద మంది సేవలను వినియోగించుకుంటారు. భర్తీ చేసే పోస్టుల వివరాలివీ కొత్తగా ఏర్పాటు చేయనున్న 50 ఎస్టీ గురుకులాల్లో రాబోయే మూడేళ్లలో భర్తీచేసే పోస్టులివీ.. 2016-17 లోనే 50 ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేస్తారు. జూనియర్ లెక్చరర్ (350) పోస్టులను 2018-19లో భర్తీ చేస్తారు. పీజీ టీచర్స్ (350) పోస్టుల్లో 2017-18లో 250, 2018-19లో వంద పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) 450 పోస్టులకు గాను 2016-17లో 350, 2018-19లో 100, ఫిజికల్ డెరైక్టర్ (50) పోస్టులను మొత్తం 2018-19లో, పీఈటీ (50) పోస్టులను 2018-19లో, ల్రైబేరియన్లు (50) పోస్టులను 2018-19లో, 50 స్టాఫ్‌నర్స్ పోస్టులను, 50 క్రాఫ్ట్/మ్యూజిక్ టీచర్స్ పోస్టులను, 50 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 2016-17లో భర్తీ చేస్తారు. -
మన భూమి ఇస్తూ.. 5,500 కోట్ల ఖర్చా?
- సింగపూర్ కంపెనీలకు రాయితీలపై ఆర్థిక శాఖ అభ్యంతరం - అవేవీ పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. సాక్షి, హైదరాబాద్ : సింగపూర్ కంపెనీలకు భూమి ఇస్తూ మౌలిక సదుపాయాలు మనం కల్పించడమేమిటి? అందుకోసం రూ. 5,500 ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడమేమిటి?.. సింగపూర్ కంపెనీలపై అవ్యాజమైన ప్రేమ కురిపిస్తూ అలవిమాలిన రాయితీల వరాలిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఆర్ధిక శాఖ వేసిన ప్రశ్నలివి. అంతేకాదు ఆ నిధుల విడుదల కోసం వచ్చిన ఫైలునూ తిరస్కరించింది. రాజధానిని అభివృద్ధి చేయడానికి సింగపూర్ కంపెనీలు రూ. 300 కోట్లు ఖర్చుపెడుతుంటే రాష్ర్టప్రభుత్వం రూ.5,500 ఖర్చు పెట్టబోతోంది. అంతేకాదు స్విస్‌ఛాలెంజ్ విధానాన్ని ఆమోదించిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు అనుగుణంగా సింగపూర్ కంపెనీలకు అనేక రాయితీలను ఉదారంగా ఇచ్చేశారు. అయితే వాటిపై ఆర్ధికశాఖ గతంలోనే అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కానీ వాటిని చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. సింగపూర్ సంస్థలకు రాయితీలు ఇవ్వడంపై ఆర్థిక శాఖ సూచనలను, అభ్యంతరాలను చంద్రబాబు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ఖజానాకు భారమైన, సింగపూర్ సంస్థలకు లాభదాయకమైన అనేక నిబంధనలపై ఆర్థికశాఖ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అవేమిటంటే... ► సింగపూర్ సంస్థలకు ఇచ్చిన 1,691 ఎకరాల భూమిలో రహదారులు, మంచినీటి వసతి, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ ఆ సంస్థలు పెట్టిన షరతులకు ఆర్థికశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటి కల్పనకు రూ.5,500 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా సీఆర్డీఏ కోరింది. ఇంత మొత్తంలో నిధులు లేవని ఆర్థిక శాఖ తిరస్కరించింది. ► రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వ్యయం చేసి రహదారులు, విద్యుత్, మంచినీటి, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తే ఇక సింగపూర్ సంస్థలు చేసేదేమిటని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. ఈ మౌలిక వసతులను కూడా సింగపూర్ సంస్థలతో రాయితీ అండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న నాటి నుంచి 18 నెలల్లో కల్పించాలనే షరతు విధించారు. 18 నెలల కాలంలో రూ. 5,500 కోట్ల రూపాయల వ్యయం చేసి వసతులను కల్పించకపోతే సింగపూర్ సంస్థలకు సీఆర్డీఏ పెనాల్టీ చెల్లించాలనే నిబంధనకు ప్రభుత్వ పెద్దలు అంగీకరించారు. ► సింగపూర్ సంస్థలు అసలు ఎంత మేర పెట్టుబడి పెడతాయో తేల్చాలని, భూమి ధర మినహా సింగపూర్ సంస్థలు పెట్టుబడి పెట్టే మొత్తంలో 20 శాతం కన్నా ఎక్కువ రాయితీలు, సబ్సిడీలు ఇవ్వరాదని ఆర్థిక శాఖ సూచించింది. ఈ సూచనను ప్రభుత్వ పెద్దలు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ► రాష్ట్ర ప్రభుత్వ కొత్త పర్యాటక విధానంలో ఉన్న 20 శాతం నిబంధనను రాజధానికి వర్తింప చేయాలన్న ఆర్థిక శాఖ సూచనను ప్రభుత్వ పెద్దలు బుట్టదాఖలు చేశారు. ► రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థలను తొలగిస్తే చెల్లించే పరిహారంపై అపరాధ వడ్డీ 20 శాతం చెల్లించాలనే నిబంధనను సవరించాలని, ఈ నిబంధన రాష్ట్ర ఖజానాకు హాని చేకూర్చుతుందని ఆర్థిక శాఖ పేర్కొనగా అందుకు ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు. ► ఎస్క్రో అకౌంట్ ఏర్పాటు చేయాలని, అనంతరమే స్విస్ చాలెంజ్‌కు కౌంటర్ ప్రతిపాదనలను ఆహ్వానించాలని ఆర్థిక శాఖ చేసిన సూచనను ప్రభుత్వ పెద్దలు తిరస్కరించారు. ఎస్క్రో అకౌంట్ తెరిచేందుకు సింగపూర్ సంస్థలు నిరాకరించినప్పటికీ అందుకు ప్రభుత్వ పెద్దలు అంగీకరించారు. ► రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో సింగపూర్ సంస్థలు రెవెన్యూ వాటా కింద ఎంత శాతం ఇస్తారో పేర్కొనలేదు. ఆ సంస్థలు రెవెన్యూ వాటా ఎంత ఇస్తాయో తెలియకుండానే గత నెల 24న జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించడం గమనార్హం. రూ. 300 కోట్ల ఖర్చుకు రూ. 27,461 కోట్ల లాభం మనం అభివృద్ధి చేయడానికి ఓ కంపెనీకి 10 ఎకరాలు ఇచ్చామనుకోండి. పెట్టుబడి నిష్పత్తి ప్రకారం లాభం వాటాలూ ఉండడం సహజం. మనం రూ.10 కోట్లు, కంపెనీ రూ. 20 కోట్లు ఖర్చు చేస్తే అదే నిష్పత్తిలో అభివృద్ధి చేసిన స్థలాలను అమ్ముకుంటాం. కానీ రాజధాని అభివృద్ధి విషయంలో ఇది తిరగబడింది. రూ 300 కోట్లు ఖర్చు పెట్టే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ. 27,461 కోట్లు, 1,691 ఎకరాల భూమి ఇచ్చి రూ. 5,500 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టే రాష్ర్టప్రభుత్వానికి దక్కేది రూ. 19,886కోట్లు.రాజధానిని1,691 ఎకరాలలో అభివృద్ధి చేయడం కోసం సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ కంపెనీలు ఖర్చు చేసేది కేవలం రూ. 300 కోట్లు.మౌలికసదుపాయాలకు రాష్ర్టప్రభుత్వం చేయబోయే ఖర్చు రూ. 5,500 కోట్లు. అంటే సింగపూర్ కంపెనీలు పెట్టే ఖర్చు కన్నా ప్రభుత్వం పెట్టేది పది రెట్లు ఎక్కువ. ఆ తర్వాత అక్కడ గజం రూ.లక్ష పలుకుతుందని సీఎం చంద్రబాబే చెబుతున్నారు. ఎకరాలో కొంత రహదారులకు, పార్కులకు పోయినా మిగిలే 2,800 గజాల స్థలం రూ. 28 కోట్లు పలుకుతుంది. అంటే 1,691 ఎకరాల విలువ రూ. 47,348 కోట్లు. అభివృద్ధి చేసిన తర్వాత సింగపూర్ కంపెనీలకు ఈ భూమిలో 58శాతం వాటాకుబాబు సర్కార్ ఒప్పుకుంది అలా వాటికి రూ. 27,461.84 కోట్లు, రాష్ర్ట వాటా 42శాతం కాబట్టి దానికి రూ. 19,886.16 కోట్లు అన్నమాట. మనభూమిచ్చి... మనం ఎక్కువ ఖర్చుపెట్టి... సింగపూర్ కంపెనీలకు ఎందుకు లాభం చేకూర్చాలో.. ఆ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చితే ఏ ‘బాబు’కి లాభమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా! -
ఉద్యాన వర్సిటీలో 72 పోస్టుల భర్తీకి అనుమతి
ఆర్థిక శాఖ ఉత్తర్వులు.. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ సాక్షి, హైదరాబాద్: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీలో 72 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేసేందుకు అంగీకరించింది. ప్రొఫెసర్/ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టు ఒకటి, అసోసియేట్ ప్రొఫెసర్/సీనియర్ సైంటిస్ట్ పోస్టులు 19, అసిస్టెంట్ ప్రొఫెసర్/సైంటిస్ట్ పోస్టులు 28, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 2 ఉన్నాయి. స్టోర్ కీపర్ పోస్టులు 5, కేర్ టేకర్ పోస్టులు 4, వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులు 13 ఉన్నాయి. పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆర్థిక శాఖ ఆదేశించింది. జోన్లు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లలను సక్రమంగా పాటించాలని పేర్కొంది. భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని సూచించింది.