సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సోమవారం కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. ఎలాంటి షరతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలకు అంగీకరించింది. రూ. 2234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు మెమో పంపింది. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన ప్రక్రియను పీపీఏ పూర్తి చేయాలని జలశక్తి శాఖను ఆదేశించింది. ( పోలవరం ప్రాజెక్టుకు మేం అడ్డుకాదు.. కానీ )
కాగా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,805 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం చేసిన ఖర్చును ధ్రువీకరిస్తూ కాగ్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు తెలిపారు. (పోలవరం: పెట్టుబడి అనుమతి ఇవ్వాలి)
Comments
Please login to add a commentAdd a comment