Arrears Payment
-
పోలీసులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
ఏలూరు టౌన్: పోలీసులకు ఇవ్వాల్సిన అలవెన్సు బకాయిలు మంజూరు చేయటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు జీతాల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకున్నా.. అలవెన్సుల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడంతో పోలీసులకు ఆర్థిక భరోసా లభించింది. బకాయిల చెల్లింపులతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలన గాడిలో పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపులపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. పోలీసులకు ఊరట.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి పశ్చిమలో సుమారు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ, హెచ్‌సీ, కానిస్టేబుల్ వరకూ అలవెన్సుల బకాయిలు మంజూరవుతున్నాయి. సుమారు 11 నెలలుగా పేరుకుపోయిన ట్రావెలింగ్ అలవెన్సు బకాయిలు ఒకేసారి విడుదల చేయటంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఆర్ఏ, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ రుణాలు సైతం మంజూరు చేయటంతో పోలీసులు సంతోషంగా ఉన్నారు. ఇక సరెండర్ లీవ్స్, అదనపు సరెండర్ లీవ్స్ బకాయిలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, అవికూడ త్వరలోనే మంజూరు చేస్తారని అంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం బకాయిలు విడుదల చేసింది. రెండు జిల్లాల్లోనూ సుమారు ఆయా బకాయిల చెల్లింపులు రూ.8 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఒక్క టీఏ అలవెన్సు బకాయిలు మాత్రమే సుమారుగా రూ. 3.82 కోట్ల నుంచి రూ.4.12 కోట్ల వరకూ ఉందని అధికారులు అంటున్నారు. వీటితోపాటు హెచ్ఆర్ఏ, ఇతర బకాయిలు చూస్తే రెండు జిల్లాలోనూ పోలీసుల శాఖకు రూ.8 కోట్ల వరకూ బకాయిలు చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ రుణాలు సైతం విడుదల కావటంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ శాఖలో సీఐలు– 30 , సబ్ ఇన్స్పెక్టర్లు –120, ఏఎస్ఐ –150, హెడ్ కానిస్టేబుల్స్ – 450 , కానిస్టేబుల్స్ – 1850 మంది ఉన్నారు. మొత్తంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2600 మంది వరకూ పోలీస్ సిబ్బంది ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట పోలీస్ శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రా«ధాన్యత ఇస్తున్నాం. సిబ్బంది అనారోగ్యంతో మరణిస్తే సంక్షేమ నిధి నుంచి ఆర్థికంగా ఆదుకుంటున్నాం. తాజాగా ప్రభుత్వం అలవెన్సు బకాయిలు విడుదల చేసింది. టీఏ అలవెన్సులు, హెల్త్, హెచ్ఆర్ఏ ఇలా అన్నీ మంజూరు చేశారు. – రాహుల్‌దేవ్ శర్మ, ఏలూరు ఎస్పీ బకాయిల చెల్లింపులు హర్షణీయం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలీస్ సిబ్బందికి చాలా కాలంగా చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించడం హర్షణీయం. సిబ్బందికి ఏ సమస్య వచ్చినా పోలీస్ అధికారుల సంఘం వారికి అండగా ఉంటుంది. పోలీస్ సిబ్బందికి 11 నెలల టీఏ అలవెన్సులతోపాటు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, హెల్త్ అలవెన్సులు సైతం విడుదల చేశారు. సిబ్బందికి అలవెన్సులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. – ఆర్.నాగేశ్వరరావు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఏలూరు -
బకాయిలు చెల్లిద్దాం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. దీర్ఘకాలంగా ఉన్న ఈ బకాయిల చెల్లింపులో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం కొన్ని బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి సూచనతో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల హరీశ్ సూచనల నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులతో చర్చించి బకాయిల వివరాలను తీసుకున్నారు. వీటిలో తక్షణం చెల్లించాల్సిన మొత్తాలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు.. తాజాగా మంత్రి హరీశ్‌రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లు భేటీ అయ్యారు. నోటీసులతో కదలిక ఆర్టీసీలో ఈ బకాయిల ప్రభావం 48 వేల కుటుంబాలపై ఉంది. ఇటీవల పీఎఫ్ కమిషనరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేయటం, రెండురోజుల క్రితం సహకార పరపతి సంఘం లీగల్ నోటీసు జారీ చేయటంతో ఆర్టీసీలో కదలిక వచ్చింది. కనీసం రూ.2 వేల కోట్లు అయినా విడుదల చేస్తే సమస్య చాలావరకు పరిష్కారం అవుతుందని బాజిరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల ఆయన సీఎంతో కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఇప్పుడు హరీశ్‌రావుతో చర్చల సందర్భంగా అదే విషయాన్ని వెల్లడించారు. పీఎఫ్ బకాయిలే రూ.1,300 కోట్లు కొన్నేళ్లుగా ఆర్టీసీలో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా మారటంతో, జీతాలు తప్ప ఉద్యోగులకు ఇతర చెల్లింపులు దాదాపు నిలిచిపోయాయి. దీంతో వారికి దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ►ఆర్టీసీ ఉద్యోగులకు కీలకమైంది సహకార పరపతి సంఘం. ప్రతినెలా జీతం నుంచి మినహాయించే 7 శాతం మొత్తంతో ఏర్పడే నిధి నుంచి ఉద్యోగులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. ఈ నిధిని ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవటంతో ఇప్పుడు రుణాలు నిలిచిపోయాయి. అలాగే అందులోనే డిపాజిట్లు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతినెలా పింఛన్ తరహాలో అందే వడ్డీ కూడా నిలిచిపోయింది. ఎండీగా సజ్జనార్ వచ్చాక రూ.500 కోట్లు తిరిగి చెల్లించినా, ఇప్పటికీ రూ.850 కోట్ల బకాయిలున్నాయి. ►ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఉండే పీఎఫ్ ట్రస్టు నుంచి కూడా నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేసింది. ప్రతినెలా పీఎఫ్ చెల్లింపులు కూడా సక్రమంగా లేవు. దానికి ఉన్న బకాయిలు రూ.1,300 కోట్లకు పేరుకుపోయాయి. దీంతో పీఎఫ్ కమిషనరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ►ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక చేయూతనందించేందుకు ఉన్న స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం నిధులను కూడా ఆర్టీసీ వాడేసుకుంది. అలాగే ఎస్బీటీ నిధులు కూడా ఖాళీ చేసింది. దీని కాంట్రిబ్యూషన్ కింద జీతం నుంచి నెలవారీ కోత మాత్రం కొనసాగుతోంది. వీటి బకాయిలు రూ.400 కోట్లకుపైగా ఉన్నాయి. ►2013కు సంబంధించి 2015లో జరిగిన వేతన సవరణ బకాయిల్లో సగం మొత్తాన్ని బాండ్ల రూపంలో ఇవ్వాల్సి ఉంది. ఆ మొత్తం రూ.150 కోట్ల వరకు ఉంది. ►ఆరు విడతలకు సంబంధించిన కరువు భత్యం (25 శాతం వరకు ) రూ.325 కోట్ల మేర పెండింగులో ఉంది. ►2019లో జూన్ నుంచి నవంబర్ వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు, గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన వారికి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పెండింగులో ఉంది. అవో రూ.20 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. -
19 ఏళ్ల క్రితంనాటి బిల్లు కట్టాల్సిందే!
యాదగిరిగుట్ట: వారు 19 ఏళ్ల క్రితం ఓ ఇల్లు కొనుగోలు చేశారు. పాత యజమాని పేరిట ఉన్న విద్యుత్ మీటర్ తొలగించి కొత్త మీటర్ బిగించుకున్నారు. అప్పటి నుంచి నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే, పాత యజమాని పేరిట ఉన్న రూ.10 వేల బకాయి కట్టాలంటూ ఇప్పుడు విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. బిల్లు చెల్లించలేదని తాజాగా కరెంటు కనెక్షన్ కూడా తొలగించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం... 19 ఏళ్ల క్రితం దాతారుపల్లిలో జయిని నాగరాజుకు చెందిన ఇంటిని రాంపల్లి సక్కుబాయి కొనుగోలు చేశారు. అప్పట్లోనే పాత విద్యుత్ మీటర్ తొలగించి, సక్కుబాయి కుటుంబసభ్యుల పేరుతో కొత్త మీటర్ తీసుకున్నారు. అప్పటి నుంచి కరెంట్ బిల్లు రూ.500 కంటే తక్కువగానే వస్తోంది. కానీ, గత నెలలో విద్యుత్ అధికారులు వచ్చి గతంలో ఉన్న ఈ ఇంటి యజమాని పేరుతో బకాయి బిల్లు రూ.10 వేలు వచ్చింది, ఆ బిల్లు ఇప్పుడు కట్టాలని చెప్పారు. ఈ క్రమంలోనే గత నెల బిల్లు సక్కుబాయి కుటుంబసభ్యులు కట్టలేదు. దీంతో గురువారం విద్యుత్ అధికారులు దాతారుపల్లిలోని సక్కుబాయి ఇంటికి వెళ్లి ఈ నెల ఇంటి బిల్లుతోపాటు బకాయి ఉన్న బిల్లు కట్టాలని, లేకుంటే కరెంట్ కట్ చేస్తామంటూ కనెక్షన్ తొలగించారు. ఇదెక్కడి అన్యాయం.. తాము ఇల్లు కొనుగోలు చేసి 19 ఏళ్లు అయింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాత బకాయి ఉందని విద్యుత్ అధికారులు చెప్పలేదని సక్కుబాయి ఆవేదన వ్యక్తం చేసింది. కానీ, ఇప్పుడు ఈ విధంగా విద్యుత్ కనెక్షన్ తొలగించడమేమిటని ఆందోళన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. -
‘రేషన్ బియ్యం సబ్సిడీ బకాయిలను చెల్లించండి’
సాక్షి, న్యూఢిల్లీ : రేషన్ బియ్యం సబ్సిడీ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన 1,728 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వి. విజయసాయి రెడ్డి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం కొంత సొమ్మును సబ్సిడీ కింద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ (ఏపీ సివిల్ సప్లైస్ కార్పోరేషన్)కు చెల్లిస్తుంది. ఆ విధంగా చెల్లించాల్సిన మొత్తాల్లో ఇంకా 1,728 కోట్ల రూపాయల మేర బకాయి మిగిలి ఉంది. ఈ మొత్తాన్ని త్వరితగతిన విడుదల చేసి 2020-21 ఖరీఫ్ సీజన్లో రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుకు సహకరించాలని విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి విజ్ఞప్తి చేశారు. బియ్యం సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌కు విడుదల చేయాల్సిన బకాయిలు 2.498 కోట్ల రూపాయలకు చేరడంతో గత ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ ద్వారా ఈ బకాయిల విషయం ప్రధానమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చదవండి: 'ఎవరికీ కమిషన్లు, వాటాలు ఇవ్వనవసరం లేదు' ప్రధాని ఆదేశాలతో గత మార్చి 5న కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కొంత మొత్తం విడుదల చేసినప్పటికీ ఇంకా 1,728 కోట్ల రూపాయల బకాయిలు మిగిలి ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ బకాయిలను త్వరితగతిన విడుదల చేయవలసిందిగా కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏప్రిల్ 1న మరోసారి ప్రధాన మంత్రికి లేఖ రాసిన విషయాన్ని విజయసాయి రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బియ్యం సబ్సిడీ బకాయిలు త్వరగా విడుదల చేయడం వలన రైతులకు సకాలంలో కనీస మద్దతు చెల్లింపులతోపాటు స్వయం సహాయ బృందాలు, సహకార సంఘాలను ఆర్థిక వత్తిళ్ళ నుంచి కాపాడవచ్చునని వివరించారు. అలాగే 2020-21 ఖరీఫ్ సీజన్‌కు తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో రైతులకు సాయపడవచ్చునని విజయసాయి రెడ్డి తన లేఖలో మంత్రికి వివరిస్తూ సాధ్యమైనంత త్వరగా బియ్యం బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. చదవండి: పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్ -
పోలవరం బకాయిల విడుదలకు మార్గం సుగమం
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. బకాయిల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సోమవారం కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. ఎలాంటి షరతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలకు అంగీకరించింది. రూ. 2234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు మెమో పంపింది. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన ప్రక్రియను పీపీఏ పూర్తి చేయాలని జలశక్తి శాఖను ఆదేశించింది. ( పోలవరం ప్రాజెక్టుకు మేం అడ్డుకాదు.. కానీ ) కాగా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,805 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం చేసిన ఖర్చును ధ్రువీకరిస్తూ కాగ్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు తెలిపారు. (పోలవరం: పెట్టుబడి అనుమతి ఇవ్వాలి) -
14,936 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు
సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకం రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగదీస్తోంది. నాటి సర్కారు చెల్లించని రూ.60 వేల కోట్ల బకాయిలు ఇప్పటి ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. వివిధ కార్పొరేషన్ల నుంచి పెద్దఎత్తున రుణాలు తీసుకుని ఇతర అవసరాలకు అప్పటి టీడీపీ సర్కారు మళ్లించేసింది. దీంతో ఈ బకాయిల బండ ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పడింది. అయినా, క్రమపద్ధతిలో వాటిని ప్రస్తుత సర్కారు తీర్చుకుంటూ వస్తోంది. ఇలా ఈ ఏడాది కాలంలో రూ.14,936 కోట్లను చెల్లించింది. టీడీపీ సర్కారు నిర్వాకాలివీ.. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కింద ప్రతీనెలా చెల్లించాల్సిన నిధులను చెల్లించకుండా పెద్దఎత్తున బకాయిలను పెట్టింది. ♦ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు పెద్దఎత్తున చెల్లింపులు చేయలేదు. ♦రైతులకు చెల్లించాల్సిన సున్నా వడ్డీ డబ్బులకు ఎగనామం పెట్టింది. ♦విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును ఇవ్వలేదు. వీటికితోడు.. వివిధ రకాల పనులకు సంబంధించిన బిల్లులను పెద్ద మొత్తంలో పెండింగ్‌లో పెట్టి ఖాళీ ఖజానాను తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అప్పగించింది. ♦ఈ బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రాధాన్యతా క్రమంలో తీర్చుకుంటూ వస్తోంది. కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో సర్కారుకు ఆదాయం పడిపోయినప్పటికీ రైతుల ప్రయోజనానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సున్నా వడ్డీ బకాయిల సొమ్మును ఏకంగా 57 లక్షల రైతుల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. -
ఊసరవెల్లి రంగులు మార్చినట్లు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాము ఆర్టీసీకి ఎలాంటి బకాయి లేమని, బకాయిల కన్నా అదనంగా రూ.622 కోట్లు గత ఆరేళ్లలో చెల్లించామని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆర్టీసీ కార్పొరేషన్‌కు బకా యిలు చెల్లించేశామని, 2014–15 సంవ త్సరం నుంచి ఇప్పటివరకు రూ.4,253.36 కోట్లు చెల్లించామని, ఇది బకాయిల కంటే అధికమని పేర్కొంది. జీహెచ్ఎంసీ కూడా రూ.1,492 కోట్ల బకాయిల్లో రూ.335 కోట్లు చెల్లించేసిందని, ప్రభుత్వం అద నంగా చెల్లించిన నేపథ్యంలో ఆర్టీసీకి జీహెచ్ఎంసీ కూడా చెల్లిం చాల్సినదేమీ లేదని వెల్ల డించింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, సమ్మెచేసే ఉద్యోగుల డిమాం డ్లలో న్యాయ బద్ధమైన వాటి పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా హిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘ వేంద్ర సింగ్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. కేంద్రం పరిష్కరించాలి.. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అసలు ఆర్టీసీ విభజన జరగ లేదని, ఆస్తులు, అప్పులను తెలంగాణ, ఏపీలకు పంపకాల వంటి ఇతర సమస్య లను కేంద్రం పరిష్కరించాల్సి ఉందని, ఆర్టీసీలో 31 శాతం వాటా కేంద్రానికి కూడా ఉందని చెప్పింది. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ముందుగానే రీయింబర్స్మెంట్ చేస్తున్నట్లు ఆర్టీసీకి తెలిపారా.. ఇవ్వాల్సింది లేదని కూడా చెప్పారా లేదా అని ప్రశ్నించింది. పైగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో కూడా ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల్లేవని చెప్పలేదని, బకాయి ఇవ్వాలన్న ఆర్టీసీ డిమాండ్‌ను ఖండించలేదని ధర్మాసనం ఎత్తిచూపింది. ముందుగానే డబ్బులు ఇచ్చేశామని ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నందున ఆర్టీసీకి బకాయిలు రావాల్సినవి ఉన్నాయో లేదో, ఉంటే ఎంత బకాయిలు ప్రభుత్వం నుంచి రావాలో తెలియజేయాలని ఆర్టీసీ ఎండీని కోర్టు ఆదేశించింది. నాలుగు ప్రధాన డిమాండ్లకు ఆర్టీసీ విభజన కాలేదు.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం ఆర్టీసీ ఇప్పటికీ ఉమ్మడిగానే ఉందని, ఈ వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని ఏజీ చెప్పారు. ‘జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 42 శాతం, ఏపీకి 58 శాతం బకాయిల్ని డబ్బు రూపంలో చెల్లించేందుకు అడ్డుంకులు ఏమున్నాయి. ఐదేళ్లుగా కేంద్రం వద్ద ఈ సమస్యను పరిష్కరించుకోకుండా ఏం చేస్తున్నారు’అని ధర్మాసనం ప్రశ్నించింది. సోమవారమే దీనిపై కేంద్రానికి లేఖ రాశామని ఏజీ జవాబు చెప్పారు. దీంతో ధర్మాసనం కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేసింది. ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉన్నందున కేంద్రం ఏం చేయదల్చిందో చెప్పాలని, ఏపీ పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం వీటి విషయంలో కేంద్ర వైఖరి తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 1న జరుపుతామని పేర్కొంది. ఆంకెలాట ఆడుతున్నట్లు ఉంది.. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లోని అంశాల్ని పరిశీలించిన ధర్మాసనం.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అంకెలాట ఆడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బకాయిలు చెల్లించామని చెబుతున్నారే గానీ, బకాయి ఏమీ లేదని చెప్పట్లేదని తప్పుపట్టింది. ఇందుకు ఏజీ బదులిస్తూ.. పూర్తి వివరాలిచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలంటే హైకోర్టు ఇవ్వలేదని చెప్పారు. ‘ల్యాప్‌టాప్ క్లిక్ చేస్తే పూర్తి వివరాలు అందించే ఈ రోజుల్లో ఆర్టీసీకి ఎంత మేరకు బకాయిలు చెల్లించాలో చెప్పడానికి అంత సమయం ఎందుకు? రూ.4,253 కోట్లు చెల్లించామని చెబుతున్నారు. అందులో రూ.850 కోట్లు ఆర్టీసీ అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండటాన్ని కూడా డబ్బు ఇచ్చినట్లు ఎలా చెబుతారు? ఆర్టీసీకి అప్పు పుట్టేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. ఆ అప్పుపై వడ్డీలో కూడా ఒక్క రూపాయి ప్రభుత్వం చెల్లించదు. అలాంటప్పుడు గ్యారంటీగా ఉన్న మొత్తాన్ని కూడా ఆర్టీసీకి ఇచ్చామని ఎలా చెబుతారు? ఎప్పుడో డబ్బులిచ్చి 2018–19లో చెల్లించాల్సినవి కూడా ఇచ్చామని ఎలా చెబుతారు’అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ప్రజాహితంతో అధికారులు వివరాలిచ్చారని ఏజీ చెప్పగానే.. ధర్మాసనం స్పందిస్తూ.. ‘వివరాలన్నీ వేగ్గా ఉన్నాయి. క్లిస్టర్ క్లియర్‌గా లేనేలేవు. సూటిగా చెప్పే ప్రయత్నమే కనబడలేదు’అంటూ వ్యాఖ్యానించింది. బడ్జెట్ లెక్కలు చెప్పండి ‘బడ్జెట్లో ఆర్టీసీకి 2013–2019 సంవత్సరాలకు ఎంత కేటాయించారు? తాజా బడ్జెట్ ఎంత.. ఇప్పటి వరకు ఎంత విడుదల చేశారు. ఇంకా ఎంత బడ్జెట్ విడుదల చేయాల్సి ఉందో తెలపండి. ఆర్టీసీ యూనియన్ల ప్రధాన 4 డిమాండ్ల పరిష్కారానికి అవసరమైన రూ.47 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందో లేదో కూడా స్పష్టం చేయాలి’అని కోర్టు పేర్కొనగా.. ఆర్థికమాంద్యం నేపథ్యంలో రూ.47 కోట్లు విడుదల చేసేందుకు సమయం కావాలని ఏజీ చెప్పారు. దీంతో ధర్మాసనం వెంటనే స్పందిస్తూ.. ‘ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆ నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు రూ.47 కోట్లు ఇవ్వాలంటే ఆర్థిక మాంద్యమని చెబుతున్నారు. ఆర్టీసీ కూడా ప్రజల కోసమే పనిచేస్తోంది. విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలకే ఆదాయం సరిపోతోందని ప్రభుత్వం చెబుతోంది. మరి ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఆర్టీసీ లేదా? గిరిజనులు, మహిళలు, పిల్లలు, పేద, మధ్యతరగతి వారంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్టీసీకి బడ్జెట్లో కేటాయించిన రూ.550 కోట్లకు రూ.425 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని, మిగిలిన రూ.125 కోట్టు వచ్చే మార్చిలోగా విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏజీ చెప్పారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు.. పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలని పలుసార్లు కోరారు. సమ్మె చట్ట విరుద్ధమంటూనే, ఆర్టీసీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నారంటూ పరస్పర విరుద్ధంగా చెప్పడం ఊసర వెల్లి రంగులు మార్చినట్లుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమ్మె విరమించాలని ఆదేశిస్తే కార్మికులు ఏం చేస్తారో.. సమ్మె చట్ట విరుద్ధమంటే ఏమవుతుందో కూడా ఆలోచించాలని హితవు పలికంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనపై ఆర్టీసీ వైఖరిని తెలిపేందుకు సోమవారం వరకు గడువు కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సెల్ శ్రీనివాసన్ అయ్యంగార్ కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించలేదు. కానుకకు జవాబుదారీ ఉంటుందా? ఆర్టీసీ బకాయిలు ముందుగానే చెల్లించేశామని ప్రభుత్వం చెప్పడంతో ఆ విషయాన్ని ముందుగానే కార్పొరేషన్‌కు చెప్పారా అని ప్రశ్నిస్తూ ‘మీకు నేను రూ.3 లక్షలు అప్పు ఉన్నాను. మీ కుమార్తె వివాహానికి నేను అప్పుతో కలిపి ప్రేమతో రూ.5 లక్షలు ఇచ్చాను. అప్పు పోను మిగిలిన రూ.2 లక్షలు కానుక అనుకుంటారు కదా? మరి ఆ రూ.2 లక్షలకు ఇప్పుడు మీరు జవాబుదారీ అని నేను అంటే ఎలా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన జవాబు రాలేదు. -
బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట ఆందోళన
సాక్షి, బాసర : పెరిగిన జీతాలు చెల్లించలేదని బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం ఆందోళనకు దిగారు. గతేడాది (2018) జూలై నెలలో జీతాలు పెరగగా మే 2019 వరకు వాటిని చెల్లించలేదని సెక్యురిటీ సిబ్బంది ఆరోపించారు. క్యాంపస్‌లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న 180 మంది పెరిగిన జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. దాదాపుగా 10 నెలలు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 29 లక్షలు చెల్లించాలని తెలిపారు. బకాయిల చెల్లింపు కోసం గతంలో పలుమార్లు వినతి పత్రాలు అందించిన లాభం లేకపోవటంతోనే ఇవాళ గేటు ఎదుట భైటాయించామని తెలిపారు. (చదవండి : బాసర ట్రిపుల్ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు) -
ఎన్పీఏల గుర్తింపునకు ఇకపై నెల గడువు
ముంబై: మొండి బకాయిల్ని (ఎన్పీఏ) గుర్తించే విషయంలో ఆర్బీఐ శుక్రవారం నూతన నిబంధనలను విడుదల చేసింది. ఒక్కరోజు చెల్లింపుల్లో విఫలమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించాలన్న ఆర్బీఐ పూర్వపు ఆదేశాలను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో పాత నిబంధనల స్థానంలో ఆర్బీఐ కొత్తవాటిని తీసుకొచ్చింది. రుణ ఖాతాల పరిష్కారానికి సంబంధించి ఇంతకుముందు వరకు అమల్లో ఉన్న అన్ని పరిష్కార విధానాల స్థానంలో నూతన నిబంధనలను ప్రవేశపెట్టినట్టు ఆర్బీఐ తెలిపింది. వీటి కింద ఇకపై ఎన్పీఏల ఖాతాల గుర్తింపునకు గాను 30 రోజుల గడువిచ్చారు. నూతన ఆదేశాల ప్రకారం ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తులను ముందే గుర్తించి, సకాలంలో వాటిని ఆర్బీఐకి తెలియజేసి పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఒత్తిడిలో (వసూళ్ల పరంగా) ఉన్న రుణ ఖాతాలను బ్యాంకులు ముందుగానే గుర్తించడంతోపాటు, చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన వెంటనే వాటిని ప్రత్యేకంగా పేర్కొన్న ఖాతాలుగా (ఎస్ఎంఏ) వర్గీకరించాల్సి ఉంటుందని ఆర్బీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. డిఫాల్ట్ అవడానికి ముందే పరిష్కార ప్రణాళికపై దృష్టి పెట్టాలని సూచించింది. ‘‘బ్యాంకు, ఆర్థిక సంస్థ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ వీటిల్లో ఏదైనా ఓ రుణగ్రహీత డిఫాల్ట్ అయినట్టు ప్రకటించిన అనంతరం 30 రోజుల్లోపు ఆయా రుణగ్రహీత ఖాతాకు సంబంధించి పరిష్కార విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. పరిష్కార ప్రణాళిక అమలు చేసేట్టయితే, రుణమిచ్చిన అన్ని సంస్థలూ అంతర్గత ఒప్పందంలోకి (ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్) వస్తాయి’’ అని ఆర్బీఐ పేర్కొంది. దివాలా లేదా వసూళ్లకు సంబంధించి చట్టపరమైన చర్యలు చేపట్టే స్వేచ్ఛ రుణదాతలకు ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను నిపుణులు ప్రశంసించారు. ‘‘నూతన కార్యాచరణను 2018 ఫిబ్రవరి 12 నాటి ఆదేశాల ఆధారంగా రూపొందించారు. తగినంత మెజారిటీతో పరిష్కారాలను అన్వేషించే యంత్రాంగం ఏర్పాటుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్ అన్నది నిబంధనల మేరకు బ్యాంకులు ఉమ్మడిగా పరిష్కా రాన్ని ఐబీసీకి వెలుపల గుర్తించేందుకు తోడ్పడుతుంది’’ అని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ ఎల్ విశ్వనాథన్ పేర్కొన్నారు. ‘‘నూతన నిబంధనలు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్‌బీఎఫ్‌సీలకు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఎన్పీఏల గుర్తింపు ఇప్పుడిక వేగాన్ని సంతరించుకుంటుంది’’ అని ఎకనమిక్ లా ప్రాక్టీస్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ సుహైల్ నథాని పేర్కొన్నారు. -
మొండి బకాయిల విషయమై ఎలాంటి అవకతవకలు లేవు
ముంబై: మొండి బకాయిల విషయమై ఎలాంటి అవక తవక లకు పాల్పడలేదని యస్‌బ్యాంక్ స్పష్టం చేసిం ది. మొండి బకాయిలను కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేశారా అని ఇటీవలనే నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) యస్‌బ్యాంక్‌ను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా యస్‌బ్యాంక్ ఈ వివరణ ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి తమ స్థూల మొండి బకాయిలు 1.3 శాతంగా, నికర మొండి బకాయిలు 0.59 శాతంగా ఉన్నా యని పేర్కొంది. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే తమ మొండి బకాయిల గణాంకాలు అత్యుత్తమైనవని వివరించింది. కాగా బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ పదవీ కాలాన్ని ఈ ఏడాది జనవరి వరకూ ఆర్బీఐ కుదించిన విషయం తెలిసిందే. -
కార్మికులకు పదో వేజ్‌బోర్డ్ ఏరియర్స్
సాక్షి, గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు (ఎన్సీడబ్ల్యూఏ) 10వ వేజ్‌బోర్డ్‌కు సంబంధించిన ఏరియర్స్‌లో 70 శాతం ఈ నెల 14న చెల్లించనున్నారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ వేజ్‌బోర్డ్ వేతనాలు 2016 జూలై 1 నుంచి అమలులోకి రాగా, కంపెనీ నవంబర్ 2017 నుంచి కొత్త జీతాలను చెల్లిస్తూ వస్తోంది. కాగా జూలై 2016 నుంచి అక్టోబర్ 2017 మధ్య గల 16 నెలల కాలానికి చెల్లించాల్సిన బకాయిలను కంపెనీ కార్మికులకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.51 వేలను ఏరియర్స్‌లో భాగంగా 2017 అక్టోబర్ 17న కంపెనీ కార్మికులకు చెల్లించింది. అయితే కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 10వ వేజ్‌బోర్డుకు సంబంధించి ఏరియర్స్‌లో 70 శాతం మొత్తాన్ని చెల్లించాలని కంపెనీ తాజాగా నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి గతంలో చెల్లించిన రూ.51 వేల ఏరియర్స్‌ను, ఇన్‌కమ్‌ట్యాక్స్, సీఎంపీఎఫ్ సొమ్మును మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల బ్యాంకు అకౌంట్లలో ఈ నెల 14న జమ చేయనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. దీని కోసం కంపెనీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. మిగిలిన 30 శాతం ఏరియర్సును కోల్ ఇండియా స్థాయిలో తీసుకునే నిర్ణయం మేరకు కంపెనీ చెల్లిస్తుందని యాజమాన్యం తెలిపింది. -
బ్యాంకుల నెత్తిన ‘గీతాంజలి’ బండ
న్యూఢిల్లీ: కుంభకోణంలో చిక్కుకున్న గీతాంజలి జెమ్స్ గ్రూపునకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిపోవడంతో మార్చి త్రైమాసికంలో బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,000 కోట్ల మేర పెరిగిపోనున్నాయి. గీతాంజలి జెమ్స్ గ్రూపునకు ఇచ్చిన వర్కింగ్ క్యాపిటల్ రుణాలు రూ.8,000 కోట్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎటువంటి చెల్లింపులు జరగలేదు. దీంతో ఈ మొండి బకాయిలకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. గత త్రైమాసికంలో ఎన్పీఏలుగా మారిన ఖాతాల్లో గీతాంజలి అతిపెద్దది కావడం గమనార్హం. డిసెంబర్ త్రైమాసికం నాటికి దేశీయ బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,40,958 కోట్లుగా ఉన్నాయి. పీఎన్బీని రూ.13,000 కోట్ల మేర మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి గీతాంజలి జెమ్స్ గ్రూపు ప్రమోటర్ మెహుల్‌చోక్సీ దగ్గరి బంధువు కావడం గమనార్హం. ముంబైలోని సీబీఐ కోర్టు మోదీ, చోక్సీలకు వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్ వారంట్లు కూడా జారీ చేసింది. అలహాబాద్ బ్యాంకు సార«థ్యంలోని 21 బ్యాంకుల కన్సార్షియం గీతాంజలి జెమ్స్ గ్రూపునకు వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని తొలుత 2010–11లో మంజూరు చేసింది. రూ.900 కోట్లతో ఐసీఐసీఐ బ్యాంకు ఈ రుణంలో అధిక వాటా కలిగి ఉంది. 2015లో గీతాంజలికి ఇచ్చిన రుణాలను పునరుద్ధరించగా, 2017 డిసెంబర్ క్వార్టర్ వరకు ఈ రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లింపులు జరిగాయి. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు గీతాంజలి జెమ్స్ గ్రూపు రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. -
బకాయిలు.. రూ.30 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: భారీగా బడ్జెట్ అంచనాలు వేసుకోవటం.. ఆచరణలో అంత స్థాయిలో ఆదాయం రాకపోవటంతో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. అన్ని శాఖల్లో ఇప్పటికే దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు లెక్కతేలుతోంది. దీంతో ప్రాధాన్య క్రమంలో నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ తిప్పలు పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో మూడు నెలలు మిగిలి ఉండగానే... డిసెంబర్ నుంచే నిధుల సమీకరణకు తంటాలు పడుతోంది. గత నెలలో ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు చెల్లింపులు ఆలస్యమవటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్ల పంపిణీ దాదాపు రెండు వారాల పాటు వాయిదా పడింది. ప్రధానంగా బడ్జెట్లో అంచనా వేసుకున్న స్థాయిలో రెవెన్యూ రాబడి లేకపోవటం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు మూడు నెలలుగా ఆగిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు స్పష్టమవుతోంది. దెబ్బతీసిన జీఎస్టీ! జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రభావం కూడా రాష్ట్ర ఖజానాను అతలాకుతలం చేసింది. జీఎస్టీతో వచ్చే ఆదాయంపై స్పష్టత లేకపోవటంతో వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపులోనూ గందరగోళమే కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న సాగునీటి రంగానికి సైతం సరిపడేన్ని నిధులను అందించలేకపోయింది. అత్యధికంగా ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. అదే దిశగా కాళేశ్వరంతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రూ.13 వేల కోట్లకుపైగా విలువైన పనులు పూర్తయ్యాయి. ఇందులో రూ.5,657 కోట్ల బిల్లులు ప్రస్తుతం పెండింగ్‌లోనే ఉన్నాయి. అన్ని శాఖల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. నీటిపారుదల రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న పరిశ్రమలపైనా ఇదేరకమైన ప్రభావం కనిపిస్తోంది. వివిధ పరిశ్రమలకు అందించాల్సిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మూడేళ్లుగా దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా ప్రోత్సాహకాలను చెల్లించలేదు. అదే తరహాలో అన్ని శాఖల్లోనూ నిధుల విడుదల అసంపూర్తిగానే సాగుతోంది. ఇదిలా ఉండగా రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి చివరి విడత రూ.4 వేల కోట్లను ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లోనే విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులను ముందే చెల్లించటంతో ఆ మేరకు మిగతా కార్యక్రమాలపై దాని ప్రభావం పడినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని డిస్కంలను ఉదయ్ పథకం పరిధిలోకి తెచ్చి రుణాల నుంచి విముక్తులను చేసేందుకు కంకణం కట్టుకుంది. ఈ పథకంలో చేరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.12 వేల కోట్ల బకాయి పడింది. వివిధ పథకాలు, కార్యక్రమాల వారీగా బకాయిలు సాగునీటి ప్రాజెక్టులు రూ.5,657 కోట్లు డిస్కంలు రూ.12,000 కోట్లు జెన్కో, ట్రాన్స్‌కో రూ. 3,400 కోట్లు పౌరసరఫరాల శాఖ రూ. 3,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రూ. 2,000 కోట్లు పరిశ్రమలకు రాయితీలు రూ. 2,000 కోట్లు వడ్డీ లేని రుణాలు రూ. 800 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ, పాలీ హౌజ్‌లు రూ. 600 కోట్లు ఆరోగ్య శ్రీ రూ.400 కోట్లు స్థానిక సంస్థలు రూ.700 కోట్లు మొత్తం రూ.30,557 కోట్లు -
బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆర్బీఐ కొరడా
న్యూఢిల్లీ: మొండి బకాయిలు బాగా పెరిగిపోవడంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)పై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. బీఓఐ తాజాగా రుణాలు జారీ చేయరాదని, డివిడెండ్‌ను పంపిణీ చేయకూడదని ఆంక్షలు విధించింది. సత్వర దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. వరుసగా రెండేళ్ల పాటు నికర మొండి బకాయిలు అధికంగా ఉండటం, సెట్ వన్ మూలధనం తగినంతగా లేకపోవడం, ఆస్తులపై రాబడి (రిటర్న్ ఆన్ అసెట్) రుణాత్మకంగా ఉండటం వంటి కారణాల వల్ల ఆర్బీఐ తాజాగా ఈ ఆంక్షలు విధించిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 4 శాతం తగ్గి రూ.174 వద్ద ముగిసింది.మరోవైపు నికర మొండి బకాయిలు అధికంగా ఉండటంతో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆర్బీఐ అదనపు ఆంక్షలను విధించింది. అయితే డిపాజిట్ల సమీకరణ, రుణ మంజూరు, ట్రెజరీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదని ఈ బ్యాంక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు తెలిపింది. మెరుగుపడిన బీఓఐ రుణ నాణ్యత: గత ఏడాది మార్చి చివరి నాటికి 13.07%గా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 13.22%కి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 7.79% నుంచి 6.90%కి తగ్గాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఈ బ్యాంక్ రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 13.45% నుంచి 12.62%కి, నికర మొండి బకాయిలు 7.56% నుంచి 6.47%కి తగ్గాయి. -
రాయితీల వెత.. పరిశ్రమల మూసివేత!
సాక్షి, హైదరాబాద్ : సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. రాష్ట్రంలోని 69,120 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో 8,618 పరిశ్రమలు ఇప్పటికే ఖాయిలా పడ్డాయి. మరో వందల సంఖ్యలో పరిశ్రమలూ అదే దారిలో ఉన్నాయి. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి స్థాపించిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. దీంతో పెట్టుబడి రుణాలను తిరిగి చెల్లించలేక యువ పారిశ్రామికవేత్తలు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈ రుణాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటిస్తున్న బ్యాంకులు ఈ పరిశ్రమలను వేలం వేస్తున్నాయి. కొత్తగా స్థాపించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోకుండా తొలి ఐదేళ్లు రాయితీ, పోత్సాహకాలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తోంది. రాయితీ, ప్రోత్సాహకాల కోసం ఈ పరిశ్రమలు మూడు నాలుగేళ్ల కింద పెట్టుకున్న దరఖాస్తులు ఇంకా ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కేటాయిస్తున్న రాయితీ, ప్రోత్సాహకాల నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో పెండింగ్ బకాయిలు ఏటికేటికీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని 5,060 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీ, ప్రోత్సాహకాల బకాయిలు రూ.981.23 కోట్లకు పెరిగిపోయాయి. ఐడియా బాగున్నా.. ఆచరణేదీ! కొత్తగా స్థాపించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలం గాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్’ (టీ–ఐడియా) అనే పథకాన్ని 2014 నవంబర్ 29న ప్రకటించింది. ఈ పథకం కింద జనరల్ కేటగిరీకి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్తగా పరిశ్రమలు నెలకొల్పితే ప్రోత్సాహకంగా రూ.20 లక్షలకు మించకుండా 15 శాతం పెట్టుబడి వ్యయాన్ని రాయితీగా ఇస్తామని పేర్కొంది. అదే జనరల్ కేటగిరీ మహిళలకైతే అదనంగా రూ.10 లక్షలకు మించకుండా మరో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని వెల్లడించింది. ఈ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుంచి 5 ఏళ్ల వరకు సేల్స్ ట్యాక్స్, విద్యుత్ బిల్లులను రీయింబర్స్మెంట్ చేస్తామని, పెట్టుబడి రుణాలు భారం కాకుండా పావలా వడ్డీ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపింది. మొత్తం 11 రకాల ప్రయోజనాలను ప్రకటించింది. ఈ రాయితీ, ప్రోత్సాహకాల కోసం పరిశ్రమల నుంచి వచ్చే దరఖాస్తులను రాష్ట్ర పరిశ్రమల శాఖ నేతృత్వంలోని జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు పరిశీలించి అర్హులైన వాటిని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాయి. అయితే పరిశ్రమల శాఖ సిఫారసు చేసిన మూడు నాలుగేళ్లకు గానీ ఈ ప్రయోజనాలు సదరు పరిశ్రమలకు అందట్లేదు. నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీవ్ర జాప్యమే ఇందుకు కారణమని పలువురు పేర్కొంటున్నారు. -
ఈ ఏడాది నష్టం 900 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.900 కోట్ల మేరకు నష్టాలు వచ్చే అవకాశముందని తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అంచనా వేసింది. వేతన సవరణ, అలవెన్సులకు తోడు బకాయిల చెల్లింపు భారంగా మారిన నేపథ్యంలో ఈ స్థాయిలో నష్టాలు వచ్చే అవకాశముందని తేల్చింది. ఆర్థిక సంవత్సరంలో ఇంకా 8 నెలలు మిగిలి ఉండగానే.. ఆర్టీసీ ఈ లెక్కలు వేయడం గమనార్హం. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీ 2013-14 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.908 కోట్లు నష్టాలను నమోదు చేసింది. అంటే ఉమ్మడి ఆర్టీసీ నష్టం రికార్డును తెలంగాణ ఆర్టీసీ ఒక్కటే దాటిపోనుండడం ఆందోళనకరంగా మారింది. మంగళవారం హైదరాబాద్‌లోని బస్ భవన్లో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, ఈడీలు రవీందర్, పురుషోత్తమ్ నాయక్, నాగరాజు, వేణులతోపాటు ఇతర విభాగాధిపతులతో నిర్వహించిన సమీక్షలో ఈ వివరాలను పేర్కొనడం గమనార్హం. కారణం వేతన సవరణే..! గత ఆర్థిక సంవత్సరం ఆర్టీసీకి రూ.707 కోట్లు నష్టం వచ్చింది. అయినా కార్మికులు అడిగినదానికంటే ఎక్కువగా ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో.. ఆర్టీసీపై తీవ్ర భారం పడింది. ఆ సవరణను 2012 నుంచి అమలు చేయాల్సి రావటంతో దాదాపు రూ.1,200 కోట్ల వరకు బకాయిలు దానికి తోడయ్యాయి. పాత అప్పులు తీర్చకపోవడంతో బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దాంతో కార్మికుల పరపతి సహకార సంఘం పేరుతో అప్పు తెచ్చుకుని రోజులు నెట్టుకొస్తోంది. ఇక భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉన్నందున ఈ ఆర్థిక సంవత్సరం భారీ నష్టాలు తప్పవని అధికారులు తేల్చేశారు. ఒకవేళ 10% మేర బస్సు చార్జీలు పెంచినా.. దాని వల్ల కేవలం రూ.250 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం లేకపోవడం, ప్రత్యామ్నాయ ఆదాయం కోసం పెద్దగా కసరత్తు లేకపోవడంతో నష్టాలు తగ్గే అవకాశం తక్కువని తేల్చారు. ఆదాయం పెంచుకుంటాం: సోమారపు ప్రస్తుతం రూ.4 వేల కోట్లుగా ఉన్న ఆర్టీసీ వార్షికాదాయాన్ని రూ.5 వేల కోట్లకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు దోహదం చేసే అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని సమావేశం అనంతరం చెప్పారు. కొత్తగా 1,575 బస్సులను, 236 మినీ బస్సులను కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని బస్సుల షెడ్యూల్‌ను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.కృష్ణా పుష్కరాలకు 1,150 ప్రత్యేక బస్సులను తిప్పనున్నట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు చెప్పారు. ఏసీ బస్సునూ తిప్పాలనుకున్నామన్నారు.