
ముంబై: మొండి బకాయిల విషయమై ఎలాంటి అవక తవక లకు పాల్పడలేదని యస్‌బ్యాంక్ స్పష్టం చేసిం ది. మొండి బకాయిలను కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేశారా అని ఇటీవలనే నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్‌ఎస్‌ఈ) యస్‌బ్యాంక్‌ను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా యస్‌బ్యాంక్ ఈ వివరణ ఇచ్చింది.
ఈ ఏడాది జూన్ 30 నాటికి తమ స్థూల మొండి బకాయిలు 1.3 శాతంగా, నికర మొండి బకాయిలు 0.59 శాతంగా ఉన్నా యని పేర్కొంది. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే తమ మొండి బకాయిల గణాంకాలు అత్యుత్తమైనవని వివరించింది. కాగా బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ పదవీ కాలాన్ని ఈ ఏడాది జనవరి వరకూ ఆర్‌బీఐ కుదించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment