
త్వరలో రైల్వే చార్జీల పెంపు?
న్యూఢిల్లీ: నిధుల కొరత ఎదుర్కొంటున్న రైల్వే శాఖ త్వరలో చార్జీలను పెంచే అవకాశముంది. ప్రత్యేక భద్రత నిధి, రైల్వే ట్రాక్‌ల బలోపేతం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం తదితరాల కోసం రూ. 1,19,183 కోట్లు కేటారుుంచాలని రైల్వే శాఖ ఆర్థిక శాఖకు ఇటీవల లేఖ రాసింది. రైల్వే ప్రతిపాదనలను ఆర్థిక శాఖ తిరస్కరించడంతో రైల్వే చార్జీల పెంపు తప్పనిసరైనట్లు తెలుస్తోంది.