నగదు రహిత చెల్లింపులకు ఫీచర్ మొబైల్ ఫోన్లలో ఉన్న అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా(యూఎస్‌ఎస్‌డీ) వెర్షన్
25 నుంచి ఉపయోగించాలని సీఎంల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు
న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపులకు ఫీచర్ మొబైల్ ఫోన్లలో ఉన్న అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా(యూఎస్‌ఎస్‌డీ) వెర్షన్ (ూ99#) అత్యుత్తమమైందని డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు ఏర్పాటు చేసిన సీఎంల కమిటీ అభిప్రాయపడింది. నోట్ల రద్దు నేపథ్యంలో ఈ వెర్షన్‌ను ఈ నెల 25 నుంచి నగదు రహిత లావాదేవీలకు వాడేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆధునిక ‘యూఎస్‌ఎస్‌డీ’ వెర్షన్‌ను ఈ నెల 25 నుంచి ప్రారంభించాలి అని ఆర్థిక శాఖకు సమర్పించిన సిఫార్సులో సూచించింది.
ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు కన్వీనర్‌గా ఉన్న సీఎంల కమిటీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కమిటీ రెండో సమావేశం నీతి ఆయోగ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఉడాయ్ టీసీఎస్ సహకారంతో ఆధార్‌తో చెల్లింపులు చేసే (ఏఈపీఎస్) అప్లికేషన్‌ను తయారు చేసిందని తెలిపింది. దీన్ని వ్యాపారులంతా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. అయితే దీన్ని ఉపయోగించాలంటే స్మార్ట్ ఫోన్, వేలిముద్ర స్కానర్ అవసరమని తెలిపింది. కాగా, ఎలక్ట్రానిక్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు లక్కీ డ్రాలను నిర్వహించాలని ఎన్‌పీసీఐ (భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్)ను నీతి ఆయోగ్ సూచించింది.