సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వివిధ విభాగాల అధికారులు, బ్యాంకర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర స్థారుులో ఈ కమిటీని నియమించినట్లుగా పేర్కొంటూ ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్థిక శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, ఆర్‌బీఐ ప్రతినిధి, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్, ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీఐ జోనల్ హెడ్‌లు సభ్యులుగా ఉంటారు.
నోట్ల రద్దుపై టాస్క్‌ఫోర్స్ కమిటీ
Published Thu, Dec 8 2016 1:09 AM | Last Updated on Tue, Oct 2 2018 4:36 PM
Advertisement