UPI Transactions: 11 నెలల్లో రూ.223 లక్షల కోట్లు | UPI Transactions Worth Rs 223 lakh crore from 2024 January to November | Sakshi
Sakshi News home page

UPI Transactions: 11 నెలల్లో రూ.223 లక్షల కోట్లు

Published Sat, Dec 14 2024 6:41 PM | Last Updated on Sat, Dec 14 2024 7:17 PM

UPI Transactions Worth Rs 223 lakh crore from 2024 January to November

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) 2024 జనవరి నుంచి నవంబర్ వరకు ఏకంగా రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనడానికి ఈ లావాదేవీలు ఓ ఉదాహరణ అనే చెప్పాలి. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా.. నేపాల్, భూటాన్, యూఏఈ, సింగపూర్, శ్రీలంక, మారిషన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా జరుగుతున్నాయి.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా 2016లో ప్రారంభమైన యూపీఐ.. మల్టిపుల్ బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేయడం ద్వారా చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఇది వినియోగదారులకు తక్షణ నగదు బదిలీలకు మాత్రమే కాకుండా.. వ్యాపార లావాదేవీలకు కూడా ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటి

యూపీఐ అనేది భారతదేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. అక్టోబర్ 2024లోనే రికార్డు స్థాయిలో 16.58 బిలియన్ ఆర్థిక లావాదేవీలను యూపీఐ ప్రాసెస్ చేసింది. దీని విలువ మొత్తం రూ.23.49 లక్షల కోట్లు. రాబోయే రోజుల్లో ఈ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అర్థమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement