ఒక్కో నీటి బిందువే.. మహా సముద్రమైనట్లు, ఒక్కో రూపాయి పోగేస్తేనే కోటీశ్వరులవుతారు. కాబట్టి రోజుకు కేవలం రూ.50 ఆదా చేయడం ద్వారా.. కోటి రూపాయలు సొంతం చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇదెలా సాధ్యం? దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
రోజుకి 50 రూపాయలు ఆదా చేస్తే.. నెలకు రూ.1,500, సంవత్సరానికి రూ.18,000 అవుతాయి. అయితే కోటి రూపాయలు కావాలంటే మాత్రం దీనిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే కంటే ముందు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అయితే కోటి రూపాయల కోసం దీర్ఘకాలిక పెట్టుబడి అవసరం.
రోజుకు రూ.50 పొదుపు చేస్తూ.. రూ.1 కోటి సొంతం చేసుకోవాలంటే, ముందుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. కనీసం 30 ఏళ్ల వరకు ఇన్వెస్ట్‌మెంట్లలను కొనసాగించాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల 10 నుంచి 20 శాతం వరకు రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపౌండింగ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీరు కోటి రూపాయలు ఎలా పొందుతారో ఇక్కడ చూడండి.
➤రోజుకి 50 రూపాయలు కాబట్టి.. 10 సంవత్సరాలలో మీ పెట్టుబడి రూ.1,80,000 అవుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.2,13,137 వస్తాయి. కాబట్టి ఈ మొత్తం రూ. 3,93,137.
➤ఇదే విధంగా 20 సంవత్సరాలలో, మీ పెట్టుబడి రూ.3,60,000. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.16,14,519. కాబట్టి మొత్తం రూ.19,74,519.
➤30 సంవత్సరాలలో.. పెట్టుబడి రూ.5,40,000 అయితే.. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.77,95,583 వస్తాయి. వీటి మొత్తం రూ.83,35,583.
➤32 సంవత్సరాలలో, మీ పెట్టుబడి రూ.5,76,000, దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.1,04,76,949 అవుతుంది. కాబట్టి మీరు పొందే మొత్తం రూ.1,10,52,949.
పైన చెప్పిన విధానం ప్రకారం, మీరు పెట్టే పెట్టుబడి, దానికి ఎంత లాభం వస్తుంది. చివరగా చేతికి ఎంత వస్తుందనే వివరాలు స్పష్టంగా అవగతం అవుతాయి.
ఇదీ చదవండి: 15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!
గమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి.
Comments
Please login to add a commentAdd a comment