15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం! | 15X15X15 Formula You Get Rs 1 Crore in 15 Years | Sakshi
Sakshi News home page

15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!

Published Tue, Dec 10 2024 8:59 PM | Last Updated on Tue, Dec 10 2024 9:14 PM

15X15X15 Formula You Get Rs 1 Crore in 15 Years

డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులవ్వాలని అందరికీ ఉంటుంది. అయితే ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదు, ఆచరణ కూడా అవసరం. ఈ కథనంలో 15 సంవత్సరాల్లో కోటీశ్వరులు ఎలా అవ్వాలో అనే విషయాన్ని.. 15X15X15 ఫార్ములా ద్వారా తెలుసుకుందాం.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే.. దానికి అత్యుత్తమ మార్గం ఇన్వెస్టిమెంట్ అనే చెప్పాలి. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి.

ఇక 15X15X15 ఫార్ములా విషయానికి వస్తే, 15 సంవత్సరాల్లో నెలకు రూ. 15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు అవుతుందనేదే.. ఈ ఫార్ములా సందేశం. అంటే మీరు 15 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు 15,000 ఇన్వెస్ట్ చేసి 15 శాతం వార్షిక రిటర్న్స్ ఆశించాలి.

  ●  పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 15,000
  ●  వ్యవధి: 15 సంవత్సరాలు
  ●  వడ్డీ రేటు: 15 శాతం

పైన చెప్పిన దాని ప్రకారం నెలకు 15,000 రూపాయలు పెట్టుబడి పెడితే.. 15 సంవత్సరాలకు అసలు రూ. 27 లక్షలు అవుతాయి. వడ్డీ రేటు 15 శాతం (రూ. 73 లక్షలు), కాబట్టి ఇలా మీరు కోటి రూపాయలు సంపాదించవచ్చు.

ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!

15X15X15 ఫార్ములా ద్వారా కోటీశ్వరులవ్వాలంటే.. త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 40 ఏళ్లకే మీకు కోటి రూపాయలు వస్తాయి. 30 ఏళ్లకు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 45 సంవత్సరాలకు మీ చేతికి డబ్బులు వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే.. మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, అంత త్వరగా కోటీశ్వరులు అవ్వొచ్చన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement