Crore
-
ఐదు గంటల్లో కోటీశ్వరుడైన 9వ తరగతి విద్యార్ధి.. అసలేం జరిగిందంటే?
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక విద్యార్థి తన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే తన బ్యాండ్ బ్యాలెన్స్ ఏకంగా రూ.87.63 కోట్లుగా చూపించింది. దీంతో ఐదు గంటల పాటు ఆ విద్యార్ధి కోటీశ్వరుడయ్యాడు.బీహార్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి 'సైఫ్ అలీ' రూ.500 విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్ళాడు, ఆ సమయంలో తన బ్యాంకు బ్యాలెస్ చెక్ చేస్తే.. రూ.87.65 కోట్లు ఉన్నట్లు చూపించింది. స్క్రీన్‌పైన కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్ అతన్ని ఒక్కసారిగి ఆశ్చర్యపరిచింది. సైఫ్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ విషయాన్ని పంచుకున్నాడు.సైఫ్ ఖాతాలో రూ.87.63 కోట్లు ఉన్న విషయం ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ అతడు బ్యాంక్ స్టేట్మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లి చెక్ చేసాడు. అప్పుడు అతని ఖాతాలో కేవలం 532 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. అంతే కాకుండా అతని బ్యాంక్ అకౌంట్ కూడా కొంత సేపు స్తంభించింది.ఈ వింత సంఘటన కేవలం ఐదు గంటలు మాత్రమే కొనసాగింది. తనకు తెలియకుండానే వచ్చిన అదృష్టం.. తనకు తెలియకుండానే అదృశ్యమైంది. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్.. సైఫ్ ఖాతాలో పొరపాటున ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయ్యిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించింది. ఈ తప్పిదం ఎలా జరిగిందన్న దానిపై బ్యాంకు అధికారులు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..ఇలాంటి సంఘటనలు మొదటిసారి కాదుఅనుకోకుండా బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయిన సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ తరువాత వచ్చిన డబ్బు వచ్చినట్లే వెనక్కి వెళ్లాయి. కొంతమంది తమకు తెలిసిన వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం వంటివి కూడా చేశారు. కానీ ఆ డబ్బును కూడా అధికారులు మళ్ళీ కట్టించుకున్నారు. అయితే సైఫ్ ఖాతాలో పడ్డ డబ్బు, ఐదు గంటల తరువాత మాయమైంది. -
15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!
డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులవ్వాలని అందరికీ ఉంటుంది. అయితే ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదు, ఆచరణ కూడా అవసరం. ఈ కథనంలో 15 సంవత్సరాల్లో కోటీశ్వరులు ఎలా అవ్వాలో అనే విషయాన్ని.. 15X15X15 ఫార్ములా ద్వారా తెలుసుకుందాం.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే.. దానికి అత్యుత్తమ మార్గం ఇన్వెస్టిమెంట్ అనే చెప్పాలి. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి.ఇక 15X15X15 ఫార్ములా విషయానికి వస్తే, 15 సంవత్సరాల్లో నెలకు రూ. 15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు అవుతుందనేదే.. ఈ ఫార్ములా సందేశం. అంటే మీరు 15 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు 15,000 ఇన్వెస్ట్ చేసి 15 శాతం వార్షిక రిటర్న్స్ ఆశించాలి. ● పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 15,000 ● వ్యవధి: 15 సంవత్సరాలు ● వడ్డీ రేటు: 15 శాతంపైన చెప్పిన దాని ప్రకారం నెలకు 15,000 రూపాయలు పెట్టుబడి పెడితే.. 15 సంవత్సరాలకు అసలు రూ. 27 లక్షలు అవుతాయి. వడ్డీ రేటు 15 శాతం (రూ. 73 లక్షలు), కాబట్టి ఇలా మీరు కోటి రూపాయలు సంపాదించవచ్చు.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!15X15X15 ఫార్ములా ద్వారా కోటీశ్వరులవ్వాలంటే.. త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 40 ఏళ్లకే మీకు కోటి రూపాయలు వస్తాయి. 30 ఏళ్లకు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 45 సంవత్సరాలకు మీ చేతికి డబ్బులు వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే.. మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, అంత త్వరగా కోటీశ్వరులు అవ్వొచ్చన్నమాట. -
అక్కడ ఒక్కో ఇల్లు రూ. 100 కోట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
న్యూఢిల్లీ: జీవితంలో ఓ సొంతిల్లు కొనుక్కోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇందుకోసం పైసాపైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్న వారు లేదా కొనుక్కున్న వారు ఉంటారు. ఈ క్రమంలో సామాన్యులు తమ తాహతుకు మించే ఖర్చు చేస్తారు. అయితే మన దేశంలో వంద కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త నిర్వచనంన్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవరపర్స్(డీఎల్ఎఫ్) సంస్థ ‘ది కామెల్లియాస్’ పేరుతో అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త నిర్వచనాన్ని అందించే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. ‘ది కామెలియాస్’లో ఒక్కో అపార్ట్ మెంట్ ధర రూ.100 కోట్ల వరకు ఉంది. దేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, సీఈఓలు, అత్యంత ధనవంతులకోసం ‘ది కామెల్లియాస్’ నిర్మితమయ్యింది. ఈ ప్రాజెక్ట్ విలాసవంతమైన ఇంటీరియర్స్, సాటిలేని విసాలవంతమైన సౌకర్యాలకు నెలవుగా ఉంది.పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన ఇళ్ల ధరలు2014లో ‘ది కామెలియాస్’ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు చదరపు అడుగు ధర రూ.22,500. కానీ నేడు దాని ధర చదరపు అడుగు రూ.85,000కు పైగానే పలుకుతోంది. అంటే పదేళ్లలో 4 రెట్లు పెరిగింది. గతంలో దాదాపు రూ.25-30 కోట్లకు అమ్ముడుపోయిన ఇక్కడి ఫ్లాట్ ధర నేడు రూ.100 కోట్లకు చేరుకుంది. ఢిల్లీలోని అత్యంత పాష్ ఏరియాలు, గురుగ్రామ్‌లోని పాష్ ఏరియాల మధ్య ధరల వ్యత్యాసం ఇప్పుడు తగ్గుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఇటీవల, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్‌పై ఒక నివేదికను అందించింది.బాల్కనీలోంచి చూస్తే..డీఎల్ఎఫ్ ది కామెల్లియాస్లోని ఫ్లాట్‌లో 72 అడుగుల గాజు బాల్కనీ ఉంటుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి అతిథులు కోసం మరొకటి ఆ ఫ్లాట్‌లోని వారి కోసం రూపొందించారు. ఈ బాల్కనీ వినోదాలకు కేంద్రంగా ఉంటుంది. దీనిలో డైనింగ్ ఏరియా, ఫార్మల్ సీటింగ్, ఫ్యామిలీ మీటింగ్స్ కోసం ప్రత్యేక కార్నర్లు ఉన్నాయి. ఈ బాల్కనీలోంచి చూస్తే బయటనున్న స్విమ్మింగ్ పూల్, పచ్చని చెట్లు కనిపిస్తాయి.లగ్జరీ లివింగ్‌లో కొత్త బెంచ్మార్క్ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్‌లో సింపుల్‌గా ఉంటుంది. క్లాస్సి, స్పెషల్ ఫర్నిషింగ్‌ను ఇందుకోసం వినియోగించారు. డీఎల్ఎఫ్కు చెందిన ఐకానిక్ ప్రాజెక్ట్‌లు ‘ది అరాలియాస్’, ‘ది మాగ్నోలియాస్’ మాదిరిగా ఈ ప్రాజెక్ట్ కూడా ఢిల్లీ- ఎన్సీఆర్లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ కోసం కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. కాగా ది కామెల్లియాస్కు మించిన పెద్ద ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించేందుకు డీఎల్ఎఫ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.కొత్త ప్రాజెక్టులో..డీఎల్ఎఫ్ దహ్లియాస్ పేరుతో నిర్మితమవుతున్న ఈ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ గోల్ఫ్ కోర్స్ రోడ్, గురుగ్రామ్‌లో నిర్మింతం కానుంది. సగటున ఒక అపార్ట్‌మెంట్‌కు దాదాపు రూ.100 కోట్లు ఖర్చుకానుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 34,000 కోట్లుగా అంచనా. ఇందులో 9,500 చదరపు అడుగుల నుండి 16,000 చదరపు అడుగుల వరకు నివాస స్థలాలు ఉంటాయి. దహ్లియాస్‌లో 2,00,000-చదరపు అడుగుల క్లబ్‌హౌస్ ఏర్పాటు కానుంది. ఇది కామెల్లియాస్లోని క్లబ్‌హౌస్ కంటే చాలా పెద్దదిగా ఉండనుంది. ఇది లగ్జరీ మార్కెట్లో మరింత ఆకర్షణీయంగా మారనుంది.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
రూ. 23 కోట్ల దున్న.. నెలకు రూ. 5 లక్షల ఆదాయం
కొందరు ఎవరినైనా తిట్టేటప్పుడు దున్నపోతులా ఉన్నావ్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దున్నపోతు గురించి తెలిస్తే ఇకపై అలాంటి మాట అనరు. ఎందుకంటే ఈ దున్నపోతు ధర, అది తినే తిండి, అంతకు మించి దీని ద్వారా వచ్చే ఆదాయం గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.ఆ దున్నపోతు ఖరీదు రూ.23 కోట్లు అని చెబితే ఎవరైనా నమ్ముతారా? అవును.. ఇది అక్షరాలా నిజం. అయితే దాని వలన వచ్చే ఆదాయం గురించి తెలిస్తే అంత ధర ఉండటంతో తప్పులేదంటాం. ఇప్పుడు ఆ దున్నపోతు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా దాని యజమాని నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకూ సంపాదిస్తుండటం విశేషం. హర్యానాకు చెందిన ఆ దున్నపోతు పేరు అన్మోల్.హర్యానాలోని సిర్సాలో ఉంటున్న పల్వీందర్ సింగ్ అనే రైతు ఈ అన్మోల్ను పెంచుతున్నాడు. దాని వయసు ఎనిమిదేళ్లు. బరువు 1500 కిలోలు. ఈ దున్నపోతును రూ.23 కోట్లు ఇస్తానన్నా పల్వీందర్ సింగ్ ఎవరికీ అమ్మబోనని తెగేసి చెబుతున్నాడు. ఉత్తరాదిన జరిగే పుష్కర్ మేళా, ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనల్లో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది. దీని భారీ ఆకారం ఎవరినైనా ఇట్టే కంగుతినేలా చేస్తుంది.ఇక ఈ అన్మోల్ ఎంత తిండి తింటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోకమానరు. ఇది అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు, డ్రైఫ్రూట్స్‌ను తింటుంది. దాని తిండి కోసం యజమాని రోజూ రూ.1,500 ఖర్చు చేస్తుంటాడు. అంటే నెలకు దానిని మేపడానికి రూ.45 వేల వరకు ఖర్చవుతుందన్నమాట. అది ప్రతి రోజూ 250 గ్రాముల బాదాం, నాలుగు కిలోల దానిమ్మలు, 30 అరటిపండ్లు, ఐదు లీటర్ల పాలు, 20 గుడ్లను తింటుంది. వీటితోపాటు అది ఆయిల్ కేక్, పచ్చి గడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నలను కూడా తింటుంది. అన్మోల్ దున్నపోతుకు దాని యజమాని పల్వీందర్ సింగ్ రోజూ స్నానం చేయిస్తుంటాడు. ఇందుకోసం బాదాం నూనె, ఆవ నూనెలను కూడా వినియోగించడం విశేషం.ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు -
కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఇండియన్ తొలి హీరో ఎవరు.. ఏ సినిమాకు? (ఫోటోలు)
-
కోటి మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్
ఇబ్బందికరమైన కాలర్లు, మోసాలకు పాల్పడుతున్న మొబైల్ కనెక్షన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్, టెలికాం డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఇలాంటి కోటికిపైగా మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. అలాగే సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను టెలికాం శాఖ బ్లాక్ చేసింది."ఇప్పటి వరకు, సంచారసాథి సహాయంతో 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేశాం. అలాగే సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లు బ్లాక్ చేశాం" అని ప్రకటన పేర్కొంది. స్పామ్ కాల్స్ కోసం రోబోకాల్స్, ప్రీ-రికార్డ్ కాల్స్‌తో సహా బల్క్ కనెక్షన్లను ఉపయోగిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది.వాటి కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్ చేయాలని సూచించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?"గడిచిన 15 రోజుల్లో అటువంటి 3.5 లక్షల నంబర్లు డిస్కనెక్ట్ చేశాం. 50 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేశాం. అలాగే దాదాపు 3.5 లక్షల ఉపయోగించని, ధ్రువీకరించని ఎస్ఎంఎస్ హెడర్లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్లను బ్లాక్ చేశాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యలతో పాటు నాణ్యతా సేవా నిబంధనలను ట్రాయ్ సవరించింది. ఇవి అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుండి మొబైల్ సర్వీస్ క్యూఓఎస్ పనితీరు సమీక్ష త్రైమాసిక ప్రాతిపదికన కాకుండా నెలవారీగా నిర్వహించనున్నట్లు కూడా ప్రకటనలో వెల్లడించారు. -
‘ఇన్ఫ్రా’లో కోటి కొలువులు!
మౌలిక రంగం భారీ ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది. మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కోటి ఉద్యోగాలు కొత్తగా ఏర్పడతాయని ఉద్యోగ నియామక సేవలు అందించే ‘టీమ్‌లీజ్ సర్వీసెస్’ అంచనా వేసింది. కేంద్రంలో మూడోసారి కొలువు దీరిన మోదీ సర్కారు రహదారులు, రైళ్లు, విమానాశ్రయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ రంగంలో అసలు నైపుణ్యాలు లేని వారితోపాటు, స్వల్ప నైపుణ్యాలు, పూర్తి నైపుణ్యాలు కలిగిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ అంచనా. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 98 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయని తన తాజా నివేదికలో తెలిపింది. ‘కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నాం. దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఇది తప్పనిసరి. వ్యూహాత్మక పెట్టుబడులు ఉపాధి అవకాశాలతోపాటు, అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధికి వీలు కలి్పస్తాయి’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి. సుబ్రమణియమ్ తెలిపారు. రవాణా రంగంపైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. విమానాశ్రయాల సంఖ్యను 220కి పెంచడం, 2025 చివరికి జాతీయ రహదారుల నిడివిని 2 లక్షల కిలోమీటర్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. అలాగే, 2030 నాటికి 23 జల రవాణా మార్గాల అభివృద్ధితోపాటు, 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల అభివృద్ధిని సైతం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. భారీగా వ్యయాలు.. ‘మౌలిక రంగంలోని పలు ఉప విభాగాల మధ్య ప్రాధాన్యతల్లో మార్పు ఉండొచ్చు. మౌలిక రంగానికి సంబంధించిన ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆరోగ్యకరమైన వృద్ధితో కొనసాగుతాయి. ఈ రంగంలో రైల్వే, రహదారులు, నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతాయి. ఇది ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతునిస్తుంది’ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా జూన్‌లో విడుదల చేసిన నివేదిక సైతం ఈ రంగంలో వృద్ధి అవకాశాలను తెలియజేస్తోంది. మౌలిక రంగం, సామాజికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం.. పట్టణీకరణ పెరగడం, రహదారుల అనుసంధానత ఇవన్నీ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధికి దోహదం చేస్తాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ కంపెనీస్ కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా తెలిపారు. పెద్ద, భారీ కాంట్రాక్టులు వస్తుండడంతో తాము నియామకాలను పెంచినట్టు ఎల్అండ్టీ గ్రూప్ హెచ్ఆర్ చీఫ్ ఆఫీసర్ సి.జయకుమార్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలు.. విమానాశ్రయాల విస్తరణ.. 2202025 నాటికి జాతీయ రహదారుల నిర్మాణం 2,00,000 కిలోమీటర్లు2030 నాటికి జలరవాణా మార్గాల ఏర్పాటు 23 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ 35 పార్క్‌ల నిర్మాణం -
ఒక్క ఫోన్ కాల్.. భారీగా దొరికిన నగదు
చెన్నై, సాక్షి: తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రూ. 1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో లోక్‌సభకు పోలింగ్‌కు ముందు ఒకే ఇంట్లో అదీ కూడా ఓ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారని, ఒక బ్యాగ్‌లో నింపిన మొత్తం రూ.1 కోటి కరెన్సీ నోట్లు దొరికాయని జిల్లా కలెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్లోని ఎలక్షన్ కంట్రోల్ రూంకి ఫోన్ కాల్ వచ్చిందని, ఫలితంగా నగదు రికవరీ అయ్యిందని ఆయన చెప్పారు. ఓ ఇంట్లో కరెన్సీ నోట్లు భద్రపర్చినట్లు సమాచారం అందడంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గ్రామానికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో ఎవరు ఉంచారు.. ఎన్నికలలో ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును సిద్ధం చేశారా అనే కోణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఉత్తరకాశీ సొరంగం శిథిలాల తొలగింపునకు రూ. 20 కోట్ల ఖర్చు!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ ప్రమాదం జరిగి చాలా కాలం గడిచింది. ఈ ప్రమాదాన్ని ఎవరూ మరిచిపోలేరు. త్వరలో ఈ సొరంగంలో శిథిలాల తొలగింపు పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై ఒక నివేదిక వచ్చింది. ఉత్తరకాశీ సొరంగం నిర్మాణ సమయంలో కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయింది. ఆ సమయంలో సొరంగంలో పనిచేస్తున్న 43 మంది కూలీలు లోపల చిక్కకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారుల తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ టన్నెల్ శిథిలాల తొలగింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పనులకు రూ.20 కోట్లు వెచ్చించనున్నట్లు స్విస్ కంపెనీ వెల్లడించింది. ఈ శిథిలాలను సిల్క్యారాలోని డంపింగ్ గ్రౌండ్‌కు తరలించనున్నారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నామని స్విస్ కంపెనీ తెలిపింది. -
రూ.లక్ష కోట్లకు పైగా విరాళం - ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!
చాలా మంది ధనవంతులు డబ్బు కూడబెట్టే కొద్దీ ఇంకా పోగు చేయాలి, ఇంకా గొప్పవాళ్ళైపోవాలి అని ఆలోచించడం సర్వ సాధారణం. అయితే కొందరు మాత్రమే వారికున్నదాంట్లో చాలా వరకు పేదలకు లేదా మంచి పనులను భారీగా విరాళం అందిస్తారు. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువ మందిలో 'మెకెంజీ స్కాట్' (MacKenzie Scott) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఇప్పటి వరకు ఎంత దానం ఇచ్చింది? బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ప్రముఖ నవలా రచయిత్రి అయిన 'మెకెంజీ స్కాట్' ఇప్పటి వరకు సుమారు రూ.1,19,522 కోట్లకుపైగా విరాళంగా ఇచ్చింది. అంతే కాకుండా తాను బ్రతికి ఉండే వరకు, తనకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ కూడా చేసినట్లు సమాచారం. నిజానికి ఈమె (మెకెంజీ స్కాట్) అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య. 1993లో ఈమె జెఫ్ బెజోస్‌ను పెళ్లి చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు భరణంగా అందిన డబ్బు కారణంగానే ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళలలో ఒకరుగా నిలిచారు. 1907లో కాలిఫోర్నియాలో జన్మించిన మెకెంజీ స్కాట్ ఆరు సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది. చిన్నతనంలోనే 'ది బుక్ వార్మ్' అనే 142 పేజీల బుక్ రాసినట్లు, అది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. స్కాట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (ఇంగ్లీష్) పూర్తి చేసింది. అంతే కాకుండా ఈమె సాహిత్యంలో నోబెల్ గ్రహీత 'టోని మోరిసన్' వద్ద చదువుకుంది. మెకెంజీ స్కాట్ చదువు పూర్తయిన తరువాత న్యూయార్క్ నగరంలోని ఓ కంపెనీలో పనిచేసింది, ఆ సంస్థలోనే జెఫ్ బెజోస్ కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి 1993లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అమెజాన్ స్థాపించి ఇద్దరూ దానిని బాగా అభివృద్ధి చేసారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి 2019లో మెకెంజీ స్కాట్, జెఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకున్న తరువాత రూ. 2,53,600 కోట్ల విలువైన స్టాక్స్ అందుకుంది. ప్రస్తుతం ఈమె విద్య, ఆరోగ్యం, సామజిక న్యాయం, పర్యావరణం వంటి వివిధ అంశాలకు మద్దతు పలుకుతూ వేలకోట్ల రూపాయలు విరాళంగా అందిస్తూ ప్రపంచంలో ఎక్కువ విరాళాలు అందించినవారి జాబితాలో ఒకరుగా నిలిచింది. -
ఏకంగా రూ. 1 కోటి వార్షిక వేతనం అందుకుంటున్న భారత విద్యార్థి!
అతను ఐఐఎం, ఐఐటీలు వంటవి ఏం చెయ్యలేదు. కానీ వేతనంగా ఏకంగా కోటి రూపాయల వార్షిక ప్యాకేజిని అందుకుంటున్నాడు. మరీ అంత వేతనం ఎలా? అని అనుకుంటున్నారా!.. పనిచేసే అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సిన పని లేదు అని నిరూపించాడు ఈ భారతీయ విద్యార్థి. వివరాల్లోకెళ్తే..భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే బార్మర్ అనే చిన్న జిల్లాలో నివసించే మహిపాల్ సేజు అనే భారత విద్యార్థి ఓ జపాన్ కంపెనీ నుంచి కోటి రూపాయల వార్షిక ప్యాకేజీని అందుకుని రికార్డు సృష్టించాడు. అయితే అతను ఏమి ఐఐఎం, ఐఐటీ స్టూడెంట్ కాదు. అందరిలానే బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకుని ఆశ్చర్యపరిచాడు. కేవలం పట్టదల, అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే.. పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వారితో సమానంగా వేతనం తీసుకోవచ్చని ప్రూవ్ చేశాడు. మహిపాల్ జోథ్‌పూర్‌లోని బార్మర్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో బీటెక్ పూర్తిచేశాడు. అయితే బీటెక్ చదువుతుండగానే 2019లో ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా జపాన్‌లో నగోయాలోని ఒక కంపెనీలో రూ. 30 లక్షల ప్యాకేజీతో మొదటి ఉద్యోగాన్ని సంపాదించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత జపాన్‌లోని టోక్యోలో మరో కంపెనీతో ఏకంగా రూ. 1 కోటి వార్షిక ప్యాకేజ్ ఆఫర్ అందుకుని రికార్డు సృష్టించాడు. మహిపాల్ ప్రస్తుతం జపాన్‌లోని టోక్యోలో మెకానికా కార్పొరేషన్ అనే కంపెనీకి ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద పెద చదువులు చదవలేదని బాధపడాల్సిన పనిలేదు ప్రస్తుత పరిస్థితులకు అవసరమయ్యే స్కిల్స్ సంపాదించుకుంటే పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చని మహిపాల్ చేసి చూపించాడు. నిజం చెప్పాలంటే ఫోకస్ కరెక్ట్‌గా ఉండి, పనిపై అంకితా భావం ఉంటే ఏ నేపథ్యం నుంచి వచ్చినా కోట్లలో వేతనం అందుకోగలమని చాటి చెప్పాడు, పైగా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు మహిపాల్ సేజు. (చదవండి: ఇందిరా గాంధీ బ్రేక్ ఫాస్ట్‌గా కోసం ఓ చెఫ్ పడ్డ పాట్లు! కానీ చివరికి..) -
కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు
ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) సీజన్ 15లో ప్రస్తుతం ‘కేబీసీ జూనియర్స్ వీక్’ జరుగుతోంది. చివరి ఎపిసోడ్లో హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి మయాంక్ హాట్‌సీట్‌పై కూర్చున్నాడు. ఈ 12 ఏళ్ల కంటెస్టెంట్‌తో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ పలు విషయాలను ముచ్చటించారు. అమితాబ్ బచ్చన్ ఈ ఎపిసోడ్‌లోని మొదటి ప్రశ్నను అడిగారు. దీనికి సమాధానం చెబితే రూ. 6,40,000 గెలుచుకోవచ్చు. 2023లో వాషింగ్టన్ డీసీలో ప్రారంభించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఎవరి పేరు మీద ఉంది? అని అడిగారు. దీనికి మయాంక్ సరైన సమాధానం ఇస్తూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పాడు. తరువాతి ప్రశ్నలకు మయాంక్ సరైన సమాధానాలు చెబుతూ వచ్చాడు. గేమ్ సమయంలో మయాంక్ తాను పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నదీ ఇంకా తనకు తెలియడం లేదని చెప్పాడు. తరువాత మాయాంక్ ‘మీరు చిన్నప్పుడు ఏం కావాలని అనుకున్నారు?’ అని అడిగాడు. అందుకు అమితాబ్ బదులిస్తూ ‘చిన్నప్పుడు ఎక్కువగా గిల్లీ దందా ఆడేవాళ్లం. అది తప్ప మరేదీ మా మనసులోకి రాలేదు’ అని చెప్పారు. తరువాత అమితాబ్.. మయాంక్‌ను కోటి రూపాయల ప్రశ్న అడిగాడు. కొత్తగా కనుగొన్న ఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టిన ఘనత ఏ యూరోపియన్ కార్టోగ్రాఫర్‌కు దక్కుతుంది? అడి అడిగారు. దీనికి సమాధానం చెప్పేందుకు మయాంక్ ఒక ఒక నిపుణుడి సహాయం తీసుకుని ‘మార్టిన్ వాల్డ్సీముల్లర్’అని సరైన సమాధానం చెప్పాడు. సీజన్ 15లో భారీ మొత్తాన్ని గెలుచుకున్న తొలి జూనియర్ కోటీశ్వరుడు మయాంక్. ఈ విషయాన్ని అమితాబ్ షోలో ప్రకటించారు. ఆ సమయంలో మయాంక్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత అమితాబ్.. మయాంక్‌ను రూ. 7 కోట్ల ప్రశ్న అడిగారు. దీనికి మయాంక్ సమాధానం చెప్పలేక గేమ్ ముగించి, కోటి రూపాయలు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు -
వామ్మో.. వీళ్ల పెళ్లి ఖర్చు రూ.491 కోట్లా? ప్రత్యేకతలివే!
ఒకప్పుడు రాజుల కాలంలో ఐదు రోజులు ఆడంబరంగా పెళ్లి చేసుకునే వారని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ కంప్యూటర్ యుగంలో కూడా కొంత మంది ధనవంతులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇటీవల సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి తన కూతురు పెళ్ళికి వందల కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సౌత్ ఫ్లోరిడాకు చెందిన ఒక కార్ డీలర్షిప్ తన కూతురు 'మడేలైన్ బ్రాక్వే' పెళ్లి ఐదు రోజులు ఘనంగా చేసాడు. దీనికైన ఖర్చు 59 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.491 కోట్లు కంటే ఎక్కువ. ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. 26 ఏళ్ల మడేలైన్ బ్రాక్వే.. తన ప్రియుడు 'జాకబ్ లాగ్రోన్'తో జరిగిన ఐదు రోజుల పెళ్ళికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీసింది. కచేరీ ప్రారంభం నుంచి వేర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రిపూట బస చేసే వరకు అన్నింటికీ సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలైస్ గార్నియర్‌లో రిహార్సల్ డిన్నర్, వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో రాత్రిపూట బస, ప్రైవేట్ లంచ్, ఉటాలోని ఫైవ్ స్టార్ లగ్జరీ రిసార్ట్‌లో బ్యాచిలొరెట్ వీక్ వంటి అన్ని వీడియో రికార్డ్ చేసుకున్నారు. వివాహ వేదిక ఎక్కడో స్పష్టంగా వెల్లడించలేదు, కానీ ఈఫిల్ టవర్ ఉద్యానవనంలో వేడుకలు పెద్ద ఎత్తున జరిగినట్లు, బహుశా అదే ప్రాంతంలో పెళ్లి కూడా జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ జంట 2020 మార్చిలో డేటింగ్ ప్రారంభించారు. లాగ్రోన్ లింక్డ్ఇన్ అకౌంట్ ప్రకారం, అతను కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్‌లో టాలెంట్ కోఆర్డినేటర్‌గా, కంట్రీ సింగర్ జాసన్ ఆల్డియన్కు ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. పెళ్ళికి కొన్ని రోజుల ముందే ఈ జంట, వారి స్నేహితులు పారిస్‌కు వెళ్లారు. వీరు బస చేసిన హోటల్ గదుల ఖరీదు రోజుకి 2400 డాలర్లని సమాచారం. ఇదీ చదవండి: రూ.1000 కోట్ల కంపెనీకి తిరుగులేని అధినేత్రి.. చిన్నప్పుడే.. కోట్లు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకున్న ఘటనలు ఇప్పటికే కూడా చాలా వెలుగులోకి వచ్చాయి. గతంలో కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి తన కూతురు పెళ్ళికి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. పెళ్ళిలో వధువు ధరించిన చీర ఖరీదే రూ. 17 కోట్లు కాగా, ఆమె వేసుకున్న బంగారు ఆభరణాల ఖరీదు రూ. 90 కోట్లు, మేకప్ కోసం మాత్రమే రూ. 30 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by The Lake Como Wedding Planner (@lakecomoweddings) -
కోట్లు పలికే ‘రంగురాయి’ ఏది? బంగారం, ప్లాటినం ఎందుకు దిగదుడుపు?
ఎవరైనా ఏదైనా ఖరీదైన వస్తువు గురించి మాట్లాడినప్పుడు ముందుగా బంగారాన్ని ప్రస్తావిస్తారు. నిజానికి ఒక గ్రాము బంగారం కొనాలన్నా కూడా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్లాటినం దాని కంటే ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే బంగారం, ప్లాటినం మాత్రమే అత్యంత ఖరీదైన ఖనిజాలు కాదు. దీనికంటే ఖరీదైన ఖనిజాలు భూమిపై చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఖనిజం ఏది? దాని ధర ఎంత అనేది తెలుసుకుందాం. బంగారం కంటే ఖరీదైన ఖనిజాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ జాబితాలో అనేకమైనవి కనిపిస్తాయి. వాటిలో మనం ఉపయోగించే వాటి విషయానికొస్తే రోథియం, పల్లాడియం, ఇరిడియం, జాడైట్ మొదలైనవి ఉన్నాయి. ఇవేకాకుండా మనం నేరుగా ఉపయోగించని అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి. అవి బంగారం కంటే చాలా ఖరీదైనవి. వీటిలో లిథియం లాంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఖనిజం ఏమిటో తెలుసుకుందాం. అత్యంత ఖరీదైన ఖనిజం విషయంలో అనేక వాదనలు వినిపిస్తాయి. దానికి సంబంధించిన అనేక నివేదికలు కనిపిస్తాయి. ఆ నివేదికల ప్రకారం చూస్తే రోథియం అత్యంత ఖరీదైనది. మరికొందరు శాస్త్రవేత్తలు జాడైట్ ఖనిజం అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. జాడైట్ ఒక రకమైన రాయి. అది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని ఖరీదైన ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. దీని ధర క్యారెట్లలో ఉంటుంది. డైమండ్ మాదిరిగా ఇది క్యారెట్ల లెక్కన లభిస్తుంది. జాడైట్ క్యారెట్ ధర చాలా అధికం. ఒక క్యారెట్ జాడైట్ ధర 3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని చెబుతారు. అంటే ఒక్క జాడైట్ రాయి కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? -
రూ. 400 కోట్ల సమీకరణలో ముత్తూట్ ఫిన్‌కార్ప్
హైదరాబాద్: ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ) ద్వారా రూ. 400 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల వరకు గ్రీన్ షూ ఆప్షన్ కింద అట్టే పెట్టుకునే వెసులుబాటుతో రూ. 100 కోట్ల ఎన్సీడీలను జారీ చేసినట్లు సంస్థ తెలిపింది. రూ. 1,000 ముఖ విలువ ఉండే ఎన్సీడీలు సెప్టెంబర్ 14 వరకు అందుబాటులో ఉంటాయి. 24 నెలల నుంచి 96 నెలల వరకు కాలావధి ఉండే ఈ వీటిపై రాబడి రేటు 8.65 శాతం – 9.43 శాతం దాకా ఉంటుందని కంపెనీ సీఈవో షాజీ వర్గీస్ తెలిపారు. రూ. 1,100 కోట్ల వరకు గరిష్ట సమీకరణ పరిమితికి లోబడి తొలి విడతగా ఈ ఎన్సీడీలను జారీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
నిమిషానికి రూ.కోటి రెమ్యునరేషన్.. నటి రియాక్షన్ అదిరిపోయింది!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. బాస్ పార్టీ అంటూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలోనూ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. ఇటీవలే ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఈఫిట్ టవర్‌ను వన్డే వరల్డ్ కప్‌ను ఆవిష్కరించిన ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక నటిగా స్థానం దక్కించుకుంది. అయితే తాజాగా ఒక్క నిమిషానికి రూ. కోటి రూపాయల రెమ్యునరేషన్ వసూలు చేస్తోందని గత కొద్ది రోజులుగా ఆమెపై రూమర్స్ వస్తున్నాయి. అంతే కాదు ఆమెపై నెటిజన్స్ సైతం ట్రోల్స్ కూడా చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!) ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఊర్వశికి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీరు ఒక నిమిషానికి రూ. కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు? దీనిపై మీరేమంటారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. నాలాంటి సెల్ఫ్ మేడ్ నటులు ఎవరైనా సరే ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చాలాసార్లు ఇందతా అబద్ధమంటూ నెటిజన్స్ ఆమెపై ట్రోల్స్ చేశారు. ఊర్వశి రౌతేలా సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన నటించింది. ఆ తర్వాత సనమ్ రే, హేట్ స్టోరీ- 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అలాగే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: కేవలం రూ.7 కోట్ల సినిమా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది!) View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
తారక్ చేతికున్న వాచ్ ధరెంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
Jr NTR Patek Philippe Watch: తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'జూనియర్ ఎన్టీఆర్' గురించి పరిచయమే అవసరం లేదు. మంచి నటనా నైపుణ్యంతో ప్రేక్షులకు హృదయాలను దోచుకున్న ఈ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు. ఇటీవల ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహానికి హాజరైన జూ. ఎన్టీఆర్ సుమారు రూ. 2.45 కోట్లు విలువైన వాచ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇది 'పాటక్ ఫిలిప్' అనే స్విజర్ల్యాండ్ బ్రాండ్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో జూ. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో కూడా మరో పాటక్ ఫిలిప్ వాచ్ పెట్టుకుని కనిపించాడు. దీని ధర రూ. 1.56 కోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇంకా ఈయన వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందని సమాచారం. ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్‌బుక్ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్! ఇక కార్ల విషయానికి వస్తే.. ఈయన వద్ద లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్, రేంజ్ రోవర్ రోగ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే మూవీ చేస్తున్నారు. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Jr NTR Universe ™ (@ntr.universe) -
అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
అంకిత భావంతో చేసే పని నలుగురిచే గుర్తించేలా చేస్తుందన్న మాటలు మళ్ళీ ఋజువయ్యాయి. లాస్ వెగాస్‌లోని బర్గర్ కింగ్‌లోని మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాషియర్ అండ్ కుక్‌గా పనిచేస్తున్న 'కెవిన్ ఫోర్డ్' 27 సంవత్సరాలు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పని చేస్తే ఆ సంస్థ అతనికి మిఠాయిలు, పెన్నులు, స్టార్‌బక్స్ కప్ వంటి వాటితో కూడిన మంచి బ్యాగ్‌ని అందుకున్నాడు. అన్ని సంవత్సరాలు ఎంతో నిబద్దతతో పనిచేస్తే సరైన గుర్తింపు లభించలేదని, దానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ తర్వాత అతని కుమార్తె సెరీనా GoFundMe పేజీ స్టార్ట్ చేసింది. దీనికి అతి తక్కువ కాలంలోనే అన్యూహ్య స్పందన లభించింది. దీని ద్వారా ఏకంగా నాలుగు లక్షల డాలర్లు.. అంటే సుమారు రూ. 3.48 కోట్లు విరాళాలుగా సమకూరాయి. కెవిన్ ఫోర్డ్ అంకిత భావం, చిత్త శుద్ధి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. దీనివల్లే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రాగలిగాయి. కుటుంబం పోషణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల లభించిన విరాళాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇదీ చదవండి: సిమ్ కార్డ్ డీలర్లకు కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా! పదవి విరమణ వయసు వచ్చినప్పటికీ ఆర్థికపరమైన కారణాల వల్ల పనిచేస్తూనే ఉన్నాడు. భారీగా విరాళాలు పొందిన ఫోర్డ్.. ప్రపంచంలో చాలామంది దాతృత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన డబ్బు నా పిల్లలు మనవళ్ల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానన్నట్లు సమాచారం. -
ఆ దేశం పీతలను అంతం చేసేందుకు ఏకంగా రూ. 26 కోట్లు..!
ప్రతి దేశం తన బడ్జెట్ ప్రకారం ఆయా రంగాల అభివృద్ధికి కొంత కేటాయించడం కామన్. అన్ని దేశాల్లోనూ జరిగేదే. కానీ కేవలం ఒక సీ ఫుడ్ కోసం కోట్లు కేటాయించడం విన్నారా!. అది కూడా పీతలను తొలగించేందుకు దాదాపు 26 కోట్లు కేటాయించాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటీ వింత నిర్ణయం అనిపిస్తుంది కదా!. అసలు ఎందుకు ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాటి కోసం ప్రత్యేకంగా అంత డబ్బు ఎందుకంటే.. అసలేం జరిగిందంటే..ఇటలీలో నీలిరంగు పీతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే ప్రఖ్యాతి గాంచిన నత్తల జాతిని అంతం చేసేలా పెరిగిపోతున్నాయి. నిజానికి ఈ నీలరంగు పీతను పశ్చిమ అట్లాంటిక్‌కు చెందినవి. తొలినాళ్లలో ఒకటో రెండు నీలి పీతలను గుర్తించారు ఇటలీ వాసులు. ఆ తర్వాత క్రమంగా వాటి సంఖ్య పెరిగిపోవడమే గాక వాటి కారణంగా నత్తలు మాయం అవ్వుతున్నాయి. దీంతో పాటు షెల్ఫిష్, ఫిఫ్ రో వంటి ఇతర జలచరాలు చనిపోవడం జరిగింది. ఇటలీ వాసులు మొలస్కా జాతికి చెందిన నత్తలను బాగా తింటారు. అందుకు సంబంధించి ఆక్వా కల్చర్ ఇటలీలో బాగా ప్రఖ్యాతి గాంచింది. అలాంటి ఆక్వాకల్చర్ ఇప్పుడు ఈ నీలిపీతల కారణంగా చాల నష్టాలను చవి చూస్తోంది. ఈ నీలిపీతలు సముద్ర జాతికి చెందని కొన్ని మొక్కలు, ఇతర జలచర జంతువులను తినేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర ఇటలీలో ఉన్న పో రివర్ వ్యాలీ డెల్టాలో ఉన్న ఆక్వాఫార్మ్‌లు దారుణంగా దెబ్బతిన్నాయి. సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ నీలి పీతలు ఈ ప్రాంతంలో ఉండే నత్తలను దాదాపు 90% వరకు తినేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇటలీ ప్రభుత్వం ఆ నీలిపీతల ఉధృతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇటాలియన్ వ్యవసాయం మంత్రి ఫ్రాన్సిస్కో లోలోబ్రిగిడా పో నది డెల్టాను సందర్శించిన తదనంతరమే ఈ పీతల నిర్మూలన కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పెద్ద ఎత్తున ఆ పీతలను వేటాడి అంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వీలైనంత ఎక్కువ పీతలను పట్టి వాటిని చంపేయాలని సూచించారు. అందుకు కోసం దాదాపు రూ. 26,51,00,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత తర్విత గతిన ఈ నీలిపీతల సంఖ్యను తగ్గించకపోతే పరిస్థితి తీవ్రమై పర్యావరణ ప్రభావాలకు లోనవ్వాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరించారు. అంతేగాదు యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం, చైనా, దక్షిణ కొరియా తర్వాత ఇటలీనే ఎక్కువగా నత్తలను పెంచే మూడొవ అతిపెద్ద ఉత్పత్తిదారు. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!) -
60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జీవితం ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. కుబేరుడు బిచ్చగాడు కావచ్చు, బిచ్చగాడు కుబేరుడు కావచ్చు. కొన్ని సందర్భాల్లో కటిక పేదరికంలో ఉన్నవాళ్లు కూడా ఒక్క రోజులోనే ధనవంతులుగా మారిగా సందర్భాలు గతంలో కోకొల్లలు. ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. చిలీ ప్రాంతానికి చెందిన 'ఎక్సెక్వియెల్ హినోజోసా' (Exequiel Hinojosa) జీవితంలో ఇదే జరిగింది. ఇతడు ఇంటిని శుభ్రపరుస్తున్న సమయంలో ఒక పాత పుస్తకం కనిపించింది. మొదట ఇదేదో పనికిరాని బుక్ అనుకున్నాడు. ఆ తరువాత క్షణ్ణంగా పరిశీలించగా.. అతని అతని తండ్రికి చెందిన ఒక బ్యాంక్ పాస్‌బుక్ అని అర్థమైంది. బ్యాంక్ పాస్‌బుక్.. నిజానికి ఆ బ్యాంక్ పాస్‌బుక్ అతని తండ్రికి తప్పా ఇంకెవరికీ తెలియకపోవడం గమనార్హం. ఆ పాస్‌బుక్ 1960-70 కాలానికి చెందినట్లు గుర్తించాడు. అందులో అప్పట్లోనే సుమారు 1.40 లక్షల చిలియన్ పెసోస్ (Chilean pesos) డిపాజిట్ చేసినట్లు తెలిసింది. ఆ డబ్బు విలువ ఇప్పుడు కోట్ల రూపాయలకు సమానం. ఆ డబ్బుని ఎక్సెక్వియెల్ హినోజోసా విత్‌డ్రా చేసుకోవాలనుకున్నారు. అయితే అతని ఎంక్వైరీలో ఆ అకౌంట్ చాలా రోజులకు ముంచు క్లోజ్ అయినట్లు తెలిసింది. అంతలో అతని ఆశలు ఆవిరపోయాయి. మొత్తం మీద డబ్బు తిరిగి పొందటం కష్టమని చాలామంది వెల్లడించారు. కానీ అతని పట్టు వదలకుండా ప్రయత్నించాడు. ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా.. స్టేట్ గ్యారెంటీడ్.. ఆ బ్యాంకు పాస్‌బుక్‌లో స్టేట్ గ్యారెంటీడ్ అని ఉండటం గమనించాడు. అంటే డబ్బుని బ్యాంకు ఇవ్వని పక్షంలో, కస్టమర్‌కి ఆ డబ్బు తిరిగి అందేలా ప్రభుత్వం సహాయం చేస్తుందని అర్థం. కానీ ప్రభుత్వం కూడా ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. చివరికి చేసేదిలేక కోర్టుని ఆశ్రయించాడు. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! ఆ డబ్బు తన తండ్రి డిపాజిట్ చేసయినట్లు, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వాదించి.. చివరకు 1 బిలియన్ చిలీ పెసోస్ ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఇది 1.2 మిలియన్ డాలర్లకు సమానం (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 10 కోట్లు). దీంతో దెబ్బకు ఇతడు కోటీశ్వరుడయ్యాడు. -
కోటీశ్వరులు పెరిగారు.. లక్షాధికారులు తగ్గారు!
I-T returns filed for income above Rs 1 crore: దేశంలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఆర్జించినట్లు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఇది కోవిడ్ మహమ్మారి సంక్షోభం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 49.4 శాతం పెరిగింది. మరోవైపు అదే కాలానికి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ కేవలం 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షలు, 2021-22 ఏడాదికి 1.93 లక్షలు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1.80 లక్షలు ఉన్నాయి. అల్పాదాయ వర్గాలపై కోవిడ్ దెబ్బ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ట్యాక్స్ ఫైలర్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల సంఖ్య 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. కానీ రూ. 5 లక్షలు, ఆలోపు ఆదాయ విభాగంలో కేవలం 0.6 శాతం పెరిగింది. కోవిడ్ మహమ్మారి సంక్షోభం దెబ్బ వివిధ ఆదాయ వర్గాలపై ఎలా ఉందో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయ వర్గం మినహా, ఇతర అన్ని ఆదాయ వర్గాల ట్యాక్స్ రిటర్న్స్ సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయానికి దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4.94 కోట్ల నుంచి 5.68 కోట్లకు పెరిగాయి. అయితే, ఇతర ఆదాయ వర్గాల రిటర్న్‌లలో తగ్గుదల కనిపించింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్య క్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1.90 లక్షల నుంచి 1.46 లక్షలకు పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయానికి ఐటీఆర్‌ల సంఖ్య 2.83 లక్షల నుంచి 2.25 లక్షలకు తగ్గాయి. రూ. 5 లక్షల-10 లక్షల మధ్య ఆదాయానికి ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్ 1.05 కోట్ల నుంచి 99.36 లక్షలకు తగ్గాయి. -
పాన్ కార్డ్ స్కాం: టీచర్ చనిపోయిన పదేళ్లకు రూ.7 కోట్ల ట్యాక్స్ నోటీసు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ కుటుంబానికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఆ కుటుంబానికి చెందిన స్కూల్ టీచర్ పేరిట రూ.7 కోట్ల ట్యాక్సీ నోటీసు వచ్చింది. అయితే.. ఆ టీచర్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఈ నోటీసులు రావడం గమనార్హం. 2013లో ఆ టీచర్ చనిపోగా.. 2017-18 ఏడాదికి గాను ఆమె పేరిట ఇంత మొత్తంలో పన్ను వసూలు నోటీసులు వచ్చాయి. ఉషా సోని మధ్యప్రదేశ్‌లోని పట్కేటా గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. జులై 26న ఆమె పేరిట రూ.7.55 కోట్ల ట్యాక్సీ వసూలుకు చెందిన ఆదేశాలు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుమారుడు పవన్ సోనీ.. మాట్లాడుతూ..' 2013 నవంబర్ 16న మా తల్లి చనిపోయింది. న్యాచురల్ కాస్టింగ్ సంస్థ పేరుపై ముడి సరుకులు కొనుగోలుకు సంబంధించి ఈ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులో ఉంది. కేసు నమోదు చేశాము. మా అమ్మ పాన్ కార్డులను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరో మాకు తెలియదు.' అని అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఒక్క కుటుంబమే కాదు. అనేక కుటుంబాలకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. గిరిజన ప్రాంతాలైన బేతూల్ జిల్లాలో దాదాపుగా 44 మందికి ఇలాంటి నోటీసులు వచ్చాయి. దాదాపు రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు నోటీసులు వచ్చాయి. నితిన్ జైన్ అనే మరోవ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. నెలకు రూ.5 నుంచి 7 వేల వరకు సంపాదించే సామర్థ్యం గల ఇతనిపై రూ.1.26కోట్ల పన్ను వసూలుకు సంబంధించిన నోటీసులు వచ్చాయి. తమిళనాడులోని కోర్టల్లమ్‌లో తన పేరుపై ఓ అకౌంట్ ఉంది. ఈ పేరును ఇదే మొదటిసారి వినడమని నితిన్ తెలిపారు. 2014-15 మధ్య తన పేరుపై అకౌంట్ ఓపెన్ అయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఘటనలపై బేతూల్ ఎస్పీ సిద్ధార్ద చౌదరి స్పందించారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ కాల్పుల ఘటన.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగింది..? -
లాలూ ఫ్యామిలీకి ఈడీ షాక్.. రూ.6 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్..
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చిక్కెదురైంది. ఈ మేరకు లాలూ కుటుంబానికి సంబంధించిన రూ.6కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవీని ఈడీ గత మేలోనే ప్రశ్నించింది. ఆమెతో పాటు వరుసగా బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ఎంపీలు మిసా భారతి, చండ యాదవ్, రాగిని యాదవ్‌ల నుంచి కూడా సమాచారాన్ని ఈడీ రాబట్టింది. ఈ కేసులో గత జులైలోనే దాదాపు 18 మందిపై సీబీఐ ఛార్జ్‌షీటును దాఖలు చేసింది. 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. బిహార్‌కు చెందిన అభ్యర్థులకు ఉద్యోగాలను అక్రమంగా కేటాయించారని, బదులుగా ఉద్యోగం పొందిన అభ్యర్థులు తమ భూములను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి రాసి ఇచ్చారనేది ఆరోపణ. దీనిపై కొన్నేళ్లుగా దర్యాప్తు నడుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో లాలూకు చెందిన రూ.6 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం 'దేవర'. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఎన్టీఆర్ సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. జూనియర్ 2011లో వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. మే 5వతేదీన 2011లో జరిగిన వీరి వివాహాం అత్యంత వైభవంగా జరిగింది. కాగా.. ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే కుమారులు జన్మించారు. (ఇది చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'కల్కి' ఇప్పట్లో రావడం కష్టమే!) అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లిలో కట్టుకున్న చీరపై నెట్టింట చర్చ నడుస్తోంది. ఆమె ధరించిన బంగారు వర్ణం గల చీర ధర దాదాపు కోటి రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా ఎన్టీఆర్ పెళ్లి వేడుకల కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి చీర ప్రత్యేకతలు ఎన్టీఆర్ భార్ ప్రణతి ధరించిన అంత భారీ ధర పలకడానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పెళ్లి రోజు బంగారు వర్ణంలో ఉన్న చీరను తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ధరించింది. లక్ష్మీ ప్రణతి కంజీవరం చీరలో స్వచ్చమైన బంగారం, వెండితో నేసినట్లుగా సమాచారం. ఆమె చీరకు తగినట్లుగానే బంగారు, వజ్రాల నెక్లెస్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నారు. వాటితో పాటు ఒక జత డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా ధరించింది. జూనియర్ ఎన్టీఆర్ సంప్రదాయమైన తెల్లని కుర్తా, ధోతీతో మెరిసిపోయారు. అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కళ్యాణ మండపం విలువ రూ. 18 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో 3 వేల మంది అతిథులు, దాదాపు 12,000 మంది అభిమానులు హాజరయ్యారు. కాగా.. ఈ జంటకు 2014లో తమ మొదట అభయ్ రామ్ జన్మించగా.. 2019లో భార్గవరామ్‌ను స్వాగతించారు. ఈ ఏడాది మార్చిలో ప్రణతి తన 30 బర్త్‌డేను కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. భార్య 30వ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బర్త్‌డే పార్టీ ఇచ్చారు తారక్. (ఇది చదవండి: ఆ సీన్లో ఎలాంటి తప్పులేదు.. మహాభారత్ నటుడు షాకింగ్ కామెంట్స్!) -
ఏడు కంపెనీలకు షాక్ - దెబ్బకు రూ. 469 కోట్లు వెనక్కి!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే. కావున వాహన తయారీ సంస్థలు ఇలాంటి వెహికల్స్ తయారు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి ఫేమ్ 2 పథకం కింద ప్రయోజనాలను అందిస్తోంది. దీనిని అదనుగా తీసుకున్న చాలా కంపెనీలు నిబంధనలను పాటించలేదని గుర్తించి మొత్తం రికవరీ చేయాలనీ కేంద్రం ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఫేమ్ 2 నియమాలను అదనుగా తీసుకున్న 7 కంపెనీలు రూ. 469 కోట్లు క్లెయిమ్ చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మోసాన్ని గుర్తించిన కేంద్రం ఫేమ్ 2 కింద పొందిన మొత్తం డబ్బుని తిరిగి వెనక్కి ఇవ్వాలని వెల్లడించింది. మరో 7 నుంచి 10 రోజులలోపు మొత్తం డబ్బుని తిరిగి ఇవ్వని యెడల ఈ స్కీమ్ నుంచి కంపెనీని తొలగించనున్నట్లు పేర్కొంది. (ఇదీ చదవండి: నోట్ల ఉపసంహరణ గడువుపై కేంద్రం కీలక ప్రకటన - తప్పక తెలుసుకోవాల్సిందే!) మన దేశంలో తయారైన విడి భాగాలను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసిన కంపెనీలకు మాత్రమే ప్రోత్సాహకాలు అందించాలని ఫేమ్ 2 నిబంధలు చెబుతున్నాయి. అయితే హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో వంటి కంపెనీలు చైనా విడి భాగాలతో వాహనాలను తయారు చేస్తున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకొచ్చింది, ఎవరు ప్రారంభించారో తెలిస్తే అవాక్కవుతారు!) ఫేమ్ 2 నిబంధనలను అనుగుణంగా నడుచుకుంటున్నట్లు హీరో ఎలక్ట్రిక్, ప్రభుత్వానికి వివరణాత్మకంగా సమాచారం అందిస్తామని యాంపియర్, మాకు ఇప్పటి వరకు ఎటువంటి నోటీసు అందలేదని లోహియా కంపెనీలు వెల్లడించాయి. కాగా దీనిపైన స్పందించడానికి ఒకినావా & రివోల్ట్ నిరాకరించినట్లు సమాచారం. మొత్తం మీద విదేశాల నుంచి ముడి భాగాలను దిగుమతి చేసుకుని వాహనాలను తయారు చేసినట్లు రుజువైతే ఇప్పటి వరకు ప్రోత్సాహకాల కింద అందుకున్న మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.