Man Discovers His Father 60 Years Old Bank Passbook In Trash, Becomes An Overnight Billionaire - Sakshi
Sakshi News home page

60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Published Thu, Aug 10 2023 8:27 AM | Last Updated on Thu, Aug 10 2023 10:39 AM

Man discovers 60 years old bank passbook he is turn to rich person - Sakshi

జీవితం ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. కుబేరుడు బిచ్చగాడు కావచ్చు, బిచ్చగాడు కుబేరుడు కావచ్చు. కొన్ని సందర్భాల్లో కటిక పేదరికంలో ఉన్నవాళ్లు కూడా ఒక్క రోజులోనే ధనవంతులుగా మారిగా సందర్భాలు గతంలో కోకొల్లలు. ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. చిలీ ప్రాంతానికి చెందిన 'ఎక్సెక్వియెల్ హినోజోసా' (Exequiel Hinojosa) జీవితంలో ఇదే జరిగింది. ఇతడు ఇంటిని శుభ్రపరుస్తున్న సమయంలో ఒక పాత పుస్తకం కనిపించింది. మొదట ఇదేదో పనికిరాని బుక్ అనుకున్నాడు. ఆ తరువాత క్షణ్ణంగా పరిశీలించగా.. అతని అతని తండ్రికి చెందిన ఒక బ్యాంక్ పాస్‌బుక్ అని అర్థమైంది.

బ్యాంక్ పాస్‌బుక్..
నిజానికి ఆ బ్యాంక్ పాస్‌బుక్ అతని తండ్రికి తప్పా ఇంకెవరికీ తెలియకపోవడం గమనార్హం. ఆ పాస్‌బుక్ 1960-70 కాలానికి చెందినట్లు గుర్తించాడు. అందులో అప్పట్లోనే సుమారు 1.40 లక్షల చిలియన్ పెసోస్ (Chilean pesos) డిపాజిట్ చేసినట్లు తెలిసింది. ఆ డబ్బు విలువ ఇప్పుడు కోట్ల రూపాయలకు సమానం.

ఆ డబ్బుని ఎక్సెక్వియెల్ హినోజోసా విత్‌డ్రా చేసుకోవాలనుకున్నారు. అయితే అతని ఎంక్వైరీలో ఆ అకౌంట్ చాలా రోజులకు ముంచు క్లోజ్ అయినట్లు తెలిసింది. అంతలో అతని ఆశలు ఆవిరపోయాయి. మొత్తం మీద డబ్బు తిరిగి పొందటం కష్టమని చాలామంది వెల్లడించారు. కానీ అతని పట్టు వదలకుండా ప్రయత్నించాడు.

ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా..

స్టేట్ గ్యారెంటీడ్..
ఆ బ్యాంకు పాస్‌బుక్‌లో స్టేట్ గ్యారెంటీడ్ అని ఉండటం గమనించాడు. అంటే డబ్బుని బ్యాంకు ఇవ్వని పక్షంలో, కస్ట‌మ‌ర్‌కి ఆ డబ్బు తిరిగి అందేలా ప్రభుత్వం సహాయం చేస్తుందని అర్థం. కానీ ప్రభుత్వం కూడా ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. చివరికి చేసేదిలేక కోర్టుని ఆశ్రయించాడు.

ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ!

ఆ డబ్బు తన తండ్రి డిపాజిట్ చేసయినట్లు, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వాదించి.. చివరకు 1 బిలియన్ చిలీ పెసోస్ ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఇది 1.2 మిలియన్ డాలర్లకు సమానం (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 10 కోట్లు). దీంతో దెబ్బకు ఇతడు కోటీశ్వరుడయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement