
బిస్కెట్ అంటే గుర్తొచ్చే కంపెనీ.. దశాబ్దాల చరిత్ర కలిగిన కలిగిన సంస్థ, కేవలం 12మందితో ప్రారంభమై.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా ఎదిగిన బ్రాండ్.. ఇంతకీ ఆ కంపెనీ ఎదనుకుంటున్నారా? అదేనండీ.. అందరికీ సుపరిచయమైన 'పార్లే-జీ'. ఇంతకీ ఈ కంపెనీ ఎలా మొదలైంది. ఈ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న పాప ఎవరు? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మన దేశంలో చాలామందికి తెలిసిన బిస్కెట్ కంపెనీ 'పార్లే-జీ' (Parle-G). ఈ బిస్కెట్లను తినని వారు బహుశా ఉండరు. ప్రస్తుతం మార్కెట్లో.. లెక్కకు మించిన బిస్కెట్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ, ఈ బిస్కెట్లకు (పార్లే-జీ) ఉన్న ఆదరణ మాత్రం ప్రత్యేకం. ప్రతి ఏటా కంపెనీ రూ. 8,000 కోట్ల విలువైన బిస్కెట్లను విక్రయిస్తూ.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్స్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
పార్లే-జీ ప్రస్థానం
1929లో స్వదేశీ ఉద్యమం మధ్యలో.. చౌహన్ కుటుంబానికి చెందిన 'మోహన్ లాల్ దయాల్' ముంబైలోని విలే పార్లేలో తొలి పార్లే ఫ్యాక్టరీని స్థాపించారు. ఆ సమయంలో 12 మందితో.. జర్మన్ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలను ఉపయోగించి బిస్కెట్స్ తయారు చేశారు. అప్పట్లో ఆ యంత్రాల కోసం రూ. 60వేలు ఖర్చు చేశారు. ఆ కంపనీ నేడు.. అనేక ఇతర దేశాలకు విస్తరించింది.

'పార్లే-జీ'ని మొదట్లో “పార్లే గ్లూకో” గా పరిచయం చేశారు. కానీ చివరికి బిస్కెట్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీని కొనసాగించడానికి దాని పేరును 'పార్లే-జీ'గా మార్చారు. పార్లే-జి లోని G అనే పదం మొదట్లో 'గ్లూకోజ్' ని సూచిస్తుంది, తరువాత అది కంపెనీ బ్రాండ్ నినాదానికి అనుగుణంగా 'జీనియస్'గా మారింది. దాని పేరు అనేక మార్పులకు గురైనప్పటికీ, దాని రుచి, ప్యాకేజింగ్ మాత్రం అలాగే ఉన్నాయి.
పార్లే-జీ ప్యాకెట్ మీద ఉన్న పాప ఎవరంటే?
పార్లే-జీ బిస్కెట్స్ గురించి తెలిసిన చాలామందికి తెలియాల్సిన ప్రశ్న.. ఆ బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న చిన్నారి ఎవరు? అని. కొందరు ఆ పాప ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తి అనే భావించారు. మరికొందరు నీరూ దేశ్‌పాండే అని.. ఇంకొందరు గుంజన్ దుండానియా అని అనుకున్నారు.
నిజానికి పార్లే బిస్కెట్ ప్యాకెట్‌పై ఉన్న పాప కేవలం.. ఎవరెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ 'మగన్ లాల్ దహియా' ఊహాజనితమే అనే తెలిసింది. మొత్తానికి చాలామందికి దశాబ్దాలుగా తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్నలకు జవాబు తెలిసిపోయింది.
ఇదీ చదవండి: ప్రపంచంలోని సూపర్ బిలియనీర్స్.. జాబితాలో 24 మంది
Comments
Please login to add a commentAdd a comment