న్యూఢిల్లీ: గడువు సమీపిస్తుండడంతో ఆదాయపన్ను రిటర్నులు అధిక సంఖ్యలో దాఖలవుతున్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ నెల 18 నాటికి 3.06 కోట్ల రిటర్నులు ఫైల్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఇందులో 91 శాతం మంది (2.81 కోట్లు) తమ రిటర్నులను ఎలక్ట్రానిక్ రూపంలో ధ్రువీకరించినట్టు తెలిపింది.
పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించిన 2.81 కోట్ల ఐటీఆర్‌లలో 1.50 కోట్ల పత్రాలను ఇప్పటికే ప్రాసెస్ చేయడం కూడా పూర్తయినట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మూడు కోట్ల రిటర్నుల నమోదు ఏడు రోజులు ముందుగానే నమోదైనట్టు తెలిపింది.
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులు నమోదు చేయడానికి గడువు జూలై 31తో ముగియనుంది. ఆడిట్ అవసరం లేని వారందరికీ ఇదే గడువు వర్తిస్తుంది. ఈ ఏడాది గడువు పొడిగించే అవకాశం లేదని ఇప్పటికే ఆదాయపన్ను శాఖ స్పష్టం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment